బెంగళూరు : కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకే 100 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందంటూ సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రావడంతో సిద్ధరామయ్య ఆ ట్వీట్‌ను తొలగించారు. అయినప్పటికీ దుమారం కొనసాగుతూనే ఉంది.
ఈ తరుణంలో బెంగళూరులోని ఓ కార్పొరేట్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తాను ‘కన్నడ భాష విషయంలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాను. అందుకే బెంగళూరు వదిలి వెళ్లిపోతున్నాను’ అంటూ చేసిన థ్రెడ్ పోస్ట్‌కి 14 లక్షల ఇంప్రెషన్స్ వచ్చాయి.
పంజాబ్‌కు చెందిన షానీనాని ఇండియా సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఏడాదిన్నపాటు ఉన్నారు. బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లయి కంపెనీ లిమిటెడ్ సంస్థలో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటీవ్‌గా విధులు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాదిన్నర కాలంలో బెంగళూరులో తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు పెళ్లైంది. ఏడాది పాటు పంజాబి సంప్రదాయ వస్త్రదారణలో ఆఫీస్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో నా వస్త్రదారణ చూసిన వారు నేను పంజాబీ అని గుర్తించేవారు. ఆఫీస్ వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఆటో ఎక్కాల్సి వచ్చినా, లేదంటే ఇతర వస్తువులు కొనుగోలు చేసిన మార్కెట్ రేటు కంటే తన వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. కొన్నిసార్లు మొహం మీదే కన్నడ నేర్చుకోమని వివక్షచూపుతూ మాట్లాడేవారు.
ఓరోజు నా ఆఫీస్‌లో కరెంట్‌యింది. వెంటనే ఆఫీస్‌లోని ఎలక్ట్రిక్ విభాగానికి నేరుగా ఫిర్యాదు చేశా. అక్కడ కూడా నాకు చేదు అనుభవమే ఎదురైంది. అందులో ఓ ఉద్యోగికి సమస్యను పరిష్కరించాలని హిందీ, ఇంగ్లీష్‌లో అడిగా. నో హిందీ,నో ఇంగ్లీష్.. ఓన్లీ కన్నడ.. కన్నడలో మాట్లాడండి. మీసమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో కంగుతినట్లు చెప్పారు.
ఇలా వర్ణించలేని ఇబ్బందులు ఎదుర్కొన్నాని, అందుకే బెంగళూరు వదిలి గురుగ్రామ్ వెళ్లినట్లు చెప్పారు. నేను నా ఇంటికి వచ్చా. సంతోషంగా ఉన్నాను. ఇన్ని రోజులు ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నాను. మంచి ఆహారం తింటాను, నేను కోరుకున్న చోటికి వెళ్లగలుగుతున్నాను అని వ్యాఖ్యానించారు. కాగా, చాలా మంది నెటిజన్లు ఆమెకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు కన్నడ నేర్చుకుంటే తప్పేముంది.’ అని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment