Indian-American businessman
-
గ్రీన్‌కార్డులపై ‘కంట్రీ లిమిట్’ తొలగించండి
వాషింగ్టన్: గ్రీన్‌కార్డులపై 7 శాతంగా ఉన్న కంట్రీ లిమిట్‌ను తొలగించాలని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ భారత–అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ జైన్ భుతోరియా అమెరికా పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిమితి వల్ల గ్రీన్‌కార్డుల కోసం అర్హులైన వారు సుదీర్ఘీకాలం నిరీక్షించాల్సి వస్తోందని చెప్పారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లో భారతఅమెరికన్ పార్లమెంట్ సభ్యుడు రో ఖన్నా ఆధ్వర్యంలో తాజాగా జరిగిన యూఎస్–ఇండియా సదస్సులో అజయ్ జైన్ మాట్లాడారు. హెచ్–1 వీసాలపై లేని కంట్రీ లిమిట్ గ్రీన్‌కార్డులపై ఎందుకని ప్రశ్నించారు. అమెరికాలో ఇప్పుడు 8,80,000 మంది గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. వీరిలో భారత్, చైనా నుంచి వచ్చినవారి సంఖ్య అధికంగా ఉందన్నారు. పదేళ్లకుపైగా నిరీక్షిస్తున్నవారు చాలామంది ఉన్నారని గుర్తుచేశారు. చట్టాన్ని మార్చకపోతే మరో 50 సంవత్సరాలు ఎదురు చూడక తప్పదని తేల్చిచెప్పారు. -
అమెరికాలో ఎన్నారై వ్యాపారవేత్త అరెస్టు
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హాండాను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించని కారణంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం హాండాను యూఎస్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం విచారణ నిమిత్తం బోస్టన్‌కు తరలించారు. బోస్టన్‌లో ఆల్ఫా ఒమేగా జువెలర్స్ యజమాని అయిన హాండాకు వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించలేదు. అనూహ్యంగా 2007 డిసెంబర్లో అమెరికాను వదిలివెళ్లాడు. రూ.46.6 కోట్ల మొత్తాన్ని చెల్లించకుండా ఎగవేశారని అధికారుల లెక్కల్లో తేలింది. దీంతో హాండా అమెరికాకు తిరిగిరాగానే లాస్ఏంజెలెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆయనపై మోపిన అభియోగాలు రుజువైతే అమెరికా చట్టాల ప్రకారం 20 ఏళ్ల వరకు జైలు పడే అవకాశముందని ఎఫ్ బీఐ తెలిపింది.