గ్రీన్‌కార్డులపై ‘కంట్రీ లిమిట్‌’ తొలగించండి | US lawmakers to remove the 7 per cent country limit on green cards | Sakshi
Sakshi News home page

గ్రీన్‌కార్డులపై ‘కంట్రీ లిమిట్‌’ తొలగించండి

Published Fri, Apr 28 2023 5:28 AM | Last Updated on Fri, Apr 28 2023 5:28 AM

US lawmakers to remove the 7 per cent country limit on green cards - Sakshi

వాషింగ్టన్‌:  గ్రీన్‌కార్డులపై 7 శాతంగా ఉన్న కంట్రీ లిమిట్‌ను తొలగించాలని సిలికాన్‌ వ్యాలీకి చెందిన ప్రముఖ భారత–అమెరికన్‌ వ్యాపారవేత్త అజయ్‌ జైన్‌ భుతోరియా అమెరికా పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిమితి వల్ల గ్రీన్‌కార్డుల కోసం అర్హులైన వారు సుదీర్ఘీకాలం నిరీక్షించాల్సి వస్తోందని చెప్పారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో భారతఅమెరికన్‌ పార్లమెంట్‌ సభ్యుడు రో ఖన్నా ఆధ్వర్యంలో తాజాగా జరిగిన యూఎస్‌–ఇండియా సదస్సులో అజయ్‌ జైన్‌ మాట్లాడారు.

హెచ్‌–1 వీసాలపై లేని కంట్రీ లిమిట్‌ గ్రీన్‌కార్డులపై ఎందుకని ప్రశ్నించారు. అమెరికాలో ఇప్పుడు 8,80,000 మంది గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. వీరిలో భారత్, చైనా నుంచి వచ్చినవారి సంఖ్య అధికంగా ఉందన్నారు. పదేళ్లకుపైగా నిరీక్షిస్తున్నవారు చాలామంది ఉన్నారని గుర్తుచేశారు. చట్టాన్ని మార్చకపోతే మరో 50 సంవత్సరాలు ఎదురు చూడక తప్పదని తేల్చిచెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement