ఇద్దరిలో బిగ్‌బాస్‌ ఎవరు? | Who will host Big Boss Season 3 | Sakshi
Sakshi News home page

ఇద్దరిలో బిగ్‌బాస్‌ ఎవరు?

Published Thu, Mar 21 2019 2:31 AM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

Who will host Big Boss Season 3 - Sakshi

ఎన్టీఆర్‌, నాగార్జున

బాలీవుడ్‌లో బిగ్‌బాస్‌ సూపర్‌ హిట్‌. దీన్ని సౌత్‌ ఇండియాలో కూడా పరిచయం చేయాలని నిర్వాహకులు భావించారు. కన్నడం, తమిళంలో కూడా ఈ షోను పరిచయం చేశారు. అక్కడా హిట్టే. ఆ తర్వాత తెలుగులో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ఈ షో ఆరంభమైన విషయం తెలిసిందే. షో సూపర్‌ హిట్‌. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా పర్ఫెక్ట్‌ అన్నారు. షో మొదటి ఎపిసోడ్‌ సుమారు 16.18 టీఆర్‌పీ (టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్‌), మొదటివారం 9.24 టీఆర్‌పీను నమోదు చేసింది. ‘నా టీవి’ అనే ఎన్టీఆర్‌ మేనరిజమ్‌ బాగా క్లిక్‌ అయింది.

ప్రతి సినిమా షెడ్యూల్, ఫ్యామిలీకి టైమ్‌ కేటాయించడం కుదరకపోవడంతో సెకండ్‌ సీజన్‌లో హోస్ట్‌గా తప్పుకున్నారు ఎన్టీఆర్‌. కొత్త హోస్ట్‌గా నాని ఎంట్రీ ఇచ్చారు. ‘నా నీ టీవీ’ అంటూ నాని మేనరిజమ్‌ కూడా ఆకట్టుకుంది. సెకండ్‌ సీజన్‌ కూడా మంచి హిట్టే. సెకండ్‌ సీజన్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌ 15.05, మొదటి వారంలో 7.93 టీ ఆర్‌పీ నమోదయ్యాయి. తర్వాతి సీజన్‌లో కనిపించబోనని షో ఫైనల్‌ రోజే నాని స్పష్టం చేశారు. మూడో సీజన్‌ జూన్‌లో స్టార్ట్‌ కానుంది. ప్రస్తుతం హోస్ట్‌ ఎవరన్న టాపిక్‌ మొదలైంది. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కారణంగా ఈసారి కూడా ఎన్టీఆర్‌ ‘బిగ్‌బాస్‌’ను మిస్‌ అవుతారని వినిపిస్తోంది.

అయినప్పటికీ ఎన్టీఆర్‌ను తీసుకురావాలని ‘బిగ్‌బాస్‌’ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు నాగార్జున కూడా బిగ్‌బాస్‌ హోస్ట్‌గా కనిపిస్తారని టాక్‌. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ తెలుగు వెర్షన్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ను నాగార్జున సక్సెస్‌ఫుల్‌గా నడిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘బిగ్‌బాస్‌’కు హోస్ట్‌గా నాగ్‌ కూడా పర్ఫెక్ట్‌ అని పలు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరిలో బిగ్‌బాస్‌ హోస్ట్‌ ఎవరన్నది మాత్రం నిర్వాహకుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. జూన్‌లో ప్రారంభం కాబోయే మూడో సీజన్‌ ప్రీ–ప్రొడక్షన్‌ పనులు నడుస్తున్నట్టు, సెట్‌ ఎక్కడ వేయాలి? కంటెస్టెంట్స్‌ ఎవరనే డిస్కషన్స్‌ జరుగుతోందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement