
మోదీకి మరో బ్రహ్మరథం!
వాషింగ్టన్: గత ఏడాది న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రహ్మరథం పట్టిన భారతీయ అమెరికన్లు మరోసారి అలాంటి కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారు. వచ్చే సెప్టెంబర్‌లో మోదీ అమెరికాలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొననున్నారు. తర్వాత కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో భారతీయులు నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఇందుకు భారీ ఏర్పాట్లు చేసేందుకు భారతీయ అమెరికన్ సంఘాలు అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాయి.
సెప్టెంబర్ 27న ఎస్‌ఏపీ సెంటర్‌లో మోదీకి ఘనస్వాగతం పలికేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.