'బిగ్‌ బాస్‌'కు ఆమె సెట్ అవ్వరు: నటుడు | actor shiva balaji cricised Kalpana in Bigg Boss house | Sakshi
Sakshi News home page

'బిగ్‌ బాస్‌'కు ఆమె సెట్ అవ్వరు: నటుడు

Published Sun, Jul 30 2017 4:14 PM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

'బిగ్‌ బాస్‌'కు ఆమె సెట్ అవ్వరు: నటుడు

'బిగ్‌ బాస్‌'కు ఆమె సెట్ అవ్వరు: నటుడు

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ శనివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగిపోయింది. రోజురోజుకు ఈ రియాల్టీ షోకు ఆదరణ పెరుగుతోంది. అయితే ఈ షో రెండో వీకెండ్ ఎపిసోడ్‌లో భాగంగా తారక్ 12 మంది సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చారు. టాస్క్ లో పాల్గొన్న సందర్భంగా షోలో యాక్టివ్ ఉంటున్న నటుడు శివబాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు నచ్చని వ్యక్తిని విలన్ గా ఎంచుకుని కత్తుల సింహాసనంపై కూర్చోపెట్టి కారణం వివరించడం టాస్క్ ప్రత్యేకత.

సభ్యుల విషయంలో గొడవ జరిగితే సర్దిచెప్పాలని తాను చూస్తే, కల్పన మాత్రం అడ్డుపడుతున్నారని అర్చన అన్నారు. తొలివారం ఓకే అనేలా ఉన్న కల్పన రెండో వారంలో మాత్రం డబుల్ గేమ్ అడుతున్నారని నటి హరితేజ చెప్పారు. శివబాలాజీ మాత్రం మరో అడుగు ముందుకేశారు. కెప్టెన్ గా చేసిన కల్పన ఈ బిగ్ బాస్ కు సెట్ అవ్వరని, హౌస్ లో ఉండేందుకు తగిన వారు (అన్ ఫిట్) కాదని అభిప్రాయపడ్డారు. ఆమె విలన్ అని చెప్పేందుకు ఒక్క కారణం కాదు.. తన వద్ద ప్యాకేజీ కారణాలున్నాయంటూ శివబాలాజీ పేర్కొన్నారు. దీంతో హౌస్ వాతావరణం కాస్త వేడెక్కింది. టాస్క్ లో భాగంగా ఏడుగురు సభ్యులు కల్పనను విలన్ గా ఎంపిక చేసుకోగా, ఆ తర్వాతి స్థానంలో నటుడు సమీర్ నిలిచారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్ గాయని మధుప్రియ. ఎలిమినేషన్ నుంచి ఆమె పేరు ప్రకటించిన తర్వాత సభ్యులలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించలేదు. 14 మంది కంటెస్టెంట్‌లతో ప్రారంభమైన రియాల్టీ షో తొలి వారం తర్వాత నటి జ్యోతి ఎలిమినేట్ అ‍వ్వగా, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అర్థాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. షోను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్టీఆర్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement