నా విజయానికి అది ఓ కారణం | NTR better host than salman khan, says shiva balaji | Sakshi
Sakshi News home page

నా విజయానికి అది ఓ కారణం

Published Wed, Sep 27 2017 7:27 AM | Last Updated on Mon, Jun 18 2018 8:04 PM

NTR better host than salman khan, says shiva balaji - Sakshi

సాక్షి, శంషాబాద్ ‌: ప్రజలు చూపిన అభిమానం, ఆదరణతోనే తాను తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ వన్‌ విజేతగా నిలిచానని టాలీవుడ్ నటుడు శివబాలాజీ అన్నారు. షిర్టీ సాయిబాబాను దర్శించుకున్న అనంతరం ఆయన మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివబాలాజీ మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు.

‘బిగ్‌బాస్‌లో ప్రవేశించిన మొదటి వారం ఏమీ అర్థం కాలేదు. ఎవరితోనూ మాట్లాడలేక పోయాను. రెండో వారం పరిస్థితి అర్థమైంది. అప్పటి నుంచి గెలుపుపై సానుకూల దృక్పథంతోనే ఆటలో కొనసాగాను. కొన్ని సందర్భాల్లో పక్కవారికి నచ్చినా నచ్చకపోయినా అదే విధానాన్ని కొనసాగించాను. ఇది కూడా నా విజయానికి ఓ కారణం’ అన్నారు.  

సల్మాన్‌ను మించిన హోస్టింగ్‌
‘తారక్‌ హోస్టింగ్‌ సల్మాన్‌ ఖాన్‌ను మించి ఉంది. ఆయన అద్బుతంగా చేశారు. ఎప్పటికప్పుడు బయట ప్రేక్షకులు వారి మదిలో మా గురించి  ఏమనుకుంటున్నారనేది ఆయన వ్యాఖ్యానంతో తెలిసిపోయేది. ఈ షో అద్భుత విజయానికి ఆయనే ప్రధాన కారకులు’ అన్నారు. బిగ్‌ బాస్‌ షో తర్వాత తాము షీర్డి వెళ్లామని, అక్కడ ఓ  వృద్ధురాలు తన వద్దకు వచ్చి ఎంతో అభిమానం చూపిందని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement