
సాక్షి, చెన్నై: బిగ్‌బాస్ నిర్వాహకులతో తమకు పారితోషికం సమస్య తలెత్తలేదని అందులో పాల్గొని బయటకు వచ్చిన నటి మీరా విుథున్, సాక్ష్మీ అగర్వాల్ పేర్కొన్నారు. తమిళ బిగ్ బాస్ హౌస్ గురించి పెద్ద చర్చే జరుగుతున్న విషయం తెలిసిందే. కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 3 సీజన్ గత రెండు సీజన్ల కంటే కాస్త ఎక్కువగానే వివాదాలకు నిలయంగా మారిందని చెప్పవచ్చు. ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లోనూ, బయట వివాదాస్పదంగా మారింది. ఇటీవల ప్రముఖ దర్శకుడు అమీర్ బిగ్‌బాస్ రియాలిటీషోపై తీవ్రంగానే విమర్శించారు. ఆ గేమ్ షో ప్రేక్షకులను బానిసలుగా మార్చేస్తుందని, అందులో పాల్గొన్న దర్శకుడు చేరన్‌ను చూస్తే జాలేస్తోందని, బిగ్‌బాస్ తలుపులు బద్దలు కొట్టి ఆయన్ని బయటకు తీసుకురావాలనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం
ఇక బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొన్న నటులు లోపల, బయట వివాదాలను సృష్టిస్తున్నారు. హాస్యనటి మధుమిత హౌస్ సభ్యులు తనను అవమానించారంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కలకలం సృష్టించింది. ఆ చర్యతో బయటకు పంపబడిన ఆమె బయటకు వచ్చిన తరువాత తనకు రావలసిన పారితోషికం వెంటనే చెల్లించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బిగ్‌బాస్ నిర్వాహకులను బెదిరించినట్లు ఆరోపణలను ఎదుర్కొనడం, ఆ సంస్థ నిర్వాహకుడు ఆమెపై పోలీసులకు పిర్యాదు చేయడం, అది అసత్యపు ఫిర్యాదు అని మధుమిత స్పందించడం వంటి రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
మధుమిత ఎందుకలా చేసిందో తెలియదు..
కాగా మధుమితతో పాటు బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొని నామినేట్ అయిన నటి మీరావిుథున్ ఆమె వ్యవహారం గురించి స్పందిస్తూ తనకు పారితోషికం విషయంలో బిగ్‌బాస్ నిర్వాహకంతో ఎలాంటి సమస్య తలెత్తలేదని పేర్కొంది. నటి మధుమిత వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యను ఎదుర్కొందో తెలియదని అంది. తన వరకూ బిగ్‌బాస్ సంస్థతో సత్‌సంబంధాలే ఉన్నాయని, తమని మర్యాదగానే చూసుకున్నారని చెప్పింది.
వంద రోజుల తరువాతనే..
మరో సటి సాక్షీఅగర్వాల్ స్పందిస్తూ సభ్యులెవరైనా మధ్యలో బయటకు వచ్చేస్తే ఒప్పందం ప్రకారం మిగిలిన పారితోషికాన్ని వంద రోజులు పూర్తి అయిన తరువాతనే అందించనున్నట్లు పేర్కొనబడిందని చెప్పింది. అందుకే తాము ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని అంది. అలాంటిది నటి మధుమిత ఎందుకలా ప్రవర్తించిందో తెలియదని, ఆమెకు సంబంధించిన ఒప్పందంలో ఏం ఉందో కూడా తనకు తెలియదని సాక్షీ అగర్వాల్ పేర్కొంది.