వాషింగ్టన్: కృత్రిమ మేధను సరిగా వాడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ముప్పు నుంచి బయటపడాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధ వల్ల తలెత్తే దుష్ప్రభావాల గురించి తలచుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో పిచాయ్ చెప్పారు.
ఈ టెక్నాలజీ ప్రయోజనకరమైన రీతిలో ఉపయోగించుకొనేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఐతో అసత్య సమాచారాన్ని సృష్టించే వీలుందని, ఇది సమాజానికి ప్రమాదకరమని అన్నారు. అణ్వాయుధాలను నియంత్రిస్తున్న తరహాలోనే ఏఐని నియంత్రించడానికి ఒక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment