![Neena Gupta Shared Glimpse Of What She Had For Breakfast](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/10/9/Neena.jpg.webp?itok=q65tC_B4)
బాలీవుడ్ నటి, దర్శకురాలు అయిన నీనా గుప్తా సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకుంది. మంచి నటిగా పేరుతెచ్చుకోవడమే గాక ఎన్నో అవార్డులు, పురస్కారాలను దక్కించుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటుంది. అలానే తాజాగా తనకిష్టమైన బ్రేక్‌ఫాస్ట్ గురించి షేర్ చేసుకుంది.
ఇన్‌స్టాలో తనికష్టమైన పరాటా ఫోటోని షేర్ చేసింది. 'ఆలూ పనీర్ ప్యాజ్ పరాఠా' బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అని పేర్కొంది. అలాగే తనకిష్టమైన వివిధ అల్పాహారాల కూడా గురించి వెల్లడించింది. సౌత్ ఇండియన్ వంటకమైన ఊతప్పం అంటే మహా ఇష్టమని అన్నారు. కొబ్బరి చట్నీతో ఊతప్పం తింటుంటే ఆ రుచే వేరేలెవెల్ అని చెబుతున్నారు.
అలాగే తనకు సుజీ (గోధుమ రవ్వ)తో చేసిన అట్లు అంటే మహా ఇష్టమని తెలిపింది. ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పుకొచ్చింది. దీన్ని రైతాతో తింటే టేస్ట్ మాములుగా ఉండదట.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/parat.jpg)
(చదవండి: అత్యంత స్పైసీ హాట్ సాస్..జస్ట్ మూడు నిమిషాల్లో..!)
Comments
Please login to add a commentAdd a comment