ఈవీ దిగ్గజ కంపెనీ టెస్లా అనూహ్య నిర్ణయం తీసుకుంది. కంపెనీ హెడ్ క్వార్టర్స్‌ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు తరలించనున్నట్లు ప్రకటించి ఆటోమొబైల్ మార్కెట్‌కు భారీ షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన షేర్‌హోల్డర్స్ వార్షికోత్సవం సమావేశంలో ఊహించని ఈ ప్రకటన చేశాడు కంపెనీ సీఈవో ఎలన్ మస్క్.
ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న టెస్లా.. కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీ నుంచే ఆటోమొబైల్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. అయితే ఉన్నపళంగా ఎందుకు తరలిస్తున్నారనే విషయం కాసేపు హైడ్రామా నడిపించిన మస్క్.. విస్తరణలో భాగంగానే ఈ తరలింపు చేపట్టినట్లు చెప్పారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు టెస్లా హెడ్ క్వార్టర్స్‌ను తరలించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంత కాలపరిమితిలో చేస్తామనే విషయంపై మాత్రం మస్క్ స్పష్టత ఇవ్వలేదు.
ప్రస్తుతం చిప్, ఇతరత్ర కంపోనెంట్‌ల కొరత సమస్య ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ.. పాలో ఆల్టోలో ఉన్న హెడ్ క్వార్టర్స్ కేంద్రం టెస్లా సేల్స్ ఆశాజనకంగానే సాగుతున్నట్లు సమావేశంలో మస్క్ వెల్లడించాడు. అయితే ఫ్రెమోంట్ ప్లాంట్ నుంచి వాహనాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పరిమితుల కారణంగా అది జరగలేకపోతుందని ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇక హెడ్‌క్వార్టర్స్ తరలింపు గురించి రకరకాల ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. కాలిఫోర్నియాలో ఉన్న చట్టాల వల్ల మస్క్ ఇబ్బందులు పడుతున్నాడని, అందుకే తరలింపునకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అంతేకాదు తక్కువ ఇన్‌కమ్ ట్యాక్స్‌లు, తక్కువ రెగ్యులేషన్స్ ఉన్న ప్రాంతాలకు తరలిపోయే అంశం గురించి మస్క్ సహా పలువురు టెక్ దిగ్గజాలు చాలాకాలంగా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాలో ఆల్టోకు 2400 కిలోమీటర్ల దూరంలోని ఆస్టిన్‌కు హెడ్ క్వార్టర్స్‌ను తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. టెస్లా తీసుకున్న ఈ ఊహించని నిర్ణయంతో ఆటోమొబైల్ రంగంలో ఎలాంటి కుదేలుకు లోనవుతుందో చూడాలి మరి!.
Comments
Please login to add a commentAdd a comment