మంత్రివర్గ ఉపసంఘం భేటీలో చర్చ
సాక్షి, హైదరాబాద్: అర్చకులు, దేవాలయ ఉద్యోగుల వేతనాల క్రమబద్ధీకరణ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు గురువారం మంత్రివర్గ ఉప సంఘం భేటీ కాబోతోంది. ఇప్పటికే ఓ దఫా సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం అధికారులతో విధివిధానాలపై ప్రాథమికంగా చర్చించింది. కొన్ని సందేహాలుండటంతో వాటి నివృత్తికోసం వివరాలు సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. వాటిని అధికారులు సిద్ధం చేయటంతో గురువారం రెండో భేటీకి సిద్ధమైంది. వేతనాల విషయంలో ఉపసంఘం తుది నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించనుందని తెలుస్తోంది.