కర్ణాటక రాజధాని.. దేశానికి ఐటీ రాజధాని.. అదే సిలికాన్ వ్యాలీగా పేరు గాంచిన బెంగళూరు. ఇప్పుడే ఈ మెట్రోపాలిటన్ సిటీ ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీల కార్యకలాపాలతో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో ట్రాఫిక్ రద్దీతో అంతే అపఖ్యాతి పాలవుతుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ట్రాఫిక్ ఆలస్యం, రద్దీ, సిగ్నల్స్ ఆగిపోవడం, ట్రాఫిక్ వల్ల సమయం వృధా అవ్వడం, వాహనాల్లో ఇంధనం వృధా ఖర్చు వంటి ఇతర కారణాల వల్ల సంవత్సరానికి రూ.19,725 కోట్ల నష్టం వాటిల్లితున్నట్లు తెలుస్తోంది.
ట్రాఫిక్ నిపుణుడు ఎంఎన్ శ్రీహరి అతని బృందం రోడ్ ప్లానింగ్, ఫ్లైఓవర్, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాల లోటుకు సంబంధించిన సమస్యలపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో బెంగళూరు నగరంలో 60 పూర్తిస్థాయిలో ఫ్లైఓవర్‌లు ఉన్నప్పటికీ, ఆలస్యం, రద్దీ, సిగ్నల్‌ల వద్ద ఆగిపోవడం, వేగంగా వెళ్లే వాహనాలు, ఇంధన నష్టం, నెమ్మదిగా వెళ్లడం వంటి కారణాలతో బెంగళూరు వాహనదారులకు రూ. 19,725 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధ్యయనం హైలెట్ చేసింది.
వేగంగా విస్తరిస్తున్న ఐటీ రంగం
బెంగళూరులో రోజు రోజుకీ ఐటీ రంగం మరింత వృద్ది సాధిస్తోంది. తద్వారా హౌసింగ్,ఎడ్యుకేషన్‌తో పాటు వివిధ రంగాల అభివృద్దిలో పాలు పంచుకుంటుంది.వెరసీ బెంగళూరులో అసాధారణ జనాభా పెరుగుదల 14.5 మిలియన్లు ఉండగా వెహికల్ పాపులేషన్ 1.5 కోట్లుగా ఉంది.
మరింత విస్తరిస్తున్న బెంగళూరు
అంచనా ప్రకారం.. ఈ ఏడాది బెంగళూరు నగరం మరింత విస్తరిస్తోంది. 88 స్కైర్ కిలోమీటర్ల నుంచి 985 కిలోమీటర్లకు పెరిగింది. నగరం 1,100 చదరపు కిలోమీటర్లకు విస్తరించాలని అధ్యయనం ప్రతిపాదించింది. మరోవైపు, రహదారి పొడవు పెరుగుదల వాహనాల పెరుగుదల, విస్తీర్ణం పెరుగుదలకు సమానంగా లేదు. రహదారి మొత్తం పొడవు సుమారు 11,000 కిలోమీటర్లు. రవాణా డిమాండ్, చేసే ప్రయాణికులకు ఏ మాత్రం సరిపోదని నివేదిక పేర్కొంది.
ప్రభుత్వం చొరవ తీసుకోవాలి
పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కొరత ఆ నగర వాసుల్ని తీవ్రంగా వేధిస్తుంది. ఆలస్యం, రద్దీ, ప్రయాణం వంటి కారణాల వల్ల సామానులపై పరోక్షంగా ఖర్చుల భారం పడుతుంది. ఆర్ధికంగా నష్టపోతున్నారని శ్రీహరి అన్నారు. అంతేకాదు, తాము జరిపిన ఈ సర్వేలో ట్రాఫిక్ కారణంగా ఏడాదికి రూ.20వేల కోట్లు నష్టం వాటిల్లిందని, ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment