Diabetic
-
ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్
హైదరాబాద్: ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి నెల రోజుల పాటు 500 మంది మధుమేహ బాధితులకు ఉచితంగా ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనుంది. మధుమేహ బాధితులకు కాళ్లు తొలగించాల్సిన అవసరం లేకుండా.. ముందుగానే ఫుట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే తగిన చికిత్సలతో నయం చేయవచ్చని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వాస్క్యులర్ సర్జరీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు.ఆస్పత్రి ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ జ్ఞానేశ్వర్ ఈ వివరాలు తెలిపారు. ఈ సేవలను వినియోగించుకోవాలనుకునేవారు 9010100536 నంబరుకు ఫోన్ చేయడం ద్వారా తమ పేర్లు నమోదుచేసుకోవచ్చు. సెప్టెంబరు 22 నుంచి నవంబరు 20వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఇంకా అదనపు పరీక్షలు అవసరమైతే వాటిమీద 50% రాయితీ వర్తిస్తుంది. ఈ పరీక్షలు చేయించుకోవడానికి మధుమేహ బాధితులు ఎవరైనా అర్హులే. అయితే తాజాగా మధుమేహం బయటపడినవారి కంటే నాలుగైదేళ్లుగా దీంతో బాధపడుతున్నవాళ్లకు అయితే వెంటనే బయటపడుతుంది. ఇప్పటికే కాళ్లలో కొంత ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ పరీక్షలు చేయించుకోవచ్చు. -
యాంటీ కేన్సర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలున్న 5 సూపర్ ఫుడ్స్ఇవే!
ప్రపంచంలో జపాన్ ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు. వంద సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు కూడా దాదాపు రెండు శాతం మంది ఇక్కడ ఉన్నారు. దీనికి కారణం జపాన్ ప్రజల ఆహారపు అలవాట్లు వారి జీవనశైలి అని చెబుతారు. ఇదే మాటలను ఉటంకిస్తూ ప్రముఖ నూట్రీషనిస్ట్ డా. సింథానీ ఎక్స్‌లో ఒక ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు. యాంటి కేన్సర్, యాంటీ డయాబటిక్ సూపర్‌ఫుడ్స్ గురించి ఆయన ఈ వీడియోలో వివరించారు.షిటేక్ మష్రూమ్స్ ఇది తూర్పు ఆసియాకు చెందిన ఒక తినదగిన పుట్టగొడుగు.నాటో లేదా నానబెట్టిన సోయా బీన్స్ సీవీడ్ లేదా సముద్ర పాచి : కరిగే ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం సముద్రపు పాచిలో లభించే కొన్ని ఖనిజాలు . రక్తపోటును నియంత్రించి, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అలాగే ఫైటోకెమికల్స్ ఇందులో లభిస్తాయి. సీవీడ్ పెద్దప్రేగు , కొలొరెక్టల్ క్యాన్సర్ల నివారణలో గణనీయ పాత్ర పోషిస్తుంది. సీవీడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని పరిశోధన ద్వారా తెలుస్తోంది.5 Anti-Cancer, anti-diabetic, super foods that explain Japanese longevity. pic.twitter.com/Owicj1OFsO— Barbara Oneill (@BarbaraOneillAU) June 14, 2024ఇంకా కొంజాకు కొన్యాకూ ప్రయోజనాలు, అధిక యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న మాచ్చా టీ ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఈ వీడియోలు తెలిపారు. -
జైల్లో కుదుటగానే కేజ్రీవాల్ ఆరోగ్యం: ఢిల్లీ ఎయిమ్స్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటగానే ఉన్నట్లు తెలుస్తోంది. టైప్-2 డయాబేటిస్తో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు అయిదుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ అందిస్తోంది. ఈ మేరకు ఎయిమ్స్‌కు చెందిన అయిదుగురు వైద్యుల బృందం శనివారం కేజ్రీవాల్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దాదాపు అరగంట పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. కేజ్రీవాల్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నందున, ఆయన ఉపయోగిస్తున్న మందులనే కొనసాగించాలని మెడికల్ బోర్డు సూచించిం.ది మెడిసిన్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు పేర్కొంది. దీంతో పాటు ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని తెలిపింది’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వారం తర్వాత ఈ బృందం సీఎంను మరోసారి పరీక్షించనున్నట్లు పేర్కొన్నాయి.కాగా ఆయన షుగర్ లెవల్స్ 320కు పెరగడంతో గతవారం తీహార్ జైల్లో తొలి ఇన్సులిన్ అందించారు. తన వ్యక్తిగత వైద్యుడితో రోజూ వీడియో మాధ్యమంలో సంప్రదించే అవకాశాన్ని కల్పించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆరోగ్య కారణాల కింద బెయిల్ పొందేందుకే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే స్వీట్స్, మామిడిపండ్లు, ఆలూపూరీ వంటి ఆహార పదార్దాలు తీసుకుంటున్నారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.అయితే టైప్ 2 డయాబెటిక్ పేషెండ్ అయిన కేజ్రీవాల్‌కు క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా?, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అని నిర్ణయించేందుకు ఎయిమ్స్ వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా ఆదేశించింది. ఇంట్లో వండిన ఆహారాన్ని కూడా కోర్టు అనుమతించింది. అయితే అది ఖచ్చితంగా డాక్టర్ సూచించిన డైట్ చార్ట్‌కు కట్టుబడి ఉండాలని పేర్కొంది. -
డయాబెటిక్ న్యూరోపతికి లక్షణాలు ఇవే
-
డయాబెటిస్ పేషెంట్స్.. ఇకపై ఆ బాధ తీరినట్లే
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే సమస్య. దీన్నే షుగర్ వ్యాధి లేదా మధుమేహం అని కూడా అంటాం. ఇది ఒక్కసారి అటాక్ అయ్యిందంటే ప్రతిరోజూ మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడాల్సిందే. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేలా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇకపై షుగర్ పేషెంట్స్ ఏడాదికి కేవలం మూడుసార్లు మాత్రమే ఇన్సులిన్ తీసుకుంటే సరిపోతుందట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో మధుమేహ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకారం.. భారత్‌లోనే దాదాపు 101 మిలియన్ల మంది (10 కోట్ల మందికి పైనే) మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది.వయసుతో సంబంధం లేకుండా ఏటా భారత్‌లో డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ సమస్యకు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం అనేది లేదు. ఈ వ్యాధి ఒకసారి వస్తే ఎప్పటికీ నయం కాదు. ఎందుకంటే దీనిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. ఒక్కసారి డయాబెటిస్ బారిన పడితే డైట్ పరంగానూ చాలా జాగ్రత్తలు పాటించాలి. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుకునేలా అనేక ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రతిరోజూ తప్పకుండా మందులు వాడాల్సిందే. ఈ క్రమంలో డయాబెటిస్ ట్రీట్మెంట్కు సంబంధించి ఇప్పటికే పలు పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు హైడ్రోజెల్ ఆధారిత ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేశారు. దీనివల్ల ఏడాదికి కేవలం మూడుసార్లు మాత్రమే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని మొదట ఎలుకలపై ప్రయోగించారు. 42 రోజులకు ఒకసారి ఎలుకలకు హైడ్రోజెల్‌ను ఇంజెక్ట్ చేసి పరిశీలించగా వాటి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌తో పాటు బరువు కూడా కంట్రోల్లో ఉన్నట్లు తేలింది. ఎలుకల్లో 42 రోజుల దినచర్య అంటే మనుషుల్లో ఇది నాలుగు నెలలకు సమానమని సైంటిస్టుల బృందం తెలిపింది. తర్వాతి పరీక్షలు పందులపై ప్రయోగిస్తారు, ఎందుకంటే ఇవి మనుషుల్లాంటి చర్మం, ఎండోక్రైన్ వ్యవస్థలను కలిగి ఉంటాయి. అనంతరం 18 నెలల నుంచి రెండేళ్ల లోపు మనుషులపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తామని సైంటిస్టులు తెలిపారు. -
మాటలతోనే మధుమేహాన్ని పట్టేస్తుంది!
మీరు మధుమేహం బారిన పడ్డారో లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? కానీ... దూరంగా ఉండే డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవడం ఇష్టం లేదా? ఇంట్లోకి వచ్చి రక్త నమూనాలు సేకరించినా వద్దని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఓ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుని ఓ పదిసెకన్లపాటు మాట్లాడితే మీకు డయాబిటీస్ ఉన్నదీ లేనిది స్పష్టమైపోతుంది అంటున్నారు క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు. మన మాటకూ మధుమేహానికీ సంబంధం ఏమిటనేదేనా మీ ప్రశ్న.. అయితే చదివేయండి! మారిన జీవనశైలి, ఆహారపు అలావాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాలతో ప్రపంచంలో ఏటికేడాదీ మధుమేహ బాధితులు పెరిగిపోతున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా భారతదేశం టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాజధానిగా మారిపోయిందన్న వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాధిని వీలైనంత తొందరగా, సులువుగా గుర్తించేందుకు తగిన పరీక్షలు అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ బయోటెక్ కంపెనీ క్లిక్ ల్యాబ్ వీటిల్లో ఒకటి. ఈ సంస్థ శాస్త్రవేత్తలు కొందరు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించి కేవలం వాయిస్ రికార్డింగ్ ద్వారా మాత్రమే మధుమేహం సోకిన వారిని గుర్తించవచ్చునని నిర్ధారించారు. అధ్యయనంలో భాగంగా క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు 267 మందిని ఎంచుకున్నారు. వీరిలో 192 మంది వ్యాధి సోకనివారు. మిగిలిన 75 మంది మధుమేహంతో బాధపడుతున్న వారు. వీరందరి స్మార్ట్ఫోన్లలో శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ఒక అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేశారు. అధ్యయనంలో పాల్గొన్న వారు ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి కొన్ని నిర్దిష్ట పదాలతో కూడిన వాక్యాన్ని రోజుకు ఆరుసార్లు రికార్డు చేయమని కోరారు. మాట్లాడే వేగాన్ని బట్టి ఈ ఆడియో రికార్డింగ్ ఆరు నుంచి పది సెకన్ల నిడివి మాత్రమే ఉంటుంది. సూక్ష్మస్థాయి తేడాలు... ఈ పద్ధతిలో శాస్త్రవేత్తలకు మొత్తం 18465 రికార్డింగ్‌లు లభించాయి. స్థాయి, తీవ్రత వంటి 14 ధ్వని సంబంధిత అంశాలను విశ్లేషించి చూసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. మధుమేహ రోగుల రికార్డింగ్‌లలో సాధారణ పరిస్థితుల్లో మనం అస్సలు వినలేని సూక్ష్మస్థాయి తేడాలున్నట్లు స్పష్టమైంది. ప్రత్యేకమైన సిగ్నల్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ మాత్రమే వీటిని గుర్తించగలదన్నమాట. మధుమేహులు, ఇతరుల మధ్య ఉన్న తేడాలు చాలా సుస్పష్టంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మధుమేహం బారిన పడ్డ వారి స్వరంలో సూక్ష్మమైన తేడాలు వస్తాయని ఈ అధ్యయనం చెబుతోంది. కృత్రిమ మేధను జోడించారు... క్లిక్ ల్యాబ్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా తెలుసుకున్న విషయాలకు కృత్రిమ మేధను జోడించడంతో ఫలితాలు మరింత కచ్చితత్వంతో రావడం మొదలైంది. వ్యక్తి వయసు, పురుషుడా? మహిళనా? ఎత్తు?, బరువు? వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని స్వరాన్ని విశ్లేషించేందుకు రూపొందించిన కృత్రిమమేధ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించినప్పుడు మహిళల్లో టైప్-2 వ్యాధిని 89 శాతం కచ్చితంగా గుర్తించినట్లు తెలిసింది. పురుషుల విషయంలో ఈ కచ్చితత్వం 86 శాతం మాత్రమే. టెక్నాలజీకి మరింత పదును పెడితే కచ్చితత్వం కూడా పెరుగుతుందని, పైగా ప్రస్తుతం పరగడపున నిర్వహిస్తున్న ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్‌ల కచ్చితత్వం 85 శాతం మాత్రమేనని శాస్త్రవేత్తలు వివరించారు. సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్షలు కూడా 91 శాతం, 92 శాతం కచ్చితత్వంతో కూడిన ఫలితాలను మాత్రమే ఇస్తున్నట్లు క్లిక్ ల్యాబ్స్ శాస్త్రవేత్త జేసీ కాఫ్మాన్ తెలిపారు. స్వరం ద్వారా మధుమేహాన్ని గుర్తించే పద్ధతిని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు మరిన్ని పరీక్షలు చేపడుతున్నామని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా మధుమేహ పరీక్షలకు ప్రస్తుతం అవుతున్న వ్యయప్రయాసలను గణనీయంగా తగ్గించవచ్చునని అభిప్రాయపడ్డారు. పరిశోధన వివరాలు మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్: డిజిటల్ హెల్త్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
దేశంలో 10 కోట్ల మంది డయాబెటిక్ రోగులు
దేశంలో 10 కోట్ల మంది డయాబెటిక్ రోగులు -
మీరు మధుమేహ బాధితులా.. అయితే జాగ్రత్త పడాల్సిందే..
హూస్టన్: మీరు టైప్ 1 డయాబెటిస్ (మధుమేహం) బాధితులా? వయసు 40 ఏళ్లు దాటిందా? అయితే, జాగ్రత్తపడాల్సిందే. ఎందుకంటే మీరు కోవిడ్–19 మహమ్మారి బారినపడితే తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరే అవకాశాలు పిల్లలతో పోలిస్తే ఏడు రెట్లు అధికంగా ఉంటాయట. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఆధ్వర్యంలో జరిగిన తాజా అధ్యయనం ఈ విషయం వెల్లడించింది. ఈ అధ్యయనం వివరాలను ఎండోక్రైన్ సొసైటీకి చెందిన క్లినికల్ ఎండోక్రైనాలజీ, మెటాబాలిజం జర్నల్‌లో ప్రచురించారు. పిల్లలకు కరోనా సోకితే లక్షణాలు బయటపడవు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా స్వల్పమే. కానీ, డయాబెటిస్తో బాధపడు తున్న పెద్దల్లో కరోనా మహమ్మారి ప్రాణాం తకంగా పరిణమిస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. పిల్లలు, యువత కంటే టైప్ 1 డయాబెటిస్ ఉన్న పెద్దలకు(40 ఏళ్లు దాటినవారు) కరోఓనా సోకితే తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. చదవండి: Vice President Venkaiah Naidu: వైద్య సిబ్బంది కొరతను తక్షణమే తీర్చాలి -
ఈ చాక్లెట్లో షుగర్ ఉందా, 200 మంది డాక్టర్లతో చర్చలు చివరికి ఇలా
స్వీట్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు! ముంబై కుర్రాడు హర్ష్ కేడియకు ఇంకాస్త ఎక్కువ ఇష్టం. అయితే ఆ అమితమైన ఇష్టానికి డయాబెటిస్ బ్రేక్ వేసింది. పన్నెండేళ్ల వయసులో హర్ష్ డయాబెటిస్ బారిన పడ్డాడు. ఇక అప్పటి నుంచి జీవనశైలి, అలవాట్లను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. పార్టీలకు... చెక్.. స్వీట్లకు... కట్ పార్టీలకు... చెక్..స్వీట్లకు.... కట్... ఇలా రకరకాల చెక్‌లతో జీవితం దుర్భరప్రాయంగా అనిపించింది. ఖైదీ జీవితానికి తన జీవితానికి తేడా ఏమిటి! అని కూడా అనిపించింది. నోరు కట్టేసుకోకుండా రుచి మొగ్గలను మళ్లీ హుషారెత్తించడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ‘అసలు ఈ డయాబెటిస్ ఏమిటి?’ అని దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి భారీ కసరత్తే చేశాడు. చాక్లెట్లో షుగర్ ఎంత ఉందో తెలుసుకునేందుకు రెండు వందల మందికి పైగా వైద్యులను కలిసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. టీవీల్లో టూత్ పేస్ట్ యాడ్ లా.. ఈ చాక్లెట్ లో షుగర్ ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ‘ఏ డయాబెటిక్ చెఫ్’ మార్కెట్టులో ‘షుగర్–ఫ్రీ’ పేరుతో అందుబాటులో ఉన్న చాలా చాక్లెట్లలో ఎంతో కొంత షుగర్ కూడా ఉన్నట్లు తెలుసుకోగలిగాడు. ఈ నేపథ్యంలోనే ‘డయాబెటిక్ ఫ్రెండ్లీ చాక్లెట్’ అనే ఐడియా మదిలో మెరిసింది.పేరుకి ‘షుగర్–ఫ్రీ’ అని కాకుండా 100 శాతం షుగర్–ఫ్రీ చాక్లెట్ తయారీ కోసం ఆలోచించాడు. ఎన్నో పుస్తకాలు తిరగేశాడు. అంతర్జాల సమాచార సముద్రంలో దూకాడు. డాక్టర్లు, న్యూట్రీషనిస్ట్లు, ఫుడ్సైంటిస్టులను కలిశాడు. తన నుంచి ఒక చెఫ్ బయటికి వచ్చాడు. ప్రయోగాల్లోనే కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న హర్ష్ రకరకాల కంపెనీలలో పనిచేసి బిజినెస్ స్కిల్స్‌ను ఒంటబట్టించుకున్నాడు. తాను చేసిన పరిశోధన, వ్యాపార నైపుణ్యాలు, తల్లిదండ్రుల ఆశీస్సులు...అలా ముంబై కేంద్రంగా ‘ఏ డయాబెటిక్ చెఫ్’ అనే కంపెనీ మొదలుపెట్టాడు. ‘ఈ వయసులో ఇదొక దుస్సాహాసం’ అన్నవారు కూడా లేకపోలేదు. ‘సాహాసానికి వయసుతో పనేమిటి’ అని వెన్నుతట్టిన వారు కూడా లేకపోలేదు. ‘యంగ్ ట్రెండ్‌సెట్టర్’ టాప్ క్వాలిటీ ఇన్‌గ్రేడియంట్స్‌తో, రుచితో రాజీ పడకుండా, అయిదు రకాల ఫ్లేవర్లతో తయారుచేసిన ‘ఏ డయాబెటిక్’ చెఫ్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి టాక్ వచ్చింది. 24 సంవత్సరాల హర్ష్ చిన్న వయసులోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అండర్ 30–ఫోర్బ్స్ ‘యంగ్ ట్రెండ్‌సెట్టర్’ జాబితాలో చోటు సంపాదించాడు. మోటివేషనల్ స్పీకర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్న హర్ష్ కెడియ పేద డయాబెటిక్ పేషెంట్లకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా హర్ష్ కెడియ పుస్తకాలు చదువుతాడు. తన భావాలను కాగితాలపై పెడతాడు. రచన అతనికేమీ కొత్తకాదు.‘డయాబెటిస్ సమస్య నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాధించిన విజయం వరకు తన అనుభవాలకు పుస్తకరూపం ఇస్తే బాగుంటుంది కదా!’ అనేవాళ్లతో మనం కూడా గొంతు కలుపుదాం. ఒక ప్రాడక్ట్‌కు మార్కెట్లో మంచి టాక్ రావాలంటే...అది పేరుతోనే మొదలవుతుంది. ‘ఏ డయాబెటిక్ చెఫ్’ అనే పేరుతో తొలి అడుగులోనే మార్కులు కొట్టేసిన హర్ష్ కేడియ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా యువతకు స్ఫూర్తిని ఇస్తున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. పేదరోగులకు సహాయం చేస్తూ మంచిమనసును చాటుకుంటున్నాడు. -
మీరు డయాబెటికా?
అదుపులో లేకుండా ఉండే చక్కెరవ్యాధి అన్ని అవయవాలతో పాటు కంటిని కూడా దెబ్బతీస్తుందన్న విషయం తెలిసిందే కదా. ఇలా డయాబెటిస్ కారణంగా కంటికి కూడా పలు సమస్యలు వస్తాయి. వాటిలో ముఖ్యమైనది ‘డయాబెటిక్ రెటినోపతి’. మిగతా ఏదైనా అవయవానికి లోపం వస్తే కొద్దో గొప్పో సమస్యను మేనేజ్ చేయవచ్చేమోగానీ... కంటికి వచ్చే సమస్యలతో అంతా అంధకారమైపోతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు అన్ని అవయవాల విషయంలోనూ జాగ్రత్తగా ఉన్నప్పటికీ ... కంటి విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోవాలి. షుగర్వ్యాధి ఉన్న ప్రతివారూ తమ రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుకోవడం ఎంతముఖ్యమో... డయాబెటిక్ రెటినోపతిపై అవగాహన పెంచుకోవడమూ అంతే ప్రధానం. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమిటో తెలుసుకునే ముందుగా... అసలు మనకు చూడటం అన్న ప్రక్రియ ఎలా సాధ్యమవుతుందో అర్థం చేసుకుందాం. మన కంటి వెనక భాగంలో రెటీనా అనే తెర ఉంటుంది. మనకు కనిపించే దృశ్యం దీనిపై తలకిందులుగా పడుతుంది. అక్కడి నుంచి ఆ ఇమేజ్ మెదడుకు చేరడం వల్ల మనకు చూడటం అనే ప్రక్రియ సాధ్యమవుతుంది. కంటికి వెనక ఉన్న రెటినా తెరకు అత్యంత సన్నటి రక్తనాళాల (క్యాపిల్లరీస్) ద్వారా రక్తం సరఫరా అవుతుంటుంది. డయాబెటిస్ నియంత్రణ లేనివారిలో ఈ క్యాపిల్లరీస్ ఉబ్బడం జరుగుతుంది. దీన్నే మైక్రో అన్యురిజమ్ అంటారు. కొందరిలో క్యాపిలరీస్ మూసుకుపోతాయి. క్యాపిలరీస్ మూసుకుపోయినప్పుడు రెటినాకు కావాల్సిన పోషకాలు, ఆక్సిజన్ అందవు. అప్పుడు రెటీనా సరిగా పనిచేయదు. మైక్రో అన్యురిజమ్స్ లీక్ అయినప్పుడు ఎగ్జుడేట్స్ అనే పదార్థం రెటినాలో పేరుకుపోతుంది. దీనివల్ల రెటినా ఉబ్బతుంది. ప్రధానంగా మాక్యులా అనే మధ్యభాగంలో ఈ ఉబ్బు ఎక్కువగా ఉంటుంది. దీన్నే డయాబెటిక్ మాక్యులార్ ఎడిమా అంటారు. రక్తనాళాలు మూసుకుపోయినవారిలో అసాధారణమైన అవాంఛిత కొత్తరక్తనాళాలు పెరుగుతాయి. ఈ కొత్త రక్తనాళాల నుంచి మాటిమాటికీ రక్తస్రావం జరుగుతుంటుంది. ఈ రక్తం రెటినాలోనూ, విట్రియస్ అనే జెల్‌లోనూ స్రవిస్తుంది. దీనివల్ల అకస్మాత్తుగా చూపు తగ్గిపోతుంది. ఈ రక్తస్రావం రెటినాలోగానీ, విట్రియస్‌లో గానీ కొంతకాలం అలాగే ఉంటే రెటినా ఊడే ప్రమాదం ఉంది. దీన్నే ‘రెటినల్ డిటాచ్మెంట్’ అంటారు. క్రమేణా ఈ కొత్తరక్తనాళాలు కంటి ముందుభాగానికి (యాంగిల్ ఆఫ్ ది యాంటీరియర్ ఛేంబర్) వచ్చినప్పుడు నియోవాస్కులార్ గ్లకోమా అనే ప్రమాదకరమైన గ్లకోమా వస్తుంది. రెటినల్ డిటాచ్మెంట్ వల్లగానీ లేదా గ్లకోమా వల్లగానీ చాలామంది తమ చూపును పూర్తిగా కోల్పోతారు. అయితే డయాబెటిక్ రెటినోపతి లక్షణాలు మొదటి దశలో కనిపించవు. ఇలాంటి అసాధారణ, అవాంఛిత రక్తనాళాల నుంచి రక్తస్రావం అయి, అది కంటిలోని విట్రియస్ అనే జెల్లీలోకి స్రవించినప్పుడు ఈ కండిషన్‌ను తొలిసారి గుర్తించడం సాధ్యమవుతుంది. తర్వాత కంటి ముందు నల్లటి చుక్కలు తేలుకుంటూ పోతున్నట్లుగా, అల్లుకుపోతున్నట్లుగా కనిపిస్తుంటాయి. ఆ తర్వాత మెల్లమెల్లగాగానీ లేదా ఒక్కోసారి అకస్మాత్తుగా గాని కంటిచూపు పోవచ్చు. డయాబెటిస్ ఉంటే తరచూ కంటి పరీక్ష తప్పదు... పైన పేర్కొన్న పరిస్థితులను నివారించుకోవడం కోసం డయాబెటిస్ ఉన్నవారు కనీసం ఆర్నెల్లకొకసారి అయినా లేదా కంటి వైద్యుడు సూచించిన ప్రకారం కంటి పరీక్షలు చేయించుకోవాలి. మనం పైన చెప్పుకున్న అవాంఛిత పరిణామాలను తొలిదశలోనే గుర్తించి, తగిన చికిత్స చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం ఉండదు. సాధారణంగా రెటినోపతి సమస్య ఉన్నవారికి ఫండస్ ఫొటో, ఓసీటీ పరీక్ష, ఫ్లోరెసిన్ యాంజియోగ్రఫీ అనే పరీక్షలు చేసి, రెటినోపతి ఏ దశలో ఉందో నిర్ధారణ చేస్తారు. ఫండస్ ఫొటో ద్వారా స్టేజ్‌తో పాటు... మొదటిసారి పరీక్షించినప్పుడూ, ఆ తర్వాతి విజిట్స్లోనూ తేడాలు గమనిస్తారు. ఓసీటీ పరీక్షలో రెటినా ఎంతగా మందం అయ్యింది అనే విషయం తెలుస్తుంది. యాంజియోగ్రఫీలో కొత్తరక్తనాళాలు, రెటినాలో జరిగే రక్తసరఫరా (రెటినల్ సర్క్యులేషన్) గమనిస్తారు. డయాబెటిస్ ఉన్నవారు ఎవరైనా సరే... కనీసం ఆర్నెల్లకోసారి లేదా తమ కంటిడాక్టరు సూచించిన వ్యవధుల్లో తరచూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలతో చూపును జీవితాంతం పదిలంగా కాపాడుకోవడం సాధ్యమవుతుందని గుర్తుంచుకోవాలి. చికిత్స డయాబెటిక్ రెటినోపతిలో కంటికి జరిగిన నష్టాన్ని బట్టి అనేక రకాల చికిత్సలు చేయాల్సిరావచ్చు. ఉదాహరణకు లేజర్ ఫొటో కోయాగ్యులేషన్ అనే ప్రక్రియ ద్వారా లీకేజీలను అరికడతారు. ఇది గోల్డ్‌స్టాండర్డ్ చికిత్స. ఈ ప్రక్రియలో అసాధారణంగా, అవాంఛితంగా పెరిగిన రక్తనాళాలనూ తగ్గిస్తారు. మ్యాక్యులార్ ఎడిమా ఉన్నవారికి యాంటీవెజ్ ఇంజెక్షన్ల ద్వారా రెటినా వాపును తగ్గిస్తారు. అడ్వాన్స్డ్ రెటినోపతి ఉన్నవారికి, విట్రియస్ హేమరేజీతో పాటు రెటినల్ డిటాచ్మెంట్ ఉన్నవారికి మైక్రో విట్రియో రెటినల్ సర్జరీ నిర్వహిస్తారు. డాక్టర్ రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు -
వ్యాయామం ఇలా చేస్తే మేలు..
లండన్ : బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న తర్వాత వ్యాయామం చేయాలని కొందరు సూచిస్తుండగా ఖాళీ కడుపుతోనే వ్యాయామం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు వ్యాయామం చేస్తే రక్తంలో చక్కెర స్ధాయి నియంత్రణలో ఉంటుందని ఈ పరిశోధన వెల్లడించింది. ఖాళీ కడుపుతో ఎక్సర్సైజ్ చేస్తే శరీరం ఇన్సులిన్ వాడకాన్ని సమర్ధంగా నిర్వహిస్తుందని ఇది టైప్ 2 డయాబెటిస్తో పోరాడటంతో పాటు జీవక్రియల వేగం పెంచేందుకు ఉపకరిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. బాత్ అండ్ బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ చేపట్టిన అథ్యయనంలో వెల్లడైంది. వ్యాయామం చేసే సమయంలో మీరు ఆహారం తీసుకునే సమయంలో చేసే మార్పుల ద్వారా మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని తమ పరిశోధనలో తేలిందని యూనివర్సిటీ ఆప్ బాత్ ప్రొఫెసర్ డాక్టర్ జేవియర్ గోంజలెజ్ చెప్పారు. ఖాళీ కడుపుతో వ్యాయామం చేసిన వారి కండరాలు ప్రొటీన్‌ను మెరుగ్గా సంగ్రహిస్తున్నట్టు తమ అథ్యయనం గుర్తించామని తెలిపారు. బరువు తగ్గే క్రమంలో వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఆహారం తీసుకునే సమయంతో సంబంధం లేకపోయినా వారి ఆరోగ్యంపై మాత్రం ఇది సానుకూల ప్రభావం చూపుతుందని చెప్పారు. -
గూడు కరువై.. గుండె చెరువై!
కర్నూలు ,పత్తికొండ రూరల్: సాధికార సర్వే పేరుతో హడావుడి చేసే అధికారుల కళ్లకు ఈ పేద దంపతులు కనిపించడం లేదు. పింఛన్ ఉందా? మీరున్నది సొంతిల్లా? అంటూ ఆరా తీసే విచారణ సిబ్బందీ.. రేకుల షెడ్డులో జీవచ్ఛవంలా బతుకీడుస్తున్న ఈ అభాగ్యుల వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. విధి పగబట్టడంతో ఇంటి పెద్ద రెండు కాళ్లకు షుగర్ వ్యాధి సోకింది. పూట గడవడానికి కూలి పనులకు వెళ్తూనే మంచానికే పరిమితమైన భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది ఓ ఇల్లాలు. అధికారులు గూడు కల్పించాలని, దాతలు దయతలిస్తే భర్తకు వైద్యం చేయించుకుంటానని ఆమె కన్నీటితో వేడుకుంటోంది. మండల పరిధిలోని ఆర్. మండగిరి గ్రామానికి చెందిన పింజరి రంజాన్, లాల్‌బీ దంపతులు నిరు పేదలు. వీరికి పిల్లలు లేరు. బేల్దారి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించే రంజాన్ షుగర్ వ్యాధి బారిన పడ్డాడు. మూడేళ్ల క్రితం ఆదోని ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు ఎడమ కాలు మోకాలు వరకు తొలగించారు. 2015లో 60 శాతం వికలత్వంతో వైద్యాధికారులు మెడికల్ సర్టిఫికెట్ జారీ చేయడంతో రూ.1,000 పింఛన్ వస్తోంది. కొంతకాలానికి షుగర్ వ్యాధి మరో కాలుకు విస్తరించింది. పాదం వరకు దెబ్బతిని నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో అతడి భార్య లాల్బీపైనే పోషణ భారం పడింది. కూలి పనులు చేసుకుంటూ భర్తను పోషిస్తోంది. గూడు లేక గోడు.. పూట గడవడమే చేతకాని ఈ కుటుంబానికి ఊళ్లో జానెడు స్థలం కూడా లేదు. వేరే వారి రేకుల షెడ్లో తల దాచుకుంటున్నారు. దయనీయ స్థితిలో కాలం వెల్లదీస్తూ దాతల సాయం కోసం ఎదురుస్తున్నారు. స్పందించే దాతలు ఆంధ్రాబ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎఎన్డీబీ 0001949, అకౌంటు నంబర్: 194910100295100 సెల్: 9701851300కి ఫోను చేయవచ్చును. భర్తకోసమే బతుకుతున్నా మాకు దిక్కెవరూ లేరు. పని చేసుకుని బతుకుతున్నాం. ఉన్నప్పుడు తింటాం..లేదంటే పస్తులుంటాం. మా కెందుకో ఆ దేవుడు ఇన్ని కష్టాలు పెట్టినాడు. నా పెనిమిటి మంచం నుంచి లేయలేడు. షుగర్ వ్యాధి వచ్చిందంట. పెద్ద వైద్యం చేయాలన్నారు. మా దగ్గర మందు బిల్లలకు కూడా దుడ్లు లేవు. మా ఆయన కోసమే నేను బతుకున్నా..ఎవరైనా సాయం చేయకపోతారా..మా బతుకులు మారకపోతాయా అని ఎదురు చూస్తున్నా. – లాల్బి, మండగిరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం గతంలో జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా సామాజిక భద్రత పింఛన్ ప్రతినెలా రూ.వెయ్యి అందిస్తున్నాం. సదరం క్యాంపు కెళ్లి ప్రస్తుత వికలత్వం సర్టిఫికెట్ తెస్తే దాని ప్రకారం పింఛన్ మంజూరుకు ప్రతిపాదన పంపుతాం. ప్రభుత్వ స్థలం మంజూరుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తా. – రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి,మండగిరి -
డయాబెటిక్ కౌన్సెలింగ్
ఇన్సులిన్‌ను ట్యాబ్లెట్ల రూపంలో ఇవ్వలేమా? మనం డయాబెటిస్‌ను మందులు లేకుండానే నియంత్రించలేమా? ఇన్సులిన్ ఇంజెక్షన్ల రూపంలో కాకుండా ట్యాబ్లెట్ల రూపంలో దొరికే అవకాశం ఉందా? దయచేసి వివరించండి. – అరవింద, నెల్లూరు డయాబెటిస్ (టైప్–2) తొలిదశల్లో అంటే ప్రీ–డయాబెటిక్ స్టేజ్‌లో దీన్ని క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహార నియమాలు పాటించడం (అంటే కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు) తక్కువగా ఉండటంతోపాటు అందులో కొవ్వులు, ప్రొటీన్ల పాళ్లు ఎంత ఉండాలో అంతే ఉండేలా ఆహారం తీసుకోవడం) వంటి చర్యల ద్వారా డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు. ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి ఆహారనియమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలితోనూ రక్తంలోని చక్కెరపాళ్లు అదుపులోకి రాకపోతే మాత్రం తప్పనిసరిగా డయాబెటిస్‌కు మందులు వాడాల్సిందే. మందులు వాడటం మొదలుపెట్టాక కూడా వ్యాయామం, ఆహార నియమాలు పాటించాల్సిందే. ఇక మీ రెండో ప్రశ్నకు సమాధానం ఏమిటంటే... ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడ కూడా ఇన్సులిన్ ట్యాబ్లెట్ల రూపంలో అందుబాటులో లేదు. అయితే ఇంజెక్షన్ల ద్వారా కాకుండా టాబ్లెట్ల ద్వారా ఇన్సులిన్ అందించడానికి పరిశోధనలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్నాయి. షుగర్ తగ్గడం వల్ల కూడాసమస్య వస్తుందా? మా అమ్మగారి వయసు 64 ఏళ్లు. చాలా రోజులుగా ఆమె డయాబెటిస్తో బాధపడుతున్నారు. రోజూ క్రమం తప్పకుండా టాబ్లెట్లు తీసుకుంటారు. ఒకరోజు అకస్మాత్తుగా స్పృహతప్పిపడిపోతే హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి రక్తంలో షుగర్ పాళ్లు తగ్గాయని చెప్పారు. షుగర్ పెరిగితే కదా ప్రమాదం... ఇలా షుగర్ తగ్గడం వల్ల కూడా ప్రమాదాలు ఉంటాయా? – సందీప్, విశాఖపట్నం ఒక్కోసారి పెద్ద వయసు వాళ్లు తాము తినాల్సిన ఆహారం తినరు. కానీ తాము వాడాల్సిన చక్కెరను నియంత్రించే మాత్రలు మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటారు. అలాంటప్పుడు వాళ్ల రక్తంలో ఉండాల్సిన చక్కెర ఉండాల్సిన మోతాదు కంటే తక్కువకు పడిపోవచ్చు. అలా చక్కెరపాళ్లు చాలా ఎక్కువగా పడిపోవడాన్ని వైద్యపరిభాషలో హైపోగ్లైసీమియా అంటారు. దీనివల్ల వృద్ధులైన రోగుల్లో (వణుకు, చెమటలు పట్టడం వంటి లక్షణాలుకు బదులుగా) నరాలకు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే నిద్రమత్తుగా ఉన్నట్లుండటం, బలహీనత, భ్రాంతులు, అయోమయం వంటివి. ఆ వయసువారికి మత్తుగా జోగుతుండటం వల్ల పడిపోయి ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో వారిని తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయాలి. నైట్‌డ్యూటీలు చేస్తే డయాబెటిస్ వస్తుందా? నా వయసు 31 ఏళ్లు. నేను నెలలో ఒకటీ మూడు వారాలు డే–డ్యూటీలు, రెండూ, నాలుగు వారాలు నైట్ డ్యూటీలు... ఇలా మార్చిమార్చి డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. కాస్త యంగ్ పర్సన్స్ కావడంతో ఎవరైనా పెద్ద వయసు వాళ్లు డ్యూటీలకు రాకపోతే ఆ నైట్ డ్యూటీలు కూడా మాకే వేస్తారు. పరీక్షలు చేయించుకుంటే నాకు డయాబెటిస్ బార్డర్‌లైన్‌లో ఉందని తేలింది. రక్తపరీక్షలు చేయించినప్పటి నుంచి నాకు డయాబెటిస్ చాలా త్వరగా వచ్చేస్తుందేమోనని ఆందోళనగా ఉంది. డయాబెటిస్ రాకుండా ఉండటానికి జాగ్రత్తలు చెప్పండి. – మనీష్‌కుమార్, హైదరాబాద్ వృత్తిపరంగా కంటినిండా నిద్రలేకపోవడం, ఒత్తిడి వల్ల నిద్రపట్టకపోవడం డయాబెటిస్ రావడాన్ని వేగవంతం చేస్తే చేయవచ్చు. కానీ కేవలం నైట్ డ్యూటీస్ వల్లనే డయాబెటిస్ రాదు. అయితే డయాబెటిస్ రావడం అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల్లోగానీ, మీ వంశంలో ఎవరికైనా డయాబెటిస్ ఉందా అన్న అంశం మీద ఆధారపడి, జన్యుపరంగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువగా నైట్‌డ్యూటీలు చేస్తానని తెలిపారు. అయితే మీరు పగలు పడుకోవడం, రాత్రిళ్లు మేల్కొంటూ ఉండటం వల్ల కొన్ని రకాల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక రక్తపరీక్షలో బార్డర్‌లైన్ డయాబెటిస్ అని వచ్చింది కాబట్టి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే ఆరోగ్యకరమైన మీ జీవనశైలి మార్పులతో మీరు మీ డయాబెటిస్ వచ్చే అవకాశాలను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు. ఇందుకోసం మీరు రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం లేదా వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు వంటి అధిక క్యాలరీలు ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. ప్రతి కొద్దిగంటల తర్వాత ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఆహారంలో తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పీచు ఎక్కువగా ఉండేముడిబియ్యం, కాయధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. నైట్‌డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో కాఫీలు, టీలు తాగవద్దు. కచ్చితంగా భోజనం వేళకు భోజనం చేయడం, కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు భోజనం చేయడం వంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోండి. మీ బరువును అదుపులో పెట్టుకోండి. ఇలాంటి జీవనశైలి మార్పులు చేసుకుంటే డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఎక్కువగా నివారించవచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. - డాక్టర్ ఎమ్. గోవర్ధన్ ,సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
‘మధుమేహం’.. అంతా మోసం..!
- నిరుద్యోగుల నుంచి రూ.అరకోటి వసూళ్లు - కోరుట్లలో ఓ స్వచ్చంద సంస్థ నిర్వాకం కోరుట్ల : డయాబెటిక్ శిక్షణ, ఉపాధి పేరిట నిరుద్యోగుల నుంచి వేలల్లో డబ్బులు గుంజుతున్న ఓ స్వచ్చంద సంస్థ నిర్వాకమిది. ఏడాది కాలంగా శిక్షణ పొందుతున్నప్పటికీ తమకు ఉపాధి కల్పించడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అమలవుతున్న పథకం ద్వారా శిక్షణ నిర్వహిస్తున్నామని మభ్యపెడుతూ నిర్వాహకులు పబ్బం గడుపుకుంటున్నారు. ఇటీవల శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఉపాధి విషయమై గొడవ చేయగా స్వచ్చంద సంస్థ నిర్వాహకులు వారిలో కొందరి వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయడం గమనార్హం. దీంతో పాటు నామమాత్రంగా ఓ డయోబెటిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కొందరికి ఉపాధి ఇచ్చినట్లు నమ్మిస్తున్నారు. ఒక్కోక్కరికి రూ.30వేలు కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ కింద తమకు డయాబెటిక్ నివారణ, అవగాహన శిక్షణ కేంద్రం మంజూరైందని, శిక్షణ తర్వాత ఉపాధి కల్పనకు అనుమతి ఉందని పేర్కొంటూ కోరుట్లకు చెందిన స్టార్ మహిళా మండలి నిర్వాహకులు ఏడాది క్రితం శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ తీసుకున్న వారికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే డయాబెటిక్ అవేర్నెస్ సెంటర్లలో ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఈ ప్రచారం నిజమేనని నమ్మిన నిరుద్యోగ యువతీ యువకులు కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కేంద్రంలో అడ్మిషన్లు తీసుకున్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి సుమారు రూ.30వేలు వసూలు చేశారు. శిక్షణ కేంద్రంలో అభ్యర్థులను చేర్పించడానికి ఏజెంట్లను నియమించుకుని వారికి ఒక్కో విద్యార్థిని చేర్పించినందుకు రూ.10వేలు అందజే శారు. ఈవిధంగా మొతం్త రెండు వందల మంది అభ్యర్థులను అడ్మిట్ చేసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.50 లక్షల వసూలు చేశారు. ఈ శిక్షణ ఏడాదికాలంగా కొనసాగుతున్నా.. ఉపాధి జాడ మాత్రం లేకుండా పోయింది. అడిగితే డబ్బులు వాపస్.. రెండు నెలల క్రితం క్రితం డయూబెటిక్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న పలువురు అభ్యర్థులు తమకు ఇంకా ఎన్నాళ్లు శిక్షణ ఇస్తారంటూ ఆందోళనకు దిగారు. దీంతో సంస్థ నిర్వాహకులు గొడవ చేసిన వారికి డబ్బులు వాపస్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికే సుమారు ఇరవై మందికి డబ్బులు వాపస్ చేశారు. అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని పోలీస్‌స్టేషన్ చౌరస్తాలో ఓ డయాబెటిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన వారిలో కొందరిని అక్కడ నియమించి తాత్కాలికంగా ఉపశమనం కల్పించారు. రానున్న కాలంలో రాష్ట్రవ్యాప్తంగా డయాబెటిక్ కేంద్రాలు ఏర్పాటవుతాయని, శిక్షణ పొందిన వారికి ఆయూ కేంద్రాల్లో ఉపాధి దొరకుతుందని చెబుతున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో అలీంను వివరణ కోరగా... డయాబెటిక్ శిక్షణ కేంద్రం నిర్వహణ అంశం తమ పరిధిలోకి రాదన్నారు. అభ్యర్థులు పలుమార్లు ఆందోళన చేసినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. -
విలక్షణ నటి... వైవిధ్యభరిత పాత్ర!
అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో సమంత ఓ డయాబెటిక్ పేషంట్. ఈ విషయాన్ని చాలా మంది విమర్శించారు. ‘‘అదేంటి కథానాయిక డయాబెటిక్ పేషంటా...?’’ అని విమర్శించిన వాళ్లు అధికం. కానీ ఇలాంటి పాత్రలు మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కూడా వస్తున్నాయని చెప్పొచ్చు. అదీ ప్రధాన పాత్రల్లో. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ‘మార్గరీటా విత్ స్ట్రా ’. ఈ సినిమా ఈ వారం విడుదల కానుంది. బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ ఈ చిత్రంలో సెరెబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడే ఓ యువతిగా నటించారు. తొలి చిత్రం ‘దేవ్ డి’ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడం కల్కిలో విశేషం. ఇప్పటికే తేలిన్ బ్లాక్ నైట్ ఫిలిం చిత్రోత్సవంలో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో తన పాత్ర గురించి కల్కి చెబుతూ-‘‘ ఈ చిత్ర దర్శకురాలు సోనాలీ బోస్ బంధువు ఇదే వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెను బాగా గమనించా. ఆరు నెలల ఈ సినిమా షూటింగ్లో కూడా ఈ పాత్రలోనే ఉండేలా నా దినచర్యను కూడా మార్చుకున్నా. ఈ సినిమా కొంత మందికి చాలా ఇబ్బందిగా ఉండచ్చేమో. కానీ ట్రైలర్ చూసిన చాలా మంది నాకు ఫోన్ చేసి మరీ అభినందించారు. ఇలాంటి కథాంశాలను మన దేశంలో కూడా సాదరంగా ఆహ్వానించే రోజులు త్వరలోనే రావచ్చు’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కిడ్నీలు జర భద్రం
పెరుగుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాబెటిక్, హైపర్ టెన్షన్ కారణం జిల్లాలో 500 మందికి పైగా ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం శరీరంలో కిడ్నీలదే కీలక భూమిక మానవ శరీరంలో మూత్రపిండాలు అనేక ముఖ్య విధులు నిర్వర్తించే కర్మాగారాలు. ఇవి శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు/ మాదకద్రవ్యాలను తొలగించి శరీరంలో ద్రవ పదార్థాల సమతుల్యతను కాపాడతాయి. రక్త పీడనాన్ని క్రమ బద్ధీకరించి, ఆరోగ్య వంతమైన గట్టి ఎముకల తయారీకి, ఎర్రరక్త కణాల ఉత్పత్తికి సహకరిస్తాయి. ఇంత ముఖ్య భూమిక పోషించే కిడ్నీలపై అప్రమత్తత ఎంతో అవసరం. మూత్రపిండ వ్యాధులకు కారణాలివే మూత్రపిండాలు దెబ్బతినేందుకు కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు, మూత్ర విసర్జక మార్గ వాధులు, మూత్రకోశవ్యాధులు, మూత్ర పిండాల్లో ఏర్పడే రాళ్లు, గ్లోమోరంలో నోఫ్రోసిన్ (మూత్రపిండాలలో మూత్రాన్ని వడపోసే సూక్ష్మ నిర్మాణాల వాపు), అను వంశీకంగా సంక్రమించే మూత్రపిండ సంబంధిత వ్యాధి, మాదక ద్రవ్యాలు, విషపదార్థాలు, మలేరియా, నొప్పి నివారణ మందులు, నాటు మందులు, శాస్త్రీయం కాని మందులు అధికంగా వాడే వారికి కిడ్నీ వాధులు సంక్రమించే అవకాశం ఉంది. వయస్సు 50 సంవత్సరాలు పైబడిన వారిలో ధూమపానం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటాయి. హెచ్చరికలుగా కనిపించే లక్షణాలు సాధారణంగా మూత్రపిండ వ్యాధి రెండింటికీ సోకుతుంది. రెండు కిడ్నీలు పాడైన దశలో రక్తపోటు అధికంగా ఉండటం, మూత్రంలో రక్తం, ప్రొటీన్లను నష్టపోవడం, రక్తహీనత, ఆయాసం, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన జరుపుట (ముఖ్యంగా రాత్రి వేళల్లో), మూత్ర విసర్జన కష్టంగా ఉండటం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి కలుగుట, ముఖ్యంగా చిన్నపిల్లల్లో కాళ్లు, చేతులు వాపులు, కళ్లు చుట్లూ ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరిలో కిడ్నీ వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ వృద్ధాప్యంలో ఉన్న వారికి, మధుమేహ వ్యాధి అదుపులో లేని వారికి, రక్తపోటు క్రమబద్ధీకరణ కానివారికి, కుటుంబంలో ఎవరైనా మూత్రపిండాల వ్యాధితో బాధపడే వారు ఉంటే మిగిలిన వారికి కూడా వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. అలాంటి వారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచింది. అందుబాటులో ఆధునిక వైద్యం మూత్రపిండాల వ్యాధులకు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంది. హోమ్ డయాలసిస్, డయాలసిస్, కిడ్నీ సంబంధిత లాపరోస్కోపిక్ ఆపరేషన్లు, కిడ్నీ మార్పిడి వంటి వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. మధుమేహం, హైపర్ టెన్షన్ రోగులు వ్యాధి లక్షణాలను గుర్తించి తొలిదశలో చికిత్స పొందితే మంచిది. ఆరోగ్యకరమైన కిడ్నీలు ఆనందమయ జీవితానికి తొలిమొట్టుగా గ్రహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తరచూ కిడ్నీ పరీక్షలు చేయించుకుంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. - డాక్టర్ ఎం.సాయికృష్ణ, మూత్రపిండ వ్యాధి నిపుణులు నివారణ సాధ్యం, శ్రేష్టం కిడ్నీ వ్యాధికి గురవుతున్న వారిలో 50 శాతం మంది మధుమేహ రోగులే. మైక్రో ఆల్బుమిన్ యూరియా అనేది సుగర్ సంబంధిత కిడ్నీ వ్యాధికి ముందస్తు సూచికే కాక, రాబోయే కంటి రెటీనా, గుండె సమస్యలకు కూడా ప్రమాద ఘంటిక. శుభవార్త ఏమంటే ఏసీఈ, ఏఆర్‌బీ వంటి ఆధునిక మందులతోపాటు, ఆహారంలో ఉప్పు, మాంసకృత్తుల వాడకం తగ్గించడం, మధుమేహం, రక్తపోటును అదుపుచేసుకోవడం, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా కిడ్నీల సమస్యలను నివారించవచ్చు. దీర్ఘకాలిక సుగర్ శాతం(ెహ చ్బీఏ1సీ) వార్షిక సగటు ప్రతి ఒక శాతం తగ్గుదలతో సుగర్ సంబంధిత కిడ్నీ సమస్యలను 37 శాతం వరకూ నివారించగలిగి, పూర్తి జీవితం సంపూర్ణ ఆరోగ్యంతో జీవించొచ్చు. - డాక్టర్ ఎం.శ్రీకాంత్, డయాబెటాలజిస్ట్