priests
-
పూజారులు, గ్రంథీలకు నెలకు రూ.18 వేలు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ మరో వరాల జల్లు కురిపించింది. ఆలయాల్లో పూజారులు, గురుద్వారాల్లో సేవచేసే గ్రంథీలకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం ఇస్తామని ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ప్రాచీన హనుమాన్ ఆలయం నుంచి ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్వయంగా కేజ్రీవాల్ ప్రారంభించనున్నారు. ముందుగా హనుమాన్ ఆలయం అర్చకుల పేర్లను నమోదు చేస్తారు. ఆ తర్వాత.. పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఢిల్లీలోని అన్ని దేవాలయాలు, గురుద్వారాలకు వెళ్లి పూజారులు, గ్రంథిల పేర్లు నమోదు చేస్తారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ఈ వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మహిళా సమ్మాన్, సంజీవని యోజన లాగా ‘పూజారి, గ్రం«థి సమ్మన్ యోజన’కు ఎలాంటి అవాంతరాలు కలిగించవద్దని బీజేపీని వేడుకుంటున్నా. అయినాసరే అడ్డుకుంటామంటే బీజేపీకి మహాపాపం చుట్టుకుంటుంది. పూజారులు, గ్రంథులు మనకు దేవుడికి మధ్య వారధులుగా ఉంటూ మన ఆచారాలను భవిష్యత్ తారాలకు అందజేస్తున్నారు. సమాజంలో పూజారులు, గ్రంథీలు కీలక పాత్ర పోషిస్తున్నా వారు ఇన్నాళ్లూ నిర్లక్షానికి గురయ్యారు. దేశంలోనే తొలిసారిగా వీళ్లను ఆదుకునేందుకు ఈ పథకం తెస్తున్నాం. ఢిల్లీ రాష్ట్రంలో ఆప్ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పథకం అమల్లోకి వస్తుంది. గతంలో ఏ పార్టీ, ప్రభుత్వం ఇలాంటి ప్రయోజనం అర్చకులకు, సేవకులకు చేకూర్చలేదు. బీజేపీ, కాంగ్రెస్ పారీ్టలు కూడా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని అర్చకుల కోసం ఇలాంటి పథకాన్ని ప్రారంభిస్తాయని ఆశిస్తున్నా’’అని కేజ్రీవాల్ అన్నారు. ‘‘దేశ సంస్కృతి, సంప్రదాయాలను తరాలుగా కొనసాగిస్తున్న అర్చకులను ఆదుకునేందుకు ఉద్దేశించిన చక్కని పథకమిది’’అని ఢిల్లీ సీఎం అతిశి ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. మరోవైపు ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ పరిధిలోని మసీదుల్లో సేవలందించే ఇమామ్‌లు కేజ్రీవాల్ నివాసం బయట ఆందోళకు దిగారు. ఇమామ్‌లకు అందాల్సిన నెలవారీ గౌరవ వేతనం రూ.18,000, ముయేజిన్లకు అందాల్సిన రూ.16వేల గౌరవ వేతనం గత ఏడాదిన్నరగా అందట్లేదని వారు నిరనసన తెలిపారు. -
అధికారికంగా క్రోధి ఉగాది వేడుకలు
సాక్షి, అమరావతి: క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. మంగళవారం తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు వేదపండితులు, ఆలయ అర్చకులను సత్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో విజయవాడలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఉదయం 9 గంటలకు కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 18 మంది వేద పండితులను ఘనంగా సత్కరిస్తారు. అన్ని జిల్లాల్లో ఉగాది ఉత్సవాల నిర్వహణలో భాగంగా వేదపండితులు, అర్చకులకు సన్మాన కార్యక్రమాల నిర్వహణకు దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించారు. ప్రతి జిల్లాలో 62 ఏళ్లకు పైబడిన అర్చకులు ఇద్దరిని, ఒక వేద పండితుడిని సత్కరించాలని సూచించారు. సన్మాన గ్రహీతలకు ప్రశంసాపత్రం, రూ.10,116 సంభావన, శాలువా, కొత్తవస్త్రాలు, పండ్లు అందజేస్తారు. -
ఒగ్గు పూజారుల ఘర్షణ
దుబ్బాకటౌన్: సిద్దిపేట జిల్లాలో ఒగ్గు పూజారులు ఘర్షణ పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని రేకులకుంట మల్లన్న ఆలయం వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రసిద్ధి చెందిన రేకులకుంట మల్లికార్జునస్వామి ఆలయం వద్ద.. పూజల విషయమై ఒగ్గు పూజారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పూజారులు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో 10 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ గంగరాజు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పూజల విషయమై కొన్నేళ్లుగా వివాదం.. రేకులకుంట మల్లన్న ఆలయంలో కొన్నేళ్లుగా ఒగ్గు పూజారుల మధ్య పూజల విషయమై వివాదం నెలకొంది. చెరుకూరి వంశానికి చెందిన 26 మంది, కోటి వంశంవారు 22 మంది, పయ్యావుల వంశం వాళ్లు 10 మంది పూజలు చేయడంతోపాటు పట్నాలు వేస్తున్నారు. ఈ క్రమంలో పయ్యావుల వంశం పూజారులు తాము 10 మందిమే ఉన్నామని, మరో 10 మందికి అవకా«శం ఇవ్వాలని కోరడంతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో పయ్యావుల వంశంవారు దేవాదాయ శాఖ నుంచి కొత్తగా 10 మంది పూజలు చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారని ఈఓ తెలిపారు. దీంతో బుధవారం సాయంత్రం ఆలయం వద్ద పూజలు చేస్తున్న కొత్తవారిని పాత పూజారులు నిలదీయంతో ఘర్షణ మొదలైంది. పరిస్థితి చేయిదాటిపోయి దాడులకు దిగారు. ఈ ఘటనతో ఆలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దాడుల విషయంలో పూజారులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. -
‘ధూపదీప నైవేద్యం’ ఎలా?
సాక్షి, హైదరాబాద్: గౌరవ భృతి అందని కారణంగా దేవుళ్లకు నైవేద్యం, పేద అర్చకుల పూట గడవటం కష్టంగా మారింది. కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ భృతి బకాయిల కోసం వేడుకుంటున్నా ఫలితం లేదు. దీంతో అర్చకులు నిరసనకు సిద్ధమయ్యారు. మంగళవారం చలో సచివాలయం కార్యక్రమం నిర్వహించడం ద్వారా తమ దీనావస్థను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు. ఇదీ సంగతి: ఆదాయం అంతగా లేక ఆలనాపాలన కష్టంగా మారిన దేవాలయాల్లో నిత్య పూజలకు ఉమ్మడి ఏపీలో డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ‘ధూప దీపనైవేద్య పథకం’ప్రారంభించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత దాని పరిధిలో దేవాలయాల సంఖ్యతోపాటు గౌరవ భృతి మొత్తం కూడా పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 6000 దేవాలయాలు ప్రస్తుతం దీని పరిధిలో ఉన్నాయి. తొలుత 3500 దేవాలయాలకు మాత్రమే ఉండగా, గతేడాది గోపనపల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన ప్రారంభోత్సవం సందర్భంగా మరో 2500 దేవాలయాలను ఇందులో చేర్చనున్నట్టు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆమేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ వాటిని ధూపదీప నైవేద్య పథకంలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గౌరవ భృతి రూ.6500 ఉండగా, దానిని కూడా రూ.10 వేలకు పెంచుతున్నట్టు కేసీఆర్ అప్పడు ప్రకటించారు. కొద్దిరోజులకు ఆమేరకు కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో గౌరవ భృతి రూ.10 వేలకు పెరిగింది. అప్పటి వరకు రూ.6500 చెల్లిస్తున్న ఆలయాలకు కూడా వర్తింపజేశారు. కొన్ని నెలలు పాత దేవాలయాలకు ఆ మొత్తం చెల్లించారు. కానీ, కొత్తగా చేరిన దేవాలయాలకు మాత్రం ఇప్పటి వరకు వాటి చెల్లింపులు మొదలు కాలేదు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున తర్వాత ఇస్తారులే అనుకుంటూ అర్చకులు కాలం గడిపారు. కొత్త ప్రభుత్వం కొలువు దీరటంతో బకాయిలు సహా వాటి చెల్లింపు ఉంటుందని ఆశపడ్డారు. కానీ, వారి గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. పాత దేవాలయాలకు సంబంధించి నవంబరు నుంచి బకాయిలు పేరుకుపోగా, కొత్తగా చేరిన దేవాలయాలకు ఇప్పటి వరకు అసలే చెల్లించలేదు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి విన్నవించినట్టు ఆర్చకులు చెబుతున్నారు. దేవాదాయశాఖ కమిషనర్‌ను కలిసి అభ్యర్థించామని పేర్కొంటున్నారు. కానీ, ఆర్థిక శాఖ అధికారులు డబ్బులు విడుదల చేయటం లేదన్న సమాధానం దేవాదాయ శాఖ అధికారుల నుంచి వస్తోందన్నారు. దీంతో విషయాన్ని స్వయంగా సీఎం దృష్టికి తెస్తేనన్నా ఫలితముంటుందన్న ఉద్దేశంతో చలో సచివాలయం కార్యక్రమానికి నిర్ణయించినట్టు పేర్కొంటున్నారు. -
అయోధ్య రామాలయ పూజారుల పోస్టులకు 3,000 దరఖాస్తులు
అయోధ్య(యూపీ): అయోధ్యలో నిర్మాణం తుది దశకు చేరుకున్న రామమందిరంలో పూజారుల నియామక క్రతువు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి 3,000 దరఖాస్తులు అందినట్లు రామ మందిర్ తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఉన్నతాధికారి సోమవారం చెప్పారు. వీరిలో 20 మందిని మాత్రమే ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. -
'నామినేషన్లకు' ఎప్పుడెలా ఉందో.. కాస్త చూసి చెప్పండి! పురోహితుల వెంట..
సాక్షి, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. మంచి రోజు, బలమైన ముహూర్తం చూడాలని పండితులను సంప్రదిస్తున్నారు. ఈనెల 3నుంచి నామినేషన్ల ప్రక్రియం ప్రారంభమైంది. పదోతేదీ వరకు నామినేషన్ల ప్రక్రియకు తుది గడువు ఉంది. ఇంకా ఐదురోజులు మాత్రమే నామినేషన్లకు ముహూర్తం ఉంది. ఏ రోజు, ఏసమయం బాగుందో చూసి చెప్పండి అంటూ పురోహితుల వెంట తిరుగుతూ... బీఫాంలు అందుకున్న అభ్యర్థులు తమ జాతకాలను పరిశీలించుకుంటున్నారు. ఏ రోజు ఎలాగుందంటే..? నామినేషన్ల దాఖలు గడువుకు ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అభ్యర్థి జన్మనక్షత్రం ప్రకారం అనువైన తిథి, నక్షత్రం ఆధారంగా ముహూర్తం చూసుకుని నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు పురోహితులను కలుస్తున్నారు. ► 6వ తేదీ నవమి. అశ్లేష నక్షత్రం నామినేషన్ల దాఖలుకు ఇష్టపడరని పండితులు చెబుతున్నారు. ► 7న మంగళవారం కావడంతో చాలా మంది నామినేషన్ వేయరంటున్నారు. ► 8న ఏకాదశి, పుష్పనక్షత్రం కావడంతో ఎక్కువ మంది నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ► 9న ఏకాదశి ఉదయం 10.30 వరకు ఉండడంతో నామినేషన్లు అధికంగా దాఖలు కావొచ్చని చెబుతున్నారు. ► 10న రాహుకాలం అధికంగా ఉండడంతో నామినేషన్లు పెద్దగా దాఖలు కాకపోవచ్చు. ఇవి చదవండి: కడుపేద వర్గాలకు చేరువైన 'సీపీఐ..' ఇకపై ప్రశ్నార్థకమేనా!? -
విజయదశమి: అర్చకులకు సీఎం జగన్ తీపికబురు
సాక్షి, అమరావతి: విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభవార్త చెప్పారు. అర్చకులకు ఇచ్చిన ఎన్నికల హామీని సీఎం జగన్ నెరవేర్చారు. 26 జిల్లాలోని 1,177 మంది అర్చకులకు కనీస వేతనం రూ.15,625లు అమలు చేస్తూ దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంద్రకీలాద్రికి సీఎం జగన్ రేపు(శుక్రవారం) ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారికి సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పట్టు వస్త్రాలతోపాటు పసుపు, కుంకుమలను ప్రభుత్వం తరపున అందించనున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రమైన మూల.. ఈ నెల 20వ తేదీ, శుక్రవారం కలిసి రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులను అనుగ్రహించనున్నారు. చదవండి: వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రకటన.. పురస్కార గ్రహీతలు వీరే.. -
‘పూజారమ్మా... అర్చన చెయ్యి’.. ఇక అక్కడ ఇదే మాట వినపడుతుంది
‘పూజారి గారూ... అర్చన చెయ్యండి’ అనే మాట ప్రతి గుడిలో వినపడేదే. కాని తమిళనాడులో ఒక మార్పు జరిగింది. పూజారులుగా స్త్రీలు నియమితులయ్యే ప్రయత్నం మొదలయ్యింది. ‘పూజారమ్మా... అర్చన చెయ్యి’ అనే ఇకపై మాట వినపడనుంది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు అర్చకత్వం కోర్సును ముగించి త్వరలో పూజారులుగా నియమితం కానున్నారు. ‘మహిళలు పైలెట్లుగా, వ్యోమగాములుగా దిగంతాలను ఏలుతున్నప్పుడు దేవుని అర్చనను ఎందుకు చేయకూడదు’ అనే ప్రశ్న తమిళనాడు ప్రభుత్వం లేవనెత్తింది. అంతేకాదు దానికి సమాధానం కూడా వెతికింది. జవాబును ప్రజల ముందుకు తెచ్చింది. గతంలో ఛాందస దృష్టితో బహిష్టు కారణాన స్త్రీలను ‘అపవిత్రం’ అని తలచి గర్భగుడి ప్రవేశానికి, అర్చనకు దూరంగా ఉంచేవారు. గ్రామదేవతల అర్చనలో స్త్రీలు చాలా కాలంగా ఉన్నా ఆగమశాస్త్రాలను అనుసరించే దేవాలయాలలో స్త్రీలు అర్చకత్వానికి నిషిద్ధం చేయబడ్డారు. ఇప్పుడు ఆ విధానంలో మార్పును తెచ్చింది తమిళనాడు ప్రభుత్వం. మహిళా అర్చకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వనుంది. అందులో భాగంగా ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సును ముగించి సహాయక అర్చకులుగా శిక్షణ పొందనున్నారు. ఒక సంవత్సరంపాటు ఆలయాల్లో శిక్షణ పొందాక ప్రధాన అర్చకులు కానున్నారు. అందరూ యోగ్యులే డి.ఎం.కె నేత కరుణానిధి 2007లో అర్చకత్వానికి అన్ని కులాల వాళ్లు యోగ్యులే అనే సమానత్వ దృష్టితో తమిళనాడులో ఆరు అర్చక ట్రైనింగ్ స్కూళ్లను తెరిచారు. అయితే ఆ కార్యక్రమం అంత సజావుగా సాగలేదు. ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కులాల వాళ్లు అర్చకత్వం కోర్సు చేసి పూజారులుగా నియమితులు కావచ్చన్న విధానాన్ని ప్రోత్సహించింది. దాంతో గత సంవత్సరం నుంచి చాలామంది ఈ కోర్సుల్లో చేరుతున్నారు. అయితే తిరుచిరాపల్లిలోని అర్చక ట్రైనింగ్ స్కూల్లో ముగ్గురు మహిళలు ఈ కోర్సులో చేరడంతో కొత్తశకం మొదలైనట్టయ్యింది. రమ్య, కృష్ణవేణి, రంజిత అనే ముగ్గురు మహిళలు ఒక సంవత్సరం కోర్సులోని థియరీని విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ హిందూ ధార్మిక మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా సర్టిఫికెట్లు పొందారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా ఒక సంవత్సరం పాటు వివిధ ఆలయాల్లో సహాయక అర్చకులుగా పని చేసి తదుపరి అర్చకులుగా నియమితులవుతారు. కోర్సు చదివిన కాలంలో వీరికి 3000 రూపాయల స్టయిపెండ్ లభించింది. దేవుడు కూడా బిడ్డడే ‘దేవుడు కూడా చంటిబిడ్డలాంటివాడే. గర్భగుడిలో దేవుణ్ణి అతి జాగ్రత్తగా ధూపదీపాలతో, నైవేద్యాలతో చూసుకోవాలి. స్త్రీలుగా మాకు అది చేతనవును’ అంది రమ్య. కడలూరుకు చెందిన ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగం మాని మరీ అర్చకత్వం కోర్సులో చేరింది. మరో మహిళ కృష్ణవేణి ఇంటర్ వరకూ చదివి ఈ కోర్సు చేసింది. మూడో మహిళ రంజిత బి.ఎస్సీ చదివింది. ‘మా బ్యాచ్‌లో మొత్తం 22 మంది ఉంటే మేము ముగ్గురమే మహిళలం. కాని గత నెలలో మొదలైన కొత్తబ్యాచ్‌లో 17 మంది అమ్మాయిలు చేరారు. రాబోయే రోజుల్లో ఎంతమంది రానున్నారో ఊహించండి’ అంది రమ్య. తమిళనాడులో మొదలైన ఈ మార్పును మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తాయో లేదో ఇప్పటికైతే సమాచారం లేదు. కాని స్త్రీలు దైవాన్ని కొలిచేందుకు ముందుకు వస్తే ఇకపై వారిని ఆపడం అంత సులువు కాకపోవచ్చు. -
అర్చకులకు వంశపారంపర్య హక్కులు.. స్వరూపానందేంద్ర స్వామి స్పందన ఇదే..
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించేందుకు ఏపీ కేబినెట్ తీర్మానంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. అర్చకుల వంశపారంపర్య హక్కులపై ఏపీ కేబినెట్ తీర్మానం ఆమోదయోగ్యంగా ఉందన్నారు. అసెంబ్లీలో చట్టబద్దంగా నిర్ణయం తీసుకునేందుకు ఏపీ కేబినెట్ తీర్మానం చాలా అవసరం అన్నారు. అర్చక కుటుంబాల దశాబ్దాల కల నెరవేర్ఛడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. అర్చక వృత్తికి బ్రాహ్మణులు దూరమవుతున్న సమయంలో ఇది హర్షించదగ్గ పరిణామంగా స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. ఇక ఓపికున్నంత వరకు అర్చకత్వం దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు ఓపిక, శక్తి ఉన్నంత వరకు భగవంతుడి సేవలో కొనసాగేలా ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే దేవదాయ శాఖ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు నిర్ణయించింది. సీఎం జగన్‌కు ఏపీ అర్చక సమాఖ్య కృతజ్ఞతలు దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే అర్చకులకు పదవీ విరమణ లేకుండా వీలైనంత కాలం పనిచేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఏపీ అర్చక సమాఖ్య సీఎం జగన్‌కు బుధవారం కృతజ్ఞతలు తెలిపింది. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్ అంటూ అర్చక సమాఖ్య అధ్యక్షుడు అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణకూ ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే.. -
ఉదయం అర్చకత్వం ఆ తర్వాత కాయకష్టం..
సాక్షి, హైదరాబాద్: అంతగా ఆదాయం లేని చిన్న దేవాలయాల నిర్వహణకు ప్రభుత్వం ప్రారంభించిన ధూపదీపనైవేద్య పథకం గందరగోళంగా మారింది. దేవాల యంలో పూజాదికాలకు కావాల్సిన వస్తువులు(పడితరం) కొనేందుకు రూ.2 వేలు, ఆలయ అర్చకుడి కుటుంబ పోషణకు రూ.4 వేలు.. వెరసి రూ.6 వేలు ప్రతినెలా చెల్లించాల్సి ఉండగా, నిధుల లేమి సాకుతో ఆ మొత్తాన్ని ఆర్థిక శాఖ విడుదల చేయటం లేదు. పెద్ద దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులకు ట్రెజరీ నుంచి వేతనాలు అందుతున్నాయి. ఆ దేవాలయం నుంచి వచ్చే ఆదాయాన్ని దేవాదాయ శాఖ తీసేసుకుంటోంది. కానీ చిన్న దేవాలయాలకు అంతగా ఆదాయం లేకపోవటంతో ధూప దీప నైవేద్య పథకం నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. గతేడాది కొన్ని నెలల పాటు వేతనం ఇవ్వక, ఆ దేవాలయాలు, వాటి అర్చకుల కుటుంబాలను ఆగమాగం చేసి న అధికారులు ఆ తర్వాత ఎట్టకేలకు కొద్ది నెలలు సక్రమంగానే విడుదల చేశారు. మళ్లీ డిసెంబరు నుంచి నిధులు విడుదల చేయటం లేదు. నాలుగు నెలలు వరసగా ఆగిపోగా, గత నెల ఒక నెల మొత్తం విడుదల చేశారు. మిగతావి అలాగే పెండింగులో ఉన్నాయి. ఆటో తోలుతున్న ఈ వ్యక్తి పేరు పురాణం దివాకర శర్మ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన స్థానిక శ్రీ వైద్యనాథ స్వామి దేవాలయ అర్చకులు. ధూప దీప నైవేద్య పథకం కింద ఆయన ఈ ఆలయ పూజారిగా పనిచేస్తున్నారు. కానీ ఆ పథకం కింద ఇవ్వాల్సిన రూ.6 వేలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. నాలుగు నెలలుగా స్తంభించిన ఆ మొత్తంలో అతి కష్టమ్మీద ఒక నెల వేతనం మాత్రమే తాజాగా విడుదలైంది. గతేడాది కూడా ఇలాగే కొన్ని నెలలు నిలిచిపోయింది. దీంతో కుటుంబ పోషణ భారం కావడంతో ఉదయం దేవాలయం మూసేసిన తర్వాత ఇదిగో ఇలా అద్దె ఆటో తీసుకుని నడుపుకొంటున్నారు. ఒక్కో సారి రాత్రి దేవాలయం మూసేసిన తర్వాత గ్రామీణులకు కోలాటంలో శిక్షణ ఇస్తూ వారిచ్చిన ఫీజు తీసుకుని రోజులు గడుపుతున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ హయాంలో పథకం ప్రారంభం మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆదాయం లేని దేవాలయాల్లో నిత్య పూజలకు ఆటంకం కలగొద్దన్న సదాశయంతో 2007లో ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో అర్చకులకు గౌరవ వేతనం రూ 1500, పూజా సామగ్రికి రూ.1000 చొప్పున విడుదల చేసేవారు. 1750 దేవాలయాల్లో ఈ పథకం అమలవుతుండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2018లో 3645 ఆలయాలకు విస్తరింపజేస్తూ చెల్లించే మొత్తాన్ని రూ.6 వేలకు పెంచారు. దేవాలయాల సంఖ్య, వేతన మొత్తం పెరిగినా.. నిధుల విడుదల మాత్రం సక్రమంగా లేకపోవడంతో సమస్యలు ఎదురువుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3645 దేవాలయాలకు సంబంధించి ప్రతినెలా రూ. 2,18,70000 మొత్తం విడుదల కావాల్సి ఉండగా, నిధుల సమస్య పేరుతో ఆర్థిక శాఖ ఆ మొత్తాన్ని దేవాదాయ శాఖకు అందించటం లేదు. ఎన్ని ఇబ్బందులో.. ఓ దేవాలయ నిర్వహణకు నెలకు రూ.2 వేల నిధులు ఏమాత్రం సరిపోవటం లేదు. ఇక పూజారి కుటుంబ పోషణకు రూ.4 వేలు కూడా చాలటం లేదు. అయినా సరిపుచ్చుకుందామంటే ఆ నిధులు క్రమం తప్పకుండా అందటం లేదు. ధూపదీపనైవేద్యం అర్చకుల్లో బ్రాహ్మణేతరులు కూడా ఉన్నారు. వీరు పూర్తిగా ఆలయంపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయన్న పేరుతో ఆలయానికి దాతలు అడపాదడపా ఇచ్చే సాయం కూడా ప్రస్తుతం తగ్గిపోయిందనేది అర్చకుల మాట. దీంతో గత్యంతరం లేక చాలా మంది అర్చకులు ఇతర పనులు చేసుకుంటున్నారు. కొందరు ఆటో నడుపుతుంటే, మరికొందరు ఉపాధి హామీ పనులు, ఇతర కూలీ పనులకు వెళ్తున్నారు. కూలీ పనులకు వెళ్తున్నాం ‘‘నేను కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్ గావ్ ఆలయంలో ధూపదీపనైవేద్య పథకం అర్చకునిగా పనిచేస్తున్నాను. ఆ రూపంలో రావాల్సిన గౌరవ వేతనం సరిగా రావటం లేదు. ఆ వచ్చే మొత్తం కూడా కుటుంబ పోషణకు సరిపోక నా భార్యతో కలిసి మిగతా సమయంలో ఉపాధి హామీ పథకం పనులకు, ఇతరుల పొలాల్లో పనులకు కూలీలుగా వెళ్తున్నాం.’’ – సంగాయప్ప అర్చకుడు నిధులు పెంచాలి, క్రమం తప్పకుండా ఇవ్వాలి ‘‘గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో నిత్య పూజలు చేస్తూ పూజాదికాల్లో ఉంటున్న ధూపదీపనైవేద్య పథకం అర్చకుల పరిస్థితి దారు ణంగా మారింది. ఆ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని ప్రస్తుత మార్కెట్ ధరల పట్టికను అనుసరించి పెంచాల్సి ఉంది. ఆ మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇవ్వాలి’’ – వాసుదేవ శర్మ,ధూపదీపనైవేద్య పథకం అర్చకుల రాష్ట్ర అధ్యక్షులు -
సీఎం జగన్‌కు టీటీడీ వేద పండితుల ఆశీర్వచనం
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీటీడీ వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. సీఎంను శేషవస్త్రంతో వేద పడింతులు సత్కరించారు. అనంతరం స్వామివారి ప్రసాదం, క్యాలెండర్‌ను అందించారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హాజరయ్యారు. కాగా, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటిలో ఆనందాలను నింపాలని, మంచి ఆరోగ్యం అందించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం తన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలిపారు. చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లంక భూములకు డి పట్టాలు -
చినజీయర్ స్వామి క్షమాపణ చెప్పాలి
ఎస్ఎస్ తాడ్వాయి/గుండాల: సమ్మక్క, సారలమ్మ వనదేవతలమీద త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై పూజారులు మండిపడ్డారు. స్వామి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం సమ్మక్క, సారలమ్మ పూజారులు, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వా యి మండలంలోని మేడారంలో చినజీయర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు. అయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్వామి మాటలపై పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు మాట్లాడుతూ చినజీయర్ స్వామి ఇంగీత జ్ఞానం లేకుండా సమ్మక్క, సారలమ్మ దేవత కాదని అనడం అవివేకమన్నారు. కోట్లాది మందికి అశీర్వాదాలు అందించే తల్లులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఆదివాసీ ప్రజానీకానికి, వనదేవతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, స్వామి వ్యాఖ్యలను తప్పుబడుతూ భద్రాద్రి కొత్త గూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డలోని పగిడిద్దరాజు గుడివద్ద అరెం వంశీయులు బుధవారం నిరసన తెలిపారు. సమ్మక్క, సారలమ్మ విషయంలో స్వామి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. -
ఏలియన్స్ జాడ కోసం వేదాంత వేత్తలను నియమించుకుంటున్న నాసా..!
ఏలియన్స్ జాడ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎన్నో ఏళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఏలియన్స్ జాడ కనుక్కోవడం కోసం నాసా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రహాంతరవాసుల ఆచూకీ, రహస్యాలను తెలుసుకోవటానికి 24 మంది వేదాంత వేత్తల సహాయాన్ని కోరుతున్నట్లు టెక్నోట్రెండ్జ్ ఒక నివేదికలో తెలిపింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీలో డిగ్రీని పొందిన బ్రిటిష్ వేదాంత వేత్త రెవ్ డాక్టర్ ఆండ్రూ డేవిసన్ ఈ మిషన్‌లో భాగమయ్యారు. వచ్చే ఏడాది ఈ విషయంపై తన పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు కూడా తెలిపారు. నాసాలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసులు, యూఎఫ్ఓల రహస్యాలకు సంబంధించిన గుట్టును విప్పే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ వేదాంత వేత్తల్ని నాసా అంతరిక్షంలోకి పంపిస్తుందా? లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. మరో గ్రహంపై జీవం కనిపించిన తర్వాత వివిధ మతాలకు చెందిన వారి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ 24 మంది వేదాంత వేత్తల సహాయాన్ని నాసా కోరినట్లు సమాచారం. ఈ నెల డిసెంబర్ 26న హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ కంటే అతిపెద్ద అంతరిక్ష టెలిస్కోప్ జేమ్స్ వెబ్ ను అంతరిక్షంలోకి నాసా, యూరోప్ దేశాలు ప్రయోగించాయి. ఈ టెలిస్కోప్ సహాయంతో విశ్వం పుట్టుకతో పాటు, ఏలియన్స్ జాడ కూడా తెలుసుకోవాలని నాసా భావిస్తుంది. (చదవండి: జనవరి 1 నుంచి మరో కొత్త నిబంధన అమల్లోకి!) -
సీఎం వైఎస్ జగన్‌కు అర్చక సమాఖ్య కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: ఆలయాల జీర్ణోద్ధరణతో పాటు అర్చకుల సంక్షేమ కార్యక్రమాల కోసం టీటీడీ ప్రతి ఏటా రూ.50 కోట్లు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై ఏపీ అర్చక సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. గత టీడీపీ ప్రభుత్వం అర్చకుల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబులు శనివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఇవీ చదవండి: వ్యవసాయ రంగానికి ఏపీ ప్రభుత్వం సేవలు.. దేశంలోనే నంబర్ వన్ టీడీపీ అప్పులతోనే తిప్పలన్నీ.. -
వంశపారంపర్య అర్చకులకు విధి విధానాలు
సాక్షి, అమరావతి: ఆలయాల్లో పనిచేసే అర్చకుల కలలు నిజంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వంశపారంపర్య అర్చకుల గుర్తింపునకు విధివిధానాలను ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎనిమిది రకాల అంశాలకు సంబంధించి ఏ ఒక్క అంశంలో ఆధారాలు చూపినా వారిని సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకత్వానికి అర్హుడిగా గుర్తిస్తూ ఆలయ 43(10) రిజిస్టర్లో నమోదు చేయాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ వాణీమోహన్ రెండ్రోజుల క్రితం రాష్ట్రంలోని అందరు రీజనల్ జాయింట్ కమిషనర్లు, జోనల్ డిప్యూటీ కమిషనర్లు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. సంబంధిత ఎనిమిది అంశాలను అ ఉత్తర్వులలో వివరించారు. అవి.. ► అర్చక ఇనాం భూములను అనుభవిస్తూ ప్రస్తుతం అర్చకత్వం చేస్తున్న వారు సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకులుగా గుర్తించబడతారు. ► దరఖాస్తుదారుని తండ్రి లేదా తాతలు ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తే అతడిని ఆ ఆలయానికి వంశపారంపర్య అర్చకునిగా గుర్తిస్తారు. ► ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అమలులో ఉన్న దేవదాయ చట్టం ప్రకారం ఆలయాల రిజిస్టర్ 25లో గానీ, 1966 నాటి ఆంధ్రప్రదేశ్ దేవదాయ చట్టం ప్రకారం ఆలయ రిజస్టర్ 38లో గానీ అర్చకులుగా నమోదై ఉన్న వారి వారసులను సంబంధిత ఆలయ వంశపారంపర్య అర్చకులుగా గుర్తిస్తారు. ► అర్చకులందరూ ఒక అవగాహనకు వచ్చి ఓ వ్యక్తిని సూచించినా అతడిని సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకునిగా గుర్తిస్తారు. ► గతంలో కోర్టు ఆదేశాలున్న చోట.. అలాంటి వారిని సంబంధిత ఆలయ వంశపారంపర్య అర్చకునిగా అర్హుడవుతారు. ► ఎలాంటి వివాదాల్లేని చోట ప్రస్తుతం ఆలయ అర్చకుడే ఆ ఆలయ వంశపారంపర్య అర్చకుని హోదా పొందవచ్చు. ► ఏదైనా ఆలయంలో వంశపారంపర్య అర్చకునికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనప్పుడు పేపరు నోటిఫికేషన్ ద్వారా అతని నియామకానికి చర్యలు చేపడతారు. ► వంశపారంపర్య అర్చకత్వానికి అర్హత ఉండి ఆలయ అర్చకునిగా పనిచేసిన వారు చనిపోయిన పరిస్థితుల్లో ఆ కుటుంబంలో నిబంధనల ప్రకారం అర్హులు లేనట్లయితే భర్తను కోల్పోయిన అర్చకుని భార్య సూచించిన వ్యక్తి ఆమె జీవితకాలం వంశపారంపర్య హోదా అర్చకునిగా పనిచేయవచ్చు. .. పై ఎనిమిది అంశాల ప్రాతిపదికన రూ.కోటి పైబడి ఆదాయం ఉన్న ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వం గుర్తింపు ప్రక్రియను దేవదాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలోనే చేపడతారు. రూ. కోటిలోపు ఆదాయం ఉండే 6(ఏ) కేటగిరి ఆలయాలలో ఈ గుర్తింపు ప్రక్రియ రీజనల్ జాయింట్ కమిషనర్ల అనుమతితో చేపడతారు. 6 (బీ) కేటగిరి ఆలయాల్లో జోనల్ డిప్యూటీ కమిషనర్లు, 6(సీ) కేటగిరి ఆలయాల్లో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియకు అనుమతిస్తారు. ఏపీ అర్చక సమాఖ్య హర్షం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన దేవదాయ సవరణ చట్టం ప్రకారం ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంశపారంపర్య అర్చకుల గుర్తింపునకు విధివిధానాలు ఖరారుతో పాటు అప్పటి చట్టం అమలుకు పూనుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రతినిధులు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, పెద్దింటి రాంబాబు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌తో పాటు వెలంపల్లి, వాణీమోహన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అర్చక సమస్యలపై చొరవ అవసరం పెందుర్తి: అర్చకుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సూచించారు. వంశపారంపర్య హక్కులను అమలు చేయాలన్నారు. రుషికేష్‌లోని శారదాపీఠం శాఖలో చాతుర్మాస దీక్షలో ఉన్న స్వామీజీని రాష్ట్ర దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణీమోహన్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి పీఠ పూజలో పాల్గొన్నారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ అర్చకుల డిమాండ్లపై చొరవ చూపాలని సూచించారు. జీర్ణావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
9 మంది అప్పన్న వైదికులకు షోకాజ్ నోటీసులు
సింహాచలం (పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో గడిచి జ్యేష్ట ఏకాదిశి రోజున జరిగిన లక్ష్మీనారాయణస్వామి వార్షిక కల్యాణోత్సవంలో అర్చకులు ఆలపించిన గరుడ గజ్జన పాటను మార్ఫింగ్ చేసిన ఘటనలో తొమ్మిది మంది వైదికులకు దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తానే మార్ఫింగ్ చేసి ఇన్చార్జి ప్రధానార్చకుడికి పంపినట్టు ఇప్పటికే ఓ వేదపండితుడు అధికారుల వద్ద ఒప్పుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది. మొత్తం సంఘటనపై ఈవో కొద్ది రోజులుగా విచారణ చేస్తున్నారు. ఈసంఘటనలో మొత్తం తొమ్మిది మంది వైదికులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అందరినుంచి సమాధానం వచ్చినవెంటనే ఈవో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. వైదికుల సమాధానం ఆధారంగా విచారించి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై సింహాలచలం దర్శనాలపై కఠిన నిబంధనలు అమలవుతాయని, ఉద్యోగులైనా సరే దర్శనం టికెట్ తీసుకోవాల్సిందేనని ఈవో సూర్యకళ తెలిపారు. -
శ్రీవారి ఆలయంలో అర్చకుల నియామకం చేపట్టిన టీటీడీ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ అర్చకుల నియామకం చేపట్టింది. శ్రీవారి ఆలయంలో 2007 తర్వాత ఈ ఏడాది అర్చకుల నియామకం జరిగింది. మీరాశి వంశానికి చెందిన 8 మందికి శ్రీవారి కైంకర్యాలు చేసే అవకాశం టీటీడీ కల్పించింది. కాగా మీరాశి వంశీకుల్లో నూతన తరానికి శ్రీవారి ఆలయంలో అర్చకత్వం చేసే భాగ్యం లభించింది. ఈ క్రమంలో నేడు నియమితలైన 8 మంది అర్చకులు శ్రీవారికి పాదసేవ చేశారు. అనంతరం ఈ అదృష్టం కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వాళ్లు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన అర్చకులు కృష్ణ శేషచల దీక్షితులు మాట్లాడుతూ.. శ్రీవారి అర్చకులకు మరపురాని రోజని అన్నారు. వంశపారంపర్యం కొనసాగిస్తూ మా పిల్లలకు కైంకర్యాలు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇందుకు కారణమైనా సీఎం జగన్మోహన్రెడ్డికి, టీటీడీ పాలకమండలికి ధన్యవాదాలు తెలిపారు. కాగా నేడు మూడు కుటుంబాల నుంచి 8 మంది అర్చకులు బాధ్యతలు చేపట్టారు. నూతన అర్చకులు అందరు కూడా రెగులరైజ్ ఉద్యోగులగా బాధ్యతలు చేపట్టారు. చదవండి: టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్‌గా జవహర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం -
బురిడీ బాబాల నిర్వాకం: పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి
సాక్షి, యాదాద్రి: రామన్నపేట మండలం మునిపంపులలో దారుణం జరిగింది. దంపతుల గొడవల్లో తలదూర్చిన బురిడీ బాబాలు.. సమస్య పరిష్కరిస్తామని చెప్పి పూజల పేరుతో మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. లైంగిక దాడిని వీడియో తీసిన బురిడీ బాబాల అనుచరులు.. బాధితురాలిని బ్లాక్మెయిల్ చేసి రూ.లక్షలు వసూలు చేశారు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేయకుండా పోలీసులు సెటిల్మెంట్ చేశారు. దీంతో బాధిత మహిళ రాచకొండ సీపీని ఆశ్రయించింది. విచారణలో పోలీసులు, బాబాల బాగోతం వెలుగు చూసింది. నిర్లక్ష్యం వహించిన రామన్నపేట సీఐ, ఎస్ఐను సీపీ సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురికి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: ప్రేయసితో సెల్ఫీ వీడియో: చనిపోతున్నా.. చివరిసారి చూసిపో.. -
అర్చకులపై ఏపీ సర్కార్ వరాల జల్లు..
కడప కల్చరల్: నిరంతరం దేవునిసేవలో ఉంటూ భక్తుల కోరికలు, కష్టాలను దైవానికి తెలుపుతూ వారికి స్వాంతన ఇచ్చేందుకు కృషి చేస్తున్న అర్చకులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. కుటుంబాన్ని పోషించే స్థాయి, ఆర్థిక స్థోమత లేక నిరాశ, నిస్పృహాలతో కొట్టుమిట్టాడుతున్న వారి జీవితాల్లో కూడా ఆనందోత్సాహాలు వెల్లివిరిసే సమయం వచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వీరి జీతాలను పెంచింది. అనుకోని ఈ వరానికి ఎంతో ఆనంద పడుతున్న అర్చక లోకానికి ప్రభుత్వం రాష్ట్ర దేవదాయశాఖ ద్వారా మరింత సంతోషాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పలు సంక్షేమ పథకాలను రూపుదిద్దింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ కోరుతున్నారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రంలోని దేవాదాయశాఖ పరిధిలోగల దేవాలయాలలో సేవలు అందిస్తున్న అర్చకుల (కుటుంబ) సంక్షేమం కోసం వారి ఆర్థిక అభివృద్ధి కోసం ఆ శాఖ ప్రత్యేక కార్యచరణను అమలు చేస్తోంది. గత మాసంలో దాన్ని రాష్ట్ర అధికారులు ముఖ్యమంత్రి సూచన మేరకు మరికొంత ఆర్థిక లాభం లభించేలా సవరణలు చేశారు. దానికి దేవదాయశాఖ మంత్రి ఆమోదం కూడా లభించింది. ఇందులో భాగంగా ఆ శాఖ అర్చక ఉద్యోగుల సంక్షేమ నిధి నుంచి ఆర్థికసాయం అందజేయనున్నారు. దీనికి రాష్ట్ర అర్చక సమాఖ్య కూడా అంగీకరించింది. అర్చకులు, దేవదాయశాఖలోని ఇతర ఉద్యోగులు ఈ సంక్షేమ పథకాల కోసం ఆ నిధి నుంచి ఆర్థికసాయం తీసుకోవచ్చు. ఆలయాల గ్రేడ్, ఆస్తులు, ఆదాయాన్ని బట్టి అధికారులు అర్హతను నిర్ణయిస్తారు. రుణాలు సులభంగానే పొందవచ్చు. తీసుకున్న వారు సకాలంలో చెల్లిస్తే మరోసారి మరింత సులభంగా రుణాలు పొందవచ్చు. అర్చకుడు లేదా అర్హతను బట్టి వారి కుటుంబ సభ్యులకు వారి బ్యాంకు ఖాతాలోనే సొమ్ము జత చేస్తారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఆయా ఆలయాల ద్వారా నేరుగా ఆ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌కు పంపాల్సి ఉంటుంది. ఆయన వాటిని పరిశీలించి రుణానికి సిఫార్సు చేసి ప్రధాన కార్యాలయానికి పంపుతారు. రుణాలు....వివరాలు వివాహ రుణం: దీనికి రూ. లక్ష రుణం లభిస్తుంది. అర్చకుడు తనకు, తన సంతాన వివాహానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు వివాహ శుభలేఖను కూడా జతపరచాల్సి ఉంది. నామమాత్రపు వడ్డీతో ప్రతినెలా కంతు చెల్లించే అవకాశం కల్పించారు. ఉపనయనం గ్రాంట్: దీనికోసం రూ. 25 వేలు ఇస్తారు. ఇది అర్చకుల సంతానానికి మాత్రమే లభిస్తుంది. మనవళ్లకు, దేవదాయశాఖ కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా దత్తత తీసుకున్న పిల్లలకు ఈ సౌకర్యం లేదు. గృహ నిర్మాణ రుణం: దీనికి రూ. 5 లక్షల వరకు రుణం ఇస్తారు. సగం రుణంగా, సగం గ్రాంట్‌గా అందజేస్తారు. రెండు విడతలుగా నిర్మాణం సాగుతున్న సమయంలో ఫోటోలు, స్థలం వివరాలు, పొసెసన్ సర్టిఫికెట్, సేల్‌డీడ్, నోటరైజ్డ్ కాపీ, గ్రామ పంచాయతీ ఆమోదం పొందిన ప్లాన్, సర్వేయర్ రూపొందించిన నిర్మాణ అంచనా. ఇద్దరు సహా ఉద్యోగుల హామీ పత్రాలు సమరి్పంచాలి. నిబంధనల మేరకు రెండు విడతలుగా సొమ్ము మంజూరవుతుంది. గృహ మరమ్మతులు: దీనికి రూ. 2 లక్షలు మంజూరు చేస్తారు. ఇందులో రూ. లక్ష రుణం, మరొక రూ. లక్ష గ్రాంటుగా ఇస్తారు. సంబంధిత ఫోటోలు, ఎస్టిమేషన్లు, అనుమతులు, సేల్ డీడ్లను జత పరుస్తూ దరఖాస్తు చేసుకోవాలి. వైద్య రుణం చెల్లింపు: ఈ రుణానికి అర్హత కోసం వ్యాధిగ్రస్తుల వ్యాధి వివరాలు, వైద్య పరీక్షల రిపోర్టు, స్రూ్కటినీ సరి్టఫికెట్ దరఖాస్తుకు జత చేయాలి. ఆ వ్యాధి ఆరోగ్యశ్రీలో లేకుంటే రూ. 2 లక్షలు వైద్య ఖర్చులకు మంజూరు చేస్తారు. ఈ సంవత్సరం (2021) మే నెల 15వ తేది తర్వాత సమర్పించిన క్లెయిమ్‌లకు మాత్రమే ఈ రుణం వర్తిస్తుంది. వైద్య ఖర్చులు అయిన ఆరు నెలల కాలంలో సమరి్పంచే దరఖాస్తులకే రుణం వస్తుంది. అత్యవసర సమయంలో ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ సౌకర్యం ఉంది. అంగవైకల్యం: గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు అవకాశం. దేవదాయశాఖలో 10 సంవత్సరాలకు పైబడిన సర్వీసు, శాశ్వత అంగవైకల్యంతో విధులు నిర్వర్తించలేని స్థితిలో ఉన్న వారికి ఈ సౌకర్యం వర్తిస్తుంది. 5–10 సంవత్సరాల సరీ్వసు గల వారికి రూ. లక్ష మంజూరు చేస్తారు. జిల్లా ఆరోగ్య అధికారి ధృవపత్రం సమరి్పంచాల్సి ఉంటుంది. విద్యా గ్రాంటు: దీనికి రూ. 33 వేలు మాత్రమే మంజూరు చేస్తారు. న్యాయ, ఇంజనీరింగ్, మెడిసిన్, చార్టెడ్ అకౌంటెంట్ లాంటి ఉన్నత లేదా వృత్తి విద్యలకు మాత్రమే రుణం ఇస్తారు. ప్రభుత్వం ఇస్తున్న విద్యా దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్ తదితర సౌకర్యం పొందని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ గుర్తింపుగల విద్యా సంస్థల్లో చదువుతున్న సరి్టఫికెట్ సమరి్పంచాలి. మొదటి సంవత్సరం పాసయ్యాక గ్రాంటు విడుదల చేస్తారు. రిటైర్డ్మెంట్ గ్రాంటు : గ్రాట్యూటీ సాయం పొందుతున్న ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు ఈ శాఖలో ఏ బకాయి లేని వారికి ఈ సౌకర్యం ఉంది. 20 సంవత్సరాలు పైబడిన సర్వీసు గల వారికి రూ. 4 లక్షలు, 15–20 సంవత్సరాలలోపు సరీ్వసు గల ఉద్యోగికి రూ. 3 లక్షలు, 10–15 సంవత్సరాల సర్వీసుగల వారికి రూ. 2 లక్షలు ఇస్తారు. కుటుంబ సభ్యులు లీగల్ హేర్ సర్టిఫికెట్ సమర్పిస్తే 50 శాతం నగదు, 50 శాతం ఫిక్స్డ్ సర్టీఫికెట్ ఇస్తారు. దీనికి అవసరమైన అన్ని సర్టిఫికెట్లు సమర్పించాలి. ఎక్స్‌గ్రేషియా: ఉద్యోగి సర్వీసులో మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ. లక్ష ఎక్స్‌గ్రేíÙయా ఇస్తారు. సాధారణ మరణమైతే రూ. 50 వేలు ఇస్తారు. కనీసం మూడు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసినా లేదా ప్రమాదంలో మరణించిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. డెత్ సరి్టఫికెట్‌తోపాటు సంబం«ధిత ఇతర సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. చదవండి: శరణ్య.. నువ్వు డాక్టర్ కావాలమ్మా! -
వై ఎస్ కుటుంబం వల్లే అర్చకులు అభివృద్ధి చెందారు
-
మిరాశీ కుటుంబాల్లో అర్హులకు టీటీడీ అర్చకులుగా అవకాశం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ కైంకర్యాలు నిర్వహిస్తున్న నాలుగు ఆర్చక కుటుంబాలకు మనోస్థైర్యాన్ని కల్పిస్తూ వంశపారంపర్య హక్కులను కొనసాగించేలా సీఎం వైఎస్ జగన్ సానుకూల నిర్ణయం తీసుకోవడంపై శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు కృతజ్ఞతలు తెలియచేశారు. అర్చకత్వానికి అర్హులైన తమ కుటుంబాలకు చెందిన దాదాపు 15 మందిని టీటీడీలో అర్చకులుగా నియమించాలని సీఎంను కోరామన్నారు. దీనిపై స్పందించిన సీఎం తక్షణమే ఈమేరకు చర్యలు చేపట్టాలని టీటీడీకి సూచించినట్లు చెప్పారు. సీఎం సూచన మేరకు తమ కుటుంబాల్లో అర్హులైన వారిని అర్చకులుగా నియమిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. నాలుగు మిరాశీ కుటుంబాలకు చెందిన అర్చకులతో కలసి ఆయన సీఎంను కలసి తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందచేశారు. ఆదివారం తిరుమలలోని అర్చక భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌ను ఆశీర్వదిస్తున్న అర్చకులు సుపరిపాలన కొనసాగాలి... రాష్ట్రంలో వేల సంఖ్యలో అర్చక కుటుంబాలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం జీవో 439 జారీ చేసి అర్చకులకు పదవీ విరమణతో పని లేకుండా కైంకర్యాలు నిర్వహించుకునే అవకాశం కల్పించడాన్ని వేణుగోపాల దీక్షితులు స్వాగతించారు. స్వామివారి కృపా కటాక్షాలతో రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అర్చక కుటుంబాలు సీఎం జగన్‌కు అండగా ఉండాలని కోరారు. దివంగత వైఎస్సార్ మాదిరిగానే సీఎం జగన్ అర్చక కుటుంబాలకు ఎంతో మేలు చేశారని వేణుగోపాల దీక్షితులు పేర్కొన్నారు. అర్చకుల పిల్లలకు రిటైర్మెంట్ వేకెన్సీలలో ఉద్యోగాలు, పెన్షన్, గ్రాట్యుటీ సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంపై అర్చక కుటుంబాల తరపున కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఏఎస్ కృష్ణ శేషాచలం దీక్షితులు, ఏ.గోవిందరాజు దీక్షితులు, సీనియర్ అర్చకులు ఏ.రామకృష్ణ దీక్షితులు, మిరాశీ కుటుంబాలకు చెందిన 14 మంది అర్చకులు ఉన్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేస్తున్న దృశ్యం నాడు అర్చకులను ఆదుకున్న వైఎస్సార్.. 1987లో దేవదాయ చట్టాన్ని సవరించి మిరాశీ అర్చకుల వారసత్వ హక్కులు అప్పటి టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో నాలుగు కుటుంబాలకు చెందిన అర్చకులు వీధుల పాలయ్యారు. అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో దేవదాయ చట్టాన్ని సవరించి నాలుగు కుటుంబాలకు చెందిన అర్చకులు తిరిగి తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చకత్వం చేసుకునేలా అవకాశం కల్పించారు. అప్పటి నుంచి ఈ కుటుంబాలకు చెందినవారిని అర్చకులుగా నియమిస్తూ వస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అర్చకులకు మేలు చేసేలా 2019 అక్టోబరులో జీవో 439 జారీ చేసి అర్చకులకు పదవీ విరమణ వయసును తొలగించి శారీరకంగా ధృఢంగా ఉన్నంతవరకు కైంకర్యాలు నిర్వహించుకునే అవకాశం కల్పించారు. తద్వారా వేల సంఖ్యలో అర్చక కుటుంబాలను ఆదుకున్నారు. -
సీఎం జగన్‌కు శ్రీవారి ఆలయ అర్చకులు కృతజ్ఞతలు
సాక్షి, తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శ్రీవారి ఆలయ అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ, 1977లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మిరాశి వ్యవస్థను రద్దు చేసిందని.. దీంతో గతంలో చాలా అర్చక కుటుంబాలు వీధిపాలయ్యాయన్నారు. 2007లో వైఎస్సార్ చేసిన చట్ట సవరణతో 26 మంది అర్చకులు కైంకర్యాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అర్చక కుటుంబాల్లోని కొత్తగా 12 మంది అర్చకులను శ్రీవారి సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. వారికి అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చి.. అధికారులకు ఆదేశాలిచ్చారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రిటైరైన అర్చకులకు కూడా జీవితాంతం శ్రీవారి పాదసేవ చేసుకునే అవకాశాన్ని సీఎం జగన్ కల్పించారని వేణుగోపాల దీక్షితులు తెలిపారు. చదవండి: అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు: గౌతమ్ సవాంగ్ శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్.. -
పంచాయతీ ఎన్నికలు: పురోహితులకు డిమాండ్
గుత్తి రూరల్: శుక్ర మౌఢ్యమి, గురు మౌఢ్యమితో శుభకార్యాలేవీ జరగడం లేదు. దీంతో పురోహితులను పలకరించేవారు కరువయ్యారు. ఇలాంటి తరుణంలోనే ఎన్నికల ప్రక్రియ మొదలవ్వడం పురోహితులకు కలిసి వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తాము ఏ సమయంలో నామినేషన్ దాఖలు చేస్తే గెలుపు సులువవుతుందో తెలపాలంటూ పురోహితుల వద్దకు పరుగు తీస్తున్నారు. పనిలో పనిగా తమ జాతకం ఎలా ఉంటుందో తెలపాలంటూ ప్రాధేయపడుతున్నారు. (చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణానికి శ్రీకారం) -
తిరుమల శ్రీవారికి అభిషేకం..
సాక్షి, తిరుమల: సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం గురువారం నుంచి ప్రారంభం కాగా, నిన్న స్వామివారిని 6,998 మంది భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. మొదటిరోజు దర్శనానికి ఎనిమిది రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేశారు. తెలంగాణ నుండి 143, తమిళనాడు నుండి 141, కర్ణాటక నుండి 151 మందితోపాటు మహారాష్ట్ర, న్యూఢిల్లీ, అరుణాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల నుండి భక్తులు దర్శించుకున్నారు. ఉదయం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి దర్శనం కొనసాగుతుంది. గంటకు 500 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దర్శనానికి భౌతిక దూరం తో పాటు, మాస్కులు తప్పనిసరిగా ధరించేవిధంగా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. అలిపిరి వద్ద భక్తులకు కరోనా ర్యాండమ్ పరీక్షలు.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అవకాశాన్ని బట్టి దర్శనాల టికెట్ల సంఖ్య పెంచుతామని తెలిపారు. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని ఆయన స్పష్టం చేశారు. అలిపిరి వద్ద భక్తులకు కరోనా ర్యాండమ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సన్నిధి గొల్లలకు వంశపారంపర్యం కొనసాగిస్తూ తీర్మానం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.(తిరుమల శ్రీవారి దర్శనం ప్రారంభం) -
అర్చక లోకం.. ఆనంద మంత్రం
మహారాణిపేట (విశాఖ దక్షిణం): ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న అర్చకుల కల నేరవేరింది. గత ప్రభుత్వ హయాంలో వంశపారంపర్య అర్చకత్వం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారు. నేడు,రేపు అంటూ తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ల పాటు కాలయాపన చేసి చివరకు మొండి చెయ్యి చూపించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్చకులకు బాసటగా నిలిచారు. అర్చకుల వంశపారంపర్య అర్చకత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అర్చక చట్టం సవరణ జరిగితే, తనయుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో అర్చకులకు వంశపారంపర్య హక్కులను కల్పించారు. దీంతో జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న అర్చకులు,వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అర్చకులకు జీవం పోసిన జగన్ అర్చకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వంశపారంపర్య హక్కులను పునరుద్ధరిస్తూ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జీవో జారీ చేశారు. త్వరలోనే ఈ జీవో అమలుకానుంది. ఈ సమస్యతోపాటు ఇతర సమస్యల సాధన కోసం అర్చక సంఘాలు గత ప్రభుత్వ హయాంలో ఉద్యమాలు చేశాయి. టీడీపీ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు. జగన్ సీఎం కాగానే వీరి సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు. వంశపారంపర్య హక్కులను కల్పించారు. అలాగే ప్రతి ఆలయంలో పనిచేసే అర్చకులకు కనీస వేతనం ఇచ్చేందుకు సీఎం నిర్ణయించారు. 6బి,6సి దేవాలయాల్లో పనిచేసే ప్రతి అర్చకుడికి రూ. పదివేలు జీతం ఇవ్వాలని దేవదాయ అధికారులను సీఎం ఆదేశించారు. సంకల్పయాత్రలో, విశాఖలో నిర్వహించిన బ్రాహ్మణ గర్జనలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చుకుటున్నారు. జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది నెలలకే వంశపారంపర్య హక్కు జీవో విడుదల చేయడంతో అర్చకులు సంతోషంలో వ్యక్తం చేస్తున్నారు. అర్చకులకు బాసటగా వైఎస్సార్ దివంగత వైఎస్సార్ అంటే అర్చకులకు ఎనలేని అభిమానం. అర్చకుల సమస్యలపై ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక దృష్టి సారించారు. 1987 నాటి అర్చక చట్టాన్ని సవరిస్తూ 2007లో శాసనసభ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. వైఎస్సార్ మరణాననంతరం అర్చకుల వంశపారంపర్య హక్కులు, ఇతర సమస్యలు పరిష్కారం అలాగే ఉండిపోయాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ అర్చకుల బాధలను చూసి చలించిపోయారు. వంశపారంపర్య హక్కుల పునరుద్ధరణకు జీవో తెచ్చారు. పునాతన,శిథిలావస్థకు ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకం అమలుకు నిధులు కూడా కేటాయించారు. జిల్లాలో ఆలయాలు జిల్లాలో దేవాదాయశాఖ ఆధీనంలో మొత్తం 1047 ఆలయాలు ఉన్నాయి. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహాస్వామి, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం, అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయం, ఆశీలమెట్ట శ్రీ సంపత్ వినాయకగర్ ఆలయాలు జిల్లాలో పెద్దవి. జిల్లాలో 6ఎ దేవాలయాలు 11 , 6బీ 60 ఆలయాలు, 6సి 972 ఆలయాలు ఉన్నాయి. వీటిలో వంశపారంపర్య హక్కులు ఉండే ఆలయాలు దాదాపు 35 నుంచి 40 వరకు ఉంటాయి. సీఎంకు రుణపడి ఉంటాం దేవాదాయశాఖ ఇచ్చిన జీవోలను అమలు చేయాలి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో జీవోలను పక్కన పెట్టారు. ఇప్పడు వంశపారంపర్య హక్కు జీవోను అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఏ ప్రభుత్వం చేయలేని విధంగా అర్చకుల కోసం పని చేస్తున్న సీఎం జగన్‌కు అర్చక లోకం రుణపడి ఉంటుంది. వంశపారంపర్య హక్కు అమలు కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టాం. కాని అమలు కాలేదు. ఇప్పుడు అమలు అవుతుండడంతో సంతోషంగా ఉంది. – కొత్తలంక మురళీకృష్ణ, ఉత్తరాంధ్ర అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి సంతోషంగా ఉంది సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలలకే అర్చక లోకానికి మేలు చేసే పనులు చేశారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అర్చకుల వంశపారంపర్య హక్కు జీవో జారీ చేశారు. అర్చక కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. గతంలో ఈ హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం. అయినా పట్టించుకోలేదు. కాని జగన్ వచ్చిన కొద్ది నెలలకే సమస్య పరిష్కరించారు. – వెలవలపల్లి కోటేశ్వర శర్మ, అర్చక సంఘం నాయకుడు అర్చకుల కష్టాలను అర్థం చేసుకున్న జగన్ అర్చకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పాదయాత్రలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి వివరించాం. మంచి రోజులు వస్తున్నాయి. అంతా మంచి జరుగుతుందని మాతో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలలకే వంశపారంపర్య హక్కులను పునరుద్ధరిస్తూ జీవో జారీ చేశారు. ఇది ఎంతో మంచి పరిణామం. ఇంకా కొన్ని ఆలయాల్లో అతి తక్కువగా జీతాలు ఇస్తున్నారు. కనీస వేతనాలు కూడా లేవు. 6సి,6బి అర్చకులకు నెలకు రూ.20 వేల జీతం ఇవ్వాలని కోరుతున్నాం. – అయిలూరి శ్రీనివాస దీక్షితులు, ఉత్తరాంధ్ర అర్చక సంఘం అధ్యక్షుడు అర్హులందరికీ జీతం జిల్లాలో 6సీకి సంబంధించిన ఆలయాల్లో 51 మంది అర్చకులకు నెలకు పది వేల రూపాయల జీతాలను అమలు చేశాం. ఇంకా చాలా మంది అర్హులు ఉన్నారు. వీరి కూడా రూ.10 వేలు జీతం ఇచ్చేందుకు ధార్మిక పరిషత్‌కు లేఖ రాశాం. దేవాలయం నుంచి కొంత భాగం, థార్మిక పరిషత్ నుంచి మొత్తం కలిపి ఈ జీతం ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఎ.శాంతి, సహాయ కమిషనర్, దేవాదాయశాఖ విశాఖ జిల్లా -
అర్చకులు,ఇమామ్,మౌజమ్,పాస్టర్లకు ఆర్థికసాయం
-
లాక్డౌన్ వేళ..ఆర్థిక అండ
జయనగరం పూల్‌బాగ్: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు నిషేధించింది. భక్తులు రాకపోవడంతో అర్చకులు, మౌజమ్(ఇమామ్)లు, పాస్టర్లకు భృతి కరువైంది. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. జిల్లా వ్యాప్తంగా 3,060 మందికి రూ.5వేలు చొప్పున రూ.కోటీ53లక్షల ఆర్థిక సా యం మంగళవారం అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాలో వివిధ దేవాలయాల్లో పూజలు చేసే 1616 మంది అర్చకులు, చర్చిల్లో ప్రార్థనలు జరిపే 1320 మంది పాస్టర్లు,62 మసీదుల్లో నమాజ్ చేయించే 124 మంది మౌజామ్,ఇమామ్‌లు లబ్ధిపొందనున్నారు. వీరి ఖాతాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి నగదు జమచేయనున్నారు. ఆర్థిక సాయంపై లబ్ధిదారు ల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేక ఆర్థిక సాయం... లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పాస్టర్లను, మౌజామ్లు, ఇమామ్‌లను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. అందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.5వేలు సాయం అందించనుంది. జిల్లా వ్యాప్తంగా 1320 మంది పాస్టర్లు, 62 మంది మౌజామ్లు, 62 మంది ఇమామ్‌లు ఉన్నారు. వారందరికీ సాయం అందుతుంది. దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ఎండోమెంట్ శాఖ ద్వారా సాయం అందనుంది. జిల్లావ్యాప్తంగా అందరికీ కలిపి రూ.కోటి 53 లక్షలు సాయం అందనుంది. – ఎం.అన్నపూర్ణమ్మ, మైనారిటీ సంక్షేమాధికారి, విజయనగరం కష్టకాలంలో ఆదుకుంటున్నారు.. సీఎం జగన్మోహన్రెడ్డి కష్టకాలంలో ఆదుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇటువంటి సమ యంలో ఆర్థికంగా సాయం అందించి ఆదుకోవడం శుభపరిణామం. రెండు నెలలుగా ఆలయాలకు భక్తులు రాకపోవడంతో భృతికరువైంది. అర్చకులకు అండగా నిలవడం అభినందనీయం. – ఆకెళ్ల భాస్కరరావు, అర్చకులు, విజయనగరం -
నేడు అర్చకులు,పాస్టర్లుకు రూ.5వేల చొప్పున సాయం
-
పురోహితులను ఆదుకోండి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): పితృకర్మలు నిర్వహించే పురోహితులు లాక్డౌన్ కారణంగా ఉపాధిలేక అవస్థలు పడుతుండడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దిగువనున్న దుర్గాఘాట్ పక్కనే ఉన్న పిండప్రదాన కార్యక్రమాల రేవులో దాదాపు వంద మందికి పైగా పురోహితులు అపరకర్మలు చేయిస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ, లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి వీరంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అపరకర్మలు చేయించుకునేందుకు ఎవరూ రాకపోతుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. చివరికి ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. ఈ విషయం వైఎస్ విజయమ్మ దృష్టికి వెళ్లింది. మానవత్వంతో స్పందించిన ఆమె.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో మాట్లాడి పురోహితులను ఆదుకోవాలని సూచించారు. దీంతో.. ఆమె సూచన మేరకు మంత్రి వెలంపల్లి శనివారం ఉదయం పిండ ప్రదాన రేవు పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రాంగణంలో పురోహితులకు నిత్యావసర సరుకులను అందజేయనున్నారు. -
‘ అర్చకులకు’ రూ.5,000 సాయం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆలయాల్లో భక్తుల దర్శనాల నిలిపివేతతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ. 5,000లు గ్రాంట్ రూపంలో చెల్లించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. దేవదాయ శాఖ నుంచి ఎలాంటి నెలవారీ జీతాలు పొందని, ధూప దీప నైవేద్యం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందని వారికి అర్చక సంక్షేమ నిధి నుంచి ఈ సాయాన్ని చేయనున్నట్టు మంత్రి తెలిపారు. 2,500 మంది అర్చకులకు లబ్ధి.. ► లాక్డౌన్ కారణంగా దేవాలయాలలోకి భక్తులను అనుమతించడం లేదు. ప్రస్తుతం అర్చకులు మాత్రమే ఏకాంతంగా నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ► దీంతో చిన్న దేవాలయాలలో ఎలాంటి ఆదాయ వనరులు లేని కారణంగా అర్చకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ► ధూప దీప నైవేద్యం, అర్చక వెల్ఫేర్ ఫండ్ ద్వారా 2,800 మందికి పైగా అర్చకులకు ప్రతి నెలా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుంది. ఈ రెండు పథకాలూ వర్తించని వారు రాష్ట్ర వ్యాప్తంగా 2,500 మంది దాకా పలు ఆలయాల్లో పనిచేస్తున్నారు. ► అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్మోహన్రెడ్డి అర్చక వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఒక్కొక్కరికి రూ. 5000 గ్రాంటు మంజూరు చేయాలని ఆదేశించారు. ► ఈ నిర్ణయం కారణంగా అర్చక సంక్షేమ నిధిపై సుమారు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల భారం పడనుంది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు కరోనా విపత్కర పరిస్థితుల్లో అర్చకులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగానే సానుకూలంగా స్పందించారు. అర్చకులకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు ప్రకటించినందుకు అర్చక సమాఖ్య తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, పెద్దింటి రాంబాబు (ఆంధ్రప్రదేశ్ అర్చక సమఖ్య ప్రధాన కార్యదర్శి, కార్యనిర్వాహక కార్యదర్శి) చిన్న ఆలయాల్లో అర్చకులను ఆదుకునే దిశగా నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – ద్రోణంరాజు రవికుమార్, అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు -
బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది
సాక్షి, విజయవాడ: బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అర్చకుల వంశపారంపర్యంపై నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన జీవోను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సవరించి అమల్లోకి తెచ్చారు. వంశపారంపర్య అర్చకత్వంపై జారీ చేసిన జీవో 439 నేటి నుంచి కార్యరూపం దాల్చనుంది. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా అర్చకుడు మదనగోపాలస్వామికి తొలి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ బ్రాహ్మణులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారన్నారు. వంశపారంపర్య అర్చకత్వాన్ని కొనసాగించేందుకు జీవోను సవరించారని తెలిపారు. రాష్ట్రంలో ఆలయాల పునురుద్ధరణ, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టమని సీఎం జగన్ ఆదేశించారన్నారు. అందులో భాగంగా అన్ని ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించారని పేర్కొన్నారు. (జీర్ణ దేవాలయాలను ఉద్ధరించిన జీవో) అర్చక సమాఖ్య కార్యదర్శి ఆత్రేయబాబు మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో అర్చకులకు తీరని ద్రోహం చేశారన్నారు. అర్చకులతో బలవంతపు పదవీ విరమణలు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత అన్ని ప్రభుత్వాలు అర్చకులను నిర్లక్ష్యం చేశాయన్నారు. పుష్కరకాలం తర్వాత సీఎం జగన్ అర్చకుల జీవితాలకు భరోసా కల్పించారని పేర్కొన్నారు. మా కుటుంబాల్లో జీవనజ్యోతి వెలిగించారని సంతోషం వ్యక్తం చేశారు. (అర్చకుల కల సాకారం) -
జీర్ణ దేవాలయాలను ఉద్ధరించిన జీవో
ఆంధ్రప్రదేశ్‌లో చాలా కాలంగా అర్చకులు కంటున్న కలలు నెరవేరేలా గత సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగ భద్రత, అర్హత కలిగిన వారసత్వ గుర్తింపు, చిన్న దేవాలయాలపై దేవాదాయ శాఖ పెత్తనాన్ని తొలగించే ఈ ఉత్తర్వుల కోసం అరకొర జీతాలతో, సదుపాయాలతో గ్రామాల్లో దేవాలయాల్ని అంటి పెట్టుకొని జీవిస్తూ ఉన్న అర్చకులు ఎదురుచూస్తూ ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా ఇది సాధించటం కోసం అర్చక సమాఖ్య ప్రతినిధులు తిరగని ఆఫీసు లేదు, కలవని అధికారులు, రాజకీయ నాయకులు లేరు. 1987లో మొదలైన ఈ కష్టాలకు 2007లో రాజశేఖర్ రెడ్డి చట్ట సవరణ ద్వారా వెసులుబాటు కల్పిస్తే ఒక దశాబ్దం తర్వాత దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణ రూపంలో తీసుకువచ్చారు. 2017 లో ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ముసాయిదా తయారై జీవో 76 రూపంలో విడుదలైనా, ఆనాటి ప్రభుత్వం వాటిని నిర్ధారించకుండానే వదిలేసింది. ఈరోజు శాశ్వత ప్రాతిపదికలో జీవో 439 ద్వారా ఆ అంశాలను నిర్ధారించారు. 1987వ సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని సమూలంగా చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సు మేరకు సవరించి నూతన చట్టాన్ని తీసుకువచ్చారు. అంతవరకు ఉన్న వ్యవస్థను నాశనం చేయడంలో ఈ చట్టం సఫలీకృతం అయింది. కానీ దానికి ప్రత్యా మ్నాయంగా మరొక విధానాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చట్టంలో ఎక్కడా కనిపించలేదు. సంస్కరణ ప్రధానంగా కాకుండా, ఎవరి మీదనో ద్వేషంతో, కోపంతో చట్టాలు తీసుకొని వస్తే దాని దుష్పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఈ చట్ట సవరణలో తిరుమల తిరుపతి దేవస్థానంలోని మిరాసి హక్కులను తొలగించారు. ఈ మొత్తం చట్టంలో హర్షించదగిన సంస్కరణ ఇది ఒకటి. మరి ఇంక ఏ దేవాలయంలో లేని విధంగా తిరుమల దేవాలయంలో స్వామి వారికి సేవ చేసినందుకు ఆలయ ఆదాయంలో రకరకాల సేవలకు భాగం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి మిరాసీలు చాలా ఉన్నా ప్రధానమైనది అర్చక మిరాసి. ఆలయ ఆదాయం పెరగటంతో మిరాసీదారులకు కూడా ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. ఈ మిరాసి రద్దుతోపాటు వారసత్వ హక్కు, చిన్న గ్రామాలలో అర్చకులకు వచ్చే దక్షిణలు, దేవాలయాల్లో సేవ చేసినందుకు ఏర్పాటుచేసిన సర్వీస్ ఈనాములను రద్దు చేశారు. దేవాదాయ శాఖను విస్తృతపరచి ఆదాయం లేని చిన్న చిన్న దేవాలయాలను కూడా దేవాలయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న దేవాలయాలను వాటిని అంటిపెట్టుకుని అరకొర ఆదాయంతో పనిచేస్తున్న అర్చకులను ఈ సంస్కరణ బాగా దెబ్బ తీసింది. వారికున్న చిన్న ఆదాయపు వనరులను తీసివేశారు కానీ, ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఎటువంటి వనరులను ఏర్పాటు చేయలేకపోయింది. చిన్న ఆలయాల నిర్వహణకు ప్రభుత్వ ప్రతిపాదన ఏమిటి అని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేక పోయింది. ఈ అంశాన్ని పరిశీలించి సుప్రీంకోర్టు ఇచ్చిన భిన్న ఉత్తర్వులను అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజుల్లో తాత్సారం ప్రదర్శించింది. రాజకీయంగా పట్టించుకోని, స్పందిం చని నిరంకుశ ప్రభుత్వం, అవినీతిమయమైన, చలనం లేని దేవాదాయ, ధర్మాదాయ శాఖతో ఆ రోజుల్లో చిన్న దేవాలయాల్లోని పురోహితులు పడిన కష్టాలు వర్ణనాతీతం. చట్ట సవరణ వారికి వ్యతిరేకంగా ఉండటంతో క్షేత్రస్థాయిలో అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మొదలెట్టారు. అధికార యంత్రాంగం విస్తరించి చిన్న దేవాలయాలు కూడా వారి పరిధిలోకి రావటంతో ఆ వచ్చే అరకొర ఆదాయం ఈ అధికారుల జీతాలకే సరిపోయింది. ఈ సమస్య కేవలం అర్చకులకే కాదు. దేవాలయానికి ఇతరత్రా సేవలు చేస్తున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు మొదలైనవారు కూడా అనుభవించారు. ఈ చిన్న చిన్న కులాల వారి కుండే సర్వీస్ ఈనాములను కూడా తొలగించారు. గ్రామాలలోని చిన్న దేవాలయాల్లో చాలామంది బ్రాహ్మణ కులాలకు సంబంధించని లింగాయతులు, బోయలు, తంబళ్ల కులస్తులు, చాద్ధాట వైష్ణవులు అర్చకత్వం నిర్వహిస్తుంటారు. వీరందరు కూడా ఈ నూతన చట్టంతో తరతరాల వృత్తిని వదిలి పెట్టలేక, సరైన జీవనభృతి లేక కష్టాలు అనుభవించారు. ఈ సమయంలో చిన్న గ్రామాలలోని దేవాలయాల అర్చకుల తరఫున నాయకత్వం వహించి దేవాలయాల పరిరక్షణ ఉద్యమాన్ని నడిపిన ఘనత చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఎమ్వీ సౌందర్‌రాజన్‌కి దక్కు తుంది. సుప్రీంకోర్టు దాకా ఈ అంశంపై జరిగిన కేసులలో వీరు చాలా ప్రధాన పాత్ర పోషించారు. ప్రజాభిప్రాయాన్ని చిన్న దేవాలయాల అర్చకుల సమస్యలు అర్థం చేసుకునే విధంగా కూడగట్టడంలో కూడా ప్రధాన పాత్ర పోషించారు. సుప్రీంకోర్టు తన తీర్పులో చిన్న దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక విధానాలు ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఆనాటి మంద తోలు మూర్ఖ ప్రభుత్వం ఈ సమస్యలపై కమిటీలు వేయడం వరకే పరిమితం అయింది కానీ సమస్య పరిష్కారానికి ఎటువంటి చొరవ చూపలేదు. ప్రభుత్వ అధినేతల నిర్లక్ష్య ధోరణితో ఏకపక్షంగా అధికారులు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న అర్చకులను ఎటువంటి పారితోషికం లేకుండా పదవీ విరమణ చేయించటం, వారి వారసులకు అర్చకత్వం బాధ్యతలు ఇవ్వకపోవటం సాధారణమైపోయింది. ఈ వేధింపులు తాళలేక మహబూబ్‌నగర్ జిల్లా అలంపురంలో భీష్మ సేనా చారి అనే పురోహితుడు గుడిగంటకు ఉరి వేసు కుని 2001లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. 2004లో ప్రభుత్వం మారటంతో ఈ సమస్యపై నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం దృష్టి సారించింది. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అఖిలపక్ష సిఫార్సు మేరకు చట్టాన్ని సవరించి వారసత్వ హక్కులను గుర్తించింది. ఆ చట్ట సవరణకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమోదించింది.. రాష్ట్రంలో ఆదాయం బాగా వచ్చేటటువంటి దేవాలయాలు చాలా కొద్ది మాత్రమే. ఆ ఆలయా లకు చిన్న గ్రామాలలో ఉండే ఆలయాలకు ఒకే విధమైన విధివిధానాలు ఉండాలి అనుకోవడం అవివేకం. గ్రామాలలోని చిన్న దేవాలయాలను ప్రత్యేకంగా పరిగణించి గ్రామ సమాజం యొక్క ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తితో అధికార యంత్రాంగం నియంత్రణ లేకుండా నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి ఈ విధి విధానాలు ఆ లక్ష్య సాధనకు తప్పకుండా ఉపయోగపడతాయి. అర్హతలేని వారసత్వానికి ఎక్కడా తావులేదు. ప్రభుత్వం కూడా సరైన విధానాలు ఏర్పాటు చేసి, సరైన ప్రావీణ్యం ఉన్నవారే ఎంపిక అయ్యేటట్లు చూడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా వారికి ఇచ్చే పారితోషికం తగిన స్థాయిలో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. పెద్ద దేవాలయాల ఆదాయాన్ని దీనికి కేటాయించడం ద్వారా కనీసం అర్చ కునికి 15 వేల రూపాయల నెలసరి పారితోషికం వచ్చేట్టుగా ఏర్పాట్లు చేయవచ్చు. అదేవిధంగా ధార్మిక ఉద్యోగులను దేవాదాయశాఖ పరిధి నుంచి తొలగించి ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేవలం హిందూ ధర్మంపై అవగాహన, విశ్వాసం ఉన్న వారితో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. దేవాలయాల ఆస్తులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. విద్యాసంస్థల పేరుతో, మరొక పేరుతో చాలామంది చౌకగా దేవాదాయ భూములు ఆక్రమించుకున్నారు. మరికొందరు చట్టవిరుద్ధంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు. వీరందరిని దేవాదాయ భూముల నుంచి తొలగించి భూములు ఆలయాలకు చెందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే సరైన ఆదాయవనరులు ఏర్పడి దేవాలయాలు సక్రమంగా నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుంది. అర్హత కలిగిన అర్చకులు, న్యాయబద్ధమైన పారితోషికం ఉన్ననాడు గ్రామాలలోని దేవాలయాలను హిందూధర్మ పరిరక్షణ ప్రచార కేంద్రాలుగా తీర్చిదిద్దవచ్చు. అర్చకులలో సామాజిక స్పృహ ఒక ప్రధాన బాధ్యతగా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు ప్రభుత్వం తీసుకున్న చర్య స్వాగతింపదగినది. భవిష్యత్తులో గ్రామాలలో దేవాదాయ వ్యవస్థను బలోపేతం చేయటానికి మరిన్ని చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
ఏపీ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుంది
-
మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. అర్చకుల చిరకాల స్వప్పమైన వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే చట్టం అమల్లోకి తెచ్చారు. 2007 లో మహానేత వైఎస్సార్ అర్చకులకు వంశపారంపర్య చట్టాన్ని తీసుకురాగా, గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయలేదు. పదేళ్ల తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ చట్టాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది. అర్చకులకు వంశపారంపర్య హక్కులను కల్పిస్తూ జీవో విడుదల చేయడం పట్ల అర్చక సమాఖ్య ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీని నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
అర్చకుల జీతాలు 25 శాతం పెంచుతాం
సాక్షి, అమరావతి : అర్చకుల సంక్షేమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన అర్చక సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్చకులకు సంబంధించిన అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్ ఆదేశాల మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అర్చకుల జీతాలను 25శాతం పెంచుతామని చెప్పారు. వంశపారంపర్య అర్చకత్వంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. అర్చకుల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని, వారి బాగుకోసం ఏదైనా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లాం, దేవాదాయశాఖ అధికారులు, 13 జిల్లాల అర్చక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సత్యదేవా.. పోస్టులకు రూ.లక్షలా!
సాక్షి, అన్నవరం (తూర్పుగోదావరి) : అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహిత పోస్టుల భర్తీ, పదోన్నతుల విషయంలో రూ. లక్షలు చేతులు మారుతున్నాయని దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు కొంతమంది ఫిర్యాదు చేశారు. పదోన్నతులకు రూ.50 వేలు, వ్రత పురోహిత పోస్టుకు రూ.3 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదు.. దేవస్థానంలో కలకలం సృష్టించింది. కోర్టు తీర్పు ప్రకారం 13 మంది పురోహితులను ఇటీవల ఈఓ ఎంవీ సురేష్‌బాబు నియమించారు. గతేడాది డిసెంబర్లో 20 మందికి ఇచ్చిన పదోన్నతులు వివిధ కారణాల వల్ల అమలు కాలేదు. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వీరికి పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతులతో బాటు గతంలో ఖాళీ ఏర్పడిన 30 రెండో తరగతి వ్రత పురోహితుల పోస్టులతోపాటు ఖాళీగా ఉన్న 36 మూడో తరగతి వ్రత పురోహితుల పోస్టుల భర్తీ చేయడానికి కమిషనర్ ఆదేశాలిచ్చారు. ఇప్పుడు ఈ పదోన్నతులపైనే వివాదం ఏర్పడింది. మొత్తం 80 మంది మూడో తరగతి పురోహితులు పదోన్నతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కమిషనర్ ఉత్తర్వుల మేరకు సీనియర్లకే పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతమంది జూనియర్ వ్రత పురోహితులు కూడా పదోన్నతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా భర్తీ చేసే వ్రత పురోహితుల పోస్టులకు కూడా గట్టి పోటీ ఉందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు.. ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈఓగా ఆర్జేసీ వస్తారంటూ ప్రచారం ఇదిలా ఉండగా, దేవస్థానం ఈఓగా తిరిగి ఆర్జేసీ వి.త్రినాథరావు నియమితులవుతారన్న ప్రచారం సాగుతోంది. ఒకటి రెండ్రోజుల్లో ఆయనను నియమిస్తూ ఆదేశాలు వెలువడుతాయన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రస్తుత ఈఓ సురేష్‌బాబు ఈ పదోన్నతులు, నియామకాలు చేపట్టాలని తొందర పడుతున్నారని కొంతమంది ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కొత్తగా పోస్టులు, పదోన్నతులు భర్తీ చేయడంలేదు కోర్టు తీర్పు ప్రకారం 13 మంది పురోహితులను నియమించడం, కమిషనర్ ఆదేశాల మేరకు గత డిసెంబర్లో ఇచ్చిన పురోహితుల పదోన్నతులను మాత్రమే అమలు చేయనున్నట్టు దేవస్థానం ఈఓ సురేష్‌బాబు తెలిపారు. కొత్తగా పదోన్నతులు, పోస్టుల భర్తీ చేయడం లేదని గురువారం ఆయన ‘సాక్షి’కి తెలిపారు. పదోన్నతులకు రూ.50 వేలు, పోస్టుకు రూ.3 లక్షలు వసూలు చేస్తున్నారన్నది వట్టి ప్రచారం మాత్రమేనని, అందులో వాస్తవం లేదని ఆయన అన్నారు. -
తిరుమలలో పీఠాధిపతులకు మహా అవమానం
-
పీఠాధిపతులకు మహా అవమానం
సాక్షి, అమరావతి: పీఠాధిపతులు, స్వామీజీలకు తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో ‘మహా’ అవమానం జరిగింది. వారు ఇప్పటివరకు మహాద్వారం ద్వారా ప్రవేశించి శ్రీవెంకటేశ్వరుని దర్శనం చేసుకునేవారు. అయితే ఇకమీదట స్వామివారి దర్శనానికి సాధారణ భక్తుల మాదిరే వారు క్యూలైన్లోనే వెళ్లాలట. తిరుమల ఆలయంలో ప్రముఖులకు నేరుగా మహాద్వారం ప్రవేశంపై చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా జారీ చేసిన సరికొత్త జీవో పెద్ద దుమారం రేపుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజు ఆదివారం సెలవు దినమైనప్పటికీ సీఎం చంద్రబాబు హడావుడిగా ఈ జీవోను జారీ చేయించారు. ఈ జీవోను హిందూ మతపెద్దలు, బ్రాహ్మణ సంఘాలు, అర్చకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాజకీయ పదవుల్లో ఉండే వారందరికీ శ్రీవారి ఆలయ మహాద్వారం గుండా నేరుగా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం తమను విస్మరించడంపై పీఠాధిపతులు, స్వామీజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. పీఠాధిపతులు, స్వామీజీల పట్ల ప్రభుత్వం మహా అపచారం చేసిందని తప్పుపట్టారు. హడావుడి ఉత్తర్వులు.. తిరుమలలో శ్రీవారి ఆలయ దర్శనానికి నేరుగా మహాద్వారం ద్వారా ప్రవేశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి హడావుడిగా జీవోఎంఎస్ 240 నంబర్ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్, మాజీ రాష్ట్రపతులు, మాజీ ఉప రాష్ట్రపతులు, ఉప ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, సుప్రీంకోర్టు జడ్జిలు, రాష్ట్ర మంత్రులు, మాజీ ప్రధానులు, పదవీ విరమణ చేసిన గవర్నర్లు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు తిరుమల ఆలయ ప్రవేశానికి నేరుగా మహాద్వారం గుండా వెళ్లే గౌరవాన్ని కల్పిస్తూ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. గతంలో ఈ హోదా కల్పించిన వారి జాబితా పూర్తిగా రద్దవుతుందని, తాజాగా పేర్కొన్న జాబితాలోని వారికే మహాద్వార ప్రవేశానికి అవకాశం ఉంటుందని ఇందులో స్పష్టం చేశారు. తప్పు పడుతున్న పీఠాధిపతులు.. ఈ జాబితాలో పీఠాధిపతులు, స్వామీజీలు లేకపోవడాన్ని హిందూ మతపెద్దలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇప్పటివరకు కొంతమంది పీఠాధిపతులు, స్వామీజీలకు తిరుమలలో స్వామివారి వద్దకు నేరుగా ఆలయ మహాద్వారం గుండా ప్రవేశించే అర్హత ఉందని.. అయితే ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులో ‘రివైజ్డు లిస్టు’ అని స్పష్టంగా పేర్కొనడంతో గతంలో మహాద్వారం గుండా ప్రవేశ అర్హత ఉన్న వారందరూ ఇప్పుడు ఆ అర్హతను కోల్పోయినట్టేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ చర్య పీఠాధిపతులను అవమానించడంగా హిందూ మతపెద్దలు అభిప్రాయపడుతున్నారు. హిందూ ధర్మాన్ని ప్రబోధించే పీఠాధిపతులు, స్వామీజీల పట్ల ప్రభుత్వం అగౌరవం చూపుతున్నదనేందుకు ఇది నిదర్శనమంటున్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తిరుమల ఆలయంతోసహా రాష్ట్రంలోని ఆలయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం పర్యవేక్షణ అధికారాలు మాత్రమే ఉన్నాయని.. ఆలయాల నిర్వహణ అన్నది ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. దీనికి భిన్నంగా ఇప్పుడు తిరుమల శ్రీవారి ఆలయంతోసహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో చంద్రబాబు ప్రభుత్వం, అధికారపార్టీ నేతల జోక్యం మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయిందని, తాజా ఉత్తర్వులు ఇందుకు దృష్టాంతమని వారు అభిప్రాయపడుతున్నారు. స్వామీజీలు చంద్రబాబు తీరును తప్పు పట్టడమే కారణమా? తిరుపతి తిరుమల దేవస్థానం(టీటీడీ)తోపాటు రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో ప్రభుత్వ జోక్యం పెరగడంతోపాటు ఆలయాల నిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించడంపై గత ఐదేళ్లుగా పలు సందర్భాల్లో పీఠాధిపతులు, స్వామీజీలు బహిరంగ వేదికలపైనే సీఎం చంద్రబాబు తీరును తప్పుపడుతూ తీవ్ర విమర్శలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో ఏకపక్షంగా 30కిపైగా ఆలయాల్ని ప్రభుత్వం కూల్చివేయడం, గోదావరి పుష్కరాలకు ఆలయాల డబ్బులను పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి ఆ కార్యక్రమాలన్నింటినీ సీఎం తన వ్యక్తిగత ప్రచారానికి వాడుకోవడాన్ని వారు నేరుగా తప్పుపట్టారు. దీనిపై మనస్సులో పెట్టుకుని.. కక్షపూరితంగానే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? అని ఈ సందర్భంగా అధికార వర్గాల్లోనే చర్చ జరుగుతుండడం గమనార్హం. వేరే ప్రాంత పీఠాధిపతులు కోరినా తిరస్కరించి.. అతి ప్రాచీన సంప్రదాయాల్లో ఒకటైన శ్రీవైష్ణవ రామానుజ సంప్రదాయాన్ని అనుసరిస్తున్న జియ్యర్లు, తొండమాన్ చక్రవర్తుల కుటుంబానికి చెందినవారితోపాటు దేశవ్యాప్తంగా 8 మఠాలకు చెందిన పీఠాధిపతులకు, ఆలయ ప్రముఖులైన సన్నిధి గొల్ల, ఆలయ అర్చకులకు మాత్రమే తొలుత తిరుమల ఆలయంలోకి నేరుగా మహాద్వార ప్రవేశం ఉండేదని మతపెద్దలు చెబుతున్నారు. బ్రిటీష్ పాలనలో కొందరు బ్రిటీష్ అధికారులకు సైతం మహాద్వార ప్రవేశం నిరాకరించినట్టు చెబుతారు. ఈ నేపథ్యంలో మహాద్వార ప్రవేశ అవకాశం లేని తమిళనాడుకు చెందిన ఒక పీఠాధిపతి తనకూ ఆలయ మహాద్వార ప్రవేశం కల్పించాలని కోరగా.. టీటీడీ తిరస్కరించినట్టు చెబుతుంటారు. అయితే స్వాతంత్య్రానంతర కాలంలో దశలవారీగా రాజ్యాంగ పదవుల్లో ఉన్న ముఖ్యులు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, రాష్ట్ర సీఎం, సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వంటి వారికి మహాద్వార ప్రవేశ అర్హత కల్పించినట్టు పేర్కొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగ పదవుల్లో ఉన్న మరికొంత మందికీ, మంత్రులు వంటివారికీ అదనంగా జాబితాలో చోటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో అర్హత ఉన్న పీఠాధిపతులు, స్వామీజీలకు ఆ జాబితాలో చోటు కల్పించకపోవడం అధికార వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. -
కన్యాదానం ఇవ్వను
రెండు రోజులుగా ట్విట్టర్లో ఒక విశేషం వైరల్ అవుతోంది. అస్మితాఘోష్ అనే యువతి ఈ మధ్య ఒక పెళ్లికి వెళ్లింది. బెంగాలీ పెళ్లే అది. పెళ్లి తంతును మహిళా పూజారులు నిర్వహించారు! అది ఆ అమ్మాయికి సంతోషంగా అనిపించింది. అస్మిత ఫెమినిస్ట్. గాయని. రచయిత్రి. ఆధునిక భావాలు ఉన్న అమ్మాయి కనుక సహజంగానే ఆమెకు పెళ్లి వేదికపై మహిళా పురోహితులు కనిపించడం సంతోషాన్నిచ్చే సంగతి అయింది. మంత్రోచ్చాటనగా వధువును ఆ పురోహితులు పరిచయం చేసిన విధానం కూడా అస్మితను ఆకట్టుకుంది. మొదట వాళ్లు తల్లి పేరు చెప్పారు. తర్వాత తండ్రి పేరు చెప్పారు. ఆ తల్లిదండ్రుల కూతురే ఈ వధువు అని చెప్పారు. తల్లి పేరు ముందు చెప్పడం అస్మితను ముగ్ధురాలిని చేసింది. కన్యాదానం దగ్గరికి వచ్చేసరికి ఆ తండ్రి.. ‘‘నేను కన్యాదానం ఇవ్వను’’ అనేశారు! అస్మిత్ పోస్ట్ చేసిన ఫొటోలో లేరు కానీ, పెళ్లికొచ్చిన అతిథులు ఆ మాటకు నివ్వెరపోయారు. ‘‘అవును. నేను కన్యాదానం చేయబోవడం లేదు. నా కూతురు ఆస్తి కాదు. దానం ఇవ్వడానికి’’ అన్నారు. ఇది కూడా అస్మితకు నచ్చింది. వెంటనే వధూవరులున్న ఒక ఫొటోను ఎంపిక చేసుకుని, ఫొటోతో పాటు వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘అయామ్ సో ఇప్రెస్డ్’ అని కామెంట్ కూడా పెట్టింది. ఫిబ్రవరి నాలుగున పోస్ట్ పెడితే ఇప్పటికింకా నిరవధికంగా లైక్‌లు వస్తూనే ఉన్నాయి. దాదాపు అందరి అభిప్రాయం ఒక్కటే. ‘మెల్లిమెల్లిగా సంప్రదాయాలను, ఆచారాలను మార్చుకుంటూ వస్తున్నాం. ఇది మంచి విషయం’ అని. అషీమా అనే అమ్మాయి.. ‘ఇది ఏ గ్రహంలో జరిగింది? అందమైన మనుషులు’ అని ట్వీట్ చేసింది. దేవిప్రసాద్ మిశ్రా అనే అతను ‘దిస్ ఈజ్ ఎక్స్లెంట్. థ్యాంక్యూ ఫర్ షేరింగ్’ అని కామెంట్ ఇచ్చాడు. విమల్ అరోరా ‘ప్రోగ్రెసివ్’ అన్నాడు. రమేశ్ చంద్ర అనే యువకుడు ‘వెరీ బ్రేవ్ ఆఫ్ దెమ్! ఆదర్శప్రాయం’ అని ట్వీట్ పెట్టాడు. దీనిని బట్టి యువతరం ఆలోచనా ధోరణి అధునాతనం అవుతోందని తెలుస్తోంది. పూర్వ ఆచారాలను వారేమీ పూర్తిగా నిరాకరించడం లేదు. వాటిలోని అంతరార్థాలు తెలిశాక, అవి నచ్చకపోతే తిరస్కరిస్తున్నారు. ఇలాంటి ఘటనే, పశ్చిమబెంగాల్లోనే ఇటీవల ఒకటి జరిగింది. వధువు ‘కనకాంజలి’ అనే ఆచారాన్ని పెళ్లి పీటల మీదే తిరస్కరించింది. వధువు గుప్పెట నిండా బియ్యం తీసుకుని తలపై పోసుకుంటూ, ‘‘నా తల్లిదండ్రుల రుణాన్ని తీర్చేశాను’’ అని చెప్పడమే కనకాంజలి ఆచారంలోని పరమార్థం. అయితే ఆ వధువు.. ‘‘తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీరేదీ, తీర్చుకోగలిగిందీ కాదు. కనుక నేను ఆ మంత్రాన్ని జపించలేను’’ అని ధైర్యంగా పురోహితులతో చెప్పడం అనేక మంది అభినందనలకు కారణమైంది. అస్మితా ఘోష్‌ను కూడా ఇప్పుడు మనం అభినందించాలి. ఆమే కనుక ట్వీట్లో తను వెళ్లిన పెళ్లిలోని ప్రత్యేకతల గురించి చెప్పకుంటే ఆ ప్రత్యేకతలు అక్కడితో ఆగిపోయేవి. -
శ్రీశైలంలో అర్ధరాత్రి పూజలు.. కలకలం
సాక్షి, శ్రీశైలం/కర్నూలు : శ్రీశైల మల్లన్న సన్నిధిలో కలకలం రేగింది. వేదపండితుడు గంటి రాధాకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు ఆలయ ఈవో రామచంద్రమూర్తి ప్రకటించారు. రాధాకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా వ్యవరించాడంటూ పేర్కొన్నారు. క్షుద్రపూజలు చేశాడని ఆరోపించారు. దీంతో అధికారులు, వేదపండితుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోనూ క్షుద్రపూజలు నిర్వహించారనే ఆరోపణలొచ్చాయి. -
ఆ సినిమాను విడుదల కానివ్వం
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీఖాన్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కేదార్నాథ్’ . ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ టీజర్ ఇదివరకే విడుదలై మంచి ఆదరణ పొందింది. 2013 సంవత్సరంలో చోటుచేసుకున్న ఉత్తరాఖండ్ చారదామ్ వరదల నేపథ్యంతో సాగే ప్రేమ కథగా సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం డిసెంబర్ 7వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై కేదార్నాథ్(తీర్థ్ పురోహిత్) ఆలయ పూజారులు మండిపడుతున్నారు. హిందూ మతాన్ని కించపరిచేలా సినిమా ఉందని, సినిమా విడుదల చేస్తే ఊరుకోమంటున్నారు. సినిమా ‘లవ్ జీహాదీ’ని ప్రోత్సహించేలా ఉందని వారు ఆరోపిస్తున్నారు. సినిమాను విడుదల కానివ్వమని, ఒక వేళ విడుదల చేయాలని చూస్తే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. రుద్రప్రయాగలో కొంతమంది నిరసనకారులు సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. -
బ్రాహ్మణేతర మహిళా పూజారులు!
సాక్షి, ముంబాయి: అవకాశాలను అందిపుచ్చుకుని మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వివక్ష, అవమానాలను ఎదుర్కొని తాము ఎంచుకున్న రంగంలో నిలదొక్కుకుంటున్నారు. ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి సాయంతో సంస్కృతం నేర్చుకుని వైదిక కర్మకాండలు నిర్వహిస్తూ అందరి మెప్పు పొందుతున్నారు మెహపెడా గ్రామానికి చెందిన బ్రాహ్మణేతర మహిళలు. విశ్రాంత ఉపాధ్యాయుడి కృషి ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలో ఈ మెహపెడా గ్రామం ఉంది. అలియాబాగ్‌కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు రామేశ్వర్ కార్వే(101) ఓ రోజు ఈ గ్రామానికి సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపన్యాసం ఇచ్చాడు. అది విన్న మెహపడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమ గ్రామంలోని వారికి సంస్కృత పాఠాలు నేర్పాలని కోరాడు. అలా 18 ఏళ్ల క్రితం సంస్కృత శిక్షణ ప్రారంభమైంది. ఆ గ్రామంలోని బ్రహ్మణేతర కుటుంబాలకు చెందిన 150 మంది మహిళలు సంస్కృతం చదువుకుని పట్టాలు సాధించడం, అర్చకత్వ శిక్షణ పొందడం వెనుక రామేశ్వర్ కృషి, పట్టుదల ఎంతో ఉంది. ‘వీరసావర్కర్ జైలులో ఉన్నప్పుడు మా నాన్న వెళ్లి కలిసేవారు..సంస్కృతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన మా నాన్నకు చెప్పేవారు... అలా మా నాన్నగారు రాయ్‌గఢ్ జిల్లాలో ఐదు విద్యాసంస్థలను ప్రారంభించారు. సంస్కృతాన్ని బ్రాహ్మణేతర ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మా నాన్న ప్రధాన లక్ష్యంగా ఉండేద’ని కార్వే కుమార్తె వసంతి డియో చెప్పారు. అయితే మొదట్లో సంస్కృతం నేర్చుకునేందుకు ఆ గ్రామానికి చెందిన మహిళలు ఆసక్తి చూపలేదు. వారిని క్లాసులకు రప్పించడమే కార్వేకు పెద్ద సవాలు. ‘ హోం వర్క్ ఇవ్వడం వల్ల ఇంట్లో పనులకు ఇబ్బంది కలుగుతోంది..దీంతో చదువుకోవడానికి రావడం మానేస్తారని..హోం వర్క్ ఇచ్చేవారు కాదు...చిన్న పిల్లలను స్కూలుకు రప్పించేందుకు ఉపాధ్యాయులు ఎంత కష్టపడతారో తమ గురూజీ కూడా తమ పట్ల అంతే శ్రద్ధ తీసుకునేవారు’ అని మొదటి బ్యాచ్‌కు చెందిన సురేఖా పాటిల్ తెలిపారు. అన్ని రకాల పూజలు పూజాధిక కార్యక్రమాలను మహిళలు నిర్వహించడాన్ని మొదట చాలా మంది అంగీకరించలేదు. క్రమంగా వారికి ఆహ్వానాలు అందుతున్నాయి. ముంబై మహానగరంతో పాటు థానే, నవీ ముంబాయిలోనూ ఈ మహిళా పూజారులు వివిధ క్రతువులు నిర్వహిస్తున్నారు. పెళ్ళిళ్లు, దశదిన కర్మలు, ఒడుగు, సాధారణంగా పురుషులు మాత్రమే నిర్వహించే శని శాంతి పూజ వంటి వాటిని కూడా వీరు చేయడం గమనార్హం. ఈ మహిళంతా ఆరు నెలల కరస్పాండెన్స్ కోర్సు ‘సంస్కృత భారతి’ని పూర్తి చేశారు. వీరిలో ఎక్కువ మంది నూటికి 80 నుంచి 90 మార్కులు సాధించడం విశేషం. అయితే, ఇప్పటికీ కొన్ని చోట్ల పూజలకు వెళ్లినపుడు వారి వారి బంధువులు తమను తక్కువ చేసి మాట్లాడటం, మంత్రాలు సరిగా చదువుతారా? పూజలు సక్రమంగా చేస్తారా అంటూ వ్యంగ్యగా మాట్లాడుతుంటారు...వాటిని విని నవ్వుకుంటూ తమ పని తాము చేసుకు పోతామని దాల్వీ అనే మహిళా పూజారి పేర్కొన్నారు. ఓ చోట సత్యనారాయణస్వామి వ్రతం చేయడానికి వెళ్లాం..సాధారణంగా పూజ అనంతరం పూజారి కాళ్లకు నమస్కరించి ప్రసాదం తీసుకోవడం అనవాయితీ.. కానీ తాము పూజ చేసిన అనంతరం కాళ్లకు మొక్కకుండానే ప్రసాదాన్ని తీసుకుంటారని చెప్పుకొచ్చారు. -
అర్చకులకు తీపికబురు!
జోగుళాంబ శక్తిపీఠం: ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. వారి పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అర్చకులు తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నప్పటికీ గతేడాది సెప్టెంబర్ 15న వేతనాల చెల్లింపు కోసం జీఓ నం.577ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో వేతనాల చెల్లింపుపై స్పష్టత ఉన్నప్పటికీ ఉద్యోగ విరమణ అనంతరం వృద్ధులైన అర్చకులు పింఛన్ పొందే విషయమై ఎలాంటి ఆదేశాలు పొందుపర్చలేదు. గతంలో చాలీచాలని వేతనాలే కాకుండా ఉద్యోగ విరమణ పేరిట అలంపూర్‌కు చెందిన భీమసేనాచార్యులు అనే అర్చకుడికి రిటైర్డ్మెంట్ నోటీస్ ఇవ్వడంతో కుటంబాన్ని పోషించుకోలేని స్థితిలో చేసేదిలేక ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఇలాంటి పరిస్థితిలో కనీసం తమకు పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచమని అర్చకులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుని అర్చకుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇదే సందర్భంలో అర్చక, ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా నేరుగా ప్రభుత్వమే ప్రతినెలా 1వ తేదీన వేతనాలు చెల్లించేందుకు కీలక నిర్ణయం వెలువరించింది. 171 మంది అర్చకులకు లబ్ధి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 6 ‘ఏ’ కేటాగిరీ కలిగిన ఆలయాల్లో 44 మంది అర్చకులు, 6 ‘బీ’ కేటాగిరీ 102 మందికి, 6 ‘సీ’ కేటాగిరీ ఆలయాల్లో 25 మంది చొప్పున మొత్తం కలిపి 171 మందికి పదవి విరమణ వయస్సు పెంపు ప్రయోజనం చేకూరనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాల చెల్లింపు ప్రక్రియలో భాగంగా వారం రోజులుగా అధికారులు 324 మంది కాంట్రాక్టు, ఎన్ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ వారికి 2015 పీఆర్సీ ప్రకారం వేతనాల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు. అందులో భాగంగానే మూడురోజుల క్రితం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా కేవలం 31 మందికి మాత్రమే వారి వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలను జమచేశారు. నేడు మరో 189 మంది అర్చక, ఉద్యోగులకు వేతనాలు చెల్లించనున్నారు. మరో విడతలో మిగిలిన వారందరికీ 2015 పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రుణపడి ఉంటాం.. ప్రభుత్వ వేతనాల చెల్లింపులతో పాటుగా పదవీ విరమణ వయస్సు 58 నుంచి 65కు పెంచడంతో నా లాంటి వృద్ధాప్యంలో ఉన్న అర్చకులకు భరోసా కల్పించినట్లయింది. పింఛన్ లేని లోటును ఈ విధంగా తీర్చినందుకు అర్చకలోకం రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది. –వీరయ్య, మద్దిమడుగు దేవస్థానం అర్చకుడు, నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని రెండు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలకు ఫలితం దక్కింది. ఈ సందర్భంగా వేతనాల చెల్లింపులపై చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు జిల్లా అర్చక, ఉద్యోగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. – జనుంపల్లి జయపాల్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా అర్చక, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు -
అర్హులైన అర్చకులకు త్వరలో వేతనాలు
సాక్షి, హైదరాబాద్: అర్హులైన అర్చకులు, ఆలయ ఉద్యోగులందరికి త్వరలోనే వేతనాలు చెల్లిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలపై మంగళవారం సచివాలయంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ, కొన్ని సాంకేతిక కారణాలవల్లే 131 ఆలయాలకు సంబంధించిన 6బీ, 6సీ, 6డీ కేటగిరి కింద ఉన్న అర్చకులు, ఆలయ ఉద్యోగుల డాటా ఇంకా ఆన్లైన్ చేయలేదన్నారు. ఈ 131 ఆలయాల్లో పనిచేస్తున్న వారితోపాటు, అర్హతలు ఉన్నా, లిస్ట్‌లో తమ పేరు లేదని కొంతమంది నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వారి సమస్యల పరిశీలనకు ఓ కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. 1,903 మందికి రివైజ్డ్ వేతనాలు వారి ఖాతాల్లో వేయడం జరుగుతుందన్నారు. 1,500 మందికి ఈ నెలాఖరులోగా జమ చేయడం జరుగుతుందన్నారు. ఆందోళన తాత్కాలిక వాయిదా గత 15రోజులుగా అర్చక, ఉద్యోగులు చేస్తున్న ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. దేవాలయాల్లో ఆర్జిత సేవలను బుధవారం నుంచి ప్రారంభిస్తామని అర్చక, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గంగు భానుమూర్తి వెల్లడించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇచ్చిన హామీతో జేఏసీకి సంతృప్తి కలగడంతో ఈ ఆందోళన విరమిస్తున్నామన్నారు. -
12 నుంచి 16 వరకు రితుమలలో సంప్రోక్షణ
-
తిరుమలలో మహాసంప్రోక్షణకు రేపే అంకురార్పణ
తిరుమల: శ్రీవారి ఆలయంలో పన్నెండేళ్లకోసారి నిర్వహించే బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈనెల 11న సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. అనంతరం 12 నుంచి 16 వరకు బాలాలయ మహాసంప్రోక్షణ జరగనుంది. ఈ సందర్భంగా వైకుంఠ నాథుడైన శ్రీవారి ఆలయంలో స్వామి వారికి సుప్రభాత సేవ మొదలుకుని ఏకాంత సేవ వరకు అన్నీ ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అంకురార్పణలో భాగం గా ముందుగా శనివారం రుత్వికుల నియామకం తర్వాత శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా పాత కళ్యాణోత్సవ మండ పంలో ఏర్పాటుచేసిన ప్రాంతంలో 28 కుండలాలు ఏర్పాటుచేస్తారు. ఆ తర్వాత రుత్వికులు, శ్రీవారి ఆలయ అర్చకులు ఆవు పాలు, నెయ్యి, పంచకం, పేడ, పెరుగుతో పంచగవ్య ఆరాధన చేసి పంచప్రాశ్యన స్వీకరణ చేస్తారు. సాయంత్రం అంకురార్పణకు శ్రీకారం చుడతారు. ప్రత్యేక టోకెన్ల జారీ నిలిపివేత శ్రీవారి దర్శనానికి సంబంధించి వివిధ రకాల దర్శన టోకన్ల జారీని గురువారం అర్ధరాత్రి నుంచే టీటీడీ నిలిపివేసింది. బాలాలయ మహాసంప్రోక్షణ నేపథ్యంలో భక్తులను కట్టడి చేసేందుకు టీటీడీ ఇప్పటికే తిరుమలలో పలు చర్యలు చేపట్టింది. కాలినడక ద్వారా వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకన్లను నిలిపివేయగా టైమ్‌స్లాట్ దర్శన టోకెన్లను జారీ చేసే కేంద్రాలను మూసివేశారు. అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, ప్రొటోకాల్‌నూ రద్దు చేశారు. అంకురార్పణ రోజున శనివారం 9 గంటలపాటు 50 వేల మందికి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆదివారం నుంచి వీలునుబట్టి రోజుకు 18 వేల నుంచి 30వేల మందికే దర్శనభాగ్యం కల్పించనున్నారు. మహాసంప్రోక్షణ జరిగే 5రోజుల్లో మొత్తం 1,94,000 మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రకటించారు. ఐదు రోజులు జరిగే కార్యక్రమాలివీ.. - 12వ తేదీ ఉదయం యాగశాలలో ఏర్పాటుచేసిన 28 కుండలాలకు శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం నూతనంగా ఏర్పాటుచేసిన యాగశాలకు రుత్వికులు వాస్తు హోమాన్ని వైదికంగా నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో మూలమూర్తికి నిత్యపూజలు నిర్వహించిన అనంతరం యాగశాలలో అగ్నిప్రతిష్ఠ హోమాన్ని నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు శ్రీవారి మూలవిరాట్టులో వున్న శక్తిని కుంభంలోకి ఆవాహన చేస్తారు. అనంతరం కుంభంతో పాటు శ్రీవారి గర్భాలయంలో వున్న ఉత్సవ మూర్తులను యాగశాలకు తరలిస్తారు. దీంతో యాగశాల బాలాలయంగా మారుతుంది. - 13వ తేదీన బాలాలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వామివారి శక్తి వృద్ధి చెందేందుకు పలు హోమాలు నిర్వహిస్తారు. తర్వాత అష్టబంధనకు ఉపయోగించే వస్తువులు, ద్రవ్య పదార్థాలను శుద్ధి, పుణ్యాహవచనం చేస్తారు. దీంతో శ్రీవారి ఆలయంలో మరమ్మతుల పనులు ప్రారంభమవుతాయి. - 14న కూడా గర్భాలయంలో మరమ్మతు పనులు సాగుతాయి. యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. - 15న యాగశాలలో మహాశాంతి హోమగుండంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తరువాత మూలమూర్తిని ఆవాహన చేసిన కుంభాన్ని గర్భాలయంలోకి తీసుకువెళ్ళి 14 కలశాలతో మూలవర్లకు విశేషంగా మహాశాంతి తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే సమయంలో యాగశాలలో ఉన్న ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని రుత్వికులు నిర్వహిస్తారు. -16వ తేదీన యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహిస్తారు. అప్పటివరకు యాగశాలలో ప్రత్యేక పూజలు అందుకున్న కుంభాలన్నింటినీ గర్భాలయంతో పాటు ఉప ఆలయాలకు తరలిస్తారు. దీంతో మహాసంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రత్యేకంగా నిర్దేశించిన ముహూర్తం సమయాన ఉ.10.16 గంటల నుండి మధ్యాహ్నం 12 గం టల మధ్య మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కళా ఆవాహనతో కుంభం నుండి మూలవిరాట్టుకు స్వామి వారి శక్తిని ఆవాహనం చేస్తారు. అనంతరం విశేష పూజలు, నైవేద్య సమర్పణ నిర్వహించి చివరిగా బ్రహ్మగోష పఠనంతో మహాసంప్రోక్షణ కార్యక్రమం ముగుస్తుంది. - 17 నుంచి భక్తులకు యాథావిధిగా దర్శనాలు కల్పిస్తారు. అలాగే, వీఐపీ, ప్రోటోకాల్ తదితర సేవల దర్శనాలను టీటీడీ ప్రకటిస్తుంది. -
వైఎస్ జగన్‌ను కలిసిన వేద పండితులు
-
సుప్రీంకోర్టుకు చేరిన టీటీడీ వివాదం
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. రమణ దీక్షితులు కంటే ముందే టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో బుధవారం వేణుగోపాల దీక్షితులు న్యాయవాది కేవియెట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. టీటీడీ బోర్డు వేణుగోపాల్ దీక్షితులును ప్రధాన అర్చకులగా నియమిస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా కోర్టుని ఆశ్రయిస్తే తమకు ముందస్తు సమాచారమివ్వకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కేవియట్ దాఖలు చేసిన్టటు న్యాయవాది తెలిపారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నరని ఆయన అన్నారు. తిరుమల దేవస్థానంపై వస్తున్న ఆరోపణలను భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కాగా తనను అక్రమంగా టీటీడీ ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారని, వచ్చే నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని రమణదీక్షితులు చెప్పిన విషయం విదితమే. -
అనువంశిక అర్చకులకు పదవీ విరమణ లేదు
సాక్షి, తిరుపతి: తిరుమలలో అనువంశిక అర్చకులకు పదవీ విరమణ లేదని హంపి పీఠాధిపతి స్వామి విద్యానంద భారతి స్పష్టం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైందవ ధార్మిక సంస్థ తిరుమల–తిరుపతి దేవస్థానంతో పాటు ఇతర ఆలయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై పలువురు పీఠాధిపతులు స్పందించారు. తిరుమల–తిరుపతి సంరక్షణ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలో సమావేశమై సుధీర్ఘంగా చర్చించారు. పలు ధార్మిక మండలి సభ్యుల సలహాలు సూచనలు స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో హంపి పీఠాధిపతి స్వామి విద్యానంద భారతి, లలితా పీఠాధిపతి స్వస్వరూపానంద స్వామి, శివశక్తి పీఠం శివచైతన్యస్వామి, శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద, హిందూ ఆలయ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు స్వామి కమలానంద భారతి తదితరులు మాట్లాడారు. హైందవ ధార్మిక ఆలయాల పరిరక్షణే లక్ష్యంగా పీఠాధిపతుల సమాచాలోచన సాగుతోందన్నారు. అందులో భాగంగానే తొలిసారిగా ఆధ్యాత్మిక నగరంలో సమావేశమై పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీవారి ఆలయంలో చోటు చేసుకుంటున్న వివాదాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో నెలకొన్న సమస్యలపైన చర్చించి పలువురి సలహాలు స్వీకరించామన్నారు. శ్రీకృష్ణదేవరాయలు చంద్రగిరి నుంచి ఏడు పర్యాయాలు తిరుమలకు పాదయాత్ర చేసి స్వామి వారికి కానుకలు సమర్పించారని వివరించారు. నిజానిజాలు తెలియాలంటే శ్రీవారి బంగారు ఆభరణాలపై జస్టిస్ జగన్నాథరావు, వాద్వా కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు సిట్టింగ్ జడ్జితో తక్షణం విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ధార్మిక సంస్థల్లో రాజకీయ జోక్యం తగదు ఆలయాల నిధులు కేవలం హైందవ ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలన్నారు. ఆలయాల అభివృద్ధికి, విద్య, వైద్యం కోసం మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. ఆలయాల నిధులను ప్రభుత్వం మరే కార్యక్రమాలకు వినియోగించటానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఇకపోతే ఆలయాల్లో హైందవేతర ఉద్యోగులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. తమ సమావేశాలు రాజకీయాలకు, ప్రభుత్వానికి సంబంధించినవి కాదని, కేవలం హైందవ ధర్మ పరిరక్షణ, సమాజ శ్రేయస్సు తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ధార్మిక మండలిని ఏర్పాటు చేసి ప్రతినిధుల ద్వారా హైందవ ధర్మ పరిరక్షణకు తీసుకోవాల్సిన విషయాలపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. వివాదాలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా సమస్యల పరిష్కారం దిశగా తమ కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అవసరమైతే మరింత మంది పీఠాధిపతులతో సమావేశమై చర్చించి తర్వాత అమరావతిలో అందరం సమావేశమై చర్చిస్తామని తెలిపారు. -
టీటీడీ వివాదంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తీరుపై విద్యాగణేషానంద భారతీస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీలో పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. తిరుమలలో పరిస్థితులపై భక్తులు సైతం ఆందోళన చెందుతున్నారని చెప్పారు. మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని భారతీ స్వామి డిమాండ్ చేశారు. టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పాలకమండలిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీవారి పింక్ వజ్రం పగిలిపోయే ఆస్కారం లేదని చెప్పారు. పూలు, నాణెలు పడినంత మాత్రాన వజ్రాలు పగిలిపోతాయా? అని ప్రశ్నించారు. అర్చకత్వం, సన్నిధి, గొల్లల విషయంలో వంశపారంపర్య పరంపరలపై పీఠాధిపతులు శనివారం సమావేశమయ్యారు. టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమితులు అయ్యేవారికి ఆగమ సంప్రదాయాలు తెలిసి ఉండాలని పీఠాధిపతులు పేర్కొన్నారు. ప్రస్తుతం బోర్డులో అలాంటి వ్యక్తులు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో పరిణామాలు కలతకు గురి చేస్తున్నాయని చెప్పారు. ఇదివరకటి రీతిలోనే కైంకర్యాలు జరగాలని సూచించారు. రమణ దీక్షితులు లేవనెత్తిన ఆరోపణలపై ప్రభుత్వం తప్పనిసరిగా సమాధానం చెప్పాలని అన్నారు. -
టీటీడీలో పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి
-
అర్చకులకే ‘దేవాలయ’ పాస్ పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలను తమకే ఇవ్వా లని అర్చకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ప్రోత్సాహకం కూడా వారికే ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్‌ను కలిసి వారి సమస్యలను విన్నవించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల అర్చకుల పేర్ల పహాణీలో అనుభవదారు పేర్లు తొలగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. -
కెరీర్‌గా పౌరోహిత్యం
మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అనే స్పృహను పురుషాధిక్య సమాజానికి కల్పించే ప్రయత్నంలో భారతీయ మహిళ చాలాదూరమే ప్రయాణించి వచ్చింది. దైవ సన్నిధి హక్కును కూడా పొంది, ఇప్పుడు దైవార్చన హక్కును సాధించుకుంది. దేశంలోని అనేక దేవాలయాలలో ఇటీవల మహిళా పూజారులు దర్శనమిస్తున్నారు. ఉపనయనాలు కూడా జరిపిస్తున్నారు. అయితే ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.లను లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అయినట్లుగా పౌరోహిత్యంపై ఆసక్తి కనబరిచే మహిళా అభ్యర్థులు ఆ పద్ధతులు, విధానాలు ఎక్కడ నేర్చుకోవాలి? ప్రస్తుతానికైతే పుణెలోని జ్ఞాన ప్రబోధిని ఇన్స్టిట్యూట్ ఈ సంశయాన్ని పరిష్కరిస్తోంది. 20 మంది యువతులతో మొదటి బ్యాచ్‌ని ప్రారంభించిన జ్ఞాన ప్రబోధిని, త్వరలోనే రెండో విడత ప్రవేశాలకు ప్రకటన ఇవ్వబోతోంది. భక్తికి.. స్త్రీ, పురుష వివక్ష లేనప్పుడు అర్చకత్వానికి ఎందుకుండాలని ఈ సంస్థకు ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్‌గా ఉన్న మనీషా సేథ్ ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా. -
‘టీటీడీని చెప్పుచేతుల్లో పెట్టుకుంటోంది’
సాక్షి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్ధానంను తన చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం చూస్తోందని బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక ఆరోపించింది. బ్రాహ్మణ ఐక్య వేదిక ఆద్వర్యంలో స్థానిక గాయత్రి కన్వెన్షన్‌లో బ్రాహ్మణ సంఘాలు భేటీ అయ్యాయి. బ్రాహ్మణ సామాజిక వర్గం, అర్చకవృత్తి పై జరుగుతున్న కుట్రకు నిరసనగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఐక్య వేదిక నేతలు మాట్లాడుతూ.. అర్చకుల విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణమన్నారు. ఇప్పటివరకు గుర్తుకురాని వయోపరిమితి హఠాత్తుగా ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. కేవలం క్షక్ష సాధింపులకే తమకు అనుకూలంగా ప్రభుత్వం నిబంధలను ప్రభుత్వం మార్చుకుంటోందని విమర్శించారు. తెలుగుదేశం మేనిఫెస్టోలో 500 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారని, కానీ ఎన్నికోట్లు కేటాయించారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. అర్చకుడికి రిటైర్మెంట్ లేదని టీడీపీ తన మేనిఫేస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. మరి 72 ఏళ్ళ రమణదీక్షితులును ఎలా తొలగించారని నేతలు ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో నాలుగేళ్ళ పాటు పనిచేసిన తరువాత, ఇప్పుడు ఆయన వయసు గుర్తుకువచ్చిందా అన్నారు. ప్రభుత్వ వైఖరి చూస్తే హిందూ వ్యతిరేకత కనిపిస్తోందని తెలిపారు. ఈ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక నేతలు డాక్టర్ పార్థసారధి, డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, ద్రోణం రాజు రవికుమార్‌లతో పాటు గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సత్యానంద భారతీ స్వామి, వైఎస్సార్సీపీ నేతలు ఎమ్మెల్యే కోన రఘుపతి, మల్లాది విష్ణు, బ్రాహ్మణ సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. (విజయవాడలో జరిగిన బ్రాహ్మణ ఐక్య వేదిక సమావేశం) బ్రాహ్మణ ఐక్య వేదిక తీర్మానాలు సత్యనారాయణ పురంలోని సీతారామ కళ్యాణ మంటపంను బ్రాహ్మణ సంఘాలకు అప్పగించాలి రమణ దీక్షితులుకు వంశపారంపర్యంగా వచ్చిన తన హక్కును కల్పించాలి సదావర్తికి భూములను ఇచ్చిన దాతల స్పూర్తిని కొనసాగించాలి ఐవైఆర్ పట్ల చూపిన అనుచిత వైఖరికి క్షమాపణ చెప్పాలి దుర్గగుడి లో తాంత్రిక పూజలపై నివేదికను బహిర్గతం చేయాలి -
శ్రీవారికి నూతన ప్రధాన అర్చకులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి పూజా కైంకర్యాల నిర్వహణకోసం కొత్తగా నలుగురు ప్రధాన అర్చకులు నియమితులయ్యారు. అనూహ్య పరిణామాల మధ్య గొల్లపల్లి కుటుంబం నుంచి వేణుగోపాల దీక్షితులు, పైడిపల్లి కుటుంబం నుంచి కృష్ణ శేషసాయి దీక్షితులు, పెద్దింటి వంశం నుంచి శ్రీనివాస దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందరాజ దీక్షితులను ఆలయ ప్రధాన అర్చకులుగా నియమిస్తూ టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీలో 65 ఏళ్లు దాటిన అర్చకులను విధుల నుంచి తొలగించి ఉద్యోగ విరమణ వర్తింపజేయాలన్న నిర్ణయం నేపథ్యంలో ఆలయ ప్రధానార్చక కుటుంబాలకు చెందిన రమణ దీక్షితులు, నరసింహదీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణ దీక్షితుల స్థానంలో వీరిని నియమించారు. ఆ మేరకు వీరు నలుగురూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మొదటిరోజు వంతుగా ప్రధానార్చక విధుల్లో ఉన్న వేణుగోపాల దీక్షితులు శుక్రవారం ఉదయం స్వామివారికి పూర్ణాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం నూతన ప్రధాన అర్చకులు ఆనంద నిలయానికి పక్కనే ఉన్న వైఖానస అర్చక నిలయంలో మీడియాతో మాట్లాడారు. వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ.. 65 ఏళ్లు దాటాక అర్చకులకు రిటైర్మెంట్ ఇవ్వాలని టీటీడీ నిర్ణయించడం శుభపరిణామమన్నారు. దీనివల్ల భవిష్యత్ తరాల వారికీ స్వామివారిని సేవించే భాగ్యం దొరుకుతుందన్నారు. కృష్ణ శేషసాయి దీక్షితులు మాట్లాడుతూ.. టీటీడీలో చోటు చేసుకున్న మార్పులను స్వాగతిస్తున్నామన్నారు. కాగా, వేంకటేశ్వరస్వామి నైవేద్య సమర్పణలో ఎలాంటి లోటు లేదని జియ్యంగార్లు పేర్కొన్నారు. టీటీడీ అధికారులు, అర్చకుల వివాదం నేపథ్యంలో పెద్దజియ్యర్, చిన్నజియ్యర్లు తిరుమలలోని తిరుమలాంబి వద్ద మీడియా ముందుకు రావడం సంచలనం కలిగించింది. -
రమణ దీక్షితులుకు నోటీసులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధానార్చకులు రమణ దీక్షితులుకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. టీటీడీ అధికారులు, ధర్మకర్తల మండలిపై చేసిన ఆరోపణలకు ఆధారపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అంతేగాక 65 ఏళ్లు దాటిన అర్చకులకు ఉద్యోగ విరమణ వర్తింపజేస్తున్నట్లు తెలుపుతూ.. ఇందులో భాగంగా గొల్లపల్లి కుటుంబం నుంచి వేణుగోపాల దీక్షితులను ప్రధాన అర్చకునిగా నియమించినట్లు టీటీడీ ఈవో ఈ నోటీసులో పేర్కొన్నారు. నోటీసులందించేందుకు టీటీడీ సిబ్బంది శుక్రవారం రమణ దీక్షితులు ఇంటికి వెళ్లగా ఆయన లేరు. దీంతో ఇంటిబయట గోడకు నోటీసు పత్రాలు అంటించి వెళ్లారు. టీటీడీలో అర్చక వారసత్వాన్ని రద్దు చేయడాన్ని తప్పుపడుతూ రమణ దీక్షితులు గత మంగళవారం చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ధ్వజమెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. తప్పులు బైటపెట్టినందుకే నాపై కక్ష తీర్చుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటుచేసుకుంటున్న లోటుపాట్లను బయటపెట్టినందుకు తనపై కక్ష తీర్చుకుంటున్నారని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 2017 డిసెంబర్లో ఎలాంటి సమాచారం లేకుండా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి వంటశాలను మూసేశారని, 25 రోజులపాటు స్వామివారికి శుచిగాలేని నైవేద్యాన్ని పెట్టారని తెలిపారు. అనంతరం వంటశాల వద్ద భూకంపం వచ్చిన మాదిరి అక్కడి గోడలు, ఇటుకలు అన్నీ పడిపోయి ఉన్నాయన్నారు. పదో శతాబ్దంలో పల్లవులు, చోళులు స్వామివారికి సమర్పించిన ఆభరణాల కోసం భూమికింద వెతికినట్టు అక్కడి పరిస్థితులు స్పష్టం చేశాయన్నారు. ఈ విషయమై ఈవోను సంప్రదించగా తనకేమీ తెలియదని ఆయన చెప్పారన్నారు. 2001లో గరుడ సేవ సందర్భంగా స్వామివారికి సమర్పించిన ప్లాటినం హారంలో నడిమిన ఉండే గులాబీ రంగు వజ్రం భక్తులు విసిరిన నాణేల వల్ల పగిలిపోయిందని రికార్డు చేశారని, అయితే ఇటీవల జెనీవాలో అలాంటి వజ్రమే రూ.500 కోట్లకు అమ్ముడైందని ఆయన వెల్లడించారు. భక్తుల నాణేల తాకిడికి వజ్రం పగిలిపోయిందనడం అబద్ధమని రమణ దీక్షితులు స్పష్టం చేశారు. వజ్రం కనిపించకుండా పోవడం, ఇతరత్రా లోటుపాట్ల గురించి బయటపెట్టినందుకే తనపై కక్ష తీర్చుకుంటున్నారన్నారు. స్వామివారి సంపద కనిపించకుండా పోవడం, వంటశాల మూసివేత వల్ల, స్వామివారికి శుచిగా లేని నైవేద్యాన్ని పెట్టడం లాంటి పరిణామాల వల్ల భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయోనన్న భయం కలుగుతోందని ఆయన అన్నారు. -
టీటీడీలో సరికొత్త శకం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నూతన ప్రధాన అర్చకులు నియమితులయ్యారు. నలుగురు అర్చకులను నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. అనూహ్య పరిణామాల మధ్య గొల్లపల్లి వంశం నుంచి రమణ దీక్షితులకు బదులుగా వేణుగోపాల దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందరాజ దీక్షితులు, పెద్దింటి వంశం నుంచి శ్రీనివాస దీక్షితులు, పైడిపల్లి కుటుంబం నుంచి కృష్ణ శేషాచల దీక్షితులను నియమించారు. ఎన్నో ఏళ్ల తర్వాత టీటీడీ సరికొత్త శకానికి శ్రీకారం చుట్టింది. శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుల పాత్ర ప్రత్యేకమైంది. స్వామివారి కైంకర్యాల్లో అత్యంత కీలకమైన బాధ్యతలు ప్రధాన అర్చకులు నిర్వహిస్తారు. రమణదీక్షతుల వ్యవహారంతో శరవేగంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీటీడీ నలుగురు ప్రధాన అర్చకులను నియమించింది. వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు తిరుమల శ్రీవారి ఆలయంలో, శ్రీనివాస దీక్షితులు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తారు. రిటైర్మెంట్ ప్రకటన శుభపరిణామం 40 తరాలుగా మిరాశిగా స్వామి వారికి సేవలు చేస్తున్నాను. 1997 వరకు మిరాసిగా వ్యవహరిస్తూ వస్తున్నాం. 65 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటన శుభపరిణామం. తర్వాతి తరాల వారికి కూడా అవకాశం కలిగించే భాగ్యం కలుగుతుంది. 65 సంవత్సరాలు పైబడిన వారికి హోదా మాత్రమే తగ్గుతుందే తప్ప మిగతా మర్యాదలతో పాటు స్వామి వారికి సేవలు చేసే భాగ్యం అలాగే ఉంటుంది. మిరాశిగా ఉన్నప్పుడు 8 ఏళ్లకు ఓసారి మారుతూ వచ్చేది. స్వామి వారి అభారణలపై విమర్శలు సరికాదు. టీటీడీ దగ్గర అని రికార్డ్స్ ఉన్నాయి. మహంతుల దగ్గర నుంచి తీసుకున్న అన్ని లెక్కలు ఉన్నాయి. వేణుగోపాల్ దీక్షితులు చాలా సంతోషంగా ఉంది ప్రధాన అర్చకుల హోదాలో మా నాన్నకు రిటైర్మెంట్ ఇచ్చి నాకు పోస్టింగ్ ఇచ్చారని పైడిపల్లి వంశానికి చెందిన శేషాచలం దీక్షితులు తెలిపారు. స్వామి వారికి సేవ చేసే భాగ్యం నాకు దక్కడం చాలా సంతోషంగా ఉంది. నాన్నగారి పర్యవేక్షణలోనే స్వామివారికి కైంకర్యాలు నిర్వహిస్తాను. మరో వైపు తిరుపతమ్మ వంశానికి చెందిన గోవిందరాజ దీక్షితులు మాట్లాడుతూ.. దేవస్థానం చైర్మన్, ఈఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. వారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అన్నీ సవ్యంగా ఉన్నాయి 1958 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు స్వామి వారికి సేవలు చేస్తూ వస్తున్నాను. ఆగమశాస్త్రం ప్రకారమే స్వామి వారికి కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయి. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని సేవలు పద్దతి ప్రకారమే నిర్వహిస్తున్నారు. స్వామివారికి జరిపే పూజ కార్యక్రమాలలో ఎలాంటి దోషం లేదు. నైవేద్యం కూడా స్వామి వారికి సవ్యంగా జరుగుతుంది. షడ్కరా ఆరాధనలు స్వామి వారికి జరుగుతూనే ఉన్నాయి. పోటును మరమ్మత్తులు చేస్తున్నారే తప్ప లోపల కట్టడాలు ఏమీ కూల్చలేదు. సుధార వరధారాజన్, ఆగమశాస్త్ర సలహా దారులు -
ఏడుకొండలవాడా..!
-
దళిత అర్చకులు
దళితుల ఆలయ ప్రవేశానికి గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దళితులనే ఆలయాలకు అర్చకులుగా నియమిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసే నిధులతో దేవాదాయ ధర్మాదాయ శాఖ, సమరసత సేవా ఫౌండేషన్ పర్యవేక్షణలో జిల్లాలోని దళితవాడల్లో ఆలయాలు నిర్మిస్తున్నారు. వీటికి స్థానిక దళితులను అర్చకులుగా నియమించి, సరికొత్త అధ్యాయానాకి శ్రీకారం చుట్టారు. ముత్తుకూరు: జిల్లాలో 2017–18 సంవత్సరంలో టీటీడీ 64 ఆలయాలు నిర్మించింది. ముత్తుకూరు మండలంలోనే నాలుగు ఆలయాలు నిర్మించారు. కృష్ణపట్నం పంచాయతీలోని కావలిదళితవాడలో నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయంలో కావలి మస్తానయ్య అనే ఎస్సీని అర్చకుడిగా నియమించారు. ముత్తుకూరులోని ఈదూరు రాజమ్మ కాలనీ నిర్మించిన సీతారామస్వామి ఆలయంలో చొక్కా శ్రీనివాసులు అనే ఎస్టీని పూజారిగా నియమించారు. గోపాలపురంలో నిర్మించిన పాండురంగస్వామి ఆలయంలో ఎస్సీని, అచ్చన్నతోపులో నిర్మించిన సీతలాంబ–పోతురాజు ఆలయంలో ఎస్టీని పూజారులుగా నియమించారు. ఒక్కొక్క ఆలయ నిర్మాణానికి టీటీడీ రూ.5 లక్షలు విడుదల చేస్తోంది. నిధులు చాలని పక్షంలో స్థానిక దాతల సహకారంతో నిర్మాణాలు పూర్తి చేసి, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హిందూ ధర్మ ప్రచారం కోసం.. దళితవాడల్లో మత మార్పిడులను అరికట్టి హిందూ ధర్మ ప్రచారం కోసం టీటీడీ చేపట్టిన ఈ బృహత్ కార్యానికి సమరసత సేవా ఫౌండేషన్ వెన్నుదన్నుగా నిలిచింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆలయాల నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. 15 రోజుల పాటు శిక్షణ ఆలయాల అర్చకులుగా ఎంపిక చేసే దళితులకు టీటీడీకి చెందిన శ్వేత భవనంలో 15 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. భక్తులను ఎలా ఆకర్షించాలి, వారితో ఎలా సంభాషించాలి, ఉపచారాలు, దేవతార్చన ఎలా చేయాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఆలయాల బాధ్యత స్వీకరించిన తర్వాత స్వయంకృషితో మంత్రాలు, స్తోత్రాలు, అర్చనలు నేర్చుకోవాలి. వచ్చే ఏడు బీసీ కాలనీల్లో ఆలయాలు వచ్చే సంవత్సరం నుంచి బీసీ కాలనీల్లో కూడా ఆలయాలు నిర్మించాలని సంకల్పించాం. బీసీలనే అర్చకులుగా నియమిస్తారు. టీటీడీ సహకారంతో స్థానిక దాతల సాయంతో ఈ దైవ కార్యం నిర్వర్తిస్తున్నాం. దళితుల్లో దేవాలయాల పట్ల నమ్మకం, విశ్వాసం కలిగించాలన్నదే మా ధ్యేయం. మన రాష్ట్రంలో 500 ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయి. దళితులు అర్చకులుగా ఉన్న ఆలయాలకు భక్తులు విశేషంగా రావడమే దీనికి తార్కాణం.–టీవీ కృష్ణకుమార్, సభ్యుడు, సమరసత సేవా ఫౌండేషన్ అర్చకుడు కావడం నా అదృష్టం నేను ఎస్టీని. బీకాం పూర్తి చేశాను. ఆలయానికి అర్చకుడు కావడం ఊహించని అదృష్ణం. ఉద్యోగాన్వేషణలో ఉండగా ఈ అవకాశం దక్కింది. టీటీడీలో 15 రోజులు శిక్షణ ఇచ్చారు. ముత్తుకూరు శివాలయంలో మరో 30 రోజులు గురువుల వద్ద శిక్షణ తీసుకున్నా. మంచి విషయాలు నేర్చుకున్నా. ఖాళీగా ఉన్నపుడు ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నా. శివాలయానికి భక్తులు బాగానే వస్తున్నారు. –చొక్కా శ్రీనివాసులు, అర్చకుడు, సీతారామస్వామి ఆలయం -
శ్రీవారి ఆలయంలో అపచారం
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. స్వామివారి సన్నిధిలోని రాములవారి మేడ వద్ద భూదేవి అమ్మవారి విగ్రహం కిందపడింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుమల శ్రీవారి ఆలయంలో గర్భాలయ మూలమూర్తితోపాటు నాలుగు అతిముఖ్యమైన విగ్రహాలున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఆలయం వెలుపల వైభవోత్సవ మండపంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. సహస్ర దీపాలంకార సేవ రద్దు చేయటంతో అర్చకులు 3.30 గంటలకు ఉత్సవమూర్తులను బంగారు వాకిలి వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆలయంలోకి తీసుకెళ్తుండగా భూదేవి అమ్మవారి విగ్రహం రాములవారి మేడ వద్ద ప్రమాదవశాత్తు కిందపడింది. అర్చకుల అజాగ్రత్త కారణంగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా విగ్రహ కిరీటం, పీఠం భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఆలయంలో అర్చకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఈ ఘటనకు పరోక్ష కారణమని తెలుస్తోంది. -
అమ్మవారికి మహా అపచారం
సాక్షి, నాగపట్టణం: అమ్మవారి విగ్రహాన్ని సల్వార్ కమీజ్‌తో అలంకరించిన ఇద్దరు అర్చకులపై వేటు పడింది. తమిళనాడు నాగపట్టణం జిల్లా మయిలాదుతుదైలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మయూర్‌నాథర్ ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. అమ్మవారి విగ్రహానికి ఆధునిక బట్టలు ఆలయంలోని అభయాంబిగై అమ్మవారిని ప్రతి శుక్రవారం వివిధ రంగుల కాగితాలతో అలంకరిస్తుంటారు. సంప్రదాయానికి భిన్నంగా రాజ్ అనే పురోహితుడు అమ్మవారి విగ్రహానికి ఆధునిక బట్టలు తొడిగారు. పింక్ రంగు సల్వార్ కమీజ్, నీలం రంగు దుపటాతో అమ్మవారిని అలంకరించారు. సీనియర్ అర్చకుడు కళ్యాణమ్ కుమారుడైన రాజ్‌ను తండ్రికి సహాయంగా ఉంటాడనే ఉద్దేశంతో గతేడాది ఆగస్టులో ఆలయంలో నియమించారు. తండ్రీకొడుకులపై వేటు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఆగమ నియమాలకు విరుద్ధంగా అమ్మవారికి అపచారం జరగడంతో భక్తులు, సీనియర్ అర్చకులు మండిపడ్డారు. దీంతో స్పందించిన దేవస్థానం పాలక మండలి ఇద్దరు అర్చకులను విధుల నుంచి తొలగించింది. చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడంతో వీరిద్దరిపై చర్య తీసుకోవాల్సివచ్చిందని పాలక మండలి ప్రతినిధి ఎస్. గణేశన్ తెలిపారు. తాను ఎటువంటి దురుద్దేశంతోనూ ఈ తప్పు చేయలేదని అర్చకుడు రాజ్ చెప్పారు. ఆలయ ప్రతిష్టను దిగజార్చాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. నంది విగ్రహానికి నోట్లతో అలంకరణ ప్రచారం కోసం గతంలోనూ రాజ్ ఇటువంటి పనులు చేశాడని మయిలాదుతుదై ఫొటోజర్నలిస్ట్ ఒకరు చెప్పారు. నంది విగ్రహాన్ని రూ. 15 వేల విలువ చేసే వంద రూపాయల నోట్లతో అలకరించించాడని, అప్పుడు అతడిని అందరూ మెచ్చుకున్నారని వెల్లడించారు. కానీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడని తెలిపారు. కాగా, అమ్మవారి విగ్రహాన్ని సల్వార్ కమీజ్‌లో అలంకరించిన ఫొటోలను రాజ్ తన స్నేహితులకు పంపడంతో సామాజిక మాధ్యమాల్లో ఇవి వైరల్‌గా మారాయి. -
ఆలయాల మూసివేత
సాక్షి నెట్వర్క్: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాలను బుధవారం మూసివేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి, పాతగుట్ట ఆలయాలను చంద్ర గ్రహణం సందర్భంగా ఉదయం 10 గంటలకు మూసివేశారు. తిరిగి రాత్రి 9 గంటల తర్వాత తెరిచి సంప్రోక్షణలు గావించి మళ్లీ మూసివేశారు. అనంతరం తెల్లవారుజాము నుంచి యథావిధిగా నిత్య కైంకర్యాలు ప్రారంభం అవుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, మంగళగిరి నరసింహాచార్యులు, అధికారులు రఘు, సింహాచార్యులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే, నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని ఉదయం 7.30 గంటలకు మూసివేశారు. గురువారం ఉదయం 4.30 గంటలకు తెరువనున్నారు. ఆలయంలో సంప్రోక్షణ పూజ అనంతరం రోజువారీగా సర్వదర్శనం, ఆర్జీత సేవలు కొనసాగుతాయని ఆలయ ఇన్చార్జి ఈవో సోమయ్య తెలిపారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ తలుపులు బుధవారం ఉదయం 10.15 గంటలకు మూసివేశారు. అంతకుముందు వేకువజామున 3 గంటలకు స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 9.15 గంటలకు తిరిగి తలుపులు తీసి గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. నదీ జలాలతో ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. స్వామివారి మూలమూర్తులకు, ఉత్సవ పెరుమాళ్లకు, నిత్యకల్యాణ మూర్తులకు, ఆంజనేయ స్వామికి, పరివార దేవతలకు అభిషేకం జరిపించారు. అనంతరం ఆరాధన, దర్బార్ సేవ నిర్వహించారు. -
మథుర ఆలయంలో పూజరుల మధ్య ఘర్షణ
-
మల్లన్న సన్నిధిలో వేదఘోష..
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల్లో కాకతీయులు, ఇతర రాజులు వీరశైవ మతాన్ని ఆదరించారు.. ఊరూరా శివాలయాలు కట్టించారు. వాటిల్లో ధూప దీప నైవేద్యం పెట్టే హక్కు.. వీరశైవ పూజారులు జంగమ, బలిజ కులాలకు చెందిన వారికి వంశపారంపర్యంగా వస్తూ ఉండేది. అయితే మారిన కాలంతోపాటు, ఈ వృత్తిని ఆచరించేవారు కరువై.. తరతరాలుగా శివాలయాల్లో పూజలు చేసేవారి స్థానంలో వేరేవారు రావడం మొదలైంది. ఇటువంటి పరిస్థితిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శివాలయాల నిర్వహణ కోసం వీరశైవ ఆగమ పాఠశాలలు కావాలని 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కోరగా అంగీకరించి మంజూరు చేశారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఈ పాఠశాలను ఏర్పాటు చేయగా వీరశైవ పంచాచార్య సంప్రదాయాల ప్రకారం బోధన జరుగుతోంది. పంచపీఠాల పఠనం.. వీరశైవంలోని కీలకమైన కొలనుపాక, ఉజ్జయని, కేదారం, శ్రీశైలం, కాశీ పంచపీఠాల గురించి మొదట పరిచయం చేస్తారు. ఆరేళ్ల కోర్సుగా చెప్పే ఈ పాఠశాలలో తొలుత రెండేళ్లు అర్చక ప్రవేశం, మంత్రాలు, దేవాలయాల్లో పూజలు నేర్పిస్తారు. మూడో ఏడాది నుంచి అర్చవర, భాషా కర్మలు, మనిషి పుట్టిన నాటి నుంచి చనిపోయేవరకు జరిపే 16 కర్మల గురించి నేర్పిస్తారు. ఐదు, ఆరేళ్లలో దేవాలయాల్లో పూజలు, మహోత్సవాలు, కల్యాణాలు, అన్నిరకాల యజ్ఞయాగాల గురించి చెప్పి వాటిని చేయిస్తారు. ఇలా ఆరేళ్ల కోర్సు పూర్తి చేశాక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఉత్తీర్ణత పత్రం అందచేస్తారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పాఠశాలకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ నుండి కూడా విద్యార్థులు వస్తుంటారు. -
అర్చకుల వేతన క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు వేతనాలు చెల్లించే కొత్త విధానానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఉద్యోగ, అర్చక సంఘాల ప్రతినిధులకు చెక్కులు అందించి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. డిసెంబర్ నుంచే సెక్షన్ 65ఏ ప్రకారం వేతనాలు చెల్లించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖకు రూ.37.5 కోట్లు విడుదల చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కొత్త విధానం అమలుకు వీలుగా చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. ఇంతకాలం దేవాలయాల ఆదాయం నుంచి ఆలయ కార్యనిర్వహణాధికారులు వేతనాలు చెల్లించారు. ఇకమీదట ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక వేతన నిధి నుంచి వేతనాలు చెల్లిస్తారు. అర్చకులు, ఉద్యోగుల ఖాతాలకు ఆ మొత్తాన్ని జమ చేస్తారు. దేవాలయ ఆదాయం సరిపోనందున ప్రతినెలా తక్కువ పడే మొత్తాన్ని ప్రభుత్వమే గ్రాంటుగా చెల్లిస్తుంది. దీనిపై దేవాలయ ఉద్యోగ, అర్చక సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వేతనాలను ధార్మిక పరిషత్ నుంచే చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పరిషత్ ఏర్పాటు కాకపోవటం విశేషం. -
ఈ యాచకులు.. కోటీశ్వరులు!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరూ మహిళలు.. ఉన్నత చదువులు చదివారు.. విదేశాల్లో జీవించారు.. కోట్లలో ఆస్తులు.. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడగలరు. కానీ ఇప్పుడా కళ్లలో దైన్యం.. మాటల్లో నిస్సహాయత.. ఆవేదన.. ఒక్క రూపాయి కోసం చేతులెత్తి యాచిస్తున్న తీరు.. హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్ దర్గా వద్ద భిక్షమెత్తుకుంటున్న ఫర్జానా, రబియా బసిరి అనే ఇద్దరు మహిళల వ్యథ ఇది. హైదరాబాద్ నగరంలో ఉన్న యాచకులందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పోలీసులు.. వీరిని చర్లపల్లిలోని ఆనందాశ్రమానికి తరలించారు. అక్కడ వీరి మాటతీరు, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతుండటాన్ని గుర్తించిన అధికారులు వారి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి కథ విన్నకొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. భర్త పోయిన వేదనతో.. హైదరాబాద్‌లోని ఆనంద్‌బాగ్‌కు చెందిన ఫర్జానా హైదరాబాద్‌లోనే డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. తర్వాత అక్కడే కొన్నేళ్లపాటు అకౌంట్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేసింది. తిరిగి హైదరాబాద్‌కు వచ్చాక ఇస్మాయిల్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి అలీ అనే కుమారుడు ఉన్నాడు. తర్వాత కూడా ఆమె పై చదువులపై దృష్టి సారించింది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, బాధల సుడిగుండాలను ఎదుర్కొంది. ఇటీవల భర్త మరణించడంతో మానసికంగా బాగా కుంగిపోయింది. ప్రశాంతంగా ఉంటుందంటూ లంగర్‌హౌజ్ దర్గాకు వచ్చి ఉండిపోయింది. దర్గాకు వచ్చే భక్తుల వద్ద యాచిస్తూ బతుకుతోంది. ప్రస్తుతం ఆమె వయసు సుమారు 60 ఏళ్లు. బాబా ఆశీర్వాదంతో ఆమె బాగుపడుతుందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఇటీవలి స్పెషల్ డ్రైవ్‌లో ఫర్జానాను గుర్తించిన పోలీసులు చర్లపల్లిలోని ఆనందాశ్రమానికి తరలించారు. ఇది తెలిసిన అలీ.. పోలీసులను సంప్రదించి తన తల్లిని తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు. దగ్గరి వాళ్లే మోసం చేస్తే.. రబియా బసిరిది కన్నీటి గాథ. హైదరాబాద్‌లోని డిఫెన్స్ కాలనీకి చెందిన బసిరికి 15 ఏళ్ల కింద అమెరికాలో హోటల్ వ్యాపారం చేస్తున్న మహ్మద్ అబ్దుల్ నయీంతో వివాహమైంది. ఆయనకు ఆమె మూడో భార్య. అక్కడ వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఇద్దరు పిల్లలు కలిగారు. కొన్నేళ్ల కింద ఆమె తండ్రి చనిపోవడంతో హైదరాబాద్‌కు వచ్చింది. కానీ తండ్రి మరణాన్ని తట్టుకోలేక మానసికంగా బాగా కుంగిపోయింది. ఆమెకు అమెరికా గ్రీన్‌కార్డు ఉన్నా.. తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది. వారికి హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులను చూసుకుందామనుకుంది. కానీ బంధువులు, దగ్గరివారు ఆమెను మోసం చేసి ఆ ఆస్తులను కొల్లగొట్టారు. దీంతో రోడ్డున పడ్డ బసిరి.. చివరికి లంగర్‌హౌజ్ దర్గాకు చేరుకుంది. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే బసిరి కథ విని జైలు అధికారులు కూడా చలించిపోయారు. అయితే ఆమె సోదరుడు వచ్చి హామీ ఇవ్వడంతో బసిరిని ఇంటికి పంపించారు. -
రూ.10 వేలిస్తే... వంద రాశారు!
సాక్షి, హైదరాబాద్: నకిలీ రశీదు పుస్తకాలతో రూ. లక్షల్లో ఒకరు దోచుకుంటే.. జాతర పనులంటూ తప్పుడు బిల్లులు పెట్టి మరొకరు నిధులు జేబులో వేసుకున్నారు.. ఇంకొకరేమో ఏకంగా అర్చకుల వేతనాలే స్వాహా చేశారు.. ఇంతలా అవినీతికి పాల్పడిన అధికారులపై ఆధారాలతో సహా దేవాదాయ కమిషనర్‌కు విజిలెన్స్ విభాగం నివేదిక సమర్పిస్తే చర్యలు తీసుకోవాల్సిన కమిషనర్ కార్యాలయం వారిపై ఈగ వాలకుండా చూసుకుంటోంది. రాజకీయ నేతల అండదండలున్నాయని కాలయాపన చేస్తోంది. చందాల దందా సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ ప్రముఖ దేవాలయం.. నిత్యం అన్నదానాలు జరుగుతుండటంతో భక్తుల విరాళాలు ఎక్కువగానే ఉంటాయి.. కానీ ఓ ఉన్నతాధికారి మాత్రం రూ.10,000 విరాళమిస్తే రూ.100గా రిజిస్టర్లో రాయటం, నకిలీ రశీదులివ్వటం మొదలుపెట్టాడు. ఏటా రూ.కోటి వరకు అందే విరాళాలు ఒక్కసారిగా పడిపోవటంతో అనుమానమొచ్చిన దేవాదాయ శాఖ విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. కొందరు దాతలను సంప్రదించి వారిచ్చిన మొత్తం, ఆలయ రిజిస్టర్లో నమోదైన మొత్తం తనిఖీ చేసి సొమ్ము స్వాహా చేస్తున్నట్లు రూఢీ చేసుకున్నారు. అలాగే ప్రసాదాలకు సంబంధించిన సరుకులు అయిపోయాయని తప్పుడు ఇండెంట్లు పెట్టి మళ్లీ సరుకులు కొనటం, తిరిగి దుకాణాలకు తరలించి ఆ మొత్తం స్వాహా చేస్తున్నట్లూ గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్సు అధికారులు కమిషనర్‌కు సమగ్ర నివేదిక సమర్పించారు. అవినీతి ‘జాతర’ నల్లగొండ జిల్లాలోని ఓ ప్రముఖ దేవాలయమది. అక్కడ ఏటా జరిగే జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయానికి కార్యనిర్వహణాధికారి లేకపోవటంతో మరో దేవాలయ అధికారిని ఇన్చార్జిగా నియమించారు. అంతే.. ఆ దేవాలయాన్ని అక్రమ సంపాదనకు కేంద్రంగా మలుచుకున్నాడు ఆ అధికారి. నిబంధనలకు విరుద్ధంగా సిబ్బందిని నియమించుకుని వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. జాతర అభివృద్ధి కార్యక్రమాల పేరుతో నకిలీ బిల్లులు పెట్టి రూ.లక్షల్లో మేశాడు. ఆలయ నిధులూ స్వాహా చేశాడు. ప్రసాదాల సామాను కొనుగోలులోనూ హస్తలాఘవం ప్రదర్శించాడు. దీనిపై ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు అందటంతో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి భారీగా అక్రమాలు జరిగాయని కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. తర్వాత ఆ అధికారిని అక్కడి నుంచి తప్పించారు. కానీ కొందరు ఎమ్మెల్యేలతో సిఫార్సు చేయించుకుని ఆయన అక్కడే తిష్ట వేశాడు. తప్పని పరిస్థితిలో ఇటీవల అసలు దేవాలయానికే పరిమితమయ్యాడు. అర్చకుల జీతాలు స్వాహా పూర్వపు వరంగల్ జిల్లాలోని ఈ ప్రముఖ దేవాలయంలో ఓ అధికారి ఏకంగా అర్చకుల జీతాలనే స్వాహా చేశాడు. ఆలయంలో అభివృద్ధి పనుల పేరుతో నిధులు స్వాహా చేసినట్టు కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదులు రావటంతో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి నిజమేనని తేల్చి నివేదిక సమర్పించారు. కాగా, ఈ మొత్తం వ్యవహారంపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. కమిషనర్ కార్యాలయాన్ని నిలదీశారు. అవినీతి వ్యవహారం సీఎం కార్యాలయం దృష్టికి వెళ్లటంతో చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. -
వృద్ధ అర్చకుల ‘సవరణ’ వెతలు
కూకట్‌పల్లికి చెందిన రామశాస్త్రి స్థానిక దేవాలయంలో 20 ఏళ్లుగా అర్చకుడిగా పని చేస్తున్నారు.. ఇప్పుడు ఆయన వయసు 68 సంవత్సరాలు. ఇంతకాలం అడ్డురాని వయసు.. ఇప్పుడు ఆయన ఉపాధికే ఎసరు పెట్టింది. పదవీ విరమణ వయసు దాటినందున అర్చకుడిగా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పేదరికంలో మగ్గుతున్న ఆయనకు ఆదుకునే అండ లేకపోవడంతో ఆ కుటుంబం ఆందోళనలో పడింది. – సాక్షి, హైదరాబాద్ ఇలా ఒక్క రామశాస్త్రికే కాదు.. రాష్ట్రంలోని వందల మంది అర్చకులకు ఉన్నట్టుండి ఇబ్బంది వచ్చిపడింది. దేవాలయ అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతన సవరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో కసరత్తు మొదలెట్టిన అధికారులు అర్చకుల పదవీ విరమణ వయసుపై దృష్టి సారించారు. విరమణ వయసు దాటి అర్చకులుగా కొనసాగుతున్నవారి విషయంలో నిర్ణయం తీసుకునే దిశగా యోచిస్తున్నారు. వారి తొలగింపు విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే అర్చకులను విధుల నుంచి తొలగించాలని నిర్ణయిస్తే వందల మంది పేద అర్చకుల కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పెద్ద ఆలయాల్లోనే.. అర్చకుల పదవీ విరమణ వయసు ప్రస్తుతం 60 సంవత్సరాలు. దేవాదాయ శాఖ పర్య వేక్షణలోని పెద్ద దేవాలయాల్లోనే ఈ ని బంధన అమలవుతోంది. చిన్న దేవాలయాల్లో నిబంధనను పట్టించుకోకపోవడంతో చాలా దేవాలయాల్లో వయసుతో నిమిత్తం లేకుండా అర్చకులు పని చేస్తున్నారు. పాలక మండళ్లు నియమించినవారు కావటంతో వారి వయసు నూ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో పేదరికంలో మగ్గుతున్న వృద్ధులు అర్చకత్వాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచే వేతనాలు.. అర్చకులకు ప్రభుత్వం నుంచే నేరుగా వేతనాలు అందేలా వేతన సవరణకు ప్రభుత్వం ఇటీవల అంగీకరించింది. దేవాలయాల నుంచి వేతనాలకు కేటాయించే 30 శాతం నిధులు, లోటు ఏర్పడితే ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఇచ్చే నిధులనుంచి వేతనాలు చెల్లించనున్నారు. ఈ క్రమంలో ఒక్కో అర్చకుడి వివరాలు సేకరిస్తున్న అధికారులకు వయసు నిబంధన ఎదురైంది. ఇంతకాలం పట్టించుకో కుండా సాగినా, వేతన సవరణ జరుపుతున్నందున నిబంధన అమలు చేయకుంటే ఎలా అన్న సందేహం తలెత్తింది. అయితే 60 ఏళ్లు దాటిన అర్చకులు వందల సంఖ్యలో ఉండ టంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. 60 ఏళ్లు దాటిన అర్చకుల్లో ఎక్కువ మంది పేదలే కావటం, వారిలో చాలామందికి మరో అండ లేకపోవటంతో.. ఆయా కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పాపం.. పాలక మండళ్లదే దేవాదాయ శాఖ ఆలయ నియామకాల్లో పాలక మండళ్లదే ప్రధాన పాత్ర. ఖాళీలు, అర్హతలతో సంబంధం లేకుండా డబ్బు వసూలు చేసి నియామకాలు జరిపిన దాఖలాలు కోకొల్లలు. కానీ దీన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. నియామకాలపై నిషేధం ఉన్నా, పాత తేదీలతో పోస్టింగులు ఇవ్వడం.. పాలక మండళ్ల గడువు తీరినా, పాత తేదీలతో పైరవీ చేసి పోస్టింగులు ఇప్పించడం పరిపాటిగా మారింది. మరోవైపు చిన్న దేవాలయాల్లో వయో నిబంధన అటకెక్కింది. ఇంతకాలం నామమాత్రంగా కూడా పట్టించుకోని దేవాదాయ శాఖ.. ఇప్పుడు వారిని ఉన్నట్టుండి తొలగించే దిశగా యోచిస్తుండటం వివాదాస్పదమవుతోంది. -
కేరళలో పూజారుల పోస్టులకు దళితులు!
తిరువనంతపురం: కేరళలో ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) నిర్వహణలోని ఆలయాల్లో 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించడానికి సిఫారసు చేశారు. వీరిలో ఆరుగురు దళితులుండటం విశేషం. ఇందుకు సంబంధించి కేరళ దేవస్థానం నియామక బోర్డు సిఫార్సు చేసింది. దళితుల నుంచి ఆరుగురిని పూజారులుగా నియమించడానికి సిఫార్సు చేయడం ఇదే తొలిసారి. ఈ నియామకాలు చేపట్టేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఇందులో అవినీతికి చోటులేదని, ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగానే ఎంపిక చేస్తున్నామని దేవస్థాన మంత్రి కదకంపల్లి రామచంద్రన్ చెప్పారు. -
అర్చకులూ.. ప్రభుత్వ ఉద్యోగులే..!
♦ జీఓ విడుదల చేసిన సీఎం కేసీఆర్ ♦ వారంపాటు చేసిన సమ్మెకు సత్ఫలితం ♦ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 614మందికి లబ్ధి అలంపూర్‌రూరల్ : దేవాదాయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ›ప్రభుత్వం ద్వారా వేతనాలు చెల్లించాలని గతవారం రోజులుగా చేస్తున్న సమ్మె విజయవంతమైంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ జీఓ 577ను విడుదల చేస్తూ ఆలయాల్లో పనిచేసే ప్రతి అర్చక ఉద్యోగులందరికీ 2015 పీఆర్సీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 646 ఆలయాలు ఉండగా.. 5625 మంది ఉద్యోగులు ఈ శాఖలో పూజారులుగా పనిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదాయం చేకూరే ఆలయాలు 49 ఉండగా.. ఒక మఠం కూడా రిజిస్టర్ కాబడి ఉంది. ఇందులో 159మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా.. కన్సల్టెంట్, ఎన్ఎంఆర్, కాంట్రాక్టు ప్రాతిపదికన 460మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ కూడా ఈ జీఓ ద్వారా పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడటమేకాక 2015 పీఆర్సీ ప్రకారం వేతనాలు సైతం పెరగనున్నాయి. ఈ పెరిగిన వేతనాలు నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుండగా డిసెంబర్ 1వ తేదీ నుంచి నగదు రూపంలో వారివారి ఖాతాల్లో జమకానుంది. ఒకే జీఓలో మూడు వరాలు దేవాదాయశాఖ పరిధిలో చారిత్రాత్మక ఘట్టంగా ఒకే జీఓ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మూడు వరాలు ప్రకటించింది. ఇందులో ఉద్యోగులందరినీ పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కాగా ప్రస్తుతమున్న 1805 దూప, దీప నైవేద్యాల కింద ఉన్న ఆలయాలతోపాటు అదనంగా మరొక 3వేల ఆలయాలకు ఈ పథకాన్ని అమలు చేయడం, దేవాదాయశాఖ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తూ ఉద్యోగుల వేతనాలను ట్రస్టు ద్వారా చెల్లించేలా ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం దేవాదాయశాఖ ఉద్యోగులకు రూ.150కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా చెల్లించనున్నారు. మరో 300 ఆలయాలకు దూపదీప నైవేద్య పథకం సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఉమ్మడి జిల్లాకు నూతనంగా మరో 300 ఆలయాలు, గ్రామీణ ప్రాంతాలకు దూప, దీప నైవేద్యం పథకం కింద ఎంపిక చేసింది. ఉమ్మడి జిల్లాలో 137ఆలయాలు ఉండగా అదనంగా 300 ఆలయాలు ఉమ్మడి జిల్లాకు కేటాయించడంపై రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆనంద్‌శర్మ హర్షం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు ఎంతోకాలంగా ఆలయ అర్చకులు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చేస్తున్న పోరాటాలకు ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించడంతో దేవాదాయశాఖ పరిధిలోని అర్చకులంతా హర్షాతిరేకాలు వెల్లివిరిశాయి. దీంతో అర్చకులంతా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రభుత్వ యంత్రాంగం సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ.. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ జన్మకు ఇది చాలు.. 22ఏళ్లుగా ఈ శాఖలో పనిచేస్తున్నా. రూ.850తో నా వేతనం మొదలైంది. చివరి కాలంలో కూడా ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తింపు పొందలేమోనని మదన పడేవాన్ని. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. ఇక ఈ జన్మకు ఇది చాలు. – శ్రీనివాసులు, జూనియర్ అసిస్టెంట్, జోగుళాంబ ఆలయం అర్చక ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6వేల మంది అర్చక ఉ ద్యోగ కుటుంబాల్లో వెలుగు లు నిండా యి. దశాబ్ధాల కల సాకారం చేసినందుకు సీఎం కు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. మా ఉద్యమానికి సహకరించిన టీఎన్జీఓ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. – జైపాల్‌రెడ్డి, జిల్లా అర్చక ఉద్యోగ సంఘం అధ్యక్షుడు -
అర్చకులకు సీఎం కేసీఆర్ కానుక
-
అర్చకులపైనా మీ ప్రతాపం?!
సందర్భం అఖిలపక్ష సమావేశం 2007లో సెలక్ట్ కమిటీ నివేదిక ప్రాతిపదికన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం దేవాదాయ చట్టాన్ని సవరించింది. అంతే... ఆయన అస్తమయంతో అంతా స్తబ్దం... ఇప్పటికి 9 సంవత్సరాలు గడిచినా సవరించిన ఆ చట్టాన్ని అమలుపరిచే చర్యలు మాత్రం శూన్యం. మన దేశంలో సమస్యలెన్ని ఉన్నాయో, కమిటీలు కూడా అన్ని ఉన్నాయి. మలమూత్ర శాలల నుంచి రైతుల, విద్యార్థుల వరకు... సవాలక్ష సమస్యలపై లక్షల పేజీల నివేదికలను ఈ కమిటీలు సమర్పిస్తుంటాయి. వీటిలో వెలుగు చూడనివి కొన్ని అయితే, ఎక్కువ భాగం అమలుకు నోచుకోనివే. ఒక ప్రభుత్వం పోయి, ఇంకో ప్రభుత్వం వస్తుంటుంది. ప్రజా స్వామ్యాన్ని ఇవి ఎంతగా గౌరవిస్తాయంటే సమాధానం దొరకని ప్రతి సమస్యకు కమిటీ ఏర్పాటే పరిష్కారంగా భావిస్తాయి. తీరా కమిటీలు, నివేదికలు అన్నీ అయి సిఫార్సులు చేతికందే సమయానికి పాత్రధారులు మరో పాత్రలతో క్షణం తీరిక లేకుండా ఉంటారు. అమూల్యమైన డబ్బూ, కాలాన్ని వెచ్చించి కమిటీలు మల్లగుల్లాలుపడి అందించిన నివేదికలు, సిఫార్సులు, విశ్లేషణలు.. అధి కారుల బల్లలమీద అతి సహజంగా మరణిస్తుంటాయి. ఈ మధ్య అర్చకుల జీతాలలో కోతలు విధిస్తూ దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయం హేయమైనది, హాస్యాస్పదమైనది. ఇలాంటి ఆదే శాలు, హెచ్చరికలు ఎన్ని జారీ అయినా చట్టంలో అసంబద్ధత, అస్పష్టత, అసమగ్రత కొనసాగినంతకాలం మన సనాతన ఆలయ వ్యవస్థ స్ఫూర్తికి ఈ పాశవిక చట్టం కోరల్లోని విష వాయువులు సోకుతూనే ఉంటాయి. దీని వెనుక ఉన్న విషాదగాథ 1987 నాటిది. గుళ్లలో అర్చకత్వం చేసి, ఇతరత్రా సేవలు చేసి అర్ధాకలితో బొటాబొటీ జీవితాలు గడిపే అర్భకుల కథ ఇది. సుప్రీంకోర్టు గడపలు కూడా తొక్కిన తరువాత రెండు కమిటీలను కోర్టు నియమించింది. వేతన స్కేళ్ల కమిటీ, అర్చకుల సంక్షేమ కమిటీ. వీటి నివేదికలను కూడా ప్రభుత్వం ఆమోదించి కోర్టు ముందుంచింది. కోర్టువారు కూడా సంతోషించి 1997లోనే వాటి అమ లుకు ఆదేశించారు. అంతే! ఆ తరువాత అదేమీ ఎరగనట్లు ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. 1987లో చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సుల్ని గుడ్డిగా నమ్మి అత్యంత ఆర్భాటంగా, హడావుడిగా, ఆగమేఘాలమీద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్టం (30/87) 30 ఏళ్ల కాలంలో ఎన్నెన్నో మలుపులు తిరిగింది. పలు కింది కోర్టుల్లో పిటిషన్లు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో లిటిగేషన్లు, తాత్కా లిక ఇంజెంక్షన్లు, కొన్ని సమర్థనలు, కొన్ని రద్దులు, కోర్టు నుంచి కొత్త ఆదేశాలు, ఎండోమెంట్ కమిషనర్ల అత్యుత్సాహభరిత సర్క్యులర్లు.. ఇవన్నీ చవిచూస్తూనే ఈ చట్టం– దేవాలయ వ్యవస్థలో కీలకమైన అర్చక వ్యవస్థకి మాత్రం భయంకరమైన చేదు అనుభవాన్ని చవిచూపించింది. ప్రసాదాలు, హారతిపళ్లెంలో వాటాలు సహా అన్ని వాటాలకు అర్చ కులు ‘చట్టప్రకారం అనర్హులు.. అనర్హులు’ అని ఎత్తిచూపుతూ, వారిని నిస్సహాయుల్ని చేసే, దౌర్జన్యాలు జరిగాయి. స్వార్థంతో అనర్హుల్ని అర్చ కులుగా చేసే ప్రయత్నంలో వృద్ధ పూజారుల్ని సైతం దుర్భాషలతో అవ మానపరిచిన దుర్ఘటనలు జరిగాయి. అర్చకుల శ్రమను సొంత ప్రయోజ నాల కోసం దోచుకునే దుస్సాహసాలు జరిగాయి. ఎక్కడ్నుంచి ఎక్కడి కైనా బదిలీ చేసెయ్యొచ్చునంటూ అర్చక కుటుంబాల్ని భయోత్పాతానికి గురిచేసే కుయుక్తులు ప్రయోగించారు. తమ అక్రమార్జనలకి సహకరించే దుష్ట శక్తుల్ని ధర్మకర్తలుగా నియమింపజేసే దురాగతాలు జరిగాయి. అవమానభారంతో, ఆకలి బాధతో, కళ్లలోంచి రక్తం చిమ్మేటంతటి ఆక్రో శంతో ఒకరిద్దరు అర్చకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చల్లా కొండయ్య కమిషన్ నివేదిక ఆధారంగా–ఆలయ వ్యవస్థకి జీవగర్రలాంటి అర్చక కుటుంబాల మీద గత పదహారేళ్లుగా సాగిన, ఇంకా సాగుతున్న ఈ దాడితో శారీరక, మానసిక క్షోభకి గురవుతున్న నిస్సహాయ అర్చక కుటుంబాల సమస్యకి శాశ్వత పరిష్కారం చూపేం దుకు వైఎస్సార్ చిత్తశుద్ధితో ప్రయత్నించారు. 2004లో వైఎస్సార్ ప్రభుత్వం కొలువుదీరింది. అఖిలపక్ష సమావేశం 2007లో వైఎస్సార్ ప్రభుత్వం సెలక్ట్ కమిటీ నివేదికతో చివరకు దేవాదాయ చట్టాన్ని సవ రించారు. అంతే. ఆయన అస్తమయంతో అంతా స్తబ్దం.. ఇప్పటికి 9 ఏళ్లు గడిచినా చట్టాన్ని అమలుపరిచే చర్యలు శూన్యం. కడుపుకాలిన బాధితులు 2010లో సమ్మె చేయక తప్పలేదు. ఇంతకూ వీరు అడుగుతున్నది దేవ రహస్యం కాదు. పీఆర్సీ ప్రకారం జీతాలివ్వండని అర్చకులు, దేవాలయ సిబ్బంది కోరుతున్నారు. సీని యర్లేమో పింఛను కూడా అడుగుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమ బద్ధీకరణను, మరికొందరు కారుణ్య నియామకాల్ని కోరుకుంటున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, యాదగిరి గుట్ట, ద్వారకా తిరుమల, బాసర, వేములవాడ, భద్రాచలం దేవాలయాలకు చెందిన అర్చకులు, ఆలయ సిబ్బంది అంతా సమ్మె చేయడంతో ప్రభుత్వం అక్టోబర్ 24, 2010న ఒక కమిటీని నియమిస్తూ జీఓ (జీవో ఎంఎస్ నం. 1395) కూడా జారీ చేసింది. ఈ కమిటీ జనవరి 5, 2011న నివేదిక కూడా ఇచ్చేసింది. ఆ మరుసటి రోజే ప్రభుత్వం ఆల యాల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు (ఈఓలకు) ఇతర ఉద్యోగులకు పీఆర్సీ స్కేళ్లు వర్తింపజేస్తూ జీఓ కూడా జారీ చేసేసింది. తమాషా ఏమిటంటే.. భక్తుల దక్షిణలే గుళ్లకు ఏకైక ఆదాయవనరు. భక్తులిచ్చే విరాళాల్లో 21.5 శాతం ప్రభుత్వమే గుంజేసుకుంటుంది. దేవా దాయ శాఖ కమిషనర్, ఉద్యోగులు, కార్యనిర్వాహక సిబ్బంది జీతాలన్నీ ఈ నిధుల నుండే చెల్లిస్తారు. ఈ సోకులు అనుభవిస్తున్న వారంతా ప్రభు త్వానికి చెందిన ‘వైట్‌కాలర్’ ఉద్యోగులు కాగా, గుడి సిబ్బంది మాత్రం దిక్కూ మొక్కూ లేని ద్వితీయ శ్రేణి పౌరులు. జనవరి 5, 2011 నాటి నివేదికను ప్రభుత్వం ఆమోదించినా అమలు చేసే నాథుడేలేడు. కడుపు చించుకుంటూ దాదాపు 20వేల మంది ఆలయ సిబ్బంది మరో మారు సమ్మెతో రోడ్డెక్కారు. అంతే, మరో కమిటీ సాక్షాత్కరించింది. ఇప్పుడు ఆ కమిటీ ఎక్కడుందో, ఏమైందో పత్తాలేదు. అర్చక కుటుంబాల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు సూచించిన సమీ కృత పథకాన్ని అమలు చేయకుండా, వాళ్ల అర్చక స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తూ, అర్చక కుటుంబాల ఆక్రోశాల మధ్య వారిని శాశ్వతంగా ఆలయా ల్నుంచి తరిమివేసేలా– తద్వారా ఆలయ సంస్కృతి అంతరించిపో యేలా చేస్తున్న కొంతమంది స్వార్థపరులైన అధికారులు చెప్పే విధంగా ప్రభుత్వం నడవకూడదు. ప్రభుత్వం కోట్లాది మంది భక్తుల మనోభావా లను గౌరవించి దేవాలయాలను, అర్చక వ్యవస్థను పరిరక్షించే లక్ష్యంతో పనిచేయాలి. ఈ లక్ష్యాలకి కట్టుబడి పనిచేసే ప్రభుత్వం మాత్రమే పది కాలాలపాటు వర్ధిల్లాలని ఆలయ సంస్కృతీ పరిరక్షణాభిలాషులందరం ఆశిద్దాం. అలాంటి సంకల్పం ఈ ప్రభుత్వం తెచ్చుకుంటుందా?! ఆ పర మాత్మకే ఎరుక!! వ్యాసకర్త చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు : సీఎస్ రంగరాజన్ మొబైల్ : 98851 00614 -
శ్రీవారి అర్చకుల మధ్య ముదిరిన వివాదం
-
సంతృప్తి... సగం బలం
చాతుర్మాస్య దీక్ష సందర్భంగా విజయవాడ శివరామక్షేత్రానికి విచ్చేసిన శ్రీ శృంగేరీ శివగంగ శ్రీశారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీపురుషోత్తమ భారతీ మహాస్వామి వారి అనుగ్రహభాషణం... ధర్మాచరణ ద్వారా మోక్షాన్ని సాధించినప్పుడే మానవ జీవిత లక్ష్యం నెరవేరుతుంది. మోక్షాన్ని పొందలేని మానవ జీవితం వ్యర్థమే. ♦ జీవితం ఆనందంగా గడపాలనుకునేవారు తనకి ఒక పరిమితిని ఏర్పరచుకోవాలి. అన్నీ ఉన్నా ఇంకా ఇంకా కావాలి అనుకోవటంలో ఆనందానికి దూరమవుతారు. సంతృప్తి అనేది ప్రతివ్యక్తికి ఉండి తీరాలి. అది లేకపోతే మనిషికి అన్నీ ఉన్నా ఆనందం లభించదు. ♦ అసంతృప్తి అనేది మనిషిని అన్నింటిలోనూ దిగజార్చివేస్తుంది. ♦ మనిషి ఆధ్యాత్మిక పరంగా ఎదగాలంటే వారి అవసరాలను తగ్గించుకోవాలి. ♦ పాపం వల్ల దుఃఖం వస్తుంది. అద్వైత ఆత్మజ్ఞానం చేత పాపం పోగొట్టబడుతుంది. ‘పాపౌఘపరిధూయతాం’ అన్నారు శంకరులు. ♦ దుఃఖం రాకూడదనుకునేవారు నిరంతరం ధర్మమార్గంలో ఉండాలి. మనసులో ఏ విధమైన పాపచింతన లేకుండా చూసుకోవాలి. సత్పురుషులను ఆశ్రయించి జ్ఞానమార్గాన్ని అనుసరించాలి. అటువంటి వారికి దుఃఖం చాలా దూరంగా ఉంటుంది. ♦ నిరంతరం వేదోక్త మార్గాలను అనుసరిస్తూ జిజ్ఞాసువులై శిష్యులకు మంచిని బోధించాలనే ఇచ్ఛ కలిగి ఉన్నవారే సత్పురుషులు. ♦ నిరంతరం ఆత్మయందే బుద్ధిని నిలపడం, ఆత్మను గూర్చి చింతించటం, ఆత్మయందే మనస్సు ఉంచడం వల్ల ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. ♦ కోరికలు పెరగడం వల్ల కష్టాల పాలవుతున్నారు. కోర్కెలను అదుపులో ఉంచుకున్న వారు, ఎంత సంపాదించినా సంతృప్తిగా జీవించేవారు సుఖవంతులు. అంతేకాని ఎంత సంపాదించామనే దానితో సంబంధం లేదు. ♦ సంతృప్తి అనేది సత్సంగం వలన కలుగుతుంది. సద్గురువుల బోధ, సత్పురుషుల సాంగత్యం వల్ల వస్తుంది. అందుకోసమే ఎల్లప్పుడూ సత్సాంగత్యాన్నే కోరుకోవాలి. యతులు, పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్ష ఎందుకు చేస్తారు? పీఠాధిపతులకు చాతుర్మాస్య దీక్ష అవసరం. గురువులందరినీ ఆవాహన చేసి దీక్షలో ఉంటారు. యతులు, సన్యాసులు... ఒక గ్రామంలో ఒకరోజుకి మించి ఉండకూడదు. అలా వారు సంచరిస్తూ ఉంటారు. కాని, క్షేత్రంలో ఎన్నిరోజులైనా ఉండవచ్చు. పక్షాన్ని మాసంగా భావించి, రెండు మాసాలు ఈ వ్రత దీక్షలు చేస్తారు. కొందరు నాలుగు మాసాలు ఆచరిస్తారు. గృహస్థులు కూడా నియమానుసారం ధర్మసింధు’ బోధించిన నియమాలు అనుసరిస్తారు. సనాతన ధర్మప్రచారం కోసం... నిరంతరం ధర్మశాస్త్రం అనుసరించడం, ధర్మప్రచారం చేయడం పీఠాధిపతుల కర్తవ్యం. ప్రతివారు ఆరోగ్య నియమాలు, సూత్రాలు పాటించాలి. ముఖ్యంగా యతులు సన్యాసులు ఆరోగ్య సూత్రాలను విధిగా అనుసరిస్తారు. ఆయా ఋతువుల్లో ఆహార నియమాలు పాటిస్తే రోగాలు రావు. -
ఉద్యోగులు, అర్చకులకు నెలనెలా వేతనం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు ప్రతి నెలా వేతనాలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వారికి కనీస వేతనాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. శనివారం ప్రగతి భవన్లో అర్చక సమాఖ్య, దేవాలయ ఉద్యోగ సంఘాల నేతలు ఉపేంద్రశర్మ, మోహన్ తదితరులు సీఎంను కలసి వేతనాలపై వినతిపత్రం సమర్పించారు. -
హుండీ చోరి కేసులో పూజారుల అరెస్టు
చెన్నై: తిరుచ్చెంగోడు అర్థనారీశ్వర ఆలయంలో నిఘా టీవీ కెమెరాను గుడ్డతో కప్పి హుండీ సొమ్మును అపహరించిన ఆలయ పూజారి, అతని కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. నామక్కల్ జిల్లా తిరుచెందూరు నగరంలో సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్ర గల పురాతన ప్రసిద్ధి చెందిన అర్థనారీశ్వర స్వామి ఆలయం కొండ పైన ఉంది. ఈ ఆలయానికి ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్తుంటారు. ఇంకనూ అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పండుగ ముహూర్తం రోజులలో ఆలయం భక్తులతో క్రిక్కిరిసి ఉంటుంది. ఇక్కడ భక్తులు కానుకలు చెల్లించడానికి హుండి, దాని పక్కనే సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆలయంలోని హుండీలో భక్తులు చెల్లించిన కానుకలు అపహరణకు గురైందువల్ల ఆలయ నిర్వాహకులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసు జాయింట్ కమిషనర్ రత్నవేల్ సీసీ టీవీ కెమెరాలో నమోదయిన దృశ్యాలను పరిశీలించారు. ఆ సమయంలో గత 17వ తేది కెమెరాను నల్ల గుడ్డతో ఒక వ్యక్తి మూసివేస్తూ కనిపించాడు. వెంటనే పోలీసులు ఆలయంలో పని చేసే వారి వద్ద విచారణ చేపట్టారు. ఆ సమయంలో పారంపర్య పూజారి జ్ఞానమణి (65), అతని కుమారుడు ముల్లైవన నాధన్ (24)లు హుండీలో డబ్బులు చోరీ చేసినట్లు అంగీకరించారు. విచారణలో వారు రూ. 20 లక్షలతో కొత్త ఇల్లు నిర్మించుకున్నారని దాని కోసం ప్రతి రోజూ చోరి చేసేవారని ఇప్పటి వరకు సుమారు రూ. 3 లక్షలను చోరి చేసినట్లు తెలిసింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు. -
మల్లేశ్వరునికి కార్తీక పూజలు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయంలో శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. శివ పంచాక్షరీ జపం, లక్ష్మీగణపతి మంత్రజపం, కాఠక పారాయణం, త్రికాలాభిషేకాలు, రుద్రహోమం, లక్ష బిల్వార్చన, సహస్ర లింగార్చన జరిగాయి. పలువురు ఉభయదాతలు రుద్రహోమం, సహస్ర లింగార్చనలో పాల్గొని తరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఓంకారం స్టాండ్‌లో దీపాలను వెలిగించారు. -
అర్చకుల వేతనాలపై నేడు నిర్ణయం?
మంత్రివర్గ ఉపసంఘం భేటీలో చర్చ సాక్షి, హైదరాబాద్: అర్చకులు, దేవాలయ ఉద్యోగుల వేతనాల క్రమబద్ధీకరణ విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు గురువారం మంత్రివర్గ ఉప సంఘం భేటీ కాబోతోంది. ఇప్పటికే ఓ దఫా సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం అధికారులతో విధివిధానాలపై ప్రాథమికంగా చర్చించింది. కొన్ని సందేహాలుండటంతో వాటి నివృత్తికోసం వివరాలు సమర్పించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. వాటిని అధికారులు సిద్ధం చేయటంతో గురువారం రెండో భేటీకి సిద్ధమైంది. వేతనాల విషయంలో ఉపసంఘం తుది నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించనుందని తెలుస్తోంది. -
ఆలయ భూములు.. హారతి కర్పూరం!
చండూరు పాత జీఓల్లోని లొసుగులను ఆధారంగా చేసుకొని పూజారులు వందల ఎకరాల ఆలయ భూములను విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఆలయ పూజారి తెలివి, దేవాదాయ శాఖ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, రిజిస్ట్రేషన్ అధికారుల చేతి వాటం వెరసి కోట్లాది రూపాయాల విలువ చేసే భూములన్ని నేడు రియల్టర్ల చేతిలో పడుతూ వస్తున్నాయి. పాత జీఓలు, కోర్టు ఉత్తర్వులంటూ పూజారి కుటుంబం చేస్తున్న హడావుడితో ఎండోమెంట్ శాఖ ఆలయ భూములను రక్షించుకోలేకపోతుంది. చండూరులోని సీతారామచంద్రస్వామి దేవాలయం నిర్వహణకు కుంభం వంశస్తులు ఆనాడు సుమారుగా వంద ఎకరాల వరకు భూములను దానంగా ఇచ్చారు. ఇందులో 60 ఎకరాలను పూజారికి స్వంతంగా కేటాయించగా, మిగిలిన 40.35 ఎకరాలు మాత్రం దేవాలయం పేరున ఉంది. కొంత కాలంగా మండలంలో పెరిగిన రియల్ ధరలను అవకాశంగా తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా ఆలయ భూములను ఆ పూజారులు రియల్టర్లకు అమ్మేసుకున్నారు. గతంలో రాష్ట ప్రభుత్వం పూజారులకు కేటాయించిన ఆలయ భూములను విక్రయించుకోవచ్చనే వెసలుబాటు కల్పించింది. ఇదే అదునుగా తీసుకున్న ఆలయ పూజారి 60 ఎకరాలను ఆనాడే అమ్మేసుకుని సొమ్ముచేసుకున్నాడు. ఇక ఆలయ భూముల పై కన్ను.. తనకు కేటాయించిన భూములను అమ్ముకున్న పూజారులు ఇక ఆలయ భూములు ఎలా విక్రయించుకోవాలనే ఆలోచన ఆ పూజారుల కుటుంబంలో వచ్చింది. కాకపోతే అటు ఆలయ భూములు, ఇటు పూజారికిచ్చిన భూములకు చెందిన సర్వే నంబర్లు ఒకటే కావడంతో చిక్కు వచ్చి పడింది. 2005 సంవత్సరానికి ముందే ఆలయ భూములు విక్రయాలు జరుపుకునేందుకు పూజారి కుటుంబం యత్నాలు చేసింది. దీంతో గ్రామస్తుల తిరుగుబాటుతో తాత్కాలికంగా విక్రయాలు వాయిదా వేసుకున్నారు. తిరిగి 2011, మే నెలలో రెండు ఎకరాలను రియల్టర్లకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయించారు. ఆ వెంటనే రిజిస్ట్రేషన్ చేయించారు. కొనుగోలు చేసింది ఆయా పార్టీలకు చెందిన నాయకులు కాబట్టే కొంత కాలం గుట్టు బయటకు పొక్కలేదు. తర్వాత ఆనోట ఈ నోట కొనుగోలు విషయం తెలవడంతో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. అధికారులు స్పందించి సర్వే చేయించారు. సుమారుగా ఆరు సంవత్సరాలు ఆ భూమిని విక్రయించిన రియల్టర్లు స్తంబ్ధంగా ఉండి తిరిగి మరో ఓ వ్యక్తికి అమ్మేసుకొని బయాన సైతం తీసుకున్నారని సమాచారం. దీంతో మంగళవారం ఆ విషయం బయటకు తెలిసింది. బుధవారం ఎండోమెంట్ ఈఓ సులోచన, తహసీల్దార్ కృష్ణారావు దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. సమాచారం అందింది సులోచన, ఎండోమెంట్ ఈఓ దేవాలయానికి చెందిన భూమిని విక్రయించినట్లు ఫోన్లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌తో మాట్లాడా. పుష్కరాలు ఉండడంతో అదనపు విధులు నిర్వహిస్తున్నాం. రెండు మూడు రోజులలో సందర్శిస్తాను. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం – కోడి గిరి బాబు, మాజీ సర్పంచ్ దేవాలయానికి చెందిన భూములను కొనుగోలు చేసిన వారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. గతంలోనే కొనుగోలు చేస్తే ఆందోళన చేశాం. తిరిగి ఎండో మెంట్, రెవెన్యూ అధికారులు స్పందించి కొలతలు వేశారు. కొనుగోలు చేసిన కొంతమంది తిరిగి మరొకరికి భూమిని విక్రయించారు. దేవాలయ భూముల పరిరక్షణ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం. ఎండోమెంట్‌కు తెలియ జేస్తా –కృష్ణారావు, తహసీల్దార్ దేవాలయానికి చెందిన భూమిని అమ్మినట్లు తన దృష్టికి వచ్చింది. ఎండోమెంట్ అధికారులకు తెలియజేస్తా. అమ్మిన భూమి ని పరిశీలించాలని వీఆర్వోకు ఆదేశాలు జారిచేశా. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. -
టీటీడీలో సన్నిధి గొల్లల వివాదం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో సన్నిధి గొల్లల వివాదం చెలరేగింది. అర్చకులకు ఏ విధానాలతై అమలు చేస్తున్నారో.. ఆ విధానాలే తమకు అమలు చేయాలని సన్నిది గొల్లలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 30న సన్నిధి వెంకటరామయ్య యాదవ్‌ను పదవీ విరమణ చేయాలని టీటీడీ సూచించింది. మిరాశీ వ్యవస్థలో ఉన్న తమను రిటైర్డ్ కావాలని చెప్పడం సరికాదని సన్నిది గొల్లలు వాపోతున్నారు.