లండన్: బ్రిటన్‌లో స్మోకింగ్ బ్యాన్ చట్టంపై ప్రధాని రిషి సునాక్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 2009 తర్వాత పుట్టిన వారికి అంటే.. 15, 15 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడాన్ని నిషేధించే చట్టాన్ని సునాక్ గతేడాదే ప్రతిపాదించారు. మంగళవారం (ఏప్రిల్16) ఈ చట్టాన్ని బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టారు.
సునాక్ సొంత పార్టీ కన్జర్వేటివ్స్ ఎంపీల్లో కొందరు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ ప్రధానులు లిజ్ ట్రుస్, బొరిస్ జాన్సన్‌లు కూడా ఈ చట్టంపై వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం అమలు చేయడమంటే ప్రజల ఇష్టాఇష్టాలను నియంత్రించడమేననేది వారి వాదన.
వేల కొద్ది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, ఒక జనరేషన్‌ను స్మోకింగ్ నుంచి దూరంగా ఉంచేందుకు ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని యూకే హెల్త్ సెక్రటరీ విక్టోరియా అట్కిన్స్ తెలిపారు. ఈ చట్టం దేశంలో ప్రొడక్టివిటీని పెంచడమే కాకుండా నేషనల్ హెల్త్ సర్వీస్‌పై భారాన్ని తగ్గిస్తుందన్నారు.
ఇదీ చదవండి.. మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్
Comments
Please login to add a commentAdd a comment