ఎన్టీఆర్
ఇప్పటివరకు చిత్రబృందం అధికారికంగా చెప్పలేదు. పోనీ హింటైనా ఇవ్వలేదు. కానీ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ గురించి తాజాగా ఓ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. అదేంటంటే... ఈ చిత్రంలో ఎన్టీ ఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారట. తండ్రి, కొడుకుల పాత్రల్లో కనిపిస్తారట. సినిమాలో తన తండ్రి గురించి కొడుకు పాత్రలో ఉన్న ఎన్టీఆర్‌కు వివరించే సమయంలోనే ‘పెనివిటీ..’ పాట ఉంటుందని టాక్.
తండ్రి పాత్రలో ఉన్న ఎన్టీఆర్‌కు జోడీగా ఈషా రెబ్బా నటిస్తున్నారట.ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయాలని కావాలనే ఈ విషయాన్ని దాచారట చిత్రబృందం. అలాగే ఎన్టీఆర్, రావు రమేశ్‌ల మధ్య రాజకీయ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయని టాక్. మరి.. ఈ వార్తలు నిజమేనా? అనేది తెలియడానికి ఇంకో పది రోజులు ఆగితే చాలు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోందని సమాచారం.
ఆల్రెడీ టాకీ పార్ట్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, ఈషా రెబ్బాలపైనే ‘పెనివిటీ..’ సాంగ్‌ను తీస్తున్నారట. ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వరకర్త. ఎస్. రాధాకృష్ణ నిర్మాత. జగపతిబాబు, నాగబాబు, రావు రమేశ్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్‌కు హోస్ట్‌గా చేసిన ఎన్టీఆర్‌నే మళ్లీ ‘బిగ్ బాస్ 3’కి కూడా హోస్ట్‌గా చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment