Bigg Boss Pavani Reddy Emotional Reply To Her Pregnancy, BreakUp And Secret Marriage Trolls - Sakshi
Sakshi News home page

Pavani Reddy: ప్రియుడితో నటి సహజీవనం, సీక్రెట్‌గా పెళ్లి!

Published Wed, Mar 29 2023 7:07 PM | Last Updated on Wed, Mar 29 2023 7:30 PM

Pavani Reddy: First Pregnant, Then Break Up Now Secret Marriage - Sakshi

చెన్నైలో సహజీవనం చేస్తున్న వీరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ..

సోషల్‌ మీడియా వచ్చాక నెటిజన్లే సెలబ్రిటీల పెళ్లిళ్లు చేస్తున్నారు. నచ్చకపోతే నెట్టింట్లోనే విడాకులు కూడా ఇచ్చేస్తున్నారు. కాలక్షేపం కోసం లేనిపోని పుకార్లు సృష్టిస్తూ.. మరికొన్నిసార్లు సెలబ్రిటీలనే విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నారు. అలా ఎంతో మంది తారల రియల్‌ లైఫ్‌లో పెళ్లి జరగకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం ఎన్నోసార్లు పెళ్లి జరిపించేశారు. తాజాగా ఈ ధోరణిపై సెటైర్‌ వేసింది తమిళ నటి పావని.

బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించింది పావని రెడ్డి. తర్వాత తమిళ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో నటించింది. ఈ రియాలిటీ షోలో పాల్గొన్న కొరియోగ్రాఫర్‌ ఆమిర్‌.. పావనిని చూడగానే ప్రేమలో పడ్డాడు. తనకు ప్రపోజ్‌ కూడా చేశాడు, కానీ పావని లైట్‌ తీసుకుంది. ఈ విషయం పక్కన పెడితే బిగ్‌బాస్‌ జోడీ డ్యాన్స్‌ షోలో వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమిర్‌కు దగ్గరైంది నటి. ఈ షోలో విజేతలుగా నిలిచిన ఈ జంట రియల్‌ లైఫ్‌లోనూ జోడీగా ఉండబోతున్నామని ప్రకటించింది. తునివు(తెగింపు) సినిమాలో వీరు ప్రేమపక్షులుగానూ నటించారు. ప్రస్తుతం ఈ జంట చెన్నైలో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలో అభిమానులు పెళ్లెప్పుడు? అంటూ వీరి వెంటపడుతున్నారు. తాజాగా ఓ అభిమాని మీ ఇద్దరికీ పెళ్లైపోయింది.. కానీ ఎందుకు దాచిపెడుతున్నారు, బయటకు చెప్పొచ్చుగా అని అడిగింది. దీనికి పావని స్పందిస్తూ.. పోయిన నెలలో నేను గర్భవతి అన్నారు. ఆ తర్వాత మేము బ్రేకప్‌ చెప్పుకున్నామన్నారు. ఇప్పుడేమో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నామంటున్నారు. మరి నెక్స్ట్‌ ఏం కహానీ చెప్పబోతున్నారేంటి? అంటూ తనదైన స్టైల్‌లో కౌంటరిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement