Published
Thu, Jul 28 2016 11:00 PM
| Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
కాంట్రాక్ట్ జేఎల్‌ఎంల క్రమబద్దీకరణ
హన్మకొండ : రాష్ట్రంలోని రెండు డిస్కంలలో కాంట్రాక్ట్ జూనియర్ లైన్‌మెన్‌లను క్రమబద్దీకరిస్తూ ఆయా డిస్కంల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్), దక్షిణ మండల విద్యుత్ పంపినీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్)లో 1175 మంది జూనియర్ లైన్‌మెన్‌లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇందులో టీఎస్ ఎన్పీడీసీఎల్‌లో 855 మంది, టీఎస్ ఎస్పీడీసీఎల్‌లో 320 మంది ఉన్నారు.
వీరి సర్వీసు అక్టోబర్ 3 2008 సంవత్సరం నుంచి రెగ్యులర్ కానుంది. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించిన వారు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి రెగ్యులర్ అవుతారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో మొదటగా విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న జూనియల్ లైన్‌మెన్‌లను క్రమబద్దీకరించింది.