జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకి నేడు శివ బాలాజీ భార్య మధుమిత రానున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్స్ భార్యలు అతిథులుగా విచ్చేసి సడెన్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. శివ బాలాజీ భార్య మధుమిత, ఆదర్శ్ భార్య గుల్నార్‌లు అతిథులుగా షోకి వస్తున్నట్లు ప్రోమోలో తెలుస్తోంది. కాగా, సడెన్ సర్‌ప్రైజ్‌తో చాలా రోజుల తర్వాత కలుసుకున్న జంటలు అందరినీ కంటతడి పెట్టించింది.
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇటీవలే 50 రోజుల పండుగ చేసుకొని చివరి దశకు చేరుకుంది. ఇది వరకు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ, తాప్సీ, నరేష్, తదితరులు షోని సందర్శించిన విషయం తెలిసిందే.