పల్లెటూరి ప్రేమకథా చిత్రంగా వస్తోన్న "ఏ చోట నువ్వున్నా"! | Tollywood Latest Movie Ye Chota Nuvvunna Movie Will Release Date Out Now - Sakshi
Sakshi News home page

పల్లెటూరి ప్రేమకథా చిత్రంగా "ఏ చోట నువ్వున్నా".. రిలీజ్ ఎప్పుడంటే!

Published Thu, Nov 16 2023 7:01 PM | Last Updated on Thu, Nov 16 2023 7:11 PM

Tollywood Latest Movie E chota Nuvvunna Will Released On November - Sakshi

ప్రశాంత్, అంబికా ముల్తానీ హీరో, హీరోయిన్స్‌గా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం "ఏ చోట నువ్వున్నా". మందలపు శ్రీనివాసరావు, మేడికొండ శ్రీనివాసరావు సంయుక్త గా ఎమ్.ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి  పసలపూడి ఎస్.వి దర్శకత్వం వహించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా రూపొందించారు. ఈ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..' దర్శకుడు పసలపూడి కథ చెప్పినపుడు చాలా బాగా అనిపించింది. వెంటనే సినిమా నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.  నటీనటుల కోసం రాజమండ్రిలో ఆడిషన్స్ నిర్వహించి అందరూ కొత్తవాళ్లను సెలెక్ట్ చేసుకున్నాం. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం కథ కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. చివరి 20 నిమిషాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.' అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement