పగలే కమ్ముకున్న చీకట్లు | nasa says Ever seen a total solar eclipse from space | Sakshi
Sakshi News home page

పగలే కమ్ముకున్న చీకట్లు

Published Tue, Apr 9 2024 10:10 AM | Last Updated on Tue, Apr 9 2024 10:31 AM

nasa says Ever seen a total solar eclipse from space - Sakshi

మునుపెన్నడూ చేసుకోని పరిణామాలకు ఉత్తర అమెరికా వేదిక అయ్యింది. గ్రహణంతో పగలే కారుచీకట్లు కమ్ముకున్నవేళ.. లక్షల మంది ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించారు.ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించి అమెరికాకు చెందిన నాసా పూర్తి సూర్య గ్రహణం ఏర్పడిన చిత్రాన్ని, వీడియోను విడుదల చేసింది. సోమవారం చోటు చేసుకున్న సంపూర్ణ సూర్యగ్రహణం సుమారు 2045 ఏడాదిన మళ్లీ ఏర్పడనుందని పేర్కొంది. 

అంతరిక్షం నుంచి సంపూర్ణ  సూర్యగ్రహణ గమనానికి సంబంధించి ఓ వీడియోను కూడా నాసా షేర్‌ చేసింది. ఇందులో సూర్యగ్రహణ గమనం కారణంగా నెమ్మదిగా కదులుతూ.. ఉత్తర అమెరికాపై చీకటి ఛాయ వ్యాపించడాన్ని అంతరిక్ష కేంద్ర నుంచి వ్యోమగాములు గమనిస్తున్నారని తెలిపింది. పట్టపగలే కొంత సమయం పాటు ఉత్తర ఆమెరికా ప్రాంతం చీకటిగా మారిందని తెలిపింది. ఇండియానాపోలిస్‌ మొత్తాన్ని క్రాస్‌ చేస్తూ.. ఇలా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడటం సుమారు 800 ఏళ్లలో ఇదే మొదటిసారని వెల్లడించింది నాసా.

మరోవైపు టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ సంపూర్ణ సూర్యగ్రహణానికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘సూర్యుడు భ్రమిస్తూ గ్రహణం ఏర్పడటం ఆర్బిట్‌ నుంచి కనిపిస్తుంది’ అని కామెంట్‌ జత చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement