టాలీవుడ్ క్యూట్ కపుల్లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. ఇంగ్లీష్ కారన్(2004) మూవీలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. 2009లో ఈ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే తమ పెళ్లి అంత ఈజీగా కాలేదని చెబుతుంది ఈ జంట. పెళ్లి చేసుకుందాని ఫిక్స్ అయ్యాక.. శివ బాలాజీ బ్రేకప్ చెప్పాడట.
మధుమితను పెళ్లి చేసుకుంటే వాళ్ల అమ్మ చనిపోతుందనే భయంతోనే అలా చేశాడట. ఏడాదిన్నర కాలం పాటు దూరంగా ఉండి.. చివరకు మళ్లీ పెళ్లికి ఒప్పించాడట. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది ఈ జంట.
(చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాశా: హీరోయిన్ )
మధుమిత మాట్లాడుతూ.. ‘దాదాపు నాలుగేళ్ల పాటు మేం ప్రేమలో ఉన్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఒక రోజు శివ బాలాజీ ఫోన్ చేసి ‘మనకు సెట్ అవ్వదు. జాతకాలు కుదరడం లేదు. మనం పెళ్లి చేసుకుంటే మా అమ్మ చనిపోతుందట’ అని చెప్పాడు.
ఆ క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఓకే అని చెప్పి గట్టిగా ఏడ్చేశాను. మనం ఫ్రెండ్స్‌గా ఉందామని బాలాజీ చెప్పినా నో చెప్పాను. ఎందుకంటే అతన్ని నేను భర్తగా ఊహించుకున్నాను. మా ఇంట్లోవాళ్లు జాతకాలు పెద్దగా పట్టించుకోరు. కానీ అత్తమ్మ వాళ్లు జాతకాలను నమ్ముతారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్లీ బాలాజీ టచ్‌లోకి వచ్చాడు. పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అప్పుడు జాతకాలు చూపిస్తే.. బాగున్నాయని చెప్పారు. అప్పుడు మా పెళ్లి జరిగింది’ అని మధుమిత చెప్పుకొచ్చింది.
ఇక శివ బాలాజీ మాట్లాడుతూ.. మధమితకు బ్రేకప్ చెప్పిన తర్వాత చాలా బాధపడ్డాను. ఇలా చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఒక్క ఏడాది చూస్తా.. అప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోకపోతే.. ఎలాగైనా ఇంట్లో వాళ్లని ఒప్పిద్దామనుకున్నాను. ఆమెకు ఎన్ని సంబంధాలు వస్తున్నా రిజెక్ట్ చేస్తుందని తెలిసింది. మా ఎలక్షన్ల సమయంలో మధుని మళ్లీ కలిశా. మాట్లాడలేదు. ఒకరోజు ‘మళ్లీ ఎందుకు నా జీవితంలోకి వస్తున్నావు’అని నా మొబైల్‌కి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కలిసి.. కొన్నాళ్లకు ఇంట్లో ఒప్పించాం’ అని శివబాలాజీ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment