TS Npdcl
-
జేఎల్ నియామకాల్లో అక్రమాలు
సాక్షి, హన్మకొండ(వరంగల్) : టీఎస్ ఎన్పీడీసీఎల్ ద్వారా చేపట్టిన నియామకాల్లో అధికారులు అక్రమాలకు తెరలేపారు. కొంతకాలంగా ఎన్పీడీసీఎల్లో చేపట్టిన ప్రతీ నియామక ప్రక్రి య వివాదాస్పదమవుతోంది. ఓ వైపు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న తమ దారి తమ దే అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. యాజమాన్యం అధికారులంటే ఒక తీరు.. ఉద్యోగులంటే మరో తీరుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు ఎంత పెద్ద తప్పు చేసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుం డగా.. ఉద్యోగులు మాత్రం చిన్న పొరపాటు చేసినా పెద్ద పెద్ద శిక్షలు విధిస్తున్నారని ఉద్యోగ సం ఘాలు ఆరోపిస్తున్నాయి. అయినా అధికారులు మాత్రం తమ కనుసన్నల్లో అక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కఠినంగా ఉన్నామని చెబుతూనే.... జూనియర్ లైన్‌మన్ పోస్టుల భర్తీలో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని అభ్యర్థులు లేవనెత్తుతున్న సందేహాలు నిజమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు పోల్ టెస్ట్ పై కఠినంగా వ్యవహరిస్తున్నారని అనిపించుకుంటూనే.. ఇదే అదునుగా అక్రమాలకు తెరలేపారని అభ్యర్థులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పోల్ టెస్ట్‌లో అసలు అభ్యర్థికి బదులుగా మరో వ్యక్తిని అధికారులు స్తంభం ఎక్కించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని పాత ఐదు సర్కిళ్ల పరిధిలో రెండో విడత పోల్ టెస్ట్uమొదటిపేజీ తరువాయి నిర్వహించారు. పూర్వ అదిలాబాద్ సర్కిల్ పరిధిలోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. జూన్ 20న జరిగిన పోల్ టెస్ట్‌లో అసలు అభ్యర్థికి బదులు మరో అభ్యర్థి స్తంభం పరీక్షకు హాజరయ్యారు. వరంగల్ సర్కిల్లో ఓ కాంటాక్టర్ వద్ద పని చేస్తున్న కార్మికుడు స్తంభాలు ఎక్కడంలో నిపుణుడు. దీంతో రాత పరీక్షలో అర్హత సాధించి స్తంభం పరీక్షకు ఎంపికైన ఓ అభ్యర్థి.. ఇక్కడి నుంచి నిష్ణాతుడిని తీసుకెళ్లి స్తంభం ఎక్కించాడు. 2,553 పోస్టుల భర్తీకి.. తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ మండలి(టీఎస్ ఎన్పీడీసీఎల్) క్షేత్ర స్థాయిలో వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు ఖాళీగా ఉన్న జూ నియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. జిల్లాల పునర్విభజన జరిగినా పూర్వ జిల్లాల వారీగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామబాద్, అది లాబాద్ సర్కిళ్ల వారీగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో 2,553 జూనియర్ లైన్మెన్ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించింది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పూర్వ విద్యుత్ సర్కిళ్ల వారీగా జనవరిలో మొదటి విడత పోల్ టెస్ట్ (స్తంభం ఎక్కే పరీక్ష) నిర్వహించారు. ఈ మేరకు 2,553 పోస్టులకుగాను అంతే సంఖ్యలో అభ్యర్థులను ఆహ్వానించగా 1,,222 మంది అభ్యర్థులు పోల్ టెస్ట్‌లో ఉత్తీ ర్ణత సాధించారని సమాచారం. అయితే, ఎందరు అర్హత సాధించారనేది అధికారికంగా ప్రకటించలేదు. ఈ పోల్ టెస్ట్ నిర్వహణ, నిర్వహణలో అక్రమాలు జరిగాయని, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, అర్హత సాధించినా అనర్హత వే టు వేశారని అభ్యర్థులు, ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఓ కమిటీని నియమించారు. ఈ నిపుణుల కమిటీ బాధ్యులు పరీ క్షకు సంబంధించిన వీడియో పుటేజీ ద్వారా అభ్యర్థుల ఎంపికకు తుది రూపు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పరిశీలించి అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసినా బయటకు వెల్లడించలేదు. మరో విడత నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీల మేరకు మొదటి విడత పరీక్షలో అభ్యర్థులు ఎంపిక కాలేదు. దీంతో రెండో విడతగా మరికొందరిని స్తంభం పరీక్షకు పిలిచారు. రెండో విడత పరీక్షలోనూమాలు జరిగాయనేరోపణలు వచ్చాయి. అదిలాబాద్‌లో జరిగిన పోల్ టెస్ట్‌లో చివరకు రాత పరీ„ýక్షలో సాధించిన అభ్యర్థి తనకు బదులు స్తంభం పరీక్షకు మరో అభ్యర్థిని తీసుకువచ్చారని సహచర అభ్యర్థులు గుర్తించారు. జూన్ 20న జరిగిన స్తంభం పరీక్షలో 104 సీరియర్ నంర్గా ఉన్న శ్రావణ్‌కుమార్ స్థానంలో వరంగల్‌లోని ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న బి.నవీన్ పరీక్షలో పాల్గొన్నాడని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరిగిందని అభ్యర్థుల వాదన. ఓ వైపు పోల్ టెస్ట్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతూనే చాటుగా అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. టీఎస్ ఇకనైనా ఎన్పీడీసీఎల్ యాజమాన్యం స్పందించి వీడియో చిత్రీకరణను పరీక్షించి పోల్ టెస్ట్ నిర్వహంచిన, అక్రమాలకు తెర లేపిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. -
వేతనం లేని చైర్మన్
ఎన్పీడీసీఎల్ సీఎండీకి రెండేళ్లుగా వేతనం నిర్ణయించని ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్) అత్యుతన్నత అధికారికి రెండేళ్లుగా వేతనం లేదు. ఎన్పీడీసీఎల్ చైర్మన్(సీఎండీ) కి నెలవారీగా ఎంత వేతనం చెల్లించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు దాటింది. ఇప్పటికీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వేతనం ఎంతనేది ఇప్పటికీ నిర్ణయించలేదు. తెలంగాణలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. ఎన్పీడీసీఎల్ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని కరెంటు సరఫరా ప్రక్రియను నిర్వహిస్తోంది. 5,612 గ్రామాల్లో వ్యవసాయ, గృహ అవసరాలకు కరెంటు సరఫరా చేస్తోం ది. ఈ సంస్థ పరిధిలో 51.21 లక్షల వ్యవసా య, గృహ, పారి శ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. అన్ని స్థాయిల ఉద్యోగులు కలిపి 8,249 మంది ఎన్పీడీసీఎల్లో ఉన్నారు. వేల కోట్ల వార్షిక టర్నోవరుతో దశాబ్దాలుగా సంస్థ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఆగస్టు 5న ఎన్పీడీసీఎల్ సీఎండీగా కె.వెంకటనారాయణ నియమితులయ్యారు. సీఎండీ నియామకంపై ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వేతనం ఎంత అనేది నిర్ణయించలేదు. దీంతో నియామకమై రెండేళ్లు గడిచినా సీఎండీ వేతనం తీసుకోవడం లేదు. ఇదే విషయంపై పలుసార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఎలాంటి స్పందనా రాలేదని ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. -
ఎన్పీడీసీఎల్లో డైరెక్టర్లు ఖాళీ
ఎన్పీడీసీఎల్లో ఖాళీల సమస్య ఇప్పటికే రెండు పోస్టులు ఖాళీ రేపటితో మరో డైరెక్టరు పోస్టు ఏడాదిగా పట్టించుకోని ప్రభుత్వం విద్యుత్ పంపిణీ వ్యవస్థపై ప్రభావం కంపెనీలో లోపించిన పరిపాలన సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి(టీఎస్ఎన్పీడీసీఎల్)లో ఉన్నత స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త విధానాల అమలు, ప్రణాళిక రూపకల్పనపై ఈ ప్రభావం చూపుతోంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను టీఎస్ ఎన్పీడీసీఎల్ నిర్వహిస్తోంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో 5,612 గ్రామాలు ఉన్నాయి. వరంగల్ కేంద్రంగా పనిచేసే ఎన్పీడీసీఎల్లో చైర్మన్‌తోపాటు నలుగు డైరెక్టర్లు ఉంటారు. ఆపరేషన్స్, ఫైనాన్స్, ప్రాజెక్టు, హెచ్ఆర్డీ విభాగాలకు అధిపతులుగా డైరెక్టర్లు వ్యవహరిస్తున్నారు. కీలకమైన ఫైనాన్స్, హెచ్ఆర్డీ విభాగాలకు డైరెక్టర్లు లేరు. టీఎస్ఎన్పీడీసీఎల్ మానవ వనరుల విభాగం(హెచ్ఆర్డీ) డైరెక్టర్ పోస్టు 2015 ఆగస్టు 1న ఖాళీ అయ్యింది. ఆర్థిక విభాగం డైరెక్టర్ సుదర్శన్ పదవీకాలం అదే ఏడాది ఆగస్టు 6తో ముగిసింది. ఈ రెండు డైరెక్టర్లు పోస్టులు ఖాళీగా ఉండగా... ఈనెల(జూలై) 31తో ప్రాజెక్టుల విభాగం పోస్టు ఖాళీ అవుతోంది. దాదాపు ఏడాదిగా రెండు డైరెక్టరు పోస్టులు ఖాళీగానే ఉండడంతో పరిపాలనపరమైన అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మరో పోస్టు ఖాళీ అవుతుండడంతో ఈ ఇబ్బందులు మరింత పెరగనున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలో కీలకమైన పోస్టులు ఖాళీ అవుతున్నా ప్రభుత్వం నియామకాలపై దృష్టి పెట్టడంలేదు. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) నిబంధనల ప్రకారం ఎన్పీడీసీఎల్లో డైరెక్టర్ కాలపరిమితి మొదట ఐదేళ్లు ఉంటుంది. ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యాక కొనసాగింపునకు అవకాశం ఉంటుంది. 70 ఏళ్ల గరిష్ట వయోపరిమితి మించని వారినే టీఎస్ఎన్పీడీసీఎల్లో డైరెక్టరుగా నియమించాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పాటైన కొన్ని నెలల వరకు టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీగా ఐఏఎస్ అధికారి కార్తికేయమిశ్రా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్)లో డైరక్టర్‌గా పనిచేసిన కె.వెంకటనారాయణను రాష్ట్ర ప్రభుత్వం కార్తికేయమిశ్రా స్థానంలో సీఎండీగా 2014 ఆగస్టులో నియమించింది. ఖాళీ అవుతున్న డైరెక్టరు పోస్టులను మాత్రం భర్తీ చేయడంలేదు. -
కాంట్రాక్ట్ జేఎల్‌ఎంల క్రమబద్దీకరణ
హన్మకొండ : రాష్ట్రంలోని రెండు డిస్కంలలో కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్లను క్రమబద్దీకరిస్తూ ఆయా డిస్కంల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్), దక్షిణ మండల విద్యుత్ పంపినీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్)లో 1175 మంది జూనియర్ లైన్మెన్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇందులో టీఎస్ ఎన్పీడీసీఎల్లో 855 మంది, టీఎస్ ఎస్పీడీసీఎల్లో 320 మంది ఉన్నారు. వీరి సర్వీసు అక్టోబర్ 3 2008 సంవత్సరం నుంచి రెగ్యులర్ కానుంది. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించిన వారు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి రెగ్యులర్ అవుతారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో మొదటగా విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న జూనియల్ లైన్మెన్లను క్రమబద్దీకరించింది. -
బాధ్యులు ఎవరు
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఇప్పటికే నష్టాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్)ను కొత్త మీటర్ల కొనుగోలు వ్యవహారం మరింత దెబ్బతీస్తోంది. గృహ వినియోగదారుల కోసం కొనుగోలు చేసిన ఈ రకం మీటర్లలోని లోపాలతో బిల్లు వసూలులో భారీగా తేడా వచ్చే పరిస్థితి నెలకొంది. టెలివిజన్(టీవీ) రిమోట్‌తో కరెంట్ రీడింగ్‌ను నిలిపివేసేలా తయారైన విజన్‌టెక్ మీటర్ల వ్యవహారం ఎన్పీడీసీఎల్లో సంచలనంగా మారింది. నిబంధనల ప్రకారమే ఈ మీటర్లను కొనుగోలు చేశారా... అవసరమైన పరీక్షలు, తనిఖీలు పూర్తి చేశారా.. అనే కోణంలో విచారణ జరపాలనే డిమాండ్ సంస్థలోని ఉద్యోగుల నుంచి వస్తోంది. లోపాలు కలిగిన మీటర్లు లక్షల సంఖ్యలో వినియోగదారులకు సరఫరా జరిగేవరకు ఉదాసీనంగా వ్యవహరించిన అధికారుల తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంస్థకు భారీగా ఆర్థిక నష్టం తెచ్చే మీటర్ల కొనుగోలు బాధ్యులు ఎవరు... వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఎన్పీడీసీఎల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్పీడీసీఎల్.. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో విద్యుత్ సరఫరాను నిర్వహిస్తున్నది. ఇళ్లకు కొత్త కనెక్షన్లతోపాటు మీటర్ల కాలిపోయినప్పుడు, సాంకేతిక లోపాలు ఏర్పడినప్పుడు కొత్త మీటర్లు అమర్చుతారు. ఎన్పీడీసీఎల్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ విధానంలో టెండర్లు పిలిచి, కంపెనీలతో ఒప్పందం చేసుకుని మీటర్లను సేకరిస్తుంది. ఇటీవ నిర్వహించిన టెండర్లలో... విజన్‌టెక్, నైనా పవర్, డెసిబల్, జీనస్ కంపెనీలను మీటర్ల సరఫరా కోసం ఎన్పీడీసీఎల్ ఎంపిక చేసింది. విజన్‌టెక్ 1.40 లక్షలు, నైనా పవర్ 1.90 లక్షలు, డెసిబల్ 55 వేలు, జీనస్ 75 వేలు కరెంటు మీటర్లను సరఫరా చేశాయి. ఒక్కో మీటరుకు రూ.747 రూపాయల చొప్పున కొనుగోలు చేసిన విజన్‌టెక్ కంపెనీ మీటర్లు ఇప్పుడు ఎన్పీడీసీఎల్కు తలనొప్పిగా మారాయి. రూ.10.45 కోట్లతో కొనుగోలు చేసిన ఈ మీటర్లు... టీవీ రిమోట్‌తో రీడింగ్ ఆగిపోతున్నాయి. ఈ విషయం ఇప్పటికే అధికారులకు, పలువురు వినియోగదారులకు తెలిసింది. దీంతో బిల్లు రూపంలో వచ్చే మొత్తంలో తేడా ఉంటోంది. ఇకముందు ఈ తేడా ఇంకా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ మీటర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చే ముందు బెంగళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చీ ఇనిస్టిట్యూట్(సీపీఆర్ఐ)కు, చెన్నైలోని ఎలక్ట్రానిక్ టెస్ట్ డెవలప్‌సెంటర్(ఈటీడీసీ)కి పంపిస్తారు. అక్కడి పరీక్షల్లో ఆమోదం పొందిన కంపెనీలనే కొనుగోలు చేస్తారు. ఎన్పీడీసీఎల్ కొనుగోలు చేసిన విజన్‌టెక్ మీటర్లను పరీక్షలకు పంపించారా లేదా అనేది సందేహంగా మారింది. ప్రఖ్యాత సంస్థల్లో పరీక్షలు నిర్వహించి ఆమోదం పొందితే రిమోట్‌తో రీడింగ్ ఎలా ఆగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజన్‌టెక్ మీటర్ల కొనుగోలు వ్యవహారంపై ఉన్నతాధికారుల నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.