తమకు జీవో (010) ప్రకారం ట్రెజరి ద్వారా జీతాలు ఇవ్వాలని కోరుతూ అర్చకులు చేపట్టిన సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది.
హైదరాబాద్: తమకు జీవో (010) ప్రకారం ట్రెజరి ద్వారా జీతాలు ఇవ్వాలని కోరుతూ అర్చకులు చేపట్టిన సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. గురువారం ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌లో అర్చకులు రిలే నిరాహారా దీక్షలు చేపట్టారు. విశ్వ హిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు ఈ దీక్షకు తమ సంఘీభావాన్ని తెలిపారు.