అమెరికాలోని నిషేధిత వర్సిటీల్లో చేరుతున్నారని అడ్డగింత
శంషాబాద్: అమెరికాలోని ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం మాదిరిగా మరో రెండు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు పాలవుతున్నారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ విశ్వవిద్యాలయం, నార్త్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయంలో చేరడానికి రాష్ట్రానికి చెందిన 20 మంది విద్యార్థులు శనివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఆ రెండు విశ్వవిద్యాలయాలను నిషేధించడంతో అన్నిదేశాల ఇమిగ్రేషన్ కార్యాలయాలతోపాటు ట్రావెల్ ఏజెంట్లకు అక్కడి ప్రభుత్వం సందేశాలు పంపింది.
ఈ మేరకు స్టడీ వీసాపై ఆయా వర్సిటీలకు వె ళ్తున్న విద్యార్థులను శంషాబాద్ ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. జనవరి 4 నుంచి ఆయా వర్సిటీల్లో క్లాసులకు హాజరుకావాల్సిన ఆ విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే అమెరికా చేరుకున్న కొందరు విద్యార్థులు తిరుగుముఖం పట్టినట్లు సమాచారం.
ఎయిర్‌పోర్టులో విద్యార్థుల నిలిపివేత
Published Sun, Dec 20 2015 4:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:12 PM
Advertisement