యాంటీ కేన్సర్‌, యాంటీ డయాబెటిక్‌ లక్షణాలున్న 5 సూపర్‌ ఫుడ్స్‌ఇవే! | Anti Cancer Anti Diabetic Super Foods That Explain Japanese Longevity, Watch Video Inside | Sakshi
Sakshi News home page

యాంటీ కేన్సర్‌, యాంటీ డయాబెటిక్‌ లక్షణాలున్న 5 సూపర్‌ ఫుడ్స్‌ఇవే!

Published Sat, Jun 15 2024 2:06 PM | Last Updated on Sat, Jun 15 2024 6:21 PM

Anti Cancer anti diabetic super foods that explain Japanese longevity

ప్రపంచంలో జపాన్‌ ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు. వంద సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు కూడా దాదాపు రెండు శాతం మంది ఇక్కడ ఉన్నారు. దీనికి కారణం జపాన్ ప్రజల ఆహారపు అలవాట్లు వారి జీవనశైలి అని చెబుతారు.  ఇదే మాటలను ఉటంకిస్తూ  ప్రముఖ నూట్రీషనిస్ట్‌  డా. సింథానీ ఎక్స్‌లో ఒక ఇంట్రస్టింగ్‌ వీడియో షేర్‌ చేశారు. 

యాంటి కేన్సర్‌, యాంటీ డయాబటిక్‌ సూపర్‌ఫుడ్స్‌ గురించి ఆయన ఈ వీడియోలో  వివరించారు.

  • షిటేక్ మష్రూమ్స్‌ ఇది తూర్పు ఆసియాకు చెందిన ఒక తినదగిన పుట్టగొడుగు.

  • నాటో  లేదా  నానబెట్టిన సోయా బీన్స్‌ 

  •  సీవీడ్‌ లేదా సముద్ర పాచి : కరిగే ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం సముద్రపు పాచిలో లభించే కొన్ని ఖనిజాలు . రక్తపోటును నియంత్రించి, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అలాగే ఫైటోకెమికల్స్ ఇందులో లభిస్తాయి. సీవీడ్ పెద్దప్రేగు , కొలొరెక్టల్ క్యాన్సర్‌ల నివారణలో  గణనీయ పాత్ర పోషిస్తుంది.  సీవీడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని పరిశోధన ద్వారా తెలుస్తోంది.

    ఇంకా కొంజాకు కొన్యాకూ ప్రయోజనాలు, అధిక యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్న మాచ్చా టీ ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఈ వీడియోలు తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement