భారత బ్రాండ్లైన ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్‌ఎస్‌ఏ) గుర్తించింది. దాంతో హాంకాంగ్, సింగపూర్‌ల్లో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే 2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్యకాలంలో ఇండియాలో తయారైన దాదాపు 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్‌కు దారితేసే కారకాలు ఉన్నట్లు రాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ (ఆర్‌ఏఎస్‌ఎఫ్‌ఎఫ్) డేటా ప్రకారం నిర్ధారణ అయినట్లు ఈఎఫ్‌ఎస్‌ఏ అధికారులు తెలిపారు.
ఈ 527 ఉత్పత్తుల్లో ఇప్పటికే 87 సరుకులను ఇతర దేశాలు తిరస్కరించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అయితే వీటిలో 332 ఉత్పత్తుల్లో భారత్‌లోనే తయారైన హానికర రసాయనాలను వినియోగించినల్లు తేలింది. కానీ మిగతావాటిలో వాడిన రసయనాలు ఎక్కడివో తెలియాల్సి ఉంది. ఇథిలీన్ ఆక్సైడ్ వాస్తవానికి వైద్య పరికరాలపై క్రిములను చంపడానికి, వాటిని శుభ్రం చేయడానికి వాడుతారు. పురుగుమందు, స్టెరిలైజింగ్ ఏజెంట్‌గా వినియోగిస్తారు. దీన్ని ఆహార ఉత్పత్తుల్లో వాడడంతో లింఫోమా, లుకేమియా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది.
ఇదీ చదవండి: హార్లిక్స్ లేబుల్ తొలగింపు.. కారణం ఇదేనా..
రామయ్య అడ్వాన్స్‌డ్ టెస్టింగ్ ల్యాబ్స్‌లోని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జుబిన్ జార్జ్ జోసెఫ్ ఇథిలీన్ ఆక్సైడ్ ఉప ఉత్పత్తుల వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలిపారు. ఇథిలీన్ ఆక్సైడ్ ఉప ఉత్పత్తి అయిన ఇథిలీన్ గ్లైకాల్ చాలా ప్రమాదమని చెప్పారు. దీన్ని గతంలో దగ్గు సిరప్‌ల్లో వాడడం వల్ల ఆఫ్రికాలో మరణాలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే ఇథిలీన్ ఆక్సైడ్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకున్న వారికి గామా కిరణాలతో చికిత్స అందించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలు అధ్యయనాలు నిర్వహించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment