యోగా ట్రైనర్‌ను పెళ్లాడిన నటి.. ఫోటోలు వైరల్‌ | Bigg Boss Fame Ramya Pandian Marries Boyfriend | Sakshi
Sakshi News home page

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. లొకేషన్‌ అదిరింది!

Nov 8 2024 6:43 PM | Updated on Nov 8 2024 6:59 PM

Bigg Boss Fame Ramya Pandian Marries Boyfriend

తమిళ నటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ రమ్య పాండియన్‌ ప్రియుడిని పెళ్లాడింది. బెంగళూరుకు చెందిన యోగా నిపుణుడు లోవల్‌ ధావన్‌తో కలిసి ఏడడుగులు వేసింది. ఈ పెళ్లి వేడుకకు ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌ వేదికగా నిలిచింది. ఈ ప్రేమజంట తమ పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి వైరల్‌గా మారాయి. సెలబ్రిటీలు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి చేసుకున్న లొకేషన్‌ కూడా అదిరిందని కామెంట్లు చేస్తున్నారు.

అలా మొదలైంది
గతేడాది బెంగళూరులో యోగా శిక్షణ కార్యక్రమంలో రమ్య, లోవల్‌ ధావన్‌ల మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఈ జంటను పెద్దలు ఆశీర్వదించడంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. బంధుమిత్రులు, సెలబ్రిటీల కోసం చెన్నైలో నవంబర్‌ 15న రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.

సినిమా నుంచి బుల్లితెరకు
కాగా రమ్య పాండియన్‌.. డమ్మీ టపాసు, జోకర్‌, రామే ఆండాళుమ్‌ రావణే ఆండాళుమ్‌ వంటి తమిళ చిత్రాల్లో నటించింది. కూకు విత్‌ కోమలి షోతో పాపులర్‌ అయింది. ఈ షోలో మొదటి సీజన్‌లో పాల్గొన్న ఆమె సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. అలాగే తమిళ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో టాప్‌ 5లో చోటు దక్కించుకుంది. తర్వాత బిగ్‌బాస్‌ అల్టిమేట్‌ షోలో పాల్గొనగా సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది.

 

 

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement