
ప్రస్తుతం అంతా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయి అంటూ తెగ చర్చ జరుగుతోంది. అయితే, దానికి కాస్తా భిన్నంగా పాన్ హైవే(PAN Highway.. గురించి ఎప్పుడైనా విన్నారా.. ఎప్పుడైనా చూశారా?. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.. ఈ హైవే అగ్రరాజ్యం అమెరికాలో ఉంది. ఈ రోడ్డు మార్గం పొడవు ఏకంగా 30,600 కిలోమీటర్లు (దాదాపు 19,000 మైళ్ళు). ఇది 14 దేశాలను కలుపుతూ వెళ్తోంది. అందుకే దీన్ని పాన్ అమెరికా హైవే అని పిలుస్తున్నారు. ఈ గురించి మరిన్ని వివరాలు ఇలా..
రోడ్లు, హైవేలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రదేశాలు, సంస్కృతులను కలుపుతాయి. ఒక దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ బాగుంటేనే ఆర్థికంగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే అమెరికాలో ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు మార్గం నిర్మించారు. దీంతో, ఈ పాన్ అమెరికా హైవే.. రికార్డుల్లోకి ఎక్కింది.
30,600 కిలోమీటర్ల పొడవు..
పాన్-అమెరికన్ హైవే.. అలాస్కాలోని ప్రుధో బేలో ప్రారంభమై అర్జెంటీనాలోని ఉషుయాలో ముగుస్తుంది. ఉత్తర అమెరికా.. దక్షిణ అమెరికాను కలుపుతుంది. ఈ రోడ్డు మార్గం దాదాపు 30,600 కిలోమీటర్లు (దాదాపు 19,000 మైళ్ళు) విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన డ్రైవింగ్ చేయగల రహదారిగా రికార్డు సృష్టించింది.
పాన్-అమెరికన్ హైవే ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా అంతటా ఒకదానికొకటి అనుసంధానించబడిన రహదారుల ద్వారా విస్తరించి ఉంది. మరీ ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత సరళ రేఖలలో ఒకటిగా ఈ హైవే పరిగణించబడుతోంది. ఇది ఎలాంటి మలుపులు లేకుండా.. సరళ రేఖగా ఉంటుంది. ఈ రోడ్డు ఒక చివర నుంచి మరో చివరకు చేరుకోవాలంటే దాదాపు 60 రోజుల సమయం పడుతుంది. విరామం లేకుంగా రోజుకు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంది.
Did you know about the Pan-American Highway?
It stretches from Alaska to Argentina, covering over 19,000 miles and passing through multiple terrains, climates, and countries! Civil engineers across the Americas made it all possible.#CivilEngineering #Infrastructure #DidYouKnow pic.twitter.com/zDqErPyZ6R— CKL Engineers (@CKLEngineersLLC) April 10, 2025
14 దేశాలను కలుపుతూ..
పాన్ అమెరికా రహదారి 14 దేశాలను కలుపుతూ వెళ్తోంది. కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, హోండురాస్, నికరాగ్వా, కోస్టా రికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ, అర్జెంటీనాను కలుపుతుంది. ఇది కేవలం ఒక మార్గం మాత్రమే కాదు. ఈ రోడ్డుపై ప్రయాణ సమయంలో ఎన్నో వింతలు, ప్రకృతి దృశ్యాలు, సంస్కృతులు, చరిత్రలను తెలుసుకోవచ్చు. ఈ హైవే ఎడారులు, పర్వతాలు, వర్షారణ్యాలు, తీర ప్రాంతాలతో సహా వివిధ వాతావరణాలు కలిగిన ప్రాంతాల గుండా వెళ్తోంది.
ఈ రోడ్డు నిర్మాణంపై 1920లో మొదటి సారి చర్చలు జరగ్గా.. 1937లో 14 దేశాలు పాన్-అమెరికన్ హైవే కన్వెన్షన్‌పై సంతకం చేశాయి. 1960లో రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యి వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ రహదారిపై ట్రాఫిక్ లేకుండా వాహనాలు ప్రయాణం సాగిస్తున్నాయి. లాంగ్ రైడ్ వెళ్లాలనుకునే వారు ఈ మార్గంలో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.