junior line men
-
అధికారుల కనుసన్నల్లోనే...
సాక్షి, హన్మకొండ: అధికారుల కన్నుసన్నల్లోనే ఎన్పీడీసీఎల్ పరిధిలో చేపట్టిన పోల్ టెస్ట్(స్తంభం పరీక్ష)లో అక్రమాలు జరిగినట్లు తేటతెల్లమవుతోంది. లైన్మెన్ల ఎంపికకు నిర్వహించే పరీక్షలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకుని అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోం ది. అభ్యర్థులను గుర్తించడానికి ప్రత్యామ్నాయ అవకాశం ఉన్నా అదేమి పట్టించుకోకుండా తమ అనుయాయులు చెప్పిన వారిని పరీక్షలో పాస్ చేసేందుకు కొత్త ఎత్తుగడలు వేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాల్‌టికెట్ లేకపోతే.. ఎన్పీడీసీఎల్ పరిధిలో జూనియర్ లైన్మెన్ల నియామకానికి గత నెలలో పోల్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాల్‌టికెట్లు జారీ చేయగా... అవి లేని పరిస్థితుల్లోనూ అభ్యర్థులను పరీక్షకు అనుమతించేందుకు ప్రభుత్వం అనుమతించింది. హాల్‌టికెట్ ఉంటే దానిపై ఉన్న ఫొటో ఆధారంగా పరీక్ష నిర్వహించాలి. ఒకవేళ లేకపోతే అఫిడవిట్ ఆధారంగా పోల్ టెస్ట్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఏదైనా తప్పు జరిగితే తమదే బాధ్యత అంటూ అభ్యర్థుల నుంచి అఫిడపిట్లు స్వీకరించి పోల్ టెస్ట్‌కు అనుమతించారు. దీనిని ఆసరాగా చేసుకున్న అధికారులు అక్రమాలకు తెరలేపారు. స్తంభం ఎక్కడంలో నిపుణులను తీసుకువచ్చి అసలు అభ్యర్థులకు బదులు స్థంభం ఎక్కించారు. ఈక్రమంలో నకిలీలను గుర్తించేందుకు అవకాశం ఉన్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా తంతు ముగించారు. నకిలీలకు అవకాశమిచ్చినా అధికారులు ఎక్కడ కూడా చిక్కకుండా అభ్యర్థులే తప్పుగా తేల్చేలా అఫిడవిట్‌ను అవకాశంగా తీసుకోవడం గమనార్హం. ఉద్యోగం దక్కించుకోవాలన్న తపన పోల్ టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులను గుర్తు పట్టేందుకు కాల్ లెటర్‌తో పాటు రాత పరీక్షకు హాజరైన హాల్‌టికెట్‌ను వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. ఈ మేరకు పిలుపు అందుకున్న అభ్యర్థులు పలువురు ఎలాగైనా ఉద్యోగం దక్కించుకోవాలనే భావనతో హాల్ టికెట్ పోయిందని చెప్పారు. దీనికి కొందరు అధికారులు సహకరించడంతో వారి పని సులువైంది. ఈ మేరకు అఫిడఫిట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. పొరపాటు చేస్తున్నామని తెలిసిన అధికారులు తాము చిక్కుకోకుండా ఉండేందుకు అభ్యర్థుల చేతిని వారి నెత్తిపైనే పెట్టారు. అయితే, ఎన్పీడీసీఎల్ పరిధిలో నిర్వహించిన పోల్ టెస్ట్‌లో అభ్యర్థులను గుర్తించడానికి హాల్ టికెట్లు పరిశీలించడంతో పాటు తమ వద్ద ఉన్న దరఖాస్తులోని ఫోటోలతో సరి చూసుకున్నారు. అలాగే, అభ్యర్థి సంతకాన్ని కూడా సరిపోల్చుకున్నారు. ఇదంతా పాత నాలుగు సర్కిళ్లలో సాఫీగానే సాగినా ఆదిలాబాద్ సర్కిల్లో ఇవేమి పట్టించుకోకుండా తాము ఎంచుకున్న మార్గమే సరైన మార్గమంటూ అక్రమాలకు పాల్పడ్డారని అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోల్ టెస్ట్‌లో అసలు అభ్యర్థికి వరంగల్ సర్కిల్లో ఓ కాంటాక్టర్ వద్ద పని చేస్తూ స్తంభాలు ఎక్కడంలో మంచి పేరున్న వ్యక్తిని రంగంలోకి దింపారు. జూన్ 20న జరిగిన స్తంభం పరీక్షలో 104 సీరియర్ నంబర్‌గా ఉన్న శ్రావణ్‌కుమార్ స్థానంలో వరంగల్‌లోని ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న బి.నవీన్ పాల్గొన్నారని ఆరోపిస్తున్న మిగతా అభ్యర్థులు.. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తున్నారు. -
కాంట్రాక్ట్ జేఎల్‌ఎంల క్రమబద్దీకరణ
హన్మకొండ : రాష్ట్రంలోని రెండు డిస్కంలలో కాంట్రాక్ట్ జూనియర్ లైన్మెన్లను క్రమబద్దీకరిస్తూ ఆయా డిస్కంల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేశాయి. తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్), దక్షిణ మండల విద్యుత్ పంపినీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్)లో 1175 మంది జూనియర్ లైన్మెన్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇందులో టీఎస్ ఎన్పీడీసీఎల్లో 855 మంది, టీఎస్ ఎస్పీడీసీఎల్లో 320 మంది ఉన్నారు. వీరి సర్వీసు అక్టోబర్ 3 2008 సంవత్సరం నుంచి రెగ్యులర్ కానుంది. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించిన వారు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి రెగ్యులర్ అవుతారు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో మొదటగా విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న జూనియల్ లైన్మెన్లను క్రమబద్దీకరించింది. -
విద్యుత్ శాఖలో కొలువుల జాతర
జిల్లాలో 356 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వీటిలో 45 జేఏ, 310 జేఎల్ఎం, 1 వాచ్‌మేన్ పోస్టులు కాంట్రాక్టు సిబ్బందికి గరిష్టంగా 20 గ్రేస్ మార్కులు సాక్షి, ఏలూరు : తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలో 45 జూనియర్ అసిస్టెంట్ (జేఏ), 310 జూనియర్ లైన్‌మేన్ (జేఎల్ఎం), 1 వాచ్‌మేన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఈపీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 1లోగా దరఖాస్తు చేసుకోవాలి. సబ్స్టేషన్లు, కార్యాలయాల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 600 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో కొందరికికొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రాధాన్యత లభించనుంది. వారి పనితీరు ఆధారంగా గరిష్టంగా 20 గ్రేస్ మార్కులు ఇవ్వనున్నారు. 500 కనెక్షన్లకు ఒక్క ఉద్యోగి మాత్రమే జిల్లాలో సుమారు 11 లక్షల విద్యు త్ కనెక్షన్ల ఉండగా, 2వేల మంది సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారు. సుమారు వెయ్యి కనెక్షన్లకు ఇద్దరు ఉద్యోగులు ఉన్నట్టు. అయితే ఈ సంఖ్య నాలుగు ఉండాలి. 1999లో రాష్ట్ర విద్యుత్ మండలి పునర్ వ్యవస్థీకరణ తరువాత సబ్స్టేషన్లు రెండున్నర రెట్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఐదున్నర రెట్లు, ఆదాయం నాలుగున్నర రెట్లు పెరిగాయి. వినియోగదారులు 127 శాతం పెరిగారు. ఉద్యోగుల సంఖ్యలో 59 శాతం తరుగుదల కనిపిస్తోంది. సిబ్బంది కొరతను ఆసరాగా తీసుకుని నిత్యం చేయాల్సిన పనులను కూడా యాజమాన్యం కాంట్రాక్టుకు ఇచ్చేస్తోంది. దీనికి అవుట్ సోర్సింగ్ పద్ధతిని జోడించారు. కాంట్రాక్టు సిబ్బంది శ్రమను కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. చట్టప్రకారం సిబ్బందికి ప్రయోజనాలేవీ అందడం లేదు. సిబ్బంది కొరతతో పని భారం పెరిగి అటు రెగ్యులర్, ఇటు కాంట్రాక్టు ఉద్యోగులు సతమతమవుతున్నారు. సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, విద్యుత్ కనెక్షన్లకు అనుగుణంగా అదనపు పోస్టులు మంజూరు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలనే ప్రధాన డిమాండ్లతో విద్యుత్ ఉద్యోగుల యూనియన్లు సంస్థపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఈపీడీసీఎల్ నిర్ణయించింది.