Regulation
-
స్మోకింగ్ బ్యాన్..! రిషి సునాక్‌పై వ్యతిరేకత
లండన్: బ్రిటన్‌లో స్మోకింగ్ బ్యాన్ చట్టంపై ప్రధాని రిషి సునాక్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 2009 తర్వాత పుట్టిన వారికి అంటే.. 15, 15 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడాన్ని నిషేధించే చట్టాన్ని సునాక్ గతేడాదే ప్రతిపాదించారు. మంగళవారం (ఏప్రిల్16) ఈ చట్టాన్ని బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టారు. సునాక్ సొంత పార్టీ కన్జర్వేటివ్స్ ఎంపీల్లో కొందరు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ ప్రధానులు లిజ్ ట్రుస్, బొరిస్ జాన్సన్‌లు కూడా ఈ చట్టంపై వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం అమలు చేయడమంటే ప్రజల ఇష్టాఇష్టాలను నియంత్రించడమేననేది వారి వాదన. వేల కొద్ది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, ఒక జనరేషన్‌ను స్మోకింగ్ నుంచి దూరంగా ఉంచేందుకు ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని యూకే హెల్త్ సెక్రటరీ విక్టోరియా అట్కిన్స్ తెలిపారు. ఈ చట్టం దేశంలో ప్రొడక్టివిటీని పెంచడమే కాకుండా నేషనల్ హెల్త్ సర్వీస్‌పై భారాన్ని తగ్గిస్తుందన్నారు. ఇదీ చదవండి.. మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్ -
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ ఆదేశాలు
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలను విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా ఆర్బీఐ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) గవర్నెన్స్ నియంత్రణలకు సంబంధించిన మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. రిస్క్ మేనేజ్మెంట్, రిసోర్స్ మేనేజ్మెంట్, పనితీరు నిర్వహణ వంటి కీలకమైన అంశాల్లో ఐటీ గవర్నెన్స్ పాత్ర కీలకం. ఐటీ గవర్నెన్స్‌కు సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలు ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ ఆదేశాల ప్రకారం.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఐటీ కార్యాకలాపాల్లో ఎలాంటి అవరోధం రాకుండా ఉండేందుకు పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన సమగ్ర ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసుకోవాలి. డేటా మార్పులున్నపుడు మైగ్రేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకమైన డాక్యుమెంట్ పాలసీని కలిగి ఉండాలి. సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేసే ప్రతి ఐటీ అప్లికేషన్ ఆడిట్ ట్రయల్స్, ఆడిట్‌ను అందించాలి. క్రిప్టోగ్రాఫిక్ నియంత్రణలపై ట్రాన్స్మిషన్ ఛానెల్‌లలో ఉపయోగించే అల్గారిథమ్‌లు, ప్రోటోకాల్‌లు పకడ్బందీగా ఉండాలని పేర్కొంది. -
విశాఖలోనూ విద్యుత్ నియంత్రణ మండలి
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు పడుతోంది. అక్కడి ప్రజలకు, పారిశ్రామిక, వ్యాపార వేత్తలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) త్వరలో అందుబాటులోకి వస్తోంది. కొన్ని విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు, కేసులను విశాఖ నుంచే ఏపీ ఈఆర్సీ పరిష్కరించనుంది. గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకూ ఉన్న వినియోగదారులకు హైదరాబాద్‌కు, భవిష్యత్‌లో కర్నూలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విశాఖలోనూ కార్యకలాపాలు మొదలుపెడుతోంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ కేంద్రంగా 1999 మార్చిలో ఏపీ ఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే.. విద్యుత్ నియంత్రణ మండలి మాత్రం హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ వస్తోంది. ప్రస్తుతం అనేక కేసుల్లో వాయిదాలకు హాజరయ్యేందుకు విద్యుత్ సంస్థల అధికారులు, ముఖ్యంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు తరచూ హైదరాబాద్‌లోని ఏపీ ఈఆర్సీ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. కనీసం రెండు, మూడు రోజులు ఏపీ ఈఆర్సీ అధికారులు రాష్ట్రంలో అందుబాటులో ఉండటం లేదు. 24 గంటలూ పనిచేయాల్సిన అత్యవసర విభాగాల్లో విద్యుత్ శాఖ ప్రధానమైనది కావడంతో ప్రజలకు కూడా దీనివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇకపై ఈ పరిస్థితిలో చాలా వరకూ మార్పు రానుంది. కర్నూలులో ఏపీ ఈఆర్సీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే విధులు నిర్వర్తించాలని ఈ ఏడాది ఏప్రిల్ 25న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు అక్కడ భవన నిర్మాణం జరుగుతోంది. షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల కొన్నేళ్లుగా వార్షిక టారిఫ్ ఆర్డర్ (విద్యుత్ చార్జీల సవరణ)పై ప్రజాభిప్రాయ సేకరణ, ఆర్డర్ విడుదల వంటి కార్యకలాపాలను మాత్రమే విశాఖపట్నం నుంచి నియంత్రణ మండలి నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 18న ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఆవరణలో ఏపీ ఈఆర్సీ క్యాంపు కార్యాలయం ప్రారంభమైంది. ఆ మరుసటి రోజే రాష్ట్ర విద్యుత్ సంస్థలు తయారు చేసిన ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ప్లాన్‌పై ఏపీ ఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టింది. ఎప్పుడూ హైదరాబాద్‌లోని కమిషన్ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ విచారణ విశాఖలో కొత్తగా ప్రారంభించిన క్యాంపు కార్యాలయంలో జరిగింది. అయితే.. ఇది ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థలు ఇచ్చిన నివేదికలపై జరిగిన విచారణ. ఇదే కాకుండా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు వేసిన పిటిషన్లపై కూడా కమిషన్ విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. నవంబర్ 4న క్యాంపు కార్యాలయంలో ఒకేరోజు 9 పిటిషన్లపై బహిరంగ విచారణ చేపట్టనుంది. షెడ్యూల్ నోటిఫికేషన్‌ను ఏపీఈఆర్సీ తాజాగా విడుదల చేసింది. -
పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం భూమి ఎస్సీలకు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమి తప్పనిసరిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన పారిశ్రామిక పాలసీ 2023 –27 కింద వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులకు ఏపీఐఐసీ భూ కేటాయింపులకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీఐఐసీ ఇండ్రస్టియల్ పార్క్స్ అలాట్మెంట్ రెగ్యులేషన్ 2020 కింద కేటాయించిన భూములకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, తాజాగా చేసిన కేటాయింపులకు మాత్రమే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.తాజా మార్గదర్శకాల ప్రకారం.. పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం భూమిని కామన్ ఫెసిలిటీ సెంటర్, 5 శాతం వాణిజ్య ప్లాట్స్‌కు కేటాయించాలి. ఎంఎస్ఎంఈలకు 15 శాతం కేటాయించాలి. రూ.500 కోట్ల పైబడి పెట్టుబడితో కనీసం 1,000 మందికి ఉపాధి కల్పిస్తూ కనీసం మరో ఐదు అనుబంధ యూనిట్లు వచ్చే యాంకర్ యూనిట్లకు 25 శాతం తక్కువ ధరకు భూమి కేటాయిస్తారు. మండలస్థాయిలో ఏర్పాటు చేసే యాంకర్ యూనిట్లకు 20 నుంచి 33 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. 33 ఏళ్లపాటు లీజుకు భూమిని ఇస్తారు. ఆ తర్వాత లీజును 66, 99 సంవత్సరాలకు పెంచుకోవచ్చు. ఉత్పత్తి ప్రారంభించి 10 ఏళ్లు దాటి నిబంధనలను పూర్తి చేసిన యూనిట్లకు ఆ భూమిని కొనుక్కొనే హక్కు కల్పిస్తారు. వివిధ కంపెనీలకు భూకేటాయింపులు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో భాగంగా వివిధ పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వట్ల గ్రామం వద్ద ఉన్న రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని సంజమల రైల్వే స్టేషన్‌కు అనుసంధానిస్తూ రైల్వే లైన్ నిర్మాణం కోసం 211.49 ఎకరాలు కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లా మల్లవల్లి వద్ద బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు అవిశా ఫుడ్స్‌కు 101.81 ఎకరాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద సత్య బయోఫ్యూయల్‌కు 30 ఎకరాలు కేటాయించింది. తిరపతిలో హిందుస్థాన్ స్టీల్ వర్క్స్‌కు కేటాయించిన 50.71 ఎకరాల యూనిట్ పూర్తి కావడానికి గడువును పెంచింది. కియా వెండర్స్‌కు రాయితీలకు సంబంధించిన విధివిధానాలు, శ్రీకాళహస్తి వద్ద ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ (గతంలో శ్రీకాళహస్తి పైప్స్) కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫెర్రో అల్లాయిస్ యూనిట్‌కు, గుంటూరు టెక్స్టైల్ పార్క్, తారకేశ్వర టెక్స్టైల్ పార్కులకు వాటి పెట్టుబడి, ఉద్యోగ కల్పన ఆధారంగా టైలర్‌మేడ్ రాయితీలను ప్రకటించింది. -
'363 బీచ్‌లు' కోస్తా తీరానికి కొత్త అందాలు
సాక్షి, అమరావతి: బీచ్ పర్యాటకంతో కోస్తా తీరానికి కొత్త కళ చేకూరనుంది. 12 జిల్లాల్లో కోస్తా తీరం వెంట 363 బీచ్‌లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫిషరీస్ యూనివర్సిటీ, పర్యాటక శాఖ, మత్స్యశాఖలతో కూడిన 11 బృందాలు కోస్తా తీరం వెంట సర్వే చేసి ఎక్కడెక్కడ బీచ్‌లను అభివృద్ధి చేయవచ్చో గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లో కోస్టల్ జోన్ టూరిజం పేరుతో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తారు. చేపల ఉత్పత్తి, మత్స్యకారుల జీవనోపాధికి విఘాతం కలగకుండా పర్యావరణానికి అనుకూలంగా బీచ్‌లను తీర్చిదిద్దనున్నారు. కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ చట్ట ప్రకారం బీచ్‌లకు అనుమతి కోసం పర్యాటక శాఖ కలెక్టర్లకు నివేదిక పంపించింది. బీచ్‌ల అభివృద్ధిపై ఇటీవల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు.మత్స్యకారులతో పాటు టూరిజం ఆపరేటర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి బీచ్‌లను ఖరారు చేసి పర్యాటక అథారిటీకి వివరాలు పంపాలని సూచించారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో67 బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు ♦ మంగినపూడి (కృష్ణా జిల్లా) ♦ పేరుపాలెం, మొల్లపర్రు (పశ్చిమ గోదావరి జిల్లా) ♦ కాకినాడ (కాకినాడ జిల్లా) ♦ మైపాడు (నెల్లూరు జిల్లా) ♦ సూర్యలంక, రామాపురం (బాపట్ల జిల్లా) ♦ చింతలమోరి (బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా) బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే..? బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే 33 ప్రమాణాల ఆధారంగా ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ బీచ్‌లను పరిశీలించి ధృవీకరిస్తుంది. పర్యావరణం, స్నానపు నీటి నాణ్యత, నిర్వహణ, భద్రత, సేవలు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. బీచ్‌లు పరిశుభ్రంగా ఉండాలి. సందర్శకులకు మెరుగైన సేవలను అందించేందుకు అధికారుల కమిటీ, విశేషాలను వివరించేందుకు సిబ్బంది ఉండాలి. రుషికొండ తరహాలో 8 బ్లూఫ్లాగ్ బీచ్‌లు విశాఖలోని రుషికొండ తరహాలో మరో ఎనిమిది బ్లూ ఫ్లాగ్ బీచ్‌లను అభివృద్ధి చేయనున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా మౌలిక వసతులను కల్పించేందుకు భూ కేటాయింపు ప్రతిపాదనలను సీసీఎల్ఏకు పంపాలని సీఎస్ ఆదేశించారు. దేశంలో 10 బ్లూ ఫాగ్ బీచ్లుండగా అందులో రుషికొండ చోటు సాధించింది. కోస్టల్ జోన్ రెగ్యులేషన్‌కు అనుగుణంగా బీచ్‌ల అభివృద్ధి: కన్నబాబు కేంద్రం 2019లో విడుదల చేసిన కోస్టల్ జోన్ రెగ్యులేషన్ నోటిఫికేషన్ ప్రకారం బీచ్‌లను అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైనట్లు చెప్పారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి రాగానే పనులు చేపడతామన్నారు. స్థానికులకు ఉపాధితో పాటు సేవల రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. -
వాట్సాప్, ఫేస్బుక్ నియంత్రణపై చర్చలు - త్వరలో కొత్త రూల్స్!
ప్రస్తుతం వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ లేకుండా యువతకు సమయమే గడచిపోదు. అయితే వీటిని కొంత మంది మంచి పనుల కోసం ఉపయోగిస్తే.. మరికొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి అనుచిత సంఘటనకు సంబంధించిన కేసులు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఎంతోమంది అకౌంట్స్ కూడా బ్లాక్ చేసింది. అయితే ఇప్పుడు వీటిపైన కొన్ని నియంత్రణలు కల్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నివేదికల ప్రకారం.. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఓవర్-ది-టాప్ (OTT) కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లను నియంత్రించడంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులలో కమ్యూనికేషన్ యాప్స్ మీద కొంత సమయం లేదా తాత్కాలిక నిషేధం విధించాల్సిన అవసరం ఉందా.. లేదా అనే విషయం మీద చర్చలు మొదలుపెట్టింది. ఇంటర్నెట్ బేస్డ్ కాల్స్ విషయంలో టెలికామ్ ప్రొవైడర్లకు వర్తించే నియమాలు కమ్యూనికేషన్ యాప్స్‌కి కూడా వర్తించేలా చేయాలని సంస్థలు ఎప్పటి నుంచో అడుగుతున్నాయి, అంతే కాకుండా లైసెన్స్ ఫీజులమీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కారణంగా టెలికామ్ విభాగం 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా'ను సంప్రదించింది. దీంతో ట్రాయ్ యాప్స్ నియంత్రణ, తాత్కాలిక నిషేధం వంటి 14 అంశాల మీద చర్చలు జరపనుంది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) వాట్సాప్, టెలిగ్రామ్ మొదలైన వాటికి పూర్తిగా నిషేధించే బదులు అత్యవసర పరిస్థితుల్లో చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా యాప్‌లలో ఆర్థిక, భద్రత పరమైన అంశాలను తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం ఉందని ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. -
కృత్రిమ మేధను తలచుకొంటే నిద్రలేని రాత్రులే.. గూగుల్ సీఈఓ సుందర్
వాషింగ్టన్: కృత్రిమ మేధను సరిగా వాడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ముప్పు నుంచి బయటపడాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధ వల్ల తలెత్తే దుష్ప్రభావాల గురించి తలచుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో పిచాయ్ చెప్పారు. ఈ టెక్నాలజీ ప్రయోజనకరమైన రీతిలో ఉపయోగించుకొనేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఐతో అసత్య సమాచారాన్ని సృష్టించే వీలుందని, ఇది సమాజానికి ప్రమాదకరమని అన్నారు. అణ్వాయుధాలను నియంత్రిస్తున్న తరహాలోనే ఏఐని నియంత్రించడానికి ఒక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు. -
సీసీ కెమెరా ఉంటేనే నిర్మాణ అనుమతులు! రాచకొండ పోలీసుల ఆలోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల మంజూరులో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. సీసీ టీవీ (క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్) కెమెరా ఏర్పాటు చేస్తేనే భవనాలు, వాణిజ్య సముదాయాలకు అనుమతుల జారీకి రంగం సిద్ధ మవుతోంది. నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకంగా మారిన నేపథ్యంలో.. వాటి ఏర్పాటును భవన నిర్మాణ అనుమ తులలో భాగం చేస్తే మేలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఆలోచనకు వచ్చారు. ఈ మేరకు నిబంధనలను అమల్లోకి తేవాలంటూ రాష్ట్ర పురపాలకశాఖకు లేఖ రాసినట్టు తెలిసింది. ఇవేగాకుండా పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే కార్యాలయాల వద్ద కూడా సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని కోరింది. ఇప్పటికే మహారాష్ట్ర, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఉన్న ఈ విధానాన్ని అధ్యయనం చేసి.. తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. భారం తక్కువ.. భద్రత ఎక్కువ.. ఇప్పటివరకు గేటెడ్ కమ్యూనిటీలు, భారీ భవనాలు, కాలనీలలో నివాసితుల అసోసియేషన్లే సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కానీ అంతటా ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని, ఆ తర్వాతే జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ/డీటీసీపీలు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు సూచించినట్టు తెలిసింది. భారీ ఖర్చుతో అపార్ట్మెంట్లు, భవనాలను నిర్మించే డెవలపర్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం పెద్ద భారమేమీ కాదని.. ఇదే సమయంలో మరింత భద్రత కూడా అని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కమాండ్ సెంటర్‌తో అనుసంధానంతో.. అంతర్రాష్ట్ర నిందితులు పలుచోట్ల తిష్ట వేసి చెయిన్ స్నాచింగ్‌లు, బ్యాంకులు, జ్యువెలరీ షాపుల లో దోపిడీలకు పాల్పడుతుండటం, అనుమానాస్పద హత్యలు, ఇతర నేరాలు చేస్తుండటం పెరిగిపోతోంది. ఈ క్రమంలో నేరాల నియంత్రణ, మరింత భద్రత కోసం సీసీ కెమెరాలన్నింటినీ ‘రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌పీఐసీసీసీ)’కు అనుసంధానించాలని పోలీసులు భావిస్తున్నారు. తద్వారా పాత నేరస్తుల కదలికలు, సున్నిత ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, నేరాలకు పాల్పడినవారు ఎక్కడున్నారన్నదీ సీసీ కెమెరాల ద్వారా పోలీసులు తెలుసుకోగలుగుతారని చెప్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినా, అనుమానాస్పదంగా అనిపించినా.. స్థానిక పోలీసులను, పెట్రోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తారని వివరిస్తున్నారు. సీసీ కెమెరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలంటే..? భవనాల ప్రహరీపై నలువైపులా, ప్రవేశ, నిష్క్రమణ ద్వారం, మెట్ల మార్గం, లిఫ్టు దగ్గర, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అపార్ట్మెంట్లోని ప్రతీ అంతస్తు సీసీ కెమెరాలో రికార్డయ్యేలా చూసు కోవాలి. సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసిన చోట్లను జీపీఎస్ లొకేషన్‌తో సహా స్థానిక పోలీసుస్టేషన్లో నమోదు చేయాలి. ఆ కెమెరాల ఫుటేజీ కనీసం 30 రోజులు నిల్వ ఉండేలా చూసుకోవాలి. కెమెరాల పనితీరు, నిర్వహణ బాధ్యత సంబంధిత భవన యజమానిదే. ప్రజల గోప్యతకు ఏ మాత్రం భంగం కలిగించకుండా పోలీసులు ఆయా సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షిస్తారు. -
కంపెనీ పేరుతో మందులు రాయొద్దు :పెద్ద అక్షరాలతో అర్థమయ్యేలా రాయాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు రోగులకు అందుబాటులో ఉండా లని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పేర్కొంది. డాక్టర్ ఫీజు, కన్సల్టేషన్, రిఫండ్ వంటి వివిధ అంశాల ఆధారంగా ఫీజులు వసూలు చేయకూడదని, అలాంటి వాటితో రోగికి సంబంధం లేదని స్పష్టం చేసింది. వైద్య నియమావళిలో పలు కీలక మార్పులు చేస్తూ, వైద్య సేవలకు సంబంధించి కొత్త నిబంధనలు విధిస్తూ, వైద్యులకు పలు సూచనలు చేస్తూ.. ఎన్ఎంసీ ముసాయిదాను రూపొందించింది. ముఖ్యాంశాలివీ.. కంపెనీ పేరుతో మందులు రాయొద్దు కార్పొరేట్ ఆసుపత్రులు తాము అందించే వైద్య సేవలను మాత్రమే తెలియజేయాలి. దాని ఫీజును చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ల పేరుతో ప్రచారం చేయకూడదు. జనరిక్ పేరుతోనే మందులు రాయాలి కానీ కంపెనీ పేరుతో రాయకూడదు. మందులు రాసేటప్పుడు పెద్ద అక్షరాల్లో (క్యాపిటల్ లెటర్స్) అర్ధమయ్యేట్లు రాయాలి. ఫార్మాస్యూటికల్ కంపెనీల నుంచి డాక్టర్లు ఎలాంటి బహుమతులు పొం దకూడదు. ఐదేళ్లకోసారి ఆ మేరకు అఫిడవిట్ సమర్పించాలి. ఒకవేళ పొం దితే దాన్ని వెల్లడించాలి. కంపెనీల ప్రభావానికి లోనుకాకూడదు. కాన్ఫరెన్స్‌లు, సెమినార్లకు కూడా కంపెనీల స్పాన్సర్షిప్ తీసుకోకూడదు. ప్రాక్టీస్‌పై జీవితకాల నిషేధం! రోగులు తమకు ఏదైనా అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు, అది నిజమని తేలితే నిపుణుల కమిటీ తగిన చర్యలు చేపడుతుంది. సాధారణ తప్పు అయితే డాక్టర్‌ను మందలిస్తుంది. కొన్నిసార్లు కౌన్సెలింగ్ ఇస్తుంది. ఒకవేళ లైసెన్స్ లేకుండా డాక్టర్ ప్రాక్టీస్ చేస్తే, లైసెన్స్ ఫీజుకు పది రెట్లు జరిమానాగా విధిస్తుంది. – వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా రోగి చనిపోయినా, భారీ తప్పులు జరిగినా.. తీవ్రత ఆధారంగా అవసరమైతే ప్రాక్టీస్ చేయకుండా జీవితకాలం నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. – రోగుల విషయంలో నైతిక నియమాలను సరిగా పాటించకపోతే లైసెన్సును నెల రోజుల వరకు సస్పెండ్ చేయవచ్చు. రోగికి ప్రత్యక్షంగా హాని జరిగితే మూడు నెలల నుంచి మూడేళ్ల వరకు సస్పెండ్ చేయొచ్చు. రోగికి వాస్తవ సమాచారం ఇవ్వాలి – రోగి పరిస్థితిని ఉన్నదున్నట్టు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు చెప్పాలి. దాచిపెట్టడం కానీ, ఎక్కువ చేసిగానీ చెప్పకూడదు. యథార్థ సమాచారం ఇవ్వాలి. ఆపరేషన్ అవసరమైతే కుటుంబ సభ్యుల అనుమతితోనే చేయాలి. సర్జన్ పేరు కూడా రికార్డులో ఉండాలి. – మైనర్లకు, మానసికంగా సరిగా లేని వ్యక్తులకు ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ల కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి. 8 ఏళ్లకు పైబడిన చిన్నారులైతే ఆ పిల్లలకు సంబంధిత చికిత్స వివరాలను తెలియజేయాలి. – రోగికి వైద్యం చేసిన తర్వాత వారి రికార్డులను మూడేళ్లు భద్రపరచాలి. వాటిని సంబంధిత వ్యవస్థలు ఏవైనా అడిగితే ఐదు రోజుల్లోగా ఇవ్వాలి. – నూతన నియమావళి రూపొందిన మూడేళ్ల లోపు రోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ప్రతి రికార్డును డిజిటలైజ్ చేయాలి. అలాగే రోగి వివరాలను గోప్యంగా ఉంచాలి. కొన్నిటికి మాత్రమే టెలిమెడిసిన్ – ఎలాంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండా టెలీ మెడిసిన్ ద్వారా మందులు ఇవ్వకూడదు. కనీసం గత ప్రిస్కిప్షన్ల వంటి ఆధారమైనా లేకుండా మందులు ఇవ్వకూడదు. – టెలీ మెడిసిన్.. వీడియో, ఆడియో, మెస్సేజ్, ఈ మెయిల్ రూపంలో జరుగుతుంది. కాబట్టి కొందరిని భౌతికంగా పరీక్షించాల్సి ఉంటే అలా చేయాల్సిందే. – ఆన్లైన్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించవచ్చు. కౌన్సిలింగ్ ఇవ్వడానికి, కొన్ని రకాల మందులు సూచించడానికి ఇది పనికి వస్తుంది. దగ్గు మందులు, నొప్పి మందులు, యాంటీ ఫంగల్, యాంటీబయోటిక్స్ వంటి మందులను ఆన్లైన్లో సూచించవచ్చు. వాట్సాప్‌లోనూ ఇవ్వొచ్చు. – వీడియో కన్సల్టేషన్‌లో చర్మ, ఆస్తమా, మధుమేహం, రక్తపోటు, క్షయ వంటి వాటికి మందులను ఇవ్వొచ్చు. ఫాలోఅప్‌లో మందులు కూడా ఇవ్వొచ్చు. – క్యాన్సర్, మెదడును ఉత్తేజపరిచే, సైకియాట్రిక్ మందులు వాట్సాప్ ద్వారా కానీ టెలీమెడిసిన్‌లో కానీ ఇవ్వొద్దు. ఆ రోగులను భౌతికంగా చూడాల్సిందే. రోగి అనుమతితోనే మీడియాలో ప్రచురించాలి – రోగికి ఏవైనా ప్రత్యేక చికిత్సలు చేసినప్పుడు వారి అనుమతి మేరకే మీడియాలో ప్రచురించాలి. – గుర్తింపులేని వైద్యులతో కలసి పని చేయకూడదు. వైద్యంతో సంబంధం లేనివారు కూడా ప్రాక్టీస్ పెడుతున్నందున వారితో కలిసి పనిచేయవద్దు. – డాక్టర్లు సెమినార్లు, సదస్సులకు హాజరవుతూ వైద్యంలో అవుతున్న అప్డేట్ ఆధారంగా ప్రతి ఐదేళ్లకోసారి 30 మార్కులు పొందాల్సి ఉంటుంది. అలా సాధిస్తేనే ఐదేళ్లకోసారి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేస్తారు. – ఎలాంటి గుర్తింపు లేనివారికి వారి అనుభవం ఆధారంగా (ఆర్ఎంపీల వంటి వారికి) వైద్యులు సర్టిఫికెట్లు ఇవ్వకూడదు. – వైద్యులు ఇతర రాష్ట్రాల్లో పనిచేసేందుకు ప్రస్తుతం ఎన్వోసీ త్వరగా ఇవ్వడంలేదు. దాన్ని ఇప్పుడు సరళతరం చేసి వారంలో ఇచ్చేలా మార్పు చేశారు. -
బ్యాన్ ఎఫెక్ట్! బిట్‌కాయిన్‌కి భారీ దెబ్బ.. కుదేలవుతున్న క్రిప్టోకరెన్సీ
శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ద్వారా క్రిప్టోకరెన్సీ జోరుకు భారత ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏకంగా బ్యాన్ చేస్తున్న కథనాల నేపథ్యంలో డిజిటల్ కరెన్సీ భారీగా కుదేలు అయ్యింది. బిట్‌కాయిన్, ఎథెరియమ్, టెథర్‌లు భారీ పతనాన్ని చవిచూశాయి. The Cryptocurrency and Regulation of Official Digital Currency Bill, 2021.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI పర్యవేక్షణలో డిజిటల్ కరెన్సీ నియంత్రణకు ఒక ప్రణాళిక రూపొందించాలని, బిట్‌కాయిన్‌లాంటి క్రిప్టోకరెన్సీలను నిషేధించడమో లేదంటే కఠిన నిబంధనలతో మినహాయింపులు ఇవ్వడమో లాంటివి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకోసం క్రిప్టోకరెన్సీ బిల్లు 2021ను ప్రవేశపెట్టనుందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని డిజిటల్ కరెన్సీలు, డిజిటల్ మార్కెట్లో పతనం చవిచూశాయి. ప్రపంచంలో అతిపెద్ద, విలువైన క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్‌కాయిన్18.53 శాతం, ఎథెరియమ్ 15.58 శాతం, టెథెర్ 18.29 శాతం పడిపోయాయి. ఇక భారత్ నుంచి కోటిన్నర నుంచి 2 కోట్ల మంది.. దాదాపు 40 వేల కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని పెట్టుబడిగా కలిగి ఉన్నారు. తాజా పతనంతో వీళ్లకు పెద్ద దెబ్బే పడింది. నియంత్రణ సరిపోతుందా? గత పదేళ్లుగా ప్రైవేట్ డిజిటల్ కరెన్సీ బాగా పాపులారిటీ పెంచుకుంటోంది. ఇక క్రిప్టోకరెన్సీ అడ్వర్టైజ్మెంట్లు ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నాయి. ఈజీగా, ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చంటూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయవి. ఈ క్రమంలో భారీ మోసాలు సైతం వెలుగుచూస్తున్నాయి. అందుకే ఆర్బీఐ మాత్రం క్రిప్టోకరెన్సీ విషయంలో మొదటి నుంచి వ్యతిరేకతనే వ్యక్తం చేస్తోంది. క్రిప్టోకరెన్సీ వల్ల దేశ ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కానీ, కేంద్రం మాత్రం క్రిప్టోకరెన్సీ ప్రయోజనాలను సైతం పరిగనణలోకి తీసుకుంటోంది. కిందటి వారం బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలో ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీలో క్రిప్టో ఎక్సేంచెజ్, బ్లాక్ చెయిన్, క్రిప్టో ఎస్సెట్స్ కౌన్సిల్ BACC, ఇతరులు సమావేశం అయ్యారు. క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం లేదని, వాటి మీద నియంత్రణ ఉంటే సరిపోతుందని ఈ భేటీలో ఓ నిర్ధారణకు వచ్చారు. ఇక క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించబోతోందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ►ఇక వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులు మరియు దానిచే నియంత్రించబడే సంస్థలను నిషేధిస్తూ గతంలో(ఏప్రిల్ 6, 2018) RBI ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే మార్చి 4, 2021న సుప్రీంకోర్టు ఆ సర్క్యులర్‌ను పక్కన పెట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ►ప్రస్తుతం ఎల్ సాల్వడర్ దేశం ఒక్కటే బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ఇచ్చుకుంది. మరికొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే సిడ్నీ డైలాగ్ సందర్భంగా నవంబర్ 18న భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘‘క్రిప్టోకరెన్సీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే పెను ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి, జాగ్రత్త పడాల’’ని ప్రపంచ దేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలాంటి అడుగు వేయబోతుందన్న ఆసక్తి నెలకొంది. Cryptocurrency: భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్.. చెల్లనే చెల్లదంటూ స్టేట్మెంట్ -
వాటికి నిబంధనలు అవసరం లేదు : ట్రాయ్
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ వంటి ఓటీటీ సేవలను అందిస్తున్న ప్లాట్‌ఫామ్‌లకు ఎలాంటి నిబంధనలు అవసరం లేదని టెలికాం వాచ్డాగ్ సోమవారం తెలిపింది. సంభావ్య పరిమితుల ముప్పును పక్కనబెట్టి ఓవర్-ది-టాప్(ఓటీటీ) కమ్యూనికేషన్ సేవలకు ప్రస్తుతం రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ అవసరం లేదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం సూచించిన చట్టాలు, నిబంధనలకు మించి, ఓటీటీ లాంటి వివిధ అంశాల కోసం సమగ్ర నియంత్రణ చట్రాన్నిసిఫారసు చేసేందుకు ఇది సరైన సందర్భం కాదు" అని ట్రాయ్ స్పష్టం చేసింది. ఓటీటీ సేవల గోప్యత, భదత్రకు సంంబంధించిన రెగ్యులేటరీ జోక్యం అవసరం లేదని కూడా ట్రాయ్ వెల్లడించింది. (ఫేస్బుక్ ఇండియా ఎండీకి నోటీసులు) ట్రాయ్ నిర్ణయాన్నినెట్ న్యూట్రాలిటీ కార్యకర్తలు స్వాగతిస్తుండగా, మరోవైపు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తీవ్రంగా వ్యతిరేకించింది. ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్పీ) మధ్య సమస్యల్ని పరిష్కరించలేదని, ఇది టీఎస్పీలకు నష్టదాయకమని కోయ్ డైరెక్టర్ జనరల్ కొచ్చర్ ఆరోపించారు. అటు ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ తాజా పరిణామంపై ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా భారతదేశంలోని టెలికాం సంస్థలు ఇంటర్నెట్ ద్వారా ఉచిత వాయిస్, టెక్స్ట్ సేవలను అందించే యాప్స్ నియంత్రణ కోసం చాలాకాలంగా లాబీయింగ్ చేస్తున్నాయి. వీటిద్వారా సోషల్ మీడియా సంస్థలు తమ ఆదాయానికి గండికొడుతున్నాయని వాపోతున్న సంగతి తెలిసిందే. -
‘దీక్ష’ ఉద్యమానికి నాంది మాత్రమే
సాక్షి, హైదరాబాద్: బీజేపీ చేపట్టిన మహిళా సంకల్ప దీక్ష మద్యనిషేధ ఉద్యమానికి నాంది మాత్రమేననీ దీన్ని దశలవారీగా ఉధృతం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. మద్యం ప్రభావంతోనే మహిళలపై నేరాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, తెలంగాణలో మద్యాన్ని నిషేధించేవరకు పోరాడతామన్నారు. గురువారం ఇందిరాపార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రెండురోజుల మహిళా సంకల్ప దీక్షకు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్య నియంత్రణ శాఖను, మద్యాన్ని పెంచే శాఖగా మార్చారన్నారు. ‘దిశ’ ఘటన తర్వాత మద్యంపై సర్వత్రా చర్చ సాగుతోందని ఆడపిల్లలపై అకృత్యాలకు మద్యమే ప్రధాన కారణమని భావించి బీజేపీ దీక్ష చేస్తోందన్నారు. ఏపీ సీఎం జగన్ మద్య నియంత్రణపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వాటిని చూసైనా ఇక్కడి ప్రభుత్వం నేర్చు కోవాలని హితవు పలికారు. మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణను సీఎం కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారన్నా రు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ రాథోడ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ దీక్షా శిబిరంలో పాల్గొన్న కుమ్రంభీమ్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన ‘సమత’ కుంటుంబీకులను లక్ష్మణ్ పరామర్శించారు. ‘సమత’పిల్లను చదివించే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని, వారు ఎంతవరకు చదివితే అంత వరకు పార్టీ చదివిస్తుందని తెలిపారు. -
ఈసారైనా పరిష్కారమయ్యేనా?
సాక్షి, ఆమదాలవలస : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీలో భవనాల క్రమబద్ధీకరణపై చేపట్టిన బీపీఎస్(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) అనుకున్న ఫలితం ఇవ్వడంలేదు. ఈ స్కీం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉంటుంది. భవన యజమానులకు ఊరట కలగడంతోపాటు మున్సిపాలిటీకి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుంది. ఇంతవరకు భాగానే ఉన్నా పథకంలో భాగంగా వచ్చిన దరఖా స్తులను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం, పాలకవర్గం పట్టించుకోవడం లేదు. మరో వైపు మున్సిపల్ అధికారులు గృహాలకు కొలతలు వేసి అధిక మొత్తంలో అపరాధ రుసుం విధిస్తున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు భవన యజమానులు వెనుకంజ వేస్తుండడంతో మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతోంది. ఇప్పటివరకు 101 దరఖాస్తులు బీపీఎస్ కింద తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు ఆహ్వానించడంతో మున్సిపాలిటీ పరిధిలో 101 దరఖాస్తులు వచ్చాయి. తొలివిడతలో 46, రెండో విడతలో 21 దరఖాస్తులు పరిష్కరించారు. మున్సిపాలిటీకి సుమారు రూ.49లక్షల వరకు ఆదాయం వచ్చింది.వాస్తవంగా ప్రభుత్వం విధించిన గడువు గత ఏడాది అక్టోబరు 30తో ముగియగా నవంబరు 30వరకు గడువు పెంచు తూ మరో ఉత్తర్వులు జారీ చేశారు. గడువు పెంచడం తప్ప ఇంతవరకు దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇటీవల ఈ గడువును ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పెంచినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కొత్త జీవో ప్రకారం దరఖాస్తుదారుడు తొలుత రూ.10వేలు మీసేవ కేంద్రంలో అపరాధ రుసుం చెల్లించి మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. అక్రమ నిర్మాణాలకు అడ్డా ఆమదాలవలస మున్సిపాలిటీలోని 23వార్డులలో సుమారు 12వేల గృహాలు ఉన్నాయి. ఇందులో 1985కు ముందు నిర్మించిన ఇళ్లకు మున్సిపాలిటీ నుంచి అనుమతులు అవసరం లేదు. ఆ తరువాత నిర్మించిన భవనాలకు 199లో బీఆర్ఎస్(బిల్డింగ్ రెగ్యూలైజేషన్ స్కీం) కింద, 2007లో బీపీఎస్ స్కీం కింద అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మళ్లీ 2016–17లో బీపీఎస్ స్కీం కింద తమ గృహాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరుతు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలో సుమారు 1000కు పైగా అక్రమ నిర్మాణాలు(అనుమతులు) లేని గృహాలు ఉన్నాయని అధికారిక సమాచారం. అందులో ప్రస్తుతం 101 మంది నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వారిలో కొంతమంది యజమానులకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని, కొంతమందికి మున్సిపల్ అధికారుల అండదండలు ఉన్నాయని, అందుకే వారు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది భవన యజమానులు మున్సిపల్ పాలకులకు, అధికారులకు మామ్మూళ్లు ఇస్తూ మేనేజ్ చేసుకుంటున్నట్లు బహిరంగ ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారులు పాలకులు స్పందించి మున్సిపల్ ఆదాయాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
జీఎస్టీ రిటర్నుల గడువు 22 వరకూ పొడిగింపు
న్యూఢిల్లీ: జనవరి నెలకు సంబంధించిన వస్తు, సేవల పన్నుల రిటర్న్స్ (జీఎస్టీఆర్–3బీ) దాఖలు చేసేందుకు గడువును జీఎస్టీ కౌన్సిల్ రెండు రోజుల పాటు పొడిగించింది. ఫిబ్రవరి 22 దాకా డెడ్‌లైన్‌ను పెంచింది. బుధవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన 33వ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విపక్షాల పాలనలో ఉన్న కొన్ని రాష్ట్రాల డిమాండ్ మేరకు రియల్ ఎస్టేట్, లాటరీలపై పన్ను రేట్ల క్రమబద్ధీకరణ అంశంపై తుది నిర్ణయాన్ని ఫిబ్రవరి 24కి (ఆదివారం) వాయిదా వేసింది. ప్రతీ గంటకి వేల కొద్దీ రిటర్నులు దాఖలవుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు సరిగ్గా లేనందున డెడ్‌లైన్‌ను రెండు రోజులు పొడిగించాలన్న సూచన మేరకు జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. జమ్మూ, కశ్మీర్‌కి గడువు ఫిబ్రవరి 28 దాకా పెంచినట్లు తెలియజేశారు. GST Council extends returns filing deadline, no decision yet on realty -
ఉల్లంఘిస్తే ఉతుకుడే!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీల్లో కొత్త పాలకమండళ్లు ఏర్పడిన నేపథ్యంలో గ్రామాల్లో నూతన మార్పులకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం కార్యాచరణ ప్రణాళిక అమలుకు నడుం బిగించింది. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ప్రజల రోజువారీ జీవనవిధానం, శైలిలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతంలోని చట్టాల్లో వివిధ అంశాలకు సంబంధించి నిబంధనలున్నా వాటిని పెద్దగా పట్టించుకున్న, కచ్చితంగా అమలుచేసిన సందర్భాలు తక్కువే. ఈ నేపథ్యంలో కొత్త చట్టం ద్వారా తీసుకొచ్చిన వివిధ అంశాలను ఆచరణాత్మకంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. పరిసరాల పరిశుభ్రత కొనసాగేలా చూడటంతోపాటు వివిధ రూపాలు, చర్యల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడే వారినుంచి జరిమానా వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా వారిలో పరివర్తన తీసుకురావడంతో పాటు ఆయా నిబంధనలు పటిష్టంగా అమలుచేసే దిశగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయంతో ఉంది. కొత్త చట్టంలోని అంశాల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాక నియమ నిబంధనలు అమలు చేయడం మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉల్లంఘనులను ఉపేక్షించరు.. కొత్తగా నిర్దేశించిన నిబంధనలు కచ్చితంగా అమల్లోకి వస్తే పల్లెల్లో జరిమానాల మోత మోగనుంది. గ్రామాల పరిధిలో వివిధ అంశాలకు సంబంధించి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కొరడా ఝళిపించే అవకాశాలున్నాయి. గ్రామపంచాయతీలు రూపొందించిన నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వ్యక్తి నుంచి పంచాయతీ ఖరారు చేసిన మేర జరిమానా (రూ.ఐదు వేలు మించకుండా) వసూలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఉల్లంఘనలు అదే రీతిలో కొనసాగించిన పక్షంలో రోజుకు రూ.వంద చొప్పున జరిమానా విధిస్తారు. రోడ్లపై అశుద్ధం పారితే రూ. 5వేలు. ►పబ్లిక్ రోడ్లపై మురుగు, అశుద్ధం ప్రవహింపజేస్తే రూ.ఐదువేలు జరిమానా ►నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ మార్కెట్‌ను తెరిచి ఉంచితే రూ.ఐదు వేలు ►మురుగునీటి కాల్వ పూడ్చి, దానిపై అనధికార భవన నిర్మాణం చేపడితే రూ.2 వేలు ►ఆక్రమణలు తొలగించడంలో, మార్పుచేయడంలో విఫలమైతే రూ.రెండు వేలు ►రోడ్లపై, గ్రామ పంచాయతీ పరిధిలోని ఇతర చోట్ల అనుమతి లేకుండా మొక్కలు నాటితే రూ. 2 వేలు ►పంచాయతీ పరిధి, క్రమబద్ధీకరించిన భూమి లేదా పోరంబోకు భూమిలో చెట్లు అనుమతి లేకుండా నరికితే రూ. రెండు వేలు ►గ్రామపంచాయతీ ఆస్తులు ఆక్రమించుకున్నా లేదా అనధికారికంగా కలిగి ఉన్నా రూ.2 వేలు ►లైసెన్స్ లేకుండా లేదా ఇచ్చిన లైసెన్స్‌లకు విరుద్ధంగా రోడ్డును ఆనుకుని ఉన్న స్థలాన్ని వాహనాలు నిలిపి ఉంచే ప్రదేశంగా వాడుకుంటే రూ. 2వేలు ► లైసెన్స్ లేకుండా ఇచ్చిన లైసెన్స్‌లకు విరుద్ధంగా కొత్త ప్రైవేట్ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినా, ప్రైవేట్ పార్కింగ్ స్థలాన్ని కొనసాగిస్తే రూ. 2వేలు ►వధశాలకు వెలుపల పశువులను వధించినా, చర్మం వలిచినా రూ. 2 వేలు ► రిజిస్ట్రేషన్ లేకుండా అనధికార శ్మశానాలు తెరవడం, శవాల ఖననం చేస్తే రూ.వెయ్యి ► తాగునీటి సరఫరా వనరుకు లేదా నివాస ప్రాంతాలకు 200 మీటర్ల పరిధిలో శవాల ఖననం, దహనం వంటివి చేస్తే రూ.వెయ్యి ►నిషేధిత స్థలంలో శవాలు పాతిపెట్టినా, దహనం చేసి, ఇతర పద్ధతులు పాటించినా రూ.వెయ్యి ►పబ్లిక్ రోడ్డుపై లేదా రోడ్డు మీదుగా అనధికారికంగా గోడ లేదా ఫెన్స్ నిర్మిస్తే రూ.వెయ్యి ►నీటిని వృథా చేయకుండా నిషేధిస్తూ ఇచ్చిన నోటీసును పట్టించుకోకపోతే రూ.500 ►తాగునీటికోసం ఏర్పాటుచేసిన స్థలంలో బట్టలు ఉతికితే రూ.500 ►తాగునీటి ఉపయోగం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో స్నానం, ఇతర చర్యలకు పాల్పడితే రూ.500 ►మంచినీటి ఉపయోగం కోసం ఏర్పాటు చేసిన చోట్ల హానికరమైన వస్తువులను ఉంచితే రూ.500 ►తాగునీరు, స్నానం చేయడానికి లేదా బట్టలు ఉతకడానికి ఏర్పాటు చేసిన స్థలంలో మురుగునీటిని, మురుగు కాల్వలు మొదలైన వాటిని అనుమతిస్తే రూ.500 జరిమానా విధించనున్నారు. -
‘డెత్‌ట్రాక్స్’పై స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో రక్తసిక్తమవుతున్న రైలుపట్టాల గురించి ‘సాక్షి’ ప్రచురించిన ప్రత్యేక కథనంపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. నగరంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ‘డెత్ ట్రాక్స్’ నివారణకు చర్యలు చేపట్టింది. ప్రమాదాలకు అవకాశమున్న అన్ని చోట్లా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ గురువారం తెలిపారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులతో కలిసి కార్యాచరణ కొనసాగించనున్నట్లు చెప్పారు. జంటనగరాల్లో ప్రమాదకరంగా మారిన రైల్వే పట్టాలపై.. ‘డెత్‌ట్రాక్స్’ శీర్షికన ‘సాక్షి’ గురువారం ప్రత్యేక కథనాన్ని ప్రచురిం చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కదిలిన రైల్వే శాఖ.. పోస్టర్లు, కరపత్రాలు, తదితర రూపాల్లో ప్రచారం చేయడంతోపాటు రైల్వే చట్టాలపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించింది. గతంలో కంటే ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, పట్టాలు దాటకుండా అనేక చర్యలు చేపట్టామని రాకేశ్ తెలిపారు. కొన్ని చోట్ల ప్రజలు నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతున్నట్లు గమనించామన్నారు. అవసరమైన అన్ని చోట్లా సైడ్‌వాల్స్, ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు, ప్రజల భద్రత దృష్ట్యా ట్రాక్‌లపై రైల్వే శాఖ చేపట్టే అవగాహన కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు సహకరించాలని కోరారు. నగరంలోని సుమారు 48 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ ట్రాక్ మార్గంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు సీపీఆర్వో స్పష్టం చేశారు. -
పదునెక్కిన ‘పంచాయతీ’ చట్టం
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులకు కొత్త పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా వివిధ విధులు, అధికారాలు, బాధ్యతలను నిర్దేశించారు. కొత్తగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గ సభ్యులంతా తమ విధులను సక్రమంగా నిర్వహించేలా చట్టంలో ఆయా అంశాలు సోదాహరణంగా వివరించారు. గ్రామ ప్రథమ పౌరుడిగా వార్డు సభ్యులకు సర్పంచ్ నేతృత్వం వహిస్తారు. వివిధ రూపాల్లో పంచాయతీకి వచ్చే అన్నిరకాల నిధులను సమర్థవంతంగా నిర్వహించేలా వార్డుమెంబర్లకు సర్పంచ్ చేదోడువాదోడుగా నిలుస్తారు. సర్పంచ్‌లు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా ఈ చట్టంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సర్పంచ్ల విధులు, బాధ్యతలు.. ►చట్టం లేదా ప్రభుత్వ నిబంధనల ద్వారా సంక్రమించిన అధికారాలు వినియోగించుకుని సర్పంచ్ తన విధులు నిర్వహిస్తారు. ►పంచాయతీ కార్యదర్శి కార్యకలాపాలపై సర్పంచ్‌కు పరిపాలనాపరమైన అధికారం. గ్రామ పంచాయతీలు, ఇతర కమిటీలలో ఆమోదించిన తీర్మానాల అమలుకు పంచాయతీ కార్యదర్శుల విధులపై సర్పంచ్ల పర్యవేక్షణ ఉంటుంది. ►రోజువారీ పనుల నిమిత్తం ప్రభుత్వ ఆమోదం మేరకు డబ్బు ఖర్చుచేసే అధికారం సర్పంచ్‌లకు ఉంటుంది. ఈ మేరకు చేసిన వ్యయాలకు తదుపరి పంచాయతీ సమావేశంలో ఆమోదం పొందాలి. పంచాయతీల ఆమోదం మేరకు చెల్లింపులు, ధరావతు చెల్లింపులు జరుపుతారు. చెల్లింపు విషయంలో గ్రామపంచాయతీ తీర్మానాలకు లోబడే సర్పంచ్ పనిచేయాలి ►గ్రామంలో పారిశుద్ధ్యం సక్రమంగా ఉండేలా సర్పంచ్ బాధ్యత వహిస్తారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శిచేసే పనుల పరిశీలన, పారి«శుధ్య కార్మికులు తమ విధులకు సక్రమంగా హాజరయ్యేలా పర్యవేక్షిస్తారు. ► ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చూడాలి. శిథిలాలు తొలగించాలి. పాడుబడిన బావులు, నీటి గుంటలు పూడ్చేయాలి. పిచ్చిచెట్లు నరికివేయాలి. ► పంచాయతీకి విధించిన లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఉద్దేశించిన హరితహారం కార్యక్రమాన్ని సర్పంచ్ పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతియేటా నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం పెరిగి పెద్దవయ్యేలా చూడటం సర్పంచ్ బాధ్యత ► ప్రతి ఇంటికి మొక్కలు సరఫరాచేయాలి. వీధులు, ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. మొక్కలను జాగ్రత్తగా కాపాడాలి. ► నెలకు ఒకసారి గ్రామపంచాయతీ సమావేశం నిర్వహించాలి. రెండునెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించాలి. ► వందశాతం పన్నులు వసూలు చేయాలి. పంచాయతీ రికార్డులు, వీధి దీపాల నిర్వహణ, జనన మరణ రికార్డుల నిర్వహణ. ► సర్పంచ్‌లు తమ గ్రామాల్లోనే నివాసముండాలి. గ్రామపంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరుకావాలి. గ్రామపంచాయతీ సమర్థవంతంగా పనిచేసేలా అప్పగించిన విధులను పూర్తిచేయడానికి సర్పంచ్ల పర్యవేక్షణ ఉపయోగపడుతుంది. నిర్లక్ష్యంగా ఉంటే వేటుకూ అవకాశం.. నూతనంగా ఎన్నికైన గ్రామ పాలకవర్గాలకు అధికారాలతోపాటు బాధ్యతలు కూడా పెరిగాయి. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై వేటు పడేందుకు కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త చట్టంలో నిర్ధేశించిన బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే, కేటాయించిన నిధులను సవ్యంగా ఖర్చుచేయకపోతే సర్పంచ్ల తొలగింపుతో పాటు పాలకవర్గాన్ని రద్దుచేసే అవకాశముంది. చట్టప్రకారం తాను నిర్వహించాల్సిన విధుల నిర్వహణలో విఫలమైతే వివరణ ఇచ్చేందుకు సర్పంచ్‌కు అవకాశమిస్తారు. ఈ తర్వాత జిల్లా కలెక్టర్ అతడిని పదవి నుంచి తొలగించవచ్చు. పంచాయతీల నిర్వహణకు కలెక్టర్ లేదా పీఆర్ కమిషనర్, ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు పట్టించుకోకపోతే విధుల నుంచి తొలగించే అవకాశముంది. ఒకసారి సర్పంచ్‌గా తొలగిస్తే ఆరేళ్లపాటు సర్పంచ్‌గా పోటీచేయకుండా అనర్హత వేటు వేయొచ్చు. గ్రామాభివృద్ధికి సంబంధించిన ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలను పంచాయతీ పాలకవర్గాలు రూపొందించుకోవాలి. చట్టంలో సర్పంచ్‌లకు పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారాలతో పాటు, సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌ను కట్టబెట్టారు. గ్రామాల్లో అక్రమ లేఅవుట్లకు అనుమతినిచ్చిన పక్షంలో మొత్తం పాలకవర్గాన్నే రద్దు చేసే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాల విషయంలోనూ కఠిన చర్యలుంటాయి. మూడు వందల మీటర్ల స్థలంలో, పది మీటర్ల ఎత్తు మించకుండా జీప్లస్‌టు భవనాల నిర్మాణాలకే పంచాయతీలు అనుమతి ఇవ్వొచ్చు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అయ్యే వ్యయాన్ని సర్పంచ్, స్థానిక కార్యదర్శి భరించాలి. ప్రతి ఊళ్లో నర్సరీ... మొక్కల నిర్వహణలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కల పంపిణీ కోసం నర్సరీ ఏర్పాటుతోపాటు ఊళ్లోని ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా చూసే బాధ్యత సర్పంచ్‌పై ఉంటుంది. ప్రతీ రెండు నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించాలి. వరుసగా మూడుసార్లు గ్రామసభలు నిర్వహించకపోతే సర్పంచ్‌లను తప్పించే వీలుంది.. ప్రతినెలా గ్రామపాలకవర్గం సమావేశమై అభివృద్ధి, ఇతర కార్యకలాపాలు సమీక్షించాలి. చెత్తపడేస్తే జరిమానా... గ్రామాలు, ఇళ్ల పరిసరాల్లో ఇష్టం వచ్చినట్టుగా చెత్తా చెదారం పడేస్తే, ఇంటి ఎదుట చెత్త వేస్తే ఆ ఇంటి యజమానికి రూ.500 జరిమానా విధించే అధికారాన్ని సర్పంచ్‌లకు కల్పించారు. ఇంటి నుంచి మురుగునీటిని రోడ్డు మీదకు వదిలితే రూ. ఐదువేలు జరిమానా విధించే అవకాశముంది. ఊళ్లోని ప్రతి కుటుంబం ఆరు మొక్కలు నాటాలని చట్టంలో పేర్కొన్నా, వాటిలో కనీసం మూడింటినైనా నాటాలి. హరితహారంలో ఇచ్చిన మొక్కలను పెంచకపోతే ఇంటి యజమాని నుంచి రెండింతలు ఆస్తిపన్నును జరిమానాగా వసూలు చేసే వీలుంది. -
గంజాయి గుప్పుమంటోంది
సాక్షి, హైదరాబాద్ : గంజాయి గాండ్రిస్తోంది. విద్యార్థుల మెదళ్లను చిదిమేస్తోంది. గంజాయి మత్తుతో కంపుకొడుతున్నాయి. శివారు ప్రాంతాలకే పరిమితం అయిందనుకున్న గంజాయి ఘాటు ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రముఖ కాలేజీలనూ నిషాలో పడేస్తున్నాయి. నాలుగైదు కాలేజీలు మినహా ప్రతి కాలేజీలోనూ గంజాయి గుప్పుమంటోంది. ఎక్సైజ్ శాఖ వరుసగా ఛేదిస్తున్న కేసుల్లో గంజాయి వ్యవహారం యావత్ విద్యార్థి లోకాన్ని ఆందోళనలో పడేసేలా కనిపిస్తోంది. హైదరాబాద్, శివారు, ప్రాంతాల్లోని డిగ్రీ, ఇంజనీరింగ్, బీబీఏ, హోటల్ మేనేజ్మెంట్, కాలేజీల్లో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిం దని ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రత్యేక బృందాలు దింపిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేట సాగిస్తూ గంజాయి దందా సాగిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా అనేక సంచలనాత్మక అంశాలను వెలుగులోకి తెచ్చారు. ప్రతి కాలేజీలోని సెక్షన్లలో 15 నుంచి 18 మంది గంజాయి తాగుతున్నట్లు ఎక్సైజ్ శాఖ అధ్యయనంలో బయటపడటం కలకలం రేపుతోంది. ఐదేళ్ల కిందటి వరకు సెక్షన్‌కు 7 నుంచి 8 మంది మా త్రమే గంజాయి తాగగా.. ఇప్పుడు 50% మేర పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. 2017లో గం జాయి పట్టుకున్న వ్యవహారంలో 17 కేసులు నమో దు చేస్తే, 2018లో ఆ çసంఖ్య 90కి చేరింది. ఈ నెల రోజుల్లో 7 కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ‘స్కోరింగ్’లో విద్యార్థులే.. ఎక్సైజ్, పోలీసులు ఎప్పటికప్పుడు గంజాయి పట్టుకుని కేసులు నమోదు చేస్తుండటంతో విద్యార్థులే గంజాయిని వైజాగ్, అరకులో కొనుగోలు చేసి తమ స్నేహితులకు విక్రయిస్తున్నారు. గంజాయి విక్రయించడాన్ని ‘స్కోరింగ్’అనే కోడ్ పేరుతో పిలుచుకుంటున్నారు. గతంలో దీన్ని కొంత మంది బ్రోకర్లు, ఏజెంట్లు విద్యార్థులకు అమ్మేవారు. తీరా ఇప్పుడు విద్యార్థులే స్కోరింగ్ దందాలోకి దిగడం గుబులు రేపుతోందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గడిచిన 2 నెలల్లో 8 మంది ఇంజనీరింగ్ విద్యార్థులపై ఎక్సైజ్ శాఖ కేసులు పెట్టింది. వీరి విచారణలో అంబర్పేట్, చిక్కడపల్లి, మెహిదీపట్నం, నాంపల్లి, సీతాఫల్మండి, ఫలక్‌నుమా, చైతన్యపురి ప్రాంతాల్లోని విద్యార్థులకు అమ్మకం సాగిస్తున్నట్లు తేలింది. అరకు వెళ్లి 2 కేజీల చొప్పున కొనుగోలు చేయడం, దాన్ని ఎక్సైజ్ పోలీసుల కంటపడకుండా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తరలించి స్నేహితులకు అందజేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని అన్ని కాలేజీలు 600 వరకు ఉన్నాయి. ఇందులోని 5 వేల మందికి పైగా విద్యార్థులు గంజాయి మత్తులో జోగుతున్నట్లు ఎౖజ్ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నిర్బంధం నుంచి.. ఇంటర్ వరకు నిర్బంధంలాగా ఉండి ఇంజనీరింగ్‌కు వచ్చే సరికి ఒక్కసారిగా స్వేచ్ఛా జీవులుగా మారినట్లు విద్యార్థులు ప్రవర్తిస్తున్నారని, దీంతో ఎంజాయ్ పేరుతో గంజాయికి అలవాటు పడి మత్తులో జోగుతున్నారని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు ఇస్తున్న విచ్చలవిడి స్వేచ్ఛ, డబ్బు విద్యార్థులు గంజాయి వైపు మళ్లేలా చేస్తున్నాయని, దీనిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఆల్కహాల్ తాగితే వాసన ద్వారా ఇంట్లో తెలుస్తుందని, గంజాయి అయితే పెద్దగా ఇబ్బంది ఉండదని స్నేహితులు అలవాటు చేస్తుండటంతో ఏటా దీనికి బానిసలవుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోందని అధికారులు చెబుతున్నారు. కాలేజీల వద్ద నిఘా ఏదీ? విద్యాసంస్థలు ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కావడంతో విద్యార్థులు ఇలాంటి వ్యసనాలకు దగ్గరవుతున్నారన్న ఆరోపణలున్నాయి. కాలేజీకి విద్యార్థులు వస్తున్నారా.. ఎందుకు గైర్హాజరు అవుతున్నారు.. వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులేంటి.. వస్తే ఆ మార్పు వెనుక కారణాలేంటన్న అంశాలపై దృష్టి పెట్టట్లేదని ఎక్సైజ్, పోలీస్ అధికారులు చెబుతున్నారు. కాలేజీ గ్రౌండ్స్, కాలేజీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే గంజాయి ఎక్కువగా తాగుతున్నట్లు తమ విచారణలో తేలిందని ఎక్సైజ్ సీనియర్ అధికారి వెల్లడించారు. కాలేజీలు విద్యార్థులపై దృష్టి పెట్టి, పరిసరాల్లో నిఘా పెడితే ఈ పరిస్థితిని నియంత్రించవచ్చిని చెబుతున్నారు. సమష్టిగానే నియంత్రణ.. గంజాయి మత్తులో విద్యార్థులు జోగుతూ పోతే పంజాబ్ లాంటి పరిస్థితులు వస్తాయని దర్యాప్తు, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని నియంత్రణ పోలీస్, ఎౖMð్సజ్తో మాత్రమే కాదని, విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు, ఉన్నత విద్యా శాఖ, రెవెన్యూ విభాగాలు సమష్టిగా చర్యలు తీసుకుంటేనే విద్యార్థుల జీవితాలు బాగుపడుతాయని, లేకుంటే ప్రమాదకర పరిస్థితులుంటాయని హెచ్చరిస్తున్నారు. తమ వంతుగా కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, కానీ వాటిని అమలు చేయడం, విద్యార్థులను కనిపెట్టడం యాజమాన్యాలు, తల్లిదండ్రులపైనే ఉంటుందని చెబుతున్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నో!
సాక్షి, అమరావతి: ఉద్యోగ క్రమబద్ధీకరణపై కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చెయ్యలేమని, ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంది. సుమారు 40 వేల మంది ఆశలకు మంగళం పాడింది. గురువారం కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఎన్ఎండీ ఫరూక్ ఈ సమావేశానికి హాజరయ్యారు. పలు సమస్యల కారణంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవకాశం లేదని ఉపసంఘం తేల్చిచెప్పింది. 2014 నుంచి పలు దఫాలుగా, వివిధ రకాల హామీలిస్తూ వచ్చిన ప్రభుత్వం చివరకు వారికి రిక్తహస్తం చూపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికల వేళ హామీ ఇవ్వడమే కాకుండా, మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వం ఈ విధంగా కాంట్రాక్టు ఉద్యోగులను మోసం చేస్తుందని ఊహించలేదని ఉద్యోగులు వాపోతున్నారు. కొద్దిమందికే లబ్ధి విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు మాత్రమే వర్తించేలా మంత్రివర్గం కొన్ని నిర్ణయాలు తీసుంది. మహిళలకు 180 రోజుల ప్రసూతి సెలవులు, 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంపునకు, ఇప్పటివరకూ 10 నెలల వేతనం మాత్రమే ఇస్తుండగా, ఇకపై 12 నెలలకు ఇవ్వడానికి అంగీకరించారు. ఇకపై డీఏ లేకుండా సుప్రీం కోర్టు తీర్పు అనుసరించి మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) వర్తింప చేస్తామన్నారు. దీనివల్ల 3,800 మందికి లబ్ధి జరుగుతుంది. ఈ నిర్ణయాల వల్ల ఉన్నత విద్యాశాఖపై రూ. 38 కోట్ల భారం పడుతుందని ఉపసంఘం సభ్యులు చెప్పారు. వివిధ శాఖలలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ ఒకే విధానం అనుసరించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించామని యనమల పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లుగా ఇదే మాట చెబుతూ వచ్చి, ఇప్పుడు కూడా కొద్ది మందికే లబ్ధి కలిగేలా నిర్ణయం తీసుకోవడం దారుణమని కాంట్రాక్టు ఉద్యోగులు మండిపడుతున్నారు. తమను మోసం చేసిన ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెపుతామని పేర్కొన్నారు. ఆరు సంస్థలకు భూ కేటాయింపులు రాజధాని అమరావతి పరిధిలో మరో ఆరు సంస్థలకు భూములు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రులు నారాయణ, గంటా, నక్కా ఆనందబాబుతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకుంది. సవిత విశ్వవిద్యాయానికి 40 ఎకరాలు చొప్పున రెండు విడతలగా మొత్తం 80 ఎకరాలు, అంతర్జాతీయ క్రికెట్ అకాడెమీకి 10.2 ఎకరాలు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు రెండు ఎకరాలు, ఏపీపీఎస్సీకి 1.5 ఎకరాలు, ఏపీ క్రాఫ్ట్ కౌన్సిల్‌కు ఒక ఎకరం, యంగ్మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్‌కు 2.65 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఆందోళనలకు కాంట్రాక్ట్ ఉద్యోగులు సిద్ధం కాంట్రాక్టు ఉద్యోగులను సర్కారు దగా చేసిందని పబ్లిక్‌హెల్త్, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు జి.ఆస్కారరావు ఓ ప్రకటనలో మండిపడ్డారు. దీనిపై కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులందరూ అండగా నిలవాలని కోరారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక జీవోలు జారీచేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన విషయం ఈ సర్కారుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో జీవో నెం.119 ఇచ్చి వందలాది మంది కాంట్రాక్టు డాక్టర్లను, స్టాఫ్ నర్సులను గరిష్టంగా 45 మార్కులు వెయిటేజీ ఇచ్చి రెగ్యులరైజ్ చేశారన్నారు. జీవో నెం.1246 ద్వారా 2469 మంది ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు. జీవో నెం.625 ద్వారా ఆరోగ్యశాఖలో ఉన్న 711 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని అన్నారు. ప్రస్తుత సర్కార్ నిర్ణయంపై ఆందోళనలకు కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఉద్యోగులందరూ దీనికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యశాఖతో పాటు ఇతర శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మంత్రుల నిర్ణయం శోకం మిగిల్చిందని వైద్యవిధానపరిషత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ విమర్శించారు. చట్టాన్ని సవరించైనా క్రమబద్ధీకరణ చేసే అవకాశమున్నప్పుడు ఆ పని ఎందుకు చెయ్యట్లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగుల పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. -
ఇంకా తగ్గించాలని ఓఎంసీలకు చెప్పం..!
న్యూఢిల్లీ: పెట్రోల్ రేట్లు తగ్గించాలంటూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించడం ద్వారా ప్రభుత్వం ఇంధన రేట్ల సంస్కరణలను పక్కన పెట్టి మళ్లీ పాత విధానాలకే మళ్లుతోందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఇది ఈ ఒక్క సారికి మాత్రమే పరిమితమని, మరోసారి జరగబోదని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఇకపైనా మార్కెటింగ్ స్వేచ్ఛ ఉంటుందని, ఇక ఓఎన్జీసీ వంటి చమురు ఉత్పత్తి సంస్థలను కూడా ఇంధన సబ్సిడీ భారాన్ని భరించాలని కేంద్రం అడగబోదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఇంధన ధరలు ఎగియడంతో కేంద్రం ఇటీవల పెట్రోల్, డీజిల్ రేట్లను రూ. 2.50 మేర తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో రూ. 1.50 ఎక్సయిజ్ సుంకాల తగ్గింపు రూపంలో ఉండగా, మిగతా రూ.1 భారాన్ని భరించాలంటూ చమురు కంపెనీలను కేంద్రం ఆదేశించింది. ఇంధన రేట్లపై నియంత్రణ ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా కేంద్రం ఈ విధమైన ఆదేశాలివ్వడంతో చమురు కంపెనీలకు (ఓఎంసీ) మళ్లీ సబ్సిడీల భారం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అక్టోబర్ 5న రేట్లను తగ్గించినప్పటికీ.. ఆ తర్వాత ఇంధన రేటు మళ్లీ పెరుగుతూ పోవడంతో కేంద్రం మరోసారి ఓఎంసీలను ధర తగ్గించమని సూచించవచ్చనే వార్తలొచ్చాయి. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వీటిపై వివరణనిచ్చాయి. దీంతో గురువారం ఆయిల్ కంపెనీల షేర్లు గణనీయంగా పెరిగాయి. ఇంట్రాడేలో హెచ్‌పీసీఎల్ 19 శాతం, బీపీసీఎల్ 7 శాతం, ఐవోసీ 8 శాతం ఎగిశాయి. బీఎస్ఈలో చివరికి హెచ్‌పీసీఎల్ షేరు సుమారు 15 శాతం పెరిగి రూ. 207.15 వద్ద, బీపీసీఎల్ 5 శాతం పెరుగుదలతో రూ. 278.65, ఐవోసీ 5 శాతం పెరిగి రూ. 131 వద్ద క్లోజయ్యాయి. పెట్రోల్ రేట్ల తగ్గింపు ప్రకటించినప్పట్నుంచీ ప్రభుత్వ రంగంలోని ఆయిల్ కంపెనీల షేర్ల ధరలు దాదాపు 20 శాతం దాకా క్షీణించాయి. -
రూ.కోట్ల భూమి క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా కేంద్రం నడిబొడ్డున రూ.కోట్లు విలువచేసే వివాదాస్పద భూముల్లో నిర్మించిన దుకాణాలను మూకుమ్మడిగా క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. నల్లగొండ పట్టణంలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన ప్రకాశం బజార్లో సర్వే నెం.32లో 10.06 ఎకరాల వివాదాస్పద భూములున్నాయి. ఈ భూముల యాజమాన్య హక్కులు తమవేనని రెవెన్యూ శాఖ, నల్లగొండ మునిసిపాలిటీ, వక్ఫ్బోర్డుతోపాటు కొందరు ప్రైవేటు వ్యక్తులు, కబ్జాదారులు గత మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. కబ్జాదారుల నుంచి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భూముల ధరలను వసూలు చేసి ఈ వివాదాస్పద భూముల్లో నిర్మించిన 234 వాణిజ్య దుకాణాలను క్రమబద్ధీకరించేందుకు జిల్లా కలెక్టర్‌కు తాజాగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఈనెల 18న మెమో జారీ చేశారు. ఈ స్థల వివాదంపై నల్లగొండ జిల్లా కలెక్టర్ గత జూన్‌లో ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికతో పాటు, స్థానిక ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సిఫారసులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు దశాబ్దాల చిక్కుముడి! ప్రకాశంబజార్‌లోని భూముల వివాదం చిక్కుముడిగా మారడంతో గత ప్రభుత్వాలు పెండింగ్‌లో పెట్టాయి. ప్రభుత్వానికి నల్లగొండ జిల్లా కలెక్టర్ సమర్పించిన నివేదిక ప్రకారం..సర్వే నం.32 పరిధిలోని 10.06 ఎకరాల భూమి 1944–81 మధ్యకాలానికి సంబంధించిన పçహాణీ రికార్డుల్లో ఖరీజ్ ఖాతాగా నమోదై ఉందని నల్లగొండ తహసీల్దార్ 1981లో నివేదిక సమర్పించారు. ఈ భూములను లీజుకు ఇవ్వాలని నల్లగొండ మునిసిపాలిటీ 1971లో తీర్మానం చేసింది. ఎకరాకు రూ.15 చొప్పున రూ.1,518ల ధర చెల్లించినందున ఈ భూములను స్థానిక మునిసిపాలిటీకి కేటాయిస్తూ 1963లో అప్పటి నల్లగొండ తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులుండడంతో ఈ భూములు తమవేనని సుదీర్ఘకాలంగా మునిసిపాలిటీ పోరాటం చేస్తోంది. 10.06 ఎకరాల నుంచి 2,262 చదరపు గజాల స్థలాన్ని గజానికి రూ.5 చొప్పున బస్‌స్టాండ్ ఏర్పాటుకోసం ఏపీఎస్ ఆర్టీసీకి కేటాయిస్తూ రెవెన్యూ శాఖ 1964లో జీవో జారీ చేసింది. ఈ భూముల్లో కొంత భాగాన్ని బస్ స్టాండ్ ఏర్పాటుకు, మిగిలిన భాగాన్ని షాపుల నిర్మాణానికి మునిసిపాలిటీ లీజుకు ఇచ్చింది. ఇవి ప్రభుత్వ భూములైనందున లీజుకు ఇచ్చేందుకు మునిసిపాలిటీకి ఎలాంటి హక్కులు లేవని 1983లో నల్లగొండ తహసీల్దార్ మరో నివేదిక సమర్పించారు. ఈ భూముల్లో నిర్మించిన దుకాణాలు, ఇళ్లను ఖాళీ చేయాలని అప్పట్లో నోటీసులు జారీ చేశారు. షాపుల యజమానులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. సర్వే నం.32లో ఉన్న 5 ఎకరాల పట్టా భూములను ప్రైవేటు వ్యక్తులనుంచి కొనుగోలు చేశామని కొందరు షాపుల యజమానులు సైతం న్యాయ స్థానాలను ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో 2015లో జిల్లా కలెక్టర్, మునిసిపల్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించగా, ఆ సర్వే నంబర్లో 10.06 ఎకరాలకు బదులు 15.06 ఎకరాలున్నట్టుగా తేలింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా దుకాణాలు నిర్మించుకుని జీవనోపాధి పొందుతున్న వ్యాపారస్తులకు ఈ భూములు క్రమబద్ధీకరించాలని జిల్లా కలెక్టర్ తన నివేదికలో సిఫారసు చేశారు. -
ఈ కామర్స్ నియంత్రణకు నిబంధనలు
జెనీవా: భారత ఈ కామర్స్ రంగ నియంత్రణ కోసం నిబంధనలను రూపొందించే పని జరుగుతోందని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ కామర్స్ రంగం 2020 నాటికి 120 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ కామర్స్ రంగం ఏటా 51 శాతం మేర వృద్ధి చెందుతున్నప్పటికీ, డిజిటల్ మార్కెట్లకు సంబంధించిన చట్టాలను ఇంకా రూపొందించాల్సి ఉందన్నారు. వాణిజ్యం, అభివృద్ధిపై జెనీవాలో జరిగిన మూడో ఇంటర్ గవర్నమెంటల్ నిపుణుల బృందం సమావేశంలో పాశ్వాన్ మాట్లాడారు. అంతర్జాతీయ సరఫరా చైన్ల అవతరణ, వాణిజ్య అడ్డంకులు తగ్గిపోవడం, అంతర్జాతీయ వాణిజ్యం పెరగడం, ఈ కామర్స్ వేగవంతమైన విస్తరణతో కొత్త తరహా అనైతిక వ్యాపార ధోరణులకు ముప్పు పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వినియోగదారుల రక్షణ కోసం డైరెక్ట్ సెల్లింగ్ నియంత్రణకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ కామర్స్ రంగానికి నిబంధనలను తీసుకొచ్చే పని జరుగుతోందని చెప్పారు. -
మధురానుబంధానికి ఏడడుగులు
ఇంటికి వచ్చిన అతిథికి కాఫీ ఇస్తూ, ‘పంచదార వేయొచ్చా?’ అని అడగడం సర్వ సాధారణం అయిపోయింది. మిథునం కథలో శ్రీరమణ ‘ప్రతివారికి శంఖుచక్రాల్లా బీపీ షుగర్లు ఉంటున్నాయి’ అని చమత్కరించారు. అది వాస్తవం కూడా. మధుమేహం (షుగర్) ఏ కారణం వల్ల వచ్చినా, మధుమేహం వచ్చినవారు వారు మాత్రమే కాకుండా వారి జీవిత భాగస్వామిపైన కూడా ఆ ప్రభావం ఉంటుంది. ప్రభావం అంటే.. మధుమేహం వారిపై వారి భాగస్వామి మరింత శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఏర్పడడం. మధుమేహాన్ని భాగస్వామి తన నియంత్రణలో ఉంచుకునేలా వారు ప్రోత్సహించాలి. ఇది కొత్త బాధ్యతే కావొచ్చు. కాని తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన బాధ్యత. ఒత్తిడిని తగ్గించాలి: మధుమేహం వచ్చిందని తెలియగానే భాగస్వామికి తాను భారంగా ఉన్నాననే భావనలో పడిపోతారు. అది తప్పు అని చెప్పాలి. ఒత్తిడి పెరిగే కొద్దీ వ్యాధి పెరుగుతుంది కనుక, ఒత్తిడి పడకుండా, ఎప్పటికప్పుడు వ్యాధిని నియంత్రణలో ఉంచుకునేలా వారితో ప్రేమగా మాట్లాడుతుండాలి. శ్రద్ధ తీసుకోవాలి: మధుమేహం గురించి పూర్తిగా అవగాహన కలిగించాలి. మొదట్లో కొన్నిసార్లయినా డాక్టరు దగ్గరకు భాగస్వామితో కలిసి వెళ్లి, వ్యాధి గురించి వివరంగా అడిగి తెలుసుకోవాలి, మధుమేహం గురించి బాగా చదవాలి. ఎంత తెలుసుకుంటే, అంత జాగ్రత్తగా ఉండొచ్చని, భయపడటం అనవసరమని చెబుతూ ఉండాలి. కలిసి వాకింగ్: మధుమేహం అనేది జీవన విధానంలో ఒక అసమతుల్యతని, వ్యాధి తగ్గడానికి సమష్టి కృషి అవసరమని, భాగస్వామితో చర్చించి, ఏం చేయాలనే అంశం నిర్ణయించుకోవాలి. ఎటువంటి విషయంలో సహాయం అవసరమవుతుందో ముందుగానే చర్చించుకోవాలి. ఉదాహరణకి ఆరోగ్యకరమైన ఆహారం గురించి సూచించడం, వాకింగ్ చేసేలా సహకరించడం, వారితో పాటు వాకింగ్‌కి వెళ్లడం. శాసించకూడదు: నిరంతరం ఏదో ఒక జాగ్రత్త చెబుతూంటే, భాగస్వామికి చిరాకు కలిగి, చాలాకాలం పాటు వ్యాధిని నిర్లక్ష్యం చేస్తారు. ఇది చాలామందిలో కనిపిస్తుంది. ఏ ఒక్కరూ ఆరోగ్యం విషయంలో క్రమశిక్షణతో ఉండరనే గుర్తించాలి. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని ప్రతిరోజూ శ్రద్ధతో కాపాడుకోరనే విషయం గుర్తు తెచ్చుకోవాలి. మనకు ఇష్టులైనవారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే బాధ కలుగుతుంది. అలాగని నిత్యం నస పెడుతున్నట్లుగా జాగ్రత్తలు చెప్పడం వల్ల ఆరోగ్యం కుదుట పడదని గ్రహించాలి. మధుమేహం కారణంగా శారీరకంగా బాధపడుతుంటే గమనించి, వారికి మరింత సహకరించాలి. ఆ రోజు వరకు వారు ఎంత చక్కగా పనిచేసారోనని ప్రశంసిస్తూ, 2,3 రోజులు విశ్రాంతి తీసుకోమని సూచించాలి. కొన్ని మానేయాలి: జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి. భాగస్వామి ఎదురుగా జంక్ ఫుడ్ తింటూ, టీవీ చూస్తూ కూర్చోకూడదు. భాగస్వామి కోసం చిన్న చిన్న త్యాగాలు చేయాలి. ఆహారనియమాలు పాటిస్తూ, వ్యాయామం చేయడానికి సహకరించాలి. ఇద్దరూ కలిసి జిమ్‌లో చేరాలి. తీపి తినడం, పొగతాగటం, మద్యం సేవించడం వంటి అలవాట్లను విడిచిపెట్టాలి. చెడు అలవాట్లను విడిచిపెట్టి, ఆరోగ్యంగా జీవించడానికి ఇదొక మంచి అవకాశంగా భావించాలి. ఓర్పు అవసరం: పదే పదే వ్యాధి గురించి మాట్లాడకూడదు. భాగస్వామికి ఆసరాగా ఉంటున్నారనే విషయం వారు నెమ్మదిగా అర్థం చేసుకునేవరకూ ఓరిమితో ఉండాలి. వారి కోసం తప్పక సమయాన్ని కేటాయించాలి. నిపుణుల సహకారం: వ్యాధిని నియంత్రించుకునే ఈ సుదీర్ఘ ప్రయాణంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడం అవసరం. వైద్యులను తరచుగా కలుస్తూ ఉండటం వల్ల సందేహాలు పోతాయి. వెళ్లిన ప్రతిసారీ వైద్యునితో వివరంగా అన్నీ చెప్పాలి. డైటీషియన్ దగ్గర నుంచి డైట్‌ప్లాన్ తెచ్చుకోవాలి. ఇలా అన్ని విషయాల్లో భాగస్వామితో ‘మనసున మనసై’ అన్నట్లు ఉండడం వల్ల తమకు మధుమేహం వచ్చిందనే ఫీలింగ్ బాధించదు. పైగా త్వరగా నియంత్రణలోకి వస్తుంది. -
బీఎస్–6తో ద్విచక్ర పరిశ్రమకు గడ్డుకాలమే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో అమల్లోకి వస్తున్న బీఎస్–6 ప్రమాణాలు దేశీ ద్విచక్ర వాహన పరిశ్రమను పీకల్లోతు కష్టాల్లోకి నెడుతున్నాయి. ‘‘2019లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ప్రమాణాలు.. ఆపై ఏడాది 2020లో బీఎస్–6 ప్రమాణాలున్న వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తామని కేంద్రం నిబంధన పెట్టింది. దీంతో తయారీ సంస్థలు వీటి మీదే దృష్టిపెట్టాయి. కానీ, బీఎస్–6 టెక్నాలజీ, ఆర్అండ్డీ, మెటీరియల్ బాగా వ్యయ, ప్రయాసలతో కూడినవి. దీంతో వాహన ధరలు పెరుగుతాయి. దీనికి కస్టమర్లు ఎలా స్పందిస్తారన్నదే ప్రశ్న’’ అని హోండా మోటార్ అండ్ సైకిల్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ప్రెసిడెంట్ అండ్ సీఈవో మినోరు కాటో చెప్పారు. ఏబీఎస్, బీఎస్–6 ప్రమాణాల మధ్య ఏడాది గ్యాప్‌లోనే ధరలు పెరగడం కస్టమర్లు భరించలేరన్నారు. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహన తయారీ సంస్థలకు చాలెంజింగ్‌గా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2018–19లో హెచ్ఎంఎస్ఐ ప్రణాళికల గురించి న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ‘సాక్షి బిజినెస్’ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలివీ... అన్నిటికీ అప్‌గ్రేడెడ్ మోడళ్లు 2020 నాటికి మార్కెట్లోకి బీఎస్–6 వాహనాలను విడుదల చేయాలని నిర్ణయించాం. సాంకేతికత, ఆర్అండ్డీ, ఉత్పత్తుల తయారీ, నాణ్యతపై పరిశోధనలు వేగవంతం చేశాం. 2018–19 ఆర్ధిక సంవత్సరంలో దేశంలో రూ.800 కోట్ల పెట్టుబడులు పెడతాం. ఈ ఏడాది మార్కెట్లోకి ఒక కొత్త బైక్‌తో పాటు 18 అప్‌గ్రేడ్ మోడల్స్‌ను తెస్తాం. ప్రస్తుతం విపణిలోకి ఉన్న హోండా స్కూటర్స్ అన్నిటికీ అప్‌గ్రేడెడ్ మోడల్స్ విడుదల చేస్తాం. హోండా ప్రీ ఓన్డ్ బైకులు.. దేశంలో ప్రీ ఓన్డ్ వాహనాలనూ విక్రయించే ద్విచక్ర వాహన తయారీ సంస్థ మాదొక్కటే. 2011లో బెస్ట్ డీల్ బ్రాండ్ పేరిట ప్రీ ఓన్డ్ స్టోర్లను ప్రారంభించాం. ఇప్పటివరకు దేశంలో 200 స్టోర్లున్నాయి. ప్రతి స్టోర్‌లో నెలకు 20 వాహనాలను అమ్ముడవుతున్నాయి. ఇప్పటివరకు లక్ష ద్విచక్ర వాహనాలను విక్రయించాం. బెస్ట్ డీల్ ప్రత్యేకత ఏమంటే.. ఏ కంపెనీ బైక్ లేదా స్కూటర్‌నైనా కొంటాం. అమ్మేది మాత్రం కేవలం హోండా ద్విచక్ర వాహనాలే. 6 నెలల వారంటీ, 2 ఉచిత సర్వీసులు కూడా ఉంటాయి. ఈ ఏడాది ప్రీ ఓన్డ్ సెంటర్లను 250కి చేరుస్తాం. 2017–18 ఆర్ధిక సంవత్సరంలో దేశంలో మొత్తంగా 20 మిలియన్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయాయి. 6 ఏళ్ల తర్వాత తొలిసారిగా పరిశ్రమ 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది 60 లక్షల విక్రయాలు.. 2016–17లో 50 లక్షల వాహనాలను విక్రయించిన హోండా.. గత ఆర్థిక సంవత్సరంలో 27 శాతం వృద్ధితో 60 లక్షలకు చేరింది. ఇందులో స్కూటర్లు 20 శాతం, మోటార్ సైకిల్స్ వాటా 14 శాతం. ఎగుమతులు తొలిసారిగా 23 శాతం వృద్ధితో 3 లక్షల మార్క్‌ను దాటాయి. మా మొత్తం అమ్మకాల్లో ఎగుమతుల వాటా 5 శాతం. శ్రీలంక, నేపాల్, కొలంబియా, బంగ్లాదేశ్ వంటి 27 దేశాలకు హోండా ద్విచక్ర వాహనాలు ఎగుమతి అవుతున్నాయి. మా మొత్తం అమ్మకాల్లో గ్రామీణ మార్కెట్ వాటా 28–30 శాతం వరకూ ఉంటుంది. 64 లక్షలకు ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం హోండాకు దేశంలో 4 తయారీ కేంద్రాలున్నాయి. హరియాణా, రాజస్తాన్, కర్ణాటక, గుజరాత్లో ప్లాంట్లున్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 64 లక్షలు. బీఎస్–6 తర్వాత ధరల స్థిరీకరణ జరిగాక.. ప్రస్తుతమున్న ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం సరిపోదు. అందుకే దేశంలో 5వ ప్లాంట్ ఏర్పాటుపై జపాన్‌లోని ప్రధాన కార్యాలయంలో చర్చలు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రమనేది ఇంకా నిర్ణయానికి రాలేదు. దేశంలో 5,750 డీలర్షిప్స్ ఉన్నాయి. వీటిని ఈ ఏడాది 6 వేలకు చేర్చనున్నాం. 70 శాతం నెట్వర్క్ విస్తరణ గ్రామీణ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనే ఉంటుంది. -
ఇది చైనా స్కైలాబ్!
బీజింగ్: ప్రస్తుతం నిరుపయోగంగా మారిన, నియంత్రణలో లేని అంతరిక్ష ప్రయోగ కేంద్రమొకటి భూమిపై కూలిపోనుంది. చైనాకు చెందిన టియాంగంగ్–1 (స్వర్గ సౌధం) అనే అంతరిక్ష కేంద్రం సోమవారం తెల్లవారుజామున 5 గంటలలోపు (భారత కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియా నుంచి అమెరికా మధ్యలో ఎక్కడైనా పడొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టియాంగంగ్–1ను చైనా 2011లో ప్రయోగించింది. దీని జీవితకాలం రెండేళ్లు ఉండేలా అప్పట్లో రూపొందించారు. 2013 జూన్ కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసింది. 2016లో పనిచేయడం మానేసి కొద్దికొద్దిగా కక్ష్య నుంచి పక్కకు జరుగుతూ వస్తోంది. ‘టియాంగంగ్–1 అంతరిక్ష కేంద్రం భూమివైపుకు వస్తోంది. ఆదివారం మధ్యాహ్నానికి అది భూవాతావరణానికి 179 కి.మీ. దూరంలో ఉంది’ అని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ చెప్పింది. అయితే టియాంగంగ్–1 భూమిపై ఏ సమయంలో, ఎక్కడ పడుతుం దనే కచ్చితమైన వివరాలను ఏజెన్సీ వెల్లడించలేదు. యూరోపియన్ అంతరిక్ష సంస్థ మాత్రం చైనా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.25 గంటలకు టియాంగంగ్ భూమిపై పడొచ్చని అంచనా వేస్తోంది. యూరప్‌లోనూ కూలొచ్చు దక్షిణ కొరియా అంతరిక్ష సంస్థ అంచనా మరోలా ఉంది. ఆ సంస్థ చెబుతున్న దాని ప్రకారమైతే భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 1.42 గంటల నుంచి సోమవారం ఉదయం 9.42 గంటల మధ్య టియాంగంగ్ భూమిపై కూలిపోవచ్చు. ఇది బ్రిటన్‌లో కూలే అవకాశం లేదనీ, అయితే స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్, గ్రీస్ తదితర దేశాల్లో పడిపోయే అవకాశం ఉందంది. 8 టన్నుల బరువు, 10.4 మీటర్ల పొడవుండే టియాంగంగ్ న్యూజిలాండ్, టాస్మానియా, అమెరికాల్లోనూ కూలొచ్చనీ వెల్లడించింది. ఏం భయం లేదు.. అంతరిక్ష కేంద్రం కూలిపోయినా భూమిపై జరిగే నష్టం పెద్దగా ఉండబోదనీ, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని చైనా అధికారులు చెబుతున్నారు. భూ వాతావరణంలోకి అంతరిక్ష కేంద్రం ప్రవేశించగానే అందులోని ఇంధనం అంటుకొని అనేక భాగాలు ఆకాశంలోనే కాలిపోతాయని వారు వివరిస్తున్నారు. భూమికి 80 కిలో మీటర్ల దూరంలో ఉండగానే ఇది మంటల్లో చిక్కుకుని, భూమిపై చిన్న చిన్న ముక్కలు మాత్రమే తక్కువ వేగంతో పడతాయన్నారు. ‘టియాంగంగ్ భూమికి ఎలాంటి హానినీ కలిగించదు. విషపదార్థాలను కూడా విడుదల చేయదు’ అని చైనా సైన్యంలోని అధికారులు చెప్పారు. టియాంగంగ్ గురించి ఐక్యరాజ్యసమితి సహా అన్ని సంబంధిత అంతర్జాతీయ సంస్థలకు సమాచారమిచ్చామన్నారు. ‘సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోలాగా టియాంగంగ్ భూమిపైకి దూసుకొచ్చి కూలదు. ఆకాశం నుంచి ఉల్కలు రాలుతున్నట్లుగా కనిపిస్తుంది అంతే’ అని చైనా ఏజెన్సీ చెప్పింది. గత 60 ఏళ్లలో ఆరు వేలకు పైగా వస్తువులు/పరికరాలు అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చాయనీ, వీటి వల్ల ఎవ్వరికీ హానీ జరగలేదని యూరోపియన్ అంతరిక్ష సంస్థ పేర్కొంది. -
ఉద్యోగ భద్రత.. ఎన్నాళ్లీ వ్యథ..!
పాలకొల్లు టౌన్: బాబు వస్తే జాబు వస్తుంది.. 20 14 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రధాన అంశం. ఇదొక్కటే కాదు ఎన్నో అమలుకాని హామీలను ఇచ్చి తీరా గద్దెనెక్కిన తర్వాత టీడీపీ పాలకులు వీటి అమలును మరిచిపోయారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత, వేతనాలు లేవని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కాంట్రాక్ట్ హెల్త్ ఉద్యోగుల విధానాన్ని 2002లో ప్రవేశపెట్టిన చంద్రబాబు ఉద్యోగుల కుటుంబాలకు భద్రత లేకుండా చేశారని ఆరోపిస్తున్నా రు. దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు మంగళవారం కాంట్రాక్ట్ ఉద్యోగులు విజయవాడలోని అలంకార సెంటర్లో ధర్నా చేయడానికి పూనుకున్నట్టు యూ నియన్ నాయకులు తెలిపారు. జిల్లాలో వందలాది మంది జిల్లాలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్అసిస్టెంట్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు సుమా రు 500 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో, సు మారు 10 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉ ద్యోగులు పనిచేస్తున్నారు. 2002లో కాం ట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని అప్పటి సీఎం చంద్రబాబు కమిటీ వేసినా నివేదికను పక్కనపెట్టారని ఉద్యో గులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంట్రాక్ట్ హెల్త్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఆయన ఆకస్మిక మృతితో విషయం మరుగునపడిపోయిందన్నారు. 2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని పట్టించుకోలేదని వాపోతున్నారు. జీఓ 27తో నిరాశ ప్రభుత్వం స్పందించకపోవడంతో కాం ట్రాక్ట్ ఉద్యోగులు సుప్రీంకోర్టుçను ఆశ్రయించారు. దీంతో కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిందని ఉద్యోగ సంఘ నాయకులు చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో సీఎం చంద్రబాబు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని కాంట్రాక్ట్ ఉద్యోగులను నమ్మించి డిసెంబర్లో మంత్రి వర్గ కమి టీ ఏర్పాటు చేయడంతో వేతనాలు పెరుగుతాయని ఆశించగా జీఓ 27న విడుదల చేసి నిరాశకు గురిచేశారని ఉద్యోగులు అంటున్నారు. బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏలను మినహాయించి పర్మినెంట్ వేత నం ఇచ్చేలా జీఓ 27 రూపొందించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యను సంప్రదించగా విషయాన్ని మంత్రివర్గ కమిటీ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధనకు కాంట్రాక్ట్ హెల్త్ ఉ ద్యోగులు పోరాటానికి సిద్ధమయ్యారు. -
పలికెడిది ప్రతి వస్తువూనట! పలికించునది ఇందుశ్రీ అట
వెంట్రిలాక్విజమ్ మంచి కెరీర్. ఈ ఫీల్డులో అబ్బాయిలే ఉంటారని, అమ్మాయిలు రాకూడదని ఏ నిబంధనలూ లేవు. షోలు ఇస్తూనే ప్రస్తుతం నేను బెంగళూరులో ఎంఎస్ కమ్యూనికేషన్స్, బీఎఫ్ఏ కోర్సు చేస్తున్నాను. ఆసక్తి అమ్మాయిలకు, అబ్బాయిలకు వెంట్రిలాక్విజం నేర్పిస్తున్నాను. – ఇందుశ్రీ ఇందుశ్రీ వెంట్రిలాక్విస్ట్. ఊహు.. ఈ మాట సరిపోదు. అంతర్జాతీయ వెంట్రిలాక్విస్ట్. ఈ మాట కూడా! ఇండియాలో మొట్ట మొదటి మహిళా వెంట్రిలాక్విస్ట్. ఎస్. ఈ మాట కరెక్ట్. ఈ ఏడాది జనవరి 20న న్యూఢిల్లీలో తొలి భారతీయ ఉమన్ వెంట్రిలాక్విస్ట్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఇందుశ్రీ ‘ఇండియన్ ఉమెన్ అచీవర్స్’అవార్డు అందుకున్నారు. ఈ నెల 26, 27 తేదీలలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఉత్సాహవంతులైన యువతీయువకుల కోసం రవీంద్రభారతిలో నిర్వహించిన శిక్షణా శిబిరాలకు వచ్చి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’ ఇందుశ్రీని పలకరించింది. ఆ విశేషాలివి. రెండేళ్ల వయసుకే ‘పట్టు’! ఇందుశ్రీ బెంగుళూరు అమ్మాయి. రెండేళ్ల వయస్సులో టీవీలో వెంట్రిలాక్విజమ్ చూసి, మాట్లాడే ఆ బొమ్మ కావాలని పట్టుపట్టింది. తర్వాత కొన్నాళ్లు మ్యూజిక్‌లో పడిపోయి, తిరిగి వెంట్రిలాక్విజమ్లోకి షిఫ్ట్ అయ్యారు ఇందుశ్రీ. ఆమెకు ఆ కళను ఎవ్వరూ నేర్పలేదు. తనకు తానుగా ఆడియో, వీడియోల్లో నేర్చుకొంటూ సాధన చేస్తూ వచ్చారు! ఇష్టం కాబట్టి.. కష్టమనిపించలేదు వెంట్రిలాక్విజంలో ఆర్టిస్టుగా నిలదొక్కుకోడానికి రేయింబవళ్లు కష్టపడ్డారు ఇందుశ్రీ. స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవడం, బొమ్మలు తయారు చేసుకోవటం పెద్ద పనులు. బొమ్మల తయారీలో, ఎంపికలో మొదటి నుంచి ఆమె తండ్రి రవీంద్ర సహకారం అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడు తమ్ముడు లకితేష్, భర్త అశ్వత్ భేరి చేదోడుగా ఉంటున్నారు. ఇందులో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ, వాటిని నెగ్గుకుని వచ్చారు ఇందుశ్రీ. లైవ్‌లో డాగ్ వెంట్రిలాక్విజమ్! బహుశా ఎవ్వరూ ఈ తరహా ప్రదర్శన చేసి ఉండరు. ఇందుశ్రీ చేశారు! బెంగళూరులో సోనీ, స్టార్, సీఎన్ఎన్ టీవీల్లో కుక్క బొమ్మతో కాకుండా, నిజంగా కుక్కతోనే వెంట్రిలాక్విజమ్ షో చేశారు. ముంబైలో అయితే ‘ఇండియా హ్యాజ్ గాట్ టాలెంట్ షో’లో ఒకేసారి నాలుగు బొమ్మలతో .. (రెండు చేతుల్లో రెండు, రెండు కాళ్లతో రెండు) వెంట్రిలాక్విజమ్ చేశారు. ఒకోసారి ఆ ఈవెంట్‌ను ఎలా చేయగలిగానా అనిపిస్తుందట. అభిమానులూ ఉన్నారు 2016లో బెంగళూరులో నారాయణ హృదయాలయంలో ఓ చిన్నారికి హార్ట్ ఆపరేషన్‌కు తేదీ నిర్ణయించారు డాక్టర్లు. కానీ ఆ చిన్నారి ఆపరేషన్‌కు రాను అంది. డాక్టర్లు కారణం అడిగారు. ‘‘ఇందుశ్రీ అక్క వెంట్రిలాక్విజమ్ ప్రోగ్రామ్ ఉంది. చూడాలి అంది. డాక్టర్లు విస్తుపోయారు. ఇది తెలిసిన ఇందుశ్రీ వండర్ అయ్యారు. 22 ఏళ్లు.. 3,500 షోలు బెంగళూరు సిటీకేబుల్‌లో ప్రోగ్రామ్స్‌తో పాటు, బయట 3,500 పై షోలు చేశారు ఇందుశ్రీ. వెంట్రిలాక్విజమ్‌లో 22 ఏళ్ల జర్నీ ఆమెది. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్ లాంటి 16 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. టీ కప్పు, పుస్తకంతో కూడా మాట్లాడించగలిగారు. అలా అన్ని వస్తువులతో మాట్లాడించాలన్నదే ఆమె ఆశయం. – కోన సుధాకర్ రెడ్డి, ‘సాక్షి’ సిటీ -
‘అక్రమ ఉద్యోగుల’ క్రమబద్ధీకరణ!
అంగట్లో కూరగాయల్లాగా ఉద్యోగాలను అమ్మేశారు.. పోస్టులు లేకున్నా ఎడాపెడా నియామకాలు చేపట్టారు. నియామకాలపై నిషేధం ఉన్నా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1,731 మందిని దర్జాగా నియమించేశారు. ఈ విషయం ఇటీవల వెలుగు చూసేసరికి ‘అరే.. ఇదేం విడ్డూరం’అంటూ ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ కొద్ది రోజులకే పరిస్థితి మారిపోయింది. ఆ నియామకాలన్నింటినీ సక్రమం చేసేందుకు ఫైలు కదిలింది.. పైగా నజరానాగా ఆ అక్రమ ఉద్యోగులందరికీ వేతన సవరణ చేసేందుకు రంగం సిద్ధమైంది. దళారులు తలుచుకుంటే జరగనిదేముంది... అదీ అక్రమాలకు నిలయంగా మారిన దేవాదాయశాఖలో మరింత సులభమని మరోసారి రుజువైంది. సాక్షి, హైదరాబాద్: ఎన్నో అవినీతి ఆరోపణలతో పరువుపోగొట్టుకున్న దేవాదాయశాఖలో తాజాగా జరుగుతున్న తంతు విస్మయం కలిగిస్తోంది. నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నందున కొత్త నియామకాలు చేపట్టకుండా ప్రభుత్వం నిషేధం విధించిన కాలంలో దొడ్డిదారిన చేరిన అక్రమ ఉద్యోగులను క్రమబద్ధం చేసేందుకు రంగం సిద్ధమైంది. దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులకు ప్రభుత్వం ఇటీవల వేతన సవరణ చేసింది. వేతన సవరణ కసరత్తు సమయంలో దేవాదాయశాఖలో నియామకాలపై నిషేధం ఉన్న సమయంలో 1,731 మంది అక్రమంగా ఉద్యోగాలు పొందారన్న విషయం బయటపడింది. దీంతో కంగుతున్న ఉన్నతాధికారులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో అక్రమంగా నియమితులైన వారికి వేతన సవరణ చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన సర్కారు వారికి వేతన సవరణను వర్తింపచేయొద్దని ఆదేశించింది. డిసెంబర్ నుంచి కొత్త వేతనాలు రావాల్సి ఉన్నందున వారిని పక్కనపెట్టి మిగతా వారికి వేతనాలు పెంచి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసింది. దీంతో ఆ అక్రమ ఉద్యోగులపై చర్యలు తప్పవనుకున్నారు. 2004లో దేవరయాంజాల్‌శ్రీరామచంద్రస్వామి భూముల అక్రమ ధారాదత్తం వెలుగు చూసినప్పుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దేవాదాయశాఖలో పెద్ద సంఖ్యలో అక్రమంగా ఉద్యోగుల నియామకం జరిగినట్లు తేలింది. దీనికి ఓ కమిషనర్, కొందరు అధికారులు బాధ్యులని గుర్తించిన ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంది. అక్రమంగా నియమితులైనట్లు తేలిన కొందరు ఉద్యోగులను కూడా తొలగించింది. దళారుల మాయ... దేవాదాయశాఖలో తాజాగా బయటపడిన అక్రమ ఉద్యోగులను ఇప్పుడు కూడా ప్రభుత్వం తొలగిస్తుందన్న ప్రచారం జరిగింది. అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నందున జీతాల రూపంలో దేవాదాయశాఖపై ఆర్థికభారం కూడా పడుతున్న విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందన్న వార్తలు వచ్చాయి. కానీ ఇదే సమయంలో కొందరు దళారులు రంగప్రవేశం చేశారు. అక్రమ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు భారీగా డబ్బు వసూలు చేశారు. ఆ తర్వాత తెరవెనక ఇంకేం మతలబులు చోటుచేసుకున్నాయోగానీ అక్రమ ఉద్యోగులకు కూడా వేతన సవరణ చేసేందుకు అడ్డుగా ఉన్న అంశాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఆ ఉద్యోగులకు కూడా వేతన సవరణ చేయాలంటూ డిమాండ్ చేసిన దేవాదాయశాఖ అర్చక ఉద్యోగ సంఘాలకు ఆ మేరకు సమాచారం కూడా అందింది. ఈ నెలాఖరు వరకు ఆ తంతు పూర్తవుతుందని భావిస్తున్నారు. మార్చి నుంచి వారికి కూడా వేతన సవరణ అమలవుతుందని పేర్కొంటున్నారు. ఇదే జరిగితే అక్రమార్కులకు భరోసా లభించి భవిష్యత్తులో వారు మరిన్ని అక్రమాలకు తెగబడేలా ప్రోత్సహించినట్లు అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఫిర్యాదు చేసేలా ధైర్యమిద్దాం
సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై లైంగిక వేధింపులను నియంత్రించేందుకు వారిలో ధైర్యం నింపాలని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొ న్నారు. వేధింపులకు గురైన చిన్నారుల విష యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చిన్నారులపై లైంగిక వేధింపులు– నియంత్రణపై ఏడాది పాటు ప్రచారం నిర్వహిం చేందుకు కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో మాట్లా డుతూ.. దేశవ్యాప్తంగా ప్రతి 30 నిమిషాలకో మైనర్ లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. పాఠశా లలు, ఇళ్లల్లో, పనిచేసే చోట 53 శాతం మైనర్ బాలబా లికలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ చేసిన అధ్యయనంలో వెల్లడైందన్నారు. 13 రాష్ట్రాల్లో జరిగిన ఈ అధ్య యనంలో 12 లక్షల మంది మైనర్లు వేధింపులకు లోనవుతున్నారని, వీరిలో 57 శాతం అబ్బాయిలు ఉన్న ట్లు తెలిపారు. సమాజంలో లైంగిక వేధింపుల నియం త్రణపై అవగాహన, చర్చ జరిగి పోలీస్స్టేషన్లలో ఫిర్యా దు చేసే వరకు బాధితులు రావాలని అభిప్రాయ పడ్డారు. ఇందుకు పోలీస్ శాఖతో పాటు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, వైద్య, పంచాయతీరాజ్ శాఖ, ఎన్జీవోలు, పాఠశాలలు కలసి పనిచేస్తాయని చెప్పారు. ఈ నెల 3న సాయంత్రం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద క్యాంపెయిన్ ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొంటారని నోడల్ అధికారులు సౌమ్యామిశ్రా, చారుసిన్హా వెల్లడించారు. క్యాంపెయిన్ లోగోతో పాటు, ప్రచార గేయం, వెబ్‌పేజ్, ఫేస్బుక్, ట్వీటర్ ఖాతాలను డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి, రైల్వే డీజీ కృష్ణప్రసాద్, ఐజీలు సౌమ్య మిశ్రా, చారుసిన్హా ఆవిష్కరించారు. ప్రచార గేయ రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్‌ను డీజీపీ సన్మానించారు. ఆన్లైన్ వేధింపులు తీవ్రతరం.. మైనర్లపై భౌతికంగా జరిగే లైంగిక వేధింపుల కన్నా ఆన్లైన్ వేధింపులు తీవ్రతరంగా మారాయని డీజీపీ అనురాగ్ శర్మ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో రెండ్రోజుల పాటు పోలీసు అధికారులకు యూనెస్కో ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. టెక్నాలజీ వినియోగం పెరిగిన కొద్దీ చిన్నారులకు లైంగిక వేధింపులు పెరిగాయని, అధికారులు, సిబ్బంది టెక్నాలజీపై పట్టు సాధించి, వేధింపుల నియంత్రణకు కృషిచేయాలని సూచించారు. -
విద్యుత్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
-
విద్యుత్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
♦ 20,903 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విలీనం ♦ సీఎం ఆమోదంతో వెంటనే వెలువడ్డ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యో గుల నిరీక్షణ ఫలించింది. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 20,903 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు శనివారం ఉత్తర్వులు జారీ చేశాయి. ఉద్యోగుల విద్యార్హతలను ప్రామాణికంగా తీసుకుని ఉన్నత నైపుణ్యంగల వారికి ఆర్టిజన్ గ్రేడ్–1, నైపుణ్యంగల వారికి ఆర్టిజన్ గ్రేడ్–2, స్వల్ప నైపుణ్యంగల వారికి ఆర్టిజన్ గ్రేడ్–3, నైపుణ్యంలేని వారికి ఆర్టిజన్ గ్రేడ్–4 హోదాలు కల్పిస్తూ విలీనం (అబ్జార్షన్) చేసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. ట్రాన్స్‌కోలో 4,197 మంది, జెన్కోలో 2,914 మంది, టీఎస్ఎస్పీడీసీ ఎల్లో 9,459 మంది, టీఎస్ఎన్పీడీసీఎల్లో 4,333 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ పొందారు. వారికి కొత్త పే స్కేల్‌ను విద్యుత్ సంస్థలు ప్రకటించాయి. ఏళ్ల తరబడి విద్యుత్ సంస్థల్లో తక్కువ జీతం తీసుకుంటూ కష్టపడుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆగమేఘాల మీద ప్రక్రియ... ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను హైకోర్టు, సుప్రీంకోర్టు ఇటీవల వ్యతిరేకించడం... విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు లో కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో న్యాయ పరమైన చిక్కులు ఎదురుకాక ముందే క్రమబద్ధీ కరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలతోపాటు ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంది. జెన్కో, ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ల పాలక మండళ్లు శుక్రవారం విద్యుత్‌సౌధలో సమావేశమై ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించాయి. ఆ వెంటనే ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాయి. ఈ ప్రతిపాదనలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, విద్యుత్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామమ కృష్ణ, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు శని వారం చర్చించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమ బద్ధీకరణ ప్రతిపాదనలను సీఎం ఆమోదానికి పంపగా, ఆయన వెంటనే ఆమోదముద్ర వేయ డంతో ఈ ప్రక్రియ వేగంగా జరిగిపోయింది. సీఎంకు ట్రాన్స్‌కో సీఎండీ కృతజ్ఞతలు విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీ కరిస్తామన్న మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యుత్ సంస్థల తరఫును జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ముఖ్య మంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటా రన్నారు. విద్యుత్ ఉద్యోగులు మరింత అంకితభావంతో పనిచేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సహకరించిన మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణ, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావుకు ప్రభాకర్‌రావు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. -
క్రమబద్ధీకరణం
అక్రమ భవన నిర్మాణదారులకు శుభవార్త. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్యారాజ్యంగా చేపట్టిన నిర్మాణాలకు రాజముద్ర పడనుంది. దశాబ్దం క్రితం అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తూ సక్రమ నిర్మాణాలుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆరుమాసాల గడువు ఇచ్చింది. ♦ అక్రమ నిర్మాణాలకు అవకాశం ♦ 2007 క్రితం నాటి నిర్మాణాల క్రమబద్ధీకరణ ♦ ఆరునెలల గడువు ♦ ప్రభుత్వానికి తీవ్ర నష్టమని వ్యతిరేకత సాక్షి ప్రతినిధి, చెన్నై: చెరువులు, నీటి నిల్వ ప్రాంతాలు, స్థానిక సంస్థలకు సొంతమైన స్థలాలు, ప్రజా వినియోగానికి కేటాయించిన ప్రదేశాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అనర్హమైనవిగా గుర్తించి విద్యుత్, తాగునీటి వసతిని తొలగిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. చెన్నై శివారు ప్రాంతాలు గ్రేటర్ చెన్నైలో కలిసిపోగా ఆయా ప్రాంతాల్లో నివాస గృహాలు, వాణìజ్య సముదాయాలు నిర్మించాలంటే చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఎండీఏ), డైరెక్టర్ టౌన్, కంట్రీ ప్లానింగ్ కమిటీ (డీటీసీపీ)నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ రెండు సంస్థలు సూచించే నియమ నిబంధనలు, భద్రతా సూచనలను పాటించకుండా నిర్మాణాలు జరిపితే ప్రమాదాలు చోటుచేసుకోగా కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రేటర్ చెన్నై చట్టంలో 113సీ పేరుతో సవరణ చట్టాన్ని తెచ్చారు. నిబంధనలను అతిక్రమించి 2007 జూలై 1వ తేదీ క్రితం నాటి నిర్మాణాల గణాంకాలను సేకరించి క్రమబద్ధీకరణకు రిటైర్డు న్యాయమూర్తి రాజేశ్వరన్ చైర్మన్‌గా 2014లో కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో సభ్యులుగా పలువురు అధికారులు, నిర్మాణరంగ నిపుణులుగా ఉన్నారు. ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి కొన్ని సిఫార్సులు చేసింది. కమిటీ చేసిన సిఫార్సులను మంత్రివర్గం ఇటీవలే ఆమోదించి అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి నోటీసు వెలువడిన నాటి నుంచి ఆరు నెలల్లోగా క్రమబద్ధీకరణను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరణ పరిధిలోకి రాని నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ సిబ్బందికి అధికారాలు ఇచ్చారు. ఓవైపు వ్యతిరేకత అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. నీటి నిల్వ ప్రాంతాలు, ప్రభుత్వ పొరంబోకు స్థలాల్లో నిర్మాణాలను ప్రభుత్వమే అనుమతించడం వల్ల కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమ నిర్మాణా లు, ఆక్రమణలపై పరిసరాల్లోని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. సీఎండీకే, డీటీసీపీ అధికారుల ఉదాసీనతకు ప్రజలు ప్రాణాలు కోల్పోతూ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారనే ఆవేదన వ్యక్తం అవుతోంది. చెన్నై మౌళివాక్కంలో 61 మందిని బలిగొన్న 11 అంతస్తుల నిర్మాణం, ఇటీవల నిట్టనిలువునా కాలిపోయిన టీనగర్‌లోని చెన్నై శిల్క్స్ భవనాన్ని ఉదహరిస్తున్నారు. క్రమబద్ధీకరణకు ఇవీ నిబంధనలు ♦ ఆయా నిర్మాణాలు 2007 జూలై 1 కంటే ముందు నిర్మించి ఉండాలి. ♦ కొత్తగా చేపట్టబోయే నిర్మాణాలు ఎయిర్ కంట్రోల్, సముద్రతీర ప్రాంతాల, ఎయిర్‌ఫోర్సు, సైనిక దళాల, కొండ ప్రాంతాల, తమిళనాడు న్యూక్లియర్ సంస్థల నిబంధనలకు నిర్మాణాలు కట్టుబడి ఉండాలి. ♦ వీధులు, రోడ్లు, జాతీయ రహదారులు, ప్రభుత్వ, స్థానిక సంస్థలకు సొంతమైన ప్రదేశాలు, నీటి నిల్వ ప్రాంతాలు, నగర అభివృద్ధి పథకాల పరిధిలోని ప్రాంతాలు, పార్కులు, ప్రజోపయోగంలో ఉండే బహిరంగ స్థలాల్లో నిర్మించిన వాటిని క్రమబద్ధీకరించేందుకు వీలు లేదు. ♦ రోడ్ల విస్తరణకు అనువైన ప్రదేశాలు, వాహనాలు నిలిపే ప్రదేశాలు తదితరాల్లోని నిర్మాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా కమిటీ సిఫార్సు చేసింది. ♦ క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం చెల్లించాల్సిన సొమ్ము, విస్తరించిన ప్రాంతానికి రుసుం, జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. ♦ అపార్టుమెంట్ల నిర్మాణాల్లో కారు పార్కింగ్ సరిగా లేకుంటే రూ.10 వేలు, వాణిజ్య సముదాయాల్లో చెన్నైలో అయితే రూ.1లక్ష, శివార్లలో రూ.50 వేలు, ద్విచక్రవాహన పార్కింగ్‌లో లోపాలుంటే రూ.2,500లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంద -
కంటిచూపు కూడా!
గుడ్‌ఫుడ్ ఉదయం వేళ కావాల్సిన మలవిసర్జన సరిగా కాకపోయినా... ఒక వ్యక్తి మలబద్దకంతో బాధపడుతున్నా స్వాభావికంగానే ఆ పరిస్థితిని నయం చేసే ఔషధ ఫలం జామపండు. ఆపిల్ కంటే చాలా రెట్లు ఎక్కువగా మేలు చేస్తుందన్న పేరు పొందిన పండు జామ. దాని ప్రయోజనాల్లో కొన్ని... ►క్రమం తప్పకుండా జామ పండు తినేవారి బరువు నియంత్రణలో ఉంటుంది. దీనిలో పీచు పదార్థాలు ఎక్కువ, చక్కెర పాళ్లు తక్కువ. అందుకే స్వాభావికంగా బరువు నియంత్రించడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. ►దీనిలో విటమిన్–ఏ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే మంచి కంటిచూపు కావాలనుకున్నవారు దీన్ని తినడం మేలు. పైగా క్యాటరాక్ట్, మాక్యులార్ డీజనరేషన్ వంటి అనేక కంటి వ్యాధులను జామ నివారిస్తుంది. ►జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ముఖ్యంగా ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. జామలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇందుకు దోహదపడతాయి. ►జామలో విటమిన్–సి పాళ్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది విటమిన్–సి లోపించడం వల్ల వచ్చే స్కర్వీ వంటి వ్యాధులకు విరుగుడుగా కూడా పనికి వస్తుంది. ►థైరాయిడ్ వ్యాధుల నియంత్రణకు ఉపయోగపడే పండు... జామ. ►జామపండును క్రమం తప్పకుండా తినేవారి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. విటమిన్–బి6, విటమిన్ బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం... మెదడులోని న్యూరాన్ల పనితీరుకు పై విటమిన్లు అవసరం కావడమే దీనికి కారణం. ►రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించడానికి జామ ఉపకరిస్తుంది. అంతేకాదు... ఇది అధిక రక్తపోటును నివారిస్తుంది. ∙జామపండ్లను కొరికి తినేవారిలో చిగుర్లు, పంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. -
క్రమబద్ధీకరణకు 22 వేల దరఖాస్తులు
- 10 వేల దరఖాస్తులు సబ్‌స్టేషన్ ఆపరేటర్లవే - బిల్ కలెక్టర్ల నుంచీ దరఖాస్తుల స్వీకరణపై త్వరలో నిర్ణయం - ఆ తర్వాతే మార్గదర్శకాల రూపకల్పనకు కమిటీ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల మందికి పైగా తాత్కాలిక ఉద్యోగులు, కార్మికుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. అందులో దాదాపు 10 వేలు సబ్‌స్టేషన్ ఆపరేటర్లవే ఉన్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో అత్యధికంగా 10 వేల దరఖాస్తులు రాగా, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) పరిధిలో మరో 5 వేలు, తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) పరిధిలో 4,200, రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) పరిధిలో 4,100 దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఇంధన శాఖ అధికార వర్గాలు తెలిపాయి. దరఖాస్తుల్లోని సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నెల 17 తర్వాతే దరఖాస్తుల సంఖ్య పట్ల స్పష్టత రానుందని అధికారవర్గాలు తెలిపాయి. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులను దశల వారీగా క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ అమలు కోసం విద్యుత్ సంస్థల యాజమాన్యాలు దరఖాస్తుల స్వీకరణ నిర్వహించాయి. బిల్ కలెక్టర్లపై త్వరలో నిర్ణయం ప్రైవేటు కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్న బిల్ కలెక్టర్లు, అకౌంటింగ్ అసిస్టెం ట్లు, హమాలీల క్రమబద్ధీకరణ కోసం కూడా దరఖాస్తులు స్వీకరించే అంశంపై త్వరలో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోనున్నాయి. పార్ట్‌టైం ఉద్యోగుల నుంచీ దరఖాస్తులు స్వీకరించాలని విద్యుత్ ట్రేడ్ యూనియన్లు చేసిన డిమాండ్‌పై యాజమా న్యాలు పరిశీలన జరుపుతున్నాయి. పార్ట్‌టైం ఉద్యోగులకు భవిష్య నిధి (పీఎఫ్) సదుపాయం లేకపోవడం, నిబంధనల మేరకు 8 గంటలు పనిచేసే కార్మికుల పరిధిలోకి వీరు రాకపోవడంతో పార్ట్‌టైం ఉద్యోగుల నుంచి తొలుత దరఖాస్తులు స్వీకరించలేదు. ట్రేడ్ యూనియన్ల విజ్ఞప్తుల నేపథ్యంలో సాధ్యాసా ధ్యాలను పరిశీలించి ఆ తర్వాత ఓ నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యాలు భావిస్తున్నా యి. దీంతో పార్ట్‌టైం ఉద్యోగుల నుంచి భవిష్యత్తులో న్యాయపర చిక్కులు ఎదురుకా వన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవు తోంది. రాష్ట్ర వ్యాప్తంగా డిస్కంల పరిధిలో దాదాపు 5 వేల మందికి పైగా బిల్ కలెక్టర్లు పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. -
పట్టా వెనక పిట్ట కథ
ఇప్పటికే పట్టా ఉన్న ఇళ్లకే క్రమబద్ధీకరణ పేరుతో తిరిగి మంజూరు రెండేళ్ల తర్వాత అమ్ముకునే హక్కుకల్పిస్తామంటూ గొప్పలు అభ్యంతరాల పేరుతో పేదల దరఖాస్తుల తిరస్కరణ అధికార పార్టీ రాజకీయ ప్రచారమే అసలు రహస్యం గాజువాక : ఏ మాట వెనుక ఏ ప్రయోజనం దాగి ఉంటుందో తెలియనంత వరకు జనం మోసపోతూనే ఉంటారు.. 20 శాతాబ్దపు మేధావిగా గుర్తింపు పొందిన కార్ల్ మార్కస్ చెప్పిన విషయమిది.. వంద చదరపు గజాల లోపు ప్రభుత్వ స్థలంలోని ఇళ్లను ఉచితంగాను, ఆపై విస్తీర్ణంలో ఉన్న ఇళ్లను కొంత నగదుతోను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న విషయం కార్ల్ మార్కస్ మాటలకు అతికినట్టు సరిపోతుంది. ఇప్పటికే పట్టాలున్న ఇళ్లకే క్రమబద్ధీకరణ పేరిట మళ్లీ పట్టాలు జారీ చేస్తూ.. అదేంటని ప్రశ్నిస్తే పట్టాకు పిట్టకథలు అల్లుతున్నారు టీడీపీ ప్రజాప్రతినిధులు. ప్రస్తుతం ఇస్తున్న పట్టాకు రెండేళ్ల తరువాత అమ్ముకొనే హక్కు వస్తుందట.. ఇప్పటివరకు పట్టాలు లేని ఎన్ని ఇళ్లను క్రబద్ధీకరించారన్న లెక్కను మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. అసలు కథ ఏమిటంటే.. ప్రభుత్వం మంజూరు చేసిన క్రమబద్ధీకరణ పట్టాల లబ్ధిదారులకు గతంలోనే పట్టాలు, ఎల్పీసీలు ఉన్నారుు. గాజువాక వంటి హౌస్ కమిటీ పరిధిలో ఇళ్లను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవో నంబర్ 44ద్వారా 2009లోనే క్రమబద్ధీకరించారు. 2004 మందికి ఉచితంగా పట్టాలు కూడా జారీ చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ఆ పట్టాలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. రద్దు చేయ డానికి కారణమేంటన్నది ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అర్థం కాని నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నారుు. ప్రభుత్వపరంగా ఏ నియోజకవర్గంలోను అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోరుుంది. దీంతో సొంత పార్టీలో సైతం నిరసన గళం పెరుగుతుండటంతో ఏదో ఒకటి చేసి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇప్పుడు జీవో 296 ప్రకారం మళ్లీ క్రమబద్ధీకరణ చేయాలంటూ కొత్త కథను తెరపైకి తెచ్చారు. ఈ పట్టాలకు అమ్ముకొనే హక్కు కల్పిస్తున్నామంటూ కహానీలు వినిపిస్తున్నారు. ప్రభుతానికి చిత్తశుద్ధి ఉంటే పాత పట్టాలకు అమ్ముకొనే హక్కు కల్పించలేదా అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నారుు. ఇప్పటికే పట్టాలున్న అనేకమందిని టీడీపీ నాయకులు ఒత్తిడి చేసి మరీ కొత్తగా దరఖాస్తు చేరుుంచారు. పేదలకు న్యాయమేదీ.. ఈ జీవోల ప్రకారం పేదలకు సరైన న్యాయం జరగట్లేదని తెలుస్తోంది. గాజువాక తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న అండిబోరుున అన్నపూర్ణ ఆవేదన వింటే ఈ విషయం స్పష్టమవుతుంది. స్థానిక గోపాలరెడ్డినగర్‌కు చెందిన అన్నపూర్ణ ఒక లారీ డ్రైవర్ భార్య. 60 గజాల ప్రభుత్వ స్థలంలో పదేళ్ల క్రితం పాక వేసుకొని భర్త, పిల్లలతో నివాసముంటోంది. పాక స్థలానికి పట్టా ఇవ్వాలని, కరెంటు మీటరు మంజూరు చేయాలని, ఇంటికి పన్ను వేయాలని అధికారుల చుట్టూ తిరుగుతోంది. న్యాయం జరగలేదు. రెండేళ్లుగా కాలనీలోని టీడీపీ నాయకుల చుట్టూ తిరుగుతోంది. డబ్బులు ఇస్తే తప్ప పని చేయలేమని వారు స్పష్టం చేయడంతో ఏమీ చేయలేకపోరుుంది. నగరంలో ఇలాంటి అన్నపూర్ణలు అనేక మంది ఉన్నారు. వారి గోడును చంద్రబాబు జీవోలు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. సగానికిపైగా దరఖాస్తుల తిరస్కరణ క్రమబద్ధీకరణ కోసం అందిన దరఖాస్తుల్లో సగానికి పైగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. నగర వ్యాప్తంగా మొత్తం 60వేలకు పైగా దరఖాస్తులు అందగా, వాటిలో 32 వేల దరఖాస్తులకు మాత్రమే పట్టాలు మంజూరయ్యారుు. వాటిలో కూడా నో మ్యాన్ ల్యాండ్, గెడ్డ పోరంబోకు వంటి రకరకాల కారణాలను చూపించి అధికారులు పట్టాలు జారీ చేయడం లేదు. గాజువాక నియోజకవర్గంలోని రెండు మండలాల నుంచి 19,300 మంది దరఖాస్తు చేయగా, వారిలో కేవలం 6,500 మందికే పట్టాలు ఇస్తున్నారు. మిగిలినవాటిని చెరువులు, గెడ్డలు, రహదారుల భూములు వంటి కారణాలతో అధికారులు తిరస్కరించారు. ఈ కారణాలతోనే గతంలో కూడా పట్టాలు పొందలేని పేదలు ఇప్పుడు కోసం దరఖాస్తు చేసుకున్నా న్యాయం జరగకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఆ స్థలాలకు పట్టాలు ఇవ్వలేం.. అభ్యంతరకరమైన స్థలాల్లోని ఇళ్లను క్రమబద్ధీకరించలేం. ప్రస్తుతం ప్రకటించిన 32వేల పట్టాలతో పాటు 118 జీవో ప్రకారం మరో నాలుగు వేల పట్టాలను ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం. వీటి కోసం మళ్లీ ఎవరూ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మాకు అందిన దరఖాస్తుల నుంచే ఈ కొత్త పట్టాలు అందజేస్తాం. - వెంకటేశ్వర్లు, విశాఖ ఆర్డీవో -
పాత నోట్లతో క్రమబద్ధీకరణ
ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: నిర్మాణాలు, ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ కోసం నోటీసు అందుకున్న వారు చెల్లించాల్సిన సొమ్మును పాత రూ.500, రూ.1000 నోట్ల ద్వారా కూడా చెల్లించే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావులతో సీఎం కేసీఆర్ శనివారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేయాల్సిన పనులన్నీ చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ భూములు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) భూముల్లో నిర్మాణాలు, ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ కోసం చేసే చెల్లింపులకు ఈ నెల 14 వరకు పాత పెద్ద నోట్లను కూడా తీసుకోవాలని ఆదేశించారు. జీవో నంబర్ 59తో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు, జీవో నంబర్ 92తో యూఎల్సీ ఖాళీ స్థలాలు క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ట్రేజరీలకు కూడా సమాచారం అందించింది. ఆదివారం (13వ తేదీ)న కూడా బ్యాంకులు, ట్రేజరీలు తెరిచి ఉంటాయని, ఆది, సోమవారాల్లో ట్రేజరీల ద్వారా చెల్లింపులకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలని దరఖాస్తుదారులను ప్రభుత్వం కోరింది. చెల్లింపులకు సంబంధించిన చలాన్లను సంబంధిత రెవెన్యూ అధికారులకు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. చలాన్లు అందిన వెంటనే క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. -
అక్రమబద్ధీకరణే లక్ష్యం
కొండవాలు ప్రాంతాల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు పట్టు అభ్యంతరం చెప్పిన జేసీపై బదిలీ వేటు తాజాగా కలెక్టర్‌పై ఒత్తిడి చేసేది లేక పునఃపరిశీలన పేరిట అంగీకారం దరఖాస్తుదారుడి నుంచి రూ. 50 వేల నుంచి లక్ష వసూళ్లు కోట్లు దండుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరకర భూముల్లో ఉన్న కట్టడాలను కూడా క్రమబద్ధీకరించేస్తామంటూ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఏడాదిగా దండుకుంటూనే ఉన్నారు. వారితో దగ్గరుండి దరఖాస్తు చేరుుంచడమే కాదు ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారు. అరుుతే క్షేత్ర స్థారుు సర్వేలో అభ్యంతరకర భూముల్లో ఉన్న వాటిని తిరస్కరించారు. ఇందుకు అడ్డు చెప్పిన జేసీ జె.నివాస్‌ను ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చి బదిలీ చేరుుంచారు. ఇప్పుడు కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చి తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులు మళ్లీ వాటిపై అప్పీలు చేసుకునేలా ఆదేశాలు జారీ చేరుుంచారు. ఇదే అదునుగా మళ్లీ వీరి నుంచి వసూళ్ల దందా మొదలెట్టేశారు. సాక్షి, విశాఖపట్నం : అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో వంద గజాల్లోపు ఆక్రమణలను క్రమబద్ధీకరించాలని గతేడాది ఆగస్టు 14న జీవో నెం. 296 జారీ చేశారు. కానీ నగరంలో మూడొంతులు ఎండోమెంట్, గెడ్డలు, కొండవాలు ప్రాంతాలను ఆక్రమించుకుని కట్టినవే. ఇందులో అత్యధికంగా రాజకీయ నాయకులవి కాగా ఇంకొందరు నేతల అండదండలతో ఆక్రమించుకుని బహుళ అంతస్తులు నిర్మించేసుకున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తమ అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించుకోవాలని పథక రచన చేశారు. వీటిలో ఎక్కువగా కొండవాలు ప్రాంతాల్లో క్రమబద్ధీకరించేందుకు కాదు కదా.. కనీసం నివాసం ఉండేందుకు కూడా వీల్లేని నివాసాలే ఉన్నారుు. అరుుతే వీరి నుంచే ఎమ్మెల్యేలు వారి అనుచరులు భారీగా డబ్బులు వసూలు చేశారు. ఈ దరఖాస్తులన్ని తిరస్కరణకు గురికావడంతో వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యారుు. ఏదో విధంగా వీటిని తిరిగి జాబితాలో చేర్చాలని ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. జేసీ జె.నివాస్‌పై ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి కూడా చెప్పించి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆన్లైన్లోనే దరఖాస్తుల స్వీకరణ, సర్వే, పరిశీలన జరిపి తిరస్కరించినందున తిరిగి జాబితాలో చేర్చడం కుదరదని జేసీ కుండబద్దలు కొట్టారు. అందరూ ఊహించినట్టుగా రేషన్ షాపు డీలర్‌షిప్‌ల విషయంలో తమ మాట చెల్లుబాటు కాకపోవడం వల్ల జేసీపై గరంగరంగా ఉన్నట్టుగా కలర్ ఇచ్చినప్పటికీ, అసలు కథ మాత్రం ఈ అక్రమబద్ధీకరణ విషయంలో తమ మాట చెల్లుబాటు కాలేదని తిరుగుబాటు చేశారు. మంత్రులు కూడా చేతులు కలపడంతో జేసీని బలవంతంగా సాగనంప గలిగారు. జేసీని బదిలీ చేయడంతో ఇప్పుడు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అప్పీలకు అవకాశం స్మార్ట్ సిటీ సదస్సు కోసం అమెరికా వెళ్లే హడావుడిలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలంతా కలెక్టర్‌తో భేటీ అయ్యారు. ఆయన కూడా జేసీ బాటలోనే ఎమ్మెల్యేలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినలేదు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్లు చేరుుంచి మరీ కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. ‘ఇప్పటివరకు మీరు తిరస్కరించిన వాటిని పునఃపరిశీలించాలని, వారిలో మా కార్యకర్తలు ఉన్నారని, మేము ఇచ్చే జాబితాల ప్రకారమే క్రమబద్ధీకరణ పట్టాలివ్వాలని’ అంటూ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో చేసేది లేక పునః పరిశీలన పేరిట మళ్లీ ఆన్లైన్ ద్వారాలు తెరిపించారు. తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులు మళ్లీ వాటిపై అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. -
అర్చకుల వేతనాలపై నేడు నిర్ణయం?
మంత్రివర్గ ఉపసంఘం భేటీలో చర్చ సాక్షి, హైదరాబాద్: అర్చకులు, దేవాలయ ఉద్యోగుల వేతనాల క్రమబద్ధీకరణ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు గురువారం మంత్రివర్గ ఉప సంఘం భేటీ కాబోతోంది. ఇప్పటికే ఓ దఫా సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం అధికారులతో విధివిధానాలపై ప్రాథమికంగా చర్చించింది. కొన్ని సందేహాలుండటంతో వాటి నివృత్తికోసం వివరాలు సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. వాటిని అధికారులు సిద్ధం చేయటంతో గురువారం రెండో భేటీకి సిద్ధమైంది. వేతనాల విషయంలో ఉపసంఘం తుది నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించనుందని తెలుస్తోంది. -
అక్రమ కట్టడాలపై ‘ఆస్తి పన్ను’ పిడుగు
* జరిమానాల వసూళ్లకి కొత్త నిబంధనలపై సర్కార్ కసరత్తు * ఆస్తి పన్నులో 25 నుంచి 100 శాతం జరిమానాలు సాక్షి, హైదరాబాద్: అక్రమ కట్టడాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించనుంది. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, కూల్చివేత జరిగే వరకు ఆ భవనాలపై ఆస్తి పన్నుల రూపంలో భారీ మొత్తంలో జరిమానాలు విధించేవిధంగా కొత్త నిబంధనలను ప్రభుత్వం రూపొందిస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లోని అక్రమ కట్టడాలపై ఈ నిబంధనలను అమల్లోకి తెస్తూ త్వరలో రాష్ట్ర పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా అక్రమ కట్టడాలపై ఆస్తిపన్నులో 25 నుంచి 100 శాతాన్ని జరిమానాగా వసూలు చేయాలని మున్సిపల్ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీలో కొన్ని భవనాలపై ఈ జరిమానాలను వసూలు చేస్తున్నారు. క్రమం తప్పకుండా ప్రభుత్వానికి ఆస్తిపన్నులు, జరిమానాలు చెల్లిస్తున్నందున తమ భవనాల క్రమబద్ధీకరణ జరిగినట్లేనని ఆదేశించాలని కొందరు భవనాల యజమానులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడిగా కేసులు పెండింగ్‌లో ఉండిపోతుండడంతో ఈ భవనాల యజమానుల నుంచి ఆస్తిపన్ను, జరిమానాలను వసూలు చేయలేకపోతున్నారు. ఈక్రమంలో జరిమానా చెల్లించినంత మాత్రాన అక్రమ భవనాల క్రమబద్ధీకరణ జరగదనే విధంగా కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. త్వరలో టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ అక్రమ కట్టడాలకు సంబంధించిన కేసుల సత్వర విచారణ కోసం టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు నిర్ణయించారు. ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఈ నెల 22న అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. -
సాఫ్ట్వేర్.. సమస్యలతో బేజార్
సాంకేతిక లోపాలతో సతమతమవుతున్న రెవెన్యూ శాఖ * పరిష్కారం కనుగొనని ఉన్నతాధికారులు * ఇలాగైతే కష్టమంటున్న తహసీల్దార్లు * ‘క్రమబద్ధీకరణ’ అమలులో వైఫల్యం సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో వివిధ పథకాల అమలు నిమిత్తం భూపరిపాలన కార్యాలయం ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ ఎందుకూ కొరగాకుండా పోతోంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ఉన్నతాధికారులు సమకూర్చిన ఆన్లైన్ విధానాలతో పారదర్శకత సంగతేమో గానీ, గత రెండేళ్లుగా ఏ పథకం కూడా సంపూర్ణంగా అమలుకు నోచుకోలేదు. 2014 డిసెంబర్లో ప్రభుత్వం ప్రారంభించిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ నుంచి నిన్నమొన్నటి సాదా బైనామాల క్రమబద్ధీకరణ వరకు సాంకేతిక సమస్యలతో రెవెన్యూ యంత్రాంగమంతా సతమతమవుతోంది. సమస్యలు పరిష్కరించకపోగా పథకాల అమలు విషయంలో వైఫల్యాలకు తహసీల్దార్లనే బాధ్యులను చేస్తూ చార్జిమెమోలు, ఇంక్రిమెంట్లలో కోతలు విధిస్తామంటున్నారు. ఇది ఎంతవరకు సబబని తెలంగాణ తహ సీల్దార్ల సంఘం ప్రశ్నిస్తోంది. టీజీటీఏ ఆధ్వర్యంలో తహసీల్దార్లంతా మూకుమ్మడిగా ఆందోళనకు దిగడంతో మేల్కొన్న సర్కారు త్వరలోనే ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇచ్చింది. కొలిక్కిరాని క్రమబద్ధీకరణ ప్రక్రియ రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ మొదలై రెండేళ్లు కావస్తున్నా, ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు. సాంకేతిక సమస్యల కార ణంగా పక్కన బెట్టిన దరఖాస్తులను అధికారులు ఇంతవరకు పరిష్కరించలేదు. జీవో 58 ప్రకారం పేదలు నివాసముంటున్న స్థలాలను ఉచితంగా వారికి క్రమబద్ధీకరించాలి. ఈ విషయంలో ఎంతోమందికి ఆధార్ కార్డు లేదని, కార్డు ఉన్నా ఇన్వాలిడ్ అని రావడంతో నేటి వరకు ఆ దరఖాస్తులను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అలాగే జీవో 59 కింద చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ నిమిత్తం ఏడాది క్రితమే సొమ్ము చెల్లించినా ఆ భూములనూ అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మొత్తం 49,211 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉంటే.. ఇప్పటివరకు ఆయా దరఖాస్తుల్లో అధికారులు క్లియర్ చేసింది 7,451 దరఖాస్తులే (15శాతం) కావడం గమనార్హం. ఈ ప్రక్రియ నిమిత్తం భూపరిపాలన అధికారులు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్‌లో రోజుకో రకమైన సమస్యలు తలెత్తుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇతర పథకాల అమలు తీరూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదని తెలుస్తోంది. -
కాంట్రాక్ట్ జేఎల్‌ఎంల క్రమబద్దీకరణ
హన్మకొండ : రాష్ట్రంలోని రెండు డిస్కంలలో కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్లను క్రమబద్దీకరిస్తూ ఆయా డిస్కంల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్), దక్షిణ మండల విద్యుత్ పంపినీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్)లో 1175 మంది జూనియర్ లైన్మెన్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇందులో టీఎస్ ఎన్పీడీసీఎల్లో 855 మంది, టీఎస్ ఎస్పీడీసీఎల్లో 320 మంది ఉన్నారు. వీరి సర్వీసు అక్టోబర్ 3 2008 సంవత్సరం నుంచి రెగ్యులర్ కానుంది. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించిన వారు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి రెగ్యులర్ అవుతారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో మొదటగా విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న జూనియల్ లైన్మెన్లను క్రమబద్దీకరించింది. -
రేపే ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు
- తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహణకు సిద్ధం - ఓటుహక్కు వినియోగించుకోనున్న 49,600 మంది సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా జరుగుతున్న ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలు, కార్యాలయాలు, వర్క్‌షాపుల్లో పోలింగ్ జరగనుంది. 49,600 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. పది సంఘాలు పోటీలో నిలిచినా.. తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని అంచనా. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చివరి ఎన్నికల్లో టీఎంయూ -ఈయూ కలసి పోటీ చేసి సంయుక్త విజేతలుగా నిలిచాయి. ప్రస్తుతం అవి వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. కాగా, గతంలో ఎన్నడూ లేనట్టుగా ఆర్టీసీలో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య తాజా కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. కార్మికులు ప్రతినెలా తమ వేతనం నుంచి కొంత మొత్తం కోత పెట్టుకుని పోగుచేసుకునే ‘కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ’ నిధులను, పదవీ విరమణ, కార్మికులు చనిపోతే అందే ఆర్థిక సాయం నిధులను కూడా ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకోవటంతో కార్మికులకు రుణా లు ఆగిపోయాయి. వాటిని తిరిగి జమకట్టేం దుకు ఆర్టీసీ వద్ద నిధుల్లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవటంతో కార్మికుల కుటుంబా లు ప్రైవేటు అప్పులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో కార్మిక సంఘాలు విఫలమయ్యాయి. దీన్ని కార్మికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం టీఎంయూ అధికార టీఆర్ఎస్తో సఖ్యతగా ఉంటోందన్న ప్రచారముంది. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన ఆర్టీసీ సమీక్షకు కేవలం ఆ సంఘం నేతలకే ప్రవేశం లభించటం గమనార్హం. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆ సంఘానికి అనుకూలంగా ప్రచారం చేశారు. ఆ సంఘం గెలిస్తే కార్మికుల పక్షాన ప్రభుత్వంతో పోరాడలేదని మిగతా సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. ఎవరి ధీమా వారిదే... ఇతర సంఘాలు ఎన్ని ఆరోపణలు చేసినా చివరకు గెలుపు తమదేనని టీఎంయూ నేతలు విశ్వాసంతో ఉన్నారు. వేతన సవరణ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలలో బాండ్ల రద్దు, సర్వీసులో చనిపోయిన కార్మికులకు రికవరీ లేకుండా రూ.6 లక్షలు చెల్లింపు తదితర హామీలతో ఎన్ఎంయూ ధీమాగా ఉంది. కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, 44 శాతం ఫిట్మెంట్, గ్రేడ్ పే విధానం అమలు వంటివి తమ విజయాలేనని ఈయూ చెప్పుకొంటోంది. -
అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ!
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూములను సద్వినియోగం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఆక్రమణకు గురైన అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 25 లక్షల ఎకరాలను ప్రభుత్వం పేదలకు అసైన్ చేసింది. కానీ ఈ భూముల్లో చాలావరకు ఉపయోగపడటం లేదని, అసైన్‌దారులకు బదులుగా ఆ భూములన్నీ ఇతరుల చేతుల్లోకి వెళ్లాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూముల వివరాలను సేకరించేందుకు దృష్టి సారించింది. అసైన్‌దారుల వద్దే భూమి ఉందా? ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నారా? అసలు ఆ భూమి ఎక్కడుంది? ఎంత ఉంది.. అనే వివరాలన్నీ జూన్ 30లోగా సేకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలన్నీ అందుబాటులోకి వస్తే ఇతరుల చేతుల్లోకి వెళ్లిన భూమిని స్వాధీనం చేసుకొని తిరిగి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అసైన్దారులు సాగులో ఉంటే వారు వ్యవసాయం చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా పెట్టుబడి సాయం అందించాలని సీఎం ఇప్పటికే సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగం అసైన్డ్ భూముల వివరాల సేకరణలో నిమగ్నమైంది. కాగా, దాదాపు 70 % భూములు అసైన్‌దారుల చేతిలో లేవని పలు జిల్లాల్లో చేపట్టిన సర్వేలతో తేలింది. నెరవేరని లక్ష్యం.. సాగుకు పనికి రాని భూమిని, రాళ్లు రప్పలతో కూడిన భూమిని పంపిణీ చేయటంతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములను సద్వినియోగం చేసేందుకు క్రమబద్ధీకరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అసైన్డ్ భూముల్లో అసలైన లబ్ధిదారులు లేకున్నా.. అర్హులైన నిరుపేదలు ఉంటే వారికే ఆ భూములు అప్పగించాలని యోచిస్తోంది. ఎస్సీ లబ్ధిదారుల భూములు ఎస్సీలు, ఎస్టీల చేతుల్లో ఉంటేనే క్రమబద్ధీకరించాలని, బీసీలు, ఓసీల చేతుల్లో ఉంటే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆలోచన చేస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, పాఠశాలలు అసైన్డ్ భూముల్లో ఉంటే క్రమబద్ధీకరించి.. వాటిని అసైన్డ్ భూముల జాబితాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. జిల్లాల వారీగా అసైన్డ్ భూముల వివరాలన్నీ వచ్చాక ఏమేం చర్యలు చేపడితే.. ఈ భూములు వినియోగంలోకి వస్తాయనే కోణంలో తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
స్థలాల క్రమబద్ధీకరణకు స్పందన కరువు
- ఈ నెల 25తో ముగియనున్న గడువు - యూఎల్సీ భూములకు పది శాతానికి మించని దరఖాస్తులు - బేసిక్వాల్యూ ప్రకారం సొమ్ము చెల్లించలేమంటున్న లబ్ధిదారులు సాక్షి, హైదరాబాద్: పట్టణ భూపరిమితి(యూఎల్సీ) చట్టం పరిధిలోని ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు స్పందన కరువైంది. ఒకసారి డిక్లరెంట్ నుంచి కొనుగోలు చేసిన స్థలాలకు తిరిగి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాల్సి రావడం లబ్ధిదారులు భారంగా భావిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో యూఎల్సీ స్థలాలను గుర్తించి అనుభవదారులకు నోటీసులు ఇచ్చేందుకు సమయం చాలడం లేదని రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో సుమారు 7 వేల పార్శిల్స్(స్థలాలు) ఉన్నట్లు గుర్తించారు. వాటి క్రమబద్ధీకరణ నిమిత్తం ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు 10 శాతానికి మించలేదు. యూఎల్సీ ఖాళీస్థలాలను చెల్లింపు కేటగిరీ కింద క్రమబద్ధీకరించాలని గత నెల 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో పలు జీవోల ద్వారా యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ/ కేటాయింపు అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం, తాజా ఉత్తర్వుల మేరకు మండల తహసీల్దార్ స్థాయిలోనే ఆ ప్రక్రియను పూర్తిచేసే వెసులుబాటును కల్పించింది. ఈ నెల 25తో దరఖాస్తు గడువు ముగుస్తున్నా, ప్రజల నుంచి స్పందన కనిపించకపోవడంతో కిందిస్థాయి అధికారులకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మిగులు భూములను ప్రభుత్వానికి డిక్లరెంట్లు అప్పగించినా యూఎల్సీ స్వాధీనం చేసుకోకపోవడంతో వాటిని ప్లాట్లుగా ఇతరులకు విక్రయించారు. సదరు భూములను ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్(పీవోబీ)లో చూపకపోవడం, సబ్ రిజిస్ట్రార్లు ఎటువంటి అభ్యంతరం లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో ఎంతోమంది యూఎల్సీ స్థలాలను తెలిసో, తెలియకో కొనుగోలు చేశారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు 250 గజాల్లోపు స్థలానికి బేసిక్ విలువలో 25 శాతం, 500 గజాల్లోపు అయితే 50 శాతం, ఆపైన 75 శాతం బేసిక్ విలువను చెల్లించాల్సి ఉంది. యూఎల్సీ స్థలాల క్ర మబద్ధీకరణ దరఖాస్తుతోపాటుగా రూ.2000 రుసుమును కూడా ఈ నెల 25 లోగా మీ సేవా కేంద్రంలో చెల్లించాలి. గడువు పెంచితే మేలంటున్న అధికారులు చాలా ప్రాంతాల్లో యూఎల్సీ స్థలాలను ఇప్పటివరకు గుర్తించలేదని, వాటిని గుర్తించి అనుభవదారులకు నోటీసులు ఇవ్వడానికి ఎంతో సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. గుర్తించిన యూఎల్సీ స్థలాల అనుభవదారుల చిరునామా మారిపోవడంతో నోటీసులను సకాలంలో వారికి చేర్చలేకపోతున్నామని చెబుతున్నారు. దరఖాస్తు గడువుకు మరింత సమయం ఇస్తే మేలని తహసీల్దార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు క్రమబద్ధీకరణ నిమిత్తం చెల్లించాల్సిన ధరను ఇంకాస్త తగ్గించాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సదరు స్థలాలను కొనుగోలు చేసిన తేదీనాటి బేసిక్ విలువలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. -
చివరి అవకాశం!
మిగులు భూముల క్రమబద్ధీకరణపై కలెక్టర్ రఘునందన్‌రావు ♦ 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి ♦ క్రమబద్ధీకరించుకోని స్థలాలు వెనక్కి.. ♦ యూఎల్సీ స్థలాల రెగ్యులరైజేషన్‌తో రూ.వెయ్యి కోట్ల రాబడిట ♦ విలేకరుల సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్సీ) భూములను క్రమబద్ధీకరించుకోవడానికి ఇదే చివరి అవకాశమని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు వెల్లడించారు. ఈ నె ల 25వ తేదీలోపు దరఖాస్తులను సమర్పించాలని, గడువు పొడగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ మిగులు భూములుగా గుర్తించిన ఖాళీ స్థలాలనే క్రమబద్ధీకరించనున్నట్లు ఆయన చెప్పారు. దరఖాస్తు చేయని మిగులు భూములను 22ఏ కింద ప్రకటించి వీటిని ప్రజోపయోగ అవసరాలకు లేదా వేలం ద్వారా ప్రభుత్వం విక్రయిస్తుందని తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో హైదరాబాద్ కలెక్టర్ రాహుల్‌బొజ్జ, జేసీ రజత్కుమార్సైనీతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. జంట జిల్లాల్లో 672 ఎకరాల విస్తీర్ణంలో వివాదరహిత యూఎల్సీ స్థలాలున్నాయని, వీటిని క్రమబద్ధీకరణకు జీఓ 92ను జారీచేసిన ట్లు తెలిపారు. ఆర్డీఓ అధ్యక్షతన గల కమిటీ మూడు వేల గజాల వరకు క్రమబద్ధీకరిస్తుందని, అపై విస్తీర్ణం కలిగిన స్థలాలు మాత్రం ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 601 ఎకరాల విస్తీర్ణంలో మిగులు భూములు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామని, ప్రతి కాలనీకి ప్రత్యేక బృందాలను పంపి క్రమబద్ధీకరణ సమాచారాన్ని ఆక్రమణదారులకు తెలియపరిచామని తెలిపారు. నిర్ధారించిన ఖాళీ మిగులు భూములు 5,700 మంది పొజిషన్లో ఉన్నట్లు గుర్తించామని, వీరిలో 250 గజాల్లోపు దాదాపు 4,200 మంది వరకు ఉన్నారని తెలిపారు. అంతేగాకుండా.. ఆయా భూములకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 750 దరఖాస్తులు వచ్చాయని, రెండు జిల్లాల్లో యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణ ద్వారా కనిష్టంగా రూ.1000 కోట్ల మేర ఖజానాకు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్న గురుకుల్ ట్రస్ట్ భూములను క్రమబద్ధీకరించే అవకాశంలేదని కలెక్టర్ రఘునందన్ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 71 ఎకరాల పరి ధిలో ఖాళీ మిగులు భూములున్నాయని, వీటి ని క్రమబద్ధీకరిస్తామని రాహుల్ బొజ్జ చెప్పా రు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దరఖాస్తు ఇలా... ♦ రిజిస్టర్ సేల్ డీడ్, దరఖాస్తు పత్రం, ఆధార్ కార్డును జతపరిచి మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు సమర్పించాలి. ♦ దస్తావేజు గత నెల 26వ తేదీకి ముందు రిజిస్టర్ అయి ఉండాలి. ♦ దరఖాస్తుతోపాటు రూ.2,035 ప్రాసెస్ రుసుము మీ సేవ కేంద్రంలో చెల్లించాలి. ♦ క్రమబద్ధీకరణ ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన మిగులు భూములకే వర్తిస్తుంది. చెల్లించాల్సిన రుసుం ♦ 250 గజాల వరకు మే 26, 2016 నాటి రిజిస్ట్రేషన్ విలువలో 25శాతం ♦ 251 -500 గజాల వరకు నిర్దేశిత విలువలో 50 శాతం ♦ 500 గజాలపైబడిన స్థలాలకు నిర్ధిష్ట రిజిస్ట్రేషన్ విలువలో 75 శాతం ♦ గుర్తించిన మురికివాడల్లో 125 గజాల వరకు పది శాతం ♦ క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా తేల్చి నోటీసులు అందుకున్న దరఖాస్తుదారులు నెలరోజుల్లోపు 40శాతం, ఆ తర్వాత మూడు మాసాల్లో 30శాతం, మిగతా మొత్తం నోటీసు తీసుకున్న ఏడు మాసాల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. ♦ నిర్దేశిత మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించినవారికి ఐదుశాతం డిస్కౌంట్‌ను కూడా ప్రభుత్వం ప్రకటి ంచింది. -
పేదల ఇళ్లు తొలగిస్తే సీఎం ఫామ్‌హౌస్ ముట్టడి: భట్టి
ఒక్క పేదవాడి ఇల్లు తొలగించినా లక్షల మందితో కలసి ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడిస్తామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా షామీర్పేట మండలం జవహర్‌నగర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు చేపట్టిన ఆమరణ దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. ఇక్కడి పేదల ఇళ్లను క్రమబద్దీకరించాలని, గ్రామ కంఠంగా ప్రకటించాలని కోరుతూ వార్డు సభ్యులు 24 రోజుల రిలే దీక్షల అనంతరం ఆమరణ దీక్ష చేస్తున్నారు. దీనికి భట్టి విక్రమార్కతోపాటు జిల్లా నాయకులు శుక్రవారం మద్దతు పలికారు. ఈ సందర్భంగా భట్టి మట్లాడుతూ... తెలంగాణలో మళ్లీ దొరలపాలన వచ్చిందన్నారు. కేసీఆర్ కుటుంబంలోని వారే రాజ్యమేలుతున్నారని వ్యాఖ్యానించారు. జవహర్‌నగర్ పంచాయతీలో రెండున్నర లక్షల మంది ఉన్నారని... ఒక్క పేదవాడి ఇల్లు తొలగించినా వీరందరితో కలసి కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తామన్నారు. -
గలగలలాడని గల్లాపెట్టె
⇒ క్రమబద్ధీకరణ ఆదాయం అంతంతే.. ⇒ వస్తాయనుకున్నది రూ.408.99 కోట్లు ⇒ వచ్చింది రూ.153.36 కోట్లే.. ⇒ మార్గదర్శకాల్లో కొరవడిన స్పష్టత ⇒ నిర్ధేశిత మొత్తం చెల్లింపునకు వెనుకడుగు ⇒ గడువు పెంచే యోచనలో సర్కారు..! సిటీబ్యూరో: సర్కారుకు కాసులు తెచ్చిపెడుతుందని భావించిన క్రమబద్ధీకరణ ప్రక్రియ గాడి తప్పింది. కోట్లు వచ్చి పడతాయని భావించిన అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. మార్గదర్శకాల జారీలో జాప్యం.. దరఖాస్తుల పరిశీలనలో సాంకేతిక ఇబ్బందులు.. డీడీల రూపేణా నిర్ధేశిత మొత్తాన్ని చెల్లించాలనే నిబంధనలు ఇందుకు అడ్డుగా నిలిచాయి. ఈ ప్రక్రియ ద్వారా హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో రూ. 408.99 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, కేవలం రూ.153.36 కోట్లు మాత్రమే జమయ్యాయి. జంట జిల్లాల్లో 59 జీఓ కింద 26,392 దరఖాస్తులు రాగా (వీటిలో 13,607 అర్జీలు ఉచిత కేటగిరీ (జీఓ 58) నుంచి చెల్లింపు కేటగిరీలో మారాయి) సగానికి పైగా ప్రాథమిక స్థాయిలోనే తిరస్కరణకు గురయ్యాయి. 15,500 దరఖాస్తులను ఆర్డీఓ కమిటీలు పరిశీలించి 13,607 మాత్రమే క్రమబద్ధీకరణకు ఆమోదయోగ్యమైనవిగా తేల్చాయి. అయితే, ఈ దరఖాస్తుదారులు కూడా నిర్ధేశిత మొత్తాన్ని చెల్లించేందుకు మొగ్గు చూపలేదు. దీనికి అధికార యంత్రాంగం ప్రదర్శించిన గంద రగోళమే కారణమని తెలుస్తోంది. ఏకమొత్తం చెల్లించిన దరఖాస్తులకు కూడా మోక్షం కలగకపోవడంతో క్రమబద్ధీకరణపై అనుమానాలు పెరిగాయి. ఫలితంగా ప్రభుత్వం అంచనా తల్లకిందులైంది. బోలెడు ఆశలు.. ఆక్రమిత స్థలాల్లో వెలిసిన కట్టడాలను క్రమబద్ధీకరించడం ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. భూముల విలువలు ఆకాశన్నంటినందున.. వీటి విలువ ఆధారంగా పెద్ద ఎత్తున రాబడి వస్తుందని భావించింది. అయితే, క్రమబద్ధీకరణ చెల్లింపులకు డిమాండ్ డ్రాఫ్ట్‌లతో ముడిపెట్టడంతో యజమానులు వెనక్కి తగ్గారు. ప్రతి చెల్లింపుపై ఆదాయ పన్నుల శాఖ (ఐటీ) నిఘా ఉంటుందని, దరఖాస్తు చేసుకునేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. మార్కెట్ విలువకు అనుగుణంగా కనీస ధరను నిర్ణయించడం కూడా వెనుకడుగు వేసేందుకు ఓ కారణమైంది. అయినప్పటికీ జంట జిల్లాల్లో రూ.153.36 కోట్లు చెల్లించారు. దీంట్లో 778 మంది ఏక మొత్తంలో నిర్ధేశిత రుసుం చెల్లించారు. వాస్తవానికి ఆమోదం పొందిన దరఖాస్తులతో ఖజానాకు రూ. 408.99 కోట్లు వస్తాయని అంచనా వేసింది. విధి విధానాల ఖ రారులో అస్పష్టత, మార్గదర్శకాలను సకాలంలో వెలువరించకపోవడంతో క్రమబద్ధీకరణపై దరఖాస్తుదారులకు అనుమానాలు పెరిగాయి. దీంతో అర్హత సాధించిన దరఖాస్తుదారులు కూడా నిర్ధేశిత ఫీజుల చెల్లింపుపై వేచిచూసే ధోరణి ప్రదర్శించారు. ఈ క్రమంలోనే తుది గడువు (ఫిబ్రవరి 29) ముగిసింది. మరోసారి గడువు పొడిగింపు? భూ క్రమబద్ధీకరణ (జీఓ 59) గడువును మరోసారి పొడిగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. దరఖాస్తుల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు సాంకేతిక సమస్యలు తలెత్తడం, కన్వీయెన్స్ డీడ్ ఖరారు కాకపోవడం, పాలనాపరమైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న సర్కారు ఈ దిశగా ఆలోచ న చేస్తోంది. మరోవైపు ఆమోదం పొందిన దరఖాస్తుదారులు కూడా స్థలాల క్రమబద్ధీకరణపై ఆసక్తి చూపకపోవడాన్ని క్షేత్రస్థాయిలో విశ్లేషిస్తున్న ఉన్నతాధికారులు.. గడువు పొడిగించే యోచనలో ఉన్నారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగానికి సంకేతాలిచ్చిన సర్కారు ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. -
నేటితోసరి
క్రమబద్ధీకరణ గడువు పూర్తి ఎల్ఆర్ఎస్...బీఆర్ఎస్కూ అంతే.. హెచ్ఎండీఏకు 1.58 లక్షలు..జీహెచ్ఎంసీకి 2 లక్షల దరఖాస్తులు జీహెచ్ఎంసీలో ఎల్ఆర్ఎస్.. బీఆర్ఎస్కు.... హెచ్ఎండీఏ పరిధిలో క్రమబద్ధీకరణకు మంగళవారంతో గడువు ముగుస్తోంది. ఇకపై ఇలాంటి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. నిర్ణీత సమయం మించితే దరఖాస్తులు తీసుకోబోమని అంటున్నారు. బీఆర్ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు జీహెచ్ఎంసీకి ఇప్పటి వరకూ 2 లక్షలు... క్రమబద్ధీకరణకు హెచ్ఎండీఏకు 1.58 లక్షల దరఖాస్తులు అందాయి. వీటి ద్వారా జీహెచ్ఎంసీకి రూ.157 కోట్లు... హెచ్ఎండీఏకు రూ.150 కోట్ల ఆదాయం సమకూరింది. సిటీబ్యూరో: క్రమబద్ధీకరణ పథకం కింద దరఖాస్తుల స్వీకరణ గడువు మంగళవారంతో ముగియనుంది. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీక రణకు ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్/బీఆర్ ఎస్ గడువు కూడా మంగళవారంతో ముగుస్తుండటంతో దరఖాస్తుల స్వీకరణకు స్వస్తి పలకాలని హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిర్ణయించింది. మంగళవారం రాత్రి 12గంటలకే హెచ్ఎండీఏ వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నిర్ణీత గడువు ముగిశాక దరఖాస్తులను, ఫీజులను ఆన్లైన్లో స్వీకరించకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. క్రమబద్ధీకరణకు ఈసారి అనూహ్య స్పందన లభించింది. 2007-08లో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్/బీపీఎస్‌లను ప్రకటించి తుది గడువును మూడుసార్లు పొడిగించినా ఇంతగా స్పందన కనిపించలేదు. అప్పట్లో కేవలం 63వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వీటి లో 40వేలు పరిష్కరించడం వల్ల రూ.200 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి సోమవారం సాయంత్రం వరకు హెచ్ఎండీఏకు 1.58 లక్షల దరఖాస్తులు అందాయి. ఎల్ఆర్ఎస్ కింద అత్యధికంగా 1,22,850... బీఆర్ఎస్ కింద 35,150 దరఖాస్తులు వచ్చాయి.ప్రాథమిక రుసుంగా ఇప్పటి వరకు రూ.138.15 కోట్ల ఆదాయం వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. డిమాండ్ డ్రాఫ్టుల రూపంలో మరో రూ.21 కోట్లు వివిధ బ్యాంకుల నుంచి హెచ్ఎండీఏకు రావాల్సి ఉంది. ఈ లెక్కన సుమారు రూ.159 కోట్ల ఆదాయం వస్తోంది. మొత్తం లక్షన్నరకు పైగా దాఖలైన దరఖాస్తులను పరిష్కరిస్తే రూ.500కోట్లకు పైగా సమకూరుతుందని అధికారుల అంచనా. డీటీసీపీ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో రిటైరైనసిబ్బందిని తాత్కాలికంగా నియమించుకొని వచ్చే 6-8 నెలల్లోగా దరఖాస్తులను పరిష్కరించాలని హెచ్ఎండీఏ కమిషనర్ భావిస్తున్నారు. పరిష్కారం ఎలా? హెచ్ఎండీఏకు పెద్ద సంఖ్యలో అందిన దరఖాస్తులను పరిష్కరించడం అసాధ్యంగానే కనిపిస్తోంది. కీలకమైన ప్లానింగ్ విభాగంలో తగినంత సిబ్బంది లేరు. గతంలో ఔట్సోర్సింగ్ సిబ్బంది సేవలు వినియోగించుకొని 63 వేల దరఖాస్తుల్లో 40వేలు పరిష్కరించ గలిగారు. మిగిలిన 20వేల దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఔట్సోర్సింగ్ సిబ్బందిని తప్పించారు. ఈ పరిస్థితుల్లో పెద్దసంఖ్యలో వచ్చిన దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తారన్నది ప్రశ్న. సకాలంలో పరిష్కరించకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. టైటిల్ వెరిఫికేషన్‌కు కనీసం 20 మంది రెవెన్యూ సిబ్బంది అవసరం. వీరు రోజుకు 10 దరఖాస్తుల వంతున పరిశీలించినా 200 మాత్రమే పూర్తి చేయగలరు. ఈ లెక్కన వారానికి 5 రోజులు (సెలవులు పోను) పనిచేస్తే 1000 మాత్రమే పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం 1.60 లక్షల దరఖాస్తులకు 160 పని దినాలు పడతాయి. పండుగలు, ఇతర సెలవులు తీసేస్తే సుమారు 6 నెలలు పడుతుంది. నిజానికి ఒక డిప్యూటీ తహశీల్దార్ రోజుకు 10 ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించడం అసాధ్యం. రోజుకు 5 దరఖాస్తులు తేల్చినా... మొత్తం 1.60 లక్షల దరఖాస్తులకు ఏడాది పడుతుంది. ప్రస్తుతం హెచ్ఎండీఏలో డీటీలు, సర్వేయర్లు, ప్లానింగ్ అధికారులు తగినంత మంది లేరు. ఈపరిస్థితుల్లో 6-8 నెల ల్లో ఎలా పరిష్కరించి క్రమబద్ధీకరణ ధ్రువీకరణ పత్రాలు అందిస్తారన్నది ప్రశ్నార్థకం. జీహెచ్ఎంసీకి 2 లక్షల దరఖాస్తులు సిటీబ్యూరో: బీఆర్ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించి జీహెచ్ంఎసీకి దాదాపు రెండు లక్షల దరఖాస్తులు అందాయి. నేడు (మంగళవారం) ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో ఇంకా దరఖాస్తు చేసుకోని వారు వేగిర పడుతున్నారు. జీహెచ్ఎంసీకి సోమవారం సాయంత్రం వరకు బీఆర్ఎస్కు 1,31,095... ఎల్ఆర్ఎస్కు 68,722.... మొత్తం 1,99,817 దరఖాస్తులు అందాయి. ప్రాథమిక ఫీజుగా బీఆర్ఎస్కు దాదాపు రూ.102 కోట్లు, ఎల్ఆర్ఎస్కు రూ.55 కోట్లు... మొత్తం రూ. 157 కోట్లు జీహెచ్ంఎసీ ఖజానాకు జమయ్యాయి. బీఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించడం తప్ప, ఎలాంటి ప్రాసెస్ చేయరాదని హైకోర్టు ఆదేశాలున్నాయి. ఈ నేపథ్యంలో తుది తీర్పు అనంతరమే వీటిని పరిశీలించాలని భావిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మాత్రం గడువు ముగియగానే పరిశీలించనున్నారు. వంద రోజుల్లో పదివేల దరఖాస్తులను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ వంద రోజుల ప్రణాళికలోనూ ఈ అంశాన్ని ప్రకటించారు. ఆర్థిక పరిపుష్టికి... హెచ్ఎండీఏను ఆర్థికంగా పటిష్టపర్చాలన్నదే నా లక్ష్యం. 1.60 లక్షల దరఖాస్తులను పరిష్కరిస్తే రూ.500 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సిబ్బంది కొరతతో పరిష్కారంలో కొంత ఇబ్బంది ఎదురైంది. అందుకే రిటైర్డ్ ప్లానింగ్ అధికారులను తీసుకోవాలని నిర్ణయించాను. డీటీసీపీ నుంచి 30 మంది, రెవెన్యూ నుంచి 20 మంది సిబ్బందిని డెప్యూటేషన్‌పై నియమించాలని ప్రభుత్వానికి లేఖ రాశాను. ప్రస్తుతం హెచ్ఎండీఏ ప్లానింగ్ వింగ్ నుంచి 24 మందిని తీసుకొని ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రారంభిస్తాం. - టి.చిరంజీవులు, కమిషనర్, హెచ్ఎండీఏ -
ఐదేళ్ల సర్వీసుంటే క్రమబద్ధీకరణ!
-
ఐదేళ్ల సర్వీసుంటే క్రమబద్ధీకరణ!
త్వరలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సాక్షి, హైదరాబాద్: కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా కాంట్రాక్టు ఉద్యోగులను ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకొన్న కొద్దీ దశల వారీగా క్రమబద్ధీకరిస్తారు. అయితే 2014 జూన్ 1వ తేదీ (రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రోజు) నాటికి కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉండి.. ఇప్పటికీ కొనసాగుతున్నవారికే దీనిని వర్తింపజేస్తారు. దీనికి సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి 8 మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం... ఆయా శాఖల్లో సంబంధిత కేటగిరీలో రెగ్యులర్ పోస్టు ఖాళీగా ఉండాలి. ఆ ఉద్యోగి నెలనెలా ఫుల్‌టైమ్ స్కేల్ జీతం పొంది ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుకు సరిపడే విద్యార్హత, వయసు ఉండాలి. మొత్తంగా ఐదేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. ఉద్యోగి సర్వీసు లెక్కించేటప్పుడు విద్యా, సంక్షేమ శాఖల్లో మాత్రమే సంవత్సరాంతపు సెలవులను పరిగణనలోకి తీసుకుంటారు. అనధికారిక గైర్హాజరు, క్రమశిక్షణా రాహిత్యం వంటివాటిల్లో ఈ మినహాయింపు ఉండదు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన నాటి నుంచి ఈ రెగ్యులరైజేషన్ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఐదేళ్లు ఎప్పుడు నిండితే.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి ఉద్యోగంలో ఉండి.. ఐదేళ్ల సర్వీసు నిండని కాం ట్రాక్టు ఉద్యోగులను క్రమపద్ధతిలో రెగ్యులరైజ్ చేస్తారు. ఈ ఐదేళ్లు నిండే వరకు వారి ని కాంట్రాక్టు ఉద్యోగులుగానే పరిగణిస్తారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకే ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారు, ప్రత్యేక ప్రాజెక్టులు, స్కీముల కింద పనిచేస్తున్న కాం ట్రాక్టు ఉద్యోగులకు వర్తించదు. వారి విషయాన్ని ఆలోచిస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించారు. రిజర్వేషన్ల సర్దుబాటుకు బ్యాక్లాగ్ మార్గదర్శకాలకు లోబడి అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల ప్రతిపాదనలను సంబంధిత శాఖ కార్యదర్శి బిజినెస్ రూల్స్ ప్రకారం ఆర్థిక శాఖ హెచ్ఆర్ఎం విభాగం పరిశీలనకు పంపాలి. క్రమబద్ధీకరణ ద్వారా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల అమలులో అసమానతలు ఉత్పన్నమైతే వాటిని ఆయా కేటగిరీల్లో బ్యాక్లాగ్ పోస్టులుగా పరిగణించి భర్తీ చేయాలి. ఈ సమాచారాన్ని సంబంధిత శాఖ వెంటనే ఆర్థికశాఖలోని హెచ్ఆర్ఎం విభాగానికి తెలియపరచాలి. అయితే ఈ మార్గదర్శకాలను కేబినెట్ ఆమోదించినా... ఉత్తర్వుల జారీ, ప్రక్రియ అమలుకు మరికొంత సమయం పడుతుందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. బాబు చేసిన చట్టానికి సవరణ రెండు దశాబ్దాల కిందట అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రభుత్వం... కాం ట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను నిషేధి స్తూ చట్టం చేసింది. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడ్డంకిగా మారడంతో.. ఈ ‘1994 యాక్ట్ నంబర్ 2’ను సవరించాలని కేబినెట్ తీర్మానించింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై టీఆర్ఎస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా సీఎం కేసీఆర్ దీనిపై పలుమార్లు ప్రకటనలు చేశారు. తాజాగా దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో వివిధ శాఖల పరిధిలో పనిచేస్తున్న దాదాపు 18 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. -
ఇక 3 రోజులే...
31తో ముగియనున్న క్రమబద్ధీకరణ గడువు ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్లకు ఇదే చివరి అవకాశం నేరుగా దరఖాస్తులు స్వీకరించనున్న హెచ్ ఎండీఏ సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలోని అక్రమ లే అవుట్లు, నిర్మాణాల క్రమబద్ధీకరణకు తుది గడువు 3 రోజుల్లో ముగియనుంది. ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకొనేందుకు ఈ నెల 31ని తుది గడువుగా ప్రభుత్వం నిర్దేశించింది. క్రమబద్ధీకరణ గడువును పొడిగించే విషయమై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సంకేతాలు లేవని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని, అన్ని డాక్యుమెంట్లు లేకపోయినా.. ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకొని, ఆ ప్రింటవుట్‌ను తీసుకొని మాన్యువల్‌గా దరఖాస్తులు అందజేయాలని ఆయన సూచించారు. అయితే ఆ దరఖాస్తుతో పాటు టైటిల్‌డీడ్ జిరాక్స్ కాపీ(అటెస్టెడ్)తో పాటు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు, రూ.10 వేల డిమాడ్ డ్రాఫ్టును జతచేసి తార్నాకలోగానీ, లేదా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో గానీ సమర్పించి రసీదు తీసుకోవాలని తెలిపారు. క్రమబద్ధీకరణ గడువు మరో 2 నెలలు పెంచాలని కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. అయితే...అటునుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఇక ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్లకు గడువు పెంచకపోవచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. క్రమబద్ధీకరణ గడువు ముంచుకొస్తుండటంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేందుకు ఎక్కువ మంది ఒకేసారి ప్రయత్నిస్తుండటంతో నెట్లో అప్లోడ్ కానిపరిస్థితి ఎదురైంది. దీనికితోడు హెచ్ఎండీఏలోని సర్వర్లు అధిక లోడ్‌ను తీసుకొనేందుకు సపోర్టు చేయకపోవడంతో ఆన్లైన్ ద్వారా దాఖలైన దరఖాస్తులు సోమవారం నాటికి 37180కి మించలేదు. ఎల్ఆర్ఎస్ కింద 27115, బీఆర్ఎస్ కింద 1065 దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్ ద్వారా దాఖలైనట్లు హెచ్ఎండీఏ వెబ్సైట్ చూపిస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన కమిషనర్ చిరంజీవులు చివరి మూడు రోజులైనా సద్వినియోగం చేసుకొని మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు ఆదేశించారు. ఆమేరకు దరఖాస్తుతో పాటు ఏయే డాక్యుమెంట్లు జతచేయాలో సూచిస్తూ హెచ్ఎండీఏ వెబ్సైట్లో పెట్టారు. దరఖాస్తుదారులకు అసౌకర్యం కలగకుండా దరఖాస్తులన్నీ స్వీకరించేంతవరకు రాత్రి 8 గంటల వరకు ఆఫీసును తెరిచే ఉంచాలని కమిషనర్ నిర్ణయించారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లను కూడా రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంచి కొత్త దరఖాస్తులను స్వీకరించాలని ప్లానింగ్ విభాగం ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఆరాటమేదీ...? క్రమబద్ధీకరణకు తుది గడువు ఇక మూడు రోజులే ఉండటంతో మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లకు దరఖాస్తుల రాక కాస్త పెరిగినట్లు సమాచారం. ఈ నెల 31తో స్కీం ముగియనుండటంతో వీలైనంత వరకు ఆదాయాన్ని రాబట్టుకొనేందుకు అధికారులు ఆరాటపడాలి. అయితే... హెచ్ఎండీఏలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రోజూవారీగా ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయి? మాన్యువల్‌గా దరఖాస్తులు తీసుకొంటే ఏ రసీదు ఇవ్వాలి.? సేవాకేంద్రాల ను నిరవధికంగా పనిచేయిస్తే సిబ్బందికి భోజనం,ఇతర సౌకర్యాలు వంటి అంశాలపై అధికారులు ఇంతవరకు దృష్టిపెట్టలేదు. మండ లాల్లోని ఫెసిలిటేషన్ సెంటర్లపై పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్లానింగ్ డెరైక్టర్లు కూడా ఇటు దృష్టి సారించకపోవడంతో వారిదే ఇష్టారాజ్యంగా మారింది. కొందరు దళారులు ఒక్కో దరఖాస్తుకు రూ.3 వేల చొప్పున రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 63 వేల దరఖాస్తులు... ఈనెల 31వ తేదీతో గడువు ముగియనున్నందున బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు గడువులోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ ఇబ్బందుల దృష్ట్యా దరఖాస్తులు అప్లోడ్ చేయడాన్ని సులభతరం చేశామన్నారు. ఇప్పటి వరకు 63 వేల దరఖాస్తులందాయన్నారు. మరిన్ని కౌంటర్లు ఏర్పాటుకు ఆదేశం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తుల విషయంలో ప్రజల కు ఇబ్బందులు కలుగకుండా సిటిజన్ సెంటర్స్‌లో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి సోమవారం రాత్రి ఆయా సర్కిల్స్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. వీటిని జతచేయండి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకొనేవారు తొలుత హెచ్ఎండీఏ వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ పేరుతో రూ.10 వేల డీడీని తీసుకొని దాని నంబర్‌ను ఆన్లైన్ దరఖాస్తులో ఎంట్రీ చేయాలి. ఎలాంటి ధ్రువపత్రాలు స్కాన్ చేయాల్సిన అవసరంలేదు. ఈ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని, దాన్ని ఒక జిరాక్స్ కాపీ తీసి భద్రపర్చుకోవడంతో పాటు మరో కాపీకి ఈ దిగువ పేర్కొన్న డాక్యుమెంట్లు జత చేసి హెచ్ఎండీఏ కార్యాలయం, లేదా మండల సహాయ కేంద్రాల్లో సమర్పించాలి. బీఆర్ఎస్కు గతంలో మంజూరు చేసిన ధ్రువపత్రం (ఉంటే). భూమి/బిల్డింగ్‌కు సబంధించి యాజమాన్య ధ్రువపత్రాలు అంటే...రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు(గజిటెడ్ అధికారిచే ధ్రవీకరించినవి). బిల్డింగ్ ప్లాన్‌కు సంబంధించి లెసైన్స్డ్ ఆర్కిటెక్ట్/ ఇంజనీర్‌చే ధ్రువీకరించిన నమూనా (3 సెట్లు) రూ.10 వేల డీడీ (మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ పేరుతో..) ఇండెమ్నిటి బాండ్ బిల్డింగ్ ఫొటోలు (ఎలివేషన్ ఫొటో) ఎల్ఆర్ ఎస్‌కు భూమికి సబంధించి యాజమాన్య ధ్రువపత్రాలు అంటే... రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ (గజిటెడ్ అధికారిచే ధ్రవీకరించినది) స్థలం యొక్క ప్లాన్ (లొకేషన్ స్కెచ్ ప్లాన్) లే అవుట్ ప్లాన్‌లో ప్లాట్ స్థలం, ఖాళీ ప్రదేశం, రోడ్ తదితరాలు తెలియజేస్తూ... ఇండెమ్నిటీ బాండ్ రూ.10 వేల డీడీ (మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ పేరుతో..) -
క్రమబద్ధీకరణ చేయొద్దు!
* మేం ఆదేశాలిచ్చేదాకా జీవో 146ను అమలు చేయకండి * అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు * దరఖాస్తులను మాత్రం స్వీకరించవచ్చు * జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించిన తీరు సరికాదు * శాసన ప్రక్రియ ద్వారా సవరించుకోవచ్చు * పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ఆదేశం * విచారణ జనవరి 27కు వాయిదా సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అక్రమ నిర్మాణాలను తాము చెప్పే వరకూ క్రమబద్ధీకరించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమబద్ధీకరణ కోసం జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ చేసిన తీరు సరికాదని, కార్యనిర్వాహక అధికారాల ద్వారా చట్ట సవరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కావాలంటే శాసన ప్రక్రియ ద్వారా చట్ట సవరణ చేసుకోవచ్చని సూచించింది. అయితే క్రమబద్ధీకరణ కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు మాత్రం అనుమతించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను జనవరి 27కు వాయిదా వేసింది. ఆ చట్ట సవరణ తప్పు: పిటిషనర్ న్యాయవాది జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన 146, 152 జీవోలను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎ.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని మంగళవారం హైకోర్టు విచారించింది. తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ ఏడాది అక్టోబర్ 28కి ముందు నిర్మించిన అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో 146 జారీ చేసిందని కోర్టుకు చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 455ఎఎకు సవరణ చేసినట్లుగా జీవోలో పేర్కొన్నారని... ఈ సవరణ ప్రకారం క్రమబద్ధీకరణ గడువును 5.12.2007 నుంచి 2015కు పొడిగించారని చెప్పారు. అయితే సెక్షన్ 101 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఏ చట్టాన్నయినా వర్తింప (అడాప్ట్) చేసుకోవచ్చని, సవరణ మాత్రం చేయడానికి వీల్లేదని కోర్టుకు నివేదించారు. పిటిషనర్ వాదనల్లో వాస్తవముంది: ధర్మాసనం పిటిషనర్ న్యాయవాది వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మా ముందున్న ప్రాథమిక ఆధారాలను బట్టి పిటిషనర్ తరఫు న్యాయవాది చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంది. సెక్షన్ 101 కేవలం ఓ చట్టాన్ని అన్వయించుకోవడానికి ఉద్దేశించిందే. దాని కింద చట్ట సవరణ చేయడానికి వీల్లేదు. చట్ట సవరణ చేసే విషయంలో మీకు (రాష్ట్ర ప్రభుత్వానికి) హక్కులపై మాకు కొంత సందేహం ఉంది..’’ అని పేర్కొంది. అయితే ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదిస్తూ... ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 100, రాజ్యాంగంలోని 131, 372 అధికరణల ప్రకారం ఈ చట్ట సవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. అందులో భాగంగానే క్రమబద్ధీకరణ జీవో జారీ చేశామని కోర్టుకు విన్నవించారు. దీనిపై సంతృప్తి చెందని ధర్మాసనం... శాసనాధికారం ద్వారా చట్ట సవరణ చేసుకోవచ్చే తప్ప, ఇలా కార్యనిర్వాహక అధికారాల ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి చట్ట సవరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తాము తదుపరి ఆదేశాలిచ్చేంత వరకు జీవో 146 ప్రకారం అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించవచ్చని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే నెల 27కు వాయిదా వేసింది. -
క్రమబద్ధీకరణపై అనాసక్తి
► సమీపిస్తున్న గడువు.. స్పందన కరువు ► కనీస ధర చెల్లింపునకు అర్జీదారుల వెనుకడుగు ► నోటీసులు జారీచేసినా ముందుకురాని వైనం ► జీఓ 59 కిందకు చేర్చిన దరఖాస్తులే అధికం క్రమబద్ధీకరణపై ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. క్రమబద్ధీకరణ ఖజానాకు కాసులవర్షం కురిపిస్తుందనుకున్న సర్కారు అంచనాలు తలకిందులయ్యాయి. రెగ్యులరైజేషన్‌కు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉంది. అయినా దరఖాస్తుదారుల్లో చలనం కల్పించడం లేదు. ఉచిత రెగ్యులరైజేషన్‌కు ఆసక్తిచూపిన అర్జీదారులు కనీస ధరలు చెల్లించి వాటి యాజమాన్య హక్కులు పొందేందుకూ ముందుకు రావడంలేదు. ఉచిత కేటగిరీ కింద నమోదైన దరఖాస్తుల్లో 7,229 అర్జీలను చెల్లింపు కేటగిరీలోకి మార్చి రూ.89.98 కోట్లు సమకూర్చుకోవచ్చని జిల్లా యంత్రాంగం అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం రూ.1.89 కోట్లు మాత్రమే ఖజానాకు జమయ్యాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో వెలిసిన కట్టడాల క్రమబద్ధీకరణ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింది. క్రమబద్ధీకరణ పర్వం ముగింపునకు రెండు వారాల గడువే మిగిలి ఉండడంతో నిర్దేశిత రుసం చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ నోటీసుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. డిసెంబర్ 31నాటికి జీఓ 58, 59 దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రెగ్యులరైజేషన్‌కు ఆసక్తిచూపిన అర్జీదారులు.. కనీస ధరలు చెల్లించి వాటి యాజమాన్య హక్కులు పొందేందుకు ముందుకు రావడంలేదు. మరిముఖ్యంగా ఉచిత కేటగిరీ (జీఓ 58) కింద నమోదైన దరఖాస్తుల్లో 7,229 అర్జీలను చెల్లింపు కేటగిరీ(జీఓ 59)లోకి మార్చారు. తద్వారా నిర్దేశిత మొత్తాన్ని చెల్లించమని నోటీసులు ఇచ్చారు. వీటిని చెల్లింపు కేటగిరీలోకి మార్చడం ద్వారా రూ.89.98 కోట్లు సమకూరుతాయని జిల్లా యంత్రాంగం అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం రూ.1.89 కోట్లు మాత్రమే ఖజానాకు జమయ్యాయి. ఉచిత కేటగిరీలో వీరు దరఖాస్తుచేసుకున్నా.. నిర్మాణశైలి, జీవన స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రెవెన్యూ అధికారులు.. వీరిని జీఓ 59 కింద పరిగణించారు. దీంతో అప్పటివరకు ఉచితంగా ఇళ్ల పట్టాలు లభిస్తాయని ఆశించిన వీరందరూ ప్రస్తుతం డబ్బులు చెల్లించాల్సిరావడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. చెల్లింపు కేటగిరీది అదే పరిస్థితి సర్కారీ స్థలాల్లోని నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో చాలా మంది రెగ్యులరైజేషన్‌కు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో జీఓ 59 కింద జిల్లావ్యాప్తంగా 11,855 దర ఖాస్తులు వచ్చాయి. వీటిని గత ఆర్నెలలుగా జల్లెడపట్టిన రెవెన్యూ యంత్రాంగం.. వీటిలో 5,230 అర్జీల ను అర్హమైనవిగా తేల్చింది. మిగతావాటిలో 2,678 దరఖాస్తులను ఆర్డీఓ నేతృత్వంలోని పరిశీలనకమిటీ తోసిపుచ్చింది. మరోవైపు క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నట్లు గుర్తించిన వాటిలో 4,703 దరఖాస్తుదారులకు నోటీసులు పంపింది. నిర్దిష్ట రుసుము చెల్లించి యాజమాన్య హక్కులు పొందాలని అందులో పేర్కొంది. చెల్లింపు కేటగిరీ కింద క్రమబద్ధీకరించే స్థలాలతో రూ.120.62 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేయగా, ఇప్పటివరకు అందులో రూ.88.12 కోట్లు ఖజానాకు చేరాయి. రిజిస్ట్రేషన్లపై అస్పష్టత! డబ్బులు చెల్లించి స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు చెబుతున్నా.. ఆక్రమణదారులు వెనుకడుగు వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై స్పష్టతనివ్వకపోవడమే. మొత్తం చెల్లించిన తర్వాత.. ఎవరైనా కోర్టుకెక్కితే తమ పరిస్థితేంటనే అయోమయం నెలకొంది. దీనికితోడు ఇతర జిల్లాల్లో జీఓ 59 కింద ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్థలాల రిజిస్ట్రేషన్‌కు అనుమతులు ఇస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. మన జిల్లాలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో గడువు సమీపిస్తున్నా అర్జీదారులు ముందుకు రాలేకపోతున్నారు. ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీ కిందకు మార్పిడి జరిగిన దరఖాస్తుల పరిస్థితి కూడా ఇదేనని ఒక అధికారి వ్యాఖ్యానించారు. కేవలం సరూర్‌నగర్ మండలం మన్సురాబాద్లోనే సుమారు 150 మంది పేదలు జీఓ 59 కింద తమ స్థలాలను రెగ్యులరైజ్ చేయించుకోవడానికి అర్హత పొందారు. వీరంతా పూర్తి వాయిదా చెల్లించి పట్టాలు పొందాలని అనుకుంటున్నా జిల్లా యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో డైలమాలో పడ్డారు. -
ఆశలు ఔట్
క్రమబద్ధీకరణలో జిల్లా సిబ్బందికి నో చాన్స్ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మెలిక పెట్టడంపై ఆగ్రహం నిరాశకు గురైన వేలాదిమంది కాంట్రాక్టు ఉద్యోగులు అరకొరజీతంతో కుటుంబాలను నెట్టుకొస్తూ ఎప్పటికైనా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో ఎన్నోవ్యయ ప్రయాసలకోర్చి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపింది. చేశామని గొప్పలు చెప్పుకునేందుకే అన్నట్టుగా 1994కు మందు కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ విధానంలో చేరిన ఉద్యోగులను మాత్రమే రెగ్యులర్ చేస్తామని ప్రకటించడంతో మిగతావారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో ఇలా చేరిన వారు దాదాపు లేరని చెప్పాలి. దీంతో జిల్లా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలకు క్రమబద్ధీకరణ అందని ద్రాక్షే. విజయనగరం ఫోర్ట్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ మిగతా హామీల మాదిరిగానే మాటమార్చింది. దీంతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురివుతున్నారు. జిల్లాలో ఉన్న చాలా శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో దాదాపు ఐదు వేల మంది పనిచేస్తున్నవారున్నారు. రెగ్యులర్ అవుతుందని ఆశపెట్టుకున్న్ట ఉద్యోగులు... చంద్రబాబు పెట్టిన మెలికతో చిత్తయ్యారు. 1994కు మందు కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ విధానంలో చేరిన ఉద్యోగులను రెగ్యూలర్ చేస్తామని మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 1997 తరువాత నుంచే అధికం 1997 నుంచి 2004 వరకు చంద్రబాబు పాలనలో కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ నియామకాలు రాష్ట్రంలో అధికంగా జరిగాయి. 1994 కు ముందు చేరిన వారు అతి తక్కువ మంది ఉన్నారు. వీరిని రెగ్యూలర్ చేయడం వల్ల ప్రభుత్వం పై పెద్దగా భారం పడదు. అందుకే ఈ మెలిక పెట్టారని కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు. నిరాశకు గురైన కాంట్రాక్టు ఉద్యోగులు: తాము అధికారంలోకి వస్తే ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హమీ ఇవ్వడంతో తమ కష్టాలు తొలుగుతాయని వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తే తమ కష్టాలు తొలగిపోతాయని కొత్త ప్రభుత్వం గద్దె ఎక్కిన నాటి నుంచి వారు చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. అయితే మంత్రివర్గ ఉపసంఘం పెట్టిన మెలిక వారికి తీవ్ర నిరాశనిస్పృహకు గురిచేసింది. వైద్య విధాన్ పరిషత్, వైద్య ఆరోగ్యశాఖ, ఆరోగ్యశ్రీ,ఎయిడ్స్ నియంత్రణశాఖ,ఐసీడీఎస్, విద్యశాఖ, మున్సిపాల్టీ, విద్యుత్‌శాఖ, 108, 104, వయోజన విద్య, రెవెన్యూ, పశు సంవర్ధకశాఖ, ఉపాధిహామీశాఖల్లో వేలాది మంది కాంట్రాకు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వైద్య విధాన్ పరిషత్‌లో 64 మంది, వైద్య ఆరోగ్యశాఖలో 660 మంది ,108లో 145 మంది, ఎయిడ్స్ నియంత్రణశాఖలో 54 మంది,104లో 116 మంది, విద్యశాఖలో 500 మంది, ఐసీడీఎస్శాఖలో 51 మంది ,పంచాయతీరాజ్‌శాఖలో 64మంది,విద్యుత్‌శాఖలో 600 మంది, పశు సంవర్ధశాఖలో 800 మంది, రెవెన్యూశాఖలో 30 మంది, వయోజన విద్య 1200మంది,మున్సి పాల్టీలో 100 మంది, కాంట్రాక్టు , ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. అన్యాయం ఎన్నికల మందు కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ రెగ్యులర్ చేస్తానని చెప్పిన చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు 1994 కు మందు విధుల్లో చేరిన వారిని మాత్రమే రెగ్యులర్చేస్తానని ప్రకటించడం అన్యాయం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల అందర్నీ రెగ్యులర్ చేయాలి. - పెంకి ఇజ్రాయిల్, వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు హామీ మేరకు క్రమబద్ధీకరించాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరించాలి. అధికారంలోకి రాకముందు ఒక విధంగా, వచ్చిన తర్వాత మరో విధంగా మాట్లాడడం తగదు. జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరిని రె గ్యులర్ చేయాలి. - జి.అప్పలసూరి, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు -
వేగం...సులభం
ఆన్లైన్లో ప్రభుత్వ శాఖల సమాచారం భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానం మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు సిటీబ్యూరో ఓ వైపు బీపీఎస్‌తో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం.. మరోవైపు భవిష్యత్‌లో ప్రజలు భవన నిర్మాణ అనుమతులను సులభంగా...త్వరితంగా పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రెవెన్యూ, వాటర్ బోర్డు, విమాన యాన సంస్థల సేవల అనుసంధానానికి యత్నిస్తోంది. ఎవరైనా భవన నిర్మాణానికిదరఖాస్తు చేసుకుంటే... అది ప్రైవేటు స్థలమేనా?.. లేక ప్రభుత్వానిదా?... నీటి సదుపాయం ఉందా? లేదా?... ఏదైనా వివాదం ఉందా? అనే వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని యత్నిస్తోంది. దీనికోసం సంబంధిత ప్రభుత్వ విభాగాలన్నీ తమ సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచాలని బీపీఎస్‌పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార సు చేసినట్లు తెలిసింది. అనుమతి కోసం వచ్చిన దరఖాస్తులోని సర్వే నెంబరును నమోదు చేయగానే ఆ స్థలానికి సంబంధించిన వివరాలన్నీ తెలిసేలా ఉండాలని సూచించింది. ఇవి అధికారులతో పాటు ప్రజలకూ అందుబాటులో ఉండేలా చూడాలంది. ఉదాహరణకు నగరంలో ఎవరైనా ఒక ప్లాటు కొనాలనుకుంటే సంబంధిత సర్వే నెంబరును నమోదు చేయగానే వివరాలు తెలిసేలా.. ప్రభుత్వ భూముల సమాచారాన్ని రెవెన్యూ శాఖ... ఆ ప్రాంతంలో నీటి సరఫరాకు అవకాశం ఉందో లేదో తెలిపే సమాచారాన్ని వాటర్ బోర్డు ఆన్లైన్లో పొందుపరచాలి. నీటి సరఫరాకు అవకాశం ఉంటే బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతి ఇచ్చే ముందే జీహెచ్ఎంసీ తగిన ఫీజు వసూలు చేసి ఏర్పాట్లు చేస్తుంది. అవకాశం లేనట్లయితే తిరస్కరిస్తుంది. తద్వారా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉంటాయని భావిస్తున్నారు. ఏదైనా స్థలానికి సంబంధించి వివాదాలున్నట్లయితే...ఆ విషయం తెలిసేలా ఉండాలి. తద్వారా దాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ముందస్తుగానే విషయం తెలుస్తుంది. అన్ని వివరాలూ ఇలా అందుబాటులో ఉంచడం (సీమ్‌లెస్ ఇన్ఫర్మేషన్) ద్వారా త్వరితంగా అనుమతులు రావడమే కాకుండా, భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని సబ్‌కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రస్తుతం టీఎస్ ఐపాస్ తరహాలో సింగిల్‌విండో విధానం ద్వారా ఇతర శాఖల వద్దకు వెళ్లకుండానే అనుమతులిచ్చేందుకూ వీలవుతుందని భావిస్తున్నారు. సబ్‌కమిటీ నివేదికను సీఎం పరిశీలించాక నిర్ణయం తీసుకుంటారు. ఎయిర్పోర్ట్ అథారిటీ అట్లాస్‌తో ప్రయోజనం.. ఎక్కువ ఎత్తున్న భవనాల నిర్మాణానికి ప్రస్తుతం ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంది. దీనికి ఎంతో సమయం పడుతోంది. దీన్ని నివారించేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ రూపొందిస్తున్న అట్లాస్‌ను వినియోగించుకోనున్నారు. నగరంలోని ఏ ప్రాంతంలో సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో భూమి ఉందో తెలిసేలా ఎంఎస్ఎల్(మీన్ సీ లెవెల్) వివరాలతో ఎయిర్‌పోర్టు అథారిటీ అట్లాస్‌ను రూపొందిస్తోంది. ఎఎంఎస్ఎల్ల వివరాలు సులభంగా అర్థమయ్యేలా వివిధ రంగుల్లో రూపొందుతున్న అట్లాస్‌తో తక్కువ ఎత్తు భవనాలను నిర్మించాల్సిన ప్రాంతాలకు ఒక రంగును, కొంత ఎత్తు వరకు అనుమతించే ప్రాంతాలకు మరో రంగును వినియోగిస్తారు. వీటిని బట్టి ఆ ప్రాంతంలో ఎంత ఎత్తు వరకు భవనం నిర్మించవచ్చునో సులభంగా తెలుస్తుంది. ఈ అట్లాస్‌ను ఆన్లైన్లో అనుసంధానించడం ద్వారా సమస్త సమాచారం అందుబాటులో ఉంటుంది. త్వరితంగా అనుమతులు ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. దీంతో పాటు అనుమతి లేని భవనాలకు రిజిస్ట్రేషన్లు చేయరు. తద్వారా భవిష్యత్‌లో అక్రమ నిర్మాణాలు లేకుండా చూడవచ్చని భావిస్తున్నారు. -
వంద గజాలకు లక్ష చిక్కులు
అభ్యంతరాలు పరిధే ఎక్కువ లబ్ధిదారుల సంఖ్యను కుదించే రూల్స్ కొండలపై నిర్మాణాలకే క్రమబద్ధీకరణ ఛాన్స్ పదివేలకు మించని అర్హులు విశాఖపట్నం సిటీ : వంద చదరపు గజాల విస్తీర్ణంలో అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారి గృహ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తాం. -ఇటీవల నగరంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన ఇది.. ఈ ప్రకటన ప్రభుత్వ స్థల ఆక్రమితదారుల్లో ఆనందాన్ని నింపింది. వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే అర్హుల జాబితా అంతగా లేదని భోగట్టా. ఎక్కువ మంది లబ్ధిపొందే అవకాశం లేదని అర్ధమవుతోంది. రెండు నెలల కిందట రహస్య సర్వే ద్వారా లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉన్నదని నిర్ధారించుకున్నాకే సర్కారు ఈ ప్రకటన చేసినట్లు తెలిసింది. కొండలపై నివాసముంటున్న కొద్దిమందే లబ్ధిపొందనున్నారని సర్వేలో తేటతెల్లమైంది. పదివేలకు మించి ఇళ్ల నిర్మాణాలు క్రమబద్ధీకరణ జరగదని భావిస్తున్నారు. మహా నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ వర్గాలు జూన్ 25 నుంచి ఈనెల 5 వరకూ సర్వే చేశారు. 100 గజాల లోపు అభ్యంతరం లేని గృహాలను నిశితంగా పరిశీలించారు. వివరాలు బయటకు పొక్కకుండా పకడ్బందీగా సర్వే చేశారుగెడ్డ పోరంబోకు, చెరువులు, కాల్వలు, పోరంబోకు స్థలాలు, స్మశానాలు,వక్ఫ్ స్థలాలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, సీఆర్‌జెడ్, , హౌస్‌కమిటీ భూములన్నీ అభ్యంతరకరమైనవేనని వీరు నివేదించారు. ఈ భూముల్లో నిర్మాణాలకు ప్రభుత్వం ప్రకటించిన క్రమబద్ధీకరణ వర్తించదని గుర్తించారు. కొండవాలు ప్రాంతాలు, గయాళ్లు భూముల్లో నిర్మాణాలను మాత్రమే వర్తించనుంది. నగర వ్యాప్తంగా 10 వేల ఇళ్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 20 వేల ఇళ్లకు క్రమబద్ధీకరణ అర్హత ఉన్నట్టు గుర్తించారు. నగరంలో కొండవాలు ప్రాంతాలన్నీ సింహాచలం దేవాదాయ భూ పరిధిలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నిర్మించుకున్న ఇళ్లకు క్రమబద్ధీకరణ కుదరదని రెవెన్యూ, పట్టణప్రణాళిక అధికారిక వర్గాలు చెబుతున్నాయి. హనుమంతవాక జంక్షన్ నుంచి సింహాద్రిపురం, దుర్గా నగర్, వెంకోజీపాలెం, సీతమ్మధార, బ్యాంకు కాలనీ, నార్త్ ఎక్స్టెన్షన్, గణేష్‌నగర్, కస్తూరినగర్, సింగాలమ్మ కాలనీ, సత్యసాయి నగర్, వరాహగిరి కాలనీ, బర్మాక్యాంపు లోని కొన్ని భాగాలు, మాధవధార ప్రాంతంలోని మరి కొన్ని ప్రాంతాలున్నాయి. ఇవన్నీ అభ్యంతరాలు వ్యక్తమయ్యే ప్రదేశాలేనని తేల్చారు. గాజువాక, పెందుర్తి ప్రాంతంలోని కొండవాలు ప్రాంతాల్లోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యే గృహాలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఆ ఇళ్లన్నీ ఎన్ని సంవత్సరాలు క్రితం నిర్మాణమైంది...పన్ను ఎప్పటి నుంచి చెల్లిస్తున్నదీ వంటి లెక్కలేసి లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించనున్నారని తెలిసింది. కైలాసపురం, కప్పరాడ, బర్మాక్యాంపు, మురళీనగర్, మాధవధార, తాటిచెట్లపాలెం, ఆశవానిపాలెం వంటి ప్రాంతాల్లో నిర్మించుకున్న ఇళ్ల వారికి ఈ స్కీం వర్తించవచ్చని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. మార్గదర్శకాలు విడుదలైతే లబ్దిదారులు సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని తెలిసింది. ముఖ్యమంత్రి స్వాతంత్య్రవేదికపై దీనికి సంబంధించి స్పష్టీకరణ చేస్తారని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. -
పేదల ఇళ్లు క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఏర్పాటు చేసుకున్న ఇళ్లను వందగజాల వరకూ ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో పేదల నివాసాలను గరిష్టంగా వందగజాల వరకూ క్రమబద్ధీకరిస్తున్నట్లు రెవెన్యూ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలు నివాసం కోసం వేసుకున్న గుడిసెలు, ఇళ్లకే ఇది వర్తిస్తుంది. ఆక్రమించుకున్న స్థలాలకు క్రమబద్ధీకరణ జీవో వర్తించదని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ బుధవారం జారీ చేసిన జీవో 296లో స్పష్టం చేశారు. జీవోలోని ముఖ్యాంశాలు, విధి విధానాలిలా ఉన్నాయి. ⇒ గతేడాది జనవరి ఒకటో తేదీ నాటికి ఉన్న ఆక్రమిత ఇళ్లకే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ⇒ అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమిత నివాసాల క్రమబద్ధీకరణ అని ఈ పథకాన్ని పిలుస్తారు. అమలు ఈ నెల 15 నుంచి ఆరంభమవుతుంది. ‘మీసేవ’ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ⇒ క్రమబద్ధీకరణ కోసం ఈ నెల 15 నుంచి 120 రోజుల్లోగా ‘మీసేవ’ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను సంబంధిత తహశీల్దార్లకు పంపుతారు. సబ్ కలెక్టరు/ రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన డివిజనల్ స్థాయి రెగ్యులరైజేషన్ కమిటీ (డీఎల్ఆర్సీ)ని ఏర్పాటు చేస్తారు. ఇందులో ఆయా మున్సిపాలిటీల పట్టణ ప్రణాళిక అధికారి సభ్యునిగానూ, తహశీల్దారు సభ్య కన్వీనరుగాను ఉంటారు. తహశీల్దారు ప్రతి దరఖాస్తు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి క్రమబద్ధీకరణకు అర్హమైనదో కాదో నిర్ధారించడం కోసం డీఎల్ఆర్సీకి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం తహశీల్దార్లకు జిల్లా కలెక్టరు/రాష్ట్ర భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) నిర్దిష్ట ప్రొఫార్మా, చెక్‌లిస్టు పంపుతారు. మహిళల పేరిటే పట్టాలు ⇒ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మహిళల పేరిట రూపొందిస్తారు. కుటుంబంలో మహిళలు లేని పక్షంలో కుటుంబ పెద్ద అయిన పురుషుని పేరుతో తయారు చేస్తారు. ⇒ అందిన ప్రతి దరఖాస్తును 90 రోజుల్లోగా పరిష్కరించాలి.హాడీఎల్పీసీ నిర్ణయంపై సంతృప్తి చెందని పక్షంలో దరఖాస్తుదారు 90 రోజుల్లోగా జేసీ-1కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ ప్రాంతాలకు వర్తించదు... ⇒ అభ్యంతరంలేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటారు. ⇒ మాస్టర్‌ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్, రోడ్ల అభివృద్ధి ప్రణాళికకు ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లోని దరఖాస్తులను, అనుమతించిన లేఅవుట్లలోని ఖాళీ స్థలాలనూ పరిశీలించరు. నీటివనరులు, శ్మశాన వాటికలు, నీటిపారుదల, తాగునీటి ట్యాంకులు ప్రాంతాల్లోని ఆక్రమణదారుల దరఖాస్తులను అనుమతించరు. ప్రజావసరాలకు పనికొచ్చే స్థలాలు, అతి విలువైన స్థలాలనూ ఈ జీవో నుంచి మినహాయిస్తారు. ⇒ పట్టా పొందిన రెండేళ్ల తర్వాత ఆ స్థలాలపై వారికి పూర్తి వారసత్వ హక్కులు లభిస్తాయి. -
కటాఫ్ డేట్.. జూన్ 2, 2014
అక్రమ కట్టడాలు, లే ఔట్ల క్రమబద్ధీకరణ బీపీఎస్, ఎల్ఆర్ఎస్పై సర్కారు నిర్ణయం! పురపాలక శాఖ నుంచి {పతిపాదనలు కోరిన సీఎంవో గతంతో పోల్చితే క్రమబద్ధీకరణ చార్జీలూ రెట్టింపు హైదరాబాద్: మళ్లీ అక్రమ కట్టడాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో భవనాలు/లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాల(బీపీఎస్/ఎల్ఆర్ఎస్)ను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను తాజాగా సీఎం కార్యాలయం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన 2014 జూన్ 2 తేదీని అక్రమాల క్రమబద్ధీకరణకు ‘కటాఫ్ డేట్’గా ప్రభుత్వం నిర్ణయించి నట్లు తెలుస్తోంది. అంటే, 2014 జూన్ 1 లోపు నిర్మాణం పూర్తై భవనాలు, లే ఔట్లనే క్రమబద్ధీకరించనున్నారు. ఆ తర్వాత పుట్టుకొచ్చిన అక్రమ కట్టడాలు, లే అవుట్లను కూల్చేయాలా? లేదా? అన్న అంశంపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కటాఫ్ డేట్‌కు ముందు నిర్మితమైన భవనాలు, లే అవుట్లను గుర్తించేందుకు ‘గూగుల్ మ్యాప్స్’ సహాయాన్ని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంతో పోలిస్తే ఈ సారి క్రమబద్ధీకరణ చార్జీలు దాదాపు రెట్టింపు కానున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తే రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని ఇప్పటికే జీహెచ్ఎంసీ తమ వార్షిక బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. నగరంలో దాదాపు 65 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్థికంగా కుదేలైన మిగిలిన 67 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు సైతం అక్రమాల క్రమబద్ధీకరణ ద్వారా రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే చివరిసారి..: అక్రమ కట్టడాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదని 2002లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అడ్డంకిగా మారే అవకాశాలున్నాయని అధికారవర్గాలు గుర్తించాయి. ఆ ఆదేశాల తర్వాత కూడా.. ఇదే చివరి క్రమబద్ధీకరణలు అంటూ 2007-08లో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ను అమలు చేశారు. 2002లో సైతం ‘ఇదే చివరిసారి’ అంటూ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. గత ప్రభుత్వాల నిర్ణయాలు, హైకోర్టు ఆదేశాల ప్రభావం లేకుండా బీపీఎస్, ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టేందుకు అనువుగా ఏపీ మునిసిపల్ చట్టం, మునిసిపల్ కార్పొరేషన్ల చట్టం, భవన నిర్మాణ నియమావళి, డీటీసీపీ చట్టాలను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా సవరించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు. పెండింగ్ దరఖాస్తులు మళ్లీ పరిశీలన ఉమ్మడి రాష్ట్రంలో 2007-08లలో పెండింగ్‌లో వున్న 57,473 బీపీఎస్, 4,586 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరాలు, పట్టణాల అభివృద్ధికి భారీ ప్రణాళికల అమలుకు కావాల్సిన నిధుల కోసం క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. -
వడపోత
రేపటిలోగా జీఓ 59 దరఖాస్తుల పరిశీలన ఆ తర్వాత క్షేత్రస్థాయికి అధికారులు ఆరు కేటగిరీలు మినహా అన్నింటికీ మోక్షం ఆగస్టులో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జీఓ 59 దరఖాస్తుల వడపోత మొదలైంది. అభ్యంతరకర స్థలాల జాబితాను రెవెన్యూ యంత్రాంగం సిద్ధం చేస్తోంది. చెల్లింపు కేటగిరీలో దరఖాస్తుల పరిశీలనకు నడుంబిగించిన జిల్లా యంత్రాంగం.. ముందుగా క్రమబద్ధీకరణకు అనువుగాని స్థలాలకు సంబంధించిన అర్జీలను వేరు చేస్తోంది. ఆగస్టు నెలాఖరులోగా జీఓ 59 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర సర్కారు గడువు నిర్ధేశించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఇప్పటికే మార్గదర్శకాలను కూడా జారీచేసింది. 27 అంశాలతో కూడిన చెక్లిస్ట్ను కూడా అందజేసింది. ఈ మేరకు స్థలాల క్రమబద్ధీకరణ పర్వాన్ని కొనసాగించాలని నిర్ధేశించింది. 125 గజాల్లోపు ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నివసిస్తున్న పేదలకు జీఓ 58 కింద ఉచితంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన అధికార యంత్రాంగం.. చెల్లింపు కేటగిరీలోనూ అదే తరహాలో ముందుకు నడవాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా వివాదాస్పద /అభ్యంతరకర స్థలాల క్రమబద్ధీకరించకూడదని సంకల్పించిం ది. మరీ ముఖ్యంగా అభ్యంతరకర భూములుగా తేల్చిన వక్ఫ్, రైల్వే, రక్షణ, రిజర్వ్ఫారెస్ట్లు, ఖాళీ స్థలాలు, పట్టా భూముల్లో వెలిసిన నిర్మాణాల జోలికి వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ రఘునందన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. ఇవేకాకుండా ఎఫ్టీఎల్, శిఖం, లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, శ్మశానవాటికల్లో కట్టడాలను క్రమబద్ధీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, జీఓ 58 కింద వచ్చిన ఇలాం టి దరఖాస్తులను రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించినట్లు చెప్పారు. భూమి స్థితిగతులను పరిగణలోకి తీసుకుంటున్న సర్కారు.. ఒక్కో దరఖాస్తును ని శితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇదే సూత్రం చెల్లింపు కేటగిరీలో వచ్చిన దరఖాస్తులకూ వర్తిస్తుందని చెప్పారు. కాగా, అభ్యంతరకర స్థలాల జాబితా సోమవారంలోపు కొలిక్కివస్తుందని, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అధికారుల బృందాలు పర్యటించి క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలిస్తారని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, జీఓ 59 కింద జిల్లావ్యాప్తంగా 11,744 దరఖాస్తులు రాగా, దీనికి సంబంధించి ఖజానాకు రూ.68.92 కోట్ల రాబడి వచ్చింది. క్రమబద్ధీకరణకు నోచుకునే నిర్మాణదారులు ఐదు విడతలుగా నిర్ధేశిత కనీస ధర చెల్లించే వెసులు బాటు కల్పించిన తరుణంలో.. క్రమబద్ధీకర ణతో సుమారు రూ.250 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
డ్రెయినేజీలో దొంగలు పడ్డారు..!
యూజీడీ సొమ్ము గోల్మాల్ కనెక్షన్ల పేరుతో కలెక్షన్లు రూ.6 కోట్లు బొక్కేసిన ఉద్యోగులు 25 వేల కనెక్షన్లు అనధికారికం నెలాఖరు లోపు క్రమబద్ధీకరించుకోకుంటే కట్ విజయవాడ సెంట్రల్ : దోపిడీకి కాదేదీ అనర్హం అనుకున్నారో ఏమో.. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) కనెక్షన్ల పేరుతో ఆ విభాగం ఉద్యోగులు రూ.కోట్లు కొల్లగొట్టారు. నగరపాలక సంస్థ ఖజానాకు జమ చేయకుండా తమ జేబులు నింపుకొన్నారు. అనధికారిక యూజీడీ కనెక్షన్లపై ఉన్నతాధికారులు దృష్టిసారించడంలో అక్రమార్కుల గుట్టురట్టయింది. నగరంలో 62,150 యూజీడీ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 25 వేల కనెక్షన్లు అనధికారికమేనని ఇంజినీరింగ్ అధికారుల సర్వేలో తేలింది. సర్కిల్-3 పరిధిలోనే సుమారు 22 వేల కనెక్షన్లు అనధికారికంగా ఉన్నట్లు లెక్కతేలింది. ఈ నెలాఖరులోపు క్రమబద్ధీకరణ చేసుకోకుంటే కనెక్షన్లను తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడేళ్లుగా దోపిడీ యూజీడీ కనెక్షన్లకు సంబంధించి సుమారు రూ.6 కోట్ల మేర గోల్మాల్ జరిగినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. గృహనిర్మాణదారులు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవన సముదాయాల నుంచి కొందరు ఉద్యోగులు యూజీడీ కనెక్షన్ల పేరుతో కలెక్ట్ చేసిన సొమ్మును బొక్కేశారు. మూడేళ్లుగా ఈ అక్రమ వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం. సర్వే సందర్భంగా తాము గతంలో ఫలానా ఉద్యోగులకు సొమ్ము చెల్లించామని పలువురు గృహ యజమానులు వాపోయినట్లు తెలుస్తోంది. యూజీడీ స్కామ్‌పై ఉన్నతాధికారులు దృష్టిసారించడంతో ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లు పరారైనట్లు అత్యంత విశ్వసనీయం సమాచారం. మరికొందరు మెల్లగా సర్దుకొనే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఫిర్యాదులు లేకపోవడంతో అక్రమార్కులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గతంలో చెల్లించినప్పటికీ మళ్లీ యూజీడీ కోసం వేలాది రూపాయలు చెల్లించాల్సి రావడంతో గృహ యజమానులకు ఆర్థిక భారం తప్పేట్టు లేదు. నిర్ణయించిన టారిఫ్ చార్జీలను బిల్డింగ్ ప్లాన్ ఆమోదం పొందిన నాటి నుంచి లేదా మూడేళ్ల నుంచి కానీ వసూలు చేయాలని కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ నెల 31 లోపు క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా గడువు విధించారు. లేనిపక్షంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఎలాంటి నోటీసూ లేకుండానే కనెక్షన్లు కట్ చేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. సర్కిల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకొని నగదు చెల్లించే వెసులుబాటు కల్పించారు. -
కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త
క్రమబద్ధీకరణకు సర్కారు పచ్చజెండా అయిదేళ్ల సర్వీసు ఉంటేనే అర్హులు విధివిధానాలు ఖరారు చేసిన కమిటీ సీఎంకు నివేదిక సమర్పించిన సీఎస్ హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా ఈ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందుతారని ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు అవసరమయ్యే విధివిధానాలను అధ్యయనం చేసేందుకు గత ఏడాది ఆగస్టు 13న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో ఏడు విభాగాల ముఖ్య కార్యదర్శుల కమిటీ సుదీర్ఘంగా కసరత్తు చేసింది. గత నెలలోనే ఈ కమిటీ తమ నివేదికను సిద్ధం చేసింది. మార్గదర్శకాలన్నింటినీ అందులో పొందుపరిచింది. ఈ కమిటీ నివేదికతో పాటు ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ఫైలు ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉంది. సీఎం ఆమోదించిన వెంటనే ఈ ఉత్తర్వులు వెలువడతాయని ఆర్థిక శాఖ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. కమిటీ సిఫారసు చేసిన నిబంధనల ప్రకారం... రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం నాటికి అంటే గత ఏడాది జూన్ 2 నాటికి అయిదేళ్ల సర్వీసు నిండిన కాంట్రాక్టు ఉద్యోగులను ముందుగా రెగ్యులరైజ్ చేస్తారు. రెండో విడతలో అయిదేళ్లు నిండని అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. అయిదేళ్ల పాటు కాంట్రాక్టు ఉద్యోగులుగానే గుర్తించి.. తర్వాతే రెగ్యులర్ అయ్యే అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ ఈ క్రమబద్ధీకరణ పథకం వర్తిస్తుంది. ప్రత్యేక ప్రాజెక్టులు, స్కీముల కింద పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వర్తించదు. అంటే... నెలనెలా ప్రభుత్వం ఫుల్ టైమ్ స్కేల్ అందుకుంటున్న వారినే ఇందుకు అర్హులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులకు సరిపడే విద్యార్హత, వయసు నిబంధనలున్న అభ్యర్థులకే అవకాశమిస్తారు. ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టుల సంఖ్య మేరకే ఈ నియామకాలుంటాయి. రిజర్వేషన్లు, రోస్టరు పద్ధతిని సైతం అనుసరిస్తారు. పార్ట్ టైం, డైలీ వేజ్ కార్మికులు సైతం ఈ క్రమబద్ధీకరణ పరిధిలోకి రారు. క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే ప్రభుత్వ సర్వీసు మొదలవుతుందని.. గతంలో పని చేసిన సర్వీసు లెక్కలోకి రాదని కమిటీ నిర్ణయించింది. కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆర్టీసీ సమ్మె ముగిసిన వెంటనే అందులో పని చేస్తున్న మూడు వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తున్నట్లు స్వయంగా సీఎం ప్రకటించారు. దీంతో మిగతా విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు సైతం తమకెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. -
ఇక కొత్త డోర్ నంబర్లు
పెలైట్ ప్రాజెక్టుగా నాలుగు డివిజన్లు ఎంపిక ఎనిమిది డిజిట్లతో నంబర్ల కేటాయింపు కమిషనర్ వీరపాండియన్ ప్రత్యేక దృష్టి విజయవాడ సెంట్రల్ : నగరంలో అడ్డదిడ్డంగా ఉన్న డోర్ నంబర్ల క్రమబద్ధీకరణపై మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ దృష్టి సారిం చారు. స్మార్ట్‌సిటీ నేపథ్యంలో జిప్పర్ కోడ్ విధానంలో కొత్త డోర్ నంబర్లు కేటాయించి ఇంటికి ఒక యూనిక్ ఐడీ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. పెలైట్ ప్రాజెక్ట్ కింద 13, 17, 18, 21 డివిజన్లను ఎంపికచేశారు. క్రమబద్ధీకరణ బాధ్యతను జిప్పర్ కన్సల్టెంట్‌కు అప్పగించారు. శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించేం దుకు వీలుగా సంస్థ ప్రతినిధులకు అథరైజేషన్‌తో పాటు ఐడీ కార్డులు మంజూరు చేశారు. ఇక ఎనిమిది అంకెలే.. ఇప్పటివరకు ఒకే డోర్ నంబర్ వేర్వేరు గృహాలకు ఉండటంతో తరచూ ఇబ్బందులు ఏర్పడేవి. ఈ విధానానికి చెక్ పెట్టాలన్నది కమిషనర్ ఆలోచన. నాలుగు ఆంగ్ల అక్షరాలు, నాలుగు న్యుమరికల్ నంబర్లు (ఎనిమిది డిజిట్లతో) యూనిక్ ఐడీని కేటాయించి జిప్పర్కోడ్కు అనుసంధానం చేస్తారు. ఇలా రూపొందించిన జిప్పర్ కోడ్‌ను మొబైల్ యాప్‌లో ఎంటర్ చేయగానే, ఆ ఇంటి చిరునామా మ్యాప్‌తో సహా కనిపిస్తుంది. గృహాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, ఇతర సంస్థల చిరునామాలను ఆన్లైన్లో చిటికెలో కనుక్కోవచ్చు. ఈ సమాచారం ఇవ్వాలి జిప్పర్ కోడ్ విధానంలో పూర్తి సమాచారం కావాలంటే గృహ యజమానులు తమ కరెంట్ మీటర్ సర్వీస్, నీటి కుళాయి కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ల నంబర్లు, ఆస్తి, వాణిజ్య పన్నులు, రేషన్, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఓటర్ గుర్తింపు కార్డుల వివరాలను జిప్పర్ కన్సల్టెంట్ సిబ్బందికి అందించి సహకరించాల్సిందిగా కమిషనర్ కోరారు. అంతా ఆన్లైనే.. నాలుగేళ్ల కిందట జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో డోర్ నంబర్ల కేటాయింపు ప్రక్రియను నాటి అధికారులు చేపట్టారు. క్యాడ్ఇన్ఫో సంస్థకు ఆ బాధ్యతల్ని అప్పగించారు. మాన్యువల్ విధానంలో డోర్ నంబర్లను కేటాయించారు. నిధులలేమి కారణంగా మధ్యలోనే ఈ ప్రక్రియకు బ్రేక్‌పడింది. స్మార్ట్‌సిటీ నేపథ్యంలో డోర్ నంబర్ల క్రమబద్ధీకరణతో పాటు గృహాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఆన్లైన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతగా ఎంపిక చేసిన నాలుగు డివిజన్లలో ఆశించిన ఫలితం సాధిస్తే నగరం మొత్తం ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. -
3వ ప్రభాగ్ సమితిలోగుడిసెల క్రమబద్ధీకరణకు పచ్చజెండా
భివండీ, న్యూస్‌లైన్ : భివండీ నిజాంపూర్ షహర్ మహానగర్ పాలిక మూడో ప్రభాగ్ సమితి పరిధిలోని గుడిసెలను క్రమబద్దీకరించేందుకు కమిషనర్ అంగీకరించారు. సోమవారం ఈ మేరకు కమిషనర్ నిర్ణయం తీసుకున్నారని కార్పొరేటర్ సంతోష్ ఎం.శెట్టి మంగళవారం తెలిపారు. కొన్నేళ్ల కిందట వెలసిన ఈ గుడిసెవాసులు కార్పొరేషన్‌కు క్రమం తప్పకుండా పన్ను కడుతున్నారు. అయితే వారి పన్ను పత్రాలపై ‘అక్రమంగా వెలసిన గుడిసెలు’ అని కార్పొరేషన్ అధికారులు ముద్ర వేశారు. ఆ ముద్రను తొలగించాలని 2008 నుంచి స్థానిక కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఒక్క గుడిసెకు రూ.60 ఉన్న పన్నును రూ.500 నుంచి రూ.600 వరకు పెంచారు. అయినప్పటికీ గుడిసెవాసులు ఆ మొత్తాన్ని పన్నుగా చెల్లిస్తున్నారని, కానీ అక్రమ గుడిసెలు అన్న ముద్రను మాత్రం తొలగించలేదని సంతోష్ శెట్టి చెప్పారు. సోమవారం జరిగిన కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని కార్పొరేటర్లు సంతోష్ శెట్టితో పాటు మేయర్ తుషార్ చౌదరి, కార్పోరేటర్లు నిలేష్ చౌదరి, ప్రభాగ్ సమితి మూడు సభాపతి లలిత నితిన్ భజాగే, హనుమాన్ చౌదరి, కమ్లాకర్ పాటిల్, అల్కా నారాయణ్ చౌదరి, పూనం పాటిల్‌లు లేవనెత్తారు. వెంటనే అక్రమ అనే ముద్రను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కమిషనర్ జీవన్ సోనావునే ఆ ముద్రను తొలగించేందుకు అంగీకరించారని సంతోష్ శెట్టి చెప్పారు. కమిషనర్ ప్రకటన పట్ల ప్రభాగ్ సమితి మూడు పరిధిలోని వేలాది మంది తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. గుడిసెలపై అక్రమ ముద్రను తొలగించి, క్రమబద్ధీకరించేందుకు అంగీకరించిన కమిషనర్ జీవన్ సోనావునేను పలువురు తెలుగు ప్రముఖులు సన్మానించారు. మంగళవారం ఉదయం కార్పొరేషన్ ముఖ్య కార్యాలయంలో కామత్‌ఘర్ సేవ సమితి అధ్యక్షులు సుదామ్ సావంత్, సచ్చిన వేలేకర్, మామిడాల మల్లేశం, డాక్టర్ సదానందం, డాక్టర్ చెన్న రాజమల్లయ్య, తదితర్లు కమిషనర్ జీవన్ సోనావునేకు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తుషార్ చౌదరికి, సంతోష్ ఎమ్. శెట్టితో పాటు ఇతర కార్పొరేటర్లకు అభినందనలు తెల్పినారు. -
అభ్యంతరాలుంటే పెండింగ్
పట్టా భూములైనా, నిర్మాణాలు లేకున్నా,లబ్ధిదారులు ఉండకున్నా అంతే క్రమబద్ధీకరణ భూములపై కలెక్టర్లకు సర్కారు ఆదేశం తాజా పరిస్థితిపై భూపరిపాలన కమిషనర్ సమీక్ష 20 నుంచి అసైన్మెంట్ పట్టాల పంపిణీ చెల్లింపు కేటగిరీలో దరఖాస్తులకు 28 వరకు గడువు సాక్షి, హైదరాబాద్: క్రమబద్ధీకరణ ప్రక్రియలో అభ్యంతరకర భూములకు సంబంధించిన దరఖాస్తులను, అలాగే పూర్తి వివరాలు లేని వాటిని పక్కనపెట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఉచిత కేటగిరీలో క్రమబద్ధీకరణ ప్రక్రియ పురోగతిపై జిల్లాల క లెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో బుధవారం భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ అధర్‌సిన్హా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉచిత క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చెక్ మెమో(వివరాల)ను వెంటనే ఆన్‌లైన్‌లోకి ఎక్కించేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న పేదలకు ఆయా స్థలాలను క్రమబద్ధీకరించే విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టమైన ఆదేశాలిచ్చారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 20 నుంచి అన్ని జిల్లాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధర్‌సిన్హా పేర్కొన్నారు. కమిటీల తో కాలయాపన వద్దు క్షేత్రస్థాయిలో వివరాల పరిశీలనకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అసైన్మెంట్ కమిటీ సమావేశాలు ఇప్పటి నుంచే అవసరం లేదని కమిషనర్ సూచించారు. వివాదాస్పద భూములకు సంబంధించిన దరఖాస్తులను వేరు చేయాలన్నారు. సీసీఎల్ఏ నుంచి వచ్చిన 32 అంశాలతో కూడిన చెక్ మెమోలను డౌన్లోడ్ చేసుకొని, క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఆ వివరాలను చెక్మెమోల్లో నమోదు చేయాలని సూచించారు. ఈ నెల 15కల్లా పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే సరిపడా సిబ్బంది లే రని కొందరు అధికారులు పేర్కొనగా, క్రమబద్ధీకరణకు దరఖాస్తులు లేని మండలాల నుంచి సిబ్బందిని డిప్యుటేషన్‌పై వినియోగించుకోవాలని అధర్‌సిన్హా సూచిం చారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి జిల్లాలోని మండలాలను ఏబీసీ కేటగిరిలుగా విభజించాలని, 15 వేలకులోపున్న బీ, సీ కేటగిరీ మండలాల్లో పరిశీలనను కచ్చితంగా పూర్తి చేయాలని, అంతకన్నా ఎక్కువ దరఖాస్తులున్న చోట మరికొంత సమయం ఇస్తామని చెప్పారు. కామన్‌గా ‘పట్టా’ నమూనా అర్హులైన లబ్ధిదారులకు ఇచ్చే అసైన్మెంట్ పట్టాలను ఇప్పటివరకు జిల్లాల్లో వేర్వేరు ఫార్మాట్లలో ఇస్తున్నారని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకంగా ఉండేలా ప్రత్యేక నమూనాను రూపొందించామని అధర్‌సిన్హా పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారానే అసైన్మెంట్ పట్టాను డౌన్లోడ్ చేసి లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంటుందన్నారు. తహసీల్దార్లు అప్లోడ్ చేసిన చెక్మెమోలోని వివరాలే అసైన్మెంట్ పట్టాలో ముద్రితమవుతున్నందున, డేటా ఎంట్రీ సమయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పట్టణ భూ పరిమితి(యూఎల్సీ) పరిధిలోని భూములకు సంబంధించిన దరఖాస్తులను యూఎల్సీ నుంచి వచ్చిన కమిటీలు పరిశీలన చేస్తాయన్నారు. క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యలేవైనా ఎదురైతే.. స్పష్టత కోసం ప్రభుత్వానికి రాయాలని అధికారులకు సూచిం చారు. ఈ సందర్భంగా భూమి పరిస్థితి, లబ్ధిదారుని గుర్తింపు తదితర అంశాలపై అధికారుల సందేహాలకు అధర్‌సిన్హా స్పష్టతనిచ్చారు. ఎటువంటి అభ్యంతరాలున్నా సదరు దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టాలన్నారు. చిన్నచిన్న తేడాలున్నట్లు గమనిస్తే మరోమారు పరిశీలనకు అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే జీవో 59 ప్రకారం చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. చెల్లింపు కేటగిరీలో దరఖాస్తుల సమర్పణకు ఈనెల 28 వరకు గడువు ఉందని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన ఇలా.. స్టేటస్ ఆఫ్ ల్యాండ్: గత ప్రభుత్వం జారీచేసిన జీవో 166 పరిధిలోనిది అయి ఉండకూడదు. సదరు భూమిపై ఎటువంటి కోర్టు కేసు ఉండకూడదు. దరఖాస్తులో పేర్కొన్న స్థలం ఇప్పటికే పట్టాభూమి అయినట్లయితే.. దాన్ని అభ్యంతరకరమైన భూమిగా పరిగణించాలి. లబ్ధిదారుని గుర్తింపు: దరఖాస్తుదారుని ఆధార్ కార్డు సంఖ్య, ఫొటో తప్పనిసరి. దరఖాస్తులో పేర్కొన్న కుటుంబసభ్యుల వివరాలను నిర్ధారించుకోవాలి. వివిధ పథకాలకు లబ్ధిదారులను గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు పాటించే ప్రక్రియను వర్తింపజేయాలి. రూ. 2 లక్షలలోపు వార్షికాదాయాన్ని నిర్ధారించేందుకు పాత రేషన్ కార్డు, ఇటీవలి ఆహార భద్రత సర్వే వివరాలను పరిగణనలోకి తీసుకోవాలి. భార్య లేదా భర్త పేరిట ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు చేశారేమో తనిఖీ చేయాలి. దరఖాస్తుదారులు అదే స్థలంలో నివాసముంటున్నారో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. నివాసం పరిస్థితి: క్రమబద్ధీకరణ కోరుతున్న స్థలంలో నిర్మాణం ఉండి తీరాలి. ఆ స్థలం జూన్ 2, 2014కు ముందునుంచి దరఖాస్తుదారుడి ఆక్రమణలోనే ఉన్నట్లు ధ్రువీకరించుకోవాలి. లబ్ధిదారుడు నివాసముంటున్న ట్లు ధ్రువీకరణ పత్రం, ఎప్పడి నుంచి అక్కడ ఉంటున్నారన్న వివరాలు సరిపోలుతున్నాయో లేదో చూసుకోవాలి. విద్యుత్ బిల్లు, నీటిపన్ను, ఆస్తిపన్నులను సంబంధిత శాఖ ద్వారా నిర్ధారించుకోవాలి. -
అధికారులకు ‘క్రమబద్ధీకరణ’ పరేషాన్
స్థలాల క్రమబద్ధీకరణలో చెక్మెమోతో తంటాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో చెక్‌మెమో వ్యవహారం రెవెన్యూ అధికారులను పరేషాన్‌కి గురిచేస్తోంది. ఉచిత, చెల్లింపు కేటగిరీల కింద వచ్చిన సుమారు మూడున్నర లక్షల దరఖాస్తుల పరిశీలనలో చెక్‌మెమోను తప్పనిసరిగా పాటించాలని భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ తాజాగా ఆదేశాలు జారీచేశారు. చెక్మెమోలోని 32 అంశాలను విచారణాధికారి, మండల తహశీ ల్దారు స్వయంగా పరిశీలించి ధ్రువీకరించాలని అం దులో పేర్కొన్నారు. అలాగే.. ఏవైనా తప్పిదాలు జరి గితే సంబంధిత మండల తహశీల్దార్లను బాధ్యులుగా పరిగణిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు సిబ్బంది కొరత, మరోవైపు అధికమైన పనిభారంతో తహశీల్దార్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుకు పది దరఖాస్తులు గగనమే.. క్రమబద్ధీకరణ దరఖాస్తుల్లో దరఖాస్తుదారు పేర్కొన్న స్థలం వివరాలను క్షేత్రస్థాయిలో విచారణాధికారితో పాటు తహశీల్దారు కూడా పరిశీలించాలి. దీంతో పాటు దరఖాస్తుదారుని వృత్తి, మతం, కులం, వీధి, వార్డు, గ్రామం, కుటుంబ సభ్యుల వివరాలను కూడా ధ్రువీకరించాలి. విద్యుత్, నీటి బిల్లులు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డులు సరైనవో కావో సంబంధిత విభాగాల అధికారులతో సంప్రదించి నిర్ధారించుకోవాలి. దరఖాస్తులో పేర్కొన్న ఇంటి నిర్మాణం, ఖాళీ జాగాలను పరిశీలించి సర్వే చేయించాలి. ఇలా చెక్మెమోలో పేర్కొన్న 32 అంశాలను స్వయంగా తహశీల్దార్లు ధ్రువీకరించాలని సీసీఎల్ఏ జారీచేసిన చెక్మెమోలో పేర్కొన్నారు. వీటన్నింటిని నేరుగా తామే వెళ్లి పరిశీలించడమంటే సాధ్యమయ్యే పనికాదని అధికారులు అంటున్నారు. రోజుకు 50 దరఖాస్తులు పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా, 32 అంశాలను నిశితంగా పరిశీలించాల్సి వస్తున్నందున రోజుకు పది దరఖాస్తులు కూడా క్లియర్ చేయలేకపోతున్నట్లు అధికారులు వాపోతున్నారు. పరిశీలన ప్రక్రియ ఇదేవిధంగా కొనసాగితే.. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ నెల 20నుంచి పట్టాల పంపిణీ సాధ్యం కాకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. -
ఏడేళ్ల తరువాత మరో ఛాన్స్ !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : భవనాల క్రమబద్ధీకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అనుమతి లేకుండా జిల్లాలో నిర్మించిన భవనాలను లైన్ క్లియర్ కానుంది. ఏడేళ్ల తరువాత రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఈ అవకాశాన్ని కల్పించింది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని అమలు చేశారు. 2007 డిసెంబర్ 15వరకు భవన క్రమబద్ధీకరణ అమలులో ఉంది. అప్పట్లో జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల్లో 2,552 భవనాల్ని క్రమబద్ధీకరించారు. ప్రభుత్వానికి దాదాపు రూ. 6.23కోట్ల ఆదాయం వచ్చింది. తాజాగా భవనాల క్రమబద్ధీకరణకు సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో ఈసారి అంతకు రెట్టింపు ఆదాయం రావచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చివరిగా జరిగిన భవన క్రమబద్ధీకరణలో విజయనగరం మున్సిపాల్టీ పరిధిలో 2,774 దరఖాస్తులు రాగా, 1,795 దరఖాస్తుల్ని అధికారులు క్లియర్ చేశారు. వీటి ద్వారా రూ. 5కోట్ల 15వేల ఆదాయం వచ్చింది. బొబ్బిలి మున్సిపాల్టీ పరిధిలో 324 దరఖాస్తులు రాగా, 284 పరిష్కరించారు. వీటి ద్వారా రూ.38.18లక్షల ఆదాయం వచ్చింది. పార్వతీపురం మున్సిపాల్టీలో 964దరఖాస్తులు రాగా, 243పరిష్కరించడంతో రూ.62.10లక్షల ఆదాయం సమకూరింది. సాలూరు మున్సిపాల్టీలో 512దరఖాస్తులు రాగా, 230 పరిష్కారమయ్యాయి. వీటి ద్వారా రూ.23.10 లక్షల ఆదాయం లభించింది. చివరిగా భవన క్రమబద్ధీకరణ జరిగి ఏడేళ్లు దాటడంతో ఈసారి అంతకుమించి ఆదాయం లభించే అవకాశం ఉంది. దాదాపు ప్రతీ మున్సిపాల్టీలో అక్రమ కట్టడాల సంఖ్య వందల్లోనే ఉంది. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో వాటి లెక్క తేలడం లేదు. అలాంటి భవనాల క్రమబద్ధీకరణ చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో అక్రమ కట్టడదారులంతా ముందుకొచ్చి క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉంది. భూమి, భవనాల విలువ భారీగా పెరగడంతో తప్పనిసరిగా క్రమబద్ధీకరణకు యజమానులు ఆసక్తి చూపుతారు. ఈలెక్కన మున్సిపాల్టీల్లో ఈసారి భవన క్రమబద్ధీకరణ ఆదాయం రూ.13 నుంచి 15 కోట్ల వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్లాన్ తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టిన వారు, తీసుకున్న ప్లాన్ కన్నా అదనపు నిర్మాణాలు చేపట్టిన వారంతా భవన క్రమబద్ధీకరణలోకి వస్తారు. వీరంతా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా అధికారులు క్రమబద్ధీకరించనున్నారు. అలాగే, పంచాయతీల్లో కూడా భవన క్రమబద్ధీకరణకు అవకాశం ఉంది. అయితే వీటిలో అనధికార కట్టడాల్ని అంచనా వేయడం కష్టం. -
దర్జాగా.. అక్రమాలు
జిల్లా వ్యాప్తంగా ఎడాపెడా కొత్త నిర్మాణాలు!? ఎల్ఆర్ఎస్, బీపీఎస్‌పై అక్రమార్కుల ఆశలు తెరచాటుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు కర్నూలు : జిల్లా వ్యాప్తంగా ఎడాపెడా కొత్త నిర్మాణాలు, లేఅవుట్లు తెరపైకి వస్తున్నాయి. అక్రమ లేఅవుట్ల, నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మరోసారి లేఅవుట్ క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్), బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్(బీపీఎస్)ను తీసుకొచ్చేందుకు సన్నద్ధం కావడంతో గుంపులో గోవింద అంటూ తెరచాటు అక్రమ నిర్మాణాలకు అక్రమార్కులు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అధికారికంగా ఈ పథకాలను ప్రకటించేలోగా ఈ అక్రమ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆయా వర్గాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ముందస్తు అనుమతుల్లేకుండా కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయి. కర్నూలు జిల్లా పరిధిలో కొత్తగా నిర్మాణాలు చేపట్టాలన్నా, లేఅవుట్లు వేయాలన్నా స్థానిక సంస్థల అనుమతి తప్పనిసరి. లేదంటే వీటిని అక్రమ నిర్మాణాలుగా పరిగణిస్తారు. వీటిని ఎవరైనా కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్లు జరగవు. బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేది తక్కువ. గతంలో కొందరు వ్యాపారులు చేసిన మోసాలకు కొనుగోలుదారులు ఇబ్బందులకు గురవ్వడాన్ని గుర్తించిన ప్రభుత్వం 2007లో మొదటిసారి బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ని ప్రవేశపెట్టింది. బీపీఎస్ కింద అప్పట్లో దాదాపు 8 వేలకుపైగా దరఖాస్తులొచ్చాయి. 4,600కుపైగా పరిష్కరించారు. 2013 మార్చి వరకు క్రమబద్ధీకరణ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. ఎల్ఆర్ఎస్ కింద వచ్చిన వెయ్యి దరఖాస్తుల్లో అప్పట్లో 50 శాతానికిపైగా పరిష్కారమయ్యాయి. పట్టణ ప్రణాళిక సూచించిన మేరకు తదుపరి సమాచారాన్ని అందించకపోవడంతో దాదాపు 500 దరఖాస్తులు వివిధ దశల్లో అపరిష్కృతంగా మిగిలాయి. మరోసారి బీపీఎస్, ఎల్ఆర్ఎస్ వచ్చే అవకాశం లేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పదేపదే ప్రకటించడంతో నగరం, గ్రామీణ జిల్లాలోని ముఖ్య ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు వేసేందుకు వ్యాపారులు సాహసించలేదు. కొనుగోలుదారుల్లోనూ చైతన్యం రావడంతో లేఅవుట్లకు డీటీసీపీ, అపార్ట్మెంట్లకు కర్నూలు కార్పొరేషన్/మున్సిపాలిటీ అనుమతి ఉందా? లేదా? అనేది నిర్ధారించుకున్నాకే రంగంలోకి దిగుతున్నారు. దీంతో రియల్టీ వ్యాపారులు కూడా అచితూచి వ్యవహరిస్తున్నారు. క్రమబద్ధీకరణ లక్ష్యంగా నిర్మాణాలు.. స్థానిక సంస్థలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ప్రభుత్వం మరోసారి బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో ఇదే మంచి తరుణంగా భావించి కొత్తగా అనేక నిర్మాణాలకు, లేఅవుట్లకు వ్యాపార వర్గాలు తెరతీస్తున్నాయి. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో గత నెల రోజుల వ్యవధిలో 50 నుంచి 100 వరకు అక్రమ నిర్మాణాలు జరిగినట్లు అధికారికవర్గాలు గుర్తించాయి. వీటిలో 70 శాతానికిపైగా ఉన్న పాత భవంతులపై అదనపు అంతస్తులు వేసినవే. ప్రణాళిక విభాగ క్షేత్రస్థాయి ఉద్యోగుల సాయంతో మూడో కంటికి తెలియకుండా నిర్మాణాలను పూర్తి చేశారు. వీటిని బీపీఎస్ కింద క్రమబద్ధీకరించుకోవాలన్నది ప్రధాన ఉద్దేశం. ఇప్పటికీ నగర పరిధిలోనూ, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో ప్రణాళిక విభాగ అధికారులతో అదనపు అంతస్తుల నిర్మాణం కోసం వ్యాపారులు సంప్రదింపులు జరుపుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా కొత్తగా 50 వరకు లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. కర్నూలు నగర పరిధిలోని శివార్లలోనూ, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ పట్టణ శివార్లలో వీటిని వేసినట్లు నిఘా, అమలు విభాగం తాజాగా గుర్తించినట్లు సమాచారం. వీటిని ప్లాట్ల కింద సాధ్యమైనంత వేగంగా విక్రయించి సొమ్ము చేసుకోవాలన్నది వ్యాపారుల ఉద్దేశం. నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలంటే వివిధ రుసుముల కింద భారీగా చెల్లించాలి. ప్రభుత్వ భూమి వంటివి ఇందులో కలిసి ఉంటే అధికారులు కొర్రీలు వేస్తారు. ప్రభుత్వం మరోసారి తీసుకొచ్చే ఎల్ఆర్ఎస్తో ఇలాంటి అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలన్నది వ్యాపారుల లక్ష్యం. నియంత్రించాల్సింది అధికారులే... అక్రమ భవనాల, లేఅవుట్ల నియంత్రణ అధికారుల చేతిలోనే ఉంది. త్వరలో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలు మళ్లీ ప్రవేశపెడతారనే ఉద్దేశంతో నిర్మాణాలు సాగిస్తున్న, తెరచాటు అక్రమ నిర్మాణాలను అధికారులే నిరోధించాలి. క్షేత్రస్థాయిలో జరిగే వ్యవహారాలపై దృష్టి సారిస్తే వీటిని అడ్డుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. లేనప్పుడు బీపీఎస్, ఎల్ఆర్ఎస్ లాంటి పథకాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా నిర్మాణాలు చేపట్టి క్రమబద్ధీకరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా కర్నూలు కార్పొరేషన్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వీటిపై దృష్టిసారిస్తే మేలు. -
వాయిదాల్లోనూ ‘క్రమబద్ధీకరణ’
మార్గదర్శకాలను సవరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు 500 గజాలపైన స్థలాలకుధరలో 75 శాతం చెల్లిస్తే చాలు డిసెంబర్ వరకు ఐదు సులభ వాయిదాల్లోనూ చెల్లించొచ్చు ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రాయితీ సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణలో భాగంగా స్థలం ధరను సులభంగా వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అంతేగాకుండా వివిధ కేటగిరీల్లో చెల్లించాల్సిన సొమ్ము శాతాన్ని కూడా భారీగా తగ్గిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పేదలకు ఉచిత క్రమబద్ధీకరణ సదుపాయాన్ని ఎప్పటిలాగే 125 గజాలకే పరిమితం చేసినా... స్వల్ప ఉపశమనం కల్పించారు. 126 గజాల నుంచి 150 గజాల్లోపు ఉన్న స్థలాలకు మురికివాడల్లోని పేదలు రిజిస్ట్రేషన్ ధరలో 10 శాతం, ఇతర ప్రాంతాల్లో 25 శాతం చెల్లించేలా మార్గదర్శకాల్లో మార్పులు చేశారు. ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని గత నెల 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పేదలకు ఉచిత క్రమబద్ధీకరణ నిమిత్తం జారీ చేసిన జీవో నం.58 కింద దరఖాస్తులు వెల్లువెత్తగా... రిజిస్ట్రేషన్ ధర చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ (జీవో.59)కు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. పట్టణాలు, నగరాల్లో భూముల రిజిస్ట్రేషన్ ధరలు మార్కెట్ ధరల కన్నా ఎక్కువగా ఉండడంతో.. రిజిస్ట్రేషన్ ధరను తగ్గించాలని ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీంతో క్రమబద్ధీకరణ ప్రక్రియను సమీక్షించిన ప్రభుత్వం... మార్గదర్శకాలను సవరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. భూములకు రిజిస్ట్రేషన్ ధరలో చెల్లించాల్సిన సొమ్ము శాతాన్ని తగ్గించడంతో పాటు సులభంగా వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించింది. అంతేగాకుండా ఒకేసారి సొమ్ము చెల్లించిన వారికి అదనంగా 5 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. తాజా ఉత్తర్వుల్లో ముఖ్యమైన అంశాలు.. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారికి స్థలాన్ని అప్పగిస్తూ తహసీల్దారు చేసే కన్వీనియెన్స్ డీడ్‌కు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యంతరకరం కాని ప్రభుత్వ భూములు, యూఎల్సీ పరిధిలోని మిగులు భూముల క్రమబద్ధీకరణకు మాత్రమే తాజా ఉత్తర్వులు వర్తిస్తాయి. యూఎల్సీ పరిధిలోని స్థలాల క్రమబద్ధీకరణకు వేరుగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం కల్పించిన క్రమబద్ధీకరణ సదుపాయాన్ని గడువులోగా వినియోగించుకోకుంటే... ఆయా స్థలాలను చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. నేటితో ముగియనున్న ‘ఉచిత’ గడువు.. నిరుపేదలు ఉచిత క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన గడువు శనివారంతో ముగియనుంది. ఇకపై గడువు పొడిగించే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఇక చెల్లింపు కేటగిరీలో దరఖాస్తులకు ఫిబ్రవరి 28 తేదీని చివరి గడువుగా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఇప్పటివరకు ఉచితం కేటగిరీలో క్రమబద్ధీకరణ కోసం 2.60 లక్షల దరఖాస్తులు రాగా... చెల్లింపు కేటగిరీల్లో 9,700 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులతో పాటు రిజిస్ట్రేషన్ ధర (25 శాతం) కింద రూ. 59 కోట్లు అందినట్లు పేర్కొన్నారు. సులభ వాయిదాలు ఇలా.. క్రమబద్ధీకరణకు దరఖాస్తుతో పాటు రిజిస్ట్రేషన్ ధరలో 25 శాతాన్ని చెల్లించాలి. అయితే ఈ మొత్తాన్ని కూడా రెండు వాయిదాల్లో (12.5 శాతం చొప్పున) చెల్లించేందుకు అవకాశం కల్పించారు. మిగతా 75 శాతం సొమ్మును మూడు సమాన వాయిదాల్లో (25 శాతం చొప్పున) కట్టాల్సి ఉంటుంది. -
పేదలకు ఉచితమే..
- 125 గజాల దాకా క్రమబద్ధీకరణ - రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న పేదలకు ఆయా స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతతో ఉందని రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆక్రమిత స్థల విస్తీర్ణం 125 గజాలకు మించినా దరఖాస్తుదారులు పేదలైతే వారికి 125 గజాల వరకు ఉచితంగానే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన స్థలం క్రమబద్ధీకరణకే నిర్దేశిత ధర మేరకు సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. కుటుంబ వార్షికాదాయం పట్టణాలు, నగరాల్లో రూ.2 లక్షల్లోపు ఉన్న వారందరినీ పేదలుగానే పరిగణిస్తామన్నారు. వీరంతా స్థానిక తహశీల్దారు నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుందన్నారు. అయితే భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో 59 కింద ప్రభుత్వం పేర్కొన్న రిజిస్ట్రేషన్ ధరను తగ్గించే యోచన లేదని మీనా స్పష్టం చేశారు. పేదలకు 125 గజాల వరకు స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరిస్తున్నందున దరఖాస్తుదారుల్లో ఎక్కువ శాతం మందిపై భారం లేదన్నారు. మధ్యతరగతి వర్గాల కోసమే 125 గజాల నుంచి 250 గజాల వరకు రిజిస్ట్రేషన్ ధరలో 50 శాతం రాయితీని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. 250 నుంచి 500 గజాల్లోపు స్థలంలో ఉంటున్న వారు స్థలం క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ ధరలో 75 శాతమే చెల్లించాలని, 500 గజాలకుపైగా ఆక్రమిత స్థలంలో ఉంటున్న ప్రజలను మధ్య తరగతివారీగా పరిగణించలేమన్నారు. 2 లక్షలకు చేరువైన దరఖాస్తులు.. క్రమబద్ధీకరణకు ఇప్పటివరకూ 1.89 లక్షల దరఖాస్తులు వచ్చాయని మీనా తెలిపారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి 1.17 లక్షల దరఖాస్తులు రాగా, అత్యల్పంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 255 దరఖాస్తులే వచ్చాయన్నారు. క్రమబద్ధీకరణ గడువు పెంచినందున మరో 3 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. కాగా, ప్రభుత్వ భూములతో పాటు ఆక్రమణలకు గురైన శ్మశాన స్థలాలు, మున్సిపల్ స్థలాలను కూడా క్రమబద్ధీకరించాలని నిర్ణయించినట్లు మీనా చెప్పారు. శిఖం భూములను ఆక్రమించుకొన్న వారికి కూడా ఆయా స్థలాలను క్రమబద్ధీకరించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఎంఎస్ మక్తా.. వంటి ప్రాంతాల్లో మూడు ద శాబ్దాలుగా హుస్సేన్ సాగర్ స్థలాన్ని ఆక్రమించుకొని ఎంతోమంది నివాసముంటున్నారని, వాటిని రెగ్యులరైజ్ చేయకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో శిఖం భూములను కూడా డీనోటిఫై చేసి క్రమబద్ధీకరించేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయన్నారు. క్రమబద్ధీకరణ గడువు పెంపు ఉత్తర్వులు జారీ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దరఖాస్తుల సమర్పణకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. 125 గజాల్లోపు స్థలాలను ఉచిత క్రమబద్ధీకరణ నిమిత్తం దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 31 వరకు, రిజిస్ట్రేషన్ ధర చెల్లించి వివిధ కేటగిరీల స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసేవారికి ఫిబ్రవరి 28 వరకు గడువు పొడిగిస్తూ జీవోఎంఎస్ నంబర్లు 5, 6 లతో వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. -
భూముల క్రమబద్ధీకరణ గడువు పెంచాలి: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ గడువు పెంచాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, 125 గజాలు, ఆ పైన ఆక్రమించుకుని ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉన్న ప్లాట్లను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని, గతంలో భూపోరాటాల సందర్భంగా పెట్టిన కేసులన్నింటిని ఎత్తేయాలని తీర్మానం ఆమోదించింది. ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం పలు తీర్మానాలు చేసింది. క్రమబద్ధీకరణ పేరుతో భూకబ్జాదారులు లాభపడకుండా చూడాలని, అక్రమ లేఅవుట్లు చేసి అమ్మినవారిని కఠినంగా శిక్షించాలని కోరింది. రాష్ట్రంలోని 338 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని, వ్యవసాయకూలీలు, పేదలకు కరువు భృతిని అందించాలని విజ్ఞప్తి చేసింది. మార్చి 7-10 తేదీల్లో ఖమ్మంలో జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభ ల డాక్యుమెంట్‌లోని అంశాలపై చర్చించి ఈ సమావేశం ఆమోదించింది. -
కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలి
అసెంబ్లీలో విపక్షం డిమాండ్ ఐకేపీ, అంగన్వాడీ కార్మికులపై వాయిదా తీర్మానం.. తిరస్కరించిన స్పీకర్ మంత్రి జవాబు కోసం వైఎస్సార్సీపీ పట్టు సాక్షి, హైదరాబాద్: ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ), అంగన్వాడీ కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై శనివారం శాసన సభలో దుమారం రేగింది. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం చర్చించకపోయినా సంబంధిత మంత్రితో సమాధానం చెప్పించాలని వైఎస్సార్ సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇందుకు కూడా స్పీకర్ అనుమతించకపోవడంతో సభ్యులు ఆయన పోడియంను చుట్టుముట్టి చర్చ జరగాలని, కార్మికులకు న్యాయం చేయాలని, మంత్రి సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ.. సమస్య తీవ్రమైనదేగానీ అత్యవసరంగా చర్చించాల్సినది కాదని, మరో రూపంలో వస్తే చర్చకు అనుమతిస్తానని చెప్పారు. బాబు వస్తాడు, జాబు వస్తుందని చెప్పి... ఈ దశలో జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకుని.. ‘‘నాలుగు రోజులుగా వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు నిరాహార దీక్ష చేస్తున్నారు. 15 వేల మంది ఏపీ విద్యుత్ సంస్థ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీలు, ఐకేపీ సిబ్బంది నిరాహార దీక్షలో ఉన్నారు. బాబు వస్తాడు, జాబు వస్తుందని నమ్మి ఓట్లేస్తే ఈవేళ ఉన్న వాటిని తీసేస్తున్నారు’’ అని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేయాలని, వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం త్వరలో నివేదిక ఇస్తుందని, సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సర్కారు తీరు దారుణం : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాంట్రాక్టు కార్మికుల పట్ల చంద్రబాబు సర్కారు తీరు దారుణంగా ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. శనివారం పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సర్వేశ్వరరావు, రాజన్న దొర, గిడ్డి ఈశ్వరిలు మీడియా పాయింట్లో మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులకు నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదని చెప్పారు. వైఎస్ ఇచ్చిన కాంట్రాక్టు ఉద్యోగాల్ని ఈ ప్రభుత్వం మానవత్వం లేకుండా రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. వీరి సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వం కనీసం ఓ ప్రకటన చేయాలని కోరినా తిరస్కరించారన్నారు. బాబు వచ్చిన తర్వాత జాబ్‌లు పోయే పరిస్థితి నెలకొందని తెలిపారు. -
కాసుల వేట!
క్రమబద్ధీకరణతో రూ.6,000 కోట్ల రాబడే లక్ష్యం! సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్సీ) స్థలాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. యూఎల్సీ భూముల వివరాలను గురువారంలోపు అఖిలపక్ష పార్టీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎల్సీ స్థలాల లెక్క తేల్చిన సర్కారు.. నివేదికను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం చేస్తున్న సర్కారు.. యూఎల్సీ స్థలాలను కూడా రెగ్యులరైజ్ చేయాలని యోచిస్తోంది. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం జరిగిన రాజకీయపార్టీల ప్రతినిధుల భేటీలో స్పష్టం చేసింది. అయితే, యూఎల్సీ స్థలాలపై స్పష్టమైన సమాచారం కావాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే సర్వే నంబర్లవారీగా యూఎల్సీ భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. ఇటీవల క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే ఆధారంగా భూమి స్థితిగతులు, ఆక్రమణలు, విస్తీర్ణం తదితర అంశాలను పొందుపరుస్తూ నివేదిక సమర్పించింది. యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణపై ఈనెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. రెగ్యులరైజ్‌తో భారీ రాబడి అంచనా యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణతో సుమారు రూ.6,000కోట్లు సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జిల్లాలోని 11 పట్టణ మండలా ల్లో 3,452.25 ఎకరాల యూఎల్సీ భూములుండగా, దీంట్లో 1,369.19 ఎకరాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. వివాదరహితంగా ఉన్న 2,083.06 ఎకరాల భూములే ప్రస్తుతం క్రమబద్ధీకరణకు అనువుగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా శేరిలింగంపల్లిలోని అయ్యప్ప గురుకుల్ ట్రస్ట్ భూ ములున్నాయి. వీటిని క్రమబద్ధీకరించడం ద్వారానే భారీగా నిధులు సమీకరించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్థల యాజ మాన్య హక్కుల కోసం ఒకవైపు ట్రస్ట్, దేవాదాయ, యూఎల్సీ విభాగం కోర్టును ఆశ్రయించాయి. యూఎల్సీ, దే వాదాయ శాఖలను కేసులు ఉపసంహరించుకునేలా చేసి.. ట్రస్ట్‌కు కొంత మొత్తాన్ని కేటాయించడం ద్వారా క్రమబద్ధీకరణకు మార్గం సుగమం చేసుకోవాలని ప్రభుత్వం అనుకుంటోంది. కనీస ధరపై కసరత్తు! యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకర ణకు నిర్ధేశించే ధరపై ఏకాభిప్రాయం కుదరడంలేదు. ప్రస్తుతం కనీస ధరనే పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తుండగా.. అది అసంబద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల బహిరంగ మార్కెట్ ధరకంటే కూడా రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉన్నందున.. ప్రస్తుత విలువను ప్రామాణికంగా తీసుకోవడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ధరను నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో 2008 నాటి కనీస ధర మేరకే క్రమబద్ధీకరించడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయానికి అనుగుణంగా ధరల నిర్ధారణలో మార్పులు చేర్పులు జరిగే అవకాశంలేకపోలేదని యంత్రాంగం అంటోంది. -
అక్రమార్కులపై వేటు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: క్రమబద్ధీకరణ ముసుగులో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు యత్నించిన వ్యవహారంలో రెవెన్యూ అధికారులపై వేటు వేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ల్యాండ్ మాఫియాతో కుమ్మక్కై ఈ తతంగం నడిపించిన తహసీల్దార్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించింది. ఉప్పల్ మండలం కొత్తపేట సర్వే నం.135లో దాదాపు మూడెకరాల భూమిని 166 జీఓ కింద క్రమబద్ధీకరించేందుకు కొందరు రెవెన్యూ అధికారులు పావులు కదిపారు. అక్రమార్కులతో మిలాఖత్ అయి.. మొత్తం భూమికే ఎసరు తెచ్చారు. కంచే చేను మేసినట్లు ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన యంత్రాంగమే వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ఎత్తుగడ వేయడంతో నివ్వెరపోయిన కలెక్టర్ శ్రీధర్.. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ సహా కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ట్లు తెలిసింది. మాజీ తహసీల్దార్ కనుసన్నల్లోనే ఈ అక్రమాలకు తెరలేచిందని మల్కాజిగిరి ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని మంగళవారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)కు లేఖ రాశారు. అంతేకాకుండా స్థానిక సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్పై కూడా వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. వాస్తవానికి ఈ వ్యవహారంలో అప్పటి ఆర్డీఓ సహా మరో ఇద్దరు తహసీల్దార్ల పాత్ర ఉన్నప్పటికీ, ఈ తతంగంలో మాజీ తహసీల్దార్ ముఖ్య భూమిక పోషించినట్లు కలెక్టర్ గుర్తించారు. 166 జీఓకు వక్రభాష్యం చెబుతూ ప్రభుత్వ భూమిని ముక్కలుగా విడగొట్టి దరఖాస్తులు సమర్పించడంలో కబ్జాదారులకు సహకరించినట్లు పసిగట్టారు. దాంతో ఆయనపై చర్యలకు సిఫార్సు చేశారు. ఇదిలావుండగా.. క్షేత్రస్థాయిలో పరి శీలించకుండా అడ్డగోలుగా ప్రతిపాదనలను జిల్లా స్థాయి కమిటీకి నివేదించి న మరోఇద్దరు అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని జిల్లా యంత్రాం గం నిర్ణయించింది. గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ కూడా ఈ భూ బాగోతంలో పాలుపంచుకున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించినందున.. వీరి మెడకూ ఉచ్చు బిగియనుంది. ఈ తతంగంలో వ్యూ హాత్మకంగా వ్యవహరించిన ఆర్డీఓకు ప్రభుత్వ ఆశీస్సులు ఉండడంతో చర్యలపై అధికారులు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇదిలావుండగా.. 135 సర్వేనంబర్‌లో 166 జీఓ కింద దరఖాస్తు చేసుకున్న బోగస్ దరఖాస్తులన్నింటినీ తిరస్కరిస్తూ ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక సమర్పించారు.