సుందర్ పిచాయ్ (Sundar Pichai).. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. సాధారణ కుటుంబం నుంచి ప్రపంచమే గుర్తించదగిన స్థాయికి ఎదిగాడంటే దాని వెనుక ఆయన కృషి అనన్య సామాన్యమనే చెప్పాలి. అంతే కాకుండా ఈ రోజు ఆ స్థాయిలో ఉండటానికి పిచాయ్ భార్య అంజలి కూడా కారణమని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సుందర్ పిచాయ్, అంజలి ఇద్దరూ కూడా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకునే రోజుల్లో క్లాస్మేట్స్. దీంతో వారిద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తరువాత పిచాయ్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయాడు, అంజలి మాత్రం ఇండియాలోనే ఉద్యోగంలో చేరింది.
గూగుల్ సీఈఓగా..
ఎంత దూరంలో ఉన్నా ప్రేమకు పెద్ద దూరం కాదన్నట్లు.. చివరికి వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కిరణ్, కావ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం గూగుల్ సీఈఓగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.
చాలామందికి సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా మాత్రమే తెలుసు, కానీ ఒకానొక సందర్భంలో ఆయన గూగుల్ కంపెనీ వదిలేయాలనుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా ఉన్న సమయంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ పోస్ట్ ఆఫర్ చేసింది, ట్విటర్ కంపెనీ కూడా కీలకమైన జాబ్ ఇస్తామని ఆఫర్ చేసింది.
గూగుల్ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగం ఉన్న సమయంలో వచ్చిన ఆఫర్స్ స్వీకరించాలనుకుని ఆ జాబ్ వదిలేయాలనుకున్నాడు, ఈ విషయాన్ని తన భార్యకు చెప్పినప్పుడు.. ఆమె వద్దని వారిస్తూ.. గూగుల్ సంస్థలోనే మంచి ఫ్యూచర్ ఉందని సలహా ఇచ్చింది. ఆ సలహా తీసుకున్న పిచాయ్.. ఆ తరువాత కంపెనీ సీఈఓగా ఎంపికయ్యాడు.
ఇదీ చదవండి: మొన్న విప్రో.. నేడు హెచ్‌సీఎల్ - ఎందుకిలా?
రోజుకు రూ. 5 కోట్లు..
ఈ రోజు గూగుల్ కంపెనీ సీఈఓగా రోజుకు రూ. 5 కోట్లు ప్యాకేజీ తీసుకుంటున్నాడు అంటే.. దానికి కారణం భార్య ఇచ్చిన సలహా పాటించడమనే చెబుతున్నారు. అర్థం చేసుకునే భార్య ఉంటే.. మగవారి జీవితంలో సక్సెస్ వస్తుందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.
Comments
Please login to add a commentAdd a comment