న్యూఢిల్లీ: దేశీయంగా చాలా మటుకు పెద్ద కంపెనీలు (1,000 మందికి పైగా ఉద్యోగులున్నవి) కృత్రిమ మేథను (ఏఐ) వినియోగిస్తున్నాయి. టెక్ దిగ్గజం ఐబీఎం నిర్వహించిన సర్వేలో పాల్గొ్న్న వాటిల్లో దాదాపు 59 శాతం సంస్థలు ఏఐని వినియోగిస్తున్నట్లు తెలిపాయి. ఐబీఎం గ్లోబల్ ఏఐ వినియోగ సూచీ 2023 ప్రకారం ఇప్పటికే ఏఐ వినియోగిస్తున్న కంపెనీల్లో 74 శాతం సంస్థలు గడిచిన 24 నెలల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు, ఉద్యోగులకు శిక్షణపై గణనీయంగా పెట్టుబడులు పెంచాయి.
ఏఐ వినియోగానికి సంబంధించి సరైన నైపుణ్యాలున్న ఉద్యోగులు దొరకడం, నైతికతపరమైన అంశాలు సవాళ్లుగా ఉంటున్నాయి. వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐ టెక్నాలజీలను ఉపయోగించుకోవడంలో ఇవే ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ‘భారతీయ సంస్థల్లో ఏఐ వినియోగం, దానిపై పెట్టుబడులు పెట్టడం తద్వారా సానుకూల ప్రయోజనాలు పొందుతూ ఉండటం ఒక శుభ సంకేతం.
ఇప్పటికీ కాస్త సందేహిస్తున్న చాలా మటుకు వ్యాపారాలు ఇకనైనా ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి‘ అని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ తెలిపారు. కృత్రిమ మేథ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందాలంటే డేటా, ఏఐ గవర్నెన్స్ కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. గవర్నెన్స్ సాధనాలను ఉపయోగించకపోతే ఏఐ వల్ల కంపెనీలకు డేటా గోప్యత, లీగల్‌పరమైన సవాళ్లు, నైతికతపరమైన సందిగ్ధత వంటి సమస్యలు ఎదురు కావచ్చని సందీప్ పటేల్ వివరించారు. భారత్, ఆ్రస్టేలియా, కెనడా తదితర దేశాలకు చెందిన 8,584 మంది ఐటీ ప్రొఫెషనల్స్‌పై ఐబీఎం ఈ సర్వే నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment