
అనర్హుడంటూ కోర్టు షాకిచ్చి 24 గంటలు గడవక ముందే ఎలాన్ మస్క్ కౌంటర్ చర్యకు..
టెస్లా విషయంలో ఆ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ ప్రధాన కార్యాలయాన్ని డెలావర్ నుంచి టెక్సాస్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించారు. భారీ ప్యాకేజీ అందుకునేందుకు మస్క్ అనర్హుడంటూ డెలావర్ కోర్టు తీర్పు ఇచ్చిన తరుణంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలాన్ మస్క్ అనర్హుడంటూ డెలావర్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ వెంటనే మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. డెలావర్ రాష్ట్రంలో ఎవరూ తమ సంస్థలను రిజిస్టర్ చేసుకోవద్దని పిలుపునిచ్చారు.
The public vote is unequivocally in favor of Texas!
— Elon Musk (@elonmusk) February 1, 2024
Tesla will move immediately to hold a shareholder vote to transfer state of incorporation to Texas. https://t.co/ParwqQvS3d
అంతేకాదు.. టెస్లా ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు మార్చాలా? అని పోల్ కూడా పెట్టారు. ఆ పోల్‌లో 80 శాతం అవునని చెప్పడంతో.. మార్పు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు సైతం టెక్సాస్‌లోనే తమ కంపెనీలను రిజిస్టర్ చేసుకుంటాయి. పన్ను శాతం తక్కువగా ఉండడమే అందుకు కారణం.