
ఆంక్షలు, టారిఫ్‌లు అంటూ ప్రపంచ దేశాలను ముఖ్యంగా చైనాకు అమెరికా చుక్కలు చూపిస్తోంది. దీంతో చైనా ఇండియాతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల మధ్య సంబంధాలను పునరుద్ధరించే లక్ష్యంతో తాజాగా చైనా (China) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు, భారతీయులకు 85 వేల వీసాల(China Visas)ను జారీ చేసినట్లు చెప్పింది. చైనా రాయబారి జు ఫీహాంగ్ ఎక్స్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. భారతీయ సందర్శకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, చైనా అనేక వీసా సడలింపులను ప్రవేశపెట్టింది.
ఇండియా-చైనా దేశాల మధ్య ఏర్పడుతున్న దృఢమైన బంధానికి ఇది నిదర్ణమని స్పష్టం చేసింది. చైనాకు వస్తున్నన్న 85 వేల ఇండియన్లకు వీసాలు ఇచ్చినట్లు జూ ఫీహంగ్ తెలిపారు. తమన దేశంలో పర్యటించాల్సిందిగా ఎక్కువ మంది భారతీయ మిత్రులను కోరుతున్నట్లు వెల్లడించారు. భారత్, చైనా మద్య ట్రావెల్‌ను ఈజీ చేసేందుకు అనేక సదుపాయాలు కల్పించినట్లు చైనీస్ ప్రభుత్వం చెప్పింది.
చదవండి: అపుడు స్టార్ యాక్టర్.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!
అంతేకాదు వీసాకోసం దరఖాస్తుదారులు ఇకపై ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకోవలసిన అవసరం లేదనీ, ఇప్పుడు పని దినాలలో వీసా కేంద్రాలలోకి నేరుగా తమ దరఖాస్తులను అందచేయ వచ్చని కూడా చైనా ప్రకటించింది. చాలా తక్కువ టైం కోసం చైనా వెళ్లే వారు బయోమెట్రిక్ డేటాను సమర్పించాల్సిన అవసరం లేదు. ఇది దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేస్తుంది అలాగే చాలా తక్కువ ధరకే చైనా వీసాను అందిస్తున్నట్లు చెప్పారు. కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ సాంస్కృతిక, వ్యాపార విద్యా సంబంధాలను విస్తృతం చేయడానికి రెండు దేశాలు ప్రయత్నాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
చదవండి: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం!