ఓరుగల్లును ముక్కలు చేయొద్దు
Published Wed, Sep 21 2016 12:57 AM | Last Updated on Fri, Sep 28 2018 7:57 PM
హన్మకొండ అర్బ¯ŒS : ఓరుగల్లు మహానగరాన్ని ముక్కలు చేయవద్దని హన్మకొండ, వరంగల్, కాజీపేట పట్టణాలు ఒకే జిల్లాలో ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తూ పౌరసంఘాల జేఏసీ ఆధర్యంలో మేధావులు నక్కల గుట్ట కాళోజి విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు మంగళవారం మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా జేఏసీ గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ 12 దశాబ్దాల చరిత్ర ఉన్న ఓరుగల్లు మహానగరాన్ని ముక్కలు చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. గ్రేటర్ వరంగల్ మొత్తం ఒకే జిల్లా ఉండాలనానరు. లేదంటే నిత్యం ఆందోళనలు కొనసాగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జేఏసీ చైర్మ¯ŒS పుల్లూరి సుధాకర్ మాట్లాడుతూ స్మార్ట్, హృదయ్, అమృత్ వంటి పథకాలతో ఇప్పుడే ఓరుగల్లు అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో నగరాన్ని ముక్కలు చేస్తే అభివృద్ధి నిరోధకంగా మారుతుందని అన్నారు. కన్వీనర్ తిరునహరి శేషు మాట్లాడుతూ జిల్లాల విభజన ప్రజల సౌకర్యం కోసం చేయాలి తప్ప రాజకీయ అవసరాల కోసం కాదని అన్నారు. గ్రేటర్ ముక్కలు చేసే ఆలోచన విరమించుకోవాలని కోరారు. ర్యాలీలో డాక్టర్ అశోక్, చిల్లా రాజేంద్రప్రసాద్, అనీస్‌సిద్దికి, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ప్రతినిధి డాక్టర్ కోదండ రామారావు, రమాదేవి, దివాకర్, భద్రునాయక్, బందెల మోహ¯ŒSరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement