సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్ వంటి ఓటీటీ సేవలను అందిస్తున్న ప్లాట్‌ఫామ్‌లకు ఎలాంటి నిబంధనలు అవసరం లేదని టెలికాం వాచ్‌డాగ్ సోమవారం తెలిపింది. సంభావ్య పరిమితుల ముప్పును పక్కనబెట్టి ఓవర్-ది-టాప్(ఓటీటీ) కమ్యూనికేషన్ సేవలకు ప్రస్తుతం రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ అవసరం లేదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం సూచించిన చట్టాలు, నిబంధనలకు మించి, ఓటీటీ లాంటి వివిధ అంశాల కోసం సమగ్ర నియంత్రణ చట్రాన్నిసిఫారసు చేసేందుకు ఇది సరైన సందర్భం కాదు" అని ట్రాయ్ స్పష్టం చేసింది. ఓటీటీ సేవల గోప్యత, భదత్రకు సంంబంధించిన రెగ్యులేటరీ జోక్యం అవసరం లేదని కూడా ట్రాయ్ వెల్లడించింది. (ఫేస్‌బుక్ ఇండియా ఎండీకి నోటీసులు)
ట్రాయ్ నిర్ణయాన్నినెట్ న్యూట్రాలిటీ కార్యకర్తలు స్వాగతిస్తుండగా, మరోవైపు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తీవ్రంగా వ్యతిరేకించింది. ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్‌పీ) మధ్య సమస్యల్ని పరిష్కరించలేదని, ఇది టీఎస్‌పీలకు నష్టదాయకమని కోయ్ డైరెక్టర్ జనరల్ కొచ్చర్ ఆరోపించారు. అటు ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్ తాజా పరిణామంపై ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా భారతదేశంలోని టెలికాం సంస్థలు ఇంటర్నెట్ ద్వారా ఉచిత వాయిస్, టెక్స్ట్ సేవలను అందించే యాప్స్ నియంత్రణ కోసం చాలాకాలంగా లాబీయింగ్ చేస్తున్నాయి. వీటిద్వారా సోషల్ మీడియా సంస్థలు తమ ఆదాయానికి గండికొడుతున్నాయని వాపోతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment