Brahmaratham
-
మోదీకి మరో బ్రహ్మరథం!
వాషింగ్టన్: గత ఏడాది న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రహ్మరథం పట్టిన భారతీయ అమెరికన్లు మరోసారి అలాంటి కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారు. వచ్చే సెప్టెంబర్‌లో మోదీ అమెరికాలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొననున్నారు. తర్వాత కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో భారతీయులు నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఇందుకు భారీ ఏర్పాట్లు చేసేందుకు భారతీయ అమెరికన్ సంఘాలు అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాయి. సెప్టెంబర్ 27న ఎస్ఏపీ సెంటర్లో మోదీకి ఘనస్వాగతం పలికేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. -
ప్రభంజనం...
సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో రెండురోజులు పర్యటించగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారం ఆద్యంతం జనాభిమానం మధ్యే సాగింది. మధిర, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి ప్రతిచోట జనంపోటెత్తడంతో రోడ్‌షో విజయవంతమైంది. మధిర మండలం శివాపురం గ్రామానికి సోమవారం సాయంత్రం 4.45 గంటలకు చేరుకుని అక్కడినుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విజయమ్మ మంగళవారం రాత్రి సత్తుపల్లి రోడ్‌షోతో ముగించారు. మధిర, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లిలో రెండురోజులు రోడ్‌షో నిర్వహించి... మున్సిపల్ బరిలో వైఎస్సార్ సీపీ, సీపీఎం అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ,అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు కదం తొక్కాలన్నారు. రోడ్‌షో పొడవునా మహిళలు, కూలీలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువత ఎదురేగి ఆమెకు స్వాగతం పలికారు. తొలిరోజు మధిర, ఇల్లెందులో..., రెండో రోజు కొత్తగూడెం, సత్తుపల్లిలలో వెల్లువలా జనం తరలివచ్చి విజయమ్మ ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. ఆమె ప్రసంగంలో వైఎస్ఆర్ పేరును ప్రస్తావించినప్పుడల్లా ప్రజలు జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేస్తూ మహానేతను గుర్తు చేసుకున్నారు. మండుటెండలో సైతం మంగళవారం ఆమె కొత్తగూడెంలో ప్రచారం నిర్వహించగా త్రీటౌన్సెంటర్, రైతుబజార్, పోస్టాఫీస్ సెంటర్లకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. కొత్తగూడెం, చంద్రుగొండ, పెనుబల్లి మీదుగా ఆమె పర్యటన సాయంత్రం 5గంటలకు సత్తుపల్లి చేరుకుంది. సత్తుపల్లిలో జనజాతర.... మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన విజయమ్మకు సత్తుపల్లి ప్రజలు ఘనస్వాగతం పలికారు. వెంగళరావు నగర్ నుంచి మొదలయిన రోడ్‌షో హనుమాన్ నగర్ వరకు జనజాతరగా సాగింది. రింగ్సెంటర్లో ఆమె ప్రసంగం ఉండటంతో సాయంత్రం 4గంటలకే జనంతో కిక్కిరిసి పోయింది. వెంగళరావునగర్, విరాట్ నగర్, జలగం నగర్. గాంధీనగర్, గవర్నమెంట్ ఆస్పత్రి, ఆర్అండ్బీ క్వార్టర్స్ ఏరియా వరకు ఎటు చూసినా జనం వేల సంఖ్యలో బారులు తీరారు. రింగ్‌రోడ్ సెంటర్లో ఆమె ప్రసంగిస్తూ శీనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నప్పుడు జనం ఒక్కసారిగా జేజేలు పలికారు. జనాభిమానం ఉప్పొంగడంతో సత్తుపల్లిలో రోడ్‌షో రెండు గంటలపాటు జరిగింది. రోడ్‌షో జరిగినంత సేపూ.. రింగ్ సెంటర్ నుంచి వేంసూరు రోడ్, అశ్వారావుపేట రోడ్, ఖమ్మం రోడ్ జనంతో కిక్కిరిశాయి. వైఎస్ వల్లే కేటీపీఎస్ 4వ దశ ...: రోడ్‌షోలో విజయమ్మ ప్రసంగిస్తూ....దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుల, మత, ప్రాంతీయ అభిమానాలను చూపకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారని అన్నారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) 4వ దశ 500 మెగావాట్ల విద్యుత్‌ను వైఎస్ తీసుకువచ్చారని అన్నారు. జిల్లా ప్రజలపై వైఎస్ ఎప్పుడూ ఆప్యాయత, అభిమానాలు చూపేవారని చెప్పారు. చంద్రబాబు నాయుడు పాలన కాలంలో రైతులు బషీర్‌బాగ్‌లో విద్యుత్ పోరాటం చేస్తే వారిపై కాల్పులు జరిపించాడని.. ఈదుర్ఘటనలో మృతిచెందిన ముగ్గురిలో ఖమ్మం జిల్లాకు చెందిన ఒకరున్నారన్నారు. ఆకుటుంబాలను చంద్రబాబు పరామర్శించాల్సిందిపోయి కాల్పులు జరిపిన పోలీసులను అభినందించారని.. ఇది బాబు నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. మీ ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను... ‘ఖమ్మం జిల్లా ప్రజలు మా కుటుంబంపై చూపిస్తున్న ఆప్యాయతను, ప్రేమను, ఆదరాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేము. మీ కష్టాలు, బాధలు సంతోషాలలో జగన్ పాలుపంచుకుంటారు.. ధైర్యంగా ఉండండి..’ అని ఆమె భరోసానిచ్చారు. వైఎస్ కుటుంబం ఎప్పటికీ ఈజిల్లాను మరువదన్నారు. ఈపర్యటనలో ఆమె వెంట వైఎస్సార్ సీపీ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, ఎడవల్లి కృష్ణ, తాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ తెల్లం వెంకట్రావు, యువజన విభాగం మూడు జిల్లాల కోఆర్డినేటర్ సాధు రమేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎండీ ముస్తఫా, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు తోట రామారావు, నేతలు భీమా శ్రీధర్, జాలె జానకిరెడ్డి, శివారెడ్డి, సత్తుపల్లి మున్సిపల్ కన్వీనర్ కోటగిరి మురళీకృష్ణారావు, నాయకులు గోలి శ్రీనివాసరెడ్డి, మౌలాలి, కొత్తగుండ్ల శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మురిసిన మంగళాద్రి
మంగళగిరిలోని పానకాల స్వామి తీర్థంనాడు కొండపైనుంచి చూస్తే ఇసుకేసినా రాలునా అన్నట్టుగా కనిపించే భక్త ప్రవాహం... ఆ స్వామి విశిష్టత.. విశ్వాసం.. కాదనలేని సత్యాలు... భక్తుల కొంగు బంగారంలా కోరిన కోర్కెలు తీర్చేవాడని ప్రగాఢ నమ్మకం. అందుకే.. భక్త జనుల పరవళ్లు.. ప్రవాహాలు.. ఆ స్వామి సాక్షిగా మంగళాద్రిలో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’కి సైతం పోటెత్తిన జనసంద్రం. మహానేత తనయ, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలకు పలికిన స్వాగతం తీర్థంనాటి రథోత్సవాన్ని జ్ఞప్తికి తెచ్చింది. సాక్షి, గుంటూరు మహానేత వైఎస్సార్ తనయ, జననేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఎన్నికల ప్రచార భేరికి జనం బ్రహ్మరథం పట్టారు. మండు టెండను లెక్క చేయకుండా షర్మిలతో పాటు కదం తొక్కారు. అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. జిల్లాలో ఐదో రోజుల నుంచి అవిశ్రాంతంగా పర్యటిస్తున్న షర్మిల మంగళవారం పిడుగురాళ్ల నుంచి బయలుదేరి సత్తెనపల్లి, గుంటూరు, పెదకాకాని మీదుగా ఉదయం 11.30 గంటలకు మంగళగిరి చేరుకున్నారు. మంగళగిరి శివారు చినకాకాని జాతీయ రహదారి వై జంక్షన్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. పాత మంగళగిరి సీతారామ కోవెల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తల ఆనంద సందోహాల నడుమ షర్మిల రోడ్ షో ప్రారంభమైంది. బోస్ బొమ్మ సెంటర్, మహాత్మాగాంధీ రోడ్, కూరగాయల మా ర్కెట్ మీదుగా మిద్దె సెంటరుకు చేరుకుని అక్కడ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. రోడ్ షోలో మంగళగిరి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన షర్మిలను చూసేందుకు మహిళలు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. మిద్దె సెంటరు, తాడేపల్లి పట్టణ సెంటర్లో షర్మిల ప్రసంగంతో పార్టీ శ్రేణులు, వైఎస్‌ను అభిమానించే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ద్విగుణీకృతమైంది. జన క్షేమాన్ని కాంక్షించి, అనునిత్యం పేద ప్రజల కోసం పరితపించిన వైఎస్ మరణించిన తరువాత కాంగ్రెస్ సర్కారు సంక్షేమానికి పాడె కట్టి, అభివృద్ధిని అటకెక్కించిందని షర్మిల మండిపడ్డారు. బాబు తొమ్మిదేళ్ల హయాంలో ప్రజలకు మేలు చేసే పనులేవైనా చేశారా? అని షర్మిల ప్రశ్నించినప్పుడు ‘జనం నుంచి లేదు.. లేదు.. అని’ పెద్ద ఎత్తున స్పందన లభించింది. వైఎస్ హయాంలో సంక్షేమ పథకాలు గుర్తు చేస్తూ షర్మిల చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిలో ఉత్సాహం నింపింది. జగన్ జనం కోసమే అహర్నిశలు పాటు పడుతున్నారనీ, ఒక్క అవకాశం ఇస్తే జగనన్న తన జీవితాన్ని ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నారని ఉద్వేగభరితంగా చేసిన షర్మిల ప్రసంగం ప్రతి ఒక్కరిలో ఉత్తేజాన్ని నింపింది. మిద్దె సెంటరు నుంచి షర్మిల కాన్వాయ్ మంగళగిరి పట్టణంలో రాజీవ్‌గాంధీ సెం టరు, గాలిగోపురం, అంబేద్కర్ సెంటర్, గౌతమ బుద్ధరోడ్డు మీదుగా యర్రబాలెం, నులకపేట, ప్రకాష్‌నగర్, డోలాస్‌నగర్, ముగ్గురోడ్డు నుంచి తాడేపల్లి పట్టణానికి చేరుకుంది. దారి పొడవునా అందరికీ అభివాదం చేస్తూ షర్మిల రోడ్ షో, ఎన్నికల ప్రచారం విజయవంతమైంది. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించండి .. మంగళగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆర్కే అన్న, గుంటూరు పార్లమెంటు అభ్యర్థి బాలశౌరి, మున్సిపల్ అభ్యర్థి చిల్లపల్లి మోహనరావులను గెలిపించాలని షర్మిల చేసిన వినతికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. రానున్న ఎన్నికల్లో జెడ్పీటీసీలుగా భీమిరెడ్డి జయలక్ష్మి, యేళ్ళ జయలక్ష్మి, ఎంపీపీలుగా రత్నకుమారి, భారతీదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పోటీ చేస్తున్న స్వరూపరాణిలను అఖండ మెజార్టీతో గెలిపించాలని షర్మిల కోరారు. వైఎస్ కుటుంబానికి అండగా నిలవండి : ఆర్కే పేదవాడి ముఖాన చిరునవ్వు చూడాలనే దివంగత మహానేత వైఎస్ ఆశయాన్ని నెరవేర్చగల సత్తా ఉన్న నేత జగన్ ఒక్కరేనని మంగళగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేర్కొన్నారు. పేదవారికి మేమున్నామనే భరోసా కల్పించిన జగన్, షర్మిల, విజయమ్మలకు అండగా నిలవాలని కోరారు. ఇతర పార్టీలు గాలికి కొట్టుకుపోయేలా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన ఘనత వైఎస్‌దే : బాలశౌరి చేనేత వర్గానికి 18 శాతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీని ప్రధానితో మాట్లాడి తగ్గించిన ఘనత మహానేత వైఎస్‌దేనని గుంటూరు పార్లమెంటు అభ్యర్థి బాలశౌరి అన్నారు. మంగళగిరి జనభేరి సభలో బాలశౌరి మాట్లాడుతూ రత్నాల చెరువును అభివృద్ధి చేసి, చేనేత కార్మికుల కోసం డ్రైనేజి వ్యవస్థను బాగు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎవరిని అడిగినా వైఎస్ పాలనే మేలని ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు.