రెండేళ్లుగా సహజీవనం.. రెండోపెళ్లికి నటి రెడీ.. | Tollywood Actress Pavani Reddy Going To Marry Amir | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌ సెన్సేషనల్‌ నటి.. ప్రియుడితో పెళ్లి అప్పుడేనంటూ..

Published Sun, Mar 17 2024 5:34 PM | Last Updated on Tue, Mar 19 2024 1:44 PM

Tollywood Actress Pavani Reddy Going To Marry Amir - Sakshi

రెండేళ్లుగా సహజీవనం కూడా చేస్తున్నారు. ఇన్నాళ్లకు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యారు. జంటగా ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ చేసిన వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతు

పావనిరెడ్డి.. చూడగానే క్యూట్‌గా అనిపించే ఈ బ్యూటీ మొదట్లో సీరియల్స్‌ చేసింది. తర్వాత తెలుగు వెండితెరపై మెరిసింది. ది ఎండ్‌, డబుల్‌ ట్రబుల్‌, డ్రీమ్‌, లజ్జ అనే చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు లేకపోవడంతో టాలీవుడ్‌ను వదిలేసి తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ కూడా సీరియల్స్‌తోనే తన కెరీర్‌ మొదలుపెట్టింది. 2013లో తెలుగు నటుడు ప్రదీప్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ బాగానే ఉంటున్నారనుకున్న తరుణంలో 2017లో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

మొదటి భర్త పోవడంతో..
నటి మరొకరితో చనువుగా ఉన్న ఫోటోను ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టడంతోనే అతడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని వార్తలు వెలువడ్డాయి. తర్వాత ఈమె పూర్తిగా చెన్నైలోనే సెటిలైపోయింది. అక్కడ ఆనంద్‌ జాయ్‌ అనే నిర్మాతను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ కొన్నాళ్లకే అందులో నిజం లేదని తేలిపోయింది. అనంతరం తమిళ బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొంది. ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌ ఆమిర్‌.. పావనికి ప్రపోజ్‌ చేశాడు. అప్పటినుంచి వీరి మధ్య లవ్‌ జర్నీ మొదలైంది.

ఇన్నాళ్లకు పెళ్లికి రెడీ..
బీబీ జోడీ రెండో సీజన్‌లో జంటగా పార్టిసిపేట్‌ చేయడమే కాక ట్రోఫీ గెలిచారు. రెండేళ్లుగా సహజీవనం కూడా చేస్తున్నారు. ఇన్నాళ్లకు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యారు. జంటగా ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ చేసిన వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. పావని పుట్టినరోజైన నవంబర్‌ 9న వివాహం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇకపోతే పావని ఇటీవలే చారి 111 సినిమాలో నటించింది. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాటర్స్‌ అనే తెలుగు వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.

చదవండి: మొదటి భార్యకు విడాకులు.. ఈ తాగుబోతును పదేళ్లు భరించింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement