
మన భారతీయ వంటకాలు విదేశీయలు మెచ్చుకోవడం కొత్తేం కాదు. కానీ ప్రముఖులు, అత్యున్నత హోదాలో ఉన్నవాళ్లు ఇతర దేశాల ప్రముఖ వంటకాలను రుచి చూస్తే మాత్రం..వెంటనే వాళ్లపై గౌరవం పెరుగుతుంది. అదీగాక ఆ వంటకం టేస్ట్‌ని మెచ్చుకుంటే..ఇక ఆ ఆనందం వేరెలెవెల్. అచ్చం అలాంటి సందర్భమే ఇక్కడ చోటుచేసుకుంది.
భారతదేశం పర్యటనలో ఉన్న జపాన్ రాయబారి కైచి ఓనో బిహార్ పేమస్ వంటకమైన 'లిట్టి చోఖా'ని రుచి చూశారు. లిట్టి చోఖా ప్రపంచ వంటకాల్లోని తనదైనముద్ర వేసిన విలక్షణమైన వంటకం ఇది. భూటాన్, భారత్‌లలో సేవలందిస్తున్న జపాన్ రాయబారి కైచి ఓ రెస్టారెంట్‌లో బిహారి వంటకాలను రుచి చూశారు. టేబుల్‌పై అందంగా ఒక బౌల్‌లో ఆకర్షణీయంగా అమర్చిన రైస్, పెరుగు, చేపల ఫ్రై, వాటితోపాట ఈ లిట్టి చోఖా రెసిపీ కూడా ఉంది.
అందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.."నమస్తే బిహార్..చివరికి బిహార్ ప్రముఖ వంటకం లిట్టు చోఖాను రుచి చూసే అవకాశం లభించింది." అని పోస్ట్‌పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్‌లో జపాన్ రాయబారి బిహారీ మాండలికాన్ని ప్రదర్శిస్తూ..“గజబ్ స్వాద్ బా” అని కితాబు కూడా ఇచ్చేశారు. ఇక్కడ గజబ్ స్వాద్ బా అంటే గొప్ప రుచి అని అర్థం. ఇది ఆహార ప్రియులను ఎంతగానో ఆకర్షించడమే గాక ఆశ్చర్యపరిచింది కూడా.
ఏంటీ 'లిట్టి చోఖా ' :
బిహారీ సంప్రదాయ వంటకం ఇది. దీన్ని స్టఫ్డ్ బేక్డ్ హోల్ వీట్ బాల్స్ అని కూడా అంటారు. ఇది చాలా రుచికరమైన, పోషక వంటకం. గోధుమ పిండి బంతిలో సుగంధద్రవ్యాలతో కూడిన మసాల ఉంచి సైడ్ డిష్‌గా కూరగాయలతో చేసిన కర్రీని అందిస్తారు. అలాగే ఇక్కడ జపాన్‌తో బీహార్ చాలా లోతైన ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబంధాన్ని కలిగి ఉంది. అందులోనూ ఇది బుద్ధుని భూమి కావడంతో జపాన్ వాసులకు ఎంతో ఇష్టమైన ప్రదేశంగా పేరుగాంచింది.
Namaste, Bihar!
Finally had the chance to try the world-famous Litti Chokha—Gajab Swad Ba!👍 pic.twitter.com/DTzqStRsUn— ONO Keiichi, Ambassador of Japan (@JapanAmbIndia) April 14, 2025
(చదవండి: వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!)