
బిగ్ బాస్ షోలో కంటతడి పెట్టిన నటుడు
ఈ విషయాన్ని శివ బాలాజీ భార్య మధుమిత సోషల్ మీడియా ద్వారా మరో మారు గుర్తుచేసుకున్నారు. ఇది బాలాజీలోని అరుదైన కోణమని ఆమె తెలిపారు. అలాంటిదాన్ని బిగ్ బాస్ షో ఒక్క రోజులో బయట పెట్టిందని చెప్పారు. ఆయన కన్నీరు పెట్టుకోవడం నేను చూడలేనని తన భర్త ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఈ రోజు మా ఆయన చెప్పబోయే కథ కోసం ఎదురుచూస్తున్నట్లు ఇందులో పేర్కొన్నారు.