
ప్రదక్షిణల నుంచి పరమేశ్వరుని అర్చనకు
మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అనే స్పృహను పురుషాధిక్య సమాజానికి కల్పించే ప్రయత్నంలో భారతీయ మహిళ చాలాదూరమే ప్రయాణించి వచ్చింది. దైవ సన్నిధి హక్కును కూడా పొంది, ఇప్పుడు దైవార్చన హక్కును సాధించుకుంది. దేశంలోని అనేక దేవాలయాలలో ఇటీవల మహిళా పూజారులు దర్శనమిస్తున్నారు. ఉపనయనాలు కూడా జరిపిస్తున్నారు. అయితే ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.లను లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అయినట్లుగా పౌరోహిత్యంపై ఆసక్తి కనబరిచే మహిళా అభ్యర్థులు ఆ పద్ధతులు, విధానాలు ఎక్కడ నేర్చుకోవాలి? ప్రస్తుతానికైతే పుణెలోని జ్ఞాన ప్రబోధిని ఇన్‌స్టిట్యూట్ ఈ సంశయాన్ని పరిష్కరిస్తోంది.
20 మంది యువతులతో మొదటి బ్యాచ్‌ని ప్రారంభించిన జ్ఞాన ప్రబోధిని, త్వరలోనే రెండో విడత ప్రవేశాలకు ప్రకటన ఇవ్వబోతోంది. భక్తికి.. స్త్రీ, పురుష వివక్ష లేనప్పుడు అర్చకత్వానికి ఎందుకుండాలని ఈ సంస్థకు ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్‌గా ఉన్న మనీషా సేథ్ ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా.
Comments
Please login to add a commentAdd a comment