అమెరికాలో ఎన్నారై వ్యాపారవేత్త అరెస్టు
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హాండాను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించని కారణంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం హాండాను యూఎస్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం విచారణ నిమిత్తం బోస్టన్‌కు తరలించారు. బోస్టన్‌లో ఆల్ఫా ఒమేగా జువెలర్స్ యజమాని అయిన హాండాకు వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించలేదు.
అనూహ్యంగా 2007 డిసెంబర్‌లో అమెరికాను వదిలివెళ్లాడు. రూ.46.6 కోట్ల మొత్తాన్ని చెల్లించకుండా ఎగవేశారని అధికారుల లెక్కల్లో తేలింది. దీంతో హాండా అమెరికాకు తిరిగిరాగానే లాస్‌ఏంజెలెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆయనపై మోపిన అభియోగాలు రుజువైతే అమెరికా చట్టాల ప్రకారం 20 ఏళ్ల వరకు జైలు పడే అవకాశముందని ఎఫ్ బీఐ తెలిపింది.