అందానికి సంబంధించి.. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పాదాల దగ్గర నుంచి హెయిర్ వరకు ప్రతిదాని సంరక్షణ కోసం విచిత్రమైన చిట్కాలతో వీడియోలు పోస్ట్ చేసేస్తున్నారు. ఇక మేకప్ విషయానికి వస్తే వామ్మో..! ఆ పదం ఎత్తాలంటేనే భయంగొలిపేలా పిచ్చి పిచ్చి మేకప్‌లతో జనాలను చంపేస్తున్నారనే చెప్పొచ్చు. ఏవేవో వింత వింత మేకప్‌ల వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. వాటిని చూసి జనాలు ఇవేం అందం పోకడలు అని నోరెళ్లబెడుతున్నారు. ఇప్పుడు తాజగా అదే మాదిరిగా ఓ మేకప్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చూస్తే.. ఇందుకోసం కూడా మేకప్ అవసరమా అని తలపట్టుకుంటారు.
ఇంతకీ ఏంటా మేకప్ అంటే..జపాన్ టిక్‌టాక్ బ్యూటీ క్రియేటర్ వెనెస్సా ఫ్యూన్స్ ఈ వీడియోని పోస్ట్ చేసింది. అందులో ఆమె హాట్ గ్లూగన్ అనే సరికొత్త మేకప్ గురించి వివరించింది. వేడివేడి జిగురుని ఉపయోగించి "3D టియర్‌డ్రాప్ మేకప్" వేస్తారు. ఇందులో ఏంటి స్పెషాల్టీ అంటే..మేకప్ ప్రక్రియలో భాగంగా ముఖంపై ప్లాస్టిక్ షీట్ వంటిదాన్ని పరిచి దాని మీద వేడి వేడి వెంట్రుకుల జిగురుని వేయడం జరుగుతుంది.
అతి ముఖానికి అతుక్కుపోయిన వెంటనే..ఒలిస్తే కన్నీటి బిందువు ఆకారంలా ముఖంపై రావడం జరుగుతుంది. దీన్ని భావోద్వేగ భరితం లేదా దుఃఖ పూరితంగా కననిపించేలా చేసేందుకు ఈ మేకప్‌ని ఉపయోగిస్తారట. అంతేగాదు అనుకోని పరిస్థితుల్లో సానుభూతిని సంపాదించుకునేందుకు కూడా ఈ మేకప్ ఉపయోగపడుతుందట. ఆఖరికి ఏడుపుని కూడా మేకప్‌తో మాయ చేస్తారా అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
ఈ బ్యూటీ ట్రెండ్ చూస్తే.. ఇక రాను రాను కన్నీళ్లకు కూడా విలువ ఉండదేమోకదూ. అయితే నిపుణులు మాత్రం ఇలా చర్మంపై వేడి వేడి జిగురుని వేయడం అనేది మంచిది కాదని, ఇది చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
(చదవండి: శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?)
Comments
Please login to add a commentAdd a comment