tear
-
ఇదేం మేకప్ సామీ..కన్నీళ్లు పెట్టించేస్తున్నారుగా!
అందానికి సంబంధించి.. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పాదాల దగ్గర నుంచి హెయిర్ వరకు ప్రతిదాని సంరక్షణ కోసం విచిత్రమైన చిట్కాలతో వీడియోలు పోస్ట్ చేసేస్తున్నారు. ఇక మేకప్ విషయానికి వస్తే వామ్మో..! ఆ పదం ఎత్తాలంటేనే భయంగొలిపేలా పిచ్చి పిచ్చి మేకప్‌లతో జనాలను చంపేస్తున్నారనే చెప్పొచ్చు. ఏవేవో వింత వింత మేకప్‌ల వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. వాటిని చూసి జనాలు ఇవేం అందం పోకడలు అని నోరెళ్లబెడుతున్నారు. ఇప్పుడు తాజగా అదే మాదిరిగా ఓ మేకప్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చూస్తే.. ఇందుకోసం కూడా మేకప్ అవసరమా అని తలపట్టుకుంటారు. ఇంతకీ ఏంటా మేకప్ అంటే..జపాన్ టిక్‌టాక్ బ్యూటీ క్రియేటర్ వెనెస్సా ఫ్యూన్స్ ఈ వీడియోని పోస్ట్ చేసింది. అందులో ఆమె హాట్ గ్లూగన్ అనే సరికొత్త మేకప్ గురించి వివరించింది. వేడివేడి జిగురుని ఉపయోగించి "3D టియర్‌డ్రాప్ మేకప్" వేస్తారు. ఇందులో ఏంటి స్పెషాల్టీ అంటే..మేకప్ ప్రక్రియలో భాగంగా ముఖంపై ప్లాస్టిక్ షీట్ వంటిదాన్ని పరిచి దాని మీద వేడి వేడి వెంట్రుకుల జిగురుని వేయడం జరుగుతుంది. అతి ముఖానికి అతుక్కుపోయిన వెంటనే..ఒలిస్తే కన్నీటి బిందువు ఆకారంలా ముఖంపై రావడం జరుగుతుంది. దీన్ని భావోద్వేగ భరితం లేదా దుఃఖ పూరితంగా కననిపించేలా చేసేందుకు ఈ మేకప్‌ని ఉపయోగిస్తారట. అంతేగాదు అనుకోని పరిస్థితుల్లో సానుభూతిని సంపాదించుకునేందుకు కూడా ఈ మేకప్ ఉపయోగపడుతుందట. ఆఖరికి ఏడుపుని కూడా మేకప్‌తో మాయ చేస్తారా అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ బ్యూటీ ట్రెండ్ చూస్తే.. ఇక రాను రాను కన్నీళ్లకు కూడా విలువ ఉండదేమోకదూ. అయితే నిపుణులు మాత్రం ఇలా చర్మంపై వేడి వేడి జిగురుని వేయడం అనేది మంచిది కాదని, ఇది చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. (చదవండి: శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?) -
బిగ్ బాస్ షోలో కంటతడి పెట్టిన నటుడు
హైదరాబాద్: ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ షో ఈ ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న14 మంది సెలబ్రెటీస్లలో నటుడు శివబాలాజీ ఒకరు. అయితే గడిచిన షోలోని ఓ టాస్క్‌లో సహ కంటెస్టెంట్లు చెప్పిన నిజ జీవిత సంఘటలు విన్న శివ బాలాజీ కన్నీరు పెట్టుకోవడం అందరి హృదయాల్ని కలచివేసింది. ఈ విషయాన్ని శివ బాలాజీ భార్య మధుమిత సోషల్ మీడియా ద్వారా మరో మారు గుర్తుచేసుకున్నారు. ఇది బాలాజీలోని అరుదైన కోణమని ఆమె తెలిపారు. అలాంటిదాన్ని బిగ్ బాస్ షో ఒక్క రోజులో బయట పెట్టిందని చెప్పారు. ఆయన కన్నీరు పెట్టుకోవడం నేను చూడలేనని తన భర్త ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఈ రోజు మా ఆయన చెప్పబోయే కథ కోసం ఎదురుచూస్తున్నట్లు ఇందులో పేర్కొన్నారు. -
ఓరుగల్లును ముక్కలు చేయొద్దు
హన్మకొండ అర్బ¯ŒS : ఓరుగల్లు మహానగరాన్ని ముక్కలు చేయవద్దని హన్మకొండ, వరంగల్, కాజీపేట పట్టణాలు ఒకే జిల్లాలో ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తూ పౌరసంఘాల జేఏసీ ఆధర్యంలో మేధావులు నక్కల గుట్ట కాళోజి విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు మంగళవారం మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా జేఏసీ గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ 12 దశాబ్దాల చరిత్ర ఉన్న ఓరుగల్లు మహానగరాన్ని ముక్కలు చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. గ్రేటర్ వరంగల్ మొత్తం ఒకే జిల్లా ఉండాలనానరు. లేదంటే నిత్యం ఆందోళనలు కొనసాగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జేఏసీ చైర్మ¯ŒS పుల్లూరి సుధాకర్ మాట్లాడుతూ స్మార్ట్, హృదయ్, అమృత్ వంటి పథకాలతో ఇప్పుడే ఓరుగల్లు అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో నగరాన్ని ముక్కలు చేస్తే అభివృద్ధి నిరోధకంగా మారుతుందని అన్నారు. కన్వీనర్ తిరునహరి శేషు మాట్లాడుతూ జిల్లాల విభజన ప్రజల సౌకర్యం కోసం చేయాలి తప్ప రాజకీయ అవసరాల కోసం కాదని అన్నారు. గ్రేటర్ ముక్కలు చేసే ఆలోచన విరమించుకోవాలని కోరారు. ర్యాలీలో డాక్టర్ అశోక్, చిల్లా రాజేంద్రప్రసాద్, అనీస్సిద్దికి, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ప్రతినిధి డాక్టర్ కోదండ రామారావు, రమాదేవి, దివాకర్, భద్రునాయక్, బందెల మోహ¯ŒSరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇల్లెందును ముక్కలు చేయొద్దు
సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు ఖమ్మం సిటీ: జిల్లాల పునర్విభజన పేరుతో ఇల్లెందు నియోజకవర్గాన్ని ముక్కలు చేయొద్దని సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఆయన బుధవారం ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాల పునర్విభజన ముసాయిదాలో శాస్త్రీయత లోపించిందని, ఆయా ప్రాంతాల చారిత్రక.. సాంస్కతిక అస్థిత్వానికి ముప్పు ఏర్పడిందని అన్నారు. జిల్లాలోని గార్ల, బయ్యారం మండలాలను భౌగోళికాంశాల ఆధారంగా మహబూబాబాద్‌లో కలిపితే ఖమ్మం జిల్లాకు నష్టం కలుగుతుందన్నారు. ఈ రెండు మండలాల్లోని ప్రజలకు జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలపడం ద్వారా పెద్ద గాయం చేశారని, ఇప్పుడు మరో రెండింటిని కూడా తొలగిస్తే.. ఆ గాయంపై కారం చల్లినట్టుగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందు నియోజకవర్గాన్ని మూడు ముక్కలుగా చేయకుండా ఖమ్మం లేదా కొత్తగూడెం జిల్లాలో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బయ్యారం మండలంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఇప్పటివరకు గంపెడాశతో ఉన్న ఇక్కడి నిరుద్యోగ యువత.. ప్రభుత్వ నిర్ణయంతో నిరాశ, నిస్పహలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వనరులు కోల్పోయిన ఖమ్మం జిల్లా బీదగా మారే ప్రమాదముందన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తామన్న మంత్రి తుమ్మల హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయినప్పటికీ జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా అదనంగా సాగు నీరు ఇవ్వలేదని విమర్శించారు. ఆర్భాటంగా ప్రకటించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కింద ఇప్పటివరకూ జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదని అన్నారు. ఇది మాటల ప్రభుత్వమేనని, చేతులు ఉండవనే విషయానికి ఇది నిదర్శనమని అన్నారు. చేసే పనులను మాత్రమే చెప్పాలని తుమ్మలకు హితవు పలికారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరు ఇస్తామని సీఎం కేసీఆర్ గొప్పలు చెబుతున్నారని, వాస్తవానికి తెలంగాణలో అంత సాగు భూమి లేదని రెవెన్యూ సర్వే లెక్కలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. లేని భూమికి నీళ్లెలా ఇస్తారని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, నాయకులు జానిమియా, సలాం, నర్సింహారావు, పోటు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.