Bigg Boss Ultimate Show Update: Kamal Haasan Quits As Host, Deets Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss Ultimate Show: బిగ్‌బాస్‌ షో హోస్ట్‌గా తప్పుకున్న కమల్‌, ఎందుకంటే?

Published Mon, Feb 21 2022 8:05 AM | Last Updated on Mon, Feb 21 2022 9:07 AM

Kamal Haasan Quits Bigg Boss Ultimate Show - Sakshi

తమిళ  ‘బిగ్‌బాస్‌’ షో హోస్ట్‌గా కమల్‌ హాసన్‌ తప్పుకున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఓ లేఖను విడుదల చేశారు కమల్‌. ‘‘కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులు ‘విక్రమ్‌’ సినిమాపై ప్రభావం చూపాయి. ప్రొడక్షన్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోయాం. దీంతో నేను హోస్ట్‌గా చేస్తున్న  ‘బిగ్‌బాస్‌’ షో, ‘విక్రమ్‌’ సినిమా డేట్స్‌ క్లాష్‌ అయ్యాయి. ఈ కారణంగా నా మనసుకు ఎంతో దగ్గరైన ‘బిగ్‌బాస్‌’ హోస్ట్‌గా తప్పుకోక తప్పడం లేదు. షో యాజమాన్యంతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అన్నారు.

లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్, విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ ప్రధానపాత్రల్లో రూపొందుతోన్న ‘విక్రమ్‌’ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. కాగా ‘బిగ్‌బాస్‌’ లో కమల్‌హాసన్‌ ప్లేన్‌ను ఎవరు రీప్లేస్‌ చేస్తారనే విషయంపై కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. కమల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినప్పుడు ‘బిగ్‌బాస్‌’ షోకి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement