madhumitha
-
దీపావళికి నేను ఎందుకు దూరంగా ఉన్నానంటే..!
-
యూట్యూబ్ కామెంట్స్ లో చాలా వార్నింగ్ లు వచ్చాయి: మధుమిత
-
ఇలాంటి భర్త దొరకడం నిజంగా అదృష్టం..!
-
డబ్బు పిచ్చి కన్నా పెద్ద జబ్బు ఏది లేదు
-
ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం అదే అంటున్న శివ బాలాజీ
-
ఆస్ట్రియా వీధుల్లో చిల్ అవుతోన్న కేతిక శర్మ.. బ్లాక్ శారీలో పూర్ణ హోయలు!
►గ్రీన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మధుబాల ►బ్లాక్ శారీలో తన అందంతో కెపెక్కిస్తోన్న పూర్ణ ►గ్రీన్ డ్రెస్‌లో హల్ చల్ చేస్తోన్న అనన్య పాండే ►ఆస్ట్రియాలో చిల్ అవుతోన్న కేతిక శర్మ ►ఫ్లూట్ నేర్చుకుంటోన్న ఆదాశర్మ View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Madhoo Shah (@madhoo_rockstar) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
దిల్లీ టూర్లో మధుమిత- శివబాలాజీ కపుల్స్ (ఫొటోలు)
-
శివ బాలాజీపై డౌట్ వచ్చి అప్పుడే దూరం పెట్టేశా: మధుమిత
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకరు. ఇంగ్లీష్ కారన్(2004) మూవీలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. 2009లో ఈ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే తమ పెళ్లి అంత ఈజీగా జరగలేదని అంటోంది ఈ ప్రేమ జంట. అంతే కాకుండా శివనే మొదట తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది. (ఇది చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ) ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ జంట పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలాగానే తమ పెళ్లిలో చాలా ట్విస్టులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ జంట లైఫ్‌లో ఎదురైన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందన్న విషయాన్ని మధుమిత వెల్లడించారు. మధుమిత మాట్లాడుతూ.. 'నేను ఇది మా అశోక్‌గాడి లవ్ స్టోరీలో మొదటిసారి శివను చూసినప్పుడే ఈ అబ్బాయి బాగున్నాడనిపించింది. ఇంగ్లిష్ కరన్’ సమయంలో దర్శకుడు పరిచయం చేయగా.. నేనే అతన్ని పలకరించాను. ఆ తర్వాత చాలాసార్లు నాకు హెల్ప్ చేసే సరికి మంచి వాడనే ఫీలింగ్ కలిగింది. మొదట్లో నేను హాయ్ అంటే హాయ్ అనేవాడు. తను కూడా నన్ను చాలా గమనించేవాడు. నేను ఒకసారి లిప్‌స్టిక్ వేసుకున్న తర్వాత తుడుచుకున్న టిష్యూ తీసుకుని దాచుకున్నాడు. అలాంటి పనులు చేస్తూ నాకు కనిపించాలని ప్రయత్నించేవాడు. ఒకసారి నేను చెన్నై వెళ్లగానే మిస్ అవుతున్నట్లు మెసేజ్ పెట్టాడు. అది చూసి నాకు సందేహం వచ్చి దూరం పెట్టడం మొదలుపెట్టా. కానీ ఆ తర్వాత కూడా నాకు దగ్గరయ్యేందుకు చాలా ట్రై చేశారు. ఒకరోజు ఏకంగా పెళ్లి చేసుకుందామా అని అడిగేశాడు. ' అంటూ చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: భీమిలీ కబడ్డీ జట్టు హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా!) -
నాన్న చనిపోయాక అప్పు తీర్చలేక ఆస్తులమ్మేశాం: శివ బాలాజీ
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు శివబాలాజీ. ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీతో వెండితెరకు పరిచయమయ్యాడు శివబాలాజీ. తండ్రి వ్యాపారవేత్త అయినా శివబాలాజీ మాత్రం నటన అంటే ఆసక్తి ఉండటంతో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. తక్కువ కాలంలోనే తనను తాను నిరూపించుకున్నాడు. చందమామ, శంభో శివ శంభో, ఆర్య వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవల తన భార్య మధుమితతో కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరైన శివబాలాజీ తన కష్టనష్టాలను చెప్పుకొచ్చాడు. 'నాన్న చనిపోయాక తన బిజినెస్ చూసుకునేవాళ్లు ఎవరూ లేరు. అమ్మకు ఏం తెలియదు, తమ్ముడు ఇంకా చిన్నవాడు. నెమ్మదిగా బిజినెస్ డౌన్ అవటం, బ్యాంకుల్లో తీసుకున్న అప్పుకు వడ్డీ పెరగడం మొదలైంది. అప్పుడు నేనే వెళ్లి మిషనరీలు, ఉన్న స్థలాలు.. ఇలా కొన్ని ఆస్తులమ్మేసి ఆ డబ్బుతో అప్పు కట్టేశాను. ఆ తర్వాత నేను కూడా బిజినెస్ చేసి చాలా మోసపోయాను. ఈము పక్షులు పెంపకం గురించి విని, కేంద్ర ప్రభుత్వం సబ్సిడి ఇస్తుందని తెలిసి వాటిని పెంచాం. 1500 పక్షులను పెంచాను. కేవలం వాటి తిండికే నెలకు రూ.5 లక్షల దాకా అయ్యేది. ఆ తర్వాత అదంతా స్కామ్ అని తెలిసింది. సబ్బులు, పెయిన్ రిలీఫ్ ఆయిల్.. ఇలా అన్నీ చేశాం. కానీ ఆ స్టాక్ అమ్ముడుపోక మిగిలిపోయేవి. దీంతో ఆ వ్యాపారమూ మూసేశాం. స్నేహమేరా జీవితం సినిమా కోసం రూ.2 కోట్లు ఖర్చు పెట్టి అక్కడా నష్టపోయాను' అని చెప్పుకొచ్చాడు శివ బాలాజీ పిల్లలను స్కూల్ మాన్పించేసిన ఘటన గురించి మధుమిత మాట్లాడుతూ.. 'కోవిడ్ సమయంలో స్కూలు ఫీజులు ఎంతమేరకు ఉండాలనేది ఒక జీవో వచ్చింది. మా పిల్లల స్కూల్లో అంతకంటే ఎక్కువ ఫీజు ఉంది. అప్పటికే ఆ స్కూల్లోని విద్యార్థుల పేరెంట్స్ గేటు బయట ధర్నా చేద్దామంటూ వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టారు. కోవిడ్ సమయంలో ధర్నా వద్దు, స్కూల్ యాజమాన్యంతోనే మీరొకసారి మళ్లీ మాట్లాడితే సరిపోతుంది అని ఒక మెసేజ్ పెట్టాను. నా మాట విని వాళ్లంతా ధర్నా ఆపేశారు. అయితే రేప్పొద్దున నేనేది చెప్పినా అంతా వింటారని అనుకున్నారో ఏమో కానీ స్కూల్ యాజమాన్యం మా పిల్లలను తీసేసింది. వారం రోజుల్లో పరీక్ష ఉండగా ఒక్క మాట కూడా చెప్పకుండా తీసేశారు. అప్పటికీ మేము ఫీజంతా కట్టేశాం. అయినా మేం ఏ తప్పూ చేయకపోయినా అలా ప్రవర్తించారు' అని చెప్పుకొచ్చింది. చదవండి: పారిపోయి పెళ్లి చేసుకున్న డైరెక్టర్.. అప్పటి క్షణాలను తలుచుకుంటూ.. -
పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ
టాలీవుడ్ క్యూట్ కపుల్లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. ఇంగ్లీష్ కారన్(2004) మూవీలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. 2009లో ఈ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే తమ పెళ్లి అంత ఈజీగా కాలేదని చెబుతుంది ఈ జంట. పెళ్లి చేసుకుందాని ఫిక్స్ అయ్యాక.. శివ బాలాజీ బ్రేకప్ చెప్పాడట. మధుమితను పెళ్లి చేసుకుంటే వాళ్ల అమ్మ చనిపోతుందనే భయంతోనే అలా చేశాడట. ఏడాదిన్నర కాలం పాటు దూరంగా ఉండి.. చివరకు మళ్లీ పెళ్లికి ఒప్పించాడట. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది ఈ జంట. (చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాశా: హీరోయిన్ ) మధుమిత మాట్లాడుతూ.. ‘దాదాపు నాలుగేళ్ల పాటు మేం ప్రేమలో ఉన్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఒక రోజు శివ బాలాజీ ఫోన్ చేసి ‘మనకు సెట్ అవ్వదు. జాతకాలు కుదరడం లేదు. మనం పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతుందట’ అని చెప్పాడు. ఆ క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఓకే అని చెప్పి గట్టిగా ఏడ్చేశాను. మనం ఫ్రెండ్స్‌గా ఉందామని బాలాజీ చెప్పినా నో చెప్పాను. ఎందుకంటే అతన్ని నేను భర్తగా ఊహించుకున్నాను. మా ఇంట్లోవాళ్లు జాతకాలు పెద్దగా పట్టించుకోరు. కానీ అత్తమ్మ వాళ్లు జాతకాలను నమ్ముతారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ బాలాజీ టచ్‌లోకి వచ్చాడు. పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అప్పుడు జాతకాలు చూపిస్తే.. బాగున్నాయని చెప్పారు. అప్పుడు మా పెళ్లి జరిగింది’ అని మధుమిత చెప్పుకొచ్చింది. ఇక శివ బాలాజీ మాట్లాడుతూ.. మధమితకు బ్రేకప్ చెప్పిన తర్వాత చాలా బాధపడ్డాను. ఇలా చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఒక్క ఏడాది చూస్తా.. అప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోకపోతే.. ఎలాగైనా ఇంట్లో వాళ్లని ఒప్పిద్దామనుకున్నాను. ఆమెకు ఎన్ని సంబంధాలు వస్తున్నా రిజెక్ట్ చేస్తుందని తెలిసింది. మా ఎలక్షన్ల సమయంలో మధుని మళ్లీ కలిశా. మాట్లాడలేదు. ఒకరోజు ‘మళ్లీ ఎందుకు నా జీవితంలోకి వస్తున్నావు’అని నా మొబైల్‌కి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కలిసి.. కొన్నాళ్లకు ఇంట్లో ఒప్పించాం’ అని శివబాలాజీ చెప్పుకొచ్చాడు. -
విశ్వం ఇచ్చిన అతిగొప్ప వరం.. మధుమిత ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్ జంటల్లో నటుడు శివ బాలాజీ, మధుమిత ముందువరుసలో ఉంటారు. హీరో, హీరోయిన్లుగా నటించిన వీరిద్దరు ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2004లో వచ్చిన తమిళ చిత్రం ‘ఇంగ్లీస్ కారన్’ షూటింగ్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. అనంతరం పెద్ద అంగీకారంతో 2009 మార్చి 1న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక వివాహం అనంతరం నటకు గుడ్‌బై చెప్పేసింది మధుమిత. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇవాళ వారి వివాహా వార్షికోత్సవం సందర్భంగా మధుమిత తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. మధుమిత తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా జననం నేను ఎంచుకోలేనిది. ఆలాగే నా మరణం కూడా నేను ఎంచుకోలేనిదే. ఎనలేని ప్రేమతో నేను ఎంచుకున్న మీతో.. నా జీవితాన్ని అమితమైన ప్రేమతో అత్యద్భుతంగా మలిచారు. ఈ అనంత విశ్వం నాకు ఇచ్చిన అతిగొప్ప వరం మీరు. మీరు నా శివ. నేను మీ మధు. సదా ప్రేమలో పద్నాలుగేళ్ల శివ-మధు పెళ్ళిరోజు శుభాకాంక్షలు.' అంటూ లవ్ ఎమోజీలు జత చేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. శివ బాలాజీ తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. 2003లో విడుదలైన ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్న శివ బాలాజీ సినీ రంగంపై ఆసక్తితో ప్రవేశించారు. View this post on Instagram A post shared by Madhumitha (@madhumithasivabalaji) -
ఆ సినిమాతో రూ.2 కోట్లు నష్టపోయా: శివ బాలాజీ
శివ బాలాజీ అంటే టాలీవుడ్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో ఆయన నటించారు. 'ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ' అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. మొదట్లో తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్న శివ బాలాజీ ఆ తర్వాత సినీ రంగంపై ఆసక్తితో ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ షోలో పాల్గొని విజేతగా నిలిచాడు. చందమామ, శంభో శివశంభో, ఆర్య, అన్నవరం, టెన్త్ క్లాస్ డైరీస్ చిత్రాలతో గుర్తింపు పొందారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ బాలాజీ తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. (ఇది చదవండి: 'పంత్ కోసం ప్రార్థించండి'.. ఊర్వశి రౌతేలా మదర్ పోస్ట్ వైరల్.) శివ బాలాజీ మాట్లాడుతూ.. ' నా ఫ్రెండ్స్ ద్వారా ఈము పక్షుల పెంపకం గురించిన విన్నా. దీనికి కేంద్ర ప్రభుత్వం సబ్సీడీ ఇస్తుందని చెప్పారు. ఆ తర్వాత నేను ఈము పక్షుల పెంపకం మొదలుపెట్టా. దాదాపు 500 ఈము పక్షులతో యూనిట్ ప్రారంభించాం. దాదాపు ఒక నెలకు వాటికోసం రూ.5 లక్షలు ఖర్చు చేసేవాన్ని. కానీ ఆ తర్వాత మాకు తెలిసింది అదంతా ఓ స్కామ్ అని. కానీ ప్రభుత్వం మీట్ ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిందని చెప్పారు. దీనికి తగినంత మార్కెట్ దొరకలేదు. ఆ తర్వాత పెయిన్ రిలీఫ్ ఆయిల్, సోప్స్ వ్యాపారం మొదలెట్టాం. ఇది కూడా పెద్ద సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నేను స్నేహమేరా జీవితం సినిమా చేశా. కానీ పెద్దగా మార్కెట్ చేయలేదు. మూవీ కోసం రూ.2 కోట్లు ఖర్చు చేశా. ఈ ప్రభావం నాపై ఎక్కువగా పడింది. లోలోపల చాలా ఫీలయ్యా. నా వల్ల అందరూ బాధపడ్డారని భావించా. నా వల్ల అందరూ ఫెయిల్ అయ్యారని తీవ్ర నిరాశకు గురయ్యా. నా భార్య మధుమిత వల్లే నేను మళ్లీ నార్మల్ అయ్యా.' అని అన్నారు. -
శివబాలాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మధుమిత
-
శివబాలాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మధుమిత
టాలీవుడ్ క్యుటెస్ట్ కపుల్స్‌లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. ఇద్దరూ సహా నటీనటులుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో నటిస్తున్న క్రమంలో పరిచయం ఏర్పడి వీరిద్దరి మధ్య కొంతకాలానికి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. 2009 మార్చీలో 1న పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన ఇద్దరూ మ్యాచింగ్ దుస్తులు ధరించిన మ్యారీడ్ దోస్తుల్లా ఆకట్టుకుంటారు. ఈ నేపథ్యంలో దీపావళి పండగ సందర్భంగా ఈ ‘బ్రైట్ కపుల్’ సాక్షితో టీవీ పంచుకున్న ముచ్చట్లివి.. శివబాలాజీ: నాకు కోపం ఎక్కువని మధు నన్ను పెళ్లి చేసుకోవడం వాళ్లింట్లో ఇష్టం లేదు. అయితే ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మధుమిత: పెళ్లికి ముందు కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నా కూడా పెళ్లయిన కొత్తలో ప్రతీ చిన్న విషయానికీ గొడవ పడేవాళ్లం. అయితే ఆ తర్వాత ఎలా ఉండాలో తెలుసుకున్నాం. శివబాలాజీ: తను పప్పుచారు నుంచి పాయా దాకా అన్నీ అద్భుతంగా వండుతుంది. మధుమిత: ఇంటర్లో అన్నయ్య నుంచి వంటలు నేర్చుకున్నాను. నా దగ్గర నుంచీ తనకు నచ్చినవన్నీ తను (శివ) కూడా నేర్చుకున్నారు. శివబాలాజీ: పెళ్లయ్యాక సినిమాలు మానేయాలని మధు ఫ్యామిలీ డిసైడ్ అయింది. అయితే ఆలోచించమని నచ్చజెప్పా. అప్పుడు ఓకే అన్నప్పటికీ పెళ్లి తర్వాత పాత్రల విషయంలో పర్టిక్యులర్ అయిపోయింది. మధుమిత: కరోనా టైమ్‌లో 3 నెలల పాటు ఫార్మ్‌లో గడిపేశాం. శివబాలాజీ: నాకు చిన్నప్పటి నుంచీ వ్యవసాయం, నీళ్ల మధ్యలో ఇల్లు అంటే ఇష్టం. మధు వాళ్ల ఫ్యామిలీకి కూడా అదే హాబీ. మధుమిత: అందరూ సేఫ్‌గా పండగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. -
బిగ్‌బాస్ ప్రేక్షకులను కుక్కలు అన్న నటి
చెన్నై ,పెరంబూరు: బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో కార్యక్రమం ఎప్పుడూ రచ్చ రచ్చే. అయితే ప్రస్తుతం జరుగుతున్న సీజన్ 3లో అది కాస్త శృతి మించిందని చెప్పకతప్పదు. కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో సీజన్–3లో పాల్గొన్న సభ్యుల్లో హాస్య నటి మధుమిత ఒకరు. ఈ సీజన్లో ఈమె రచ్చే ఎక్కువ అయ్యింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఈ అమ్మడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, బయటకు వచ్చేసింది. అంనంతరం బిగ్‌బాస్ నిర్మాహకులు తన రావలసిన పారితోషికం చెల్లించలేదని ఆరోపణలు చేసి వివాదాల్లోకి ఎక్కింది. అయితే తన చేతిని కోసుకుని ఆత్మహత్యకు ఎందుకు పాల్పడాల్సి వచ్చిందో మధుమిత ఎక్కడా వెల్లడించలేదు. నటి మధుమిత అసలు విషయం అదే.. తాజాగా సోమవారం ఉదయం విజయ్ టీవీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటి మధుమిత పాల్గొని బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందన్నది తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు 15న హౌస్‌లో ఒక్కోక్కరికి ఒకో టాస్క్ ఇచ్చారని చెప్పింది. ఆ టాస్క్‌లో వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేయాలని చెప్పారంది. తాను ఒక్క మాటలో కవితను చెప్పానని తెలిపింది. చెన్నైలో నీటి సమస్య గురించి తాను తరచూ దేవుని ప్రార్థిస్తానని చెప్పింది. టాస్క్‌లో కర్ణాటకలో కుంభవృష్టి కురుస్తున్నా, తమిళనాడుకు నీరు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని కవిత రూపంలో చెప్పానన్నారు. అందుకు ఇంటి సభ్యుల్లోని దర్శకుడు చేరన్, నటి కస్తూరి మినహా అందరూ వ్యతిరేకతను వ్యక్తం చేశారని అంది. అందుకు బిగ్‌బాస్ కూడా ఒక లేఖను పంపారనీ, అందులో ఇంటిలో రాజకీయాలు మాట్లాడకూడదని పేర్కొన్నారని చెప్పింది. అలా లేఖ రావడంతో చేరన్, కస్తూరి మినహా మిగిలిన 8మంది సభ్యులు తనను మరింతగా ఎగతాళి చేశారని తెలిపింది. ఒక గ్యాంగ్ రాగింగ్ మాదిరి ప్రవర్తించారని అంది. దాన్ని భరించలేకనే తాను కత్తితో చేతిని కోసుకుని ఆత్మహత్యానికి పాల్పడినట్లు వివరించింది. తాను నీటి సమస్య గురించి మాట్లాడటాన్ని తమిళులైన వారు కూడా రాజకీయం అంటూ వ్యతిరేకతను వ్యక్తం చేసిన ఆ ఎనిమిది మంది సభ్యులను తమిళులు బిగ్‌బాస్ గేమ్‌షో గెలవనీయరనే భావిస్తున్నానని అంది. అదే విధంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమలహాసన్ కూడా ఈ విషయం గురించి స్పందిచకపోవడం విచారకరమంది. ప్రజలు ఆయన నుంచి చాలా ఆశిస్తున్నారనీ, ఆయన మాట్లాడాల్సిందని మధుమిత పేర్కొంది. దర్శకుడు చేరన్ ,సాక్షీ అగర్వాల్ నటి సాక్షీ అగర్వాల్ క్షమాపణ కాగా ప్రేక్షకులను కుక్కలు అని అన్న నటి సాక్షీ అగర్వాల్ క్షమాపణ చెప్పింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన నటి సాక్షీఅగర్వాల్, అభిరామి, మోహన్ వైద్య గత వారం మళ్లీ అతిథులుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. అప్పుడు నటి షెరీన్‌కు దర్శన్‌కు మధ్య ప్రేమ అంటూ చేసిన వ్యాఖ్యలకు షెరిన్ ఆవేదన చెందింది. దీంతో నటి షెరిన్‌ను ఓదార్చిన నటి సాక్షీ ప్రేక్షకులను కుక్కలు అంటూ వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారమే చెలరేగింది. నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు. కమలహాసన్ కూడా ఈ విషయాన్ని ప్రస్ధావించగా తాను ఆ అర్థంతో అనలేదని సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. కాగా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత తన ఇన్‌స్ట్రాగామ్‌లో ప్రేక్షకులకు క్షమాపణ తెలిపింది. ఇకపై చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తానని చెప్పింది. ఇకపోతే ఆదివారం ఎలిమినేట్ అయిన దర్శకుడు చేరన్ను బిగ్‌బాస్ రహస్య గదిలోకి పంపారు. కొన్ని రోజుల తరువాత ఆయన మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. -
బిగ్‌బాస్ నిర్వాహకులతో మాకు ఆ సమస్య లేదు!
సాక్షి, చెన్నై: బిగ్‌బాస్ నిర్వాహకులతో తమకు పారితోషికం సమస్య తలెత్తలేదని అందులో పాల్గొని బయటకు వచ్చిన నటి మీరా విుథున్, సాక్ష్మీ అగర్వాల్ పేర్కొన్నారు. తమిళ బిగ్ బాస్ హౌస్ గురించి పెద్ద చర్చే జరుగుతున్న విషయం తెలిసిందే. కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 3 సీజన్ గత రెండు సీజన్ల కంటే కాస్త ఎక్కువగానే వివాదాలకు నిలయంగా మారిందని చెప్పవచ్చు. ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లోనూ, బయట వివాదాస్పదంగా మారింది. ఇటీవల ప్రముఖ దర్శకుడు అమీర్ బిగ్‌బాస్ రియాలిటీషోపై తీవ్రంగానే విమర్శించారు. ఆ గేమ్ షో ప్రేక్షకులను బానిసలుగా మార్చేస్తుందని, అందులో పాల్గొన్న దర్శకుడు చేరన్ను చూస్తే జాలేస్తోందని, బిగ్‌బాస్ తలుపులు బద్దలు కొట్టి ఆయన్ని బయటకు తీసుకురావాలనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం ఇక బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొన్న నటులు లోపల, బయట వివాదాలను సృష్టిస్తున్నారు. హాస్యనటి మధుమిత హౌస్ సభ్యులు తనను అవమానించారంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కలకలం సృష్టించింది. ఆ చర్యతో బయటకు పంపబడిన ఆమె బయటకు వచ్చిన తరువాత తనకు రావలసిన పారితోషికం వెంటనే చెల్లించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బిగ్‌బాస్ నిర్వాహకులను బెదిరించినట్లు ఆరోపణలను ఎదుర్కొనడం, ఆ సంస్థ నిర్వాహకుడు ఆమెపై పోలీసులకు పిర్యాదు చేయడం, అది అసత్యపు ఫిర్యాదు అని మధుమిత స్పందించడం వంటి రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మధుమిత ఎందుకలా చేసిందో తెలియదు.. కాగా మధుమితతో పాటు బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొని నామినేట్ అయిన నటి మీరావిుథున్ ఆమె వ్యవహారం గురించి స్పందిస్తూ తనకు పారితోషికం విషయంలో బిగ్‌బాస్ నిర్వాహకంతో ఎలాంటి సమస్య తలెత్తలేదని పేర్కొంది. నటి మధుమిత వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యను ఎదుర్కొందో తెలియదని అంది. తన వరకూ బిగ్‌బాస్ సంస్థతో సత్సంబంధాలే ఉన్నాయని, తమని మర్యాదగానే చూసుకున్నారని చెప్పింది. వంద రోజుల తరువాతనే.. మరో సటి సాక్షీఅగర్వాల్ స్పందిస్తూ సభ్యులెవరైనా మధ్యలో బయటకు వచ్చేస్తే ఒప్పందం ప్రకారం మిగిలిన పారితోషికాన్ని వంద రోజులు పూర్తి అయిన తరువాతనే అందించనున్నట్లు పేర్కొనబడిందని చెప్పింది. అందుకే తాము ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని అంది. అలాంటిది నటి మధుమిత ఎందుకలా ప్రవర్తించిందో తెలియదని, ఆమెకు సంబంధించిన ఒప్పందంలో ఏం ఉందో కూడా తనకు తెలియదని సాక్షీ అగర్వాల్ పేర్కొంది. -
బిగ్‌బాస్ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం
తమిళసినిమా (చెన్నై) : తమిళ బిగ్‌బాస్ హౌస్ లో హాస్య నటి మధు మిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమిళంలో ఒరుకల్ ఒరు కన్నాడీ చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత బిగ్‌బాస్ సీజన్ 3లో పోటీ చేస్తున్నారు. 50 రోజులకు పైగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న మధుమిత, కెప్టెన్ బాధ్యతలను నిర్వహిస్తున్న తరుణంలో శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆమెను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు పంపేశారు. తమిళ బిగ్‌బాస్ సీజన్‌కు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన పాల్గొన్న గత రెండు సీజన్లలో కూడా వివాదాస్పద ఘటనలు జరిగాయి. అయితే హౌస్ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మధుమిత పేర్కొంది. -
బిగ్‌బాస్ షోలో భార్యలు..
-
బిగ్‌బాస్ షోలో భార్యలు
-
బిగ్‌బాస్ షోలో భార్యలు
జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్స్ భార్యలు అతిథులుగా విచ్చేసి సడెన్ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. శివ బాలాజీ భార్య మధుమిత, ఆదర్శ్ భార్య గుల్నార్లు అతిథులుగా షోకి వస్తున్నట్లు ప్రోమోలో తెలుస్తోంది. కాగా, సడెన్ సర్ప్రైజ్తో చాలా రోజుల తర్వాత కలుసుకున్న జంటలు అందరినీ కంటతడి పెట్టించింది. తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇటీవలే 50 రోజుల పండుగ చేసుకొని చివరి దశకు చేరుకుంది. ఇది వరకు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ, తాప్సీ, నరేష్, తదితరులు షోని సందర్శించిన విషయం తెలిసిందే. -
దెయ్యాలున్నాయా?
అభినవ్ (సర్దార్ పటేల్), మధుమిత జంటగా శుభోదయ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘గేట్’. ‘దెయ్యాలున్నాయి జాగ్రత్త’ అనేది ఉపశీర్షిక. సాయికార్తీక్ సమర్పణలో రాజేష్ సాయి దర్శకత్వంలో టి. లక్ష్మీసౌజన్యగోపాల్ నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో సాగే చిత్రమిదని, వినోదం, సందేశం ఉన్నాయని నిర్మాత తెలిపారు. వచ్చే నెల 10న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, 18 రోజుల్లో పూర్తి చేస్తామని మే 2న చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. వినూత్న కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇదని అభినవ్ అన్నారు. బలరామ్, సంతోష్, అలీషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.ఎస్. చక్రవర్తిరెడ్డి, సంగీతం: డిజెఎస్.