Siva Balaji and his wife Madhumitha shares their love story - Sakshi
Sakshi News home page

Siva Balaji-Madhumitha: నాకు దగ్గరయ్యేందుకు చాలా ట్రై చేశారు: మధుమిత

Published Thu, Jun 8 2023 11:27 AM | Last Updated on Thu, Jun 8 2023 11:50 AM

Shiva Balaji and Madhumitha Shares Their Love story - Sakshi

టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్స్‌లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకరు. ఇంగ్లీష్‌ కారన్‌(2004) మూవీలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అది కాస్త ప్రేమగా మారింది. 2009లో ఈ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే తమ పెళ్లి అంత ఈజీగా జరగలేదని అంటోంది ఈ ప్రేమ జంట. అంతే కాకుండా శివనే మొదట తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది. 

(ఇది చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ)

ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ జంట పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలాగానే తమ పెళ్లిలో చాలా ట్విస్టులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ జంట లైఫ్‌లో ఎదురైన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందన్న విషయాన్ని మధుమిత వెల్లడించారు. 

మధుమిత మాట్లాడుతూ.. 'నేను ఇది మా అశోక్‌గాడి లవ్‌ స్టోరీలో మొదటిసారి శివను చూసినప్పుడే ఈ అబ్బాయి బాగున్నాడనిపించింది. ఇంగ్లిష్‌ కరన్‌’ సమయంలో దర్శకుడు పరిచయం చేయగా.. నేనే అతన్ని పలకరించాను. ఆ తర్వాత చాలాసార్లు నాకు హెల్ప్‌ చేసే సరికి మంచి వాడనే ఫీలింగ్ కలిగింది. మొదట్లో నేను హాయ్‌ అంటే హాయ్ అనేవాడు. తను కూడా నన్ను చాలా గమనించేవాడు. నేను ఒకసారి లిప్‌స్టిక్‌ వేసుకున్న తర్వాత తుడుచుకున్న టిష్యూ తీసుకుని దాచుకున్నాడు. అలాంటి పనులు చేస్తూ నాకు కనిపించాలని ప్రయత్నించేవాడు. ఒకసారి నేను చెన్నై వెళ్లగానే మిస్‌ అవుతున్నట్లు మెసేజ్‌ పెట్టాడు. అది చూసి నాకు సందేహం వచ్చి దూరం పెట్టడం మొదలుపెట్టా. కానీ ఆ తర్వాత కూడా నాకు దగ్గరయ్యేందుకు చాలా ట్రై చేశారు. ఒకరోజు ఏకంగా పెళ్లి చేసుకుందామా అని అడిగేశాడు. ' అంటూ చెప్పుకొచ్చింది. 

(ఇది చదవండి: భీమిలీ కబడ్డీ జట్టు హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement