Silicon Valley
-
డీప్‌సీక్ హవా.. దిగ్గజ టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సిలికాన్ వ్యాలీకి హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చాట్‌జీపీటీ తరహాలో రూపొందించిన చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ ‘డీప్‌సీక్’ (deepseek) పై చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో చైనా డీప్‌సీక్ విషయంలో సిలికాన్ వ్యాలీకి ఓ వేకప్ కాల్ అంటూ హెచ్చరించారు. అసలేం జరిగిందంటే..? కొద్ది రోజులు క్రితం అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన దిగ్గజ టెక్ కంపెనీ ఫౌండర్లు, కోఫౌండర్లు, సీఈవోతో మాటమంతి కలిపారు. అదే సమయంలో చైనా డీప్‌సీక్ తన ఆర్1 మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, ట్రంప్ ప్రమాణ స్వీకారం కారణంగా ఆర్1 మోడల్ గురించి పెద్దగా ఎవరీకి తెలియలేదు.కానీ వారాంతంలో డీప్‌సీక్ చాట్‌బాట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. యూఎస్ యాపిల్ యాప్ స్టోర్‌లో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ స్థానంలో డీప్‌సీక్ చేరింది. చాట్ జీపీటీ సైతం డౌన్లోడ్ల విషయంలో డీప్‌సీక్ వెనక్కి నెట్టింది. దీంతో కృత్రిమ మేధా ప్రపంచంలో చైనా ఏఐ డీప్‌సీక్ దెబ్బకు ఇతర టెక్నాలజీ కంపెనీ షేర్లు.. బేర్ మన్నాయి. ముఖ్యంగా చిప్ తయారీ సంస్థలు ఊహించని స్థాయిలో నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సోమవారం దాదాపు 17 శాతం నష్టాన్ని చవిచూసింది. ఎన్విడియా సైతం అమెరికన్ స్టాక్ మార్కెట్ వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఒక రోజు లోనే అతిపెద్ద నష్టాన్ని మూగట్టుకుంది. నష్టం విలువ సుమారు 589 బిలియన్ డాలర్లు.ఈ వరుస పరిణామాలపై ట్రంప్ స్పందించారు. డీప్‌సీక్ తక్కువ ఖర్చుతో తయారు చేసినట్లు తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీకి ఇదొక వేకప్ కాల్ లాంటిది. డీప్‌సీక్‌కు వస్తున్న క్రేజ్‌ను సానుకూలంగా భావిస్తున్నట్లు చెప్పారు. బిలియన్ డాలర్లు ఖర్చు చేయకుండా, తక్కువ ఖర్చుతో అదే తరహా చాట్బాట్లను తయారు చేయొచ్చు’ అని అన్నారు. -
క్రికెట్ జట్టు కోసం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బిడ్ దాఖలు
ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ లండన్‌కు చెందిన క్రికెట్ జట్టు కోసం వేలం వేసే సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్‌ల కన్సార్టియంలో చేరారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ వంటి టాప్ టెక్ లీడర్లతో కూడిన ఈ గ్రూప్ ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ లేదా ‘లండన్ స్పిరిట్’ టీమ్‌ల కోసం 80 మిలియన్ పౌండ్ల (97 మిలియన్ డాలర్లు-రూ.805.1 కోట్లు) బిడ్ వేస్తోంది.ఈ కన్సార్టియంకు పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా, టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ సత్యన్ గజ్వానీ నేతృత్వం వహిస్తున్నారు. యువ క్రికెట్ అభిమానులను ఆకర్షించడానికి రూపొందించిన క్రికెట్ టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’ ఎనిమిది జట్లలో ప్రైవేట్ పెట్టుబడులను పొందడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీఈ) చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ బిడ్ దాఖలవుతున్నట్లు తెలిసింది.100-బాల్ ఫార్మాట్‌తో ‘ది హండ్రెడ్’100-బాల్ ఫార్మాట్‌ను అనుసరించే ది హండ్రెడ్ 2021లో ప్రారంభించినప్పటి నుంచి అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయవంతమైంది. ఈ పోటీలో ఎనిమిది నగరాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. ప్రతి ఒక్కటి యూకేలోని ఒక ప్రధాన నగరానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇది స్కై స్పోర్ట్స్, బీబీసీలో ప్రసారం అవుతుంది.ఇదీ చదవండి: ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిన ఆన్లైన్ సేవలుటెక్ కంపెనీ సీఈఓలకు ఆసక్తిసుందర్ పిచాయ్‌కు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి అందరికీ తెలిసిందే. టాప్ టెక్ కంపెనీ సారథులు క్రికెట్‌పై ఆసక్తిగా ఉంటూ దాన్ని మరింత మందికి చేరువ చేయాలని చూస్తున్నారు. ఇదిగాఉండగా, ఈసీబీ ప్రతి జట్టులో 49 శాతం వాటాను విక్రయించాలని చూస్తోంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఆడే లండన్ స్పిరిట్ జట్టుకు సొంత మైదానం ఉండడంతో దాని నిర్వహణకు సంబంధించి పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. -
ఆయనదే విజన్.. ఇతరులది భజన్ భజన్!
ఫలానా అభివృద్ధికి మేమే కారణం అంటూ అరిగిపోయిన రికార్డులాగా.. ఏళ్లు గడుస్తున్నా గప్పాలు కొట్టుకుంటూ తిరిగే నేతల్ని ఇంకా మనం చూస్తున్నాం. అయితే చర్చల ద్వారా మేధావులు అందులో ఎంత వాస్తవం ఉందనేది వెలికి తీసే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నారు. అయినా అలాంటి నేతల తీరు మారడం లేదు. అయితే ఈ దారిలో సోమనహల్లి మల్లయ్య కృష్ణ(SM Krishna) ఏనాడూ పయనించలేదు.దేశంలో కర్ణాటకలోని బెంగళూరు నగరానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఏమాత్రం పట్టుకోల్పోకుండా ఐటీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే.. భారత్‌కు సెమీకండక్టర్ హబ్‌గానూ పేరుగాంచింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా బెంగళూరును ఇవాళ పిలుచుకుంటున్నాం. అయితే.. ఈ నగరానికి ఇంతలా ఘనత దక్కడానికి ఎఎస్ఎం కృష్ణ చేసిన కృషి గురించి కచ్చితంగా చెప్పుకుని తీరాలి. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన ఎస్ఎం కృష్ణ.. కర్ణాటక ముఖ్యమంత్రిగా 1999-2004 మధ్య పని చేశారు. అదే టైంలో ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా స్వయంప్రకటిత విజనరీ నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎస్ఎం కృష్ణతో పోలిస్తే అప్పటికే చంద్రబాబు ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా పని చేసి ఉన్నారు. పైగా హైటెక్ సిటీలాంటి కట్టడంతో కొంత పేరూ దక్కించుకున్నారు. అయితే నిజంగా చంద్రబాబు తాను చెప్పుకునే విజన్‌తో.. తన రాజకీయానుభవం ఉపయోగించి ఉంటే ఆనాడే హైదరాబాద్ ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ ఘనత దక్కించుకుని ఉండేదేమో!. కానీ, ఎస్ఎం కృష్ణ తన రియల్ విజన్‌తో ఆ ట్యాగ్‌ను బెంగళూరుకు పట్టుకెళ్లిపోయారు.విజన్ అంటే ఇది.. 1999 టైంలో.. ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన ఐటీ సంస్థలు భారత్‌లో తమ తమ కంపెనీలకు అనుకూలమైన స్పేస్ కోసం వెతుకుతున్నాయి. అప్పటికీ హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఏర్పాటైనా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఎక్కువ ఫోకస్ నడిచింది. మరోవైపు ఆపాటికే బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ఏర్పాటైంది. ఇదే అదనుగా ఐటీ కంపెనీలను ఎలాగైనా బెంగళూరుకు తీసుకురావాలని నిర్ణయించుకున్న ఎస్ఎం కృష్ణ.. ఆ పరిశ్రమ వృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడంపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా.. ఐటీ పార్కులు మరియు ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) ఏర్పాటుతో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎస్ఎం కృష్ణ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఈ నిర్ణయం దేశీయ, అంతర్జాతీయ టెక్ కంపెనీలను బెంగళూరులో తమ కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి ఆకర్షించింది. అలాగే.. ఐటీ రంగం అభివృద్ధి చెందాలంటే ఏం అవసరం అనే అంశాలపై అప్పటికే ఐటీ మేధావులతో ఆయన చర్చలు జరిపి ఉన్నారు. పన్ను ప్రోత్సాహకాలు, సరళీకృత నిబంధనలతో పాటు స్టార్టప్‌లకు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో పారిశ్రామికవేత్తలతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. తద్వారా వాళ్ల అవసరాలకు అనుగుణంగా తెచ్చిన సంస్కరణలు.. బెంగళూరులో టెక్ కంపెనీల కార్యకలాపాలను సులభతరం చేశాయి.ఇక.. ఒకవైపు ఐటీ రంగం కోసం ప్రతిభావంతులైన నిపుణుల అవసరాన్ని గుర్తించి విద్యతో పాటు స్కిల్‌డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు ఐటీ పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడానికి ఇంజనీరింగ్ కాలేజీలు, శిక్షణా సంస్థల స్థాపనకూ ప్రాధాన్యత ఇచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా.. అంతర్జాతీయ వేదికలపై బెంగళూరును ఎస్ఎం కృష్ణ ప్రమోట్ చేశారు. తద్వారా భాగస్వామ్యాలను, విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగారు. బాబు విజన్.. వాస్తవం ఎంత?‘‘హైదరాబాద్‌లో టెక్నాలజీ నా చలవే’’ అంటూ హైటెక్ సిటీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు ఒక భ్రమను కల్పించారనే వాదన ఒకటి ఉంది. కానీ, అంతకు ముందే హైదరాబాద్‌కు టెక్ కంపెనీల రాక మొదలైంది. నగరానికి 1965లోనే ఈసీఐఎల్, ఆ తర్వాత ఈఎంఈ వచ్చింది. తద్వారా ఎలక్ట్రానిక్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే హైదరాబాద్‌లో ఐటీ విస్తరణకు మూలం అయ్యింది. 1982లో సీఎంసీ ఆర్ అండ్ డీ వచ్చింది. ఇది సాఫ్ట్వేర్ సంస్థ. బెంగళూర్ కన్నా మూడేళ్ల ముందే అది హైదరాబాద్‌కు వచ్చింది. దాన్ని ఆ తర్వాత టీసీఎస్‌కు అమ్మేశారు.ఇక.. 1987లో ఇంటర్‌గ్రాఫ్ హైదరాబాద్‌లోని బేగంపేటలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత దేశానికి ప్రధాని అయిన రాజీవ్ గాంధీ.. హైదరాబాద్‌తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఐటీ వృద్ధికి కృషి జరిపారు. ఈ క్రమంలోనే మైత్రీవనంలో 1991లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటైంది. ఆ తర్వాత మాదాపూర్ ప్రాంతంలో ‘‘హైటెక్ సిటీ’’కి అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి పునాది వేశారు. ఆ తర్వాత మైత్రీవనంలోని సంస్థలు అక్కడికి తరలిపోయాయి.కర్ణాటక సీఎంగా ఎస్ఎం కృష్ణ వ్యూహాత్మక దృక్పథం, ఆయన విశేషకృషి వల్లే బెంగళూరు భారతదేశ ఐటీ విప్లవానికి పర్యాయపదంగా మారింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అనే బిరుదును సంపాదించుకోగలిగింది. అయితే ఇతరుల్లా ఏనాడూ ఆయన ఆ ఘనతను.. తన ఘనతగా తర్వాతి కాలంలోనూ చెప్పుకుంది లేదు!.ఎస్ఎం కృష్ణకి నివాళిగా.. -
ఏంజెల్ ట్యాక్స్ రద్దుతో స్టార్టప్‌లకు బూస్ట్
వాషింగ్టన్: ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేస్తూ భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను సిలికాన్ వ్యాలీకి చెందిన పారిశ్రామికవేత్తలు స్వాగతించారు. దీన్నొక చరిత్రాత్మక నిర్ణయంగా అభివరి్ణంచారు. స్టార్టప్‌ల ఎకోసిస్టమ్‌కు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని టీఐఈ సిలికాన్ వ్యాలీ ప్రెసిడెంట్ అనిత మన్వానీ అన్నారు. దేశ వృద్ధికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా వ్యాపార నిర్వహణ పట్ల ఆసక్తి పెరుగుతుండడాన్ని చూడొచ్చు. కేవలం టెక్నాలజీలోనే కాకుండా, సేవలరంగం, తయారీలో మరింత మంది యువ పారిశ్రామికవేత్తలు అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో పెరుగుతున్న యువ జనాభా నేపథ్యంలో ఏంజెల్ ఇన్వెస్టర్లను పన్ను నుంచి మినహాయించే ఇలాంటి చట్టాలే అవసరం. ఇది భారాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల పారిశ్రామికవేత్తలు నిబంధనల అమలుకు బదులు తమ వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు వీలు కలుగుతుంది. అంతిమంగా ఈ నిర్ణ యం భారత్–యూఎస్ కారిడార్‌లో ఏంజెల్ పెట్టు బడులను పెంచుతుంది’’అని మన్వానీ వివరించారు. పలువురు ఇతర పారిశ్రామికవేత్తలు సైతం ఈ నిర్ణయాన్ని అభినందించారు. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే పారిశ్రామికవేత్తలు ఎప్పటి నుంచో ఏంజెల్ ట్యాక్స్ రద్దు కోసం డిమాండ్ చేస్తుండడం గమనార్హం. స్టార్టప్‌కు నిధులు పెరుగుతాయి.. భారత ప్రభుత్వ నిర్ణయంతో స్టార్టప్‌లకు స్థానికంగానే కాకుండా, విదేశాల నుంచి పెట్టుబడుల సా యం పెరుగుతుందని యూఎస్ ఇండియా వ్యూహా త్మక భాగస్వామ్య సంస్థ పేర్కొంది. ఏంజెల్ ట్యాక్స్ రద్దు ద్వైపాక్షిక సాంకేతిక సహకారం, ఆవిష్కరణల విషయంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని యూ ఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ తెలిపింది. ‘‘భారత్‌లో స్టార్టప్‌ల వ్యవస్థకు ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. స్టార్టప్ ఎకోసిస్టమ్ రాణించేందుకు, ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, పోటీతత్వాన్ని పెంచేందుకు సాయపడుతుంది’’ అని యూఎస్ఏ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కరుణ్ రిషి పేర్కొన్నారు. రిపాట్రియేషన్లోనూ సంస్కరణలు అవసరం స్వదేశానికి నిధుల తరలింపులో(రిపాట్రియేషన్ )నూ సంస్కరణలు అవసరమని మన్వానీ అభిప్రాయపడ్డారు. ‘‘రిపాట్రియేషన్ అన్నది అధిక శాతం ఎన్ఆర్ఐలు, ఇన్వెస్టర్లకు ప్రాముఖ్యంగా ఉంటుంది. ఈ విషయంలోనూ నిబంధనలను సడలించాలి. నేడు ఎవరైనా యూఎస్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రిపా్రటియేషన్కు సంబంధించి ఇదే విధమైన నిబంధనలు, నియంత్రణలను భారత్ కూడా పాటించొచ్చు’’అని మన్వానీ తెలిపారు. -
‘నో ఇంగ్లీష్.. నో హిందీ.. ఓన్లీ కన్నడ’.. మహిళ ట్వీట్ వైరల్
బెంగళూరు : కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకే 100 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందంటూ సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రావడంతో సిద్ధరామయ్య ఆ ట్వీట్‌ను తొలగించారు. అయినప్పటికీ దుమారం కొనసాగుతూనే ఉంది.ఈ తరుణంలో బెంగళూరులోని ఓ కార్పొరేట్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తాను ‘కన్నడ భాష విషయంలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాను. అందుకే బెంగళూరు వదిలి వెళ్లిపోతున్నాను’ అంటూ చేసిన థ్రెడ్ పోస్ట్‌కి 14 లక్షల ఇంప్రెషన్స్ వచ్చాయి.పంజాబ్‌కు చెందిన షానీనాని ఇండియా సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఏడాదిన్నపాటు ఉన్నారు. బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లయి కంపెనీ లిమిటెడ్ సంస్థలో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటీవ్‌గా విధులు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాదిన్నర కాలంలో బెంగళూరులో తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.నాకు పెళ్లైంది. ఏడాది పాటు పంజాబి సంప్రదాయ వస్త్రదారణలో ఆఫీస్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో నా వస్త్రదారణ చూసిన వారు నేను పంజాబీ అని గుర్తించేవారు. ఆఫీస్ వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఆటో ఎక్కాల్సి వచ్చినా, లేదంటే ఇతర వస్తువులు కొనుగోలు చేసిన మార్కెట్ రేటు కంటే తన వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. కొన్నిసార్లు మొహం మీదే కన్నడ నేర్చుకోమని వివక్షచూపుతూ మాట్లాడేవారు.ఓరోజు నా ఆఫీస్‌లో కరెంట్యింది. వెంటనే ఆఫీస్‌లోని ఎలక్ట్రిక్ విభాగానికి నేరుగా ఫిర్యాదు చేశా. అక్కడ కూడా నాకు చేదు అనుభవమే ఎదురైంది. అందులో ఓ ఉద్యోగికి సమస్యను పరిష్కరించాలని హిందీ, ఇంగ్లీష్‌లో అడిగా. నో హిందీ,నో ఇంగ్లీష్.. ఓన్లీ కన్నడ.. కన్నడలో మాట్లాడండి. మీసమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో కంగుతినట్లు చెప్పారు.ఇలా వర్ణించలేని ఇబ్బందులు ఎదుర్కొన్నాని, అందుకే బెంగళూరు వదిలి గురుగ్రామ్ వెళ్లినట్లు చెప్పారు. నేను నా ఇంటికి వచ్చా. సంతోషంగా ఉన్నాను. ఇన్ని రోజులు ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నాను. మంచి ఆహారం తింటాను, నేను కోరుకున్న చోటికి వెళ్లగలుగుతున్నాను అని వ్యాఖ్యానించారు. కాగా, చాలా మంది నెటిజన్లు ఆమెకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు కన్నడ నేర్చుకుంటే తప్పేముంది.’ అని కామెంట్లు చేస్తున్నారు. -
సిలికాన్ వ్యాలీకి దీటుగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: ‘అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి దీటుగా విశాఖ రూపుదిద్దుకుంటోంది. ఆ దిశగా అభివృద్ధిలో శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచస్థాయి ప్రఖ్యాత నగరాలతో పోటీపడేందుకు అవసరమైన అన్ని వనరులు, మౌలిక వసతులు, హంగులు, సదుపాయాలు ఈ నగరానికి ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వైజాగ్‌కు మహర్దశ పట్టింది. గ్రోత్ కారిడార్‌గానూ వృద్ధి చెందుతోంది. పరిపాలనా రాజధాని అయ్యాక అభివృద్ధిలో మరింత వేగం పుంజుకుంటుంది. రూ.వేల కోట్ల పెట్టుబడులతో విశాఖ మహానగరం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. రానున్న పదేళ్లలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో పోటీ పడేలా ఎదుగుతుంది’ అని ‘విజన్ విశాఖ కాంక్లేవ్’లో విద్యారంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, మేధావులు పేర్కొన్నారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. అమెరికా సిలికాన్ వ్యాలీ జీడీపీ వృద్ధిలో అగ్రగామిగా ఉందని, విశాఖపట్నం కూడా అందుకు తీసికట్టు కాదని చెప్పారు. అక్కడ అభివృద్ధిలో స్టాన్ఫోర్డు యూనివర్సిటీ మాదిరిగానే ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) కూడా దోహదపడుతోందని, సీఎం వైఎస్ జగన్ సహకారంతో ఏయూలో గొప్ప మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ‘విశాఖలో భారీ పరిశ్రమలు, స్టీల్‌ప్లాంట్, షిప్‌యార్డు, తూర్పు నావికదళ ప్రధాన కేంద్రం, బీహెచ్ఈఎల్, పోర్టులతోపాటు రోడ్డు, రవాణా సదుపాయాలు మెండుగా ఉన్నాయి. వేలాది ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు, అదానీ డేటా సెంటర్, బీచ్ కారిడార్లు వస్తున్నాయి. విశాఖ–హైదరాబాద్, విజయవాడ–కడప–బెంగళూరులకు హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం ప్రధానితో చర్చిస్తానని సీఎం చెప్పారు. అడగకుండానే విశాఖ అభివృద్ధికి తపించే ముఖ్యమంత్రి మనకున్నారు. ఆయనకు మనమంతా సహకరిద్దాం. రూ.వేల కోట్ల పెట్టుబడులతో విశాఖ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. గ్రోత్ కారిడార్‌గా మారుతుంది. వచ్చే పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో విశాఖ పోటీ పడుతుంది’ అని ప్రసాదరెడ్డి వివరించారు. కాంక్లేవ్‌లో ఏయూ రిజిస్ట్రార్ ఎం.జేమ్స్ స్టీఫెన్, ఇన్ఫినిటం మీడియా సీఈవో రాహుల్ రాఘవేంద్ర, స్టూడెంట్ ట్రైబ్ సీఈవో సాయిచరణ్, విశాఖ ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్, ఐఐఎం విశాఖ ఫీల్డ్ సీఈవో గుహేష్ రామనాథన్, ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. విశాఖకు ప్రచారం అక్కర్లేదు విశాఖకు ప్రచారం అక్కర్లేదు. ఇక్కడి వారంతా వైజాగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లే. ఇక్కడ ప్రఖ్యాత పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, కేంద్ర ప్రభుత్వ, రక్షణరంగ సంస్థలు, విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. విశాఖ ఎందరికో మంచి అవకాశాలు కల్పిస్తోంది. అందుకే ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. – బీకే సాహు, చైర్మన్, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆకర్షణీయ నగరం విశాఖ పెట్టుబడులను ఆకర్షించే నగరం. ఇక్కడ ఉన్నన్ని వనరులు రాష్ట్రంలో మరెక్కడా లేవు. అన్ని రవాణా సదుపాయాలూ ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఉండటంతో పరిశ్రమలు పెద్దసంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. వ్యాపార ఉన్నతికి విశాఖ భాగ్యనగరం. – ఆంజనేయవర్మ, వైస్ ప్రెసిడెంట్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ విశాఖ అభివృద్ధికి జగన్ కృషి పుష్కలమైన వనరులతో ఇప్పటికే విశాఖ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. మంచి కనెక్టివిటీ ఉంది. ఇప్పటివరకు రాష్ట్రాన్ని మంచిగా ఐదారుగురు ముఖ్యమంత్రులు పాలించారు. వీరిలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ స్ట్రాంగ్ లీడర్. రాష్ట్రంతోపాటు విశాఖ అభివృద్ధికిపాటు పడుతున్నారు. – డి.సూర్యప్రకాశరావు, వీసీ, డీఎస్ఎన్ లా విశ్వవిద్యాలయం -
అదే బెంగళూరు కొంపముంచుతోంది.. ఏడాదికి వేల కోట్లలో నష్టం!
కర్ణాటక రాజధాని.. దేశానికి ఐటీ రాజధాని.. అదే సిలికాన్ వ్యాలీగా పేరు గాంచిన బెంగళూరు. ఇప్పుడే ఈ మెట్రోపాలిటన్ సిటీ ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీల కార్యకలాపాలతో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో ట్రాఫిక్ రద్దీతో అంతే అపఖ్యాతి పాలవుతుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ట్రాఫిక్ ఆలస్యం, రద్దీ, సిగ్నల్స్ ఆగిపోవడం, ట్రాఫిక్ వల్ల సమయం వృధా అవ్వడం, వాహనాల్లో ఇంధనం వృధా ఖర్చు వంటి ఇతర కారణాల వల్ల సంవత్సరానికి రూ.19,725 కోట్ల నష్టం వాటిల్లితున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ నిపుణుడు ఎంఎన్ శ్రీహరి అతని బృందం రోడ్ ప్లానింగ్, ఫ్లైఓవర్, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాల లోటుకు సంబంధించిన సమస్యలపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో బెంగళూరు నగరంలో 60 పూర్తిస్థాయిలో ఫ్లైఓవర్లు ఉన్నప్పటికీ, ఆలస్యం, రద్దీ, సిగ్నల్ల వద్ద ఆగిపోవడం, వేగంగా వెళ్లే వాహనాలు, ఇంధన నష్టం, నెమ్మదిగా వెళ్లడం వంటి కారణాలతో బెంగళూరు వాహనదారులకు రూ. 19,725 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధ్యయనం హైలెట్ చేసింది. వేగంగా విస్తరిస్తున్న ఐటీ రంగం బెంగళూరులో రోజు రోజుకీ ఐటీ రంగం మరింత వృద్ది సాధిస్తోంది. తద్వారా హౌసింగ్,ఎడ్యుకేషన్‌తో పాటు వివిధ రంగాల అభివృద్దిలో పాలు పంచుకుంటుంది.వెరసీ బెంగళూరులో అసాధారణ జనాభా పెరుగుదల 14.5 మిలియన్లు ఉండగా వెహికల్ పాపులేషన్ 1.5 కోట్లుగా ఉంది. మరింత విస్తరిస్తున్న బెంగళూరు అంచనా ప్రకారం.. ఈ ఏడాది బెంగళూరు నగరం మరింత విస్తరిస్తోంది. 88 స్కైర్ కిలోమీటర్ల నుంచి 985 కిలోమీటర్లకు పెరిగింది. నగరం 1,100 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని అధ్యయనం ప్రతిపాదించింది. మరోవైపు, రహదారి పొడవు పెరుగుదల వాహనాల పెరుగుదల, విస్తీర్ణం పెరుగుదలకు సమానంగా లేదు. రహదారి మొత్తం పొడవు సుమారు 11,000 కిలోమీటర్లు. రవాణా డిమాండ్, చేసే ప్రయాణికులకు ఏ మాత్రం సరిపోదని నివేదిక పేర్కొంది. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కొరత ఆ నగర వాసుల్ని తీవ్రంగా వేధిస్తుంది. ఆలస్యం, రద్దీ, ప్రయాణం వంటి కారణాల వల్ల సామానులపై పరోక్షంగా ఖర్చుల భారం పడుతుంది. ఆర్ధికంగా నష్టపోతున్నారని శ్రీహరి అన్నారు. అంతేకాదు, తాము జరిపిన ఈ సర్వేలో ట్రాఫిక్ కారణంగా ఏడాదికి రూ.20వేల కోట్లు నష్టం వాటిల్లిందని, ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఎలాన్ మస్క్‌కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు?
ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ డిప్రెషన్ వంటి మానసిక సమస్యతో బాధపడుతున్నారంటూ పలు సంచలన నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, రోజూవారీ ఒత్తిళ్ల నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు మస్క్ పార్టీలకు వెళ్తుంటారు. ఆ సమయంలో మానసిక సమస్య నుంచి బయటపడేందుకు కెటామైన్ (డిప్రెషన్ తగ్గించుకునేందుకు వినియోగించుకునే మెడిసిన్) అనే మందును ఎక్కువ డోస్‌లో తీసుకుంటున్నారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. అంతేకాదు, డిప్రెషన్ నుంచి తాను బయటపడేందుకు తక్కువ మోతాదులో కెటామైన్‌ను తీసుకుంటున్నట్లు మస్క్ తన స్నేహితులకు చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. ఆ రిపోర్ట్‌ను ఊటంకించేలా.. మస్క్ డిప్రెషన్ నుంచి కోలుకునేలా కెటామైన్ ఎలా ఉపయోగపడుతుందనే తదితర అంశాలపై ట్విట్ చేశారు. ఆ ట్విట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Depression is overdiagnosed in the US, but for some people it really is a brain chemistry issue. But zombifying people with SSRIs for sure happens way too much. From what I’ve seen with friends, ketamine taken occasionally is a better option. — Elon Musk (@elonmusk) June 27, 2023 డిప్రెషన్ అనేది బ్రెయిన్ సంబంధిత సమస్య. యుఎస్‌లో ఈ మానసిక సమస్యతో బాధపడే వారు ఎక్కువగా ఉన్నారు. ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు కెటామైన్ ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా మంది జాంబిఫైయింగ్ బారిన పడేందుకు అవకాశం ఉన్న సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ (ssri) అనే మెడిసిన్‌ను తీసుకుంటున్నారని ట్వీట్లో మస్క్ తెలిపారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ (wsj) నివేదికల ప్రకారం.. మస్క్ ఆరోపిస్తున్నట్లుగా మత్తెక్కించే కెటామైన్ అనే డ్రగ్‌ను తీసుకునే కల్చర్ సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటీవ్‌లలో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మార్కెట్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని వ్యాపారంలో పనితీరు మెరుగు పరుచుకోవడంతో పాటు సృజనాత్మకత కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీలో కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ కంపెనీల్లో సీఈవోలు, ఫౌండర్లు కెటామైన్, మ్యాజిక్ మష్రూమ్‌లు, లైసెర్జిక్ యాసిడ్ డైథైలామైడ్ (ఎల్ఎస్డీ) మత్తు పదార్ధాల్ని తీసుకున్నట్లు డబ్ల్యూఎస్‌జే ప్రస్తావించింది. వారిలో గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ 'మ్యాజిక్ మష్రూమ్'లను తీసుకున్నట్లు డబ్ల్యూఎస్‌జే నివేదించింది. ఈ మ్యూజిక్ మష్రూమ్‌లలో శరీరాన్ని మత్తెక్కించే సైలోసిబిన్ (psilocybin) అనే రసాయనం ఉంటుంది. 2018లో పాడ్‌కాస్ట్ జరిగే సమయంలో ఇలా సంచలనాత్మక కామెంట్లతో నిత్యం నెటిజన్ల నోళ్లలో నానే ఎలాన్ మస్క్‌కు తాజా ట్విట్లు కొత్తవేం కావనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. 2018లో జో రోగన్ పోడ్కాస్ట్ ఎపిసోడ్లో గంజాయి తాగి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఈ సంఘటన తర్వాత తనకు, స్పేస్ఎక్స్ ఉద్యోగులకు రెగ్యులర్ డ్రగ్ టెస్ట్‌లు జరుగుతున్నాయని ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. కెటామైన్ వినియోగం.. అమెరికాలో అనుమతి కెటామైన్ డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఉపయోగించే మెడిసిన్. అమెరికాలో దీని వినియోగంపై నియంత్రణ ఉంది. వ్యాధిగ్రస్తులు వైద్య నిపుణులు ఆధ్వర్యంలో పొడిగా, ద్రవ రూపంలో, మాత్రల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. జాంబిఫైయింగ్ అంటే? మస్క్ చెబుతున్నట్లుగా..సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ అనే మెడిసిన్ వినియోగంతో జాంబిఫైయింగ్ అనే వ్యాధి సోకుతుంది. లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌తో బాధపడే వారు ఇష్టం వచ్చినట్లుగా మీద పడి కొరుకుతుంటారని హెల్త్‌కేర్ నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 ముఖేష్ అంబానీ - ఎలాన్ మస్క్‌ల మధ్య పంతం!,ఎవరి మాట నెగ్గుతుందో? -
Rahul Gandhi: ఆ మొదటి వ్యక్తిని నేనేనేమో!
2004లో నేను రాజకీయాల్లోకి వచ్చా. ఆ సమయంలో భారత్ ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి.. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ చెప్పిన మాటలివి. ఎంపీగా తనపై పడిన అనర్హత వేటు గురించి విదేశీ గడ్డపైనా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. బుధవారం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. భారత్‌లో పరువు నష్టం కేసులో ఇలాంటి శిక్షను ఎదుర్కొన్న నేతను బహుశా తానేనేమోనని వ్యాఖ్యానించారాయన. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో.. దేశం ఇలా అయిపోతుందని ఊహించలేదు. పరువు నష్టం దావాతో గరిష్ట శిక్షను ఎదుర్కొన్న మొదటి నేతను బహుశా నేనే కావొచ్చు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని పేర్కొన్నారాయన. 52 ఏళ్ల రాహుల్ గాంధీ ఇప్పటివరకు నాలుగుసార్లు ఎంపీగా నెగ్గారు. అయితే.. 2019 నాటి పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల గరిష్ట శిక్ష పడగా, ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం చట్టం ప్రకారం అనర్హత వేటు పడి ఎంపీ(వయనాడ్ లోక్‌సభ స్థానం) పదవిని కోల్పోయారాయన. అయితే పార్లమెంట్లో కూర్చొని గళం వినిపించడంతో పోలిస్తే ఇప్పుడు తనకు మరింత అవకాశం దొరికిందని చెబుతూ.. భారత్ జోడో పాదయాత్ర ప్రస్తావన తీసుకొచ్చారు. It was a pleasure to engage with the learned audience at @Stanford on 'The New Global Equilibrium'. We discussed the challenges and opportunities of a changing world order. Actions based on truth is the way forward. pic.twitter.com/6tEoCV6OsM — Rahul Gandhi (@RahulGandhi) June 1, 2023 Relive the captivating moments as Shri @RahulGandhi graced the stage at Stanford University for an unforgettable interactive session. pic.twitter.com/IbcaPQ3o8y — Congress (@INCIndia) June 1, 2023 హలో.. మిస్టర్ మోదీ తన పర్యటనలో భాగంగా.. సిలికాన్ వ్యాలీలో సందడి చేసిన రాహుల్ గాంధీ, పలువురు స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్లతో కాసేపు రాహుల్ గాంధీ ముచ్చటించారు. వాళ్ల మధ్య ఏఐతో పాటు ఇతర టెక్నాలజీల గురించి చిట్‌చాట్ జరిగింది. ఈ క్రమంలో.. భారత్‌లో టెక్నాలజీ విస్తరణ గురించి ప్రస్తావనకు రాగా.. పెగాసస్ కుంభకోణం అంశం లేవనెత్తారు రాహుల్ గాంధీ. దాని గురించి(ఫోన్ ట్యాపింగ్) నేనేం దిగులుచెందడం లేదు. ఒకానొక టైంలో నా ఫోన్‌ట్యాపింగ్ అవుతోందని నాకు అర్థమైంది. అంటూ.. తన ఐఫోన్లో ‘‘హలో మిస్టర్ మోదీ’’ అంటూ ఛలోక్తి విసిరారాయన. ఒక ప్రభుత్వమే ఫోన్లు ట్యాప్ చేయాలని అనుకుంటే.. దానిని ఎవరూ ఆపలేరు కదా. అది పోరాటం చేయదగ్గ అంశమూ కాలేదు. ఎందుకంటే.. చేసే ప్రతీ పని ప్రభుత్వానికి చేరుతుంది కాబట్టి.. అని రాహుల్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: దేశ మనోభావాల్ని కించపరిచారు -
Karnataka assembly elections 2023:ఎవరిదో రాజధాని!
రాష్ట్రాన్ని గెలవాలంటే ముందు రాజధానిని గెలవాలి. కర్ణాటకలో అధికారిక పీఠానికి తాళాలు బెంగళూరులోనే ఉన్నాయి. బీజేపీకీ, కాంగ్రెస్‌కూ ఈ విషయం బాగా తెలుసు. దాంతో ఈసారి అధికార విపక్షాల మధ్య సిలికాన్ సిటీలో సంకుల సమరం సాగుతోంది. సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీయే కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని గడచిన పలు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే తెలుస్తోంది. అందుకే బెంగళూరు పరిధిలోని 28 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాలు నెగ్గి అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తీరు తెన్నులు.. ► 2008లో బెంగళూరులో బీజేపీ 17, కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు గెలవగా జేడీ(ఎస్) ఒక్క స్థానానికి పరిమితమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి దక్షిణ భారతంలో తొలిసారి ఆ ఘనత సాధించింది. ► 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 13, బీజేపీ 12, జేడీ(ఎస్) 3 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య తొలిసారి సీఎం అయ్యారు. ► 2018లో కాంగ్రెస్15, బీజేపీ 11, జేడీ(ఎస్) 2 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ సర్కారు బలపరీక్షలో ఓడి 14 నెలలకే కుప్పకూలింది. ► 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్) సభ్యులు బీజేపీకి ఫిరాయించడంతో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. బీజేపీ ఏకంగా 12 సీట్లు నెగ్గింది. అలా బెంగళూరులో బీజేపీ బలం 15కు పెరగగా కాంగ్రెస్ 11 స్థానాలకు పడిపోయింది. బీజేపీ అధికారాన్ని స్థిరపరచుకుంది. వేధిస్తున్న తక్కువ ఓటింగ్ బెంగళూరులో ప్రతిసారీ తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండడం పరిపాటిగా వస్తోంది. 2013, 2018 ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పడిపోయింది. సగానికి సగం, అంటే నియోజకవర్గాల్లో మరీ తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. బెంగళూరు వాసులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపరన్న అపప్రథా ఉంది. దీన్ని ఈసారైనా తొలగించుకుంటారా అన్నది చూడాలి. ► 2013 ఎన్నికల్లో బెంగళూరు పరిధిలో కేవలం 55.04% ఓటింగ్ నమోదైంది. 2018లో అది కాస్తా 48.03 శాతానికి తగ్గింది. ► దాంతో ఈసారి ఎలాగైనా రాజధానిలో ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ఎన్నికల సంఘం ప్రధానంగా దృష్టి పెట్టింది. కొద్ది రోజులుగా ప్రత్యేక ర్యాలీలు, వాకథాన్‌లు, ప్రచారాలు చేపడుతోంది. తటస్థ ఓటర్లే కీలకం ► ట్రాఫిక్ సమస్య, మౌలిక వసతుల లేమి వంటి పలు సమస్యలు బెంగళూరును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారన్నది నగరవాసుల ప్రధాన ఆరోపణ. ► ఇక్కడ 15 నుంచి 20 శాతం ఓటర్లు కులమతాలకు అతీతంగా తటస్థంగా ఉంటారు. ► వీరిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ► బీజేపీ అవినీతి, పాలన వైఫల్యాలు, కుంభకోణాలను ప్రచారం చేస్తూ నగర వాసులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. శాంతినగర, సర్వజ్ఞ నగర వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది. ► ఇక తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారానికి దిగారు. ► కాంగ్రెస్, జేడీ(ఎస్)ల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో నగరంలో బీజేపీ బలంగా కనిపిస్తోంది. -
గ్రీన్‌కార్డులపై ‘కంట్రీ లిమిట్’ తొలగించండి
వాషింగ్టన్: గ్రీన్‌కార్డులపై 7 శాతంగా ఉన్న కంట్రీ లిమిట్‌ను తొలగించాలని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ భారత–అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ జైన్ భుతోరియా అమెరికా పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిమితి వల్ల గ్రీన్‌కార్డుల కోసం అర్హులైన వారు సుదీర్ఘీకాలం నిరీక్షించాల్సి వస్తోందని చెప్పారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లో భారతఅమెరికన్ పార్లమెంట్ సభ్యుడు రో ఖన్నా ఆధ్వర్యంలో తాజాగా జరిగిన యూఎస్–ఇండియా సదస్సులో అజయ్ జైన్ మాట్లాడారు. హెచ్–1 వీసాలపై లేని కంట్రీ లిమిట్ గ్రీన్‌కార్డులపై ఎందుకని ప్రశ్నించారు. అమెరికాలో ఇప్పుడు 8,80,000 మంది గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. వీరిలో భారత్, చైనా నుంచి వచ్చినవారి సంఖ్య అధికంగా ఉందన్నారు. పదేళ్లకుపైగా నిరీక్షిస్తున్నవారు చాలామంది ఉన్నారని గుర్తుచేశారు. చట్టాన్ని మార్చకపోతే మరో 50 సంవత్సరాలు ఎదురు చూడక తప్పదని తేల్చిచెప్పారు. -
బ్యాంకింగ్ మ్యూచువల్ ఫండ్స్‌కు నష్టాలు
న్యూఢిల్లీ: అమెరికా బ్యాంకుల సంక్షోభం మన దేశంలో బ్యాంకింగ్ స్టాక్స్‌పై ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా బ్యాంకింగ్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే పథకాల విలువ గత వారంలో సుమారు 6 శాతం క్షీణించింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిపోవడం, ఆ తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ కూడా సంక్షోభంలో పడిపోవడం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగంపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా చేసింది. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్ సూసె సైతం నిధుల కటకటను ఎదుర్కోగా.. ఏకంగా ఆ దేశ కేంద్రబ్యాంక్ జోక్యం చేసుకుని నిధులు సమకూరుస్తామని హామీ ఇవ్వా ల్సి వచ్చింది. ఈ పరిణామాలతో మన దేశ బ్యాంక్ స్టాక్స్ 3–13 శాతం మధ్యలో నష్టపోయాయి. ప్రభావం పెద్దగా ఉండదు.. కానీ విదేశాల్లో బ్యాంకుల సంక్షోభాల ప్రభావం నేరుగా మన బ్యాంకులపై ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్ రంగ మ్యూచువల్ ఫండ్స్‌లో 16 పథకాలు ఉంటే, ఇవన్నీ కూడా మార్చి 17తో ముగిసిన వారంలో 1.6–6 శాతం మధ్య నష్టాలను చూశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే వీటిల్లో నికర నష్టం 8–10% మధ్య ఉంది. ఇలా నష్టపోయిన వాటిల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, టాటా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్, నిప్పన్ ఇండియా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ ఉన్నాయి. అయితే, ఏడాది కాలంలో ఈ పథకా లు నికరంగా 12 శాతం రాబడిని ఇవ్వడం గమనించొచ్చు. ‘‘స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు, వడ్డీ రేట్ల పెరుగుదల ఈ థీమ్యాటిక్ ఫండ్స్ నష్టపోవడానికి కారణాలుగా ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. వడ్డీ రేట్ల పెరుగుదల తర్వాత తక్కు వ వడ్డీ మార్జిన్లు, నిధుల వ్యయాలు పెరగడం, రుణాల వృద్ధిపై ప్రభావం పడినట్టు చెప్పారు. -
కుప్పకూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్.. కొనుగోలుకు ఎలాన్ మస్క్ సిద్ధం?
యూఎస్ రెగ్యులేటరీ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎఫ్‌డీఐసీ) సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) ను షట్‌డౌన్ చేస్తున్నట్లు అధికారింగా ప్రకటించింది. అనంతరం ఆ బ్యాంక్ సంబంధించిన ఆస్తుల్ని సీజ్ చేసింది. దీంతో 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా ఇది నమోదైంది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య అమెరికా గ్లోబల్ గేమింగ్ హార్డ్‌వేర్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ రేజర్ సీఈవో మిన్ లియాంగ్ టాన్ (Min-Liang Tan) ఓ సలహా ఇచ్చారు. ట్విటర్‌ను కొనుగోలు చేసినట్లు ఎస్వీబీని కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్‌గా మార్చమని అన్నారు. అందుకు ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. ఎస్వీబీని కొనుగోలు చేసేందుకు తాను సిద్ధమేనని అర్ధం వచ్చేలా ‘నేనూ అదే ఆలోచిస్తున్నా’ అంటూ ట్విట్ చేశారు. I think Twitter should buy SVB and become a digital bank. — Min-Liang Tan (@minliangtan) March 11, 2023 I’m open to the idea — Elon Musk (@elonmusk) March 11, 2023 60 శాతం పతనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడంలో ప్రసిద్ధి చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్లు యూఎస్ రెగ్యులేటరీ ప్రకటించింది. ఈ ప్రకటనతో ఎస్‌వీబీకి చెందిన 60 శాతం షేర్లు భారీగా పతనమయ్యాయి. చదవండి👉 దిగ్గజ బ్యాంక్ మూసివేత.. ప్రపంచ దేశాల్లో కలకలం! -
బెంగళూరు వరద బీభత్సం.. కారణాలు చెప్పిన సీఎం బొమ్మై
వరదల్లో బెంగళూరు.. ఏకధాటి కురుస్తున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న నాలాలతో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా చెప్పుకునే బెంగళూరు నీట మునిగింది. మూడు రోజులు గడుస్తున్నా సగానికి పైగా నగరం వరద నీటిలో చిక్కుకుపోగా.. తాగునీటి-విద్యుత్ కొరతతో అవస్థలు పడుతున్నారు నగరవాసులు. ఈ తరుణంలో సహాయక చర్యలపైనా రాజకీయ విమర్శలు రావడంతో.. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. బెంగళూరు వర్షాలు-వరదలతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది వాస్తవ పరిస్థితి. దానిని దాచలేం. అయితే ఈ స్థితికి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలూ ఓ కారణమే. అంతేకాదు నగరం ఇలాంటి దుస్థితిని ఎదుర్కొవడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా కారణమని ఆరోపిస్తున్నారు ఆయన. నగరం ఈ దుస్థితికి చేరుకోవడానికి కారణం గత ప్రభుత్వ తీరే. తలాతోక లేకుండా పాలించారు వాళ్లు. ఎటు పడితే అటు కట్టడాల నిర్మాణాలకు అనుమతులిచ్చారు. చెరువుల నిర్వాహణను ఏనాడూ పట్టించుకోలేదు. పైగా అవినీతితో చెరువు, కుంటలల్లో అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చారు. అందుకే నగరం ఇవాళ నీట మునిగింది. అయినప్పటికీ ఆటంకాలకు దాటుకుని ఎలాగైనా నగరంలోని పరిస్థితులను పునరుద్ధరిస్తాం. అలాగే మునుముందు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపడతాం అని పేర్కొన్నారాయన. కర్ణాటక.. ప్రత్యేకించి బెంగళూరులో ఈ తరహా వర్షాలు మునుపెన్నడూ కురిసింది లేదు. గత 90 ఏళ్లలో రికార్డు స్థాయిలో వానలు కురవడం ఇదే. చెరువులన్నీ నిండిపోయాయి. నాలాలు నింగి.. వరద నీరు ఓవర్‌ఫ్లో అయ్యింది. కొన్ని కట్టలు తెగిపోయాయి. చిన్నచిన్న ప్రాంత్లాలో నాలాల సంఖ్య ఎక్కువగా ఉండడం, అక్రమకట్టడాలు కూడా ఇందుకు కారణాలయ్యాయి. దాదాపు ప్రతీ రోజూ కురుస్తుండం కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పారాయన. బెంగళూరు వరదలను ఛాలెంజ్‌గా తీసుకుని.. అధికారులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు నిరంతరాయం పని చేస్తున్నట్లు వెల్లడించారాయన. పరిస్థితి చక్కబడగానే అక్రమ కట్టడాలను తొలగిస్తామని చెప్పారాయన. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బెంగళూరు వరదల విషయంలో ప్రభుత్వందే తప్పని విమర్శిస్తోంది. ఈ మేరకు వరద నీళ్లలోనే నిరసనలు తెలుపుతున్నారు అక్కడి నేతలు. ఇదీ చదవండి: స్కూటీ స్కిడ్ అయ్యి పోల్ పట్టుకుంది.. విద్యుద్ఘాతంతో యువతి మృతి -
వేలమంది ఉద్యోగులపై వేటు,టెక్కీలకు గడ్డుకాలం..వరస్ట్ ఇయర్‌గా 2022
Tech companies fired over 32,000 employees : టెక్ దిగ్గజ కంపెనీ ఉద్యోగులకు భారీ షాకిచ్చాయి. ఒక్క జులై నెలలో సుమారు 32వేల మంది టెక్కీలపై వేటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులకు 2022 వరస్ట్ ఇయర్‌గా నిలిచిపోనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో గట్టెంకేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆయా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం, నియామకాల్ని నిలిపివేయం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ జులై నెలలో అమెరికా సిలీకాన్ వ్యాలీలో కార్యకాలపాలు నిర్వహిస్తున్న ఆయా సంస్థలు మొత్తం 32 వేల మందిని విధుల నుంచి తొలగించాయని వెలుగులోకి వచ్చిన క్రంచ్ బేస్ నివేదిక పేర్కొంది. ఉద్యోగులపై వేటు విధించిన సంస్థల్లో నెట్‌ఫ్లిక్స్, షాఫిఫై, కాయిన్ బేస్‌తో పాటు ఇతర కంపెనీలు వందల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పేర్కొంది. వారం వారం పెరిగిపోతున్నారు. మా దృష్టికి వచ్చింది. సిలికాన్ వ్యాలీలో ఉన్న టెక్ కంపెనీలు వారం వారం ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అందుకే మాకు (క్రంచ్‌బేస్) ఏ ఉద్యోగం స్థిరంగా ఉండడం లేదని అనిపిస్తుంది. స్పష్టమైన కారణం లేకుండానే ఉద్యోగాలు కోల్పోతున్నందున చాలా మందికి 2022 మరో వరస్ట్ ఇయర్‌గా మారుతోంది. కొన్ని టెక్ కంపెనీలు ఇప్పటికే నియామక ప్రక్రియను నిలిపివేశాయి. ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొనేందుకు చాలా సంస్థలు ఉద్యోగల్ని తొలగిస్తున్నాయి. అమెరికాలో దాదాపు 64 ప్రముఖ టెక్ కంపెనీలు జూలై నెలలో 32వేల కంటే ఎక్కువ మంది విధుల నుంచి తొలగించాయని క్రంచ్ బేస్ హైలెట్ చేసింది. ►క్రంచ్‌బేస్ సేకరించిన డేటా ప్రకారం..ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ షాఫిఫై గత నెలలో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. వారిలో రిక్రూటింగ్, సపోర్ట్, సేల్స్ విభాగాల ఉద్యోగులున్నారు. ►ట్విట్టర్ తన టాలెంట్ అక్విజిషన్ టీమ్‌లో 30 శాతం మందిని తొలగించింది.పెరుగుతున్న వ్యాపార ఒత్తిళ్లను ఎదుర్కొంటుందని అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. ►మైక్రోసాఫ్ట్ తన 1,80,000 మంది వర్క్‌ఫోర్స్‌లో 1 శాతాన్ని తగ్గించింది, కొన్ని నిర్మాణాత్మక సర్దుబాట్లు, వ్యాపార అవసరాలను తీర్చాలని యోచిస్తోంది. ►టిక్‌టాక్ కంపెనీ పునర్నిర్మాణం పేరుతో ఉద్యోగులను తొలగించడం ప్రారంభించిందని,100 కంటే తక్కువ మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని వైర్డ్ నివేదిక పేర్కొంది. ►హూప్ వంటి ఇతర స్టార్టప్‌లు 15 శాతం మంది సిబ్బందిని తొలగించాయి. వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ విమెమో (Vimeo) 72 మంది ఉద్యోగులను తొలగించింది. ►కేవలం రెండు నెలల్లో, నెట్‌ఫ్లిక్స్ మొత్తం 450 మంది పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించింది. సబ్స్క్రైబర్లు తగ్గడం, అదే సమయంలో ఆదాయం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ►కాయిన్‌బేస్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు 1100 మంది ఉద్యోగుల్ని తొలగించాయి. కంపెనీ సీఈవో బ్రియాన్ ఆర్మ్‌స్ట్రాంగ్ మొదట ఉద్యోగుల తొలగింపుకు ఆర్ధిక పరిస్థితులేనని అన్నారు. ఆపై అవసరానికి మించి ఉద్యోగుల్ని హయ్యర్ చేసుకుందని మాట మార్చారు. -
ఫాల్కన్ ఎక్స్‌తో ‘టీ–హబ్’ భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన టెక్నాలజీ యాక్సలేటర్ ‘ఫాల్కన్ ఎక్స్’ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో నిర్వహించనున్న గ్లోబల్ స్టార్టప్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ (ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌ల సమ్మేళనం)లో రాష్ట్రానికి చెందిన టీ–హబ్ భాగం పంచుకోనుంది. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్లో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలనుకొనే భారతీయ అంకుర సంస్థలు పాల్గొనాలని ఆహ్వానించింది. అత్యంత ప్రభావం చూపగలిగే స్టార్టప్‌లను ఎంపిక చేసేందుకు, కొత్త మార్కెట్లలో ప్రత్యేకించి అమెరికాలో ఆయా స్టార్టప్‌లు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుందని పేర్కొంది. జూలైలో మొదలయ్యే ఈ కార్యక్రమం 5 వారాలపాటు కొనసాగనుంది. వందకుపైగా వెంచర్ క్యాపిటలిస్టులు, కార్పొరేట్ కంపెనీలు ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపుతుండగా మూడు అత్యుత్తమ స్టార్టప్‌లకు లక్ష అమెరికన్ డాలర్ల చొప్పున ఫాల్కన్ ఎక్స్ నిధులు అందించనుంది. స్టార్టప్‌లు తమ వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఫాల్కన్–ఎక్స్‌తో కుదిరిన భాగస్వామ్యం ఉపయోగపడుతుందని టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాస్‌రావు తెలిపారు. ప్రపంచ స్టార్టప్ రంగంలో భారతీయ స్టార్టప్‌లకు శరవేగంగా గుర్తింపు లభిస్తోందని ఫాల్కన్–ఎక్స్ సహ వ్యవస్థాపకుడు మురళి చీరాల అన్నారు. టెక్నాలజీ నిపుణులు, పెట్టుబడిదారులైన బీవీ జగదీశ్, రాజిరెడ్డి, ఆశుగుప్తా, ప్రదీప్ ఆస్వాని, ప్రవీణ్ అక్కిరాజు తదితరులు ఫాల్కన్–ఎక్స్‌లో మురళి చీరాలతో కలిసి సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. -
రెప్పవాల్చని అందం.. ముప్పై ఏళ్లకే బిలియనీర్! ఇప్పుడేమో కటకటాల్లోకి!..
అబద్ధపు పునాదుల మీద నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం ఎంతో కాలం నిలవదు.. ఇందుకు సరైన ఉదాహరణ.. ఎలిజబెత్ హోమ్స్ ఉదంతం. 19 ఏళ్లకే స్టార్టప్ రంగంలో సంచలనం సృష్టించిన ఎలిజబెత్.. అదనంగా తన మాటల్ని-అందాన్ని ఎరగా వేసి పెట్టుబడిదారులను ఆకర్షించింది. ఆ దెబ్బకి మూడు పదుల వయసుకి చేరగానే బిలియనీర్‌గా అవతరించింది. ఇన్నేళ్లకు.. విఫలమైన తన ఆవిష్కరణ మోసం బయటపడడంతో కటకటాల వైపు అడుగులు వేస్తోంది. దాదాపు దశాబ్దం కిందట.. ఎలిజబెత్ హోమ్స్ అనే 19 ఏళ్ల అమ్మాయి చేసిన ఓ ప్రకటన రోగనిర్ధారణ పరీక్షల రంగంలో సంచలనం సృష్టించింది. డయాగ్నోస్టిక్స్ ఫీల్డ్‌లో సరికొత్త విప్లవానికి నాంది పలికిందని ప్రపంచమంతా ఆమెను తెగ పొగిడేశారు. ఆమె విజన్ ఎంతో మంది మేధావుల్ని ఆకర్షించింది. బడా బడా కంపెనీలు సైతం ఆమె ఆవిష్కరణలో పెట్టుబడుల కోసం ఎగబడ్డారు. టెక్ కంపెనీలకు అడ్డా అయిన సిలికాన్ వ్యాలీ నుంచి సెల్ప్ మేడ్ సూపర్ స్టార్‌గా ప్రపంచం మొత్తం ఆమెను కొనియాడింది. కానీ, రోజులు ఒకేలా ఉండవుగా.. ఆమె మోసం కొన్నేళ్లకైనా బయటపడింది. ఒక్క రక్తపు చుక్కతో.. థెరానోస్.. ఎలిజబెత్ హోమ్స్ బీజం వేసిన స్టార్టప్ పేరు. ప్రజలకు ఏదైనా సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో తాను ఈ స్టార్టప్ ప్రారంభించినట్లు ప్రకటించుకుంది. కేవలం ఒక్క రక్తపు చుక్కతో బ్లడ్ టెస్ట్ నిర్వహించుకునే సెల్ఫ్ సర్వీస్ మెషిన్లను రూపొందించినట్లు ప్రకటించుకుంది ఎలిజబెత్. సెల్ఫ్ సర్వీస్ మెషిన్లతో.. కొద్ది చుక్కల రక్తంతో ఫలితాన్ని రాబట్టే టూల్స్ అవి. దీంతో ఈ విప్లవాత్మక పరీక్షా వ్యవస్థ గురించి ప్రపంచమంతా చర్చ నడిచింది. ఆమె బ్రెయిన్‌కు.. ఆ ఆవిష్కరణకు ఎంతో మంది మేధావులు ఫిదా అయ్యారు. అన్నింటికి మించి ఆమె అందం, గలగలా మాట్లాడేతత్వం, గొంతు.. ఇన్వెస్టర్లను అమితంగా ఆకర్షించేది. దీంతో నాలుగేళ్లు కూడా తిరగకుండానే ఆ స్టార్టప్ కాస్త.. హెల్త్ టెక్నాలజీ కంపెనీగా రిజిస్ట్రర్ అయ్యింది. ఫైజర్, షెరింగ్ ప్లౌ కంపెనీలు సైతం ఇన్వాల్వ్ కావడంతో థెరానోస్ మీద పెద్దగా దృషి, నిఘా పెట్టలేకపోయాయి ప్రభుత్వ వర్గాలు. ఫోర్బ్స్ తో పాటు పలు పాపులర్ మ్యాగజీన్ల మీద కూడా ఆమె ముఖచిత్రం దర్శనమిచ్చింది. ఆ ఒక్క కథనంతో.. థెరానోస్ బ్లడ్ టెస్టింగ్ టెక్నాలజీ కంపెనీగా ఎదిగాక.. 2015లో వెలువడ్డ ఓ కథనం ఆ కంపెనీ రాతనే మార్చేసింది. ఆ కంపెనీ అందిస్తున్న పరికరాలు సరిగా పని చేయడం లేదని, ఫలితాలు పారదర్శకతతో లేవని, తప్పుడు ఫలితాలు చూపుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వరుస కథనాలు ప్రచురించింది. ఇది యావత్ సిలికాన్ వ్యాలీని కుదిపేసింది. అప్పటికే కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఆర్డర్లు అందుకోని వాళ్లంతా ఒక్కసారిగా ఆమెకు ఎదురు తిరిగారు. అమెరికా సెక్యురిటీ ఎక్సేంజ్ కమిషన్, స్టేట్ హెల్త్ డిపార్ట్ మెంట్స్, మెడికేర్, మెడికైడ్ సెంటర్లు, యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ లు హోమ్స్ కంపెనీపై విచారణ కొనసాగించాయి. ఆపై వ్యవహారమంతా కోర్టుకు చేరింది. దీంతో ఒక హై ప్రొఫైల్ కేసుగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ వ్యవహారం. అప్పటి నుంచి థెరానోస్ పతనం మొదలైంది. భర్త బిల్లీ ఎవాన్స్‌తో.. ఎంత శిక్ష అంటే.. థెరానోస్ వ్యవహారంలో సంక్లిష్టమైన, సుదీర్ఘమైన విచారణ జరిగింది. మొత్తం 11 అభియోగాలు ఎలిజబెత్ హోమ్స్‌కు వ్యతిరేకంగా దాఖలయ్యాయి. 11 వారాల ప్రాసిక్యూషన్, 24 మంది ప్రత్యక్ష సాక్షుల విచారణతో సాగింది. ఆ మెషిన్లు పని చేయవనే విషయం ఆమెకూ తెలుసని, అయినా ఇన్వెస్టర్లను, పేషెంట్లను తప్పుదోవ పట్టించిందని కోర్టు నిర్ధారించుకుంది.పెట్టుబడిదారులను దారుణంగా మోసగించిన ఆ అభియోగాల్లో.. కేవలం నాలిగింటిని మాత్రమే కోర్టు అంగీకరించింది. హోమ్స్‌ను దోషిగా గుర్తించింది. కానీ, శిక్ష కాలం ఎంతో వెల్లడించలేదు. నేరం తీవ్రత ఆధారంగా ఒక్కో అభియోగంపై 20 ఏళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడే అవకాశం ఉంది. అలా 37 ఏళ్ల ఎలిజబెత్ బయోటెక్ స్టార్ నుంచి ఒక మోసగత్తే ట్యాగ్ తగిలించుకుని కటకటాల వైపు అడుగులు వేస్తోంది. అయితే ఈ శిక్షపై అప్పీల్‌కు వెళ్లే అవకాశమూ కోర్టు ఎలిజబెత్‌కు కల్పించింది కూడా. రమేష్ "సన్నీ" బల్వానీ పనిలో పనిగా.. థెరానోస్ వ్యవహారాలను చూసుకునేందుకు రమేష్ "సన్నీ" బల్వానీని నియమించుకుంది హోమ్స్. అతను ఆమె కంటే వయసులో ఇరవై ఏళ్లు పెద్ద. అయినా ఇద్దరూ డేటింగ్ చేశారు. అయితే ఎప్పుడైతే ఆమె మోసం బయటపడిందో.. బల్వానీ సైతం ఇరికించాలని ఆమె ప్రయత్నించింది. బాల్వానీ పెద్ద మోసగాడని, తనను టార్చర్ చేసేవాడని, లైంగిక దాడికి సైతం ప్రయత్నించేవాడని జ్యూరీ ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. కానీ, కోర్టు మాత్రం ఆ కన్నీళ్లను నమ్మలేదు. పక్కా విచారణ తర్వాతే బల్వానీని నిర్దోషిగా తేల్చింది. అయితే థెరానోస్ తర్వాతి కష్టకాలం నుంచి.. ఇప్పుడు కోర్టు హాజరుదాకా ప్రతి క్షణం ఆమెకు అండగా ఉంటూ వస్తున్నాడు భర్త బిల్లీ ఎవాన్స్( హోటళ్ల నిర్వాహకుడు). స్టీవ్ జాబ్స్‌ను బోల్తా కొట్టించింది అందం మాత్రమే కాదు.. తేనేలూరే మాటలతో ఎదుటివాళ్లను ఆకట్టుకునేది ఎలిజబెత్ హోమ్స్. అంతెందుకు యాపిల్ ఫౌండర్, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ సైతం ఆమె ఉపన్యాసాలకు ఫిదా అయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు.. ఆమె ఎంత మాటకారి అన్నది. అయితే ఇన్వెస్టర్లను ఎట్రాక్ట్ చేయడానికి ఎలిజబెత్ హోమ్స్ ‘వాయిస్ ట్రిక్స్’ ఉపయోగించేదన్న ఆరోపణ కూడా ఉంది. అయితే ఇప్పుడు విస్తృతంగా నడుస్తున్న చర్చ ఏంటంటే.. ఇన్నేళ్లపాటు అంతేసి మందిని ఎలిజబెత్ ఎలా బురిడీ కొట్టించగలిగిందనే!!. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
Tesla: అనూహ్య నిర్ణయంతో షాకిచ్చిన టెస్లా
ఈవీ దిగ్గజ కంపెనీ టెస్లా అనూహ్య నిర్ణయం తీసుకుంది. కంపెనీ హెడ్ క్వార్టర్స్‌ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు తరలించనున్నట్లు ప్రకటించి ఆటోమొబైల్ మార్కెట్‌కు భారీ షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన షేర్‌హోల్డర్స్ వార్షికోత్సవం సమావేశంలో ఊహించని ఈ ప్రకటన చేశాడు కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న టెస్లా.. కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీ నుంచే ఆటోమొబైల్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. అయితే ఉన్నపళంగా ఎందుకు తరలిస్తున్నారనే విషయం కాసేపు హైడ్రామా నడిపించిన మస్క్.. విస్తరణలో భాగంగానే ఈ తరలింపు చేపట్టినట్లు చెప్పారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు టెస్లా హెడ్ క్వార్టర్స్‌ను తరలించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంత కాలపరిమితిలో చేస్తామనే విషయంపై మాత్రం మస్క్ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం చిప్, ఇతరత్ర కంపోనెంట్ల కొరత సమస్య ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ.. పాలో ఆల్టోలో ఉన్న హెడ్ క్వార్టర్స్ కేంద్రం టెస్లా సేల్స్ ఆశాజనకంగానే సాగుతున్నట్లు సమావేశంలో మస్క్ వెల్లడించాడు. అయితే ఫ్రెమోంట్ ప్లాంట్ నుంచి వాహనాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పరిమితుల కారణంగా అది జరగలేకపోతుందని ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక హెడ్‌క్వార్టర్స్ తరలింపు గురించి రకరకాల ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. కాలిఫోర్నియాలో ఉన్న చట్టాల వల్ల మస్క్ ఇబ్బందులు పడుతున్నాడని, అందుకే తరలింపునకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అంతేకాదు తక్కువ ఇన్కమ్ ట్యాక్స్‌లు, తక్కువ రెగ్యులేషన్స్ ఉన్న ప్రాంతాలకు తరలిపోయే అంశం గురించి మస్క్ సహా పలువురు టెక్ దిగ్గజాలు చాలాకాలంగా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాలో ఆల్టోకు 2400 కిలోమీటర్ల దూరంలోని ఆస్టిన్‌కు హెడ్ క్వార్టర్స్‌ను తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. టెస్లా తీసుకున్న ఈ ఊహించని నిర్ణయంతో ఆటోమొబైల్ రంగంలో ఎలాంటి కుదేలుకు లోనవుతుందో చూడాలి మరి!. చదవండి: ఎలన్ మస్క్ కంపెనీ బలుపు చేష్టలు.. మూల్యం -
APPLE: యాపిల్ మెగా ఈవెంట్.. 13 సిరీస్‌పై ఉత్కంఠ
iPhone 13 Launch Event: ప్రతీ ఏడాదిలాగే ఈ సెప్టెంబర్‌లోనూ మెగా ఈవెంట్‌కు యాపిల్ సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి(సెప్టెంబర్ 14) 10గం.30 ని. ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ఈవెంట్ ద్వారా యాపిల్ కొత్త ప్రొడక్టులను లాంఛ్ చేయనుంది. కరోనా వల్ల వర్చువల్‌గా ఈవెంట్ నిర్వహిస్తుండడం యాపిల్‌కు ఇది రెండోసారి. ఇక వారం నుంచి ఈ మెగా ఈవెంట్ కోసం ఐఫోన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లీకేజీల పేరిట పలు ఫీచర్లు తెరపైకి వస్తున్నాయి. ఐఫోన్ 13 సిరీస్‌లో ఐఫోన్ 13, మినీ, ప్రో, ప్రో మ్యాక్స్ మొత్తం నాలుగు మోడల్స్ ఒకేసారి రిలీజ్ చేయడం ద్వారా సంచలనానికి యాపిల్ తెర తీయబోతోందనే ప్రచారం నడుస్తోంది. ఐఫోన్ 13, మినీ మోడల్స్‌లో లార్జ్ కెమెరా సెన్సార్లు ఉండొచ్చని, ప్రొ-ప్రొమ్యాక్స్లో అల్ట్రా వైడర్ కెమెరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక ఇదే ఈవెంట్లో యాపిల్ స్మార్ట్‌వాచ్ 7 సిరీస్, థర్డ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్(Airpods 3) కూడా రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారు. కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీలోని క్యూపర్టినో యాపిల్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఈ ఈవెంట్ టెలికాస్ట్ కానుంది. యాపిల్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా లైవ్ వీక్షించొచ్చు. ఇక యాపిల్ టీవీ యూజర్స్.. యాప్ ద్వారా కీనోట్‌ను చూడొచ్చు. సిమ్ లేకుండానే.. ఐఫోన్ 13కి సంబంధించి ఇప్పటికే అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. సిమ్ కార్డ్ అవసరం లేకుండా లియో టెక్నాలజీ ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుందని, ఎమర్జెన్సీ మెసేజ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ఇలా రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అలాగే ఫోన్ వెయిట్, మందం కిందటి ఏడాది మోడల్స్ కంటే ఎక్కువగా ఉండొచ్చని చెప్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం టూమచ్ ప్రచారం.. అయితే 13 అనేది ఫారిన్ దేశాల్లో అచ్చీరాని నెంబర్. ఈ మూఢనమ్మకంతో 13 సిరీస్‌ను తప్పించి.. 14 సిరీస్‌ను యాపిల్ రిలీజ్ చేస్తుందేమో అనే ఊహాగానాలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. అందుకే సెప్టెంబర్ 13వ తేదీన కాకుండా.. 14వ తేదీన లాంఛ్‌కు ముహూర్తం పెట్టిందనే టాక్ కూడా సోషల్ మీడియాలో నడిచింది. కానీ, ఇలాంటి నమ్మకాల్ని పట్టించుకోకుండా యాపిల్ 13 సిరీస్ ద్వారానే రాబోతోందని తెలుస్తోంది. క్లిక్ చేయండి: ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు! ధర అటుఇటుగా.. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం అమెరికాలో ఐఫోన్ 13 సిరీస్ కనిష్ట ధర 799 డాలర్లుగా ఉంది. అయితే భారత మార్కెట్‌కి వచ్చే సరికి స్థానిక ట్యాక్సుల ఆధారంగా ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వెర్షన్ అమెరికా (భారత్) ఐఫోన్ 13 799 డాలర్లు (రూ. 58,600) ఐఫోన్ 13 మినీ 699 డాలర్లు (రూ. 51,314) పై రెండు 64జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌తో రావొచ్చు!. బ్లాక్, బ్లూ, పింక్, పర్పుల్, రెడ్, వైట్ కలర్స్‌లో ఫోన్లు రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. ప్రతీకాత్మక చిత్రం ఐఫోన్ 13 ప్రో 999 డాలర్లు (రూ.73,300) ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ 1,099 డాలర్లు (రూ 80,679) 128జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టెరేజ్ వెర్షన్లలో రిలీజ్ కావొచ్చు. అయితే ఈ రెండు వెర్షన్లలో 1టీబీ స్టోరేజ్ మోడల్ అంటూ ఒక పుకారు సైతం చక్కర్లు కొడుతోంది. బ్లాక్, బ్రౌన్, గోల్డ్, సిల్వర్ కలర్స్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే పైన చెప్పుకున్న ఫీచర్లు, ధరలన్నీ అంచనాలు, ఊహాగానాలు మాత్రమే. యాపిల్ సంస్థ పైవాటిలో ఏ ఒక్కదానిని అధికారికంగా ధ్రువీకరించలేదు. కేవలం ఎక్స్పర్ట్స్, టెక్ వెబ్సైట్ల అంచనాలను బట్టే ఇస్తున్నాం. చదవండి: యాపిల్ మార్కెట్ ఢమాల్! భారమంతా ఐఫోన్ 13 పైనే? -
రియల్ వరల్డ్‌లోకి ఫేస్బుక్! భారీ ఖర్చుతో..
Facebook City వర్చువల్ వరల్డ్‌లో 2.9 బిలియన్ల యూజర్లతో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది ఫేస్బుక్. త్వరలో ఈ ప్లాట్‌ఫామ్ రియాలిటీ వరల్డ్‌లోకి అడుగుపెట్టబోతోంది. సిలికాన్ వ్యాలీలోని తమ హెడ్ క్వార్టర్స్‌కు దగ్గర్లో ‘రియల్‌లైఫ్’ కమ్యూనిటీ కోసం ఒక పెద్ద నగరాన్ని నిర్మించబోతోంది. సుమారు 1700 అపార్ట్మెంట్లతో ‘విల్లో సిటీ’ పేరుతో డెవలప్ చేయబోతోంది. కాలిఫోర్నియా: ప్రస్తుతం మెన్లో పార్క్‌లో ఫేస్బుక్ హెడ్‌క్వార్టర్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్థలంలోనే ఫేస్‌బుక్‌కు మరికొన్ని సొంత బిల్డింగ్లు ఉన్నాయి. ఇక కొత్తగా 59 ఎకరాల స్థలంలో విల్లో సిటీని డెవలప్ చేయబోతోంది. 1,729 అపార్ట్మెంట్లతో పాటు 193 గదులతో ఓ పెద్ద హోటల్, సూపర్ మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్, కొత్త ఆఫీస్‌లను కట్టించనుంది. సిగ్నేచర్ డెవలప్మెంట్ గ్రూప్‌తో కలిసి ఫేస్బుక్ ఈ సిటీని నిర్మించబోతోంది. ఎంప్లాయిస్‌కు వసతి? నివాస యోగ్యంగా 320 అపార్ట్మెంట్లు, సీనియర్ల కోసం మరో 120 కేటాయించే అవకాశం ఉంది. వీటితో పాటు ఒక ఫార్మసీ, కేఫ్, న్యూయార్క్ సిటీ టౌన్ స్క్వేర్ తరహా నిర్మాణం.. ఓ భారీ పార్క్ నిర్మించనుంది. ఇక ఉద్యోగులు కావాలనుకుంటే అక్కడ ఉండొచ్చని, పర్మినెంట్ జీతగాళ్లకు ఈ ఆఫర్ ఉండొచ్చనే సంకేతాలు ఇచ్చింది. వీటితో పాటు కొత్త ఆఫీస్ బిల్డింగ్, మీటింగ్, కాన్ఫరెన్స్ రూంలు కూడా కట్టించనుంది. అయితే కొత్తగా కట్టే ఆఫీస్‌లో మూడున్నరవేల మందికి స్థానం కల్పించనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆ ఆఫీస్ ప్రాంగణంలో కేవలం ఫేస్బుక్ ఎంప్లాయిస్ మాత్రమే సంచరించేందుకు అనుమతి ఇస్తారు. అందరికీ ఇవ్వకపోవచ్చు బెల్లె హవెన్, ఈస్ట్ పాలో అల్టో మధ్య విల్లో సిటీ నిర్మించబోతున్నారు. గతంలో ఫేస్బుక్.. పది మైళ్లలోపు నివసించే ఉద్యోగులకు ఎక్కువ జీతం ఇస్తామని ప్రకటించిన వియం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంప్లాయిస్ అందరికీ నివాస సౌకర్యం కల్పించపోవచ్చని భావిస్తున్నారు. ఎకరంన్నర స్థలంలో టౌన్ స్క్వేర్ దాని చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్, నాలుగు ఎకరాల్లో పబ్లిక్పార్క్, దాని చుట్టూ రెండు ఎకరాలలో ఓపెన్ స్పేస్‌లు నిర్మించనుంది ఫేస్బుక్. ఇంతకుముందు ఓ భారీ టెక్ పార్క్ కోసం 2017లోనే ఫేస్బుక్ ఓ అప్లికేషన్ సమర్పించినా.. ఇప్పుడు అంకు మించి స్థాయిలోనే రియాలిటీ వరల్డ్‌లోకి రాబోతోంది. ఇదిలా ఉంటే గూగుల్ కూడా కిందటి ఏడాది శాన్ జోస్(కాలిఫోర్నియా)లో నాలుగు వేల అపార్ట్మెంట్లతో డౌన్‌టౌన్ వెస్ట్ పేరిట ఒక సిటీని డెవలప్ చేస్తున్నట్లు పేర్కొంది. -
కరోనా: బంకర్లలోకి బిలియనీర్స్
వాషింగ్టన్: ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకునేందుకు అమెరికాలోని శతకోటీశ్వరులు న్యూజిలాండ్ వెళ్లిపోయి అక్కడి తమ విలాసవంతమైన బంకర్ల (నేల మాళిగలు)లో తలదాచుకుంటున్నారు. వారిలో సిలికాన్ వ్యాలీకి చెందిన శతకోటీశ్వరులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఏదో ఒక రోజు ప్రపంచ ప్రళయం (డూమ్స్ డే) వచ్చి అందరూ చనిపోతారని నమ్మే కొంత మంది శతకోటీశ్వరులు న్యూజిలాండ్‌లో అత్యంత ఖరీదు చేసే విలాసవంతమైన బంకర్లను ఎన్నడో కొని పెట్టుకున్నారని ‘డెయిలీ మెయిల్’ వెల్లడించింది. వారిలో ‘పేపాల్’ వ్యవస్థాపకుడు, ఫేస్బుక్ శతకోటీశ్వరుడు పీటర్ తియాల్, టెక్సాస్‌లోని బ్లూబెర్గ్ కంపెనీ జనరల్ మేనేజర్ గేరీ లించ్ కూడా ఉన్నారు. పీటర్ తియాల్ న్యూజిలాండ్‌లోని అందమైన క్వీన్స్‌టౌన్‌లో మల్టీపర్సన్ భవనాన్ని కొనుగోలు చేశారు. అంటే భూమిపైన మామూలుగా కనిపించే ఆ భవనంలోనే అవసరమైనప్పుడు తలదాచుకునేందుకు ‘ప్యానిక్ రూమ్’ ఒకటి ఉంది. దాన్ని ఆయన 4.7 మిలియన్ డాలర్లు (దాదాపు 35.15 కోట్ల రూపాయలు) పెట్టి కొనుగోలు చేసినట్లు తెల్సింది. ఇప్పుడాయన అక్కడికి వెళ్లారో, లేదో తెలియడం లేదు. అయితే గేరీ లించ్ లాంటి శతకోటీశ్వరులు ప్రాణాంతకమైన కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందంటూ వార్తలు వెలువడిన తొలుతలోనే అమెరికా నుంచి విమానాలు పట్టుకొని న్యూజిలాండ్ వెళ్లారు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త మిహాయి దినులెస్కూ తన భార్యతో కలిసి మార్చి 12వ తేదీన న్యూజిలాండ్ వెళ్లారు. రైజింగ్ ఎస్ కంపెనీ న్యూజిలాండ్‌లో ఇలాంటి బంకర్లను కొన్నింటిని ఇప్పటికే నిర్మించగా మరికొన్నింటిని నిర్మిస్తోంది. వాటిని మూడు మిలియన్ డాలర్ల నుంచి ఎనిమిది మిలియన్ డాలర్ల వరకు విక్రయిస్తోంది. వాటిలో 22 మంది నిద్రించే అవకాశం ఉన్న మూడు మాస్టర్ బెడ్ రూమ్‌లు, లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, కిచెన్‌తోపాటు ఓ ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్ ఉన్న బంకర్లు కూడా ఉన్నాయి. కొన్ని బంకర్లు కూడా భూమిలోపల రెండు, మూడు అంతస్తులుగా ఉన్నాయి. వాటన్నింటికి కావాల్సిన ఆక్సిజన్, విద్యుత్ నిరంతరాయంగా సరఫరాకు ఏర్పాట్లు ఉన్నాయి. వాటిల్లో కొందరు శతకోటీశ్వరులు ఏడాది పాటు కొదవ లేకుండా తినుపదార్థాలను నిలువ చేసుకున్నారు. చదవండి: కరోనా కట్టడిపై చిగురిస్తున్న ఆశలు -
కరోనా ఎఫెక్ట్ : సిలికాన్ వ్యాలీ షట్‌డౌన్
సాక్షి, కాలిఫోర్నియా : అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. శుక్రవారానికి దాదాపు 11,500 కేసులు నమోదవడంతో దాదాపు సగం రాష్ట్రాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భారతీయ దుకాణాలు మూసి ఉండటంతో నిత్యావసర వస్తువులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిలికాన్ వ్యాలీగా పిలిచే శాన్ఫ్రాన్సిస్కో, శాన్‌జోస్ (కాలిఫోర్నియా) పూర్తిగా మూతపడింది. కొద్ది సంఖ్యలో వ్యాపార సంస్థలు తెరిచి ఉంటున్నా వాటిలో నిత్యావసర వస్తువులు దొర కడం లేదు. గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ సహా వందలాది కంపెనీల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే విధులు నిర్వహిస్తున్నారు. (విదేశాల నుంచి వచ్చినవారు 69వేలు) ప్రజలు వీధుల్లోకి రావొద్దని హెచ్చరికలు ప్రపంచ వాణిజ్య కేంద్రాల్లో అగ్రగామి న్యూయార్క్ పూర్తిగా స్తంభించింది. పొరుగునే ఉన్న న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల్లో ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. న్యూయార్క్‌లో కేసులు పెరుగుతుండటంతో అధికా రులు ప్రజలను వీధుల్లోకి రావొద్దని హెచ్చరించారు. నైట్ క్లబ్‌లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. వాషింగ్టన్, ఫ్లోరిడా, ఇల్లినాయీ, షికాగో, లూసియానా, జార్జియా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలను ఇళ్లకు పరిమితం చేయాలని స్థానిక ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రారంభ దశలో వాషింగ్టన్, న్యూయార్క్, కాలిఫోర్నియా రాష్ట్రాలకే పరిమితమైన వైరస్... ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలను తాకింది. అత్యధికంగా న్యూయార్క్‌లో 4,152 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి దాకా వాషింగ్టన్లో 1,228, కాలిఫోర్ని యాలో 1,044, న్యూజెర్సీలో 742 కేసులు నమోదయ్యాయి. న్యూజెర్సీలో ఒకే కుటుం బానికి చెందిన నలుగురు వైరస్ బారిన పడి మృతి చెందారు. వంద అంతకంటే ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, టెక్సాస్, కొలరాడొ, మసాచ్యూసెట్స్, లూసియానా, ఇల్లినాయీ, జార్జియా, ఫ్లోరిడా ఉన్నాయి. వాటిలో కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలలో భారతీయులు అందులోనూ తెలుగువారు లక్షల్లో నివసిస్తున్నారు. నిత్యావసరాల కోసం భారీ క్యూలు... కరోనా వైరస్ దృష్ట్యా ఇళ్లకే పరిమితం కావాలని కాలిఫోర్నియా ప్రభుత్వం హెచ్చరించడంతో శాన్ఫ్రాన్సిస్కో, లాస్ఏంజిలెస్, శాన్‌జోస్ నగరాలు నిర్మానుష్యంగా మారాయి. భారతీయులు ఆధారపడే దుకాణాలు మూసి ఉండటంతో వేలాది మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరీ ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబాలకు తోటి భారతీయులు తమ దగ్గర ఉన్న నిత్యావసరాల్లో కొన్నింటిని అంద జేస్తున్నారు. ఈ పరిస్థితి మారడానికి భారతీయ దుకా ణాలను తెరిపించాలని, అక్కడ నిత్యావసర వస్తువులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సిలికాన్ వ్యాలీ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు కాలిఫోర్నియా గవర్నర్‌ను కోరారు. న్యూజెర్సీలో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకొనేందుకు తెలుగు సంఘాలు ప్రత్యేక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశాయి. కాలిఫోర్నియాలోనూ ఈ తరహా గ్రూపులు ఏర్పాటు చేస్తున్నామని సిలికాన్ వ్యాలీ తెలుగు అసోసియేషన్‌కు చెందిన మందడి రాకేశ్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. (జనతా కర్ఫ్యూని పాటించండి) జాగ్రత్తలు తప్పనిసరి... అమెరికాలో ఉండే తెలుగువారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇళ్లకే పరిమితం కావాలని తెలుగు అసోసియేషన్లు విజ్ఞప్తి చేశాయి. నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. భారతీయ స్టోర్లలో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ తెలుగు సంఘాలు అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో దేశీయ, విదేశీ ప్రయాణాలు చేయొద్దని, 60 ఏళ్లకు పైబడిన భారతీయ తల్లిదండ్రులు ఇల్లు దాటి బయటకు రావద్దని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ తరుణంలో స్వదేశానికి వెళ్లాలన్న ఆలోచన మానుకోవాలని సూచించింది. -
హెచ్-1బీ వీసా తిరస్కరణ : అమెరికాపై దావా
శాన్ఫ్రాన్సిస్కో : సిలికాన్ వ్యాలీ ఆధారిత ఐటీ సంస్థ అమెరికా ప్రభుత్వంపై లా సూట్ ఫైల్ చేసింది. భారతీయ ఐటీ ప్రొఫెషనల్‌కు హెచ్-బీ వీసా జారీ నిరాకరణపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ దావా దాఖలు చేసింది. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన తమ ఉద్యోగికి వీసా నిరాకరణ ఏకపక్షమైనందనీ విచక్షణ పూరితమైందని వ్యాఖ్యానించింది. తమ సంస్థలో బిజినెస్ సిస్టం ఎనలిస్టు ప్రహర్ష్ చంద్ర సాయి వెంకట అనిశెట్టి( 28) కి హెచ్-1బీ వీసాను యుఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నిరాకరించిందని ఎక్స్ టెర్రా సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ ఆరోపించింది. ఫిబ్రవరి 19, 2019 ఇమ్మిగ్రేషన్ విభాగం విచక్షణా రహితంగా, చట్ట విరుద్ధంగా అనిశెట్టి వీసాను తీరస్కరించిదని పేర్కొంటూ దావా వేసింది. అన్ని అర్హతలున్నప్పటికీ ఏకపక్షంగా వ్యవహరించిందని కంపెనీ ఆరోపించింది. అనిశెట్టి బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) డిగ్రీతోపాటు డాలస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లో మాస్ట్ర్స్ డిగ్రీ చేశారని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం అనిశెట్టి (భార్య ద్వారా) హెచ్-4 డిపెండెంట్ వీసాతో ఉన్నారని తెలిపింది. మరోవైపు దీనిపై స్పందించేందుకు ఇమ్మిగ్రేషన్ విభాగం తిరస్కరించింది. కాగా మొత్తం 65,000 మందికి హెచ్1 బీ వీసా ఇవ్వాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. వీరితోపాటు లబ్ధిదారుల తరపున వచ్చిన మొదటి 20వేల మంది విదేశీయులకు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఈ లిమిట్నుంచి మినహాయింపునిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన మంత్రి సంపత్
కాలిఫోర్నియా : అమెరికా విచ్చేసిన తమిళనాడు కార్మికశాఖ మంత్రి ఎంసీ సంపత్ సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. సంపత్, అతని సిబ్బందికి సిలికానాంధ్ర ఘన స్వాగతం పలికింది. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం చీఫ్ అకాడమిక్ ఆఫీసర్ రాజు చమర్తి గత పద్దెనిమిది సంవత్సరాలుగా సిలికానాంధ్ర సాధించిన ప్రగతిని మంత్రికి వివరించారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో విస్తరిస్తున్న మనబడి, కాలిఫోర్నియా రాష్ట్ర అనుమతి పొంది భారతీయ కళలను బోధిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధిని వివరించారు. అలాగే, కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామం దత్తత తీసుకొని ఆ గ్రామానికి మౌళిక సదుపాయాలను కల్పించిన కృషిని, చుట్టుపక్కల 150 గ్రామాలకు వైద్య సదుపాయం అందించాలనే ఉద్దేశంతో సంజీవనీ వైద్యాలయ స్థాపనకు దాతలు అందించిన సహాయాన్ని, అమెరికా డాక్టర్లు, ఇతర శ్రేయోభిలాషుల సహకారాన్ని కంప్యూటర్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. అమెరికాలోనే కాకుండా, భారతదేశంలో కూడా సిలికానాంధ్ర చేస్తున్న సేవలను, సాధిస్తున్న ప్రగతిని మంత్రి సంపత్ కొనియాడుతూ, ఎలాంటి ప్రాంతీయ వివక్ష లేకుండా భారతీయ కళలను, సంస్కృతిని అమెరికా దేశంలో బోధించాలనే సదుద్దేశంతో స్థాపించిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని అందుకు కృషిచేస్తున్న సిలికానాంధ్ర బృందాన్ని అభినందించారు. ఇటీవల సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో సంస్కృతం, తెలుగు విభాగాలను ప్రారంభించారన్న విషయం తెలుసుకున్న సంపత్, విశ్వవిద్యాలయంలో తమిళభాషా ఫీఠాన్ని నెలకొల్పటానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తానని హామీ ఇస్తూ సిలికానాంధ్రా బృందాన్ని తమిళనాడుకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర కార్యవర్గం, బే ఏరియా తమిళ మన్రం, ఫ్రీమాంట్ ఇస్లామిక్ సెంటర్ ముస్లిం అసోషియేషన్, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గాల సభ్యులు పాల్గొన్నారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం గురించిన మరిన్ని వివరాలకు www.universityofsiliconandhra.org ని చూడవచ్చని, సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి తెలిపారు. -
తెలుగుతనం ఉట్టిపడేలా సిలికానాంధ్ర 17వ వార్షికోత్సవం
కాలిఫోర్నియా : 2001వ సంవత్సరం ఆగష్టు 4న కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో శ్రీకారం చుట్టుకున్న సిలికానాంధ్ర సంస్థ 17వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. క్యూపర్టీనో నగరం డియాంజా కాలేజీలో జరిగిన ఈ వేడుకలకు సిలికానాంధ్ర కుటుంబం సభ్యులతో పాటు శ్రేయోభిలాషులు, దాతలు హాజరయ్యారు. మూడు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం సంప్రదాయ కార్యక్రమాలతో తెలుగుతనం ఉట్టిపడేలా సాగింది. మారేపల్లి వెంకటశాస్త్రి వేదపఠనంతో ప్రారంభమైన ఈ వార్షికోత్సవ వేడుకలకు, విచ్చేసిన అతిథులకు తాటిపాముల మృత్యుంజయుడు ఆహ్వానం పలుకుతూ గత పదహారేళ్ళుగా సిలికానాంధ్ర జరిపిన ప్రయాణాన్ని, చేరుకొన్న మైలురాళ్ళను పునరావలోకనం చేశారు. దిలీప్ కొండిపర్తి, మాధవ కిడాంబి సారథ్యంలో ప్రదర్శించిన 'హాస్యవల్లరి'లోని లఘు నాటికలు ప్రేక్షకులను అలరించాయి. ఆధునిక సాంకేతికాభివృద్ధి తెస్తున్న ఇబ్బందులు, అంతర్జాలంలో జరుగుతున్న పెళ్ళిచూపులు, వివిధ భాషాసంస్కృతుల మేళమైన హైదరాబాద్ నగర జీవిత చిత్రాలని ముఖ్యాంశాలుగా రచించిన ఈ నాటికలు సభను నవ్వులతో ముంచెత్తాయి. మాధవ కిడాంబి, రాంబాబు మంచికంటి, శాంతివర్ధన్ అయ్యగారి, లలిత అయ్యగారి, అనిమేష్ కొండిపర్తి, మూర్తి వేదుల, సతీష్ ముచ్చెర్ల సమర్థవంతంగా పాత్రలను పోషించారు. రాంపల్లి సదాశివ మిమిక్రీ, మాట్లాడేబొమ్మను ప్రదర్శించారు. 'జానపద బ్రహ్మ' మానాప్రగడ నరసిం హమూర్తి కుమారులు సాయి, శ్రీనివాస్ లు పాడిన జానపద గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. చివరగా, 'వికటకవి తెనాలి రామకృష్ణ ' నాటకం ప్రదర్శించారు. రావు తల్లాప్రగడ రచించగా, తెనాలి రామకృష్ణుని పాత్రలో ప్రముఖ నటుడు అక్కిరాజు సుందర రామకృష్ణ ఒదిగిపోయారు. హాస్యచతురోక్తులతో, మధురంగా ఆలపించిన పద్యాలతో సభికులనుండి కరతాళ ధ్వనులను అందుకున్నారు. ఇతర పాత్రల్లో కూచిభొట్ల శాంతి, ఆర్చీశ్ ప్రఖ్య, శ్రీవేద శ్రీపాద, శ్రీదేవి అంగజాల, సూరజ్ దశిక, శ్రీనివాస శ్రీపాద, నారయణన్ రాజు, రావు తల్లాప్రగడ, సదాశివ్ రామపల్లి, శ్రీనివాస్ మంద్రప్రగడ, శర్మ యేడిద, వంశీ ప్రఖ్య, అభిరాం కల్లూరు నటించారు. హైస్కూల్ చదువుతున్న వరకూర్ ఈష మొదటిసారిగా కీబోర్డు సహకారాన్ని అందించింది. వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి అధ్యక్షోపన్యాసం చేస్తూ సిలికానాంధ్ర సాధించిన విజయాలను, రాబోయే సంవత్సరాలలో చేపట్టే కార్యక్రమాలను సభికులకు వివరించారు. సిలికానాంధ్ర మనబడి కులపతి చమర్తి రాజు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ గత పదకొండు సంవత్సరాలలో 35000 మందికి పైగా ప్రవాస బాలలకు తెలుగు నేర్పుతున్న మనబడి అభివృద్ధిని వివరించారు. ఈ కృషి వెనకాల ఉన్న కార్యకర్తలను, ఉపాధ్యాయులను వేదికపైకి ఆహ్వానించి అభినందించారు. 2018-19 సంవత్సరానికి మనబడి ప్రవేశాలు జరుగుతున్నాయని, manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ముఖ్య కోశాధికారి కొండుభట్ల దీనబాబు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, సంగీత నృత్యాలకోసం ఏర్పాటు చేసిన 'సంపద' అకాడమీ కార్యక్రమ వివరాలను సభికులతో పంచుకొన్నారు. మహారాజపోషకుడు, హృద్రోగ నిపుణుడు డాక్టర్ లక్కరెడ్డి హనిమిరెడ్డి చైర్మన్ కూచిభోట్ల ఆనంద్ ఆంధ్రప్రదేశ్‌లోని కూచిపూడి గ్రామంలో నిర్మిస్తున్న సంజీవని వైద్యశాల అందించబోయే సేవలను అభినందిస్తూ, కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను, దాతలను సత్కరించారు. ఈ వేదికపైనే శ్రీ విళంబి ఉగాది ఉత్సవంలో జరిగిన పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ 'ఎనుకుదురాట - అచ్చ తెలుగు అవధానం' మాతా కోటేశ్వరరావు, మాతా శాంకరీ దేవి సంకలనం చేసిన పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అనిల్ అన్నం, సాయి కందుల, విజయసారధి, రవి చివుకుల, కిశోర్ గంధం, వంశీ నాదెళ్ళ, రత్నమాల వంక, స్నేహ వేదుల, వసంత మంగళంపల్లి, రాజశేఖర్ మంగళంపల్లి సహాయం అందజేశారు. అందమైన కార్యక్రమాలతో పాటు పసందైన పదహారణాల తెలుగు భోజనంతో కార్యక్రమం ఆద్యంతం తెలుగుతనం ఉట్టిపడేలా సాగింది. -
జాబ్ కోసం రోడ్డెక్కి.. వైరల్
ఉండటానికి ఇళ్లు లేదు.. చేయటానికి పని లేదు. కానీ, అతని ప్రతిభే.. అతనికి ఓ దారి చూపింది. ఉద్యోగం కోసం రోడ్డెక్కిన అతను చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే.. బడా కంపెనీలు సైతం స్పందించి అతనికి జాబ్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. కాలిఫోర్నియాలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే... సిలికాన్ వ్యాలీ: డేవిడ్ కసరెజ్(26) టెక్సాస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీ నుంచి మెనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. ఆస్టిన్(టెక్సాస్)లో ఓ మోటర్ కంపెనీలో వెబ్ డెవలపర్‌గా పని చేశాడు కూడా. అయితే కొత్త లైఫ్ కోసం కాలిఫోర్నియాకు వచ్చే క్రమంలో అతను తాను నివసించే వ్యాన్‌ను(సంచార జీవనం) పోగొట్టుకున్నాడు. దీంతో ఓ పార్క్ ఫుట్‌పాత్‌పై నివసిస్తూ ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకున్నాడు. అయితే కొత్త ప్రాంతం కావటం.. పైగా డబ్బు తక్కువగానే ఉండటంతో మరో ఆలోచన చేశాడు. రెజ్యూమ్‌ను వందల సంఖ్యలో కాపీలు తీయించి టిప్ టాప్‌గా రెడీ అయి శుక్రవారం ‘మౌంటెన్ వ్యూవ్’లోని ఓ సిగ్నల్ వద్ద నిల్చున్నాడు. ‘ఇళ్లు లేదు. విజయం కోసం పరితపిస్తున్నా. దయచేసి నా రెజ్యూమ్ తీసుకోండి’ అంటూ ఓ ఫ్లకార్డు పట్టుకుని నిల్చున్నాడు. సిగ్నల్ వద్ద వాహనాల్లో ఉన్నవారికి రెజ్యూమ్ పంచుతూ పోయాడు. (రియాల్టీ షోలో ఊహించని ఘటన) మరోవైపు సోషల్ మీడియాలో కూడా అతగాడి గురించి స్టోరీలు తెగ వైరల్ అయ్యింది. ఏదైతేనేం మొత్తానికి ఆ ఐడియా వర్కవుట్ అయ్యింది. మంచి ప్రొఫైల్ కావటంతో గూగుల్, నెఫ్లిక్స్, లింక్డిన్, సహా దాదాపు 200 కంపెనీలు అతనికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బి అవుతున్న కసరెజ్.. ఆలోచించుకుని మంచి కంపెనీలో జాయిన్ అవుతానని చెబుతున్నాడు. ‘డబ్బు సాయం చేస్తామని చాలా మంది ముందుకొచ్చారు. కానీ, నాకు కావాల్సింది ఉద్యోగమే. నేను తలెత్తుకుని జీవించాలనుకుంటున్నా. ఈ ప్రయత్నం విఫలమైతే తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోదామనకున్నా. కానీ, సక్సెస్ అయ్యా’ అని కసరెజ్ అంటున్నాడు. -
మన బడికి ప్రతిష్టాత్మక నాటా పురస్కారం
కాలిఫోర్నియా : గత 10 సంవత్సరాలలో అమెరికా వ్యాప్తంగా 35,000 మంది విద్యార్ధులకు తెలుగు భాష నేర్పిస్తూ, తెలుగు భాషని ప్రాచీన భాషనుండి ప్రపంచ భాషగా తరువాతి తరానికి అందిస్తున్న సిలికానాంధ్ర మనబడికి ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) 'విద్యా ప్రదాయని' పురస్కారం అందించింది. ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన నాటా మెగా కన్వెన్షన్ వేదిక మీద నాటా అడ్వయిజరీ కౌన్సిల్ ఛైర్మన్ ప్రేం కుమార్ రెడ్డి, అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, తదుపరి అధ్యక్షులు రాఘవ రెడ్డి తదితరుల చేతులమీదుగా మనబడి ఉపాధ్యక్షులు శరత్ వేట ఈ పురస్కారం అందుకున్నారు. తెలుగు భాష వ్యాప్తికి, మనబడి కార్యకలాపాలను గూర్చి ప్రత్యేక ఆడియో విజువల్ ని ప్రదర్శించి, మనబడి బృందం చేస్తున్న కృషిని అభినందించారు. తెలుగుభాషాభివృద్ధికై మనబడి సేవలను గుర్తించి ఇంతటి విశిష్ట పురస్కారాన్ని అందించినందుకు శరత్ వేట, నాటా కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా శరత్ వేట మాట్లాడుతూ, అమెరికా వ్యాప్తంగా 250కి పైగా కేంద్రాలలో 1200 మందికి పైగా ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు భాషా సైనికుల సహకారంతో గత పది సంవత్సరాలకు పైగా అమెరికా, కెనడాలతో పాటు 10 ఇతర దేశాలలో 35,000 మందికి పైగా విద్యార్ధులకు తెలుగు భాష నేర్పించామన్నారు. గత సంవత్సరం 9,000 కు పైగా విద్యార్థులు మనబడిలో నమోదు చేసుకున్నారని తెలిపారు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ACS-WASC (Western of Association of Schools and Colleges) వారి గుర్తింపు పొందిన ఏకైక తెలుగు బోధనా విధానం సిలికానాంధ్ర మనబడి అని పేర్కొన్నారు. భారత దేశంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన మనబడి విద్యా విధానానికి అమెరికాలోని అనేక స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ కు అర్హత కూడా లభిస్తోందన్నారు. మనబడి సంచాలకులు ఫణి మాధవ్ కస్తూరి మాట్లాడుతూ సిలికానాంధ్ర మనబడి 2018-19 విద్యాసంవత్సరపు తరగతులు సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమౌతున్నాయని, వెబ్సైట్ http://manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 'భాషాసేవయే భావితరాల సేవ' అనే స్ఫూర్తితో సిలికానాంధ్ర మనబడి రేపటి తరాన్ని తెలుగు భాష సారథులుగా తీర్చిదిద్దడానికి అహర్నిశలూ కృషి చేస్తుందని అన్నారు. -
అమెరికాలో ఘనంగా మనబడి స్నాతకోత్సవాలు
అమెరికా వ్యాప్తంగా వర్జీనియా, న్యూజెర్సీ, అట్లాంటా, చికాగో నగరాలలో మనబడి స్నాతకోత్సవాలు కన్నులపండుగగా జరిగాయి. ఈ సంవత్సరం సిలికానాంధ్ర మనబడి - తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహణలో జరిగిన పరీక్షల్లో 98.5శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. వారందరికీ ప్రాంతాల వారీగా జరిగిన స్నాతకోత్సవాల్లో ధృవీకరణ పత్రాలను అందించారు. వర్జీనియా : స్నాతకోత్సవ కార్యక్రమానికి వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ ముఖ్య అతిధిగా విచ్చేసి, ఉత్తీర్ణులైన విద్యార్ధులకు తెలుగు విశ్వవిద్యాలయం పట్టాలను బహూకరించారు. వేల మైళ్ల దూరంలో పుట్టి పెరుగుతున్న ఈ చిన్నారులు, తెలుగు భాష నేర్చుకుని ఇంత చక్కగా మాట్లాడుతూ, పరీక్షలు వ్రాసి 98.5% పైగా ఉత్తీర్ణులవడం, వారికి పట్టాలు ప్రదానం చేసే అవకాశం తనకు లభించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలిపారు. విశిష్ట అతిథి గా విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి డా. దీర్ఘాసి విజయభాస్కర్ మాట్లాడుతూ, మనబడి విద్యార్ధులు స్నాతకోత్సవ దుస్తుల్లో వేదిక దగ్గరకు వస్తుంటే, తెలుగు అక్షరాలు కవాతు చేస్తున్నట్టుగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఆత్మీయ అతిధిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ఉపసభాపతి డా. మండలి బుద్ధ ప్రసాద్ సిలికానాంధ్రతో తన అనుబంధాన్ని వివరించారు. సిలికానాంధ్ర మనబడి కుటుంబ సభ్యులంతా, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండలి దంపతులతో కేక్ కోయించి, పుట్టినరోజు సంబరాలను జరిపించారు. న్యూజెర్సీ : ఎన్జే, ఎన్వై, సీటీ, పీఏ & డీఈ ప్రాంతాలలోని మనబడి కేంద్రాల విద్యార్ధులు పాల్గొన్న స్నాతకోత్సవం న్యూజెర్సీలో జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిధి న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్, తెలుగు తేజం చివుకుల ఉపేంద్ర మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లకు ముందు అమెరికాకి వచ్చిన తెలుగువారి పిల్లలకి మన మాతృభాష తెలుగుని అందిస్తున్న మనబడి కృషిని, అందుకు సహకరిస్తున్న తల్లితండ్రులకు అభినందనలు తెలిపారు. సిలికానాంధ్ర సంస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ, మాతృభాష నేర్చుకోవడంతోనే మన సంస్కృతిని తెలుసుకునే అవకాశం కలుగుతుందని, అందుకే మనబడి ద్వారా తెలుగు నేర్పించడానికి 11 సంవత్సరాల క్రితం 150 మందితో ప్రారంభించామని, ఇప్పటికీ 35000 మందికి పైగా విద్యార్ధులు మనబడి ద్వారా తెలుగు నేర్చుకున్నారని, ఇంకా ఎన్నో వేలమంది రేపటి తరం తెలుగు భాషా సారధులను తయారుచేయడమే మనబడి ధ్యేయమని అన్నారు. అట్లాంటా : విజయ్ రావిళ్ల నేతృత్వంలో జరిగిన మనబడి స్నాతకోత్సవం అట్లాంటాలో అత్యంత వైభవంగా జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ చేతులమీదుగా విద్యార్ధులు పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా, సిలికానాంధ్ర మనబడి అధ్యక్షులు రాజు చమర్తి మాట్లాడుతూ, ఈ సంవత్సరం అమెరికా వ్యాప్తంగా దాదాపు 1300 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరు కాగా 98% పైగా విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని అందుకు సహకరించిన మనబడి ప్రాంతీయ సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, మనబడి కీలక బృంద సభ్యులు, మాతృభాషా ప్రేమికులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మనబడి 2018-19 విద్యా సంవత్సరపు నమోదు కార్యక్రమం ప్రారంభమైందని, సెప్టెంబర్ 8 నుండి తరగతులు ప్రారంభమౌతాయని, http://manabadi.siliconandhra.org ద్వారా ఆగస్ట్ 31 లోగా మనబడిలో చేరవచ్చని మనబడి ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు. చికాగో : చికాగోలో జరిగిన మనబడి స్నాతకోత్సవానికి ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణతో పాటు మరో అతిధిగా విచ్చేసిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ, తాను ఎన్నో సంవత్సరాలుగా మనబడిని దగ్గరనుంచి చూస్తున్నానని, ఈ భాషాసేవ చేస్తున్న వారందరిలో మాతృభాష పట్ల నిబద్ధత చూశానని పేర్కొన్నారు. అందుకే మనబడి ఇంత విజయవంతంగా ఎంతోమంది ప్రవాస బాలలకు తెలుగు నేర్పగలుగుతోందని, ఇటీవల హైదరబాద్ లో జరిగిన ప్రపంచతెలుగు మహాసభల్లో పాల్గొన్న భారత రాష్ట్రపతి సైతం 'మనబడి ' గురించి తన ప్రసంగంలో పేర్కొనడం అందుకు నిదర్శనమని అన్నారు. స్నాతకోత్సవ కార్యక్రమాలను సిలికానాంధ్ర మనబడి ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల పర్యవేక్షించగా, మనబడి ప్రాచుర్యం ఉపాధ్యక్షులు శరత్ వేట, రామాపురం గౌడ్, కిరణ్ దుడ్డగి, పవన్ బొర్ర, మాధురి దాసరి, శ్రీనివాస్ చివులూరి, సుజాత అప్పలనేని, విజయ్ రావిళ్ల, వెంకట్ గంగవరపు, ఖమ్మం జిల్లానుంచి వచ్చిన తెలుగు భాషోద్యమ నాయకులు పారుపల్లి కోదండ రామయ్య, మనబడి విద్యార్ధుల కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, ప్రాంతీయ సమన్వయ కర్తలు, భాషా ప్రేమికులు పాల్గొన్నారు. -
ఘనంగా మనబడి స్నాతకోత్సవం
క్యాలిఫోర్నియా : సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. అమెరికాలో క్యాలిఫోర్నియా నగరంలోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో శుక్రవారం మనబడి సంస్థ నిర్వహకులు ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగు యూనివర్శిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్వీ సత్యనాయరణ చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో మనబడి కలిసి నిర్వహించిన జూనియర్, సీనియర్ సర్టిఫికేట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 300 మంది విద్యార్థులకు ద్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలమైళ్ల దూరంలో ఉన్నా, మాతృభాషపై మమకారంతో తెలుగు భాష నేర్చుకుంటున్న చిన్నారులను, వారిని ప్రోత్సహస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. మనబడి అధ్యక్షుడు రాజు చమర్తి మాట్లాడుతూ.. మొత్తం 1857 మంది విద్యార్థులుకు గాను 1830 మంది ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. అందులో 68.6 శాతం మంది డిస్టింక్షన్లో, 20.4 శాతం మంది ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారని అన్నారు. మిగతా విద్యార్థులకు డాల్లస్, చికాగో, అట్లాంటా, వర్జీనియా, న్యూజెర్సీ నగరాలలో జరగనున్న మనబడి స్నాతకోత్సవాలలో ఎస్వీ సత్యనారయణ చేతుల మీదుగా అందజేయనున్నట్టు తెలపారు. పరీక్షల నిర్వహణలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 2018-19 విద్యాసంవత్సరానికి గాను నమోదు కార్యక్రమం ప్రారంభమైనట్లు వెల్లడించారు. విద్యార్థులు మనబడి వెబ్సైట్ ద్వారా ఆగస్టు 30వ తేది లోగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సిలికానాంధ్ర సంస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిబొట్ల మాట్లాడుతూ.. కేజీ నుంచి పీజీ దాకా విద్యాబోధనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన మనబడి, సిలికానాంధ్రకు తెలుగు విశ్వవిద్యాలయం తోడు కావడం సంతోషకరమైన విషయమన్నారు. భారత్‌లో నిర్మిస్తున్న సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి కార్యాచరణను ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మనబడి ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల, తెలుగు యూనివర్శిటీ అధికారులు ఆచార్య రమేష్ భట్టు, ఆచార్య రెడ్డి శ్యామల, డా.గీతా వాణి, సిలికానాంధ్ర ఉపాధ్యక్షుడు దిలీప్ కొండిపర్తి, శాంతి కూచిబొట్ల, శ్రీదేవి గంటి, మనబడి బృంద సభ్యులు శ్రీరాం కోట్ని, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, కృష్ణ జయంతి, సాయి కందుల, లక్ష్మి యనమండ్ర తదితరులు పాల్గొన్నారు. -
15 నుంచి సిలికానాంధ్ర 'సంపద' ప్రవేశాలు
కాలిఫోర్నియా : అమెరికా, కెనడాలలో సంగీతం, నాట్యంలో శిక్షణపొందుతున్న విద్యార్ధులను ప్రొత్సహిస్తూ, వారిని గొప్ప కళాకారులుగా సంగీత విధ్వాంసులుగా చూడాలనే ఆశయంతో సిలికానాంధ్ర ప్రారంభించిన మరో వినూత్న కార్యక్రమం 'సంపద '(సిలికానాంధ్ర మ్యూజిక్, ఫర్ఫార్మింగ్ ఆర్ట్ అండ్ డాన్స్ అకాడమీ). పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్దేశించిన పాఠ్యప్రణాళిక ప్రకారం కర్ణాటక సంగీతంలో గాత్రం, వయోలిన్, వీణ, వేణువు(ఫ్లూట్), మృదంగం, హిందుస్తానీ సంగీతంలో గాత్రం, వయొలిన్, సితార్, ఫ్లూట్, తబల, భారతీయ నాట్యాలలో భరతనాట్యం, కూచిపూడి, ఆంధ్ర నాట్యం తదితర కోర్సులలో, తొలిదశ (2సం) ద్వారా జూనియర్ సర్టిఫికేట్, మలిదశ (2సం) ద్వారా సీనియర్ సర్టిఫికేట్ పొందుతారు. మొదటి సంవత్సరమే సంపదలో 800 మంది విద్యార్ధులు నమోదు చేసుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తోందని సిలికానాంధ్ర సంపద అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరాంతపు పరీక్షలను మే 5, 6 న అమెరికా, కెనడాలలోని 600కు పైగా విద్యార్థులకు వివిధ ప్రాంతాలలో నిర్వహించడంతో పాటు, ఆన్ లైన్ ద్వారా కూడా ఈ పరీక్షలను నిర్వహించామన్నారు. ఈ పరీక్షల నిర్వహణలో అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సిలికానాంధ్ర సాంస్కృతిక సైనికులు సహకారం అందించారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2018-19 విద్యాసంవత్సరపు ప్రవేశాలు మే 15న ప్రారంభమౌతున్నాయని, సంపద గురించిన మరిన్ని వివరాలకు, కొత్త విద్యాసంవత్సరంలో నమోదు కొరకు http://sampada.siliconandhra.org సంప్రదించవచ్చని దీనబాబు తెలిపారు. -
సిలికానాంధ్ర రామదాసు సంకీర్తనోత్సవం
కాలిఫోర్నియా : సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రామదాసు సంకీర్తనోత్సవం అమెరికాలో కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో ఘనంగా జరిగింది. మల్లాది రవికుమార్, కొలవెన్ను శ్రీలక్ష్మి, అవ్వారి గాయత్రి ఆధ్వర్యంలో అదిగో భద్రాది, శ్రీరామ నామమే, పలుకే బంగారమాయెనా, శ్రీరాముల దివ్యనామ, రామజోగి మందు, తారకమంత్రము, హరి హరి రామ, తక్కువేమి మనకు, కంటినేడు మా రాముల కీర్తనలను బే ఏరియాలోని కర్ణాటక సంగీత ప్రియులు, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు భక్తి పారవశ్యంతో పాడారు. అనంతరం సిలికాన్ వ్యాలీలోని వివిధ పలు సంగీత కళాశాలల విద్యార్థులు, ఔత్సాహిక సంగీత కళాకారులు వివిధ రామదాసు కీర్తనలను బృంద గానాలలో రాగయుక్తంగా పాడారు. అనురాధ శ్రీధర్ వయోలిన్ పై, శ్రీరాం బ్రహ్మానందం మృదంగంపై సహకారమివ్వగా మూడుగంటపాటూ విద్వాన్ మల్లాది రవికుమార్ శ్రీరామదాసు సంకీర్తనలను పాడారు. మల్లాది రవికుమార్ తమ గురువులు నేదునూరి కృష్ణమూర్తి, శ్రీపాద పినాకపాణి స్వరపరచిన కీర్తనలను పాడారు. రవికుమార్, అనూరాధ, శ్రీరాం కలిసి కచేరీ చేయటం ఇది మొదటిసారి. సభలో జరుగుతున్నప్పుడే అప్పటికప్పుడు ఒకరికొకరు సహకరిస్తూ మనోధర్మ సంగీతాన్ని హృద్యంగా అందించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీతవేత్త బ్రహ్మానందం, డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, డాక్టర్ జంధ్యాల రవి అతిధులుగా హాజరయ్యారు. డాక్టర్ జంధ్యాల రవికుమార్, మనబడి కులపతి చమర్తి రాజు, సిలికానాంధ్ర వైస్ చైర్మన్ కొండిపర్తి దిలీప్ వాయిద్యకారులను సత్కరించారు. జంధ్యాల రవి కూచిపూడి నాట్యం, అన్నమయ్య కీర్తనలతో తనకు సిలికానాంధ్రతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హనిమిరెడ్డి, మల్లాది రవికుమార్‌ను ఘనంగా సత్కరించారు. కార్డియాలజిస్ట్ పనిచేస్తున్న తను, ఇతర డాక్టర్లు, నర్సులకు రామ శబ్దం ఎలా పరిచయం చేశాడో చెప్పారు. మల్లాది రవికుమార్ మాట్లాడుతూ తన అన్నయ్య శ్రీరాంప్రసాద్, తన తండ్రి సూరిబాబులతో కలిసి అన్నమయ్య, రామదాసు, త్యాగరాజుల సంగీతాన్ని సిలికానాంధ్ర ద్వారా ముందు తరానికి నేర్పించడానికి సహకరిస్తామన్నారు. సిలికానాంధ్ర ముఖ్యకోశాధికారి కొండుభట్ల దీనబాబు మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే రామదాసు కీర్తనలతో లక్షగళార్చన చేయడానికి సిలికానాంధ్ర సిద్ధంగా ఉందన్నారు. కొండిపర్తి దిలీప్ నిర్మించిన పర్ణశాల నమూనా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సిలికానాంధ్ర వాగ్గేయకార బృందసభ్యులు తణుగుల సంజీవ్, సర్వ షీలా, నాదెళ్ళ వంశీ, మల్లాది సదా, గుండ్లపల్లి వాణి, కడియాల కళ్యాణి, వేదుల స్నేహ, వంక రత్నామాల, మాలెంపాటి ప్రభ, కందుల శాయి, మంచికంటి రాంబాబు, గురజాలె దీప్తి, గంధం కిశోర్, కూచిభొట్ల రవి, వేదుల మూర్తి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంతో తమవంతు కృషి చేశారు. -
సిలికానాంధ్ర మనబడి తరగతులు ప్రారంభం
అమెరికా-కెనడాలో 2017-18 విద్యాసంవత్సరానికిగానూ సిలికానాంధ్ర మనబడి తరగతులు సెప్టెంబర్9 నుండి ప్రారంభమయ్యాయి. సిలికానాంధ్ర మనబడి ద్వారా గత 10 సంవత్సరాల్లో 27000 మందికి పైగా ప్రవాస బాలలు తెలుగు నేర్చుకున్నారు. అమెరికాలో 35 పైగా రాష్ట్రాల్లో 250 కేంద్రాలలో ఈ విద్యాసంవత్సరం తరగతులకు వేలాది మంది విద్యార్ధులు హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు అమెరికా వ్యాప్తంగా ప్రతిష్టాత్మక డబ్ల్యూఏఎస్సీ(వెస్టర్న్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్) గుర్తింపు లభించిన మనబడి తరగతులకు 27కు పైగా స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్‌కు అర్హత సాధించిన తెలుగు నేర్పించే ఏకైక విద్యాలయం సిలికానాంధ్ర మనబడి. కాలిఫోర్నియా సన్నివేల్ విభాగంలో తరగతులను ప్రారంభిస్తూ మనబడి అధ్యక్షులు రాజు చమర్తి మాట్లాడుతూ, భారత దేశానికి ఎంతో దూరంగా ఉన్నా, మాతృ భాషకి దూరం కాకూడదని, పుట్టిన ఊరిలో ఉన్న వారితో బంధాన్ని నిలిపి ఉంచేందుకు మన భాష ఎంతో ముఖ్యమని గుర్తించి మన పిల్లలకు తెలుగు నేర్పించాలన్న లక్ష్యంతో మనబడి ప్రారంభించామన్నారు. దశాబ్ది కాలంగా తమ పిల్లలను మనబడిలో చేర్పించి తెలుగు నేర్పిస్తున్న తల్లి తండ్రులకు, భాషాసేవయే భావితరాల సేవ ! అనే స్ఫూర్తితో తెలుగు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు, భాషా సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ ప్రాంతాలలో తరగతులను మనబడి ఉపాద్యక్షులు శరత్ వేట, డాంజి తోటపల్లి, భాస్కర్ రాయవరం, శాంతి కూచిభొట్ల, శ్రీదేవి గంటి తదితరులు పర్యవేక్షించారు. అమెరికా వ్యాప్తంగా ఈ వారాంతంలో వివిధ ప్రాంతాలలో తరగతులు ప్రారంభమైన సందర్భలో, కూపర్టినో కేంద్రంలో మనబడి తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చెసిన ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగెశ్వరరావు మాట్లాడుతూ, తెలుగు భాషకు ప్రపంచపీఠంపై పట్టంకట్టడానికి మనబడి చేస్తున్న కృషిని అభినందనీయమన్నారు. తల్లి తండ్రులకు ఉపాధ్యాయులకు మాతృభాష పట్ల మమకారాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. మనబడి 2017-18 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు సెప్టెంబర్ 22, 2017 వరకు అందుబాటులో ఉంటుందని, రిజస్టర్ చేసుకోవడానికి, మరిన్ని వివరాలకు manabadi.siliconandhra.org చూడాలని మనబడి ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల కోరారు. -
సిలికానాంధ్ర వర్సిటీలో అన్నమయ్య జయంతి
- రెండు రోజులపాటు ఘనంగా వేడుకలు కాలిఫోర్నియా: తొలి వాగ్గేయకారుడు, పదకవితా పితమహుడు తాళ్లపాక అన్నమాచార్య 609వ జయంతిని అమెరికాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఘనంగా నిర్వహించింది. శని, ఆదివారాల్లో డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో అత్యంత వైభవంగా నిర్వహించిన వేడుకలకు పలువురు ప్రముఖులు, రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు హాజరయ్యారు. అన్నమయ్య జయంతి సందర్భంగా సిలికానాంధ్ర ఆధ్వర్యంలో గడిచిన రెండు నెలలుగా న్యూజెర్సీ, డాలస్, చికాగో, మిల్పీటస్ తదితర నగరాల్లో సంగీత, నృత్య పోటీలు నిర్వహించారు. ప్రాంతీయంగా విజేతలుగా నిలిచినవారు కాలిఫోర్నియాలో తుది విడత పోటీల్లో ప్రదర్శనలు ఇచ్చారు. పోటీల మధ్యలో గీతాంజలి మ్యూజిక్ స్కూల్, కచపి స్వరధార అకాడెమి విద్యార్థులు నృత్య గాన ప్రదర్శనలు ఇచ్చారు. శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి నృత్య కళాప్రవీణ సుమతీ కౌశల్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ‘బాలక్క’గా ఖ్యాతిపొందిన బాల కొండలరావు తన కుమారుడైన ఆదిత్య బుల్లిబ్రహ్మంతో కలిసి పలు అన్నమయ్య కీర్తనలకు కూచిపూడీ నృత్యం చేశారు. ఈ ఏడాది సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికైన బాలక్కతోపాటు అమెరికాలో కూచిపూడికి సేవ చేస్తున్న సుమతీ కౌశల్‌ను లకిరెడ్డి హనిమిరెడ్డి సత్కరించారు. అటుపై, గరిమెళ్ళ అనిల్ కుమార్ అనూరాధ శ్రీధర్ (వయోలిన్), రవీద్రభారతి శ్రీధరన్ (మృదంగం) వాద్య సహకారంతో అన్నమయ్య కీర్తనల కచేరి నిర్వహించారు. ఆ తరువాత మృత్యుంజయుడు తాటిపామల సంపాదకత్వంలో తయారైన సుజనరంజని ప్రత్యేక సంచికను ఆనంద్ కూచిభొట్ల, దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, ప్రభ మాలేంపాటి సమక్షంలో విడుదల చేశారు. ఈ పత్రికకు ఉప సంపాదకులు గా ఫణిమాధవ్ కస్తూరి వ్యవహరిస్తున్నారు. అన్నమయ్య జయంతి ఉత్సవాల రెండోరోజు(ఆదివారం) నగర సంకీర్తనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అన్నమయ్య కీర్తనలు పాడుతూ స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను మిల్పీటస్ నగర పురవీధుల గుండా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. సాయంత్రం పెరవలి జయభాస్కర్ గారి మృదంగ లయ విన్యాసం ఆకట్టుకుంది. దీనికి అనూరాధ శ్రీధర్ వయోలిన్ సహకారం అందించారు. ఆ తర్వాత కర్ణాటక సంగీత విద్వాంసులు శశికిరణ్, చిత్రవీణ గణేశ్ అన్నమయ్య కీర్తనలు ఆలాపించగా కృపాలక్ష్మి దానికి తదనుగుణంగా నృత్యం చేశారు. జాతీయ పొటీలలో గెలుపొందిన సంగీత, నృత్య పోటీదార్లకు బహుమతుల ప్రదానంతో కార్యక్రమం ముగిసింది. అమెరికా వ్యాప్తంగా జరిగిన అన్నమయ్య జయంతి ఉత్సవాలను అత్యంత వైభవం గా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సిలికానాంధ్ర వాగ్గేయకార బృంద ఉపాద్యక్షులు సంజీవ్ తనుగుల, బృంద సభ్యులు షీలా సర్వ, వంశీ నాదెళ్ల, వాణి గుండ్లపల్లి, సదా మల్లాది, ప్రవీణ్, శరత్ వేట(న్యూజెర్సీ), భాస్కర్ రాయవరం(డాలస్), సుజాత అప్పలనేని(చికాగో)లు ధన్యవాదాలు తెలిపారు. -
మిల్పీటస్ లో ఘనంగా 'మనబడి' స్నాతకోత్సవం
కాలిఫోర్నియా: అమెరికా, కెనడా, స్కాట్లాండ్ లలో దాదాపు 50 కేంద్రాలలో 1423 మంది సిలికానాంధ్ర మనబడి విద్యార్ధులకు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలలో 99.8 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణులైన విద్యార్ధులకు కాలిఫోర్నియాలోని మిల్పీటస్ నగరంలో ఆదివారం ధృవీకరణ పత్రాలను అందజేసారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలో అత్యంత వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం అందించే కర్ణాటక శాస్త్రీయ సంగీతం, హిందుస్తానీ సంగీతం, కథక్, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యం, వేణువు, వయోలిన్, వీణ, మృదంగం, తబలా కోర్సుల్లోనూ జూనియర్, సీనియర్ సర్టిఫికేట్ స్థాయి పరీక్షలను సిలికానాంధ్రతో కలిసి నిర్వహించడానికి సంబంధించిన అవగాహన పత్రాలపై పరస్పరం అందజేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంపద (SAMPADA - Silicon Andhra Music, Performing Arts & Dance Academy) అని పేరు పెట్టారు . ఈ పరీక్షలలో పాల్గొనే విద్యార్ధులు సెప్టెంబర్ 10, 2017 లోగా sampada.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవలసిందిగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హృద్రోగ నిపుణులు డా. హనిమిరెడ్డి లకిరెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సత్తి రెడ్డి, పరీక్ష నిర్వహణ అధికారి ప్రొఫెసర్ రెడ్డి శ్యామల, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అద్యక్షులు ఆచార్య మునిరత్నం నాయుడు, జర్నలిజం పీఠాధిపతి డా. కడియాల సుధీర్ కుమార్ పాల్గొన్నారు. మనబడి దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో మరొక విశిష్టమైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక గుర్తింపు సంస్థ ఏసీఎస్ వాస్క్ (Accreditation Commission of Schools -Western Association of Schools & Colleges ) డైరెక్టర్ డా. జింజర్ హావనిక్ స్నాతకోత్సవానికి విశిష్ట అతిథిగా విచ్చేసి, అమెరికాలోని 35 పైగా రాష్ట్రాలలోని 250 ప్రాంతాలలో నిర్వహిస్తున్న అన్ని మనబడి కేంద్రాలకు, వాస్క్ గుర్తింపునిస్తున్నట్టు ప్రకటించి, అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను మనబడి అద్యక్షులు రాజు చమర్తికి అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ కూచిభొట్ల, దిలీప్ కొండిపర్తి, దీనబాబు కొండుభట్ల, ప్రభ మాలెంపాటి, శాంతి కూచిభొట్ల, శరత్ వేట, శ్రీదేవి గంటి, శ్రీరాం కోట్ని, అనిల్ అన్నం, ఫణి మాధవ్ కస్తూరి, సిలికానాంధ్ర-మనబడి కార్యనిర్వాహక బృందం తదితరులు పాల్గొన్నారు. -
ప్రవాస బాలలకు తెలుగు విశ్వవిద్యాలయ పరీక్షలు
గత పది సంవత్సరాలుగా 27వేలమందికి పైగా ప్రవాస తెలుగు బాలలకు తెలుగు భాష నేర్పుతున్న సిలికానాంధ్ర మనబడి 2016-17 విద్యాసంవత్సరం వార్షిక పరీక్షలు శనివారం జరిగాయి. అమెరికాలోని 50 కి పైగా ప్రాంతాలలో 1062 జూనియర్ సర్టిఫికేట్ (ప్రకాశం), 372 మంది సీనియర్ సర్టిఫికేట్(ప్రభాసం)కోసం విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయం అధికారులు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సత్తిరెడ్డి, పరీక్షా నిర్వహణ సంచాలకులు డా. రెడ్డి శ్యామల, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అధ్యక్షులు డా. మునిరత్నం నాయుడుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వార్షిక పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షా పత్రాలను అధికారుల సమక్షంలో అమెరికాలోనే మూల్యాంకణం చేశారు. ఉత్తీర్ణులైన వారికి మే 21, 2017న జరిగే మనబడి స్నాతకోత్సవ కార్యక్రమంలో, తెలుగు విశ్వవిద్యాలయం అందించే పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ, వాస్క్ అధికారులు డా. జింజర్ హావనిక్ తదితరులు హాజరు కానున్నారు. అమెరికా వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షలను శ్రీదేవి గంటి సమన్వయ పరచగా.. కిరణ్ దుడ్డగి సాంకేతిక సహకారం అందించారు. -
సిలికాన్ వ్యాలీలో కన్నీళ్లకు కొదవ లేదు
కాలిఫోర్నియా: అమెరికాలోని సిలికాన్ వ్యాలీ అందమైన ప్రదేశమే కాదు, అక్కడ పనిచేసే ఉద్యోగులకు అధిక జీతభత్యాలు ఉంటాయి. భార్యాభర్తలు కలిసి అక్కడే పనిచేస్తే ఇక వారి వైవాహిక జీవిత వైభోగానికి సరిసద్దులే ఉండవు. సరదాగా కార్లలో పబ్బులకు, క్లబ్బులకు కలసి తిరుగుతారు. వారాంతంలో దూర తీరాల విహార యాత్రలకు వెళతారు. విందు, వినోదాల్లో తేలిపోతారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి జీవితాలు స్వర్గతుల్యం. ఇది బయటకు కనిపంచే ప్రపంచం. ఇదంతా ఒట్టి భ్రమ. సిలికాన్ వ్యాలీలో దక్షిణాసియాకు చెందిన, ముఖ్యంగా భారతీయ పురుష పుంగవులు ఇలాంటి ఆనంద డోలికల్లో తేలిపోతున్నారేమో తెలియదుగాని, వారి భార్యలు మాత్రం భయటకు చెప్పుకోలేని బాధలను అనుభవిస్తున్నారు. గహ హింసలో ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. భారత్‌లోని ఐఐటీలో ట్యాప్ రాంకర్గా వచ్చి సిలికాన్ వ్యాలీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అభిషేక్ గట్టానిపై ఆయన భార్య నేహా రస్తోగి గహ హింస కేసు పెట్టడంతో ఇలాంటి అంశాలన్నీ ఒక్కసారిగా వెలుగు చూశాయి. భర్త తనను హింసిస్తున్న విషయాన్ని ఆమె ఐఫోన్లో రికార్డు చేసి, దాన్ని కాలిఫోర్నియా కోర్టులో వినిపించడంతో ఈ వారమే ఆయనకు కోర్టు, నెల రోజుల జైలు శిక్ష విధించింది. మిత్రులతో సహోద్యోగులతో సౌమ్యంగా మెలిగే అభిషేక్ ప్రవర్తన గురించి తెలిసి సిలికాన్ వ్యాలీ నివ్వెరపోయింది. పెళ్లయినా కొత్తలో...ఆ తర్వాత ఐటీ రంగంలోనే ఉన్నత ఉద్యోగం చేస్తున్న రస్తోగి కథనం ప్రకారం పెళ్లైన కొత్తలో దంపతులిద్దరూ ఆనందంగానే ఉండేవారు. రానురాను ఇద్దరు కలసి బయటకు వెళ్లడం తగ్గింది. ఆ తర్వాత ఆఫీసుకు తప్ప బయటకు ఒంటరిగా వెళ్లడానికి వీల్లేదనే ఆంక్షలు భార్యపై మొదలయ్యాయి. చెంప దెబ్బలతో మొదలైన గహ హింస చితకబాదే వరకు వెళ్లింది. తనకు పిల్లలంటే ఇష్టమని, పిల్లలు కావాలను అభిషేక్ డిమాండ్ చేయడంతో అప్పటికే మూడుసార్లు గర్భస్రావంమైన రస్తోగి మందుల వాడడం ద్వారా ఇద్దరు ఆడపిల్లలను తల్లయ్యింది. గహ హింసా ఇంకా పెరిగింది. పిల్లలను ఏమత్రం దగ్గరికి తీయడంగానీ, వారికి సంబంధించిన పనులుగానీ చేసే వాడు కాదు భర్త. పైగా పిల్లలను విసుక్కునే వాడు. బయటే ఎక్కువ కాలం గడిపేవాడు. ఇంటికొస్తే భార్యను కొట్టడమే పనిగా పెట్టుకునే వాడు. ఎలాంటి గహ హింస ఉంటుంది? దక్షిణాసియాలో గహ హింసకు గురవుతున్న మహిళలను రక్షించేందుకు అమెరికాలో మైత్రి, నారికా అనే రెండు సంస్థలు కషి చేస్తున్నాయి. ఈ సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం భర్తలు తీసుకెళ్లకుండా భార్యలు బయటకు రాకూడదు. షాపింగ్‌లకు కూడా వెళ్లకూడదు. భార్య మొబైల్లోని నెంబర్లను, మెస్సేజ్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటారు. ఇంటర్నెట్ బ్రౌజింగ్లను చూస్తారు. ఈ నెంబర్లు ఎవరివీ, ఈ మిస్సేజ్‌లు ఎవరివంటూ అనవసర అనుమానాలతో వేధిస్తారు. రానురాను గొడవలు పెరుగుతాయి. చెంప దెబ్బల నుంచి చెప్పు దెబ్బల వరకు గహ హింస వెళుతుంది. కొందరు భార్యల ఉద్యోగాలు మాన్పిస్తారు. వారిని ఇంట్లోనే బంధీ చేస్తారు. పిల్లలు పుడితే వారి బాగోగుల సంగతి భార్యలకే వదిలేస్తారు. పట్టించుకోరు, ప్రశ్నిస్తే మళ్లీ హింస...అత్తామామలతో ఉండే కోడళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయరు? గహ హింస ఎదుర్కొంటున్న మహిళలు అమెరికా పోలీసులు అత్యవసర సేవలు అందించే 911కు ఫోన్ చేయవచ్చు. వాళ్లు వెంటనే స్పందిస్తారు. భర్తలపై గహ హింస కేసు పెడితే వెంటనే భర్తల ఉద్యోగాలు పోతాయి. వారి నుంచి ఇంకా దారుణాలను ఎదుర్కోవాలసి వస్తుందన్న భయం కూడా వారిని వెంటాడుతుంది. డిపెండెంట్ వీసాలపై వచ్చిన భార్యల పరిస్థితి ఇంకా దారుణం. హెచ్–1బీ కలిగిన భర్తలను వదిలేస్తే భార్యల డిపెండెంట్ వీసాలు రద్దవుతాయి. ఉద్యోగాలు పోతాయి. భారత్‌కు రావాల్సి వస్తుంది. వచ్చినా ఫర్వాలేదనుకుంటే అక్కడే పుట్టినందున వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం ఉంటుంది. వారిని తెచ్చుకోవడానికి తల్లులకు హక్కు లేదు. అందుకే వారు అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేయరు. 70 శాతం కేసులు ఐటీ నుంచే... ఇలాంటి పరిస్థితులలోనే గహి హింస నుంచి మహిళలను రక్షించేందుకు తాము రంగంలోకి దిగామని మైత్రి, నారికాలు తెలిపాయి. ఒక్క 2016లోనే తమకు 4,330 మంది మహిళల నుంచి ఫిర్యాదులందాయని మైత్రి తెలిపింది. 2013లో అందిన ఫిర్యాదులతో పోలిస్తే ఇవి రెండింతలట. ఏడాదికి తమకు దాదాపు 1200 ఫిర్యాదులు అందుతాయని నారికా వెల్లడించింది. అందులో 65 నుంచి 70 శాతం ఐటీ రంగానికి చెందిన మహిళలే ఉంటున్నారని పేర్కొంది. భార్యా భర్తలకు కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు ఇటు అమెరికా, అటు భారత్ చట్టాలను దష్టిలో పెట్టుకొని తాము పరిష్కార మార్గాలు సూచిస్తున్నామని చెప్పారు. రస్తోగి సూచిస్తున్న చిట్కాలు... మగవారి గహ హింస నుంచి బయట పడాలంటే సంయుక్తంగా బ్యాంక్ ఖాతా తెరవకూడదు. ఇద్దరి ఖాతాలు వేర్వేరుగా ఉండడమే మంచిది. వ్యక్తిగత స్వేచ్ఛను ముందునుంచే కాపాడుకోవాలి. పిల్లలను అసలు కనకూడదని అమె చెబుతున్నారు. అమెరికాలో నివసించే పాశ్చాత్య, యూరప్ దేశాల భార్యా భర్తలో ఈ గహ హింస లేదని, భారత్ లాంటి దక్షిణాసియా దేశాల కుటుంబాల్లోనే ఈ హింస ఎక్కువగా ఉందని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అందుకు వారి సంస్కతే కారణమని, విడుకులు తీసుకోవడంలో వారికున్న స్వేచ్ఛ మనకు లేదని వారంటున్నారు. పాశ్చాత్య సంస్కతి మోజులో పడే మగవాళ్లు, ఆ సంస్కతికి భార్యలను దూరంగా ఉంచాలనుకోవడం వల్ల కూడా భార్యాభర్తల్లో సమస్యలొస్తున్నాయని, అది గహ హింసకు దారితీస్తోందని వారు చెబుతున్నారు. -
సిలికానాంధ్ర యూనివర్సిటీలో ఘనంగా ఉగాది వేడుకలు
కాలిఫోర్నియా : శ్రీ హేమలంబ నామ ఉగాది ఉత్సవాలు కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో సిలికానాంధ్ర యూనివర్సిటీలోని లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పంచ ఘట నాదలయవిన్యాసం, వాద్య సంగీత గోష్టి (ఫ్యుజన్) కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచాయి. ప్రపంచ ప్రఖ్యాత ఘటవాయిద్య విద్వాంసులు పద్మభూషణ్ విక్కు వినాయకరాం తన శిష్య బృందంతో నిర్వహించిన 'పంచ ఘట నాదలయ విన్యాసం' తో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం పరవశించింది. ఈ సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో విక్కు వినాయకరాం మాట్లాడుతూ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పవిత్రతో కూడిన దివ్యత్వం ఉన్నట్టుగా అనుభూతి కలుగుతోందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఏ ఆశయం కోసం ప్రారంభించారో అది తప్పక నెరవేరుతుందన్నారు. తానూ ఇందులో భాగమై, విద్యార్ధులకు విద్య నేర్పడానికి సిద్ధం అని ప్రకటించారు. తాను కచేరీ చేసే ఘటం ని సంతకం చేసి కానుకగా సిలికానాంధ్ర యూనివర్సిటీకి అందజేశారు. అనంతరం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం రాబోయే ఫాల్ సెమిస్టర్ కరపత్రాలు, గోడపత్రికను పద్మభూషణ్ విక్కు వినాయకరాం ఆవిష్కరించి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, యూనివర్సిటీ కార్యవర్గానికి అందజేశారు. బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వెంకట శాస్త్రి హేమలంబ ఉగాది పంచాంగ పఠనం చేశారు. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనాన్ని మధు ప్రఖ్య సంధాతగా ఎంతో ఆసక్తిగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా పిల్లలకు నిర్వహించిన ‘భాషా వికాస పోటీ’ విజేతలకు బహుమతులు అందజేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అన్నవరపు రామస్వామి శిష్యులు 'దేవన్ డ్రోన్ ' గా చిరపరిచితులైన కళాకారులు వయోలిన్ వాసుదేవన్, ఫ్లూట్ ఫణిలు నిర్వహించిన వాయులీన-వేణుగాన ‘నాదామృత వర్షిణి’ కార్యక్రమం ప్రేక్షకులను ఆసాంతం ఉర్రూతలూగించింది. సిలికానాంధ్ర సంస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ.. యువతే రేపటి భవిత అనే సిద్ధాంతాన్ని సిలికానాంధ్ర ఎప్పుడూ నమ్ముతుందని, అందుకే ప్రతిభావంతులైన యువ కళాకారులను ఎల్లప్పుడూ సిలినాంధ్ర వేదిక స్వాగతం పలుకుతుందని అన్నారు. ఇదే వేదికపై, ఎంజే తాటిపాముల, ఫణిమాధవ్ కస్తూరి సిద్ధం చేసిన సిలికానాంధ్ర అంతర్జాల పత్రిక 'సుజనరంజని' కొత్త పోర్టల్ విడుదల చేశారు. రత్నమాల వంక, మాధవ కిడాంబి, పద్మ హరి, సిద్దార్ధ్ నూకల, సాయి కందుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, ప్రభ మాలెంపాటి, సంజీవ్ తనుగుల, రవీంద్ర కూచిభొట్ల, తదితరులు పాల్గొన్నారు. -
టెక్ దిగ్గజాలు ఎందుకు చెక్కేస్తున్నారు?
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా’ పథకాలకు ఆకర్షితులై స్వదేశీ, విదేశీ ఆన్లైన్ కంపెనీలు ఎన్నో ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌కు విస్తరించాయి. కళ్లు చెదిరే జీత భత్యాలను ఎరగా వేసి సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న భారతీయ దిగ్గజాలను తీసుకొచ్చి బాస్‌లుగా కూర్చోబెట్టాయి. కానీ ఈ బాసుల్లో ఎక్కువ మంది కంపెనీల్లో నిలదొక్కుకోకుండానే మరో చోటుకు చెక్కేస్తున్నారు. ఫలితంగా కొన్ని స్టార్టప్ కంపెనీలు తెరవకుండా మూసుకోవాల్సి వస్తోంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి గతేడాది ఏప్రిల్ నెలలో పునీత్ సోని తప్పుకోగా, ఆ తర్వాత మే నెలలో స్నాప్‌డీల్ నుంచి చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ ఆనంద్ చంద్రశేఖరన్ ఏడాది తిరక్కుండానే తప్పుకున్నారు. 2014 ఫేస్బుక్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నమితా గుప్తా, రెస్టారెంట్ లిస్టింగ్ స్టార్టప్ కంపెనీ ‘జోమాతో’ నుంచి ఏడాది తిరక్కుండానే తప్పుకున్నారు. గతంలో లింక్డ్ఇన్ ఇండియాలో హెడ్‌గా పనిచేసిన నిశాంత్ రావు చెన్నైలో ఏర్పాటు చేసిన ‘ఫ్రెష్ డెస్క్’ స్టార్టప్ కంపెనీ నుంచి వారం కిందనే తప్పుకున్నారు. ఒకప్పుడు సిలికాన్ వ్యాలీలో ఒక వెలుగు వెలిగిన ఈ దిగ్గజాలు మాతృదేశంలోని కంపెనీల్లో ఎందుకు నిలదొక్కుకోలేక పోతున్నారు? వారు మరింత ఎక్కువ జీతాలకు ఆశపడి పోతున్నారా? కంపెనీ వాతావరణం నచ్చడం లేదా? ఇక్కడి పని సంస్కతికి అలవాటు పడలేకపోతున్నారా? మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా? అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో స్థానిక వ్యాపార కంపెనీలు మార్కెట్‌పైనా, వచ్చే లాభాలపైన ప్రధానంగా దష్టిని కేంద్రీకరిస్తే భారత్‌కు వచ్చే స్టార్టప్ కంపెనీలు అంకెల మీద, మార్కెట్లో వాటా మీద (లాభాలతో సంబంధం లేకుండా) దష్టిని కేంద్రీకరించడం ప్రాథమిక లోపమని బెంగళూరులోని ‘స్టాంటన్ చేజ్’ కంపెనీ మేనేజింగ్ పార్టనర్ కేఎన్ శ్రీపాద్ తెలిపారు. భారత్‌లో 30 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారని, వందకోట్ల మంది సెల్ఫోన్లను వాడుతున్నారన్న అంకెల ఆధారంగా మార్కెట్‌ను అంచనా వేస్తున్నారని ఆయన వివరించారు. సిలికాన్ వ్యాలీలో, భారత్‌లో బయటి నుంచి చూస్తే సజనాత్మకత ఒకటిగానే కనిపిస్తుందని, కానీ క్షేత స్థాయిలో తేడాలు ఉన్నాయని, ఆ తేడాల వల్లనే స్టార్టప్ కంపెనీల్లో ఎక్కువ మంది నిలదొక్కుకోలేక పోతున్నారని ‘హైడ్రిక్ అండ్ స్ట్రగుల్స్’ ఇంచార్జి పార్టనర్ వెంకట్ శాస్త్రీ తెలిపారు. వ్యాలీలో అనుభవజ్ఞులైన సీనియర్లు దొరికే వారని, వారి అనుభవం ఇక్కడి వారికి లేదని చెప్పారు. పైగా అక్కడి మార్కెట్ పరిణతి చెందినదని, ఏ రంగానికి ప్రాముఖ్యత ఉందో ఏ రంగాల్లో రాణించాలో మార్గనిర్దేశం చేసేవారు కూడా సిలికాన్ వ్యాలీలో ఎక్కువని ఆయన వివరించారు. ఇక్కడి కంపెనీల్లో వాతావరణం, అంటే ఉద్యోగుల మధ్య సఖ్యత, స్నేహభావం లేకపోవడం, పని సంస్కతి నచ్చక పోవడమే తాము భారత స్టార్టప్ కంపెనీల నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణమని తప్పుకుంటున్న నెట్ దిగ్గజాలు చెబుతున్నారు. అమెరికాలో టాలెంట్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలు ఇవ్వగా, భారత్‌లో బంధు, మిత్ర సంబంధాల కారణంగా అనర్హులు కూడా ఉద్యోగాలు పొందుతున్నారని, వారి వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. సిలికాన్ వ్యాలీలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు పని వేళలు ఉంటాయని, వారాంతంలో రెండు రోజులు సెలవులు ఉంటాయని, భారత్‌లో పనివేళలు ఎక్కువ కావడమే కాకుండా ఎక్కువ వరకు విదేశీ కస్టమర్ల కోసం రాత్రిళ్లు పనిచేయాల్సి వస్తోందని, స్టార్టప్ కంపెనీలవడం వల్ల కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని వారన్నారు. భారత్‌లో రెడ్ టేపిజం కూడా ఎక్కువగానే ఉందన్నారు. వివిధ రంగాల్లో ఏర్పాటు చేయాల్సిందిపోయి కొన్ని రంగాల్లోనే ఎక్కువ స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయడం కూడా భారత్‌లో జరుగుతున్న పొరపాటని, దాని వల్ల కంపెనీల మధ్య అనవసరమైన పోటీ పెరిగి మూసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. -
దుఃఖ సాగరంలో వంశీ కుటుంబం
-
అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేత
హైదరాబాద్: ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు యువకుడు అక్కడ దారుణ హత్యకు గురయ్యాడు. జాతి వివక్ష చర్యల్లో భాగంగానే ఈ హత్య జరిగిందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన వంశీ మామిడాల అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఎంస్ పూర్తిచేశాడు. శాన్ఫ్రాన్సిస్కో లోని ఓ స్టోర్‌లో పనిచేస్తున్న వంశీ.. గత రాత్రి విధులు ముగించుకొని తన గదికి తిరిగివస్తుండగా హత్యకు గురయ్యాడు. డ్రగ్స్ వాడిన ఓ తెల్లజాతి వ్యక్తి వంశీపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై అక్కడి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రంప్ వలసల నిషేధంపై సిలికాన్ వ్యాలీ ఫైర్
వాషింగ్టన్ : ఏడు ఇస్లామిక్ దేశాల నుంచి అమెరికాలోకి వలసలను నిషేధిస్తూ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీచేయడంపై సిలికాన్ వ్యాలీలోని టెక్నాలజీ దిగ్గజాల సీఈఓలు విమర్శల గళం వినిపించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్లతోపాటు యాపిల్, నెట్‌ఫ్లిక్స్, టెస్లా, ఫేస్బుక్, ఉబెర్ తదితర టాప్ అమెరికా కంపెనీలు ట్రంప్ చర్యలను తీవ్రంగా ఖండించాయి. ‘ఒక వలసదారుడిగా, కంపెనీ సీఈఓగా మా కంపెనీపై అదేవిధంగా దేశానికి, ప్రపంచానికి వలసలవల్ల కలిగే సానుకూల ప్రభావాన్ని నేను ప్రత్యక్షంగా చూశా. వలసలకు మా మద్దతు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది’ అని సత్య నాదెళ్ల లింక్్డఇన్ లో తన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. ఇలాంటి చర్యలు అమెరికాలోకి నిపుణుల రాకకు అడ్డంకిగా మారుతాయని పిచాయ్ వ్యాఖ్యానించారు. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జకర్బర్గ్ స్పందిస్తూ.. ‘అమెరికాను సురక్షితంగా ఉంచడం అవసరమే. ఇందుకు ప్రధానంగా ఎవరినుంచి ముప్పుఉందోవారిపై దృష్టిపెట్టాలి. అంతేకానీ ఉగ్రవాదానికి కారకులు కానివారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడం అమెరికా పౌరులందరి భద్రతను తగ్గిస్తుంది. ఎందుకంటే ఇలాంటి చర్యలకు వనరులను మళ్లించాల్సి ఉంటుంది కాబట్టి’ అని పేర్కొన్నారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా నిషేధాన్ని తీవ్రంగా ఖండించారు. ‘వలసదారులవల్లే మా కంపెనీ ఇంత గొప్ప విజయాన్ని సాధించగలిగింది. ఎవరికీ సమ్మతం కాని పాలసీ ఇది’ అన్నారు. -
23 నుంచి కూచిపూడి నృత్య సమ్మేళనం
కూచిపూడి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంయు క్త ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 25వరకు 5వ అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనం జరగనుందని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ తెలిపారు. సోమవారం కూచిపూడిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ సమ్మేళనంలో స్థానిక కూచిపూడి కళాకారులకు పెద్దపీట వేస్తామని వెల్లడించారు. 25వ తేదీన పదివేల మంది కళాకారులతో ఏకకాలంలో నాట్య ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు. -
హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ లో మార్పులు తేండి: సిలికాన్ వ్యాలీ
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాలను పెద్ద మొత్తంలో జారీ చేయడం వల్ల అమెరికా అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ మేరకు వీసాల జారీలో మార్పులు తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ను సిలికాన్ వ్యాలీ కోరింది. ఈ మేరకు అమెరికన్ సీఈవోల మేగజిన్ సీ-సూట్ లో లారెల్ స్ట్రాటజీస్ వ్యవస్ధాపక సీఈవో అలన్ హెచ్ ఫ్లీచ్ మన్ ఓ కథనం రాశారు. హెచ్-1బీ వీసాలను పెద్ద మొత్తంలో జారీ చేయడం ద్వారా నైపుణ్యం కలిగిన విదేశీయులకు అమెరికన్ కంపెనీల్లో పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు. దీని వల్ల అమెరికా కంపెనీలు తొందరగా ఎదగడంతో పాటు పెద్ద కంపెనీలతో పోటీపడతాయని చెప్పారు. హెచ్-1బీ వీసాల జారీలో మార్పులు తీసుకురావడం వల్ల అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. అమెరికన్ కంపెనీల్లో ప్రత్యేక ఉద్యోగాలకు మాత్రమే విదేశీయులను రిక్రూట్ చేసుకోవాలనేది హెచ్-1బీ వీసా జారీలో నియమమని చెప్పారు. హెచ్-1బీలో భారీ మార్పుల వల్ల అమెరికన్లు చేయలేని కొన్ని రకాల ఉద్యోగాలకు విదేశీయులను ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుందని రాశారు. వీసా ప్రోగ్రామ్ లో మార్పులు చేయడం వల్ల అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు, వేతనాలు పెరుగుతాయనే ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్-2012 రిపోర్టు ప్రకారం.. అమెరికన్ కంపెనీలు రిక్రూట్ చేసుకున్న విదేశీయుల వల్ల పెద్ద మొత్తంలో అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు చెప్పారు. హెచ్-1బీ వీసా కలిగిన ఒక్క ఉద్యోగి 2.62 మిలియన్ల అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడని పేర్కొన్నారు. 2011లో మెక్కిన్సే విడుదల చేసిన ఓ రిపోర్టులో అమెరికన్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల కొరత ఏర్పడుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఉన్న హెచ్-1బీ వీసా కోటా 30 ఏళ్ల క్రితం సరిపోయేదని అలన్ చెప్పుకొచ్చారు. నైపుణ్యం కలిగిన విదేశీ వర్కర్ల కొరత అమెరికన్ కంపెనీలను బాధిస్తోందని పేర్కొన్నారు. అమెరికా టెక్నాలజీ సెక్టారు అభివృద్ధికి హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ లో మార్పులు తీసుకువచ్చేందుకు రిపబ్లికన్ల మద్దతు ఇవ్వాలని కోరారు. -
సిలికాన్ వ్యాలీలో టీ హబ్ ఔట్‌పోస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘టీ హబ్ ఔట్ పోస్టు’ను ప్రవాస భారతీయుల సహకారంతో సిలికాన్ వ్యాలీలో మంత్రి కేటీఆర్ ఈ నెల 15న ప్రారంభించనున్నారు. ఈ నెల 12 నుంచి వారం రోజుల పాటు అమెరికాలో ఆయన పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఐటీ, పారిశ్రామిక, ఫార్మా రంగాలకు చెందిన సంస్థల ప్రతినిధులతో మంత్రి భేటీ అవుతారు. మూడు రోజుల పాటు మిన్నెపోలిస్‌లో జరిగే ‘అడ్వామెడ్-2016’ సదస్సులో 19న పాల్గొంటారు. వైద్య ఉపకరణాల తయారీలో దేశంలోనే అగ్రస్థానం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మెడికల్ డివెజైస్’ పార్కు ఏర్పాటును ప్రతిపాదిస్తోంది. ఈ సదస్సులో ఈ పార్కు ప్రత్యేకతలు వివరించే అవకాశం ఉంది. -
సిలికాన్ వ్యాలీని అధిగమించనున్న చైనా టెక్
బీజింగ్: ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్నైనా కాపీ కొట్టడం, ప్లాస్టిక్ వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ప్రపంచ మార్కెట్లోకి చౌకగా విడుదల చేయడం చైనా పారిశ్రామిక సంస్కృతిగా ఇంతకాలం ప్రపంచ దేశాలు భావిస్తూ వచ్చాయి. వాస్తవానికి ఇప్పుడు ఈ సీన్ మారుతోంది. సొంతంగా సృజనాత్మక ఆలోచనలతో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, అందుకు పేటెంట్లను రిజిస్టర్ చేసుకోవడం చైనాలో ఇప్పుడు ఎక్కువైంది. చైనాలోని శెన్జెన్ నగరంలో పేటెంట్ హక్కుల కోసం దాఖలవుతున్న దరఖాస్తులే అందుకు తార్కాణం. అన్ని రంగాల్లో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న చైనా, సాంకేతిక రంగంలో ప్రపంచ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న సిలికాన్ వ్యాలీని అధిగమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వ్యవస్థీకృత మూలధనం (వెంచర్ క్యాపిటల్) పెట్టుబడులతోపాటు ఫిన్‌టెక్, ఫార్మ రంగాల్లో కూడా దూసుకుపోతోంది. ఇంతకాలం పెట్టుబడుల ప్రాతిపదికన వ్యాపారాన్ని నిర్వహించిన చైనా ఇప్పుడు తన పంథాను మార్చుకొని వినియోగం ప్రాతిపదికన వ్యాపార పురోభివృద్ధికి కృషి చేస్తోంది. వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల్లో చైనా 2009 సంవత్సరంలో 0.9 అమెరికా బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో ప్రపంచంలో రెండో స్థానంలో నిలవగా 2014 సంవత్సరం నాటికి తమ పెట్టుబడులను ఏకంగా7.7 బిలియన్ డాలర్లకు పెంచుకొంది. వెంచర్ పెట్టుబడుల్లో ప్రపంచంలో ఇప్పటికీ చైనాది రెండో స్థానమే అయినప్పటికీ పెట్టుబడుల పెరుగుదలను పరిగణలోకి తీసుకుంటే అమెరికాను రానున్న కాలంలో అధిగమించే అవకాశం కనిపిస్తోంది. అమెరికా వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల్లో 2009లో 8.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ప్రపంచంలో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, 2014లో 24.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో అగ్రస్థానాన్ని నిలుపుకొంది. అమెరికా పెట్టుబడులు అప్పటికిప్పటికీ మూడింతలు పెరగ్గా, చైనా పెట్టుబడులు దాదాపు ఏడింతలు పెరిగాయి. ఆర్థిక సాంకేతిక రంగమైన ఫిన్టెక్లో కూడా అమెరికాలోని కాలిఫోర్నియా తర్వాత చైనానే రెండో స్థానంలో కొనసాగుతోంది. సృజనాత్మక రంగంలో చైనా వేగంగా ముందుకు దూసుకెళ్లడానికి చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రణాళికలే దోహదపడుతున్నాయి. చైనా ప్రభుత్వం స్థానిక మౌళిక సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు పారిశ్రామిక రంగానికి ఎన్నో ప్రోత్సహకాలు ఇస్తున్నాయి. కొత్త కంపెనీలకు రెండేళ్లపాటు నూటికి నూరు శాతం పన్నులను వెనక్కి చెల్లించడం లాంటి చర్యలు తీసుకొంటోంది. పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు దోహదపడే అనేక పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని అన్ని యూనివర్శిటీల్లో లైఫ్ సెన్సైస్ గ్రాడ్యువేట్లను ప్రోత్సహిస్తోంది. అలాగే విదేశీ యూనివర్శిటీల్లో చదువుతున్న విద్యార్థులను దేశానికి రప్పించేందుకు ప్రోత్సహకాలు ఇస్తోంది. పాశ్చాత్య యూనివర్శిటీలో గ్రాడ్యువేషన్ పూర్తి చేసుకున్న చైనా విద్యార్థులు ఏటా దాదాపు 80 వేల మంది మాతృ దేశానికి తరలివెళ్లి వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. -
నష్టాలోనే టెస్లా భవిష్యత్ ఆశలు
అమెరికాకు చెందిన ప్రముఖ టెస్లా మోటార్స్ కంపెనీ వరుసగా 13వ త్రైమాసికం కూడా నష్టాలనే మూటకట్టుకుంది. తన వెహికిల్స్, బ్యాటరీ ఫ్యాక్టరీస్‌పై ఎక్కువగా ఖర్చు చేయడంతో ఊహించిన దానికంటే అధికంగానే నష్టాలను నమోదుచేసినట్టు కంపెనీ వెల్లడించింది. సిలీకాన్ వ్యాలీకి చెందిన ఈ కంపెనీ రెండో త్రైమాసికంలో నికర నష్టాలు 293.2 మిలియన్ డాలర్లుగా నమోదుచేసినట్టు కంపెనీ సీఈవో ఎలెన్ మస్క్ పేర్కొన్నారు. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ నష్టాలు 184.2 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే మొత్తం రెవెన్యూలు టెస్లా పెంచుకుంది. రెవెన్యూలను 33 శాతం పెంచుకుని 1.27 బిలియన్లగా నమోదుచేసింది. సెకండ్ ఆఫ్‌లో స్థూల మార్జిన్లు 2-3 శాతం పెంచుకుంటామని టెస్లా చెప్పింది. కంపెనీ నష్టాలను మూటకట్టుకున్నప్పటికీ, భవిష్యత్తులో టార్గెట్లను కంపెనీ భారీగానే పెట్టేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తన స్టోర్లు ఓపెన్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు పేర్కొంది. మూడేళ్లలో వాహనాల ఉత్పత్తిని పది రెట్లు పెంచుకుంటామని, సోలార్ ప్యానెల్ ఇన్స్టాలర్ సోలార్ సిటీ కార్పొరేషన్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. 2016 సెకండ్ ఆఫ్‌లో 50వేల కొత్త మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను డెలివరీ చేసేందుకు పూనుకుంటున్నట్టు కంపెనీ సీఈవో ఎలెన్ మస్క్ చెప్పారు. త్వరలోనే రాబోతున్న మోడల్ 3 సెడాన్ కోసం ప్రీపేర్ అవుతున్నామని, 2.25 బిలియన్ మూలధన వ్యయాన్ని భరించేందుకు సిద్దంగా ఉన్నట్టు స్పష్టంచేశారు. ఒకవేళ కంపెనీ నిర్దేశించుకున్న ఉత్పత్తిని, డెలివరీ లక్ష్యాలను చేధిస్తే, నాన్-గ్యాప్ లాభాల్లో తాము గ్రేట్ చాన్స్‌ను కొట్టేసినట్టేనని చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జాసన్ వీలర్ మార్కెట్ విశ్లేషకుల కాన్ఫరెన్స్‌లో తెలిపారు. 2013లో మొదటిసారి టెస్లా త్రైమాసిక లాభాలను టెస్లా నమోదుచేసింది. వరుసగా రెండో ఏడాది కూడా వెహికిల్ డెలివరీ టార్గెట్ ను కోల్పోయినట్టు గత నెలలలో కంపెనీ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం నిర్దేశించుకున్న కంపెనీ వార్షిక టార్గెట్‌ను టెస్లా చేరుకుంటుందా అని విశ్లేషకులు సందేహం వ్యక్తంచేస్తున్నారు. టెస్లా రెండో క్వార్టర్లో కేవలం 14,402 వెహికిల్స్ ను మాత్రమే డెలివరీ చేసింది. నిర్దేశించుకున్న 17వేల టార్గెట్ కంటే కూడా ఇవి తక్కువగానే నమోదయ్యాయి. -
తెలుగు భాషకు దక్కిన మరో గౌరవం
సాన్ జోస్(యూఎస్): కాలిఫోర్నియాలోలోని ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన స్కూల్ బోర్డ్ సర్వసభ్య సమావేశంలో సిలికానాంధ్ర మనబడి నిర్వహించే తెలుగు 3, తెలుగు 4 తరగతులకు ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ గుర్తింపును మంజూరు చేశారు. 2014లో సిలికానాంధ్ర మనబడి నిర్వహించిన తెలుగు1, తెలుగు2 కోర్సులకు ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఈ గుర్తింపు ద్వారా, 4 సంవత్సరాల ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ నిర్ధేశించే.. ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వ విద్యాలయాల్లో చేరడానికి మనబడి విద్యార్ధులు అర్హత సాధిస్తారు. ఈ అవకాశాన్ని ఫ్రీమాంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని తెలుగు విద్యార్ధులందరూ ఉపయోగించుకుని తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు నేర్చుకోవడమే కాకుండా ఉన్నత విద్యకు అవసరమైన ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్స్ కూడా సాధించవచ్చని మనబడి డీన్ రాజు చమర్తి తెలిపారు. 2016-17 విద్యా సంవత్సరానికి, తరగతులు మిషన్ సానొసే హై స్కూల్లో సెప్టంబర్ 10 నుంచి ప్రారంభం అవుతాయని పాఠ్య ప్రణాళికా విభాగం ఉపాధ్యక్షులు శాంతి కూచిభొట్ల తెలిపారు. ఈ కోర్సులో చేరదలుచుకున్న విద్యార్ధులు, మనబడి.సిలికానాంధ్ర.ఓఆర్జీ(manabadi.siliconandhra.org) ద్వారా నమోదు చేసుకోవాలని శాంతి కూచిభొట్ల సూచించారు. ఈ స్కూల్ బోర్డ్ ద్వారా పూర్తి స్థాయి ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపు సాధించడంలో సంచాలకులు శ్రీదేవి గంటి విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దీనబాబు కొండుభట్ల, శరత్ వేట, భాస్కర్ రాయవరం, డాంజి తోటపల్లి, వెంకట్ కొండ, ఫణి మాధవ్ కస్తూరి పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధిలో అమెరికా భాగస్వామ్యం
- రెండు వారాల పర్యటనపై మంత్రి కేటీఆర్ - వ్యాపార, వాణిజ్య ఒప్పందాల్లో సఫలమయ్యాం - పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా తెలంగాణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించేందుకు అమెరికాలోని పలు రాష్ట్రాలు సానుకూలత వ్యక్తం చేశాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. అమెరికాలోని పలు రాష్ట్రాలతో వాణిజ్య, వ్యాపార సంబంధాలు ఏర్పర్చుకోవడంలో తెలంగాణ సఫలమైందని పేర్కొన్నారు. రెండు వారాలపాటు అమెరికాలో పర్యటించి వచ్చిన మంత్రి కేటీఆర్ ఆ విశేషాలతో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి హోదాలో తమ అమెరికా పర్యటన విజయవంతమైందని తెలి పారు. పలురాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యామని, తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, నూతన పారిశ్రామిక విధా నం గురించి వివరించామని వెల్లడించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానానికి ఆకర్షితులైన ప్రఖ్యాత కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేం దుకు సుముఖత వ్యక్తం చేశాయని, ఐటీ, ఇన్నోవేషన్ రంగాల్లో తమ విధానాలను డ్రీమ్‌వర్క్స్ సీఈవో జెఫ్రీ కాట్జన్బర్గ్ ప్రశంసించారని వివరించారు. వచ్చే ఏడాది అక్టోబర్‌లో సిలికాన్‌వ్యాలీలో జరిగే ‘స్టార్టప్ ఫెస్టివల్’కు తనకు ఆహ్వానం అందినట్లు వెల్లడించారు. సిలికాన్ వ్యాలీలో టీ-హబ్ ఔట్‌పోస్టు సిలికాన్ వ్యాలీలోని వివిధ కంపెనీలు, పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపినట్లు కేటీఆర్ వెల్లడించారు. ప్రవాస భారతీయుల సహకారంతో సిలికాన్‌వ్యాలీలో ‘టీ-హబ్ ఔట్‌పోస్టు’ ఏర్పాటుకు మార్గం సుగమమైందని చెప్పారు. ఐటీ, బయోటెక్నాలజీ, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, క్లీన్టెక్ రంగాల్లోని కంపెనీలతో జరిగిన సమావేశాలు ఫలితాన్నిచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఐటీ దిగ్గజ కంపెనీలతో జరిగిన సమావేశాలు రాష్ట్రంలో ఐటీ రంగానికి ఊతమిస్తాయని వెల్లడించారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేలా పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించగలిగామని వెల్లడించారు. -
పెట్టుబడులకు ఎన్నారైల సేవలు
- సిలికాన్ వ్యాలీలో ఎన్నారైలతో కేటీఆర్ సమావేశం - వ్యాలీలో టి-హబ్ ఔట్‌పోస్టు ఏర్పాటుకు యోచన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడుల కోసం అమెరికాలోని వివిధ రంగాల్లో విజయవంతమైన తెలంగాణ ఎన్నారైల సేవలను వినియోగించుకోనున్నట్లు మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణ గడ్డ నుంచి చాలా మంది కొన్ని దశాబ్దాల కిందటే అమెరికాలో ఉద్యోగాలు ప్రారంభించి, వివిధ కంపెనీల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. మరికొంత మంది సొంత కంపెనీలు నెలకొల్పారని, ఇంకొందరు వెంచర్ క్యాపిటలిస్టుగా రాణిస్తున్నారన్నారు. ఇలా వివిధ రంగాల్లో విజయవంతమైన ఎన్నారైలతో మంత్రి సిలికాన్ వ్యాలీలో సమావేశమయ్యారు. మెదక్ జిల్లా నుంచి అమెరికాలో స్థిరపడిన ఓం నల్లమాసు కీలక పాత్ర పోషిస్తున్న అప్లైడ్ మెటీరియల్స్ కంపెనీలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజురెడ్డి, రాంరెడ్డి, కిట్టు కొల్లూరి వంటి వెంచర్ క్యాపిటలిస్టులు, వివిధ కంపెనీల్లో టాప్ మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న 40 మంది తెలంగాణ ఎన్నారైలు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ముఖ్యంగా పారిశ్రామిక విధానం, టీ-హబ్, ఐటీ పాలసీ వంటి అంశాలను వివరించిన మంత్రి.. తెలంగాణ ప్రభుత్వం వారి నుంచి కోరుకుంటున్న సహాయ సహకారాలను తెలిపారు. సిలికాన్ వ్యాలీలో ఏర్పాటు చేయబోతున్న టీ-హబ్ అవుట్ పోస్టు ఆలోచనను వారితో పంచుకున్నారు. ఈ ఆలోచనను అభినందించిన ఎన్నారైలు.. అందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అవుట్ పోస్టు ఏర్పాటు, అందులో స్టార్టప్‌ల ఎంపిక, వాటికి సిలికాన్ వ్యాలీలో వెంచర్ క్యాపిటలిస్టులతో ఆర్థిక సహకారం వంటి అంశాల్లో పూర్తి సహకారం ఇస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం అత్యుత్తమైందని, రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను అమెరికాలోని కంపెనీలకు తెలపాలని మంత్రి కోరారు. రాజకీయ స్థిరత్వం, సమర్థవంతమైన పాలన, పారదర్శక విధానాలున్న కొత్త రాష్ట్రాన్ని కంపెనీలకు పరిచయం చేయాలన్నారు. ఎన్నారైల సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను రూపకల్పన చేస్తోందని, తన పర్యటన ముగించుకుని వెళ్లిన వెంటనే సీఎంతో చర్చించి పూర్తి వివరాలతో ప్రకటన చేస్తానని తెలిపారు. -
క్లీన్టెక్ ఆవిష్కరణలపై కేటీఆర్ అధ్యయనం
- ఐ-హబ్‌లో బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ తయారీపై ఆసక్తి - సిలికాన్ వ్యాలీలో టెస్లా ఎలక్ట్రిక్ కారులో ప్రయాణం - ఇలాంటి పర్యావరణహిత టెక్నాలజీలు భారత్‌కూ అవసరమని వెల్లడి సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) ఆదివారం సంప్రదాయేతర ఇంధన వనరులు, నూతన ఆవిష్కరణలపై అధ్యయనం చేశారు. కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన క్లీన్టెక్ ఇంక్యుబేటర్, ఐ-హబ్‌లో నెలకొల్పిన ఇంధన వనరుల స్టార్టప్ పరిశ్రమలను పరిశీలించారు. ఔత్సాహిక పరిశోధకులతో పలు అంశాలపై చర్చించారు. ఐ-హబ్‌లో రీపర్పస్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించిన బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ గ్లాస్ కేటీఆర్‌ను అమితంగా ఆకర్షించింది. సాధారణ ప్లాస్టిక్ గ్లాసు పారవేశాక మట్టిలో కలిసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుంది. అదే రీపర్పస్ సంస్థ తయారుచేసిన ప్లాస్టిక్ గ్లాసు కేవలం ఆరు నెలల్లో మట్టిలో కలిసిపోతుంది. ఇలాంటి పర్యావరణ హితమైన టెక్నాలజీ ఇప్పుడు అమెరికాలో సంచనాలు సృష్టిస్తోందని, ఇటువంటి సాంకేతికత భారతదేశానికి కూడా ఎంతో అవసరమని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి వినూత్న ఆవిష్కరణలు దోహదపడుతాయని చెప్పారు. సిలికాన్ వ్యాలీలో పలు కంపెనీల సందర్శన కోసం టెస్లా మోడల్ ఎక్స్ (ఎలక్ట్రిక్) కారులో కేటీఆర్ పర్యటించారు. దానిని కేటీఆర్ స్వయంగా నడిపి చూశారు. 2003లో ప్రారంభమైన టెస్లా కంపెనీ ఇంధన రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుతోందని మంత్రి పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీలో జరుగుతున్న పరిశోధనలు టీ-హబ్ ఔత్సాహిక పరిశోధకులకు స్పూర్తినిస్తాయని చెప్పారు. టెస్లా కారు ప్రత్యేకతలు ఇవీ.. టెస్లా సంస్థ తాజాగా విడుదల చేసిన మోడల్ ఎక్స్ ఎలక్ట్రిక్ కారు పక్షిలా రెక్కల ఆకారంలో తెరుచుకునే డోర్లతో విభిన్నంగా ఉంటుంది. కారు ముందు అద్దం కూడా పనోరమిక్ వ్యూ కలిగి అన్ని దిక్కులను, పైకి చూసే వెసులుబాటు ఉంటుంది. కేవలం నాలుగు సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అంతేకాదు చుట్టూ ఉన్న వాహనాలను, ట్రాఫిక్ అలర్ట్స్‌ను ఎప్పటికప్పుడు డ్రైవింగ్ సీట్లో ఉన్నవారికి అందిస్తుంది. -
సిలికాన్ వ్యాలీలో టీ హబ్ ఔట్ పోస్ట్: కేటీఆర్
వాషింగ్టన్: సిలికాన్ వ్యాలీలో టీ హబ్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం సిలికాన్ వ్యాలీలో ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో స్టార్ట్ అప్ కంపెనీలకు సహకరించాలని ఈ సందర్భంగా సిలికాన్ వ్యాలీలోని కంపెనీల ప్రతినిధులను కేటీఆర్ కోరారు. అలాగే తెలంగాణ ఐటీ పాలసీ పారిశ్రామిక విధానాన్ని కేటీఆర్ ఈ సదస్సులో వివరించారు.ఈ సదస్సుకు ప్రముఖ కంపెనీల అధికారులతోపాటు ఇన్వెస్టర్లు హాజరయ్యారు. -
సిలికాన్ వ్యాలీలో ఘనంగా మనబడి స్నాతకోత్సవం
సిలికాన్ వ్యాలీ : మనబడి విద్యార్ధులను చూస్తుంటే తెలుగుభాష భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతోందని తెలుస్తోందని డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. మనబడి నిర్వహిస్తున్న ఈ అద్భుత కార్యక్రమం అందరికీ ఆదర్శ ప్రాయమైనది అని స్పష్టం చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా తెలుగు భాషా పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సిలికానాంధ్ర మనబడి హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధంగా నిర్వహిస్తున్న 'మనబడి ' స్నాతకోత్సవం ఆదివారం శాన్ హోసే లోని పార్క్ సైడ్ కన్వెన్షన్ సెంటర్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ శ్రీ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ... ఆంధ్రులు ఆరంభ శూరులు అని అంటుంటారని ... కానీ సిలికానాంధ్రులు ఏదైనా మొదలు పెడితే విజయం సాధించే వరకూ వెనుతిరగరని రుజువు చేశారని 150 మందితో మొదలుపెట్టి నేడు 6000 మందికి పైగా విద్యార్ధులు చదువుకునే విధంగా ఈ విద్యా వ్యవస్థను నిర్వహించడం ద్వారా సిలికానాంధ్ర మనబడి నిర్వాహుకులు ఆ సత్యాన్ని నిరూపించారని కొనియాడారు. 2015-16 విద్యా సంవత్సరానికి తెలుగు విశ్వ విద్యాలయం నిర్వహించిన పరీక్ష విశేషాలను రిజిస్ట్రార్ ఆచార్య తోమాసయ్య వివరిస్తూ మనబడి విద్యార్ధులు భాషను లోతుగా అభ్యసించడంలో చూపుతున్న అంకిత భావం తమను ముగ్ధులను చేసిందని ప్రశంసించారు. 2007లో ' మనబడి ' ప్రారంభించింది మొదలు అనేక అద్భుతాలను సృష్టిస్తూ, కొద్దికాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు భాషా బోధన కార్యక్రమంగా పేరు పొందిందని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ సంతోషం వ్యక్తం చేశారు. మనబడి అద్యక్షులు రాజు చమర్తి ప్రసంగిస్తూ, మనబడి 10 కి పైగా దేశాల్లో, అమెరికాలో దాదాపు 35 రాష్ట్రాలలో 250 కి పైగా శాఖలతో 1000 కి పైగా భాషా సైనికులతో ఒక భాషాఉద్యమంలా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. ఈ ఏడాది 6000 మంది విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్నారని ఆనంద్ వెల్లడించారు. మనబడి ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ... తెలుగు విశ్వవిద్యాలయం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ మనబడి కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. ఈ కోర్సు చదివిన వారికి అమెరికాలోని వివిధ స్కూల్ డిస్ట్రిక్ట్‌లో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్స్ లభిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య తోమాసయ్య, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అధిపతి డా. మునిరత్నం నాయుడు, పరీక్షల విభాగం అధిపతి డా. వై. రెడ్డి శ్యామల, ప్రజా సంబంధాల అధికారి డా. జె.చెన్నయ్య, సిలికానాంధ్ర వైస్ చైర్మెన్ దిలీప్ కొండిపర్తి, అద్యక్షులు సంజీవ్ తనుగుల, రవీంద్ర కూచిభొట్ల, కిషోర్ బొడ్డు, ప్రభ మాలెంపాటి, మృత్యుంజయుడు తాటిపామల, శ్రీరాం కోట్ని, మనబడి ఉపాద్యక్షులు శాంతి కూచిభొట్ల, భాస్కర్ రాయవరం, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, ప్రియ తనుగుల, స్నేహ వేదుల, అనిల్ అన్నం, జయంతి కోట్ని, పాత్రికేయులు బుద్ధవరపు జగన్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు. -
తెలుగుభాషకు అద్భుత భవిష్యత్తు
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా తెలుగు బాష పరిరక్షణ కోసం హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధంగా సిలికానంధ్ర నిర్వహిస్తున్న 'మనబడి' స్నాతకోత్సవం ఆదివారం శాన్‌హూసేలోని పార్క్‌సైడ్ కన్వెన్షన్ సెంటర్లో వైభవంగా జరిగింది. ఈ స్నాతకోత్సవంలో పద్మభూషణ్ పురస్కార గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనబడి విద్యార్థులకు వారు పట్టాలు ప్రదానం చేశారు. అమెరికా, కెనడా, హాంకాంగ్ మొదలైన దేశాల్లోని 1019 మంది విద్యార్థులు ఈ ఏడాది ఉత్తీర్ణులయ్యారు. ముఖ్య అతిథి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. మనబడి నిర్వహిస్తున్న కార్యక్రమం అందరికీ ఆదర్శప్రాయమైందని చెప్పారు. తెలుగుభాష భవిష్యత్ గొప్పగా ఉండబోతోందని ఆయన అన్నారు. ఆంధ్రులు ఆరంభ శూరులు అని అంతా అంటారని, కానీ సిలికానాంధ్రులు ఏదైనా మొదలుపెడితే విజయం సాధించే వరకూ వెనుతిరగరని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి ప్రశంసించారు. 150 మందితో మొదలుపెట్టిన నేడు ఆరువేల మందికి పైగా విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఈ విద్యావ్యవస్థను నిర్వహిస్తున్న సిలికానాంధ్ర మనబడి నిర్వాహకులను కొనియాడారు. 2015-16 విద్యా సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్ష విశేషాలను రిజిస్ట్రార్ ఆచార్య థోమాసయ్య వివరిస్తూ మనబడి విద్యార్థులకు తెలుగుభాషపై గల అంకితభావం తమను ముగ్ధులను చేసిందని ప్రశంసించారు. 2007 లో ప్రారంభమైన 'మనబడి' ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూ అనతికాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు భాషా బోధన కార్యక్రమంగా పేరొందిందని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. మనబడి పదికి పైగా దేశాల్లో, అమెరికాలో దాదాపు 35 రాష్ట్రాలలో 250కి పైగా శాఖలతో వందకు పైగా భాషా సైనికులతో భాషా ఉద్యమంలా వ్యాప్తి చెందుతోందని మనబడి అధ్యక్షులు రాజు చామర్తి తెలిపారు. ఈ ఏడాది ఆరువేల మంది విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ మనబడి ముందుకు కొనసాగుతోందని మనబడి ఉపాధ్యక్షులు దీనబాబు అన్నారు. ఈ కోర్సు చదివిన వారికి అమెరికాలోని వివిధ స్కూల్ డిస్ట్రిక్ ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్స్ లభిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య థోమాసయ్య, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అధిపతి మునిరత్నం నాయుడు, పరీక్షల విభాగం అధిపతి వై. రెడ్డి శ్యామల, ప్రజాసంబంధాల అధికారి జుర్రు చెన్నయ్య, సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి, అధ్యక్షులు సంజీవ్ తనుగల, రవీంద్ర కూచిభొట్ల, కిషోర్ బొడ్డు, ప్రభ మాలెంపాటి, మృత్యుంజయుడు తాటిపాముల, శ్రీరాం కోట్నీ, మనబడి ఉపాధ్యక్షులు శాంతి కూచిభొట్ల, భాస్కర్ రాయవరం, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, ప్రియ తనుగుల, స్నేహ వేదుల, అనిల్ అన్నం, జయంతి కోట్ని, పాత్రికేయులు బుద్ధవరపు జగన్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాలీ నిపుణులకు.. ఇన్ఫోసిస్ ఎర
బెంగళూరు : భారత రెండో అతిపెద్ద సాప్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ భవిష్యత్ పై ఎక్కువ దృష్టి సారిస్తోంది. కంపెనీ కొత్తగా చేపట్టిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్లాట్ ఫాం 'మన' ను విజయవంతం చేయడానికి, ఉత్పత్తులను అభివృద్ధి చేయడం కోసం ప్రపంచంలో టెక్ దిగ్గజాల పుట్టినిల్లు సిలికాన్ వ్యాలీ నిపుణులను ఇన్ ఛార్జ్ లుగా నియమించుకోవాలనుకుంటోంది. సిలికాన్ వ్యాలీలో కంపెనీ ప్రొడక్ట్ లను, ప్లాట్ ఫాం టీమ్ లను పెంచుకునేందుకు చూస్తున్నామని ఇన్ఫోసిస్ ఆర్కిటెక్చర్ అండ్ టెక్నాలజీ అధినేత నవీన్ బుదిరాజా తెలిపారు. ఎక్స్ పర్ట్ ట్రాకింగ్ ప్రొగ్రామ్ ద్వారా ప్రత్యేక సూపర్ కోడర్స్ టీమ్ ను రెండింతలు చేసుకున్నామని వెల్లడించారు. ఈ టీమ్ ను మరింత పెంచుకోనున్నామని చెప్పారు. ఈ ప్రోగ్రాం ద్వారా కొత్త ప్రాంతాల్లో టెక్నాలజీని అభివృద్ధిచేసి, రెవెన్యూలను పెంచుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిపారు. కంపెనీ క్లౌడ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అధినేత శామ్ సన్ డేవిడ్ ను ఎక్స్ పర్ట్ సర్వీసుల టీమ్ కు అధినేతగా నియమించినట్టు తెలిపారు. ఇన్ఫోసిస్ కొత్తగా చేపట్టిన సాప్ట్ వేర్ ప్లాట్ ఫాం 'మన' లాంటి వాటిని విజయవంతం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషిస్తారని కంపెనీ ఆశిస్తున్నట్టు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా కంపెనీలో నెలకొన్న చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. బిగ్ డేటా ప్లాట్ ఫాం, ఆటోమేషన్ ప్లాట్ ఫాం, మేథస్సు చుట్టూ తాము చేస్తున్న పనిని 'మన' ప్రొగ్రామ్ ఓ ఉన్నతస్థితికి తెస్తుందని ఆశించారు. -
గూగుల్, ఫేస్‌బుక్‌లకు వరదముప్పా..?
గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మనుషులకే కాదు. సంస్థలకూ నష్టమే. గరిష్ట ఉష్ణోగ్రతలతో భూమిపై నీటిశాతం పెరగడం సాప్ట్ వేర్ సంస్థలకు ముప్పు తెచ్చి పెడుతుంది. సిలికాన్ వాలీ దిగ్గజాలుగా ఉన్న ఫేస్ బుక్, గూగుల్, సిస్కో క్యాంపస్ లకు వరద ముప్పు తీవ్రంగా ఉండబోతుందని తెలుస్తోంది. వరద ముప్పుతో ఈ క్యాంపస్ లు మునిగిపోతాయని శాస్త్రవేత్తలు ఈ సంస్థలకు హెచ్చరికలు కూడా జారీచేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా దక్షిణ దిక్కును సిలికాన్ వాలీగా పిలుస్తారు. ఈ ఏరియా ప్రపంచంలోనే అతిపెద్ద హైటెక్ కంపెనీలకు నిలయంగా పేరొందింది. ఈ ప్రాంతంలోనే ఫేస్ బుక్, గూగుల్ ప్రధాన కార్యాలయాలున్నాయి. గ్లోబల్ వార్మింగ్ తో సముద్ర మట్టాలు పెరిగితే ఈ ప్రాంతం వరద ముప్పుకు గురవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల స్థాయిని తగ్గించుకున్నా ఈ తీవ్ర ప్రమాదం నుంచి ఆ సంస్థలు బయటపడలేవని తెలిపారు. సోషల్ మీడియా దిగ్గజంగా పేరొందిన ఫేస్ బుక్ కొత్త క్యాంపస్ వరద ముప్పుతో ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశముందని రిపోర్టులో తెలిపారు. తొమ్మిది ఎకరాల గార్డెన్ పైకప్పుతో 4 లక్షల 30వేల చదరపు అడుగుల సముదాయంలో ఈ కొత్త క్యాంపస్ ను శాన్ ఫ్రాన్సిస్కో బే తీరప్రాంతంలో నెలకొల్పారు. ఆ ప్రాంతంలోనే మెన్లో పార్క్ బేస్ ను కూడా నెలకొల్పి క్యాంపస్ విస్తీర్ణాన్ని పెంచారు. అయితే ఈ క్యాంపస్ తీవ్ర ప్రమాదంలో ఉందని, అసలు కొత్త క్యాంపస్ కోసం ఫేస్ బుక్ ఈ స్థలాన్ని ఎలా ఎంచుకున్నదో తెలియడం లేదని కాలిఫోర్నియా బే పరిరక్షణ, అభివృద్ధి కమిషన్ సీనియర్ ప్లానర్ లిండీ లొవె అన్నారు. ఈ శతాబ్దం చివరికి 1.6 అడుగుల సముద్ర మట్టాలు ఎత్తు పెరిగితే, ఫేస్ బుక్ ను వరద ముప్పు నుంచి కాపాడలేమని తెలిపారు. అదేవిధంగా అట్లాంటికా సముద్ర మట్టాలు 6 అడుగుల పెరిగితే, సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, టెక్నాలజీ కంపెనీ సిస్కో రెండూ కూడా తుడిచిపెట్టుకొని పోతాయని హెచ్చరికలు జారీ చేశారు. గ్లోబల్ వార్మింగ్ తో సముద్ర మట్టాలు పెరిగితే బే ఏరియాలోని 100 బిలియన్ డాలర్ల వాణిజ్య, నివాస ఆస్తులు ప్రమాదానికి గురవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీచేశారు. -
అమిత్ సింఘాల్ రిటైర్.. గూగుల్‌కు తీరని లోటు
శాన్ఫ్రాన్సిస్కో: గూగుల్ సంస్థలో టెక్నాలజీని అభివృద్ధి పరచడంలో 'అల్పాబెట్' సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సింఘాల్(48) పాత్ర మరువలేనిది. అమిత్ ఈ నెల 26న పదవి విరమణతో గూగుల్‌కు వీడ్కోలు పలకనున్నారు. అమిత్ నిష్క్రమణ తమ సంస్థకు తీరని లోటుగా గూగుల్ భావిస్తోంది. ప్రస్తుతం ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్‌లో పనిచేస్తున్న జాన్ గియానేంద్రియా, అమిత్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. భారత్‌కు చెందిన సింఘాల్ 16 ఏళ్ల కిందట గూగుల్లోకి అడుగు పెట్టారు. అమిత్ పదవి విరమణ అనంతరం.. తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నట్టు తెలిపారు. కార్నెల్ నుంచి ఆయనకు కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్ లభించింది. గూగుల్లోకి రాకముందు ఏటీ అండ్ టీ ల్యాబ్స్‌లో ఆయన పనిచేశారు. గూగుల్‌లో చేరిన కొంతకాలంలోనే అల్గారిథమ్‌లను తిరిగిరాయడంలో తొలి విజయం సాధించారు అమిత్. గూగుల్ సెర్చ్ ఇంజిన్ రూపొందించడంలో భాగంగా స్పెల్ చెక్ వంటి ఫీచర్లతో అమిత్ ఎంతగానో కృషి చేశారు. -
దీని ‘దుంప’తెగ.. ఏం రేటు!!
ఈ బంగాళదుంప ఫొటోను చూస్తే సాదాసీదాగా కనిపిస్తోంది కదూ. కానీ ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫొటోల్లో ఒకటి. దీన్ని గతేడాది 10 లక్షల డాలర్లకు విక్రయించారు. కెవిన్ అబోస్ అనే ఫొటోగ్రాఫర్ దీన్ని చిత్రీకరించారు. ఆయన సిలికాన్ వ్యాలీ టెక్‌లోని ప్రముఖ వ్యాపారులకు ఫొటో షూట్ తీసి భారీ మొత్తంలో వసూలు చేస్తుంటాడు. ఒక ఫొటో షూట్ కోసం లక్షా 50వేల డాలర్ల నుంచి అత్యధికంగా 5లక్షల డాలర్ల వరకు తీసుకుంటాడు. ఇతనిలో దీంతో పాటు ఫైన్ ఆర్ట్ ఫొటోగ్రాఫర్(లలిత కళా ఛాయాకారుడు) కూడా దాగి ఉన్నాడు. దాని మూలంగానే ఈ ఫొటో రూపుదిద్దుకుంది. ఎన్ని రకాలుగా ఉన్నా మనుషులుగా గుర్తించవచ్చని.. అలాగే బంగాళదుంపలను కూడా అని.. అందుకే తనకు ఇవి ఇష్టమని ఆయన తెలిపాడు. కాగా, ఇలాంటి ఫొటోలను సేకరించే పీటర్ అనే ఒక సంపన్న వ్యక్తి 2015లో కెవిన్ ఇంటిని సందర్శించినప్పుడు ఈ బంగాళదుంప ఫొటోను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం టాప్ 20 అత్యంత విలువైన ప్రారంభ కొనుగోలు ధరల్లో దీనికి చోటుకు లభించింది. -పారిస్ -
ఆ వర్సిటీల్లో అంతా భారత విద్యార్థులే
కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ వర్సిటీ, నార్త్‌వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీల్లో చేరుతున్న వారిలో 90 శాతానికిపైగా భారత విద్యార్థులే. గత ఏడాది జూన్-ఆగస్టు మధ్య ఈ వర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల జీఆర్ఈ 275 లోపే. ఆంగ్ల భాషలో పట్టు తెలుసుకోవడానికి పెట్టే టోఫెల్ పరీక్షలో ఈ విద్యార్థుల స్కోర్ 60 లోపే. అంతేకాదు ఈ కాలేజీల్లో చేరిన భారత విద్యార్థుల్లో బ్యాక్లాగ్ (నాలుగేళ్ల బీటెక్ కోర్సులో ఫెయిలై మళ్లీ పరీక్ష రాసిన) లేకుండా ఉత్తీర్ణులైన వారు ఒక్కరు కూడా లేరు. ఈ రెండు విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులందరూ కనిష్టంగా 11, గరిష్టంగా 16 బ్యాక్‌లాగ్‌లు ఉన్నవారే. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఈ వర్సిటీల్లో చదువుతున్న 90 శాతం మంది భారత విద్యార్థుల్లో 67 శాతం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. అమెరికా వస్తే ఏదో ఒక ఉద్యోగం చేసి నాలుగు డాలర్లు వెనకేసుకోవచ్చన్నదే వీరి మొదటి ప్రాధాన్యత. అందువల్లే తరగతుల్లో చేరిన నాటి నుంచే వారి గ్రాడ్యుయేషన్ కంటే ముందే పార్ట్‌టైమ్ ఉద్యోగాల వెతుకులాట మొదలవుతుంది. ఆ ఉద్యోగం కాస్త బాగుండి నెలకు 2 వేల డాలర్లు వస్తాయనుకుంటే తరగతులకు కూ డా డుమ్మా కొడతారు. ఒక్క కాలిఫోర్నియాలోనే కాదు న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో వేల మంది భారత విద్యార్థులకు ‘ఐ20’ సమకూర్చే వర్సిటీలు ఎన్నో ఉన్నాయి. కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో చదువుకునేందుకు వెళుతున్న వారిని అక్కడి సీబీటీ అధికారులు ప్రశ్నించి, అసలు కూపీ లాగుతున్నారు. విద్యార్థులు పొంతన లేని జవాబులు చెబితే ఇంటర్వ్యూ చివర్లో వీసా రద్దు చేస్తున్నామని, వెనక్కి పంపుతున్నామని చెప్పేస్తారు. అంతేకాదు పాస్‌పోర్టులో ఎఫ్-1 వీసా స్టాంపింగ్‌పై అడ్డంగా స్కెచ్పెన్నుతో గీతలు పెట్టి, ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తారు. పొంతన లేని జవాబులు చెప్పిన ఓ విద్యార్థినిని అలాగే వెనక్కి పంపేశారు. -
మీరు జారీ చేసిన వీసాలే!
వాటిని గౌరవించాలంటూ అమెరికాకు విదేశాంగ శాఖ విజ్ఞపి సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులను వెనక్కి పంపుతుండడంపై బుధవారం భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘వారికి వీసాలను జారీ చేసింది మీ కాన్సులేట్లు, ఎంబసీలే.. ఆ వీసాలను గౌరవించాలి’ అని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులకు విజ్ఞప్తి చేసింది. వ్యాపార, పర్యాటక, పని వీసాలపై వెళ్తున్నవారినీ వెనక్కి పంపుతున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీ, నార్త్‌వెస్ట్రన్ పాలిటెక్నిక్ వర్సిటీల్లోనే కాకుండా ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులనూ వెనక్కి పంపుతున్నారంది. అలాగే, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్తున్న విద్యార్థులు అవసరమైన అన్ని అధికారిక ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్లాలని సూచిస్తూ బుధవారం మరో ప్రకటన జారీ చేసింది. కాగా, కాలిఫోర్నియాలోని రెండు వర్సిటీలను నిషేధిత జాబితాలో ఉంచడంతో వాటిలో చేరిన భారతీయ విద్యార్థులను మాత్రమే వెనక్కుపంపడం లేదని అమెరికా భారత్‌కు స్పష్టం చేసింది. ఇమిగ్రేషన్ విచారణలో.. వీసాల్లో ఉన్న వివరాలకు, విద్యార్థులు ఇస్తున్న సమాచారానికి పొంతన లేనట్లుగా తేలుతున్నందువల్లనే వారిని దేశంలోకి అనుమతించడం లేదని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు భారత విదేశాంగ కార్యాలయానికి తెలిపారు. ఈ నేపథ్యంలో.. అమెరికా విద్యాసంస్థల్లో అడ్మిషన్లు తీసుకోవాలనుకునే విద్యార్ధులు అన్ని విషయాలన లోతుగా అధ్యయనం చేశాకే ముందుకు వెళ్లాలని విదేశాంగ శాఖ సూచించింది. స్టడీ ప్లాన్, వసతి, ఆర్ధిక సహాయం తదితర అంశాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తమ వెంట తీసుకెళ్లాలని, ఇంటర్వ్యూ సమయంలో ఈ పత్రాల్ని ఇమిగ్రేషన్ అధికారులకు అందచేయాలని సూచించింది. అలాగే, ఇతర వీసాలపై అమెరికా వెళ్తున్నవారు కూడా యూఎస్‌లో ఎక్కడ ఉండబోతున్నారు?, స్పాన్సర్షిప్, ఆర్థికపరమైన మద్దతు. తదితర వివరాలున్న డాక్యుమెంట్స్‌ను విధిగా వెంట తీసుకువెళ్లాలని సూచించింది. భారత్ విజ్ఞప్తి.. ‘మా విద్యార్థులకు వీసాలను జారీ చేసింది మీ కాన్సులేట్లు, ఎంబసీలే.. ఆ వీసాలను గౌరవించాల్సిన అవసరముంది. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులనే కాకుండా వేరే యూనివర్సిటీల్లో చేరిన వారిని కూడా వెనక్కు పంపుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వ్యాపార, పర్యాటక, పని వీసాలపై వెళ్తున్నవారిని సైతం వెనక్కి పంపుతున్నారు’. అమెరికా వివరణ.. ‘కాలిఫోర్నియాలోని రెండు యూనివర్సిటీలను నిషేధిత జాబితా(బ్లాక్ లిస్ట్)లో పెట్టిన కారణంగా.. వాటిలో చేరిన భారతీయ విద్యార్థులను మాత్రమే వెనక్కుపంపడం లేదు. ఇమిగ్రేషన్ విచారణ సందర్భంగా వీసాలో ఉన్న వివరాలకు, విద్యార్థులు ఇస్తున్న సమాచారానికి పొంతన లేనట్లుగా తేలుతున్నందువల్లనే వారిని దేశంలోకి అనుమతించడం లేదు’. -
ఈ వీసాతో వెళ్తే ‘తిరుగు టపా’నే!
♦ అమెరికా, బ్రిటన్‌లోని నిషేధిత యూనివర్సిటీలతో కాంట్రాక్ట్ ♦ బోగస్ ధ్రువీకరణ పత్రాలతో స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్ ♦ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: అమెరికా ప్రభుత్వం నిషేధించిన కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులుగా చేరడానికి వెళ్తున్న 20 మందిని శనివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ అధికారులు ఆపేసిన విషయం మరువకముందే.. ఇదే తరహా వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని, విద్యార్థుల్ని మోసం చేస్తున్న బోగస్ కన్సల్టెన్సీ గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రట్టు చేశారు. ప్రధాన నిందితుడు మీర్ ఆమిర్ అలీఖాన్‌ను అరెస్టు చేసి, భారీగా బోగస్ పత్రాలు, స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్ కోటిరెడ్డి తెలిపారు. నానల్‌నగర్‌కు చెందిన అలీఖాన్ ఎంబీఏ పూర్తి చేశాడని, 2009లో మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో పసిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ ఓవర్సీస్ కెరియర్స్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడని, ఇతడికి నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ వర్సిటీతో ఒప్పందం ఉందని చెప్పారు. అటు విజిట్.. ఇటు స్టడీ వీసాలు.. తొలినాళ్లల్లో అలీఖాన్.. విజిటింగ్ వీసాలతో పాటు స్టడీ వీసాలు ఇప్పించేవాడు. వీటి ప్రాసెసింగ్‌కు అవసరమైన బ్యాంక్ స్టేట్మెంట్లు, రుణ మంజూరు పత్రాలు, వివిధ కాలేజీల పేర్లతో ఉండే సిఫార్సు పత్రాలు, చార్టెడ్ అకౌంటెంట్ నివేదికలు, అఫిడవిట్లు, నాన్-జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు.. బోగస్‌వి తయారు చేసేవాడు. స్టాంపులు కూడా నకిలీవి రూపొందించాడు. అతని కార్యాలయంలో ఏడెనిమిది మంది ఉద్యోగుల్నీ నియమించుకున్నా డు. నకిలీ పత్రాలు అందించడానికి ఒక్కో వ్యక్తి దగ్గర రూ.30 వేల నుంచి రూ.60 వేల వర కు వసూలు చేసేవాడు. బోగస్ వర్సిటీలతో ఒప్పందాలు.. నిషేధిత జాబితాలో చేర్చే వర్సిటీలు యూఎస్, యూకేల్లో అనేకం ఉన్నాయి. ఇలాంటి కోవకే చెందిన ఫ్రెండ్లీ వర్సిటీ, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ యూఎస్ఏలతో పాటు నిషేధిత జాబితాలో చేరిన నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ వర్సిటీతోనూ ఇతడికి ఒప్పందాలున్నాయి. వర్సిటీలో చేర్చిన ఒక్కో విద్యార్థికి 600 నుంచి వెయ్యి డాలర్ల వరకు అలీఖాన్‌కు కమీషన్ ఇచ్చేవి. విదేశాల్లో చదువు కోసం ప్రయత్నించే విద్యార్థుల పాస్‌పోర్ట్‌తో పాటు ఇతర వివరాలు తీసుకునేవాడు. ఆయా వర్సిటీల నుంచి కొరియర్ ద్వారా ‘ఐ-20’ ఫామ్‌ను తెప్పించేవాడు. ఆ వర్సిటీల్లో సీటు ఇప్పించడం ద్వారా రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేసేవాడు. అలా వెళ్తే ఇక్కట్లు పడాల్సిందే.. అలీఖాన్ ఈ రకంగా కొన్నేళ్లుగా దాదాపు 300 మందిని విదేశాలకు పంపినట్లు పోలీసులు చెపుతున్నారు. ఇతడి మాటలు నమ్మి ఆయా వర్సిటీల్లో చేరడానికి వెళ్లేవారు ఇక్కట్లు పడాల్సిందే. అయితే వెళ్లేప్పుడు విమానాశ్రయంలో ఆపేయడమో, వెళ్ళినా.. అక్కడి విమానాశ్రయం నుంచి వెనుక్కి పంపడమో జరుగుతుందని, తిరిగి వచ్చే చార్జీలు సైతం విద్యార్థులే భరించాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ కేసును సైఫాబాద్ పోలీసులకు అప్పగించిన అధికారులు అలీఖాన్‌కు సహకరించిన వీరాస్వామి అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు. -
విద్యార్థులూ.. ప్రయాణాలు వాయిదా వేసుకోండి
సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలలో చదవాలనుకునే విద్యార్థులు.. సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. ఇటీవలి కాలంలో అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు భారతీయ విద్యార్థులకు అనుమతి నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా శాన్ జోస్‌లోని సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, ఫ్రెమాంట్లోని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలకు వెళ్లే పిల్లలకు ఈ తరహా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. తగిన వీసా, ఇతర పత్రాలు ఉన్నా భారతీయ విద్యార్థులను ఎందుకు అనుమతించడం లేదని విదేశాంగ శాఖ అమెరికా అధికారులను వివరణ కోరింది. దీనికి అమెరికా ప్రభుత్వం నుంచి ఇంకా సమాధానం రావాల్సి ఉంది. ఈ సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యేవరకు ఈ రెండు సంస్థలలో చదవాలనుకునే విద్యార్థులు తమ అమెరికా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విదేశాంగ శాఖ సూచించింది. అమెరికా విద్యా సంస్థలలో చదువుకోడానికి వెళ్లే విద్యార్థులు ముందుగానే ఆయా సంస్థలకు తగిన గుర్తింపు ఉందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలని తెలిపింది. పాస్‌పోర్టు, వీసాలతో పాటు తమ చదువుకు సంబంధించిన పత్రాలు, నివాసం ఉండే ప్రాంతానికి సంబంధించిన పత్రాలు, ఆర్థిక సామర్థ్యం, ఆరోగ్య రక్షణ ఏర్పాట్లు.. ఇలాంటి అన్ని పత్రాలను తీసుకెళ్లాలని చెబుతున్నారు. దాంతోపాటు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్వహించే ఇంటర్వ్యూకు కూడా తగిన విధంగా ప్రిపేర్ అయి ఉండాలని చెప్పారు. -
అమెరికా వెళ్లబోయి అబుదాబీలో...
-
అమెరికా వెళ్లబోయి అబుదాబీలో చిక్కుకుని..
► అబుదాబీ ఎయిర్‌పోర్టులో తెలుగు విద్యార్థుల అవస్థలు ► సిలికాన్ వ్యాలీ, ఎన్పీయూ విద్యార్థులకు చేదు అనుభవం ► పాస్‌పోర్టులు లాగేసుకున్న ఇమిగ్రేషన్ అధికారులు ► దిక్కుతోచక ఎయిర్‌పోర్టులో దిగాలుగా ఉన్న 40 మంది విద్యార్థులు ► కనీస సమాచారం ఇవ్వని అధికారులు ► సోమవారం రాత్రి నుంచి ఇబ్బందులు పడుతున్న పట్టించుకున్న వాళ్లేలేరు (సాక్షి వెబ్ ప్రత్యేకం) అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదవాలని బయలుదేరిన వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. గత కొద్దిరోజులుగా కాలిఫోర్నియాలోని రెండు యూనివర్సిటీల బ్లాక్ లిస్ట్‌లో పెట్టారన్న ప్రచారం రోజురోజుకూ కొత్త మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా కాలిఫోర్నియాలోని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన దాదాపు 40 మంది విద్యార్థినీ విద్యార్థులను అబుదాబీ ఎయిర్‌పోర్టులోనే ఆపివేశారు. వీరిలో హైదరాబాద్ నుంచి వెళ్లిన వారు 10 మంది విద్యార్థులుండగా, ఆయా రాష్ట్రాల నుంచి బయలుదేరిన విద్యార్థులు మరో 30 మంది వరకు ఉన్నారు. వీరిలో 10 మంది విద్యార్థులు సోమవారం హైదరాబాద్, ముంబై మీదుగా అబుదాబి చేరుకున్నారు. వారంతా అబుదాబి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు కనెక్టింగ్ ఫ్లయిట్‌కు బయలుదేరాలి. హైదరాబాద్ నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. పాస్‌పోర్టులు లాగేసుకున్న అధికారులు ఎతిహాద్ ఎయిర్ వేస్‌కు చెందిన విమానంలో బయలుదేరిన వీరిని అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. అక్కడి నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు కనెక్టింగ్ ఫ్లయిట్ విమానం బోర్డింగ్‌కు అనుమతించలేదు. పైగా విద్యార్థినీ విద్యార్థులందరి నుంచి పాస్‌పోర్టులను లాగేసుకున్నారు. అదేమంటే... మాకున్న ఆదేశాల మేరకు మిమ్మల్ని అనుమతించడం లేదన్నారు. అంతకు మించిన ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఏం చేయాలో వారికి పాలుపోని పరిస్థితి ఎదురైంది. లాంజ్‌లోంచి ఎక్కడికీ కదలనివ్వలేదు. గంటల తరబడి లాంజ్‌లోనే ఉండిపోయారు. వారికి సరైన సమాచారం ఇచ్చే వాళ్లు కూడా కరవయ్యారు. దాంతో జరిగిన విషయాన్ని ఎవరికి వారు తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంగళవారం సాయంత్రం ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు వచ్చి వాళ్లకు ఫుడ్ కూపన్స్ అందజేశారు. బుధవారం తిరిగి పంపిస్తాం.. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఆ విద్యార్థులకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే మంగళవారం రాత్రి ఒక అధికారి వారి వద్దకొచ్చి బుధవారం ఉదయం ఫ్లయిట్ ఏర్పాటు చేస్తున్నారని, అందరినీ తిరిగి ఇండియాకు పంపిస్తారని చెప్పారు. పాస్‌పోర్టులను మాత్రం వారికి ఇవ్వలేదు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత తిరిగి మాకు అందజేస్తారని చెబుతున్నారని ఎన్‌పీయూలో ఎంఎస్ అడ్మిషన్ కోసం వెళ్లిన వికాస్ సాక్షితో చెప్పారు. ఎన్నో ఆశలతో... ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో బయలుదేరామని, ఎవరో ఎక్కడో చేసిన తప్పిదానికి మమ్మల్ని బలి చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా అబుదాబిలో నానా కష్టాలు పడుతున్న వారికి తమ భవిష్యత్తు ఏమిటో అర్థంకాక బాధపడుతున్నామని చెబుతున్నారు. ఇలాంటి విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారన్నారు. దాదాపు 40 మంది విద్యార్థులు రెండు రోజులుగా అబుదాబిలో ఆగిపోతే ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఏం జరుగుతుందో తెలియక... గడిచిన వారం రోజులుగా ఈ యూనిర్సిటీల్లో అడ్మిషన్లకు వెళుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వర్సిటీల్లో ప్రవేశం పొందిన పలువురు విద్యార్థులను గత వారం శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇమిగ్రేషన్ అధికారులు తిప్పిపంపారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట ఎయిర్ ఇండియా అధికారులు ఉత్సాహం ప్రదర్శించిన మరో 19 మంది విద్యార్థులకు అసలు బోర్డింగ్ పాస్ ఇవ్వకుండా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచే తిప్పిపంపారు. అదేమంటే... మాకున్న సమాచారం మేరకు మిమ్మల్ని అనుమతించమని, ఒకవేళ అనుమతించినా అమెరికా నుంచి తిరిగి పంపించివేస్తారంటూ ముక్తసరి సమాధానమిచ్చారేగానీ కారణాలను వెల్లడించలేదు. బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదన్న వర్సిటీలు ఇమిగ్రేషన్ అధికారులు అనుమతి నిరాకరిస్తున్న దశలో ఆందోళన చెందిన విద్యార్థులు ఆయా యూనిర్సిటీ అధికారులను సంప్రదించారు. మెయిల్స్ ద్వారా సంప్రదించిన పలువురు విద్యార్థులతో పాటు ఆ రెండు వర్సిటీలు తమ వెబ్సైట్లో కొన్ని వివరాలిచ్చాయి. తమ యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారన్న విషయం వాస్తవం కాదని ఖండించాయి. అదొక ప్రచారంగా కొట్టిపారేశాయి. ఇమిగ్రేషన్ అధికారులకు వీసా, ఐ20, అడ్మిషన్ ప్యాకేజీ, ట్రాన్స్‌స్క్రిప్ట్స్ వంటి సరైన పత్రాలను చూపించాలని, ఎలాంటి సమస్య తలెత్తదని పేర్కొన్నాయి. ఫ్యారిస్‌లో దాడుల ఘటన తదనంతరం భద్రతా చర్యలు ముమ్మరం చేయడంవల్ల సెక్యూరిటీ పరమైన అంశాలే తప్ప ఇతరత్రా ఇబ్బందులు లేవని సమాచారమిచ్చాయి. అసలేం జరుగుతోంది? అమెరికాలోని వందలాది యూనివర్సిటీలుండగా వేటికీ తలెత్తని సమస్య వీటికి మాత్రమే ఎందుకు వచ్చిందన్నది ప్రధానాంశం. బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదంటూ ఆ యూనిర్సిటీలు చెబుతున్న దాంట్లో వాస్తవమెంతో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బ్లాక్ లిస్ట్‌లో పెట్టనప్పుడు కొందరు విద్యార్థులనైనా అనుమతించాలి కదా... అలా కాకుండా ఆ యూనివర్సిటీలకు వెళుతున్న వారందరినీ ఎందుకు తిప్పిపంపిస్తున్నారన్న విషయంపై ఎవరూ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. అయితే ప్రస్తుతం ఆ యూనిర్సిటీల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులతో మాట్లాడినప్పుడు, బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదని చెబుతున్నారు. మాకు ఇటీవలే సెకండ్ సెమిస్టర్ పరీక్షలు కూడా పూర్తయ్యాయని, బ్లాక్ లిస్ట్‌లో పెడితే పరీక్షలు నిర్వహించడానికి వీలుండదని, అలాంటి పరిస్థితి ఏమీ లేదని ఎన్‌పీయూలో ఎంఎస్ చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి చెప్పారు. ఈ యూనివర్సిటీల్లో గత సెమిస్టర్ కాలంలో 4500 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అమెరికాలో సోదాలు ఇటీవలి ప్యారిస్ దాడుల నేపథ్యంలో కాలిఫోర్నియా అంతటా సోదాలు ముమ్మరం చేసినట్టు అక్కడి విద్యార్థులు చెబుతున్నారు. ప్రధానంగా వర్సిటీల్లో చదువుతూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రానికి వస్తున్న విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం కూడా సోదాలకు ఒక కారణంగా చెబుతున్నారు. జనవరి తొలివారంలో స్పష్టత... ప్యారిస్ దాడులను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఘనంగా నిర్వహించుకునే క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలోనే తనిఖీలు ముమ్మరం చేశారని అంతకు మించిన ఎలాంటి సమస్యలు లేవని అక్కడివారు సమాచారమిచ్చారు. స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకే... ఈ యూనిర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు గత వారం అమెరికా వెళ్లగా ఇమిగ్రేషన్ అధికారులు ఆరుగురు విద్యార్థులను తిప్పిపంపారు. అలా తిప్పిపంపడమే అసలు సమస్యకు ప్రధాన కారణమైందని విశ్లేషిస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయం పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద అధికారులు అడిగిన ప్రశ్నకు ఒకదానికి మరొకటి పొంతన లేని సమాధానాలు చెప్పిన కారణంగా వారిని తిప్పిపంపినట్టు తెలుస్తోంది. దాని ప్రభావమే మిగతా విద్యార్థులపై పడిందని చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన కారణంగా ఎయిర్ ఇండియా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఎవరో కొంతమంది విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తితే ఎయిర్ ఇండియా అదికారులు మిగతా విద్యార్థులను ఇబ్బందుల పాలు చేశారని అంటున్నారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అనుమతి నిరాకరిస్తే వారందరినీ తిరిగి తీసుకురావలసి ఉంటుందని, దాన్ని తప్పించుకోవడానికే ఎయిర్ ఇండియా అధికారులు ఈ రకంగా చేశారని కూడా వినిపిస్తోంది. దుష్ర్పచారం వద్దు... భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నత చదువుల కోసం వస్తున్న విద్యార్థులను గందరగోళానికి గురిచేయరాదని తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ నేషనల్ కల్చరల్ చైర్మన్ శ్రీనివాస్ మనప్రగడ, రీజినల్ వైస్ ప్రెసిడెంట్ అప్పిరెడ్డి, యువ సంస్థ ప్రతినిధి సతీష్‌లు అన్నారు. ఆ రెండు యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారన్న ప్రచారం వల్ల ప్రస్తుతం ఆ యూనిర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని, వారితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతారని చెప్పారు. ఆ రెండు యూనివర్సిటీల్లో ప్రస్తుతం నాలుగు వేల మంది తెలుగు విద్యార్థులున్నారని, తప్పుడు ప్రచారం చేసి వారి భవిష్యత్తును పాడుచేయొద్దని కోరారు. వదంతులను నమ్మొద్దని వారు కోరారు. కొంత మంది తత్తరపాటే ఇమిగ్రేషన్ అధికారులు ప్రశ్నించినప్పుడు కొంత మంది విద్యార్థులు తత్తర పడటం, పొంతన లేని సమాధానాలు ఇవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తి ఉంటాయని, అంతమాత్రంగా నిజమైన ప్రతిభ కలిగిన విద్యార్థులకు నష్టం కలిగించే ప్రచారం వద్దని ఆయన కోరారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కొంత మంది విద్యార్థులను తిప్పిపంపినప్పుడు ఎయిర్ ఇండియా ఒక్కో విద్యార్థి నుంచి విపరీతంగా డబ్బులు వసూలు చేసిందని మనప్రగడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరి నుంచి 1.45 లక్షల రూపాయలు వసూలు చేయడం దారుణమన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి తిరిగి తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుందన్న ఉద్దేశంతో దాదాపు 20 మంది విద్యార్థులకు బోర్డింగ్ పాస్ జారీ చేయకుండా వెనక్కి పంపించిందని ఆయన తప్పుబట్టారు. -
సమస్యను అమెరికా దృష్టికి తీసుకెళ్లాం
తెలుగు విద్యార్థులను అమెరికా నుంచి తిప్పి పంపడం, ఎయిరిండియా అధికారులు అనుమతించకపోవడం లాంటి సమస్యలను అమెరికా దృష్టికి తీసుకెళ్లినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ సమస్యపై పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన రావు వెళ్లి సుష్మా స్వరాజ్‌ను కలిశారు. అప్పుడు ఆమె ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ఆమె ప్రస్తావించారు. ఇక ఈ అంశంపై కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడారు. మన పిల్లలు అక్కడ చదువుకోడానికి వెళ్లారని, వారికి సౌకర్యాలు ఉండాలని ఆయన అన్నారు. పిల్లలను అనుమతించబోమని అమెరికా అధికారులు సమాచారం ఇచ్చారని తెలిపారు. (అయితే, లిఖితపూర్వక సమాచారమా అని, ఎవరిచ్చారని అడిగినప్పుడు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు) వెళ్లిన కొంతమంది పిల్లలను ఇప్పటికే తిప్పి పంపేశారని, విద్యార్థులను అనుమతించాలా లేదా అన్నది అక్కడి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుందని అశోక్ గజపతి రాజు చెప్పారు. -
అమెరికా వెళ్లే భారత విద్యార్థుల్లో అయోమయం!
పారిస్ ఉగ్రవాదదాడి అనంతరం అమెరికా కస్టమ్స్, సరిహద్దు రక్షణ దళం భద్రత నిబంధనలను కఠినతరం చేసింది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండు యూనివర్సిటీలను బ్లాక్‌లిస్టులో పెట్టారని, అందువల్ల వాళ్లకు అమెరికా ప్రవేశం దుర్లభం అవుతోందని గత రెండు రోజులుగా దుమారం రేగుతోంది. కానీ, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ రెండూ మాత్రం.. తమ వర్సిటీలు బ్లాక్‌లిస్టులో లేవని స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని రెండు యూనివర్సిటీలు విడివిడిగా విడుదల చేసిన ప్రకటనలలో తెలిపాయి. అవసరమైతే తమను నేరుగా ఈ మెయిల్ ద్వారా సంప్రదించాలని యూనివర్సిటీలలో చేరేందుకు ఇప్పటికే బయల్దేరిన, బయల్దేరుతున్న విద్యార్థులకు తెలిపాయి. కొత్తగా వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా ఈ కింది జాబితాలోని పత్రాల అసలు కాపీలను వెంట ఉంచుకోవాలని, అలా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెబుతున్నాయి. బ్లాక్ లిస్ట్ లో తమ యూనివర్సిటీలు లేవని వాటి యజమాన్యాలు పేర్కొంటుండగా, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తరాదనే భావనతోనే ఎయిర్ ఇండియా వారి ప్రయాణాన్ని రద్దు చేసినట్లు వెల్లడించింది. ఏది ఏమైతేనేం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలని కలలుకన్న భారత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అవసరమైన పత్రాలు పాస్‌పోర్టు, వీసా విద్యాసంస్థ జారీచేసిన ఐ-20 విద్యాసంస్థ ఇచ్చిన అడ్మిషన్ ప్యాకేజి ఆర్థిక వెసులుబాటుకు సంబంధించిన ఆధారాలు విద్యాసంస్థకు దరఖాస్తు చేసేటప్పుడు ఉపయోగించిన అధికారిక ట్రాన్స్‌స్క్రిప్ట్, సర్టిఫికెట్లు ఇప్పటికే చదువుతున్న విద్యార్థులైతే.. అమెరికాలో చదువుతున్నట్లుగా రుజువుచేసే అధికారిక ట్రాన్స్‌స్క్రిప్ట్ లేదా డిగ్రీ సర్టిఫికెట్ విద్యాసంస్థ జారీచేసిన ట్రావెల్ డాక్యుమెంటు ఆరోగ్య కారణాలతో సెలవు తీసుకుంటే.. దాన్ని రుజువు చేసే పత్రాలు గత రెండు మూడు రోజులుగా అమెరికాలో చదివేందుకు వెళ్తున్న విద్యార్థులకు ఎయిరిండియా వర్గాల నుంచి కొంత చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన 19 మంది విద్యార్ధులు అక్కడికి చేరుకోవడానికి ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అయితే అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఈ రెండు యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్‌లో ఉంచారనే సాకుతో ఎయిర్ ఇండియా అధికారులు వీరికి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులకు వారి ప్రయాణ ఛార్జీలు తిరిగి చెల్లించినట్లు అధికారులు చెప్పారు. తమకు అన్ని రకాల అనుమతులు సక్రమంగానే ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. తమకు అమెరికా కాన్సులేట్ వీసా జారీచేసిన తర్వాత ఎయిర్ పోర్టు అధికారులు ఇలాంటి సాకులు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎంట్రీ వీసాలు ఉన్నందున మరో విమానయాన సంస్థ ద్వారానైనా అక్కడకు చేరుకుంటామంటున్నారు. తాము అడ్మిషన్ పొందిన యూనివర్సిటీలకు అక్రిడిటేషన్ ఉండని, గతంలో కూడా ఎంతో మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీలకు ఉన్నత చదువులకు వెళ్లారని అంటున్నారు. సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీలో చేరేందుకు వెళ్లే విద్యార్థులైతే admissions@svuca.edu అనే ఈ మెయిల్‌కు, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలో చేరేందుకు వెళ్లే విద్యార్థులైతే admissions@npu.edu అనే ఈ మెయిల్‌కు నేరుగా సంప్రదించాలని తెలిపారు. అమెరికా క్లియరెన్స్ ఇవ్వగానే విద్యార్థులను అనుమతిస్తాం హైదరాబాద్: విద్యార్థుల డబ్బు వృథా కాకూడదనే వాళ్లు అమెరికా వెళ్లకుండా ఆపినట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన 19 మందిని ఎయిర్ ఇండియా వర్గాలు శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ఆపేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. రెండు కాలిఫోర్నియా వర్సిటీలను పరిశీలనలో ఉంచినట్లు తమకు డిసెంబర్ 19న అమెరికా అధికారుల నుంచి సమాచారం వచ్చిందని తెలిపింది. అప్పటికే శాన్ఫ్రాన్సిస్కో చేరిన 14 మంది విద్యార్థులను కూడా వెనక్కి పంపేస్తున్నట్టు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. విద్యార్థుల డబ్బు వృథా కాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు ఎయిర్ ఇండియా పేర్కొంది. టిక్కెట్లు రద్దు చేసుకుంటే వారికి పూర్తిస్థాయిలో నగదు చెల్లింపులు ఉంటాయంది. ఒకవైపే టిక్కెట్ బుక్ చేసుకుని వెళ్లే.. తిరిగి రావడానికి ఎక్కువ డబ్బు పెట్టాల్సి ఉంటుందని చెప్పింది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యానే తాము వారికి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ఈ రెండు యూనివర్సిటీల గురించి అమెరికా క్లియరెన్స్ ఇవ్వగానే విద్యార్థులను అనుమతిస్తామని పేర్కొంది. అదనంగా వారి నుంచి డబ్బులు వసూలు చేయకుండా అక్కడకు తీసుకెళ్తామని ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది. విదేశాంగ మంత్రితో చర్చిస్తా... ‘‘అమెరికాలో యూనివర్సిటీలకు చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులను వారి శ్రేయస్సు మేరకే ఆపుతాం. కొన్ని వర్సిటీలకు గుర్తింపు సమస్యలు ఉన్నాయని ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను అనుమతించడం లేదు. ఎయిర్ ఇండియా విమాన సంస్థ మాత్రమే. యూఎస్ వెళ్లి.. అక్కడ అనుమతి లభించని విద్యార్థులు సొంత ఖర్చులతో తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై విదేశాంగ మంత్రితో చర్చిస్తాం.’’ - కేంద్ర పౌర విమాన యాన మంత్రి అశోక్‌గజపతి రాజు -
ఎయిర్‌పోర్టులో విద్యార్థుల నిలిపివేత
అమెరికాలోని నిషేధిత వర్సిటీల్లో చేరుతున్నారని అడ్డగింత శంషాబాద్: అమెరికాలోని ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం మాదిరిగా మరో రెండు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు పాలవుతున్నారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ విశ్వవిద్యాలయం, నార్త్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయంలో చేరడానికి రాష్ట్రానికి చెందిన 20 మంది విద్యార్థులు శనివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఆ రెండు విశ్వవిద్యాలయాలను నిషేధించడంతో అన్నిదేశాల ఇమిగ్రేషన్ కార్యాలయాలతోపాటు ట్రావెల్ ఏజెంట్లకు అక్కడి ప్రభుత్వం సందేశాలు పంపింది. ఈ మేరకు స్టడీ వీసాపై ఆయా వర్సిటీలకు వె ళ్తున్న విద్యార్థులను శంషాబాద్ ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. జనవరి 4 నుంచి ఆయా వర్సిటీల్లో క్లాసులకు హాజరుకావాల్సిన ఆ విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే అమెరికా చేరుకున్న కొందరు విద్యార్థులు తిరుగుముఖం పట్టినట్లు సమాచారం. -
ఓటమి నుంచి పాఠం నేర్చుకోవాలి
భారత్‌లో టీకొట్టులోనూ ఓ వ్యాపారవేత్త కనిపిస్తాడు * మా సేవలను మొదట భారత్‌లోనే ప్రారంభిస్తాం * గూగుల్ వెళ్లినప్పుడు టాఫీల దుకాణానికి వెళ్లిన అనుభూతి కలిగింది * ఢిల్లీ విద్యార్థులతో ముచ్చటించిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ న్యూఢిల్లీ: గూగుల్ ఎప్పుడూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని, తాము చూపించే పరిష్కారం కోట్లాది ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడుతుందనేదే ప్రధానంగా ఆలోచిస్తామని ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. అపజయానికి ఎప్పుడూ కుంగిపోకూడదని, ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవాలని గురువారం ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి అన్నారు. సిలికాన్ వ్యాలీలో ఫెయిల్యూర్స్‌ను గౌరవానికి గుర్తుగా భావిస్తారని చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. భారత్‌లో ఈ తరం వారు రిస్క్ తీసుకోవటానికి తక్కువ భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ దేశంలో ఓ టీ దుకాణానికి వెళ్లినా అక్కడ ఓ వ్యాపారవేత్త కనిపిస్తాడనీ.. అలాంటి సంస్కృతి మన దేశంలో ఎప్పటి నుంచో ఉందన్నారు. గూగుల్ సేవలను మొదట భారత్‌లో ప్రారంభించిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. యూట్యూబ్ ఆఫ్‌లైన్‌కు మొదట భారత్‌లోనే శ్రీకారం చుట్టి, తర్వాత 77 దేశాలకు తీసుకెళ్లామని గుర్తుచేశారు. తమ ఇంజనీరింగ్ కార్యాలయాలను భారత్‌లో నెలకొల్పుతామన్నారు. భారత్‌లో బలమైన మొబైల్ పరికరాల మార్కెట్, ప్రజల్లో టెక్నాలజీపై అమితాసక్తి ఉన్నాయని పేర్కొన్నారు. దీనివల్ల తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రారంభించేందుకు బ్రహ్మాండమైన అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల ప్రశ్నలకు పిచాయ్ చెప్పిన జవాబులు మరికొన్ని... * నేను ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకునేప్పుడు ఇంటర్నెట్ లేదు. తరువాత ఎప్పుడో అందుబాటులోకి వచ్చింది. * 1995లో నా దగ్గర మొదటి ఫోన్ ఉండేది. * ఇప్పుడు 20 స్మార్ట్ఫోన్లు నా దగ్గర ఉన్నాయి. * నేను స్కూల్లో పెద్దగా చదివిన వాణ్ణి కాదు.. నాకు సెమీ కండక్టర్లపై ఆసక్తి ఉండేది. * గూగుల్ సీఈఓ కాకపోయి ఉంటే నేను సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేసుకుంటూ ఉండేవాణ్ణి. * గూగుల్ వెళ్లినప్పుడు టాఫీల దుకాణానికి వెళ్లిన అనుభూతి కలిగింది. * గూగుల్ చాలా ఆనందకరమైన ప్రాంగణం. * విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేలా, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలి. * ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి. * సిలికాన్ వ్యాపారవేత్తల తరహాలోనే భారత్‌లోని స్టార్టప్ వ్యవస్థాపకుల నుంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి. * క్రికెట్, ఫుట్‌బాల్ నా అభిమాన క్రీడలు. 20 లక్షల మంది ఆండ్రాయిడ్ డెవలపర్లకు శిక్షణ భారత్‌లో వచ్చే మూడేళ్లలో 20 లక్షల మంది ఆండ్రాయిడ్ డెవలపర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ తెలిపారు. తమ నూతన ప్రణాళికలో భాగంగా 30 విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో 20 లక్షల మంది ఆండ్రాయిడ్ డెవలపర్లకు శిక్షణ ఇస్తామన్నారు. దీన్ని మూడేళ్లలో పూర్తిచేస్తామని పేర్కొన్నారు. కొత్త డెవలపర్లతో కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. పబ్లిక్ వైఫై ప్రాజెక్ట్‌పై పిచాయ్ స్పందించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని తెలిపారు. భారత్‌లో 400 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకే వారికి ఇంటర్నెట్ను చేరువ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీతో భేటీ: శ్రీరామ్ కాలేజీ విద్యార్థులతో భేటీ తర్వాత ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో సుందర్ కలిశారు. ‘మంచి సౌహ్రార్ద వాతావరణంలో సుందర్‌తో సమావేశం జరిగింది’ అని భేటీ తర్వాత మోదీ ట్వీట్ చేశారు. గత మూడు నెలల కాలంలో వీరిద్దరూ కలవడం ఇది రెండోసారి. ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా వీరిద్దరు సమావేశమయ్యారు. క్రికెట్, ఫుట్‌బాల్ నా అభిమాన క్రీడలు తాను క్రికెట్‌కు పెద్ద అభిమానినని సుందర్ చెప్పారు. గవాస్కర్ తన అభిమాన క్రికెటర్ అన్నారు. ఆయనలా క్రికెటర్‌గా మారాలని బాల్యంలో కలలు కన్నానన్నారు. సచిన్‌నూ అభిమానిస్తానని పేర్కొన్నారు. చెన్నైలో గడిపిన చిన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. టెస్టు, వన్డేలను చూసి ఆనందిస్తుంటానన్నారు. వేగవంతమైన టీ20 మ్యాచ్‌లపై అంతగా ఆసక్తి లేదన్నారు. ఫుట్‌బాల్ క్రీడను కూడా బాగా ఇష్టపడతానని సుందర్ పిచాయ్ తెలిపారు. లియోనెల్ మెస్సీ తన అభిమాన ఫుట్‌బాల్ ఆటగాడని అన్నారు. చిన్నప్పుడు అర్ధరాత్రి పూట లేచి టీవీలో ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలు చూసేవాడినని గుర్తుచేసుకున్నారు. గురువారం ఢిల్లీలో ఇండియాగేట్ వద్ద స్థానికులతో కలసి ఆయన సరదాగా క్రికెట్ ఆడారు. ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర స్థానికులతో క్రికెట్ ఆడుతున్న సుందర్ -
'భారతీయ కంపెనీలకు భారీ ఫైన్'
వాషింగ్టన్: భారతీయ సంతతికి వ్యక్తులకు చెందిన రెండు కంపెనీలకు అమెరికా కోర్టు భారీ మొత్తంలో ఫైన్ వేసింది. దాదాపు రూ.68,41,458.17(103000 డాలర్లు) మొత్తం ప్రభుత్వానికి చెల్లించాలని, మరో రూ.5579441.62(84,000డాలర్లు) ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించింది. ఇంతమొత్తంలో ఆ కంపెనీలకు ఎందుకు ఫైన్ వేశారని అనుకుంటున్నారా.. అందుకు ప్రధాన కారణం ఆ కంపెనీలు హెచ్-1బీ వీసాల విషయంలో ఉల్లంఘనలకు పాల్పడటమే. సిలికాన్ వ్యాలీలో గల ప్రముఖ కంపెనీలైన స్కోపస్ కన్సల్టింగ్ గ్రూప్, ఆరియాన్ ఇంజినీర్స్ అనేవి భారతీయ సంతతికి చెందిన వ్యక్తులైన కిషోర్ కుమార్ మరో వ్యక్తికి సంబంధిన కంపెనీలు. ఈ కంపెనీ భారత్‌తోపాటు ఇతర దేశాల నుంచి కూడా తమ కంపెనీకి హెచ్-1బీ వీసాల ద్వారా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను ఈబే, ఆపిల్, సిస్కో సిస్టమ్ కంపెనీల మాదిరిగా రప్పించింది. అయితే, ఈ క్రమంలో ఆ కంపెనీలు వీసా ఉల్లంఘనలకు పాల్పడ్డాయని అమెరికాకు చెందిన లేబర్ వేజ్ డిపార్ట్ మెంట్ గుర్తించింది. వీసాల్లో పేర్కొన్న విధంగా సదరు ఉద్యోగులకు జీత భత్యాలు చెల్లించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటికి భారీ ఫైన్ వేసింది. -
అమ్మకు కన్నీటి అభిషేకం
నన్ను పెంచటానికి నా తల్లి ఎన్నో కష్టాలు పడింది.. అంట్లు తోమింది - భారత్‌లో ఎందరో తల్లులు తమ పిల్లల కోసం జీవితాలు త్యాగం చేస్తారు - వారందరికీ వేల వేల వందనాలు: ఫేస్బుక్ సీఈఓ జుకర్‌బర్గ్ ప్రశ్నతో మోదీ భావోద్వేగం - దేశ ఆర్థికవ్యవస్థను 20 లక్షల కోట్ల డాలర్లకు పెంపే లక్ష్యమన్న ప్రధాని నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను... నేను రైల్వే స్టేషన్ వద్ద టీ అమ్మేవాడినని బహుశా మీకు తెలుసేమో. మేం చిన్నప్పుడు బతకటానికిచాలా చేయాల్సివచ్చేది. నా తండ్రి లేరు.. నన్ను పెంచటానికి నా తల్లి చాలా కష్టాలు పడింది. ఆమె పొరిగింట్లో అంట్లు తోమేది.. నీళ్లు పట్టేది.. కాయకష్టం చేసేది. ... ఇది కేవలం ఒక్క నరేంద్రమోదీ విషయంలోనే కాదు.. ఇండియాలో చాలా మంది తల్లులు తమ పిల్లల కోసం తమ జీవితాలు మొత్తం త్యాగం చేస్తారు. అందుకే అమ్మలందరికీ నా వేలవేల దండాలు. తమ పిల్లల కలలు, ఆశలను నెరవేర్చటానికి తమ సొంత జీవితాలను త్యాగం చేసిన తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. ఒక తల్లి తన బిడ్డ ఏదో కావాలని ఎన్నడూ కోరుకోదు.. నీవు కోరుకున్న దానిని నీవు ఎలా సాధిస్తావనే దాని గురించే ఆమె ఆలోచిస్తుంది. శాన్‌జోస్: అత్యంత అరుదుగా భావోద్వేగానికి గురయ్యే ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆదివారం ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అడిగిన ఒక ప్రశ్నకు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి గురించి మాట్లాడుతుండగా ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోవటానికి కొన్ని క్షణాలు మౌనందాల్చారు. ఆయన ఆదివారం సిలికాన్ వ్యాలీలో ఫేస్బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌తో అధికభాగం భారతీయులు పాల్గొన్న సభికుల ఎదుట టౌన్‌హాల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ తల్లి గురించి జుకర్‌బర్గ్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ భావేద్వేగానికి గురయ్యారు. తాను పేద కుటుంబం నుంచి వచ్చానని.. చిన్నప్పుడు తనను పెంచటానికి తన తల్లి ఎన్నో కష్టాలు పడ్డారని.. పొరిగింట్లో అంట్లుతోమటం, నీళ్లు పట్టటం చేసేవారని.. కాయకష్టం చేసేవారని తెలిపారు. ఇది తన ఒక్కడి విషయంలోనే కాదని.. భారత్‌లో ఎంతోమంది తల్లులు తమ పిల్లల కోసం జీవితాలు మొత్తం త్యాగం చేస్తారని చెప్తూ.. వారందరికీ వేల వేల వందనాలు తెలిపారు. ప్రస్తుతం 90 ఏళ్ల వయసున్న తన తల్లి ఇప్పుడు కూడా తన పనులన్నీ తానే చేసుకుంటారని చెప్పారు. ఆమె చదువుకోలేదని.. అయితే టెలివిజన్ ద్వారా వార్తలు.. ప్రపంచంలో ఏం జరుగుతుందనేది తెలుసుకుంటారని వివరించారు. మార్క్ జుకర్‌బర్క్ ప్రపంచాన్ని మార్చివేశారంటూ ఆయన తల్లిదండ్రులకు మోదీ అభినందనలు తెలిపారు. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం... పెట్టుబడిదారులు భారత్ స్వర్గధామమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ‘‘డబ్బుకు కొరవ ఉందని నేను భావించటం లేదు. దేశాల వద్ద డబ్బు ఉంది.. కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలో వారికి తెలియదు. నేను వారికి ఆ చిరునామా ఇస్తున్నా.. ఇదే (ఇండియా) ఆ ప్రాంతం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 8 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఆర్థికవ్యవస్థను 20 లక్షల కోట్ల డాలర్లకు పెంచాలన్నది తన లక్ష్యమని చెప్పారు. అందుకోసం భారత్‌లో వ్యాపారం చేయటం సులభతరం చేయటానికి, నియంత్రణను తొలగించటానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భారత్‌లో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని.. పెట్టుబడిదారులు కోల్పోయిన విశ్వాసాన్ని గత 15 నెలల్లో పునరుద్ధరించగలిగామని పేర్కొన్నారు. గత 15 నెలల్లో ఒక్క అమెరికా నుంచే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 87 శాతం పెరిగాయని.. ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం ఉన్నప్పటికీ ఎఫ్ఐఐలు 40 శాతం పెరిగాయని చెప్పారు. ‘‘ఇండియా చాలా పెద్ద దేశం. సంస్కరణల వల్ల మార్పులు కనిపించటానికి కొంత సమయం పడుతుంది. ఎటువైపు వెళుతోందో సులభంగా చూడగలగటానికి అది ఒక స్కూటర్ కాదు.. 40 బోగీలున్న ఒక రైలు కొంత సమయం తీసుకుంటుంది’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘భారత్‌లో బ్యాంకుల జాతీయీకరణ 40 ఏళ్ల కిందట జరిగింది. కానీ నా ప్రభుత్వం జన్‌ధన్ పథకం ప్రవేశపెట్టే వరకూ 60 శాతం జనాభాకు బ్యాంకు ఖాతాల్లేవు. మా ప్రభుత్వం తొలి 100 రోజుల్లోనే 18 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచింది’’ అని తెలిపారు. వ్యవసాయం, సేవలు, తయారీ - ఈ మూడు రంగాలతో పాటు.. భౌతిక, డిజిటల్ మౌలికసదుపాయాల నిర్మాణంపై తన ప్రభుత్వం ఎక్కువ దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ కార్యక్రమం కోసం దాదాపు 40 వేల ప్రశ్నలు రాగా.. మోదీ కేవలం ఆరు ప్రశ్నలకే సమాధానం చెప్పారు. అందులో రెండు ప్రశ్నలు జుకర్‌బర్గ్ సొంతంగా అడిగినవి. ఇదిలావుంటే.. ఫేస్బుక్ సంస్థలోని ‘రియల్ వాల్’పై ‘‘అహింస అతిగొప్ప ధర్మం - సత్యమేవ జయతే’’ అని ప్రధాని మోదీ లిఖించారు. సోషల్ మీడియాతో నా ఆలోచనా విధానం మారింది తన ఆలోచనా విధానంలో సోషల్ మీడియా పెద్ద మార్పు తెచ్చిందని మోదీ చెప్పారు. ‘‘నేను సోషల్ మీడియాలోకి వచ్చినపుడు.. నేను ముఖ్యమంత్రినో, ప్రధానమంత్రినో అవుతానని నాకు తెలియదు. ప్రపంచం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండేది. ప్రపంచం గురించిన సమాచారం తెలుసుకునేందుకు సోషల్ మీడియా నాకు సాయపడింది. నా ఆలోచనా విధానంలో ఇది పెద్ద మార్పు తెచ్చింది’’ అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ప్రభుత్వాన్ని - ప్రజలను నిరంతరం అనుసంధానించే శక్తి సోషల్ మీడియాకు ఉంది. పొరపాటు ఏమిటనేది వెంటనే తెలిసిపోతుంది. తద్వారా ప్రభుత్వం దానిని సరిచేసే చర్యలు చేపట్టవచ్చు. సోషల్ మీడియా కారణంగా రోజు వారీ ఓటింగ్ ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా బలం. నా పరిపాలనలో సోషల్ మీడియా పాత్ర చాలా ఉంది’’ అని ఆయన వివరించారు. గూగుల్ ఆఫీస్‌లో మోదీ సాన్‌జోస్: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్, మాజీ సీఈఓ ఎరిక్ ష్మిట్తో కలిసి కార్యాలయ ప్రాంగణంలో పర్యటించారు. ఈ సందర్భంగా సంస్థ కీలక ప్రాజెక్టుల గురించి వారు మోదీకి వివరించారు. గూగుల్ స్ట్రీట్ వ్యూ, గూగుల్ ఎర్త్ మొదలైన వాటి ఉపయోగాల గురించి చెప్పారు. డిజిటల్ ఇండియా గురించి చర్చించారు. అనంతరం ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు. తన డిజిటల్ ఇండియా స్వప్నం గురించి వారికి వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. భారతీయ రైల్వే, గూగుల్ భాగస్వామ్యంతో 500 రైల్వే స్టేషన్లలో ఆధునిక సాంకేతిక సౌకర్యాలు కల్పించనున్నారు. -
మోదీ అమెరికా పర్యటన
కార్పొరేట్ దిగ్గజాలను కలవడం దగ్గరనుంచి సిలికాన్ వ్యాలీ సందర్శన వరకూ... సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై జరిగే సదస్సు మొదలుకొని... భద్రతామండలి విస్తరణ అవసరాన్ని తెలియజేయడం వరకూ ఎన్నో అంశాలు ఇమిడి ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తీరిక లేకుండా సాగుతున్నది. సుస్థిరాభివృద్ధిపై ఐక్య రాజ్యసమితి నిర్వహించిన ప్రత్యేక శిఖరాగ్ర సదస్సులో వాతావరణ కార్యాచరణకు ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా కదలాల్సిన అవసరాన్ని తెలియజెబుతూ పునర్వి నియోగ ఇంధన వనరులను నూతన విధానాల ద్వారా అభివృద్ధి చేసుకునేందుకు వివిధ దేశాల మధ్య సహకారం ఉండాలని మోదీ ప్రతిపాదించారు. అలాగే పర్యావ రణానికి చేటు కలిగించే జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరమున్నదని పరోక్షంగా పారిశ్రామిక దేశాలకు ఆయన చెప్పిన హితవు కూడా ఎన్నదగినదే. ఈ ప్రత్యేక శిఖరాగ్ర సదస్సు సుస్థిరాభివృద్ధికి సంబంధించి కొత్త సంకల్పాన్ని చెప్పుకుంది. 2030 నాటికల్లా ప్రపంచ రూపురేఖల్ని మార్చేందుకు వీలుగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వెలువరించింది. ఇందులో 17 ప్రధాన లక్ష్యాలు న్నాయి. వాటికి అనుబంధంగా ఉప లక్ష్యాల ప్రకటనా ఉంది. వచ్చే పదిహేనేళ్లలో పేదరికాన్ని రూపుమాపడంతోపాటు ఆకలిని, వ్యాధులనూ తరిమి కొట్టడం, పర్యా వరణ విధ్వంసాన్ని నివారించడం, స్త్రీ-పురుష సమానత్వం, ఆహార భద్రత, నాణ్య మైన విద్య, ఉపాధి కల్పన వరకూ అందులో ఉన్నాయి. ఈ లక్ష్యాలు, ఉపలక్ష్యాలు సాధించడం సామాన్యమైన విషయం కాదు. ప్రపంచ దేశాలన్నీ చురుగ్గా పాల్గొని ఈ మహా యజ్ఞంలో భాగస్తులైతే తప్ప... ఎక్కడికక్కడ ఇవి రాజకీయ లక్ష్యాలుగా మారితే తప్ప వీటిని సాధించడం సాధ్యం కాదు. ఇందుకోసం మొత్తంగా దాదాపు 5 లక్షల కోట్ల డాలర్ల సొమ్ము అవసరమవు తుందన్న అంచనాలున్నాయి. ధనిక దేశాలు పర్యావరణ విధ్వంసంలో తమ పాత్రేమిటో గుర్తించి దాన్ని సవరించుకోవడంతోపాటు పేద దేశాల మనుగడకు, అభివృద్ధికి పూచీ పడాల్సిన బాధ్యత ఉన్నదని తెలుసుకుంటే తప్ప ఇంత విస్తృత మైన కార్యాచరణ ప్రణాళిక నెరవేరదు. భారత్ తన వంతుగా 2022కల్లా పునర్విని యోగ ఇంధన వనరుల ఆధారంగా లక్షా 75 వేల మెగావాట్ల విద్యుదుత్పాదన లక్ష్యంగా పెట్టుకున్నదని...ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టపరిచి, నదులను ప్రక్షాళన చేసి పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయదల్చుకున్నామని మోదీ చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి. అయితే ఆచరణలో ఇందుకెదురయ్యే ఇబ్బందులను సమర్థవంతంగా అధిగమించడంలోనే వాటి విజయం ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ పేరిట వర్ధమాన దేశాల ప్రాధాన్యతల్లో ధనిక దేశాలు చొరబడే ప్రయత్నం చేయడాన్ని మోదీ నిర్మొహమాటంగానే ప్రస్తావిం చారు. ఈ సందర్భంగా ఆయన ‘వాతావరణ న్యాయం’ అవసరమని ప్రతిపాదిం చారు. ఇందులో అసంబద్ధమేమీ లేదు. పారిశ్రామిక దేశాలు భారీయెత్తున కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి విడిచిపెడుతున్నాయి. అదే సమయంలో వర్ధమాన దేశాలను సమాన బాధ్యుల్ని చేయాలని చూస్తున్నాయి. ఈ ధోరణిని మార్చుకోన ట్టయితే సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధన సాధ్యంకాదు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా భారత్‌తోపాటు మరికొన్నిటికి చోటీయాలన్న డిమాండ్‌ను ఈసారి మరింత గట్టిగా వినిపించే ప్రయత్నం జరిగింది. ఇందుకు అలాంటి హోదాను ఆశిస్తున్న జర్మనీ, బ్రెజిల్, జపాన్‌లను కూడగట్టాలన్న మోదీ సంకల్పం నెరవేరింది. జీ-4 శిఖరాగ్ర సదస్సు పేరిట న్యూయార్క్‌లో నరేంద్ర మోదీ నిర్వహించిన సమావేశం మండలిని అర్ధవంతమైన రీతిలో సంస్కరించాలని, విస్తృతం చేయాలని డిమాండ్చేసింది. ఈ డిమాండ్ సాధనకు సభ్యదేశాలన్నిటినీ కూడగట్టాలని తీర్మానించింది. అయితే ఇది నెరవేరడం అంత సులభం కాదు. ఇందుకు రెండు రకాల అడ్డంకులుంటాయి. అయిదు శాశ్వత సభ్య దేశాలు అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలు యథాతథ స్థితిని మార్చడానికి సిద్ధంగా లేవు. అయితే ఆ సంగతిని అవి బహిరంగ పరచడం లేదు. వీటిలో చైనా తప్ప మిగిలిన దేశాలన్నీ భారత్‌కు శాశ్వత సభ్యత్వం రావడానికి కావలసిన అర్హతలున్నాయని అనడం తప్ప... అది సాకారం కావడానికి అవసరమైన చర్యలకు సిద్ధపడటం లేదు. సకల దేశాలూ పాల్గొన్న ప్రపంచ శిఖరాగ్ర సదస్సు పదేళ్ల క్రితమే భద్రతామండలి రూపురేఖల్ని మార్చాలని పిలుపునిచ్చినా శాశ్వత సభ్య దేశాలు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయాయి. మరోపక్క మండలిని సంస్కరించడంవల్ల మనకొచ్చే లాభమేమిటని సమితి సభ్య దేశాలు అనుకుంటున్నాయి. ఆ దేశాలన్నిటినీ కలిసి, తమనూ శాశ్వత సభ్య దేశాలుగా మారిస్తే వాటికొచ్చే ఉపయోగమేమిటన్నది భారత్, జర్మనీ, బ్రెజిల్, జపాన్‌లు వివరించి ఒప్పించగలిగితే వేరు. ఈ మొత్తం వ్యవహారం అవాస్తవిక అంచనాలపై ఆధారపడిందన్న మాజీ విదేశాంగ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా విమర్శలు కొట్టివేయదగ్గవి కాదు. ఒకప్పుడు గదర్ పార్టీ వంటి తిరుగుబాటు సంస్థకు పురిటిగడ్డగా, ఇప్పుడు డిజిటల్ ప్రపంచ శాసనకర్తగా ఉన్న సిలికాన్ వ్యాలీలోఆదివారం మోదీ ప్రసంగించి అందరినీ ఆకట్టుకోగలిగారు. డిజిటల్ ఇండియా నిర్మాణంలో పాలుపంచుకోమని కార్పొరేట్ దిగ్గజాలకు ఆయన పిలుపునిచ్చారు. అందుకు వారినుంచి వచ్చిన స్పందనా దీటుగానే ఉంది. సమాచార సాంకేతికతను సామాన్యులకు చేరువచేసి, అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసేందుకు ఇది తోడ్పడగలదని ఆశించాలి. అమెరికా అధ్యక్షుడు ఒబామాను మంగళవారం కలవడంతో ముగిసే మోదీ పర్యటన ద్వైపాక్షిక, ఆర్ధిక, వాణిజ్య రంగాల్లో...డిజిటల్ ఇండియా నిర్మాణంలో ఏమేరకు దోహదపడిందో రాగలకాలంలో తెలుస్తుంది. -
డిజిటల్ ఇండియాలోకి టెక్ దిగ్గజాలు
500 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫైకి గూగుల్ సహకారం... * 5 లక్షల గ్రామాల్లో మైక్రోసాఫ్ట్ చౌక బ్రాడ్‌బ్యాండ్ * భారత్‌లో ప్లాంట్ ఏర్పాటుపై యాపిల్ సానుకూలత! శాన్‌జోస్: ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి సహకారం అందించేందుకు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు ముందుకొచ్చాయి. అమెరికా పర్యటనలో భాగంగా మోదీ సిలికాన్ వ్యాలీలో అగ్రగామి ఐటీ కంపెనీల చీఫ్‌లతో సమావేశంలో ఈ కీలక ప్రకటనలు వెలువడ్డాయి. గూగుల్ ఉచిత వైఫై... దేశంలో 500 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యాన్ని అందించేందుకు గూగుల్ సహకారం అందించనుంది. గుజరాతీతో సహా 10 భారతీయ భాషల్లో టైపింగ్‌కు అవకాశం కల్పించనున్నట్లు కూడా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. వచ్చే నెలలో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని చెప్పారు. డిజిటల్ లిటరసీ(పరిజ్ఞానం)ని అందరికీ అందించాలంటే స్థానిక భాషల్లో టైపింగ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని.. అందుకే తాము ఈ చర్యలు చేపడుతున్నట్లు పిచాయ్ పేర్కొన్నారు.ఇంకా అనేక కనెక్టివిటీ ప్రాజెక్టులపై కూడా గూగుల్ దృష్టిపెట్టినట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతం చేయడంలో భారత్ అతిపెద్ద పాత్ర పోషించనుందన్నారు. దీనివల్ల ప్రజల జీవనప్రమాణాలు కూడా మెరుగవుతాయని చెప్పారు. నవకల్పనలు, ఎంట్రప్రెన్యూర్షిప్లకు రానున్న కాలంలో భారత్‌ను అత్యంత కీలక కేంద్రంగా మార్చడానికి ప్రధాని మోదీ చాలా కృషిచేస్తున్నారని ఈ సందర్భంగా పిచాయ్ వ్యాఖ్యానించారు. కాగా, భారత్‌లో వివిధ రంగాల్లో ప్రగతి, పరిణామాలను చూసి గూగుల్ చాలా గర్వపడుతోందని, డిజిటల్ ఇండియా పట్ల ప్రధాని మోదీ దార్శనికత అబ్బురపరుస్తోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ‘అసలు నవకల్పనలకు సంబంధించిన స్ఫూర్తి భారతీయుల డీఎన్ఏలోనే ఉంది.. దీంతో వారు చాలా గొప్ప ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొస్తున్నారు. ఇదే స్ఫూర్తి ఇక్కడ మమ్మల్నీ నడిపిస్తోంది’ అని గూగుల్ చీఫ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ చౌక బ్రాడ్‌బ్యాండ్.... మోదీతో సమావేశం సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా భారత్‌లో తన ప్రణాళికలను ప్రకటించారు. ముఖ్యంగా భారత్‌లోని 5 లక్షల గ్రామాలకు చౌకగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు చెప్పారు. దీనికోసం ప్రభుత్వంతో జట్టుకట్టనున్నామని కూడా ఆయన తెలిపారు. మరోపక్క, భారత్‌లో తమ డేటా సెంటర్ల నుంచి క్లౌడ్ సేవలను నిర్వహించనున్నామని, వచ్చే వారంలోనే ఇది ప్రారంభం కానున్నట్లు నాదెళ్ల చెప్పారు. దీన్ని పెద్ద మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ‘డిజిటల్ ఇండియాలో మేం కూడా భాగస్వాములమవుతాం. చౌక బ్రాండ్‌బ్యాండ్ కనెక్టివిటీ, అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్ పరిజ్ఞానంతో ప్రభుత్వాలు, ప్రజలు, వ్యాపారాలు అన్నింటికీ మేలు చేకూరుతుంది. అన్నిస్థాయిల్లో సామర్థ్యం, ఉత్పాదకత, సృజనాత్మకతను పెంపొందించేందుకు తోడ్పడుతుంది’ అని నాదెళ్ల పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియాల ద్వారా భారత్‌లో ప్రపంచస్థాయి మౌలికసదుపాయాలను అభివృద్ధి చేసేందుకు వీలవుతుందన్నారు. భారత్‌కు యాపిల్! భారత్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాని మోదీ యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. భారత్‌లో అపారమైన అవకాశాలున్నాయని.. అందుకే ఇక్కడ ప్లాంట్‌ను నెలకొల్పాల్సిందిగా మోదీ పేర్కొన్నట్లు సమావేశం అనంతరం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. యాపిల్‌కు కాంట్రాక్టు తయారీ సంస్థ అయిన ఫాక్స్‌కాన్ కూడా భారత్‌లో ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మోదీతో భేటీ సందర్భంగా కుక్ భారత్‌పట్ల చాలా ఆసక్తిని వ్యక్తం చేసినట్లు కూడా స్వరూప్ తెలిపారు. ‘యాపిల్‌లోని ప్రతి ఉద్యోగి మదిలో భారత్ అంటే చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే మా కంపెనీ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చిన్నవయస్సులో ఉన్నప్పుడు ప్రేరణ కోసం భారత్‌కు వెళ్లిరావడమే. ఆతర్వాత యాపిల్ ఏర్పాటుకు బీజాలు పడ్డాయి. ప్రధాని మోదీ తలపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇది భారత్ రూపురేఖలను సమూలంగా మార్చేయగలదు(గేమ్ చేంజర్). మేం భారత్‌లో 20 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ అత్యంత ఉత్సాహవంతమైన వినియోగదారులు ఉన్నారు’ అని కుక్ పేర్కొన్నారు. స్టార్టప్‌లకు క్వాల్కామ్ 15 కోట్ల డాలర్ల నిధులు.. భారత్‌లో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు క్వాల్కామ్ ముందుకొచ్చింది. వీటికి 15 కోట్ల డాలర్ల(దాదాపు రూ.975 కోట్లు) మేర నిధులను అందించనున్నట్లు మోదీతో భేటీ సందర్భంగా క్వాల్కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాల్ జాకబ్స్ ప్రకటించారు. ‘భారత్‌లోని వినూత్న స్టార్టప్‌లకు సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నాం. మోదీతో భేటీ సందర్భంగా ఆయన తలపెట్టిన డిజిటల్ ఇండియా ప్రణాళికల గురించి చర్చించాం’ అని జాకబ్స్ పేర్కొన్నారు. భారత్‌లో డిజిటల్ విప్లవం శాన్‌జోస్: డిజిటల్ విప్లవం దిశగా భారత్ వడివడిగా అడుగులేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికా పర్యటలో భాగంగా సిలికాన్‌వ్యాలీలో ప్రపంచ అగ్రగామి ఐటీ కంపెనీల సీఈవోలతో సమావేశం సందర్భంగా తన మానస పుత్రిక అయిన ‘డిజిటల్ ఇండియా’ ప్రణాళికలను వివరించారు. డేటా గోప్యత(ప్రైవసీ), భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడం తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని కూడా ఆయన టెక్ దిగ్గజాలకు హామీనిచ్చారు. మోదీతో విందు(డిన్నర్) సమావేశంలో పాల్గొన్న వారిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ శాంతను నారాయణ్, క్వాల్కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాల్ జాకబ్స్ తదితరులు ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టబోయే పలు ప్రణాళికలను కూడా మోదీ ప్రకటించారు. ముఖ్యంగా దేశంలో పబ్లిక్ వైఫైను మరింతగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే 500 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నామని, ఇందుకోసం గూగుల్‌తో జట్టుకట్టామని కూడా వెల్లడించారు. ఐ-వేస్ కూడా అవసరం... 6 లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించడం కోసం జాతీయ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ విస్తరణను వేగవంతం చేస్తున్నామని ప్రధాని టెక్ సీఈవోలకు వివరించారు. ‘ఈ-గవర్నెన్స్‌తో మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు వీలవుతోంది. ఇప్పుడు భారత్‌లో 100 కోట్ల మంది మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. పరిపాలనతో ప్రజలను మరింత భాగస్వామ్యం చేసేందుకు, ప్రభుత్వాన్ని వారి చెంతకు చేర్చేందుకు ఎం(మొబైల్)-గవర్నెన్స్ తోడ్పడుతుంది. స్కూళ్లు, కాలేజీన్నింటినీ బ్రాండ్‌బ్యాండ్‌తో అనుసంధానిస్తాం. పేవర్ రహిత లావాదేవీలను సాకారం చేయాలన్నదే మా సంకల్పం. దేశంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ లాకర్ సదుపాయాన్ని కల్పించనున్నాం. వ్యక్తిగత డాక్యుమెంట్లను ఇందులో దాచుకోవచ్చు. ఏ ప్రభుత్వ శాఖతో పనిఉన్నా నేరుగా వాటిని పంపడానికి వీలవుతుంది. వ్యాపారవేత్తలకు అనుమతులను వేగంగా ఇచ్చేందుకు ఈ-బిజ్ పోర్టల్‌ను నెల కొల్పాం’ అని మోదీ సీఈఓలకు వివరించారు. డిజిటల్ ఇండియాకు ఫేస్బుక్ సీఈవో మద్దతు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ డిజిటల్ ఇండియాకు తన మద్దతును ప్రకటించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటర్నెట్ను అందించడానికి ప్రధాని మోదీ చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ.. జుకర్‌బర్గ్ తన ఫేస్బుక్ ప్రొఫైల్ చిత్రాన్ని మార్చారు. మార్చిన ప్రొఫైల్ చిత్రంలో భారత జెండా మధ్య భాగంలో నవ్వుతూ జుకర్‌బర్గ్ కనిపిస్తారు. అలాగే ఆయన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మద్దతు తెలియజేయాలని తన ఫాలోయర్లను కూడా కోరారు. ప్రొఫైల్ చిత్రంలో భారత జెండాలో జుకర్‌బర్గ్ టెల్సా ‘పవర్‌బాల్’పై మోదీ ఆసక్తి... అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం టెల్సా మోటార్స్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ ఆవిష్కరిస్తున్న అద్భుతమైన కొత్తకొత్త సాంకేతిక పరిజ్ఞానాలను భారత్‌లో వినియోగించడానికి ప్రధాని ఆసక్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగంలో టెల్సా పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించుకోవచ్చన్నారు. ‘విద్యుత్‌ను ఒక బ్యాటరీలో చాలా కాలంపాటు నిల్వ చేసుకోవడానికి వీలుగా సృష్టించిన పవర్ బాల్ టెక్నాలజీ నన్ను చాలా ఆకట్టుకుంది. ఈ బ్యాటరీ టెక్నాలజీ రైతులకు చాలా ఉపయోగపడుతుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. మోదీకి ప్లాంట్‌ను స్వయంగా దగ్గరుండి చూపించిన టెల్సా సీఈఓ ఎలాన్ మస్క్... సోలార్ విద్యుత్, బ్యాటరీల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలను అందించవచ్చనేది ప్రధానితో చర్చించినట్లు చెప్పారు. 2003లో నెలకొల్పిన టెల్సా.. ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. -
పోప్‌కు తెలుపు.. మోదీకి ఎరుపు..
అక్కడ రోజులు, విషయాలు సర్వసాధారణంగా జరిగిపోతుంటాయి. సీఈవోల నుంచి సాధారణ ఉద్యోగుల వరకు క్యాజువల్ టీషర్ట్స్ ధరించి..ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన టెక్ సాధనాలను నడిపించేపనిలో ఉంటారు. ఒక్క ఉద్యోగులనే కాదు నాన్ టెక్నికల్ స్టాఫ్, ఉద్యోగులకు భోజనాలు తయారు చేసే చెఫ్ లు, ఆఫీస్ బాయ్ లు లక్షల మందికి అసలు డ్రస్ కోడ్ అనేదే లేదు. కానీ శనివారం మాత్రం పరిస్థితి తలకిందులైంది. వీకెండ్ అయినప్పటికీ విశిష్ట వ్యక్తి వస్తున్నందున తమంతట తామే క్యాజువల్ నుంచి ఫార్మల్స్ లోకి మారిపోయారు సిలికాన్ టెక్కీలు.. ఆయా కంపెనీల సీఈవోలూ! 'అవును భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం క్యాజువల్ సిలికాన్ వ్యాలీ ఫార్మల్ గా మారిపోయింది' అంటూ అమెరికా మీడియాలో ఒకటే వార్తలు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం కాలిఫోర్నియాలోని మినేటా శాన్ జోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి అరుదైన ఘన స్వాగతం లభించింది. 33 ఏళ్ల తర్వాత అక్కడ అడుగుపెడుతోన్న భారత ప్రధానిని సగర్వంగా ఆహ్వానిస్తూ 30 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పులతో ప్రత్యేకంగా తయారుచేయించిన రెడ్ కార్పెట్ ను పరిచారు సిలికాన్ వ్యాలీ ప్రొటోకాల్ అధికారులు. 'హాలీవుడ్ నటుడు జోయ్ పెస్కి('ర్యాగింగ్ బుల్' ఫేమ్) సలహామేరకు న్యూజెర్సీకి చెందిన రెడ్ కార్పెట్ స్లోర్స్ డాట్ కామ్ వారిచే ప్రత్యేక రెడ్ కార్పెట్ ను తయారుచేయించాం' అని సిలికాన్ వ్యాలీ ప్రొటోకాల్ చీఫ్ డియాన్నా ట్రయాన్ తెలిపారు. కాగా, తొలిసారిగా అమెరికాకు వచ్చిన పోప్ ప్రాన్సెస్ కు ఫిలడెల్ఫియాలో ఏర్పాటు చేసిన స్వాగత వేడుకలోనూ ఇదే కంపెనీ తయారుచేసిన తెలుపు రంగు కార్పెట్ ను వినియోగించినట్లు చెప్పారు. -
స్టీవ్ జాబ్స్ తరచూ ఇండియా వచ్చింది అందుకే..
ఇండియా కేవలం ఒక విపణే కాదు ప్రపంచానికి ఉద్దీపనం కూడా. అందుకే అక్కడి నుంచి స్ఫూర్తి పొందేందుకు యాపిల్ కంపెనీ దివంగత సహవ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తరచూ ఇండియాకు వచ్చేవారని ప్రస్తుత యాపిల్ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రముఖ టెక్ దిగ్గజాల భేటీకి టిమ్ కూడా హాజరయ్యారు. ఒక్కొక్కరితో దాదాపు 15 నిమిషాలపాటు విడివిడిగా సాగిన సమావేశంలో ఈ మేరకు టిమ్ తన మనోభావాలను మోదీతో పంచుకున్నారు. 'మోదీతో భేటీ బ్రహ్మాండంగా సాగింది' అని సమావేశం అనంతరం టిమ్ ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెండ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, క్వాల్కమ్ ప్రతినిధి పాల్ జాకబ్, సిస్కో సీఈవో జాన్ చాంబర్స్, అడోబ్ సీఈవో శాంతను నారాయెణ్, టైస్ వెంక్ శుక్లాలు కూడా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. భారత్ ను నూతన ఆవిష్కరణలకు వేదికగా మలిచే ప్రక్రియలో నరేంద్ర మోదీ అతివేగంగా దూసుకుపోతున్నారని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. 'గతేడాది నేను ఇండియాలోనే ఉన్నా. అప్పటికీ, ఇప్పటికీ కచ్చితంగా మార్పు జరిగింది. భారత్ లో లాగే సిలికాన్ వ్యాలీలోనూ ఏదో సాధించాలని తపన పడే ఔత్సాహికులను కలిశా' అని పిచాయ్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని సిలికాన్ వ్యాలీగా మారుస్తా
- బిజినెస్ స్టాండర్డ్ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడి - ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వాళ్లు బెజవాడను పట్టించుకోలేదు - అందుకే ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా అభివృద్ధి చెందలేదు సాక్షి, విజయవాడ బ్యూరో: టెక్నాలజీలో రాష్ట్రాన్ని మరో సిలికాన్ వ్యాలీగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రతి స్కూల్ ఒక ఇంక్యుబేషన్ సెంటర్‌గా పనిచేసేలా ప్రోత్సహిస్తామన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఈఓలా పనిచేస్తే కొందరు తనకు ఓట్లేయలేదని, ఇది రాజకీయ వాస్తవమన్నారు. చీఫ్ మినిస్టర్.. చీఫ్ మినిస్టర్‌గానే పనిచేయాలని తెలుసుకున్నానని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువని, ఇక్కడినుంచి ఎన్టీఆర్, ఏఎన్నార్‌తోపాటు అనేకమంది పారిశ్రామికవేత్తలు వచ్చినా ఎవరూ ఇక్కడ వ్యాపారాలు పెట్టలేదని చెప్పారు. అందుకే విజయవాడలో ఒక్క పరిశ్రమ కూడా అభివృద్ధి చెందలేదన్నారు. సోమవారం నగరంలోని ఒక హోటల్లో బిజినెస్ స్టాండర్డ్ దినపత్రిక పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన ఏపీ రౌండ్‌టేబుల్ సమావేశంలో బాబు మాట్లాడారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా ఇప్పటివరకు 1,756 పరిశ్రమలకు 21 రోజుల్లో అన్ని అనుమతులూ ఇచ్చామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కింద ఈ ఏడాది రూ.958 కోట్లతో 995 యూనిట్లు ఏర్పాటు చేసి 16 వేల మందికి ఉద్యోగాలిచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం వల్లే తామూ ఇవ్వాల్సివచ్చిందని తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ ఎస్కే భట్టాచార్య.. గృహనిర్మాణం, ఆరోగ్యం, విద్య, కార్మిక సంస్కరణల్లో ప్రభుత్వ దార్శనికత ఏమిటని ప్రశ్నించారు. అలాగే టెక్ మహీంద్రా సీఈఓ గుర్నానీ, పారిశ్రామికవేత్త సాంబమూర్తి తదితరులు వేసిన ప్రశ్నలకు బాబు జవాబిచ్చారు. పారిశ్రామికవేత్తలు జాస్తి వెంకట్, వీపీ రమేష్ లోక్‌నాథన్, నాగరాజులు పాల్గొన్నారు. పెట్టుబడులు పెట్టేవరకు వెంటపడతా ‘పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఈ పెట్టుబడులు పెట్టేవరకు మీ వెంట పడతాను. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష చేస్తాం. ఒప్పందంలో అనుకున్నట్లుగా చేయకపోతే ఊరుకోం. మా అధికారులతో సమస్యలు ఉంటే అప్పటికప్పుడే పరిష్కరిస్తా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యాటకరంగ పెట్టుబడిదారులకు తేల్చిచెప్పారు. సోమవారం నగరంలోని ఓ హోటల్లో పర్యాటక మిషన్, పర్యాటక విధానాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మూడు నెలల్లో పనులు ప్రారంభమయ్యే ప్రాజెక్టులకు సంబంధించి రూ.830 కోట్ల విలువైన తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. అలాగే రూ.3,845 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలను (ఎంవోయూలు) కుదుర్చుకున్నారు. -
మోదీకి మరో బ్రహ్మరథం!
వాషింగ్టన్: గత ఏడాది న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రహ్మరథం పట్టిన భారతీయ అమెరికన్లు మరోసారి అలాంటి కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారు. వచ్చే సెప్టెంబర్‌లో మోదీ అమెరికాలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొననున్నారు. తర్వాత కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో భారతీయులు నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఇందుకు భారీ ఏర్పాట్లు చేసేందుకు భారతీయ అమెరికన్ సంఘాలు అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాయి. సెప్టెంబర్ 27న ఎస్ఏపీ సెంటర్లో మోదీకి ఘనస్వాగతం పలికేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. -
అమెరికాలో ఘనంగా 'మనబడి' స్నాతకోత్సవం
సన్నివేల్ (కాలిఫోర్నియా): అమెరికాతో పాటు ప్రపంచంలోని 14 దేశాలలో జన్మించిన తెలుగువారికి తెలుగు భాష నేర్పించేందుకు నిర్వహిస్తున్న 'మనబడి' కోర్సు పూర్తి చేసిన వారికి పట్టాలను ప్రదానం చేశారు. సిలికానాంధ్ర, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సన్నివేల్‌లో (అమెరికా) స్నాతకోత్సవం జరిగింది. తెలుగు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కర్నాటి తోమాసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పట్టాలను అందజేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా, న్యూజెర్సీ, డల్లాస్‌లలో నిర్వహించిన పరీక్షలలో 539 మంది సీనియర్, జూనియర్ సర్టిఫికెట్ స్థాయిలలో ఉత్తీర్ణులయ్యారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభోట్ల ఆనంద్ మాట్లాడుతూ.. అమెరికాలో ప్రారంభమైన మనబడి ప్రపంచమంతా విస్తరించడం సంతోషంగా ఉందని అన్నారు. 14 దేశాల్లో 225 కేంద్రాల్లో నిర్వహిస్తున్న మనబడి కేంద్రాల్లో సుమారు 4300 మంది తెలుగును శాస్త్రీయ పద్దతిలో అభ్యసిస్తున్నారని మనబడి పీఠాధిపతి రాజు చమర్తి చెప్పారు. తెలుగు పరిరక్షణకు కృషి చేస్తామని తెలుగు విశ్వ విద్యాలయం ప్రజా సంబంధిత అధికారి డా.జుర్రు చెన్నయ్య అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య మునిరత్నం నాయుడు, పరీక్ష నిర్వహణ అధికారి డా.రెడ్డి శ్యామల ఆధ్వర్యంలో పట్టాల ప్రదానోత్సవం జరిగింది. మనబడి విద్యార్థులు, విశ్వ విద్యాలయ అధికారులు, మనబడి కార్యనిర్వాహక వర్గం స్నాతకోత్సవ గౌన్లు, టోపీలు, కండవాలు ధరించి నిర్వహించిన కవాతు సభికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మనబడి ఆర్థిక వ్యవహారాల ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల, శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ కార్యాలయంలో భారత దౌత్యాధికారి కూచిభట్ల వెంకటరమణ, తోండెపు హన్మంతరావు, రవిప్రసాద్ దోనెపూడి, గంటి శ్రీదేవి, శరత్ వేట, శాంతి కూచిభోట్ల, దిలీప్ కొండిపర్తి, అనిల్ అన్నం, ఆనంద్ బండి తదితరులు పాల్గొన్నారు. -
సిలికాన్ వ్యాలీ వద్దు.. ఇండియా ముద్దు..
న్యూఢిల్లీ: సిలికాన్ వ్యాలీకి పొలోమంటూ వెళ్లిన దేశీ ఇంజనీర్లు ప్రస్తుతం మళ్లీ భారత్ బాట పడుతున్నారు. భారత్‌లో ఈ-కామర్స్ బూమ్, స్టార్టప్‌లలో భారీ జీతభత్యాలు, సదుపాయాలు వారిని స్వదేశంవైపు ఆకర్షిస్తున్నాయి. బిలియన్ల డాలర్ల కొద్దీ పెట్టుబడులు అందుకుంటున్న ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ సంస్థలు దానికి తగ్గట్లుగానే వ్యాపార విస్తరణ కోసం సిబ్బందిపై భారీగా వెచ్చిస్తున్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకే ఇంజనీర్లు మళ్లీ ఇంటిబాట పడుతున్నారు. ఈ-కామర్స్‌లో రెండేళ్ల క్రితం వచ్చిన పెట్టుబడులు 2 బిలియన్ డాలర్ల కన్నా తక్కువగా ఉండగా.. గతేడాది ఏకంగా 5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చిపడ్డాయి. దీంతో తదుపరి దశ విస్తరణకు అవసరమైన నిపుణులను రిక్రూట్ చేసుకోవడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కి చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌ను రిక్రూట్ చేసుకుంది. వీరికి జీతభత్యాలు ఎంత ఆఫర్ చేసినదీ కంపెనీ వెల్లడించకపోయినప్పటికీ, 3-4 సంవత్సరాల్లో ఇవి 1 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా. ఈ ఇద్దరూ భారతీయ ఇంజనీర్లే. ఇక స్నాప్‌డీల్, ఇన్మొబీ, జొమాటో వంటి దేశీ కంపెనీలు కూడా గడచిన అయిదేళ్లలో సుమారు 20 మంది ఉద్యోగులను సిలికాన్ వ్యాలీ నుంచి రిక్రూట్ చేసుకున్నాయి. ఇలా స్వదేశం తిరిగొస్తున్న ఇంజనీర్ల సంఖ్య ప్రస్తుతం నామమాత్రంగానే కనిపిస్తున్నా, అంతర్జాతీయ స్థాయిలో దేశీ స్టార్టప్‌లు ఎదుగుతున్నాయనడానికి సంకేతాలుగా పరిశ్రమ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. అనేక కారణాలు.. భారతీయ ఇంజనీర్లు తిరిగి వస్తుండటానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయంటున్నారు కన్సల్టెంట్లు. వేగంగా ఎదుగుతున్న స్టార్టప్‌లలో భాగం కాగలగడం, చేరినప్పుడు లభించే బోనస్‌లు.. స్టాక్ ఆప్షన్లు, ఇతర భత్యాలు ఇంజనీర్లను ఆకర్షిస్తున్నాయని వారు చెబుతున్నారు. ఇవే కాకుండా తల్లిదండ్రులు, బంధువులకు దగ్గర్లో ఉండగలగటం మరో అదనపు ఆకర్షణగా ఉంటోంది. అయితే, జీతభత్యాల కన్నా స్టార్టప్లపైగల ఆసక్తే కొందరిని వెనక్కి రప్పిస్తోంది. అలాగని కంపెనీలేమీ వారికి తక్కువ చేయకుండా.. తగు సదుపాయాలు కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగుల కుటుంబాల కోసం సమ్మర్ క్యాంపులు ఇతరత్రా నిర్వహిస్తున్నాయి. -
విద్యారంగంలో సరిహద్దుల్లేవు
గెస్ట్ కాలమ్ ‘గ్లోబలైజేషన్, అకడమిక్ ఒప్పందాలు వంటి కారణాలతో విద్యా రంగంలో సరిహద్దులు తొలగిపోయాయి. మన విద్యార్థులు టీంవర్క్, కొలాబరేటివ్ లెర్నింగ్‌ను అలవర్చుకుంటే ప్రపంచం నలుమూలల్లో ఎక్కడైనా రాణించగలరు. సిలికాన్ వ్యాలీలో పలు సంస్థల్లో విధులు నిర్వర్తిస్తూ.. అద్భుత ప్రతిభ కనబరుస్తూ ఉన్నత స్థానాలు చేరుకుంటున్న భారతీయులే ఇందుకు నిదర్శనం’ అంటున్నారు కాలిఫోర్నియాలోని ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ-దక్షిణాసియా విభాగం రిక్రూట్మెంట్ డెరైక్టర్ సుమన్ భార్గవ. విదేశీ విద్య అవకాశం ఆశించిన వారందరికీ అందకపోయినా.. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ల ద్వారా ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవచ్చని చెబుతున్నారు భార్గవ. కాలిఫోర్నియాలోని ఐటీయూలో 2008లో ఎంబీఏ విద్యార్థిగా అడుగుపెట్టి, అక్కడే ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో మార్కెటింగ్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం అదే యూనివర్సిటీ దక్షిణాసియా విభాగం రిక్రూట్మెంట్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సుమన్ భార్గవతో ఇంటర్వ్యూ.. ఉత్తమంగా రాణిస్తున్నారు విదేశీ విద్య ఔత్సాహికులు ఆందోళన చెందే అంశం.. అక్కడ మనం రాణించగలమా? అని! ఇలాంటి సందేహంతోనే అకడమిక్ నైపుణ్యాలు, ఇతర అర్హతలు ఉన్నప్పటికీ చాలా మంది చక్కటి అవకాశాలు చేజార్చుకుంటున్నారు. సిలికాన్ వ్యాలీలోని పలు సంస్థల్లో భారతీయు విద్యార్థులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు. ఈ ఏడాదిలోనే మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సత్య నాదెళ్ల, సిస్కో సీటీఓగా నియమితులైన పద్మశ్రీ వారియర్ వంటి వారే ఇందుకు నిదర్శనం. అవగాహన పెంచుకోవాలి ఇప్పుడు మన విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా అంతర్జాతీయంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యం గా అమెరికాలో ఎన్నో యూనివర్సిటీలు కల్చరల్ డైవర్సిటీ పేరుతో విదేశీ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఉదాహరణకు ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలోని ఆరు కోర్సుల్లో దాదాపు 30 దేశాల విద్యార్థులు ఉన్నారు. అంతేకాకుండా తొలి ట్రైమిస్టర్ లేదా సెమిస్టర్లో ప్రతిభ ఆధారంగా ఆయా ఇన్స్టిట్యూట్లు ఆర్థిక చేయూత కూడా అందిస్తున్నాయి. కానీ సమస్య అంతా మన విద్యార్థులకు సంబంధిత ఇన్స్టిట్యూట్లు, వాటిలో లభించే కోర్సుల గురించి అవగాహన లేకపోవడమే. మన విద్యార్థులు ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా తమ అర్హతలకు సరితూగే కోర్సు, ఇన్స్టిట్యూట్ల సమాచారం తెలుసుకోవాలి. ఈ రెండు లక్షణాలతో మరింత ఉన్నతంగా విద్యార్థులు అకడమిక్‌గా రాణించాలంటే ముఖ్యంగా రెండు లక్షణాలు అవసరం. అవి.. టీం వర్క్, కొలాబరేటివ్ లెర్నింగ్. దీనివల్ల తమకు తెలియని కొత్త విషయాలపై అవగాహన లభించడంతోపాటు, తమలోని లోటుపాట్లు కూడా తెలుస్తాయి. ఇంకా రాణించాల్సిన అంశాల గురించి స్పష్టత వస్తుంది. అకడమిక్ ఒప్పందాలతో నైపుణ్యాలు కేవలం పుస్తకాలు, లేబొరేటరీలకే పరిమితమైతే ఆశించిన ఫలితాలు లభించడం కష్టం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయిలో దీటుగా రాణించాల్సిన అవసరముంది. అందుకు అకడమిక్ ఒప్పందాలు చక్కని మార్గం. వీటి ద్వారా ఇటు విద్యార్థులకు, అటు ఇన్స్టిట్యూట్లకు కూడా బహువిధాల పరిజ్ఞానం లభిస్తుంది. ఉదాహరణకు భారతదేశంలోని ఒక విద్యాసంస్థ, అమెరికాలోని ఇన్స్టిట్యూట్తో ఒప్పందం చేసుకుంటే.. అమెరికాలోని అకడమిక్ విధానాలు, అక్కడి పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు ఆ ఇన్స్టిట్యూట్లు వ్యవహరిస్తున్న తీరుపై అవగాహన లభిస్తుంది. విద్యార్థులకు, ఫ్యాకల్టీకి కూడా ఉపయుక్తం. యంగ్ టాలెంట్‌కు కేరాఫ్ భారత్ ఇటీవల కాలంలో చాలా విదేశీ యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు ముఖ్యంగా అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్లు భారతదేశంలోని ఐఐటీల నుంచి టైర్-1, 2 స్థాయిల్లోని ఇన్స్టిట్యూట్లతో ఒప్పందాలకు ముందుకొస్తున్నాయి. మనదేశంలో ఉన్న యంగ్ టాలెంటే ఇందుకు కారణం. పనిలో ఇమిడేతత్వం, నిబద్ధత విషయంలో భారతీయులు ఒకడుగు ముందుంటారనే అభిప్రాయం అమెరికా పరిశ్రమ వర్గాల్లో నెలకొంది. అందుకే అక్కడి ఇన్స్టిట్యూట్లు అకడమిక్ ఒప్పందాల మార్గంలో భారతీయ విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. నేరుగా విదేశీ విద్య కలను నెరవేర్చుకోలేని విద్యార్థులకు ఈ అకడమిక్ ఒప్పందాలు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. వీటి ద్వారా ఒక కోర్సు వ్యవధిలో నిర్దిష్ట కాల పరిమితిలో అక్కడి ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. ఉన్న కొద్ది రోజుల్లోనే అక్కడి అవకాశాలు, ఇతర అంశాలపై అవగాహన పెంచుకొని తమను తాము తీర్చిదిద్దుకోవచ్చు. భవిష్యత్తులో అక్కడ తిరిగి అడుగుపెట్టడానికి కూడా ఆస్కారం లభిస్తుంది. ఓపెన్నెస్.. రెండు దేశాల మధ్య తేడా ఇదే విద్యా విధానానికి సంబంధించి అమెరికా, భారత్‌ల మధ్య తేడా ‘ఓపెన్నెస్’ విధానంలోనే. అమెరికాలోని ఇన్స్టిట్యూట్లలో ఓపెన్నెస్ విధానానికి పెద్దపీట వేస్తారు. ఫలితంగా విద్యార్థులు తమ ఆలోచనలను, సందేహాలను, ఐడియాలను స్వేచ్ఛగా వెల్లడించొచ్చు. ఇలాంటి వాటి ఫలితంగా ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీల యాజమాన్యాలు కూడా తమ బోధన విధానంలో మార్పులు చేస్తుంటాయి. అదే విధంగా ఇన్స్టిట్యూట్లు ఇండస్ట్రీ వర్గాలతోనూ నిరంతరం సంప్రదింపులు సాగిస్తుంటాయి. భారతదేశంలోని ఇన్స్టిట్యూట్లు ఈ విషయంలో కొంత వెనుకంజలో ఉన్నాయి. ఓపెన్నెస్ విధానం విద్యార్థుల కోణంలో ఎంతో మేలు చేసే సాధనం. తమ ఆలోచనలను, అభిప్రాయాలను బిడియం లేకుండా బయటపెట్టే మార్గంగా ఉంటుంది. ముందుగానే సిద్ధం కావాలి ముఖ్యంగా అమెరికాలోని ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు దాదాపు ఏడాదిన్నర ముందుగా కసరత్తు ప్రారంభించాలి. ఎందుకంటే అక్కడి నియంత్రణ సంస్థలు, వాటి గుర్తింపు ఉన్న కళాశాలలు, ఇన్స్టిట్యూట్లను అన్వేషించడానికే ఎక్కువ సమయం పడుతుంది. ముందుగా తాము చేరాలనుకుంటున్న కోర్సుపై స్పష్టత తెచ్చుకుని.. ఆ కోర్సు బోధనలో పేరు గడించిన ఇన్స్టిట్యూట్ల సమాచారం తెలుసుకోవాలి. వాటికి నియంత్రణ సంస్థల గుర్తింపు ఉందో? లేదో పరిశీలించాలి. ఆ తర్వాత నిబంధనల మేరకు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి. మరో మార్గం మూక్స్ విదేశీ విద్య లక్ష్యాన్ని నేరుగా పొందలేని వారికి మరో మార్గం.. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్). అంతర్జాతీయంగా పేరున్న ఇన్స్టిట్యూట్లన్నీ పలు విభాగాల్లో ఆన్లైన్ లెర్నింగ్ విధానంలో వీటిని అందిస్తున్నాయి. ఒక సబ్జెక్ట్ లేదా విభాగానికే పరిమితం కాకుండా పూర్తి స్థాయిలో మూక్స్‌ను అందిస్తూ సర్టిఫికెట్స్ కూడా జారీ చేస్తున్నాయి. వీటికి అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంటోంది. కాబట్టి స్టడీ అబ్రాడ్ అవకాశం పొందలేని విద్యార్థులు మూక్స్‌ను మార్గంగా చేసుకుంటే అంతర్జాతీయ సర్టిఫికెట్లు సొంతమవుతాయి. నిరంతరం నేర్చుకోవాలి నేటి తరం విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన, అనుసరించాల్సిన అత్యంత ఆవశ్యకమైన అంశం.. రెగ్యులర్ లెర్నింగ్. ‘లెర్నింగ్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ సక్సెస్’. ఈ అభ్యసనం కూడా విభిన్నంగా ఉండాలి. తాము చదివే కోర్సు, రంగానికి సంబంధించి విస్తృత పరిధిలో సమాచారాన్ని పొంది, తద్వారా తాజా నైపుణ్యాలను సొంతం చేసుకునే విధంగా ఉండాలి. శరవేగంగా పోటీ పెరుగుతున్న 21వ శతాబ్దంలో ఈ దృక్పథంతో అడుగులు వేస్తేనే విజయం లభిస్తుంది. -
న‘గరం’.. కిస్
‘కిస్ ఆఫ్ లవ్’.. పేరుతో ఉద్యాన నగరం చట్టం.. సంప్రదాయం మధ్య జరిగే యుద్ధానికి వేదిక కానుంది. మోరల్ పోలీసింగ్‌ను వ్యతిరేకిస్తూ కేరళలో ప్రారంభమైన ‘కిస్ ఆఫ్ లవ్’ సెగ త్వరలో సిలికాన్ సిటీకి తగలనుంది. దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. త్వరలో బెంగళూరు కూడా వేదిక కానుంది. అయితే హిందూ సంస్కృతి, సంప్రదాయలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే శ్రీరామ సేన, ఆర్ఎస్ఎస్ ప్రభావం అధికంగా ఉన్న ఈ రాష్ర్టంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం కత్తిమీద సాము లాంటిదే. ఈ కార్యక్రమాన్ని చేపడితే కచ్చితంగా అడ్డుకుంటామని ఇప్పటికే ఆ సంస్థలు హెచ్చరించాయి. బహిరంగ ప్రదేశాల్లో ముద్దు పెట్టుకోవడం చట్ట రీత్యా నేరం కాదు. అయితే అది భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధం. దీంతో తాము చట్ట ప్రకారం నడుచుకోవాలా.. లేక భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాలా.. ‘కిస్ ఆఫ్ లవ్’ వారికి సపోర్ట చేయాలా.. లేక శ్రీరామ సేన, ఆర్ఎస్ఎస్లకు మద్ధతివ్వాలా.. అర్థం కాక హోం శాఖ తలపట్టుకుంది. చట్టం X సంప్రదాయం * సిలికాన్ సిటీని తాకిన ముద్దుల సెగ * 22న ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమం! * నగరంలోని టౌన్‌హాల్ ఎదుట నిర్వహించేందుకు సన్నాహాలు * అడ్డుకుని తీరుతామంటున్న శ్రీరామసేన, ఆర్ఎస్ఎస్.. సంస్థలు * కార్యక్రమానికి సంబంధించిన అనుమతిపై స్పష్టత ఇవ్వని హోం శాఖ సాక్షి, బెంగళూరు : మోరల్ పోలీసింగ్ (నైతిక పోలీసుగిరి)కి వ్యతిరేకంగా కేరళలో ప్రారంభమైన ‘కిస్ ఆఫ్ లవ్’ ఇప్పుడు ఉద్యాననగరిని తాకనుంది. దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో ఇప్పటికే అనేక మంది విమర్శలు, మరెంతో మంది మద్దతుతో సాగిన ఈ కార్యక్రమం ఇప్పుడు ఉద్యాననగరిలో సైతం నిర్వహించనున్నారు. నగరంలోని కొందరు ప్రజాహక్కుల కార్యకర్తలతో కలిసి నగరానికి చెందిన హక్కుల కార్యకర్త రచితా తనేజా (23) ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 22న నగరంలో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక నగరంలోని ప్రముఖ చారిత్రాత్మక కట్టడం ‘టౌన్‌హాల్’ ఎదుట ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రజా హక్కుల కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై నిర్వాహకుల్లో ఒకరైన రచితా తనేజా మాట్లాడుతూ...‘మోరల్ పోలీసింగ్కి వ్యతిరేకంగానే కాదు.. మోరల్ పోలిసింగ్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి సానుభూతిని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలచాము. నగరానికి చెందిన దాదాపు 150 మంది యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.’ అని తెలిపారు. ముందుగా ఎంజీ రోడ్ అనుకున్నా.... నగరంలో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని ముందుగా ఎంజీ రోడ్‌లోని రంగోలి మెట్రో ఆర్ట్ సెంటర్ వద్ద నిర్వహించాలని భావించినప్పటికీ అనంతరం నిర్వాహకులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనేక ధర్నాలకు వేదికగా నిలుస్తున్న టౌన్‌హాల్ ఎదుటే నైతిక పోలీస్గిరీపై తమ వ్యతిరేకతను తెలియజేయాలని భావించి ‘కిస్ ఆఫ్ లవ్’ వేదికను టౌన్‌హాల్‌కు మార్చినట్లు తెలుస్తోంది. ఇక ఇతర నగరాల్లో కార్యక్రమ నిర్వహణ సమయంలో ఏర్పడిన ఇబ్బందులు తిరిగి నగరంలో పునరావృతం కాకుండా ఉండేందుకు గాను ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ముందుగానే రాష్ట్ర హోం శాఖ నుంచి అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అనుమతిపై స్పష్టత ఇవ్వని రాష్ట్ర హోం శాఖ... ఇక ఉద్యాననగరిలో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకుని తీరతామని శ్రీరామ సేన, ఆర్ఎస్ఎస్ తదితర సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో నగరంలో ఈ కార్యక్రమ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ కార్యక్రమ నిర్వహణకు అనుమతిని ఇవ్వడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ విషయంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్ మంగళవారమిక్కడ మాట్లాడుతూ...‘చట్ట ప్రకారం, చట్టానికి లోబడి ఎలాంటి కార్యక్రమానికైతే అవకాశం ఉంటుందో వాటికి అనుమతులు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే సంసృతి హద్దులు దాటి చేసే పనులపై మాత్రం పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటారు’ అని తెలిపారు. కాగా బహిరంగ ప్రదేశాల్లో ముద్దు పెట్టుకోవడం చట్ట రీత్యా నేరమేమీ కాదని.. అయితే భారతీయ సంసృతీ సాంప్రదాయాల ప్రకారం మాత్రం ఇది సరికాదని నగరానికి చెందిన న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి అలాంటి సందర్భంలో ఈ అంశాన్ని చట్ట పరిధిలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారా.. లేక భారతీయ సంసృతీ, సంప్రదాయాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటారా అనే అంశంపై హోం శాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఇక ఈ గందరగోళం నడుమ కార్యక్రమానికి అనుమతి లభించక పోతే ‘కిస్ ఆఫ్ లవ్’ను ఈనెల 29కి వాయిదా వేయాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. -
సెల్ ‘విశ్వ’రూపం
దుబాయ్: చేతిలో సెల్ ఫోన్ లేనిదే రోజు గడవడం లేదు. అందరికీ అదొక అత్యవసర పరికరంగా మారిపోయింది. వచ్చే డిసెంబరు నాటికి ప్రపంచంలో సెల్ ఫోన్ల సంఖ్య మొత్తం జనాభా సంఖ్యను మించిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అప్పటికి ప్రపంచ జనాభా 700 కోట్లుంటే సెల్ల సంఖ్య 730 కోట్లకు చేరుతుందని ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ కంపెనీ సిలికాన్ ఇండియా తెలిపింది. ఇప్పటికే 100కు పైగా దేశాల్లో మొబైల్స్ సంఖ్య జనాభాను అధిగమించింది. రష్యాలో 25 కోట్ల సెల్ఫోన్లున్నాయి. అక్కడి జనాభా సంఖ్యతో పోలిస్తే ఇది 1.8 రెట్లు అధికం. బ్రెజిల్‌లోని ఫోన్ల సంఖ్య 24 కోట్లు. ఆ దేశ జనాభాతో పోలిస్తే ఈ సంఖ్య 1.2 రెట్లు ఎక్కువ. ప్రపంచంలో సమాచారం పరిమితంగా ఉండే బీద ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను భారీగా పెంచే సామర్థ్యం సెల్ ఫోన్లకు ఉందని అంతర్జాతీయ మొబైల్ టాప్అప్ ప్రొవైడర్ డింగ్ సీఈఓ మార్క్ రోడెన్ చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఫోన్ ఖాతాదారులు టాప్అప్ కోసం నిత్యావసరాలను త్యాగం చేస్తున్నారని డింగ్ పరిశోధకులు తెలిపారు. వర్థమాన దేశాల్లో 60% మంది రోజువారీ సంపాదన 2 డాలర్లకంటే తక్కువగా ఉన్నప్పటికీ వారిలో అత్యధికులకు మొబైల్స్ ఉన్నాయన్నారు. -
హైదరాబాద్‌లో ఓలా క్యాబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ సర్వీసులందిస్తున్న ఓలా క్యాబ్స్ హైదరాబాద్‌లో అడుగుపెడుతోంది. మే మూడో వారంలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. సిటీ ట్యాక్సీ, ఔట్ స్టేషన్, లోకల్ రెంటల్స్ ఇలా మూడు విభాగాలుగా సేవలు అందిస్తామని చెప్పారు. కంపెనీ తొలి విడతగా 200-250 కార్లను ప్రవేశపెడుతోంది. తొలుత సెడాన్ కార్లను అందుబాటులోకి తేనున్నారు. రానున్న రోజుల్లో ప్రీమియం విభాగంలో ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లను పరిచయం చేయనున్నారు. పగలు, రాత్రి... ఏ సమయంలో బుక్ చేసినా ఒకే రకమైన చార్జీ ఉంటుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, బెంగళూరుతోసహా ఏడు నగరాల్లో ఓలా సేవలందిస్తోంది. 9,000 పైగా కార్లున్నాయి. రోజుకు 15 వేలకుపైగా కాల్స్ అందుకుంటోంది. ఓలా మినీ పేరుతో చిన్న కార్లతో సేవలందిస్తోంది కూడా. వీటికి రూ.100 కనీస చార్జీ. 6 కిలోమీటర్ల తర్వాత కి.మీ.కు రూ.13 చార్జీ ఉంటుంది. ఇక లగ్జరీ కార్లకు కనీస చార్జీ రూ.200. 2 కిలోమీటర్ల తర్వాత కారు మోడల్‌నుబట్టి చార్జీ వసూలు చేస్తారు. ఇద్దరు యువకులు..: ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓలా క్యాబ్స్‌ను భవీష్ అగర్వాల్, అంకిత్ భాటి ప్రారంభించారు. వీరిద్దరూ ఐఐటీ ముంబైలో చదువుకున్నవారే. జనవరి 2011న ఓలా ప్రారంభమైంది. కొద్ది కాలంలోనే క్యాబ్ సేవల్లో దేశంలో అతి పెద్ద సంస్థగా ఎదిగింది. 9,000 కార్లలో ఒక్కటి కూడా సంస్థ సొంతం కాదు. ఔత్సాహిక యువకులకు కార్లను ఇప్పించి, వాటిని సంస్థ బ్రాండ్‌పైన వినియోగిస్తోంది. బుకింగ్స్ ఆధారంగా డ్రైవర్లకు చెల్లింపులు జరుపుతారు. ఆసక్తికర అంశమేమంటే ఓలా క్యాబ్స్ అప్లికేషన్ ద్వారా కారును బుక్ చేసుకుంటే.. ప్రయాణికుడు ఎక్కడున్నా జీపీఎస్ ఆధారంగా డ్రైవరుకు ఇట్టే తెలిసిపోతుంది. -
2025 నాటికి ఐటీ ఉత్పత్తుల వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ ఉత్పత్తుల రంగం వేగంగా విస్తరిస్తోందని, 2025 నాటికి ఇది 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు నాస్కామ్ పేర్కొంది. దేశంలో 10,000కి పైగా ఐటీ ఉత్పత్తుల స్టార్టప్ కంపెనీలు ఉన్నప్పటికీ ఇవన్నీ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని, వీటికి తగినంత నిధులను సమకూర్చాల్సిన అవసరం ఉందని నాస్కామ్ ప్రోడక్ట్ కౌన్సిల్ చైర్మన్ రవి గురురాజ్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘నాస్కామ్ ప్రోడక్ట్ కాన్క్లేవ్ 2014’ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది కనీసం 100 స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సిలికాన్ వ్యాలీ సందర్శించడానికి 25 కంపెనీలను ఎంపిక చేశామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ ప్రోడక్టు కంపెనీలు ఊహించని వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెయైంట్ (ఇన్ఫోటెక్) చైర్మన్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో 3,500కిపైగా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కంపెనీలు పరిపక్వ దశకు చేరుకున్నప్పటికీ వాటి విలువ చాలా తక్కువగా ఉందన్నారు. సగం స్టార్టప్ కంపెనీల విలువ 10 మిలియన్ డాలర్లలోపే ఉందన్నారు. కాని ఇప్పుడు అహ్మదాబాద్, తిరువనంతపురం వంటి చిన్న పట్టణాలకు విస్తరిస్తుండటంతో ఈ కంపెనీలు తట్టుకొని నిలబడగలుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వివిధ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కాలిఫోర్నియా విభజనపై కదలిక
లాస్ ఏంజెలిస్: అమెరికాలో జనాభాలో అత్యంత పెద్దదైన కాలిఫోర్నియా రాష్ట్రాన్ని ఆరు రాష్ట్రాలుగా విభజించాలన్న ప్రతిపాదన వేగం పుంజుకుంది. విభజనపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న ప్రతిపాదన అర్హత సాధించేందుకు ప్రజలతో సంతకాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గత వారం అనుమతించింది. ఈ ప్రతిపాదన అర్హత సాధించాలంటే జూలై మధ్యనాటికి 8,08,000 వేలమంది సంతకాలు అవసరం. సిలికాల్ వ్యాలీకి చెందిన వెంచర్ పెట్టుబడిదారు టిమ్ డ్రేపర్ ఈ విభజన ప్రతిపాదనను తెచ్చారు. ‘3.8 కోట్ల జనాభా ఉన్న కాలిఫోర్నియా ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థల్లో ఒక టి. రాష్ట్రంలో చాలా భాగంలో పాలన సరిగ్గా సాగడం లేదు.. రవాణా, మౌలిక సదుపాయాలు పాతవి. ఇకనైనా విభజించకపోతే పరిస్థితి దిగజారుతుంది’ అని ఆయన గురువారం ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ఆయన ప్రతిపాదనపై నవంబర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగే అవకాశముంది. ఒకవేళ దీని కి ప్రజలు అంగీకరించినా, కాంగ్రెస్ (పార్లమెం టు) ఒప్పుకుంటేనే విభజన సాధ్యమవుతుంది. అదే జరి గితే రాష్ట్రం పశ్చిమ, మధ్య, దక్షిణ కాలిఫోర్నియాలు, సిలికాన్ వ్యాలీ తదితర రాష్ట్రాలుగా విడిపోతుంది.